సాక్షి, తాడేపల్లి: క్రీడాకారిణి బొల్లు లిఖితకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలవటంపై హర్షం వ్యక్తం చేశారు. గుంటూరుకు చెందిన లిఖిత అంతర్జాతీయ వేదికపై సత్తా చాటటం.. దేశానికి బంగారు పతకం అందించడం గర్వకారణం’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
లిఖిత విజయానికి అండగా నిలిచిన ఆమె కుటుంబ సభ్యులు, కోచ్‌ల ప్రోత్సాహం అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి.. దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చికిత ‘గోల్డెన్’ ధమాకా.. తెర వెనక సైలెంట్ హీరో!
Congratulations to Bollu Likhitha on winning the gold medal in the 76 kg category at the Commonwealth Powerlifting Championships in Winnipeg, Canada! It’s a proud moment to see a young woman from Guntur win gold for India. The encouragement and support of your family and coaches are truly appreciable. Wishing you continued success, Likhitha!
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2026


