ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. మంగళవారం 3 గంటలపాటు కొనసాగిన సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ పలు డిమాండ్లు చేసింది. సీఈసీ వెంటనే రాజీనామా చేయాలని చెప్పింది.
SIRను వెంటనే నిలిపివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తొలగించిన 13.30 కోట్ల పేర్లను వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణు గోపాల్ అన్నారు. సీఈసీ, ప్రధాని, హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్, కోర్టులు, వీధుల్లో పోరాటం కొనసాగిస్తామని, ఇది స్వాతంత్య్ర పోరాటం తరహాలోనే కార్యక్రమాలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
కాగా, ‘ఓటు చోరీ’ హెచ్చరికలు నిజమయ్యాయని సీడబ్ల్యూసీ పేర్కొంది. సీఈసీ ఇతర కమిషనర్ల సలహా లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎన్నికల కమిషన్ ఒక వ్యక్తి ఆధిపత్యంలోకి మారిందని ఆరోపించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ద్వారా 13 కోట్ల 30 లక్షల మంది పేర్లు ఎన్నికల జాబితా నుంచి తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌కు ఒక్కసారిగా షాక్ ఇచ్చిన పాకిస్థాన్


