భారత్‌ను ఆపతరమా! | Indias second ODI against West Indies today | Sakshi
Sakshi News home page

భారత్‌ను ఆపతరమా!

Sep 30 2026 4:06 AM | Updated on Sep 30 2026 4:09 AM

Indias second ODI against West Indies today

నేడు వెస్టిండీస్‌తో రెండో వన్డే 

మ. 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

గువాహటి: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించిన తీరు చూస్తే సిరీస్‌ ఎలా ఉండబోతోందో అర్థమైంది. ఈ స్థితిలో నేడు ఇరు జట్ల మధ్య రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. గత మ్యాచ్‌లో 296 పరుగుల లక్ష్యాన్ని మరో 50 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా అలవోకగా ఛేదించింది. అంతే కాదు...గత మ్యాచ్‌లో సెంచరీ బాదిన భారత స్టార్‌ విరాట్‌ కోహ్లి గువాహటి రికార్డు కూడా అలాగే ఉంది. 

ఇక్కడ గతంలో టీమిండియా రెండు వన్డేలు ఆడగా, రెండింటిలోనూ కోహ్లి సెంచరీలు చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. కెప్టెన్ గిల్‌ కూడా శతకంతో తానూ సిద్ధంగా ఉండగా, రోహిత్‌ శర్మ కూడా చెలరేగితో విండీస్‌కు కష్టాలు తప్పవు.  మరోవైపు తొలి వన్డేలో సెంచరీ చేసిన జస్టిన్‌ గ్రీవ్స్‌ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడం విండీస్‌కు పెద్ద దెబ్బ. ఆ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement