ఏంటి, ఇది నిజమా?.. బీజేపీ ఎంపీపై హృతిక్ రోషన్ సెటైర్లు! | Hrithik Roshan reply on Bansuri Swaraj Vande Mataram dare to Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఏంటి, ఇది నిజమా?.. బీజేపీ ఎంపీపై హృతిక్ రోషన్ సెటైర్లు!

Sep 29 2026 3:57 PM | Updated on Sep 29 2026 4:19 PM

Hrithik Roshan reply on Bansuri Swaraj Vande Mataram dare to Rahul Gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో చేసిన ‘స్మాష్ ది పాట్రియార్కీ’ (పితృస్వామ్యాన్ని అంతం చేయాలి) నినాదంపై బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ విసిరిన సవాల్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వివాదంపై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ స్పందించడంతో ఈ అంశం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ ఏడాది ఆగస్టు 22న పూణేలో జరిగిన ‘ఛత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ‘పితృస్వామ్యాన్ని అంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.

రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శిస్తూ.. నిజంగానే మీకు పితృస్వామ్యాన్ని అంతం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, ముందుగా మీరు ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని పాడి చూపించాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.

హృతిక్ రోషన్ సెటైరికల్ రియాక్షన్ 
అయితే, స్త్రీవాదానికి,పురుషాధిక్యత వ్యతిరేకతకు సంబంధించిన ‘స్మాష్ ది పాట్రియార్కీ’ అంశాన్ని, జాతీయవాదానికి ప్రతీక అయిన ‘వందేమాతరం’ అంశంతో బన్సూరీ స్వరాజ్ ముడిపెట్టడంపై అప్పట్లో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్స్ జాతీయ కన్వీనర్ రుచిరా చతుర్వేది.. బన్సూరీ స్వరాజ్ మాట్లాడిన ఆ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. తాజాగా ఆ వీడియోపై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ స్పందిస్తూ..‘ఏంటి? ఇది నిజమేనా.. వావ్!’ అంటూ రిప్లయ్ ఇచ్చారు.

హృతిక్ రోషన్ ఈ విధంగా స్పందించడంతో ఈ పాత టాపిక్ ఒక్కసారిగా మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఫెమినిజానికి, నేషనలిజానికి సంబంధం ఏమిటని కొందరు ప్రశ్నిస్తుండగా, ఈ విచిత్రమైన రాజకీయ వాదనలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇదీ చదవండి : సభలో సుష్మాను గుర్తు చేసిన బన్సూరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement