‘22-Aతో రేవంత్‌ ప్రభుత్వం గందరగోళానికి తెరలేపింది’ | Former Minister Harish Rao Slams Revanth Sarkar | Sakshi
Sakshi News home page

‘22-Aతో రేవంత్‌ ప్రభుత్వం గందరగోళానికి తెరలేపింది’

Aug 17 2026 4:03 PM | Updated on Aug 17 2026 4:15 PM

Former Minister Harish Rao Slams Revanth Sarkar

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 30 శాతం ప్రభుత్వం నడుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా రేవంత్‌ ప్రభుత్వంపై హరీష్‌ మండిపడ్డారు. ‘లక్షలాది ప్రాపర్టీలు 22-Aలో పెట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకొన్న తర్వాత మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదు.. ప్రాహిబిటేషన్ లో ఉంది అని చెబుతున్నారు. 

రేవంత్‌ ప్రభుత్వం గందరగోళానికి తెరలేపింది. ఎవరి భూమి ప్రాహిబిటేషన్ లో ఉందో తెలియని పరిస్థితి. సీఎం రేవంత్‌ ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉంది. అందుకే తొలగించడానికి హడావుడి చేస్తున్నారు.  రాష్ట్రం లో 30 పర్సంటేజ్ ప్రభుత్వం నడుస్తుంది. ప్రాహిబిటేషన్‌లో నుండి సర్వే నంబర్ తీసివేయాలంటే 30 పర్సంటేజ్ ఆడుతున్నారు. రెవెన్యూలో  మీ పని జరగాలంటే. 30 పర్సంటేజ్ ఇవ్వాల్సిందే అంటున్నారు’ అని హరీష్‌ విమర్శించారు.

సొంతింటి యజమానులకు ‘22–ఏ’ పిడుగు..! 

 

 

 


 

 

 

 

 

Cm రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ప్రోహిబిటెషన్ లో ఉంది..

Cm రేవంత్ రెడ్డి ఇల్లు వుండటంతో ఇప్పుడు ప్రోహుబిటేషన్  తీసివేస్తం అంటున్నారు..

22ఏ పై విచారణ జరపాలి..
ప్రాహిబిటేషన్ పెట్టమని ఆదేశించింది ఎవరు. కారకులు ఎవరు..

రాష్ట్రం లో 30 పర్సంటేజ్ ప్రభుత్వం నడుస్తుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి అలా ఉంటే ..సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement