భోపాల్: బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఓ ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది. అధికారికంగా ప్రజా సేవల కోసం ఉపయోగించాల్సిన వనరుల వినియోగంపై ఈ ఘటనతో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో ఈ వ్యవహారంపై చర్చకు కారణమైంది. ఎమ్మెల్యేకు సంబంధించిన ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వనరులను ప్రజాప్రతినిధులు వ్యక్తిగత అవసరాలకు ఎలా వాడుకుంటారో ఈ ఘటన ద్వారా మరోసారి తేటతెల్లమైంది.
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో అధికారిక నివాసం బయట బీజేపీ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా వ్యక్తిగత కారును అగ్నిమాపక వాహనంతో కడుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అగ్నిమాపక వాహనానికి ఉన్న పైపులతో ముగ్గురు సిబ్బంది ఎమ్మెల్యే ఇన్నోవాపై నీటిని చల్లడం కనిపించింది. బిలోంజీలోని షా అధికారిక నివాసం బయట రోడ్డుపై ఆ వాహనం నిలిపి ఉంది.
ఇదీ చదవండి: 6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్ దీప్కే’లా అయిపోయాడు..
ఇదిలా ఉండగా, వీడియోను తాను చూసినట్లు షా తెలిపారు. నీటిని నింపేందుకు ఆ వాహనం మేయర్ చైర్మన్ ఇంటికి వెళ్లిందని, అక్కడ అనుకోకుండా నిలిపి ఉంచారని చెప్పారు. “మేము కూడా వీడియో చూశాం. ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ తన సొంత కారును కడుక్కోడు. అగ్నిమాపక వాహనం నీటి ట్యాంకును నింపేందుకు మేయర్ చైర్మన్ ఇంటికి వెళ్లిందని డ్రైవర్ చెప్పాడు. అక్కడ అనుకోకుండా వాహనాన్ని నిలిపి ఉంచారు. అందుకే దానిపై కొద్దిగా నీటిని చల్లాడు. ఇలాంటివి చేయకూడదని డ్రైవర్‌కు చెప్పాను” అని రామ్ నివాస్ షా తెలిపారు. ప్రైవేటు అవసరాల కోసం ప్రభుత్వ వనరులను ఉపయోగించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
सिंगरौली में बीजेपी के माननीय विधायक जी की कार वाशिंग फ़ायर ब्रिगेड की गाड़ी से हो रही है pic.twitter.com/CM0YBheLMz
— Brajesh Rajput (@drbrajeshrajput) August 25, 2026


