‘సర్‌’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం | Election Commission Holds Key Meeting On Sir Process | Sakshi
Sakshi News home page

‘సర్‌’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Sep 26 2026 5:34 PM | Updated on Sep 26 2026 5:54 PM

Election Commission Holds Key Meeting On Sir Process

ఢిల్లీ: సర్‌ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. అంతర్గత విబేధాలు బయటపడిన తర్వాత తొలిసారి జరిగిన భేటీకి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌, ఈసీలు సందు, జోషి హాజరయ్యారు. ‘సర్‌’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘సర్‌’లో అభ్యంతరాలపై నవంబర్‌ 30 వరకు గడువు పొడిగించింది. నోటీసులు అందుకున్నవారు బీఎల్‌వోను కలవక్లర్లేదని.. బీఎల్‌వోలే ఓటర్లక ఇళ్లకు వస్తారని ఈసీ తెలిపింది.

ఎస్ఐఆర్ (SIR)లో నోటీసు వచ్చిన వారికి బీఎల్‌వోలు ఇంటికి వచ్చి డాక్యుమెంట్లు తీసుకొని ఈసీఐనెట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈఆర్వో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అసాధారణ పరిస్థితుల్లోనే ఆన్‌లైన్ హియరింగ్. కుటుంబ సభ్యుడు కూడా హాజరు కావచ్చు. రాత్రి షెల్టర్లు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం డీఈవోలు సహాయ కేంద్రాలు, స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి’’ అని సీఈసీ పేర్కొన్నారు.

‘‘ఎస్ఐఆర్ ఫామ్-6 డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఎస్ఐఆర్ కాకుండా ఇతర సమయాల్లో సాధారణ నియమాల ప్రకారం ఫామ్‌లు వాడాలి. ఈసీఐనెట్‌ను సీనియర్ డీఈసీ అధ్యక్షతన కమిటీ సమీక్షిస్తుంది. కొత్త ఐటీ మాడ్యూళ్లు కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ ద్వారా ఆమోదం తీసుకోవాలి. ఢిల్లీ క్లెయిమ్స్, అబ్జెక్షన్లు 30 అక్టోబర్ 2026 వరకు, డిస్పోజల్ 30 నవంబర్ 2026 వరకు పొడిగింపు. 
మహారాష్ట్రలో క్లెయిమ్స్ 12 అక్టోబర్ 2026 వరకు, డిస్పోజల్ 10 నవంబర్ 2026 వరకు పొడిగిస్తున్నాం’’ అని సీఈసీ తెలిపారు.

ఎస్ఐఆర్ 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తయింది. ఓటర్లు, యువకులు కంటిన్యుయస్ అప్‌డేషన్ ద్వారా పేరు చేర్చుకోవచ్చు. ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించాలని సీఈవోలకు ఈసీ ఆదేశించింది. కమిషన్ సమావేశాలకు ముందుగా అజెండా, తర్వాత మినిట్స్ జారీ చేయాలి. అధికారుల ఏపీఏఆర్‌లు ప్రతి సంవత్సరం డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలి. విదేశీ పర్యటనలకు కమిషన్ అనుమతి తప్పనిసరి’’ అని సీఈసీ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమంలో కలకలం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement