8 తులాల గోల్డ్‌ కొట్టేసి ప్రియుడికి బైక్‌ : గుట్టు విప్పిన ఇన్‌స్టా రీల్‌ | Kovai teen steals 75 Grams Of Gold to buy bike for boyfriend held | Sakshi
Sakshi News home page

8 తులాల గోల్డ్‌ కొట్టేసి ప్రియుడికి బైక్‌ : గుట్టు విప్పిన ఇన్‌స్టా రీల్‌

Sep 5 2026 4:50 PM | Updated on Sep 5 2026 4:59 PM

Kovai teen steals 75 Grams Of Gold  to buy bike for boyfriend held

తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ప్రియుడికి ఖరదైనా బైక్‌ కొనిచ్చేందుకు 19 ఏళ్ల  కాలేజీ అమ్మాయిఏకంగా ఫ్రెండ్‌ ఇంట్లోనే  చోరీకి తెగబడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

పోలీసుల సమాచారం  ప్రకారం నిందితురాలిని టీవీకే నగర్‌కు చెందిన ఆర్‌. జాయ్ ప్రిన్సి (19)గా గుర్తించారు. ఈమె పొల్లాచి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో బి.కామ్ (సి.ఎ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు మక్కిన్‌పట్టికి చెందిన జనగన్ శివ (20) అనే యువకుడితో పరిచయం ఉంది. ప్రియుడిని ప్రసన్నం చేసుకునేందుకు అతగాడికి ఒక  బైక్‌  కొనాలని ప్లాన్‌ చేసింది. అలా పక్కా ప్లాన్‌ ప్రకారం స్నేహితురాలి ఇంట్లో దొంగిలించిన డబ్బుతో   కొత్త KTM బైక్‌ను కొనుగోలు చేసింది.  అక్కడితోఆగలేదు ప్రిన్సి , ప్రియుడితో కలిసి   బైక్‌ అన్‌వీలింగ్‌ వీడియో పోస్ట్‌ చేయడంతో  అడ్డంగా బుక్కయ్యారు. 

ఇదీ చదవండి: రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు

ఉంజవేలాంపట్టికి చెందిన హెచ్. తమిళ్ సెల్వన్ (59) కూతురు, ప్రిన్సి ఇద్దరూ స్నేహితులు.  ప్రిన్సి తండ్రికి కూడా తమిళ్ సెల్వన్  స్నేహితుడు.  ఈ పరిచయాన్నే ఆమె వాడుకుంది.  ఆగస్టు 16న ప్రిన్సి తన స్నేహితురాలిని కలవడానికి తమిళ్ సెల్వన్ ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో బీరువా తెరిచి అందులో ఉన్న 9 సవర్ల బంగారు నగలను దొంగిలించింది. ఇంట్లోని బంగారం కనిపించకపోవడంతో తమిళ్ సెల్వన్ ఇటీవల పొల్లాచి ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరోవైపు  సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోను చూసిన పోలీసులకు అనుమానం రావడంతో ప్రిన్సిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఆమె చేసిన నేరాన్ని అంగీకరించింది. దొంగిలించిన నగలను పొల్లాచిలోని ఒక జ్యువెలరీ షాప్‌లో తక్షణమే రూ. 2.5 లక్షలకు అమ్మేసినట్లు చెప్పింది.ఆ డబ్బుతోనే తన ప్రియుడికి కొత్త బైక్ కొనిచ్చినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం యువతిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు మక్కినంపట్టికి చెందిన జనగన్ శివ (20) కోసం పోలీసులు  గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్‌ జాబ్‌ ఎంచుకున్న టెకీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement