సాక్షి, కృష్ణా జిల్లా: అధికారం పోగానే కొందరు తెల్లారికే కండువా మార్చేసి దర్జాగా తిరిగేస్తున్నారని.. కానీ కార్యకర్తలే పార్టీకి, మాకు అండగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ పేర్ని కిట్టు అన్నారు. నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటిపై టీడీపీ జెండా ఉన్నా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పథకాలు అందించాం. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా కూటమి సర్కార్ నెరవేర్చిందా? అంటూ ప్రశ్నించారు.
‘‘కొల్లు రవీంద్రకు ఇదే నా ఛాలెంజ్. గతంలో టీడీపీ తరపున మేయర్ క్యాండెట్ కోసం నువ్వెంత తీసుకున్నావు? నేను చెప్పింది అబద్ధమైతే బందరుకోటలో కట్టిన గుడిలో ప్రమాణం చేద్దాం. కొల్లు రవీంద్ర దయచేసి మాతో నిన్ను పోల్చుకోకు. సీట్లు అమ్ముకునే నీకు, పార్టీ శ్రేణులను కుటుంబసభ్యులు అనుకునే మాకు చాలా తేడా ఉంది.
..బయట ఒకలా.. లోపల ఒకలా బతికే నువ్వు కూడా మాకు నీతులు చెబితే ఎలా?. పోర్టు పేరుతో 33 వేల ఎకరాలు తీసుకుని జనాన్ని మింగేయాలనుకుంది మీరు.. కేవలం 1700 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైఎస్ జగన్ పోర్టు కట్టి చూపించారు’’ అని పేర్ని కిట్టు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కూటమికి బిగ్ షాక్.. బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు


