యువతి గదిలో కెమెరా పెట్టిన ఇంటి యజమాని | House Owner Installs Hidden Camera in Young Woman Room | Sakshi
Sakshi News home page

యువతి గదిలో కెమెరా పెట్టిన ఇంటి యజమాని

Aug 26 2026 12:21 PM | Updated on Aug 26 2026 12:25 PM

House Owner Installs Hidden Camera in Young Woman Room

తిరువొత్తియూరు: చెన్నైలోని వానగరం ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి, తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి ఒక అద్దె ఇంట్లో నివసిస్తూ, ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. వీరి ఇంటి యజమాని కుమారుడు శరవణన్‌  ఆ యువతి, ఆమె స్నేహితురాళ్లు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు తరచూ వారికి వేధింపులు గురిచేసేవాడని తెలుస్తోంది. 

ఈ పరిస్థితిలో, ఆ మహిళలు ఉంటున్న గదిలోని స్విచ్‌ బాక్స్‌లో ఓ రహస్య కెమెరా అమర్చిన్నట్లు గమనించారు. అంతేకాకుండా, ఆ కెమెరా ఇంటి యజమాని కుమారుడైన శరవణన్‌ మొబైల్‌ ఫో¯న్‌కు అనుసంధానించబడి (లింక్‌ అయి) ఉండటం చూసి వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీనిపై వానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళలపై వేధింపుల నిరోధక చట్టం, సమాచార సాంకేతిక చట్టం  సహా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, శరవణన్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.  

సూర్యాపేట: ప్రాణాలు తీసిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం
 

 

  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement