ఫైనల్లో లవ్లీనా | Lovlina Borgohain becomes first Indian woman boxer to reach finals in two consecutive Asian Games | Sakshi
Sakshi News home page

ఫైనల్లో లవ్లీనా

Oct 1 2026 3:57 AM | Updated on Oct 1 2026 3:57 AM

Lovlina Borgohain becomes first Indian woman boxer to reach finals in two consecutive Asian Games

సెమీస్‌లో ఓడి కాంస్యాలు గెలిచిన ప్రియ, కపిల్, నరేందర్‌

నగోయా: వరుసగా రెండు ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా లవ్లీనా బొర్గోహైన్‌ గుర్తింపు పొందింది. బుధవారం జరిగిన 75 కేజీల విభాగం సెమీఫైనల్లో లవ్లీనా 3–2తో నటాల్యా బొగ్డనోవా (కజకిస్తాన్‌)పై గెలిచింది. శుక్రవారం జరిగే ఫైనల్లో జియి బావో (చైనా)తో లవ్లీనా ఆడుతుంది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో లవ్లీనా రజతం గెలిచింది. మరోవైపు ప్రియా ఘంఘాస్‌ (60 కేజీలు), కపిల్‌ (90 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు దక్కించుకున్నారు. 

ప్రియ 1–4తో యాఆంగ్‌ చెంగ్యూ (చైనా) చేతిలో, కపిల్‌ 1–4తో తురాబెక్‌ ఖాబిబులయెవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓటమి పాలయ్యారు. మంగళవారం జరిగిన ప్లస్‌ 90 కేజీల సెమీఫైనల్లో నరేందర్‌ పరాజయం పాలయ్యాడు. బుధవారంతో బాక్సింగ్‌ సెమీఫైనల్స్‌ ముగియడంతో ఓడిన వారికి కాంస్య పతకాలను అధికారికంగా ఖరారు చేశారు. లవ్లీనాతోపాటు అంకుశ్‌ పంఘాల్‌ (80 కేజీలు), పర్వీన్‌ హుడా (65 కేజీలు) కూడా స్వర్ణ పతకాల కోసం పోటీపడతారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement