ఇంటిని అమ్మి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య | Wife And Husband Incident In Karnataka | Sakshi
Sakshi News home page

ఇంటిని అమ్మి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య

Aug 26 2026 7:44 AM | Updated on Aug 26 2026 8:11 AM

Wife And Husband Incident In Karnataka

వివాహేతర సంబంధం, డబ్బుల గొడవతో భార్యను భర్త హత్య చేసిన ఘటన తళి వద్ద జరిగింది. వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని కర్ణాటక సరిహద్దు గ్రామమైన గుమ్మళాపురంలో నారాయణస్వామి (39), భార్య విద్య (30), ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నారు. విద్యకు మరో యువకునితో ఏడాదిగా అక్రమ సంబంధం ఉందని భర్తకు అనుమానంగా ఉంది. ఇలాంటివి వద్దని భార్యను మందలించాడు. దీంతో కొన్నివారాలుగా గొడవలు జరుగుతుంటే పెద్దలు పంచాయతీ చేశారు.   

పునీత్‌తో పరారీ   
నారాయణస్వామికి అప్పులు ఎక్కువ కావడంతో స్థలాన్ని రూ.22 లక్షలకు విక్రయించి అప్పు తీర్చేశాడు. మిగిలిన రూ.5 లక్షలను భార్య ఖాతాలో ఉంచాడు. కొన్నిరోజుల క్రితం విద్య, ప్రియుడు పునీత్‌తో పరారై  బెంగళూరు దగ్గర ఆనేకల్‌లో మకాం వేసింది. ఇది తెలుసుకొన్న నారాయణస్వామి ఆనేకల్‌కు చేరుకొని తన డబ్బులు తిరిగి ఇవ్వాలని, తన వెంట రావాలని భార్యను కోరాడు. ఆమె తిరస్కరించడంతో గ్రామానికెళ్లిపోయాడు.  

ఊరికి బ్యాంకుకు రాగా..  
సోమవారం బ్యాంకులో డబ్బులు విత్‌డ్రా చేసేందుకు విద్య గుమ్మళాపురానికి వచ్చినట్లు తెలుసుకొన్న భర్త అక్కడికెళ్లి డబ్బులు ఇవ్వు, నీ పేరు మీద ఉన్న ఆస్తిని పిల్లల పేరుమీద రాయాలంటూ గొడవ చేస్తూ బ్యాంకు నుంచి ఆమెను బయటకు లాక్కొచ్చి తలపై బండరాయితో బాది హత్య చేసి పారిపోయాడు.  డెంకణీకోట డీఎస్పీ, తళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని  ఆస్పత్రికి తరలించారు. నారాయణస్వామిని అరెస్ట్‌ చేయగా ఈ ఘటన తళి ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. తల్లీదండ్రి దూరమై ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.      

కర్ణాటక : 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement