IND vs WI: భారత తుదిజట్టులో ఊహించని మార్పులు! | IND vs WI 2nd ODI: Dinesh Karthik suggests 2 key changes in IND playing XI | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరిని తప్పించండి.. భారత తుదిజట్టులో ఊహించని మార్పులు!

Sep 30 2026 11:47 AM | Updated on Sep 30 2026 11:59 AM

IND vs WI 2nd ODI: Dinesh Karthik suggests 2 key changes in IND playing XI

భారత జట్టు (PC: BCCI X)

టీమిండియా సిరీస్‌ విజయంపై కన్నేసింది. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన శుబ్‌మన్‌ గిల్‌ సేన..‍ బుధవారం నాటి రెండో మ్యాచ్‌లోనూ గెలిచి గువాహటిలోనే  పనిపూర్తి చేయాలని పట్టుదలగా ఉంది.

ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ (డీకే) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పేస్‌ విభాగంలో రెండు మార్పులు చేసి.. బెంచ్‌ బలాన్ని పరీక్షించాలని యాజమాన్యానికి సూచించాడు. కాగా తిరువనంతపురం వేదికగా విండీస్‌తో తొలి వన్డేలో భారత్‌ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది.

ఆ ఇద్దరు తుదిజట్టులో
సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను పక్కనపెట్టి.. ప్రసిద్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌లను ఆడించింది. ప్రసిద్‌ 10 ఓవర్ల కోటాలో 60 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. బ్రార్‌ ప్రసిద్‌ మాదిరే కోటా పూర్తి చేసి 60 పరుగులు ఇచ్చి వికెట్‌ మాత్రం తీయలేకపోయాడు. ఇక సిరాజ్‌తో పాటు జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ఈ ఇద్దరిని ఆడిస్తే బెటర్‌
ఈ నేపథ్యంలో డీకే మాట్లాడుతూ.. ‘‘ప్రసిద్‌ కృష్ణ లేదంటే గుర్నూర్‌ బ్రార్‌కు బదులు సిరాజ్‌ను తీసుకువస్తారని అనుకుంటున్నా. లేదంటే ఈ ఇద్దరినీ తొలగించి.. సిరాజ్‌తో పాటు నబీని ఆడిస్తే ఇంకా బాగుంటుంది.

ఈ సిరీస్‌ ద్వారా బెంచ్‌ బలాన్ని పరీక్షిస్తే.. వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి ముందు మనకు కావాల్సిన అత్యుత్తమ కూర్పు ఏదో తెలిసిపోతుంది. వారి బౌలింగ్‌ ప్రమాణాలు, స్థాయి ఎలా ఉందో తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. సిరాజ్‌ లేదంటే నబీ.. ఇద్దరిలో ఎవరో ఒకరినైనా కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు.

కాగా ప్రసిద్‌ కృష్ణ ఈ ఏడాది ఇప్పటికి ఎనిమిది వన్డేలు ఆడి 15 వికెట్లతో టాప్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు.. సిరాజ్‌ చివరగా జనవరిలో వన్డే ఆడాడు. ఇక రంజీ హీరో ఆకిబ్‌ నబీ ఇంత వరకు అరంగేట్రం చేయనేలేదు.

వెస్టిండీస్‌తో రెండో వన్డేకు దినేశ్‌ కార్తిక్‌ ఎంచుకున్న భారత తుదిజట్టు
రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, రుతురాజ్‌ గైక్వాడ్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), నమన్‌ ధిర్‌, రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఆకిబ్‌ నబీ.

చదవండి: కోహ్లి కచ్చితంగా పశ్చాత్తాప పడతాడు: టీమిండియా దిగ్గజ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement