మీ తోబుట్టువుకు ఉపయోగపడే క్రేజీ గిఫ్ట్స్ ఇవే! | Smart Rakhi Gifts 2026 Useful Gift Ideas for Siblings Beyond Sweets Cards | Sakshi
Sakshi News home page

మీ తోబుట్టువుకు ఉపయోగపడే క్రేజీ గిఫ్ట్స్ ఇవే!

Aug 26 2026 4:59 PM | Updated on Aug 26 2026 5:04 PM

Smart Rakhi Gifts 2026 Useful Gift Ideas for Siblings Beyond Sweets Cards

అనురాగానికి ఆప్యాయత తోడై అన్నాతమ్ముళ్లు-అక్కాచెల్లెళ్ల అనుబంధాన్ని పండగలా జరుపుకునే వేడుక రాఖీ పౌర్ణమి. కాలం మారింది. దాంతోపాటు బంధాల వ్యక్తీకరణ తీరూ మారింది. ఒకప్పుడు రాఖీ కట్టి తీపి తినిపిస్తే సరిపోయేది. ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్‌లు, గ్రీటింగ్ కార్డ్‌ల కాలం వచ్చింది. కానీ నేటి డిజిటల్ యుగంలో తోబుట్టువుకు ఇచ్చే బహుమతి కేవలం ఒక వస్తువుగా మిగిలిపోకూడదు. అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా, వారి జీవితంలో భాగమయ్యేలా ఉండాలన్నది నేటి యూత్ ఆలోచన. ఈ పండుగ మరింత గుర్తుండిపోయేలా ఉండేలా కొన్ని వినూత్న, ఉపయోగకరమైన గిఫ్టింగ్ ఐడియాలు చూద్దాం.

ఆర్థిక భద్రతనిచ్చే బహుమతులు

  • తీపి పదార్థాలు ఇచ్చే సంతోషం తాత్కాలికమే, కానీ ఆర్థిక భద్రత ఇచ్చే ధీమా శాశ్వతం.

  • చెల్లెలి లేదా తమ్ముడి పేరిట ప్రతి నెలా చిన్న మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ఎస్ఐపీని ప్రారంభించవచ్చు.

  • సాంప్రదాయ బంగారానికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ బాండ్స్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయి.

  • మీ సోదరి, సోదరుడి పేరిట ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లించడం ద్వారా వారికి ఆరోగ్య భద్రతను బహుమతిగా ఇవ్వవచ్చు.

స్మార్ట్ అండ్ గాడ్జెట్ వేవ్

  • సాంకేతికతతో ముడిపడిన జీవితంలో రోజువారీ పనులను సులభతరం చేసే స్మార్ట్ బహుమతులకు ప్రాధాన్యం పెరుగుతోంది.

  • ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే స్మార్ట్‌వాచ్‌లు నేటి తరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

  • పుస్తకపఠనంపై ఆసక్తి ఉన్నవారికి ఈ-బుక్ సబ్‌స్క్రిప్షన్లు అందించడం అద్భుతమైన ఎంపిక.

  • ఆఫీస్ పనులు, ప్రయాణాలు లేదా ఆన్‌లైన్ క్లాసులకు నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్‌ఫోన్స్ / ఇయర్‌బడ్స్ ఎంతో సహాయపడతాయి.

అనుభూతులను పంచే గిఫ్ట్స్

  • నిరంతరం పనులతో అలసిపోయే అక్క లేదా చెల్లెలికి ఒక చిన్న సోలో ట్రిప్ లేదా వెకేషన్ ప్యాకేజీ గిఫ్ట్‌గా ఇవ్వడం.

  • వారికి ఇష్టమైన ఫోటోగ్రఫీ, కోడింగ్, ఫారిన్ లాంగ్వేజ్ లేదా మ్యూజిక్ కోర్సులకు సంబంధించి ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్ ఇవ్వొచ్చు.

అనుబంధానికి వెలకట్టలేం. కానీ, ఇచ్చే బహుమతిలో వారి పట్ల మనకున్న శ్రద్ధ, వారి భవిష్యత్తు పట్ల మనకున్న బాధ్యత ప్రతిబింబించాలి. ఈ రాఖీ పౌర్ణమికి కేవలం ఒక బహుమతినే కాదు.. వారి ఎదుగుదలకు తోడ్పడే నమ్మకాన్ని కానుకగా ఇద్దాం.

ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement