పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో మరో సంచలనం విషయం వెలుగు చూసింది. దాదాపు ఐదున్నర వేల (5,300) పేజీల ఈ ఛార్జిషీట్‌లో, కేతన్ అగర్వాల్ హత్య ఎలా జరిగింది, కుట్ర ఎలా పన్నారు లాంటి సమాచారాన్ని అధికారులు పొందుపరిచారు. అనేక ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్నప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియాగోయల్‌తో ప్రేమాయణం నడిపిన మాజీ ప్రియుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
పూణే పోలీసులకు సియా గోయల్ పాఠశాల రోజుల ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి. సియా గోయల్ మైనర్‌గా పాఠశాల చదువుతున్న రోజుల్లోనే ఒక ప్రేమ వ్యవహారాన్ని నడిపింది. ఆ తరువాత చేతన్‌తో ప్రేమలో పడింది. దీంతో మొదటి ప్రియుడు సియా నుంచి దూరంగా జరిగాడు. కానీ కేతన్ హత్య కేసులో చేతన్ పేరు వినిపించడంతో ఈ పాత ప్రియుడుదర్యాప్తు అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చాడని ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో బురిడీ, నెలకు రూ. 2.80 లక్షలు..కట్ చేస్తే
మరో షాకింగ్ అంశం.. కేతన్‌ను చంపాలనుకోలేదట
ఇదే చార్జ్‌షీట్‌లో మరో దిగ్భ్రాంతికరమైన అంశం కూడా వెలుగు చేసింది, హత్యకు ముందు, నిందితులు సియా, చేతన్, కేతన్ కాళ్లు చేతులు విరగ్గొట్టాలని ప్లాన్ వేశారు. అందుకు మరొక రాష్ట్రానికి తీసుకెళ్లాలని ఆలోచించారు. ఈ ప్రణాళికలో భాగంగా, వారిద్దరూ బెంగళూరులో ఉన్న ఒక స్నేహితుడిని సంప్రదించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.అయితే వీరి ప్లాన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆ ఫ్రెండ్ "మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి పనులు చేయకండి" అని వారితో హెచ్చరించాడట. ఇతడి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసి, ఛార్జిషీట్‌లో చేర్చారు.
ఇదీ చదవండి: విషాదం : భార్య టార్చర్, అత్తమామలు అల్లుణ్ని కాల్చి చంపేశారు
మరోవైపు కేతన్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ పోలీసులకు ఇచ్చిన సమాచారాన్ని కూడా ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. సియాకు రూ. 8 లక్షల విలువైన దుస్తులతో పాటు, నిశ్చితార్థం సమయంలో ఆమెకు రూ. 80 లక్షల విలువైన ఆభరణాలు కూడా ఇచ్చానని తెలిపారు. అలాగే తన కుమారుడి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరపాలని ఎన్నో కలలు కన్నామని ఆయన దర్యాప్తు అధికారులముందు వాపోయారు.
ఇదీ చదవండి: రూ. 80 లక్షల నగలు, 28 డ్రెస్సులు, గ్రాండ్ వెడ్డింగ్ : కానీ సియా ప్లాన్..!


