source: X
ఏషియన్ గేమ్స్ 2026లో ఇవాళ భారత ఆర్చర్లు చెలరేగిపోతున్నారు. ఉదయం మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత్, కొద్దిసేపటికే కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ కూడా పసిడి పతకం గెలిచింది. ఫైనల్లో భారత్ దక్షిణ కొరియాను ఓడించింది. ఈ విజయంతో భారత్ 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది.
మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పసిడి సాధించిన భారత జట్టులో చికితా తానిపర్తి, సాహిల్ కీలకంగా రాణించారు. చికితా మన తెలుగు అమ్మాయే. ఈమె స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా. చికితా ఇవాళే స్వర్ణం గెలిచిన మహిళల టీమ్ కాంపౌండ్ జట్టులోనూ సభ్యురాలు. ఆ ఈవెంట్‌లో చికితా.. ప్రితిక ప్రదీప్ (మహారాష్ట్ర), జ్యోతి సురేఖ వెన్నం (విజయవాడ)తో కలిసి స్వర్ణం సాధించింది.
ఆ ఈవెంట్ ఫైనల్లో భారత్ చైనాను 238-234తో ఓడించి, వరుసగా రెండోసారి ఆసియా గేమ్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది.
మరోవైపు మహిళల టీమ్ స్క్వాష్‌లో తన్వి ఖన్నా, అనాహత్ సింగ్ సింగపూర్‌పై 2-0 విజయం సాధించి భారత్‌కు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేశారు.
ఇప్పటివరకు 8 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్యాలు (మొత్తం 54) సాధించిన భారత్ పతకాల పట్టికలో టాప్-10లోకి (9వ స్థానం) దూసుకొచ్చింది.
ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం


