‘ది గ్రేట్‌ ఖలీ’కి యాక్సిడెంట్‌.. అప్‌డేట్‌ ఇదే | The Great Khali Meets With Car Accident, WWE Star Shares Video About His Health Condition, Read Story Inside | Sakshi
Sakshi News home page

‘ది గ్రేట్‌ ఖలీ’కి యాక్సిడెంట్‌.. అప్‌డేట్‌ ఇదే

Aug 31 2026 3:57 PM | Updated on Aug 31 2026 4:39 PM

The Great Khali meets with car accident shares video health update

PC: Instagram

మాజీ రెజ్లర్‌ ‘ది గ్రేట్‌ ఖలీ’ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న ​కారు మరో కారును ఢీకొట్టింది. హర్యానాలోని పానిపట్‌ టోల్‌ ప్లాజా వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

అప్‌డేట్‌ ఇదే
ఈ నేపథ్యంలో ‘ది గ్రేట్‌ ఖలీ’ ప్రమాద ఘటనపై స్వయంగా స్పందించాడు. ‘‘నిజమే.. నా కారు ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి నాకెన్నో ఫోన్‌ కాల్స్‌, మెసేజెస్‌ వస్తున్నాయి. నేను ఎలా ఉన్నానని అంతా అడుగుతున్నారు. అదృష్టవశాత్తూ నేను బాగున్నాను.

పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. అభిమానుల ఆశీర్వాదాలు, ఆ దేవుడి దయ వల్ల నాకేమీ కాలేదు. అదొక చిన్న యాక్సిడెంట్‌. అందుకే నేను ఎవరికీ చెప్పాలనుకోలేదు. కానీ ఆ వీడియో బాగా వైరల్‌ అయింది. అందుకే నేను స్పష్టతనివ్వాలని మీ ముందుకు వచ్చాను. నిజంగా నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మీరంతా జాగ్రత్త. జై హింద్‌’’ అంటూ ‘ది గ్రేట్‌ ఖలీ’ ఇన్‌స్టాలో వీడియో విడుదల చేశాడు.

నటుడిగానూ... 
కాగా హిమాచల్‌ ప్రదేశ్‌లో జన్మించిన దలిప్‌ సింగ్‌ రాణా అలియాస్‌ ‘ది గ్రేట్‌ ఖలీ (రింగ్‌ నేమ్‌)’ భారత్‌లో గుర్తింపు పొందిన ప్రముఖ రెజ్లర్లలో ఒకడు. అమెరికాలోని ఆల్‌ ప్రొ రెజ్లింగ్‌ ద్వారా 2000 సంవత్సరంలో ప్రొఫెషనల్‌ రెజ్లింగ్‌లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో 2005లో WWEలో చేరిన దలిప్‌ సింగ్‌.. ది అండర్‌ టేకర్‌, జాన్‌ సెనా, బటిస్టా వంటి వారితో తలపడ్డాడు.

అదే విధంగా WWE ప్రధాన ఈవెంట్లు రెజిల్‌మేనియా, సమ్మర్‌స్లామ్‌లలోనూ పాల్గొన్నాడు. ఇక దలిప్‌ సింగ్‌ సినిమాల్లోనూ నటించాడు. ది లాంగెస్ట్‌ యార్డ్‌తో సినీ రంగంలో అడుగుపెట్టిన అతడు.. గెట్‌ స్మార్ట్‌, మేక్‌గ్రూబర్‌, కుస్తి, రామా: ది సేవియర్‌ వంటి మూవీస్‌ చేశాడు. బిగ్‌బాస్‌ హిందీ 4 సీజన్‌లోనూ పాల్గొన్నాడు. కాగా దలిప్‌ సింగ్‌కు లక్షలాది మంది అభిమానులు ఉ‍న్నారు. ఇన్‌స్టాలో అతడికి దాదాపు 12 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం విశేషం.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ వీరవిహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement