ఇందుకేనేమో యువకులు పెళ్లి చేసుకోవాలంటే వణికిపోతున్నారు! | Wife caught having fun with lover married a month and a half ago | Sakshi
Sakshi News home page

ఇందుకేనేమో యువకులు పెళ్లి చేసుకోవాలంటే వణికిపోతున్నారు!

Aug 25 2026 5:34 PM | Updated on Aug 25 2026 6:11 PM

Wife caught having fun with lover married a month and a half ago
  • భర్త టీ, పాలలో నిద్రమాత్రలు కలుపుతున్న భార్య

  • ఆ తర్వాత ప్రియుడి వద్దకు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ భర్త తన భార్యను ప్రియుడితో సన్నిహితంగా ఉన‍్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో, ఈ సమయంలో తన భార్య తన చేతులను పట్టుకోగా, ఆమె ప్రియుడు తనపై దాడి చేసి.. గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని బాధిత భర్త ఆరోపించాడు. ఇంతలో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి తనను కాపాడారని తెలిపాడు.

బాధిత భర్తకు ఆ మహిళతో సుమారు నెలన్నర క్రితమే వివాహం జరిగింది. ఫిర్యాదు చేసేందుకు భర్త ఝాన్సీ ఎస్‌ఎస్‌పీ కార్యాలయానికి వెళ్లి తన గోడును వెల్లడించాడు. ఈ ఘటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

చిర్‌గావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అతడు నివసిస‍్తున్నాడు. అతడు తన తల్లిదండ్రులతో కలిసి ఎస్‌ఎస్‌పీ కార్యాలయానికి వెళ్లాడు. జూన్ 24న మధ్యప్రదేశ్‌లోని భాండేర్‌కు చెందిన ఓ యువతితో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగినట్లు తెలిపాడు. పెళ్లయినప్పటి నుంచి తన భార్య తనకు నిద్రమాత్రలు ఇవ్వడం ప్రారంభించిందని, తాను నిద్రపోయాక ఆమె తన ప్రియుడితో మాట్లాడుకునేదని భర్త ఆరోపించాడు.

టీ, పాలలో నిద్రమాత్రలు 
తన భార్య టీ, పాలలో నిద్రమాత్రలు కలిపేదని, ప్రియుడితో కలిసి తనపై హత్యాయత్నానికి పాల్పడిందని బాధిత భర్త ఆరోపించాడు. ఆగస్టు 19న ప్రియుడి ఇంట్లోకి వెళ్లిన తర్వాత, ఆగస్టు 23న రెండోసారి భర్త వారిద్దరినీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ సమయంలో ప్రియుడు, భార్య కలిసి తన గొంతు నులిమి కొట్టారని ఆరోపించాడు. అతని అరుపులు విని వచ్చిన పొరుగువారు అతడిని కాపాడారు. ప్రస్తుతం తన ప్రాణాలకు ప్రమాదం ఉందని చెబుతూ బాధితుడు పోలీసులను న్యాయం చేయాలని కోరాడు.

ఈ కేసుపై మోంఠ్ పోలీస్ సర్కిల్ అధికారి మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారని, ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి: భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ భారీ ప్రణాళిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement