యూఎస్ఎస్ అబ్ర‌హం లింక‌న్‌కు ఏమైంది? చూస్తే షాకే! | After Months Uss Abraham Lincoln Limps Into Port Covered In Rust | Sakshi
Sakshi News home page

యూఎస్ఎస్ అబ్ర‌హం లింక‌న్‌కు ఏమైంది? చూస్తే షాకే!

Sep 5 2026 9:12 AM | Updated on Sep 5 2026 9:23 AM

After Months Uss Abraham Lincoln Limps Into Port Covered In Rust

హోర్ముజ్‌లో కొన్ని నెలల పాటు విధులు నిర్వహించిన అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ థాయ్ ఓడరేవుకు చేరింది సుమారు 1,100 అడుగుల పొడవు కలిగిన ఈ నౌక గత నవంబర్‌లో శాన్ డియాగో నుంచి బయలుదేరినప్పటి ఇప్పటికీ ఎక్కడా పొంతన లేదు. నౌక అడుగు భాగం అంతటా తుప్పు పట్టి కనిపిస్తోంది. ఈ దృశ్యం చూసి అక్కడివారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అది సహజమేనని నావికా దళ నిపుణులు అంటున్నారు.  ఈ నౌక సుదీర్ఘంగా 286 రోజులు సముద్రంలోనే గడిపింది.

నిరంతరం 60 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు సముద్రంలో గడిపే నౌకలపై నీటి మట్టం వెంబడి తుప్పు పట్టడం సాధారణమే నౌక సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు, ముఖ్యంగా ప్రత్యక్ష యుద్ధ సమయంలో ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని మాజీ యుఎస్ నేవీ కెప్టెన్ కార్ల్ షూస్టర్చెప్పారు. సిబ్బందిని నీటి మట్టానికి కిందికి దించి.. తుప్పును తొలగించి.. తుప్పు నిరోధక ప్రైమర్ పూసి, చివరకు నావల్ గ్రే రంగు వేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ తుప్పు అంతటిని తొలగించడానికి సుమారు 30 రోజుల  పడుతోంది. థాయ్‌లాండ్‌లో నౌక ఆగిన సమయంలో ఈ పనులలో కొంత భాగం ప్రారంభం కావచ్చన్నారు. ఈ నౌక బుధవారం బ్యాంకాక్‌కు దక్షిణంగా ఉన్న థాయ్ గల్ఫ్‌లోని లామ్ చబాంగ్ ఓడరేవుకు చేరుకుంది. ఈ పర్యటన కొన్ని రోజుల పాటు సాగనుంది. సుదీర్ఘమైన, కఠినమైన సముద్ర ప్రయాణం తర్వాత సిబ్బందికి ఇదే మొట్టమొదటి సరైన విశ్రాంతి సమయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement