లష్కర్-ఏ-తైబా కమాండర్ యాసిర్ హతం | Lashkar commander from Pakistan killed in gunfight with forces in J&K | Sakshi
Sakshi News home page

లష్కర్-ఏ-తైబా కమాండర్ యాసిర్ హతం

Sep 5 2026 5:40 PM | Updated on Sep 5 2026 6:02 PM

Lashkar commander from Pakistan killed in gunfight with forces in J&K

మధ్య కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఏ-తైబా కమాండర్ యాసిర్ హతమయ్యాడు. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా దళాలు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేసిన తరుణంలో యూస్‌మార్గ్ ఎత్తైన  ప్రాంతం వద్ద శనివారం  ఈ తాజా ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది.

ఉగ్రవాదుల ఉనికిపై భద్రతా సంస్థలకు  అందిన సమాచారం మేరకు, భద్రతా దళాలు ఆ ప్రాంతంలో నిఘా ఆధారిత గాలింపు చర్యలు చేపట్టినప్పుడు ఈ కాల్పులు మొదలయ్యాయి. స్పెషల్ ఫోర్సెస్  53 రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి.ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. యాసిర్ మొదట లష్కర్-ఏ-తైబాకు చెందిన సులేమాన్ మూసా బృందంలో సభ్యుడిగా ఉండేవాడు. అయితే, దాదాపు ఏడాది క్రితం ఆ బృందం నుండి విడిపోయి, అప్పటి నుండి స్వతంత్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. భద్రతా సంస్థలు అతని కదలికలపై నిఘా ఉంచడంతో పాటు, కొంతకాలంగా యూస్‌మార్గ్ ప్రాంతంలో అతని కార్యకలాపాలపై  నిఘాపెట్టాయి.

సులేమాన్‌ బృందం నుండి విడిపోయిన తర్వాత యాసిర్ ఆ ప్రాంతంలో కీలకమైన లష్కర్ కార్యకర్తగా ఎదిగాడని కూడా వర్గాలు వెల్లడించాయి. యూస్‌మార్గ్ ఎత్తైన ప్రాంతాల్లో అతని ఉనికిని గుర్తించిన భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి, చివరకు అది ఎదురుకాల్పులకు దారితీసింది.

ఇదీ చదవండి: రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు

యాసిర్ మరణం తర్వాత, భద్రతా సంస్థలు అతని నెట్‌వర్క్, ఇతర లష్కర్-ఏ-తైబా కార్యకర్తలతో అతనికి ఉన్న సంబంధాలు మరియు ఆ ప్రాంతంలో అతని కార్యకలాపాల విస్తృతిపై దర్యాప్తు చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాల ప్రణాళిక, నిర్వహణ లేదా మద్దతులో యాసిర్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా భద్రతా సంస్థలు విచారణ జరుపుతున్నాయి.

ఇదీ చదవండి: 8 తులాల గోల్డ్‌ కొట్టేసి ప్రియుడికి బైక్‌ : గుట్టు విప్పిన ఇన్‌స్టా రీల్‌

కాగా హషీమ్ మూసా  అలియాస్‌  సులేమాన్ మూసా, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి సూత్రధారులలో ఒకడు. ఆ దాడి జరిగిన కొద్ది నెలల తర్వాత, శ్రీనగర్‌లోని దాచిగామ్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మూసా హతమయ్యాడు.

ఇదీ చదవండి: రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్‌ జాబ్‌ ఎంచుకున్న టెకీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement