భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం.. అద్భుతం చేసిన అథ్లెట్లు | 4x400m womens relay: India Won gold at 2026 Asian Games | Sakshi
Sakshi News home page

భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం.. అద్భుతం చేసిన అథ్లెట్లు

Sep 29 2026 6:04 PM | Updated on Sep 29 2026 6:33 PM

4x400m womens relay: India Won gold at 2026 Asian Games

PC: Sonysports

ఆసియా క్రీడలు-2026లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఐచీ నగోయా వేదికగా భారత మహిళల రిలే జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. కిరణ్‌ పహల్‌, మచెట్టిర పూవమ్మ, ప్రాచీ, విద్య రామ్‌రాజ్‌లతో కూడిన జట్టు 4*400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది.

మంగళవారం నాటి పోటీలో 3:29.69 నిమిషాల వ్యవధిలో భారత మహిళలు ఈవెంట్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచారు. బహ్రెయిన్‌ అథ్లెట్లు 3:30.21, చైనా బృందం 3:31.02 సెకన్ల వ్యవధిలో పరుగు పూర్తి చేసి వరుసగా రజత, కాంస్య పతకాలు అందుకున్నారు. ఇదిలా ఉంటే.. రిలే మహిళల స్వర్ణంతో తాజా ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ పసిడి పతకాల సంఖ్య ఆరుకు చేరింది.

విద్య రామ్‌రాజ్‌కు మూడో పతకం
విద్యా రామ్‌రాజ్‌ ఇప్పటికే మిక్స్‌డ్‌ 4*400 మీటర్ల రిలేలో వెండి, 400 మీటర్ల హార్డిల్స్‌లో కాంస్య పతకాలు గెలిచింది. తాజాగా మహిళల 4*400 రిలేలో ఏకంగా స్వర్ణం సాధించింది. 

ఇప్పటి వరకు భారత్‌ ఖాతాలో ఆరు పసిడి పతకాలు
👉మహిళల క్రికెట్‌ జట్టు
👉పురుషుల కబడ్డీ జట్టు
👉మహిళల కబడ్డీ జట్టు
👉నీరూ ధండా- షూటింగ్‌ (ట్రాప్‌ వుమెన్‌ సింగిల్‌)
👉10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌- షూటింగ్‌
👉4*400 మీటర్ల రిలే (మహిళలు)

చదవండి: చరిత్ర సృష్టించిన గుల్వీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement