3400 ముద్దులు పెట్టింది.. కారుపై లిప్‌స్టిక్‌తో రచ్చ! | Girlfriend leaves 3,400 kiss marks on car | Sakshi
Sakshi News home page

3400 ముద్దులు పెట్టింది.. కారుపై లిప్‌స్టిక్‌తో రచ్చ!

Aug 25 2026 6:27 PM | Updated on Aug 25 2026 6:36 PM

Girlfriend leaves 3,400 kiss marks on car

భోపాల్‌: కారుపై ఎక్కడైనా డెంట్ (గీత) పడితేనే యజమానులు తల్లడిల్లిపోతారు. అలాంటిది ఆ కారు అద్దాలు, బానెట్, డోర్లు అని తేడా లేకుండా ఏకంగా 3,400 లిప్‌స్టిక్ ముద్దులతో నింపితే పరిస్థితి ఎలా ఉంటుంది?. మధ్యప్రదేశ్‌ గ్వాలియర్ వీధుల్లో ఇలాంటి వింత ఘటనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కారు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ పిచ్చి పని చేసిన యజమానికి పోలీసులు షాకిచ్చారు.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసిన ఓ విచిత్ర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. విదేశీ సోషల్ మీడియా ట్రెండ్‌ను అనుకరించిన ఓ యువతి చేసిన పని,ఆమె ప్రియుడిని చిక్కుల్లో పడేసింది.

గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికర్వార్‌ అనే వ్యక్తికి చెందిన కారుపై, అతని ప్రియురాలు విదేశీ ట్రెండ్ నుంచి ప్రేరణ పొంది వినూత్నంగా ప్రయోగిద్దామనుకుంది. ఇందులో భాగంగా కారు అద్దాలు, బోనెట్, డోర్లు, బంపర్లు అని తేడా లేకుండా బాహ్య భాగం అంతా తన పెదవులకు లిప్‌స్టిక్ రాసుకుంటూ ఏకంగా 3,400 సార్లు ముద్దుల ముద్రలు వేసింది. ఈ విధంగా వేలకొద్దీ లిప్‌స్టిక్ మార్కులు వేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది.

పోలీసుల ఎంట్రీ..భారీ జరిమానా!
ఈ విధంగా వింతగా తయారైన కారు గ్వాలియర్ వీధుల్లో తిరుగుతూ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందించగా, ఈ విషయం ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లింది. ఫొటోల్లో కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వాహనాన్ని గుర్తించిన పోలీసులు, ఆదిత్య సికర్వార్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహన రూపం మార్చడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం కింద అతనికి రూ. 5,500 జరిమానా విధించారు.

పోలీసుల చర్యతో తన తప్పును అంగీకరించిన ఆదిత్య సికర్వార్, ఆ తర్వాత స్వయంగా రంగంలోకి దిగాడు. కారుపై ఉన్న ఆ లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులన్నింటినీ పూర్తిగా తొలగించి, వాహనాన్ని శుభ్రం చేసి యథాస్థితికి తీసుకువచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆశతో చేసే ఇలాంటి విపరీత చేష్టలు చివరికి ఎలా ఇబ్బందుల్లోకి నెడతాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement