సిలికాన్ వ్యాలీ నుంచి వాల్‌స్ట్రీట్ వరకు ప్రపంచ వాణిజ్య యవనికపై భారత్, భారత సంతతికి చెందిన నాయకులు తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, బిలియన్ డాలర్ల విలువైన బహుళ జాతి సంస్థలకు నాయకత్వం వహిస్తూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను దిశానిర్దేశం చేస్తున్నారు.
సాంకేతిక రంగంలో గూగుల్ (అల్ఫాబెట్) అధిపతి సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, ఐబీఎమ్ చీఫ్ అరవింద్ కృష్ణ, యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్, అడోబ్ నాయకుడు శంతను నారాయణ్ గ్లోబల్ టెక్ వ్యూహాలను శాసిస్తున్నారు. సైబర్ భద్రత, క్లౌడ్, నెట్‌వర్కింగ్ రంగాల్లో నికేష్ అరోరా (పాలో ఆల్టో), జయశ్రీ ఉల్లాల్ (అరిస్టా), జార్జ్ కురియన్ (నెట్‌యాప్) ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక భారతీయ ఐటీ రంగానికి ఐకాన్‌గా నిలిచిన ఇన్ఫోసిస్ సీఈఓగా సలీల్ పరేఖ్, కాగ్నిజెంట్ సారథిగా రవికుమార్ ఎస్ ఐటీ సేవల విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
భారతీయ, భారత సంతతికి చెందిన ప్రముఖ కంపెనీలు, సీఈఓల వివరాలు
Alphabet (Google): సుందర్ పిచాయ్
Microsoft: సత్య నాదెళ్ల
YouTube: నీల్ మోహన్
Adobe: శంతను నారాయణ్
Procter & Gamble (P&G): శైలేష్ జెజూరీకర్
T-Mobile US: శ్రీని గోపాలన్
World Bank Group: అజయ్ బంగా (ప్రెసిడెంట్ & సీఈఓ)
IBM: అరవింద్ కృష్ణ
Infosys: సలీల్ పరేఖ్
NetApp: జార్జ్ కురియన్
Palo Alto Networks: నికేష్ అరోరా
Arista Networks: జయశ్రీ ఉల్లాల్
Novartis: వసంత్ నరసింహన్
Micron Technology: సంజయ్ మెహ్రోత్రా
Honeywell: విమల్ కపూర్
Flex: రేవతి అద్వైతి
Wayfair: నీరజ్ షా
Chanel: లీనా నాయర్
Cognizant: రవికుమార్ ఎస్
Vertex Pharmaceuticals: రేష్మా కేవల్‌రమణి
Molson Coors Beverage Company: రాహుల్ గోయల్
ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..


