రాహుల్‌ గాంధీకి హరీష్‌ లేఖ | BRS Leader Harish Rao Writes Letter To AICC Leader Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీకి హరీష్‌ లేఖ

Oct 2 2026 6:55 PM | Updated on Oct 2 2026 6:56 PM

BRS Leader Harish Rao Writes Letter To AICC Leader Rahul Gandhi

హైదరాబాద్‌: ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు లేఖ రాశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి రాహుల్‌ గాంధీకి హరీష్‌ లేఖ రాశారు. ఈ ప్రైవేటీకరణ అంశంపై రాహుల్‌ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. టీజీ-ట్రాన్స్‌కో, టీజీ-జెన్‌కో, సింగరేణి, డిస్కంల ప్రైవేటీకరణకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. 

కాంగ్రెస్‌ జాతీయ విధానం ఢిల్లీలో ఒకలా.. తెలంగాణలో మరోలా ఎందుకు? అని ప్రశ్నించారు హరీష్‌, కాంగ్రెస్‌ మేనిఫెస్టో, రాయ్‌పూర్‌ ఆర్థిక తీర్మానాలను తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుందా? స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.  దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్మించిన ప్రజా ఆస్తులను రేవంత్‌ ప్రైవేటీకరించడం దుర్మార్గమన్నారు.

ఇదీ చదవండి: ఖైరతాబాద్‌లో వందశాతం మేమే గెలుస్తాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement