అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ ఎక్కువ.. పని తక్కువ అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత శైలజానాథ్. హార్టికల్చర్ హబ్‌పేరుతో చంద్రబాబు దగా చేస్తున్నారని మండిపడ్డారు. సీమలో నీటి సంక్షోభం ఉన్న సంగతి బాబుకు తెలియదా?, చంద్రబాబు చెప్పేవన్నీ పచ్ఛి అబద్ధాలేనని, రాయలసీమ నీటి సంక్షోభం ఉన్న సంగతి ఆయనకు తెలియదా? అని నిలదీశారు.
చంద్రబాబుది నరం లేని నాలుక అని, నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. సీమలో పంటలు ఎండిపోతే.. చంద్రబాబు సంబరాలు ఏంటి? అని ప్రశ్నించారు. రాయలసీమ అంటే చంద్రబాబుకు అంత అపహాస్యమా?, చిత్తూరు జిల్లాలో నీరు లేక 10 వేల ఎకరాల్లో మామిడి చెట్లు ఎండిపోయిన విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
ఇదీ చదవండి: కరువు వేళ ఈవెంట్లు కాదు.. రైతులను ఆదుకోండి..


