source: X
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. మహిళల టీమ్ కాంపౌండ్ ఆర్చరీలో చికితా రావు తానిపర్తి, ప్రితిక ప్రదీప్, జ్యోతి సురేఖ వెన్నంతో కూడిన భారత త్రయం, ఫైనల్లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణం సాధించింది. ఈ విభాగంలో భారత్ ఛాంపియన్‌గా నిలవడం ఇది వరుసగా రెండోసారి.
స్వర్ణం గెలిచిన భారత జట్టులో ఇద్దరు తెలుగువారు కావడం విశేషం. జ్యోతి సురేఖ స్వస్థలం విజయవాడ (ఆంధ్రప్రదేశ్) కాగా.. చికితా రావు తానిపర్తిది పెద్దపల్లి జిల్లా (తెలంగాణ). మరో అమ్మాయి ప్రితికది మహారాష్ట్ర.
తాజా పతకంతో భారత్ ఖాతాలో ఏడో స్వర్ణ పతకం చేరినట్లైంది. ఇప్పటివరకు 7 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్యాలు సాధించిన భారత్ పతకాల పట్టికలో టాప్-10లోకి (9వ స్థానం) దూసుకొచ్చింది.
ఇదీ చదవండి: నీరూ బంగారు ‘ట్రాప్’


