టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు మరో మూవీకి రెడీ అయిపోయారు. గతేడాది సింగిల్ మూవీతో అలరించిన హీరో.. ఈ ఏడాది సరికొత్త ప్రేమకథను ప్రకటించారు. ఇది మన అందరి కథ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ చూస్తుంటే ఓ సగటు యువకుడి కథగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చదువు, ఉద్యోగం, పెళ్లి కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సూర్యదేవర హారిక నిర్మిస్తున్నారు. ఈ మూవీకి చందు, రవి సంగీతమందించనున్నారు.


