44 ఏళ్ల క‌ల‌కు అడుగుదూరంలో.. హాకీ ఫైన‌ల్లో భార‌త్‌ | IND-Women-Hockey-Enters Final-One Win-Away-End 44 Years Drought | Sakshi
Sakshi News home page

Asian Games: 44 ఏళ్ల క‌ల‌కు అడుగుదూరంలో.. హాకీ ఫైన‌ల్లో భార‌త్‌

Sep 30 2026 5:32 PM | Updated on Sep 30 2026 6:00 PM

IND-Women-Hockey-Enters Final-One Win-Away-End 44 Years Drought

Photo Credit: Twitter

ఆసియా గేమ్స్‌లో భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు ఫైన‌ల్లో అడుగుపెట్టింది. బుధ‌వారం ద‌క్షిణ కొరియాపై 2-0తో విజ‌యం సాధించిన భార‌త్ తుది పోరుకు అర్హ‌త సాధించింది. శ‌నివారం (అక్టోబ‌ర్ 3న‌) జ‌ర‌గ‌నున్న‌ స్వ‌ర్ణ ప‌త‌కం కోసం ఫైన‌ల్లో చైనాతో అమీతుమీకి సిద్ధ‌మైంది. తొలి రెండు క్వార్ట‌ర్స్‌లో ఇరుజ‌ట్లు ఒక్క గోల్ కూడా చేయ‌లేక‌పోయాయి. 

అయితే మూడో క్వార్ట‌ర్‌లో (ఆట 44వ నిమిసం) ఇషికా గోల్ కొట్ట‌డంతో భార‌త్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ‌రుక్ష‌ణ‌మే కెప్టెన్ స‌లీమా టిటే అద్భుతంగా స్పందించి, బంతిని వెన‌క్కి క‌ట్ చేసింది. ఆ త‌ర్వాత ప్ర‌త్య‌ర్థిని బోల్తా కొట్టించి నేరుగా బంతిని నెట్‌లోకి పంపించి భార‌త్ ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. 

ఈ నేప‌థ్యంలో 44 ఏళ్ల త‌ర్వాత ఆసియా గేమ్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించేందుకు భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. గ‌తంలో 1982లో ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన ఆసియా గేమ్స్‌లో మ‌హిళ‌ల హాకీ ఫైన‌ల్లో భార‌త్ 22-0తో హాంకాంగ్‌పై ఏకప‌క్ష విజ‌యంతో స్వ‌ర్ణం ఎగ‌రేసుకుపోయింది. ప్ర‌స్తుతం మ‌హిళ‌ల హాకీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో కొన‌సాగుతున్న భార‌త్ లీగ్ ద‌శ‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధించి మంచి ఆత్మ‌విశ్వాసాన్ని కూడ‌గ‌ట్టుకుంది.

ఫైనల్లో లవ్లీనా.. సునీల్‌కు క్యాంసం
రెజ్లింగ్‌లో సునీల్ కుమార్  కాంస్యం సాధించాడు. గ్రీకో రోమన్ పురుషుల 87 కిలోల విభాగంలో ఉడుంపట్టుతో పతకం పట్టేశాడు సునీల్. కల్లమ్ రాబర్ట్స్ జాన్‌స్టన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన భారత రెజ్లర్ 5-0తో జయకేతనం ఎగురవేశాడు. గత ఎడిషన్‌లోనూ సునీల్ కంచుమోత మోగించిన విషయం తెలిసిందే.

ఇక మ‌హిళ‌ల బాక్సింగ్ 75 కేజీల విభాగంలో భార‌త బాక్స‌ర్ లవ్లీనా బొర్గొహైన్ ఫైనల్లో ప్ర‌వేశించింది. ఆసియా గేమ్స్‌లో వ‌రుస‌గా రెండోసారి ఫైన‌ల్  చేరిన ల‌వ్లీనా గ‌త ఆసియా గేమ్స్‌లో ర‌జ‌తంతో మెరిసింది. ఈసారి స్వ‌ర్ణంపై గురి పెట్టిన ల‌వ్లీనా త‌న ఫైన‌ల్ అక్టోబ‌ర్ 2న ఆడ‌నుంది. ఇక సెమీస్‌లో ల‌వ్లీనా 3-2తో క‌జ‌కిస్తాన్‌కు చెందిన న‌టాలియా బొగ్డనోవాపై విజ‌యం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement