హైదరాబాద్: తెలంగాణలో SIR ఎన్యుమరేషన్ దశ పూర్తయింది. సర్ ముసాయిదా జాబితాను సోమవారం సీఈవో సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. 3,38,26,448 మంది ఓటర్లలో 2,64,87,213 మంది ఎన్యుమరేషన్ ఫామ్‌లు సమర్పించారు. 78.30 శాతం మంది ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫామ్‌లు స్వీకరించారు. 9,22,229 మంది మరణించిన వారు ఉన్నారు. 57,46,803 మంది శాశ్వతంగా షిఫ్ట్/అబ్సెంట్/ఇతర కేటగిరీలో గుర్తింపుతో ఉన్నారు.
ఇతర వివరాలు
6,70,203 మంది ఓటర్లు ఒకటికి మించి చోట్ల నమోదైనట్లు గుర్తింపు
మల్టీపుల్ ఎన్‌రోల్‌మెంట్ ఉన్న ఓటర్ల పేర్లు ఒక్కచోటే కొనసాగింపు
జెన్యూన్ ఓటర్లకు డ్రాఫ్ట్ జాబితాలో చేరేందుకు మరో అవకాశం
ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ
కొత్త ఓటర్ల నమోదుకు ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం
ఓవర్సీస్ ఇండియన్ల నమోదుకు ఫామ్-6A
తప్పుడు చేర్పులపై అభ్యంతరాలు/తొలగింపులకు ఫామ్-7
చిరునామా మార్పు, వివరాల సవరణలకు ఫామ్-8
అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురణ
తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ విడుదల
35,985 పోలింగ్ స్టేషన్లలో బూత్ స్థాయిలో ఎన్యుమరేషన్ ప్రక్రియ
SIRలో 49,018 మంది బూత్ లెవల్ ఏజెంట్ల భాగస్వామ్యం
BLAలలో కాంగ్రెస్ 13,144.. BRS 20,394.. BJP 11,621 AIMIM 2,382.. CPI(M) 608.. BSP 569.. TDP 300 మంది
వృద్ధులు, దివ్యాంగులు, పేదలు, ఇతర బలహీన వర్గాల ఓటర్లకు ప్రత్యేక సహాయం
డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై ప్రజలు ERO/AERO కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల్లో పరిశీలనకు అవకాశం


