SIR మ్యాజిక్‌.. 35 ఏళ్ల తర్వాత కలిసిన సోదరులు | jind 35 years one phone call how sir reunited brothers in haryana | Sakshi
Sakshi News home page

SIR మ్యాజిక్‌.. 35 ఏళ్ల తర్వాత కలిసిన సోదరులు

Sep 5 2026 3:49 PM | Updated on Sep 5 2026 4:11 PM

jind 35 years one phone call how sir reunited brothers in haryana

చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల (SIR) స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల దీనిపై వ్యతిరేకతలు వచ్చాయి. ప్రముఖులైన వ్యక్తులను సైతం ఐడెంటిటీ పేరుతో వివిధ పత్రాలు చూపెట్టాలని అధికారులు ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియ 35 ఏళ్లపాటు దూరమైన అన్నదమ్ములను కలిపింది. దశాబ్ధాల పాటు దూరంగా ఉన్న సోదరులు ఇన్నేళ్ల తర్వాత కలవడంతా భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు.    

ఏం జరిగింది

గత 35 ఏళ్లుగా పంజాబ్‌లో నివసిస్తున్న సీతారామ్ అనే రైల్వే ఉద్యోగికి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కోసం హర్యానా జింద్‌లో తను బాల్యంలో చదివిన  స్కూల్ సర్టిఫికేట్‌ అవసరం అయ్యింది. దీంతో దాని కోసం అతను తన స్వగ్రామం మనోహర్‌పూర్‌కు వెళ్లారు. అయితే ఆ ప్రక్రియలో భాగంగా సీతారాం చదువుకున్న మనోహర్‌పూర్‌లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలోని సిబ్బంది అతని రికార్డులను ధృవీకరించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగా, అతని గుర్తింపును నిర్ధారించుకోవడానికి వారు గ్రామంలోని ప్రజలను సంప్రదించారు.

ఈ నేపథ్యంలో స్కూల్‌ సిబ్బంది తన సోదరుడికి కాల్‌ చేసి అతని వివరాలు నిజమా కాదా అని నిర్ధారించుకున్నారు. ఆ సమయంలో తన సోదరుడు స్కూల్‌లోనే ఉన్నాడని తెలుసుకున్న తన సోదరుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై సంతోషంతో ఉబ్బితబ్బయ్యాడు. వెను వెంటనే ఆ తర్వాత పాఠశాలకు పరుగెత్తాడు.35 ఏళ్ల ఎడబాటుకు తర్వాత సోదరులిద్దరు ముఖాముఖి కలుసుకున్నారు. వారు ఒకరినొకరు కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సీతారాం తన అన్నయ్య పాదాలకు నమస్కరించగా, ఆ భావోద్వేగ క్షణం పాఠశాల సిబ్బందిని, అక్కడున్న ఇతరులను తీవ్రంగా కదిలించింది.

ఆ తర్వాత ఆ సోదరులు స్కూటర్‌పై కలిసి బయలుదేరి జాలిగా తిరిగారు. దీంతో గ్రామస్థులంతా ‍అన్నదమ్ములను చూసి సంతోషపడ్డారు.సీతారాం ఆరుగురు సోదరులలో ఐదవవాడు. తన బాల్యంలోనే అతని స్వగ్రామం విడిచిపెట్టి పంజాబ్‌ వలస వెళ్లాడు. అక్కడ అనేక ప్రాంతాలలో పని చేసి చివరికి వికలాంగుడైన సీతారామ్, చిన్నతనంలోనే ఇంటిని విడిచి పంజాబ్‌కు వెళ్ళిపోయాడు. కొన్నేళ్లుగా అతను ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్యూన్‌గా సహా పలుచోట్ల పనిచేశాడు. చివరికి పంజాబ్‌లోనే గ్రూప్-డి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement