Asian Games 2026: బాక్సింగ్‌లో లవ్లీనా 'పసిడి పంచ్' | Lovlina Borgohain wins maiden Asian Games Gold | Sakshi
Sakshi News home page

Asian Games 2026: బాక్సింగ్‌లో లవ్లీనా 'పసిడి పంచ్'

Oct 2 2026 10:54 AM | Updated on Oct 2 2026 11:15 AM

Lovlina Borgohain wins maiden Asian Games Gold

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ అద్భుత ప్రదర్శనతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల 75 కేజీల బాక్సింగ్ ఫైనల్లో  చైనాకు చెందిన బావో జియీపై 5-0 తేడాతో సంచలన విజయం సాధించి తొలి ఏషియ‌డ్ గోల్డ్‌మెడల్‌ను లవ్లీనా ముద్దాడింది.

ల‌వ్లీనా బంగారు ప‌త‌కంతో పాటు ఓ అరుదైన రికార్డును కూడా త‌న పేరిట లిఖించుకుంది. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడ‌ల్‌ గెలిచిన రెండో భారత మహిళా బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది. అంత‌కుముందు 2014 ఆసియా క్రీడల్లో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ స్వ‌ర్ణం ప‌త‌కం సాధించింది.

మ‌ళ్లీ ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మళ్లీ లవ్లీనా చ‌రిత్ర‌ను తిరగరాసింది. లవ్లీనా తన పుట్టినరోజున ఈ ఫీట్‌ సాధించడం విశేషం. ఈ స్వర్ణంతో భారత్‌ పతకాల సంఖ్య 68కు చేరింది. శుక్రవారం భారత్‌కు ఇది రెండో గోల్డ్‌మెడల్‌. అంతకుముందు భారత మహిళల రీకర్వ్ ఆర్చరీ జట్టు బంగారు పతకం కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement