చైనాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన 'ఎవర్‌గ్రాండే' (Evergrande) మాజీ చైర్మన్‌కు అక్కడి ప్రభుత్వం రీసెంట్‌గా జీవిత ఖైదు విధించింది. ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకున్నప్పటికీ.. చివరకు ప్లాన్ బెడిసికొడితే పాలకుల చేతిలో ఎలా బలి కావాల్సి వస్తుందో చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ. అసలు చైనాలో ఈ రియల్ ఎస్టేట్ సంక్షోభం వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం..
చైనా పౌరులకు తమ దేశంలో డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి సరైన మార్గాలు చాలా తక్కువ. ఒకవేళ తమ దేశపు ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ మార్కెట్ కోసం తెరిస్తే, అక్కడి డబ్బు ట్రిలియన్ల కొద్దీ దేశం దాటి బయటకు వెళ్లిపోతుందని బీజింగ్ ప్రభుత్వానికి బాగా తెలుసు. ఎందుకంటే చైనా ఆర్థిక విధానం చాలా వరకు లాభాల కంటే ఉత్పత్తి, ఉపాధి మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అక్కడి కంపెనీలకు ప్రభుత్వమే సబ్సిడీ లోన్లను నెగెటివ్ రియల్ వడ్డీ రేట్లకు ఇస్తుంది. దాంతో ఇన్వెస్టర్లకు వచ్చే రిటర్న్స్ కూడా నెగెటివ్‌లోనే ఉంటాయి. మరి ప్రజలు తమ డబ్బును ఎక్కడ పెట్టాలి..? పూర్తి విశ్లేషణ కింది పాడ్‌కాస్ట్‌లో చూడండి..


