Asian Games 2026: ఆర్చరీలో హ్యాట్రిక్.. భారత్‌ ఖాతాలో 10వ స్వర్ణం | Asian Games 2026 Day 11: Archers Complete Hat Trick Of Gold Medals | Sakshi
Sakshi News home page

Asian Games 2026: ఆర్చరీలో హ్యాట్రిక్.. భారత్‌ ఖాతాలో 10వ స్వర్ణం

Sep 30 2026 1:01 PM | Updated on Sep 30 2026 1:38 PM

Asian Games 2026 Day 11: Archers Complete Hat Trick Of Gold Medals

source: X

ఆసియా క్రీడలు-2026 ఆర్చరీలో భారత అథ్లెట్లు హ్యాట్రిక్‌ స్వర్ణాలతో మెరిశారు. తొలుత మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో చైనాను ఓడించి పసిడి పతకం గెలిచిన భారత్.. అనంతరం కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో దక్షిణ కొరియాను ఓడించి మరో స్వర్ణం సాధించింది.

తాజాగా పురుషులు కాంపౌండ్‌ టీమ​ ఈవెంట్లోనూ బంగారు పతకంతో మెరిసింది భారత్‌. కుశాల్‌ దలాల్‌, సాహిల్‌ రాజేశ్‌ జాధవ్‌, గణేశ్‌ మణిరత్నంలతో కూడిన జట్టు చైనాను 238-237 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది.

ఈ పతకంతో భారత్‌ ఖాతాలో 10వ స్వర్ణం చేరింది (మొత్తం 59 పతకాలు). ఇవాళ ఒక్క రోజే భారత్‌ నాలుగు స్వర్ణ పతాకలు సాధించింది. ఆర్చరీతో పాటు మహిళల షూటింగ్‌ ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో నీరూ ధండా, కైనన్ చెనాయ్ జోడీ కూడా స్వర్ణం సాధించింది.

మహిళల టీమ్, మిక్స్‌డ్ టీమ్ తర్వాత పురుషుల టీమ్ కూడా బంగారు పతకం సాధించడంతో భారత్‌కు ఆర్చరీలో "గోల్డెన్ హ్యాట్రిక్" పూర్తయింది.

మరోవైపు ఇవాళే మహిళల బాక్సింగ్‌లో ప్రియ ఘంఘాస్ (60 కేజీలు), పురుషుల 90 కేజీల విభాగంలో కపిల్ పొఖరియా సెమీఫైనల్లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నారు. మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గొహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి భారత్‌కు కనీసం రజతాన్ని ఖాయం చేసింది. స్క్వాష్‌లో భారత పురుషుల, మహిళల జట్లు కూడా సెమీఫైనల్‌కు చేరి పతకాలను ఖాయం చేసుకున్నాయి.

ఇదీ చదవండి: ‘పసిడి’ పరుగుల రాణి..


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement