Photo Credit: BCCI Twitter
తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ 55వ వన్డే శతకాన్ని నమోదు చేశాడు. విండీస్‌పై 139 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు. తద్వారా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లి.. భారత దిగ్గజం సునీల్ గావస్కర్ రికార్డును కూడా సమం చేయడం విశేషం. ఈ రికార్డు ఆలస్యంగా వెలుగు చూసినప్పటికీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
వెస్టిండీస్‌పై అద్భుత రికార్డు కలిగిన సునీల్ గావస్కర్.. ఆ జట్టుపై అత్యధిక శతకాలు నమోదు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. గావస్కర్ వెస్టిండీస్‌పై 38 మ్యాచ్‌ల్లో 13 శతకాలు సాధించాడు. అయితే కోహ్లి 78 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. విండీస్‌తో తొలి వన్డేలో సెంచరీ చేసిన కోహ్లి 13వ శతకంతో గవాస్కర్ రికార్డును సమం చేశాడు.
రేపు విండీస్‌తో రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో గౌహతి వేదికగా కోహ్లి మరో సెంచరీ చేస్తే విండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలవనున్నాడు. అసలే గౌహతిలో తాను ఆడిన రెండు వన్డేల్లోనూ సెంచరీలు బాదిన కోహ్లికి ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా అది పెద్ద కష్టం కాకపోవచ్చు.
అయితే గావస్కర్ ఈ 13 శతకాలను టెస్టులోనే నమోదు చేయగా, కోహ్లి మాత్రం వన్డేల్లో 11, టెస్టుల్లో రెండు సెంచరీలు చేశాడు. అయితే భారత లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రం వెస్టిండీస్‌పై తన కెరీర్‌లో ఏడు శతకాలు మాత్రమే చేశాడు. ఇందులో మూడు టెస్టుల్లో వస్తే, మరో నాలుగు వన్డే క్రికెట్‌లో సాధించాడు.
ఇదీ చదవండి: గౌహతిలో రో-కోల ట్రాక్ రికార్డు అదుర్స్.. విండీస్‌కు చుక్కలే!


