breaking news
Mohammed Siraj
-
ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు ఆసీస్‌తో టెస్టు మ్యాచ్! సిరాజ్ ఎమన్నాడంటే?
మహ్మద్ సిరాజ్.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో లండన్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ వేసిన స్పెల్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఓటమి ఖాయమైన చోట సిరాజ్ మియా తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేశాడు. అయితే గల్లీ క్రికెటర్ నుంచి టీమిండియా ముఖచిత్రంగా మారిన సిరాజ్ తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అందులో ఒకటి అతడి తండ్రి మరణం.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21(ఆస్ట్రేలియా)లో సిరాజ్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అయితే టెస్టుల్లో డెబ్యూ చేసిన కొన్ని రోజులకే అతడి జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊపిరితిత్తల వ్యాధితో బాధపడుతున్న సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ కన్నముశారు.కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. కఠినమైన బయో-బబుల్ నియమం అమలులో ఉండడంతో కనీసం అతడిని ఓదార్చేందుకు సహచరులు సైతం పక్కన లేకపోయారు. అయితే అతడి తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది.కానీ సిరాజ్ మియా మాత్రం తన తండ్రి మరణాన్ని దిగమింగి జాతీయ విధే ముఖ్యమని ఆస్ట్రేలియానే ఉండిపోయాడు. తాజాగా ఇదే విషయంపై అప్పటి భారత బౌలింగ్ కోచ్ అరుణ్ భరత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు."మేము 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాము. మూడో టెస్టుకు ముందు సిరాజ్ తండ్రి మరణించారన్న వార్త మాకు తెలిసింది. అయితే ఆ సమయంలో కఠినమైన బయో-బబుల్ నియమం అమలులోన్నందన అతడిని మేమెవరూ కలవలేకపోయాము. మాకు అదొక ఫైవ్ స్టార్ జైలులా ఉండేది. కానీ మా మేనేజర్‌కు ప్రత్యేక అనుమతి లభించడంతో సిరాజ్‌ను కలవడానికి వెళ్లాడు. అయితే సిరాజ్‌తో నేను వీడియో కాల్ మాట్లాడాను. నువ్వు తిరిగి వెళ్ళాలనుకుంటున్నావా? అని మేము అతడిని అడిగాము. కానీ సిరాజ్ మాత్రం తాను టెస్టులు ఆడటం తన తండ్రి కలని, నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడు. అతడి మాటలు విని ఆశ్చర్యపోయాను. ఏదేమైనప్పటికి అంతటి బాధలో అతడిని ఓదార్చేందుకు మేమెవరం పక్కన లేకపోయామని" బాంబే స్పోర్ట్స్ ఎక్స్ఛేంజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ పేర్కొన్నాడు. కాగా ఆ సిరీస్‌లో సిరాజ్ మూడు మ్యాచ్‌లు 13 వికెట్లు పడగొట్టాడు.చదవండి: The Hundred: టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ..! ఎవరీ డేవినా పెర్రిన్? -
ఒక్క సిక్స్‌తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఫిట్నెస్ సమస్యల వల్ల ఈ టూర్లో కేవలం మూడు టెస్టులే ఆడగా.. అతడి గైర్హాజరీలో ఈ హైదరాబాదీ బౌలర్ పేస్ దళాన్ని ముందుండి నడిపించాడు.సిరీస్ మొత్తానికే హైలైట్అలుపున్నదే ఎరుగక ఐదు టెస్టుల్లోనూ అవిరామంగా ఆడి.. ఈ సిరీస్‌లో వెయ్యికి పైగా బంతులు బౌల్ చేశాడు సిరాజ్. మొత్తంగా ఐదు టెస్టుల్లో కలిపి 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. ఇక ఆఖరిదైన ఐదో టెస్టులో చివరి రోజు సిరాజ్ ఆట సిరీస్ మొత్తానికే హైలైట్‌గా నిలిచిందని చెప్పవచ్చు.ముఖ్యంగా.. తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ గెలుపునకు ఏడు పరుగుల దూరంలో ఉన్న వేళ సిరాజ్.. ఆఖరి వికెట్ కూల్చి భారత్‌ను విజయతీరాలకు చేర్చిన తీరు చిరకాలం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. అయితే, నరాలుతెగే ఉత్కంఠ నెలకొన్న ఆ తరుణంలో తాను ఎలాంటి వ్యూహాన్ని అమలు చేశానో సిరాజ్ తాజాగా వెల్లడించాడు.సింగిల్స్‌తో మేనేజ్ చేసిన అట్కిన్సన్ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయిన తర్వాత గస్ అట్కిన్సన్కు క్రిస్ వోక్స్ తోడయ్యాడు. భుజం విరిగినప్పటికీ జట్టు కోసం వోక్స్ అప్పుడు క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో సింగిల్స్‌తో మేనేజ్ చేసిన అట్కిన్సన్.. ఓవర్లో ఆఖరి బంతికి కూడా సింగిల్తీసి స్ట్రైక్ తనే అట్టిపెట్టుకుంటూ వోక్స్‌కు ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు.ఈ క్రమంలో సిరాజ్.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి రనౌట్‌కు ప్లాన్ చేయగా.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కారణంగా అది మిస్సయింది. ఆ తర్వాత సిరాజ్ తన వ్యూహం మార్చేసి అద్భుత డెలివరితో అట్కిన్సన్ను బౌల్డ్ చేయడంతో టీమిండియా విజయం ఖరారైంది.ఒక్క సిక్స్‌తో అంతా తలకిందులయ్యేదితాజాగా ఇందుకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సిరాజ్.. ‘‘ఒక ఓవర్లో నేను యార్కర్ వేశాను. అలాంటి సందర్భంలో మరుసటి బంతి లెంగ్త్ బాల్‌గా సంధిస్తారని బ్యాటర్ అనుకుంటాడు. అంతేకాదు.. అంతకుముందు నేను వేసిన లెంగ్త్ బాల్‌ను అతడు సిక్సర్‌గా మలిచాడు.నేను బౌలింగ్ చేసేందుకు పరుగు మొదలుపెట్టినపుడు నా బౌలింగ్ శైలి ఎలా ఉండాలో నిర్ణయించుకుంటా. విజయానికి ఆరు పరుగులు.. వాళ్లు ఒక్క సిక్సర్ కొట్టినా మ్యాచ్ మా నుంచి చేజారిపోతుంది.అందుకే నేను బ్యాటర్‌ను తికమకపెట్టి బౌల్డ్ చేయడం ద్వారా ఫలితాన్ని మార్చివేయగలిగాను. నేను ఎలా బౌలింగ్ చేయాలనుకున్నానో దానిని పక్కాగా అమలు చేసి సఫలమయ్యాను. నిజంగా అదో అద్భుత అనుభవం.ఐదు రోజుల పాటు ఆసక్తిగా సాగిన టెస్టు మ్యాచ్‌లో ఆఖరి రోజు చివర్లో గెలవడం సూపర్‌గా అనిపించింది. నా మనసు ఎంతో ప్రశాంతంగా మారిపోయింది’’ అని పేర్కొన్నాడు. తనకు ఈ మ్యాచ్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని సిరాజ్ రెవ్‌స్పోర్ట్స్‌తో చెప్పుకొచ్చాడు.2-2తో సమంగాకాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ-2025లో భాగంగా జూన్ 20- ఆగష్టు 4 వరకు ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఐదు టెస్టులు జరిగాయి. లీడ్స్‌లో ఇంగ్లండ్.. బర్మింగ్‌హామ్‌లో భారత్ గెలవగా.. లార్డ్స్‌లో మరోసారి ఆతిథ్య జట్టుదే పైచేయి అయింది. ఈ క్రమంలో మాంచెస్టర్ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. ఓవల్‌లో విజయం సాధించి 2-2తో సమం చేసింది.చదవండి: Sachin Tendulkar: ‘అతడొక గొప్ప టెస్టు ప్లేయర్.. చూడగానే కెప్టెన్ అవుతాడని చెప్పాను’ -
‘సిరాజ్‌ను ఆగమని నేనెలా చెప్తా.. గెలిస్తే చాలు దేవుడా అనుకున్నా’
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు మంచి ఆరంభమే లభించింది. అతడి సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-2తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య జరిగిన ఈ ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో గిల్ 754 పరుగులు సాధించి.. టాప్ రన్ స్కోరర్‌గానూ నిలిచాడు.సిరాజ్.. సూపర్హిట్ఇక టీమిండియా ఇంగ్లండ్‌తో సిరీస్‌ను సమం చేసుకోవడంలో పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)ది కీలక పాత్ర. ముఖ్యంగా ఆఖరిదైన ఓవల్ టెస్టులో చివరి రోజు ఈ హైదరాబాదీ బౌలర్ అద్భుతమే చేశాడు. విజయానికి ఇంగ్లండ్ 35 పరుగులు.. భారత్ నాలుగు వికెట్ల దూరంలో ఉన్న వేళ.. ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) ఒక వికెట్ తీయగా... సిరాజ్ మూడు వికెట్లు కూల్చి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.అయితే, ఐదో టెస్టు ఆఖరి రోజు ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోగానే.. భుజం విరిగినప్పటికీ టెయిలెండర్ క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు.అప్పటికి క్రీజులో ఉన్న అట్కిన్సన్ వోక్స్‌కు ఇబ్బంది కలగకుండా తానే సింగిల్స్ తీస్తూ.. ఓవర్ ముగిసే సరికి తానే క్రీజులోకి వచ్చేలా చూసుకున్నాడు.రనౌట్ ప్లాన్ఈ క్రమంలో కెప్టెన్ గిల్‌తో కలిసి సిరాజ్ ఈ జోడీని రనౌట్ చేయాలని ప్రణాళిక రచించారు. ఇందుకు అనుగుణంగా నాటి మ్యాచ్ 84 ఓవర్లో వైడ్ యార్కర్ వేయాలని వీరు ప్లాన్ చేశారు. ఇక సిరాజ్ సంధించిన డెలివరీని మిస్సయినప్పటికీ.. అట్కిన్సన్ సింగిల్ తీసేందుకు వెళ్లాడు. అయితే, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మాత్రం సరైన సమయంలో బంతిని అందుకోలేకపోయాడు.దీంతో రనౌట్ ఛాన్స్ మిస్ కాగా.. గిల్‌పై సిరాజ్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. జురెల్‌కు ముందే మన ప్లాన్ చెప్పి ఉండవచ్చు కదా అని అన్నాడు. విజయానంతరం గిల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఇక ధ్రువ్ జురెల్ కూడా తాజా ఈ విషయంపై స్పందించాడు.సిరాజ్‌ను ఆగమని నేనెలా చెప్తా‘‘ఆరోజు అంతా త్వరత్వరగా జరిగిపోయింది. మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బాల్ బాగా స్వింగ్ అవుతోంది. అప్పుడు నా కుడివైపు.. గిల్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ‘యార్.. సిరాజ్ ఇప్పుడు వైడ్ యార్కర్ వేయబోతున్నాడు’ అని నాతో చెప్పాడు.అయితే, నేను బదులిచ్చేలోపే సిరాజ్ బౌలింగ్ వేసేందుకు తన పరుగు మొదలుపెట్టాడు. అప్పుడు.. ‘నువ్వు కాస్త ఆగు’ అని సిరాజ్‌కు చెప్పడం సరికాదనిపించింది. నేను కుదురుకునేలోపే సిరాజ్ బంతి వేయడం.. బ్యాటర్లు పరుగుకు వెళ్లడం జరిగిపోయింది.గెలిస్తే చాలు దేవుడా అనుకున్నానిజానికి అది రనౌట్ కావాల్సింది. కానీ.. నా చేతుల్లో గ్రిప్ అంతగా లేదు. సరైన సమయంలో స్పందించలేకపోయాను. అప్పుడు ఒకటే అనుకున్నా.. ‘దేవుడా.. ఎలాగైనా మమ్మల్ని ఈ మ్యాచ్‌లో గెలిపించు’’ అని ప్రార్థించా.ఆరోజు రనౌట్ చేసేందుకు నాకు మంచి అవకాశం ఉంది. కానీ నేను మిస్సయిపోయా. ఏదేమైనా సిరాజ్ ఆరోజు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మేము కచ్చితంగా మ్యాచ్ గెలుస్తామని అనుకున్నాం. అనుకున్నదే జరిగింది’’ అని ధ్రువ్ జురెల్ పేర్కొన్నాడు. వివేక్ సేతియా పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదికాగా రనౌట్ ప్రమాదం నుంచి అట్కిన్సన్- వోక్స్ తప్పించుకునే సమయానికి ఇంగ్లండ్ విజయానికి కేవలం ఎనిమిది పరుగుల దూరంలో ఉంది. ఒకవేళ జురెల్ రనౌట్ మిస్ చేసిన తర్వాత.. సిరాజ్ అట్కిన్సన్ను బౌల్డ్ చేయకపోయి ఉంటే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. ఎట్టకేలకు ఆఖరికి ఆరు పరుగుల తేడాతో ఓవల్‌లో గెలిచి 2-2తో సిరీస్‌ను సమం చేయగలిగింది.చదవండి: ఛతేశ్వర్ పుజారా నెట్‌వర్త్ ఎంతో తెలుసా? -
జోహార్ఫా రెస్టారెంట్లో సందడి చేసిన మహ్మద్ సిరాజ్(ఫోటోలు)
-
'సిరాజ్‌ను అందుకే వద్దనుకున్నాం'
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా నిలిచి 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. ఇండియన్ ప్రీమియల్ లీగ్ మెగా వేలం నుంచే ఆర్సీబీ ఆచితూచి అడుగులు వేసింది. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లను వేలంలో దక్కించుకుంది. అదే సమయంలో గ్లెన్ మాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్‌లను వదులుకుంది. ఏడేళ్ల పాటు తమ జట్టులో ఉన్న సిరాజ్‌ను ఎందుకు వదులుకోవాల్సిందో ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ తాజాగా వెల్లడించారు.'భారత అంతర్జాతీయ బౌలర్లను దక్కించుకోవడం అంత సులభం కాదు. సిరాజ్‌ను జట్టులో ఉంచుకోవాలా, విడుదల చేయాలా లేదా రైట్ టు మ్యాచ్ ఉపయోగించాలా అని ఆలోచించాం. దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని మేము అతనితో చర్చించాం. అయితే అది నేరుగా కాదు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయగల భువీని జట్టులోకి తీసుకోవాలని గట్టిగా ప్రయత్నించాం. దీంతో సిరాజ్‌ను కొనసాగించడం కుదరదని అర్థమైంది. ఇదొక్కటే కాదు, ఇతర అంశాలు కూడా ఉన్నాయి. సిరాజ్ గురించే ఎక్కువగా చర్చించామ'ని క్రిక్‌బజ్‌తో మో బోబాట్ చెప్పారు. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను గాయం కారణంగా మాత్రమే నిలుపుకోలేదని వెల్లడించారు. అతడు ఫిట్‌గా ఉంటే తమతో పాటు కొనసాగించేవాళ్లమని తెలిపారు.సిరాజ్‌కు రూ.12.25 కోట్లుఐపీఎల్లో మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఆర్సీబీ తరపున 102 మ్యాచ్‌లు ఆడి 99 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో హాజిల్‌వుడ్‌ను రూ.12.50 కోట్లకు, భువనేశ్వర్‌ను రూ.10.75 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. రూ.12.25 కోట్లకు సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్‌కు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో గుజరాత్ తరఫున సిరాజ్ 15 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ తరపున 14 మ్యాచ్‌ల్లో భువనేశ్వర్ 17 వికెట్లు తీశాడు. హాజిల్‌వుడ్ 12 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 25 వికెట్లతో టాప్‌లో నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్న సంగతి తెలిసిందే.సిరాజ్‌పై ప్రశంసలుమరోవైపు ఇటీవల ఇంగ్లండ్‌లో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించి సిరాజ్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ ప్రదర్శన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను టీమిండియా సమం చేయడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించడంతో అతడి పేరు మీడియాలో మార్మోగిపోయింది. -
‘చెత్త సెలక్షన్.. అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసు’
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. శుబ్‌మన్ గిల్ (Shubman Gill) వైస్ కెప్టెన్సీ, శ్రేయస్ అయ్యర్‌కు మొండిచేయి చూపడం గురించి ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.అదే విధంగా.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్‌లను కేవలం స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేయడం.. పేసర్ల విభాగంలో హర్షిత్ రాణాకు చోటు దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.ఐపీఎల్-2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లను సెలక్టర్లు పక్కకు పెట్టడాన్ని బద్రీనాథ్ తప్పుబట్టాడు. గంభీర్ ఆశీసులు ఉండటం వల్లే హర్షిత్‌కు స్థానం దక్కిందని పరోక్షంగా కామెంట్లు చేశాడు.అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసుఈ మేరకు.. ‘‘హర్షిత్ రాణా అంటే ఎవరికీ బాగా ఇష్టమో అందరికీ తెలుసు. అందుకే అతడికి వరుస అవకాశాలు వస్తునఆయి. ఐపీఎల్లో చెత్తగా ఆడినా అతడికి చోటిచ్చారు. ప్రసిద్ కృష్ణ ఐపీఎల్లో, ఇంగ్లండ్ సిరీస్‌లో అదరగొట్టినా ప్రధాన జట్టులో అతడికి స్థానమే లేదు.రాణా ఈ జట్టులోకి ఎలా వచ్చాడో నేను అర్థం చేసుకోగలను. కచ్చితంగా ఇదొక చెత్త సెలక్షన్. సిరాజ్, ప్రసిద్లు ఏం తప్పు చేశారు?మహ్మద్ సిరాజ్ వంటి గొప్ప బౌలర్‌ను కూడా పక్కనపెట్టాడు. ఒకవేళ వర్క్‌లోడ్ కారణంగా సిరాజ్‌కు విశ్రాంతినిచ్చారని అనుకుంటే.. ప్రసిద్ కృష్ణ ఉన్నాడు కదా! అయినా సరే హర్షిత్ రాణాకే పెద్దపీట వేశారు’’ అని బద్రీనాథ్ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైకి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.గంభీర్ ప్రోత్సాహంకాగా కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా ఉన్న సమయంలో ఆ జట్టులో ఉన్న హర్షిత్ రాణాను గంభీర్ ప్రోత్సహించాడు. గంభీర్ మార్గనిర్దేశనంలో రాణించిన ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్.. గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్ అయిన తర్వాత ఏకంగా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్టు, వన్డే, టీ20లలో అరంగేట్రం చేశాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్లో హర్షిత్ కేవలం పదిహేను వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన కర్ణాటక పేసర్ ప్రసిద్... 25 వికెట్లతో చెలరేగి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియాసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: టీమిండియా వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్? -
Asia Cup 2025: సిరాజ్‌ను కాదని హర్షిత్ రాణా ఎంపిక.. ఫ్యాన్స్ ఆగ్రహం
ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా సూర్యకుమార్ ఎంపికను అందరూ స్వాగతిస్తున్నప్పటికీ.. గిల్‌కు వైస్ కెప్టెన్సీ కట్టబెట్టడాన్ని మాత్రం కొందరు వ్యతిరేకిస్తున్నారు. గిల్ కోసం యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాడిని తప్పించడాన్ని తప్పుబడుతున్నారు. అలాగే శ్రేయర్ అయ్యర్‌కు జరిగిన అన్యాయాన్ని కూడా నిలదీస్తున్నారు.సిరాజ్‌ను కాదని రాణా ఎంపిక.. ఫ్యాన్స్ ఆగ్రహంఆసియా కప్ జట్టు ఎంపికలో జైస్వాల్, శ్రేయస్‌తో పాటు మరో అర్హుడైన ఆటగాడికి కూడా అన్యాయం జరిగింది. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతూ, టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న పేస్ గన్ మొహమ్మద్ సిరాజ్‌ను కూడా ఆసియా కప్‌కు ఎంపిక చేయలేదు.సిరాజ్‌ను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఈ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక పాత్రధారి అని ఆరోపిస్తున్నారు. అతడి ప్రోద్బలం వల్లే సిరాజ్‌ను కాదని హర్షిత్‌ను ఎంపిక చేసుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సిరాజ్ ఎంత విలువైన బౌలరో ఇటీవల ప్రపంచం మొత్తం చూసిందని గుర్తు చేస్తున్నారు. ఇంగ్లండ్‌లో సిరాజ్ చేసిన మ్యాజిక్‌ను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఒత్తిడి సమయాల్లో హర్షిత్‌తో పోలిస్తే సిరాజ్ అనుభవం చాలా పనికొస్తుందని అని అంటున్నారు. సిరాజ్‌ను కాదని హర్షిత్‌ను ఎంపిక చేయడం బుద్దిలేని చర్యగా అభివర్ణిస్తున్నారు.కాగా, తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. అయినా సిరాజ్ ఆసియా కప్ జట్టులో స్థానం నోచుకోలేదు. సిరాజ్‌ను కాదని భారత సెలెక్టర్లు హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చారు.సిరాజ్‌కు టీ20 ఫార్మాట్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నా సెలెక్టర్లు ఎందుకు పక్కకు పెట్టారో తెలియడం లేదు. సిరాజ్ తాజా ఐపీఎల్ సీజన్లోనూ గుజరాత్ తరఫున మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. హర్షిత్‌తో పోలిస్తే సిరాజ్ అన్ని విషయాల్లో చాలా మెరుగ్గా ఉన్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటం చేత హర్షిత్‌కు ఆసియా కప్ బెర్త్ దక్కిందని ప్రచారం జరుగుతుంది. గంభీర్ ఐపీఎల్లో కేకేఆర్ మెంటార్‌గా ఉన్నప్పుడు హర్షిత్ ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సాన్నిహిత్యం కారణంగానే గంభీర్ హెడ్ కోచ్ కాగానే హర్షిత్‌కు టీమిండియా బెర్త్ దక్కింది.ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్స్టాండ్ బై ప్లేయర్లు: ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ -
ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను: ఇంగ్లండ్ స్పిన్నర్
ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ వేసిన బంతి భారత ఆటగాడు సిరాజ్ బ్యాట్‌ను తాకి కింద పడిన బంతి అనూహ్యంగా అతని వెనుక వైపునకు వెళ్లి స్టంప్స్‌కు తగిలింది. అంతే...చివరి వికెట్ తీసిన ఇంగ్లండ్ లార్డ్స్ మైదానంలో 22 పరుగులతో అద్భుత విజయాన్ని అందుకుంది. అప్పటికే 29 బంతులు ఆడి జడేజాకు సహకరించిన సిరాజ్ తీవ్ర నిరాశలో మునిగిపోగా, బౌలర్ బషీర్ సంబరాలు చేసుకున్న ఈ దృశ్యం అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ మ్యాచ్‌లో ఎడమ చేతికి గాయమైన బషీర్ రెండో ఇన్నింగ్స్‌లో 35 బంతులు మాత్రమే వేసి ఈ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ ఘటనను బషీర్ చాలా సంతోషంగా గుర్తు చేసుకున్నాడు. ఆ అనుభూతి తాను ఎప్పటికీ మర్చిపోలేనని అతను వ్యాఖ్యానించాడు. ‘మేం పట్టుదలగా ప్రయత్నిస్తున్నా వికెట్ మాత్రం దక్కడం లేదు. బయట కూర్చున్న నేను ఎలాగైనా మైదానంలోకి దిగాలని పదే పదే కోరుకున్నాను. నాపై నమ్మకంతో స్టోక్స్ అవకాశం ఇచ్చాడు. నేను మ్యాచ్ ఫలితాన్ని మార్చగలగడం సంతోషాన్నిచ్చింది.సిల్లీ పాయింట్లో రూట్‌ను పెట్టి సిరాజ్‌పై ఒత్తిడి పెంచుతూ ప్రతీ బంతి భిన్నంగా వేసేందుకు ప్రయతి్నంచాం. సిరాజ్ ఆ బంతిని ఆడాక అసలేం అర్థం కాలేదు. అందరూ ఎటు పోయింది అని చూస్తున్నారు. నాకైతే అస్సలు కనిపించలేదు. మావాళ్ల స్పందన చూసిన తర్వాతే నేనూ స్పందించాను.ఆ క్షణం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లార్డ్స్లాంటి ప్రత్యేక మైదానంలో స్టేడియం నిండుగా ఉన్న అభిమానుల మధ్య లభించిన ఆ ఆనందానికి మించి ఇంకేం ఉంటుంది’ అని బషీర్ భావోద్వేగం ప్రదర్శించాడు. ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఇచ్చిన సూచనలతోనే తన ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఎంతో మెరుగైందని బషీర్ అన్నాడు. తనకు అలీ ఎంతో సహకరించాడని బషీర్ చెప్పాడు.‘తొలి టెస్టు సమయంలోనే మొయిన్ అలీని కలిశాను. క్యారమ్ బాల్ వేయమని అతను ప్రోత్సహించాడు. దాంతో ప్రాక్టీస్‌తో మెరుగుపర్చుకున్నా. ఇంగ్లండ్‌లో ఒక ఆఫ్‌స్పిన్నర్ రాణించడం అంత సులువు కాదు. అలీ నన్ను సరిగ్గా మార్గనిర్దేశనం చేశాడు. ఇంగ్లండ్ శిబిరానికి ఆయన వచ్చిన తర్వాత నా మీద నాకు నమ్మకం పెరిగింది’ అని బషీర్ వెల్లడించాడు.లార్డ్స్ మ్యాచ్ తర్వాత గాయంతో బషీర్ చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. భారత్‌తో సిరీస్ చాలా అద్భుతంగా సాగిందని, పలువురు గొప్ప ఆటగాళ్లకు ప్రత్యరి్థగా తలపడి తాను ఎంతో నేర్చుకున్నానన్న ఈ ఇంగ్లండ్ స్పిన్నర్...తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. -
ధోని కాదు!.. ‘ప్రపంచంలో బెస్ట్ వికెట్ కీపర్ అతడే’
టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్‌గా భారత మాజీ ఆటగాడి పేరు చెప్పాడు. అయితే, అభిమానులు ఊహిస్తున్నట్లు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)పేరు మాత్రం కాదు.స్టంప్డ్భారత మాజీ క్రికెటర్ సయ్యద్ కీర్మాణి (Syed Kirmani) ‘స్టంప్డ్: లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ట్వంటీ-టూ యార్డ్స్’ పేరిట తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని తీసుకువచ్చాడు. హైదరాబాద్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించగా.. భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్ సహా టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ తదితరులు హాజరయ్యారు.ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ అతడేఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ సయ్యద్ కీర్మాణి. అలాంటి వికెట్ కీపర్ మరొకరు ఇంకా పుట్టనేలేదు. ముఖ్యంగా నలుగురు స్పిన్నర్లు ఉన్న జట్టులో వికెట్ కీపర్‌గా ఉండటం అంటే మాటలు కాదు.1983 వన్డే వరల్డ్‌కప్‌లోనూ అతడు ఎన్నో అత్యుత్తమ క్యాచ్‌లు అందుకున్నాడు. జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 పరుగులు చేసిన మ్యాచ్‌లోనూ.. కీర్మాణి 24 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో ఆ పరుగులు కూడా ఎంతో కీలకం.ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఆ దేవుడు ఆయనకు దీర్ఘకాల ఆయుష్షును ప్రసాదించాలి. పాఠకుల నుంచి ఈ పుస్తకానికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నా. తన ఆటోబయోగ్రఫీ పుస్తకం విజయవంతమైన బుక్స్లిస్టులో చేరాలి’’ అని ఆకాంక్షించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన సారథికాగా ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్‌గా మహేంద్ర సింగ్ ధోని పేరొందాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ దిగ్గజ సారథి.. ఆటగాడిగానూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, అజారుద్దీన్ మాత్రం బెస్ట్ వికెట్ కీపర్‌గా సయ్యద్ కీర్మాణి పేరు చెప్పడం విశేషం. ఆయన తర్వాత కూడా అంతటి గొప్ప వికెట్ కీపర్ మరెవరూ జన్మించలేదనడం గమనార్హం. కాగా 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సయ్యద్ కీర్మాణి సభ్యుడు.చదవండి: ‘అంబానీని అగార్కర్ ఒప్పించాల్సింది.. నేనైతే అలాగే చేస్తా’ -
ఆ నటితో సచిన్ టెండుల్కర్ ప్రేమ?!.. అంజలి కంటే ముందు..
క్రికెట్- బాలీవుడ్ మధ్య విడదీయలేని అనుబంధం ఉందని చెప్పవచ్చు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- షర్మిలా ఠాగోర్ నుంచి విరాట్ కోహ్లి (Virat Kohli- Anushka Sharma)- అనుష్క శర్మ, కేఎల్ రాహుల్- అతియా శెట్టి వరకు చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అందుకే ఈ రెండు రంగాలకు చెందిన ఆడ- మగ కలిసి కనిపించారంటే ‘రిలేషన్షిప్’ గురించి వదంతులు పుట్టుకురావడం సహజమే. అయితే, క్రికెట్ దేవుడుగా పేరొందిన సచిన్ టెండుల్కర్ (Sachin Tendukar) గురించి 90వ దశకంలో ఇలాంటి ఓ రూమర్ వచ్చింది. నటి శిల్పా శిరోద్కర్‌తో కలిపి సచిన్ పేరు వినిపించింది. వీరిద్దరు ప్రేమలో పడ్డారని ఆ వదంతుల సారాంశం.శిల్పా శిరోద్కర్‌తో అఫైర్?అయితే, ఇందుకు సచిన్ టెండుల్కర్- శిల్పా శిరోద్కర్ స్పందించిన తీరు మాత్రం భిన్నంగా ఉండటం గమనార్హం. గతంలో సచిన్ టెండుల్కర్ ఇండియా టుడేతో మాట్లాడుతుండగా ఈ విషయం గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాకూ- శిల్పా శిరోద్కర్‌తో అఫైర్?అన్నింటికంటే అత్యంత చెత్త రూమర్ ఇది.ఎందుకంటే మేమిద్దరం అసలు ఒకరికి ఒకరం పరిచయమే లేదు’’ అని కొట్టిపారేశాడు. మరోవైపు.. శిల్పా శిరోద్కర్ మాత్రం.. ‘‘నేను హమ్ సినిమా చేస్తున్న సమయంలో.. అంటే 1991లో తొలిసారి సచిన్‌ను కలిశాను. మా కజిన్ బాంద్రా ఈస్ట్‌కు ఆడేవాడు.ఒక్కసారి సచిన్‌ను కలిశానుఅదే జట్టు తరఫున సచిన్ కూడా ఆడేవాడు. అలా తన ద్వారా సచిన్ కలిసే అవకాశం వచ్చింది. అప్పటికే సచిన్ అంజలితో ప్రేమలో ఉన్నాడు. అయితే, అప్పటికి ఇంకా ఈ విషయం గురించి బయటకు రాలేదు.మేమే స్నేహితులం కాబట్టి మాకు ముందే ఈ విషయం తెలుసు. ఏదేమైనా ఓ నటి- క్రికెటర్‌ను కలిసింది అంటే.. అది కూడా సచిన్ టెండుల్కర్‌ను కలిసింది అంటే ఇలాంటి వార్తలు పుట్టుకురావడం సహజమే కదా!.. ఏదేమైనా ఒక్కసారి సచిన్‌ను నేను నేరుగా కలిశానని మాత్రం ఒప్పుకొంటా’’ అని పేర్కొంది.అంజలితో పెళ్లికాగా తన కంటే ఐదేళ్లు పెద్దదైన డాక్టర్ అంజలిని ప్రేమించిన సచిన్ టెండుల్కర్ 1995లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమార్తె సారా, కుమారుడు అర్జున్ సంతానం. ముప్పై ఏళ్ల వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్న అంజలి- సచిన్ దంపతులు ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేస్తూ ఉంటారు. మరోవైపు.. శిల్పా శిరోద్కర్ 2000 సంవత్సరంలో యూకేకు చెందిన బ్యాంకర్ అపరేశ్ రంజిత్‌ను పెళ్లి చేసుకుంది. కాగా శిల్పా మరెవరో కాదు... సూపర్‌స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌కు సొంత చెల్లెలు. అంటే.. మహేశ్ బాబుకు మరదలు అన్నమాట.సిరాజ్‌కు రాఖీ కట్టిన జనాయ్ఇదిలా ఉంటే.. ఇటీవల మహ్మద్ సిరాజ్- జనాయ్ భోస్లే గురించి కూడా ఇలా రిలేషన్షిప్ వార్తలు వచ్చాయి. అయితే, రాఖీ పూర్ణిమ రోజు జనాయ్ సిరాజ్‌కు రాఖీ కట్టి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ గాసిప్‌రాయుళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది. కాగా జనాయ్.. దిగ్గజ గాయని ఆశా భోస్లే మనుమరాలు.చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్ -
హైదరాబాద్ : కిర్మాణీ ఆటోబయోగ్రఫీని ఆవిష్కరించిన సిరాజ్ (ఫొటోలు)
-
'సిరాజ్ ఒక పోరాట యోధుడు'.. హైదరాబాదీపై పాక్ దిగ్గజం ప్రశంసలు
ఓవల్‌లో టెస్టులో ఇంగ్లండ్‌పై అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై పాక్ లెజెండరీ పేసర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సిరాజ్ ఇక సపోర్ట్ బౌలర్ కాదని, ప్రధాన పేసర్ అని అక్రమ్ కొనియాడాడు.ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో సిరాజ్ అద్బుతం చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో భారత్ సమం చేసింది. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో సిరాజ్(23) లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అంతేకాకుండా సిరాజ్ సిరీస్ మొత్తంగా 1000 పైగా బంతులను బౌలింగ్ చేసి తన ఫిట్నెస్ ఎంటో చాటిచెప్పాడు."సిరాజ్‌కు తపన, పట్టుదల ఎక్కువ. ఓవల్ టెస్టులో సిరాజ్ ప్రదర్శన గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే అవుతోంది. నిజంగా అతడు అద్బుతం చేశాడు. ఐదు టెస్టుల్లో దాదాపు 186 ఓవర్లు బౌలింగ్ చేసి, ఆఖరి రోజు కూడా అంతే ఉత్సాహంగా ఉండటం నిజంగా గ్రేట్. అతడు శారీరకంగా, మానసికంగా శారీరకంగా చాలా దృడంగా ఉన్నాడు.సిరాజ్ ఇకపై కేవలం సపోర్ట్ బౌలర్ కాదు. బుమ్రా గైర్హజరీలో భారత పేసర్ పేస్ ఎటాక్‌ను సిరాజ్ లీడ్ చేస్తున్నాడు. హ్యారీ బ్రూక్ క్యాచ్‌ను సిరాజ్ విడిచిపెట్టినప్పటికి, తన ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని ఏ మాత్రం కోల్పోలేదు. అది ఒక పోరాట యోధుడి లక్షణం.టెస్ట్ క్రికెట్ ఎప్పటికీ తన ఉనికిని కోల్పోదు. నేను పనిలో ఉన్నప్పుడు క్రికెట్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాను. కానీ ఆఖరి రోజు ఆటను చూసేందుకు టీవీకి అతుక్కుపోయాను" అని టెలికాం ఆసియా స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆక్రమ్ పేర్కొన్నాడు.చదవండి: ఆసియాకప్-2025కు శుబ్‌మన్ గిల్ దూరం!? -
అతడొక రియల్ హీరో.. భారత క్రికెట్‌కు అటువంటి వారే కావాలి: కపిల్ దేవ్
ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీ 2025లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో సిరాజ్ మొత్తంగా 23 వికెట్లతో సత్తాచాటాడు. తొలి నాలుగు మ్యాచ్‌లు పక్కన పెడితే ఆఖరి టెస్టులో సిరాజ్ ప్రదర్శన గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే.చారిత్రత్మక ఓవల్ మైదానంలో సిరాజ్ మియా బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత జట్టు మరుపురాని విజయాన్ని అందించాడు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు కావాల్సిన సమయంలో సిరాజ్ వేసిన బంతులు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.ఈ మ్యాచ్ ముగిసి దాదాపు ఆరు రోజులు అవుతున్నప్పటికి సిరాజ్ ప్రదర్శనను ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఈ క్రమంలో సిరాజ్‌పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. సిరాజ్ లాంటి బౌలర్లు భారత జట్టుకు మరింత మంది కావాలని ఆయన అన్నారు."సిరాజ్ రియల్ హీరో. అతడు తన బౌలింగ్ సిద్దాంతాన్ని నమ్ముకున్నాడు. అతిగా ఏదీ ప్రయత్నించలేదు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం, ముఖ్యంగా ఆఫ్ స్టంప్ చుట్టూ బంతులు వేస్తూ ప్రత్యర్ధిని బెంబెలెత్తించాడు. జస్ప్రీత్ బుమ్రా గైర్హజరీలో బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేశాడు. భారత క్రికెట్‌కు సిరాజ్ లాంటి వాళ్లు మరి కొంతమంది అవసరం. ఆఖరి రోజు ఆటలో సిరాజ్ చాలా కన్ఫిడెన్స్గా ఉన్నాడు. జట్టు గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. డేంజరస్ బ్యాటర్ జేమీ స్మిత్‌ను ఔట్ చేసి టీమిండియా శిబిరంలో ఉత్సాహన్ని నింపాడు. సిరాజ్ నాలుగో రోజు ఆటలో ఒక క్యాచ్ వదిలేసాడు. కానీ ఆ తర్వాత బౌలింగ్‌లో తన సత్తాచూపించాడు. అతడిలో కనీసం ఒత్తిడి కన్పించలేదు. ఇది కొంతమందికే సాధ్యమని" కపిల్‌దేవ్ మిడ్ డే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ పేర్కొన్నారు.చదవండి: IND-A vs AUS-A: టీమిండియా ఘోర ఓటమి.. 73 పరుగులకే ఆలౌట్ -
సిరాజ్ నాపై కోపంగా ఉండేవాడు.. ఇప్పటికీ అంతే: రహానే
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గురించి భారత వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (Ajinkya Rahane)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ హైదరాబాదీ బౌలర్‌కు కోపం కాస్త ఎక్కువేనని.. అయితే, అది అతడిలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీసేంత వరకు చల్లారదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తనకు ఆలస్యంగా బంతిని ఇచ్చినందుకు తనపై సిరాజ్ కోపంగా ఉండేవాడంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.సుదీర్ఘ స్పెల్స్ వేస్తూ..ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సిరాజ్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఓవైపు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పనిభారం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరం కాగా.. మరోవైపు సిరాజ్ మాత్రం సుదీర్ఘ స్పెల్స్ వేస్తూ.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.ముఖ్యంగా చావోరేవో తేల్చుకోవాల్సిన ఐదో టెస్టులో తొమ్మిది వికెట్లతో సత్తా చాటి టీమిండియాను గెలిపించాడు సిరాజ్. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో 23 వికెట్లు కూల్చాడు. అయితే, ఇక్కడా ఆట మధ్యలో యాంగ్రీ యంగ్‌మేన్‌లా సిరాజ్ దూకుడుగా కనిపించాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తనదైన శైలిలో సవాల్ విసరుతూ అభిమానులకు కనువిందు చేశాడు.సిరాజ్ నాపై కోపంగా ఉండేవాడు.. ఇప్పటికీ అంతేఈ నేపథ్యంలో సిరాజ్ పట్టుదల, దూకుడు గురించి టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. ‘‘సుదీర్ఘంగా బౌలింగ్ చేయడానికి సిరాజ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆస్ట్రేలియాలో తను అరంగేట్రం చేస్తున్న సమయంలోనూ అంటే.. 2020-21 సిరీస్‌లో కూడా అతడు అదే ఇంటెన్సిటీతో ఉన్నాడు.అయితే, నేను అతడిని ఆలస్యంగా బరిలోకి దించేసరికి నాపై కోపంగా ఉన్నాడు. ఇప్పటికీ అదే కోపం అతడి లోపల అలాగే ఉంది. అయితే, ఇది మహ్మద్ సిరాజ్‌లోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీసేందుకు కారణమయ్యే కోపం అన్నమాట.ఇంగ్లండ్ సిరీస్‌లో అతడి దూకుడైన బౌలింగ్ చూశాం కదా! తొలి బంతి నుంచి ఆఖరి బాల్ దాకా అదే నాణ్యతతో బౌలింగ్ చేస్తాడు. అందరికీ ఇది సాధ్యం కాదు. జేమ్స్ ఆండర్సన్ మాదిరే సిరాజ్ కూడా తొలి బంతి నుంచే దూకుడు కనబరుస్తాడు.ఇంగ్లండ్‌లో జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరైన మ్యాచ్‌లలో సిరాజ్ పేస్ దళాన్ని ముందుండి నడిపించాడు. తన బాధ్యతను చక్కగా నెరవేర్చాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. 2-2తో సమంకాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా లీడ్స్, లార్డ్స్ టెస్టుల్లో ఓడిపోయింది. బర్మింగ్‌హామ్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన గిల్ సేన.. ఆఖరిదైన ఓవల్ టెస్టులో ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రా అయింది. చదవండి: IND vs ENG: 500కు పైగా పరుగులు చేశాడు.. మీ సంకుచిత బుద్ధి మారదా? -
చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్
టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ Harry Brook) చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. ఓవల్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే.పందొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj).. ఆ వెంటనే బౌండరీ లైన్ తొక్కేశాడు. దీంతో లైఫ్‌లైన్ పొందిన బ్రూక్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ధనాధన్ దంచికొట్టి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.చెవి వెనుక అతికించి.. ఆపైకేవలం 98 బంతుల్లోనే హ్యారీ బ్రూక్.. 111 పరుగులతో సత్తా చాటి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపునకు తిప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో డ్రింక్స్ విరామ సమయంలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. డ్రింక్స్‌తో తన శరీరాన్ని హైడ్రేట్ చేసుకున్న తర్వాత.. చెవి వెనుక అతికించి పెట్టిన చ్యూయింగ్ గమ్ తీసి నోట్లో వేసుకున్నాడు. అంటే అప్పటికి దానిని బాగా నమిలిన బ్రూక్.. డ్రింక్స్ బ్రేక్ కోసం చెవి వెనక పెట్టాడన్న మాట!ఛీ! ఇదేం పని బ్రూక్ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘‘ఛీ! ఇదేం పని బ్రూక్.. చ్యూయింగ్ గమ్ అంటే మరీ ఇంత పిచ్చి ఉంటుందా?’’ అంటూ నెటిజన్లు అతడిని సరదాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆ సమయంలో కామెంటేటర్లు రిక్కీ పాంటింగ్, రవిశాస్త్రి తమదైన శైలిలో బ్రూక్‌పై చణుకులు విసిరారు.ఎక్కడో దాచి ఉంటాడు‘‘రిక్కీ.. నువ్వు చూశావా? అదైతే చెవికి సంబంధించిన వస్తువు కాదు. అది కచ్చితంగా చ్యూయింగ్ గమ్ అని చెప్పగలను’’ అని రవిశాస్త్రి అన్నాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. ఇలాంటిది నేనైతే ఇంతకు ముందెన్నడూ చూడలేదు. నాకు తెలిసి అతడి దగ్గర మరో రెండు పీసులు ఉండి ఉంటాయి. వాటిని ఎక్కడో దాచి ఉంటాడు’’ అని రిక్కీ పాంటింగ్ జోక్ చేశాడు.ఇక ఇందుకు స్పందనగా.. ‘‘అతడు నీళ్లు తాగేశాడు. ఆ వెంటనే గమ్ అతడి నోట్లోకి వెళ్లింది. మళ్లీ బయటకు.. మళ్లీ లోపలకు. ప్రతిసారి అతడు చ్యూయింగ్ గమ్ నములుతూనే ఉంటాడు’’ అని రవిశాస్త్రి అనగానే రిక్కీ పాంటింగ్ గట్టిగా నవ్వేశాడు.టీమిండియా విజయం.. సిరీస్ సమంఇదిలా ఉంటే.. ఓవల్ టెస్టులో బ్రూక్ మెరుపులు వృథా అయ్యాయి. ఆఖరిదైన ఐదో రోజు ఇంగ్లండ్‌కు 35 పరుగులు కావాల్సి ఉండగా.. సిరాజ్ అద్బుత రీతిలో రాణించి ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించాడు. విజయానికి ఆరు పరుగుల దూరంలో ఉన్న వేళ ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి.. టీమిండియాను గెలిపించాడు. ఫలితంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ 2-2తో సమమైంది. హెడింగ్లీ, లార్డ్స్‌లో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్, ఓవల్‌లో టీమిండియా విజయం సాధించింది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు డ్రా అయింది. చదవండి: నువ్వు టీమిండియాలోకి ఎలా వచ్చావో మర్చిపోవద్దు: జైస్వాల్‌తో రోహిత్ View this post on Instagram A post shared by We Are England Cricket (@englandcricket) -
IND vs ENG: అసదుద్దీన్ ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదే.. పోస్ట్ వైరల్
ఇంగ్లండ్ గడ్డ మీద అదరగొట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది. ఓడిపోతామనుకున్న ఆఖరి టెస్టు (IND vs ENG 5th Test)లో అద్భుత ప్రదర్శనతో సిరాజ్ భారత్‌ను గెలిపించిన తీరు.. అమోఘమంటూ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులూ కొనియాడుతున్నారు. ఆల్వేస్ వి న్నర్ఇందులో భాగంగా సిరాజ్ మియాను ఉద్దేశించి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసాపూర్వక ట్వీట్ చేశారు. ‘‘‘ఎల్లప్పుడూ విజేతే.. మన హైదరాబాదీ శైలిలో చెప్పాలంటే.. పూరా ఖోల్ దియే పాషా!’’ అంటూ ఒవైసీ సిరాజ్‌ను అభినందించారు. బౌలర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడని కితాబు ఇచ్చారు. ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదేఇక సిరాజ్ కూడా ఇందుకు బదులిస్తూ.. ‘‘ధన్యవాదాలు సార్.. ఎల్లవేళలా నన్ను ప్రోత్సహిస్తూ చీర్ చేస్తున్నందకు కృతజ్ఞతలు’’ అంటూ హార్ట్ సింబల్‌తో పాటు నమస్కారం పెడుతున్నట్లుగా ఉండే ఎమోజీని షేర్ చేశాడు. సిరాజ్ ఈ మేరకు ఒవైసీకి థాంక్యూ చెబుతూ చేసిన పోస్ట్ అర మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.కెరీర్ బెస్ట్ ర్యాంకులో సిరాజ్ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయాడు. ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో 9 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఈ హైదరాబాదీ బౌలర్.. బుధవారం విడుదల చేసిన ఐసీసీ బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు ఎగబాకాడు. సిరాజ్ 674 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. గతంలో సిరాజ్ అత్యుత్తమంగా 16వ ర్యాంక్ సాధించాడు.ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా (889 పాయింట్లు) అగ్ర స్థానంలో కొనసాగుతుండగా... భారత్ నుంచి రవీంద్ర జడేజా (17వ స్థానం) కూడా టాప్–20లో ఉన్నాడు. టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్ (792 రేటింగ్ పాయింట్లు)కు చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జైస్వాల్ 2 సెంచరీలు సహా మొత్తం 411 పరుగులు చేశాడు.ఈ జాబితాలో జో రూట్ (908) తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకోగా... రిషభ్ పంత్ (8వ), శుబ్‌మన్ గిల్ (13వ)లకు టాప్–20లో చోటు లభించింది. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (405 పాయింట్లు) నిలకడగా నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా... వాషింగ్టన్ సుందర్ 16వ ర్యాంక్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌లో సన్మానం! ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల పోరులో అత్యధికంగా 23 వికెట్లు తీసి సిరీస్‌ను భారత్ సమంగా ముగించడంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ సొంతగడ్డకు చేరుకున్నాడు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో సన్నిహితులు, అభిమానులు అతనికి స్వాగతం పలికారు. ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌తో కలిసి లండన్ నుంచి నేరుగా ముంబైకి చేరుకున్న సిరాజ్ ఆ తర్వాత స్వస్థలానికి వచ్చాడు. వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ వరకు భారత జట్టు ఎలాంటి మ్యాచ్‌లు ఆడటం లేదు.ఈ నేపథ్యంలో నగరంలోనే ఉండనున్న సిరాజ్‌కు త్వరలోనే ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) యోచిస్తోంది. ప్రస్తుతానికి అధ్యక్ష, కార్యదర్శులు వివిధ ఆరోపణలతో జైలులో ఉన్నందుకు ఈ కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: Asia Cup 2025: అతడు భేష్.. ఇతడు ఓకే.. టీమిండియా సెలక్టర్లకు తలనొప్పి! -
సిరాజ్ శాలరీ, నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
గత మూడు రోజులుగా సిరాజ్ పేరు మార్మోగిపోతోంది. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అతడిని పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఏమాత్రం విజయావకాశాలు లేని పరిస్థితిలో జట్టును గెలిచిపించి ఈ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ పతాక శీర్షికలకు ఎక్కాడు. పదునైన బంతులతో ప్రత్యర్థుల పనిపట్టి టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించడంలో కీరోల్ పోషించిన సిరాజ్‌కు అన్నివైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇంగ్లీషు గడ్డపై సత్తా చాటి తానేంటో మరోసారి రుజువు చేసి.. భళా అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ సంబంధించిన అన్ని అంశాలు మళ్లీ వార్తల్లోకి ఎక్కాయి. అతడి సంపాదన గురించి కూడా. గ్రేడ్ A ప్లేయర్టీమిండియా టాప్ బౌలర్లలో ఒకడైన మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) ప్రస్తుతం బీసీసీఐ కాంట్రాక్ట్‌లో గ్రేడ్ A ప్లేయర్‌గా ఉన్నాడు. దీనికి ప్రకారం అతడికి 5 కోట్ల రూపాయల వార్షిక వేతనం అందుతుంది. రిటైనర్తో పాటు, అతడు ఆడే ప్రతి మ్యాచ్‌కూ ఫీజు కూడా దక్కుతుంది. టెస్ట్‌కు రూ.15 లక్షలు, వన్డేకి రూ. 6 లక్షలు టి20కి రూ.3 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా బోనస్ కూడా అందుకోబోతున్నాడు. ఎందుకంటే బాగా ఆడిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు బీసీసీఐ బోనస్ ఇస్తోంది. ఉదాహరణకు 5 వికెట్ల తీసిన ఆటగాడికి 5 లక్షల రూపాయలు బోనస్‌గా అందజేస్తుంది. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ మియా రెండు సార్లు ఐదు వికెట్ల పదర్శన నమోదు చేశాడు.ఐపీఎల్‌తో అదుర్స్నిలకడగా ఆడుతున్న ఆటగాళ్లకు బీసీసీఐ భారీగానే జీతాలు ఇస్తోంది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా మరింత సంపాదిస్తున్నారు టీమిండియా ప్లేయర్స్. ఐపీఎల్ మెగా వేలంలో సిరాజ్ భారీ ధర పలికాడు. తాజా సీజన్లో సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. ఈ మొత్తం అతడి వార్షిక బీసీసీఐ జీతం (BCCI salary) కంటే రెట్టింపు కావడం గమనార్హం.'బ్రాండ్' బాజాఆటతో వచ్చే ఆదాయంతో పాటు వాణిజ్య ఒప్పందాల ద్వారా కూడా సిరాజ్ సంపాదిస్తున్నాడు. మై 11 సర్కిల్, థంబ్స్ అప్, కాయిన్ స్విచ్ కుబేర్, ఎజీ క్రికెట్, నిప్పన్ పెయింట్స్, మై ఫిట్నెస్ వంటి హై-ప్రొఫైల్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్‌లో రెస్టరెంట్ కూడా ప్రారంభించాడు.డిఎస్పీగా..సిరాజ్ క్రీడా రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అతడిని పోలీస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీస్ శాఖలో డిఎస్పీగా సిరాజ్ జీతం రూ.58,850 నుంచి రూ.137050 వరకు ఉంది. 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చిన తర్వాత రూ.2.87 లక్షల ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌తో అతడి జీతం రూ.80000 నుంచి రూ.1.85 లక్షల వరకు ఉండవచ్చు.నికర విలువ2019 నుంచి మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన సిరాజ్ విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. నిలకడగా ఆడుతూ టీమ్‌లో టాప్ ప్లేయర్‌గా ఎదిగాడు. వివిధ మీడియా నివేదికల ప్రకారం.. అతడి మొత్తం నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 57 కోట్లుగా అంచనా. ఇందులో బీసీసీఐ, ఐపీఎల్, బ్రాండ్ ఎండార్స్మెంట్స్, పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయాలు కూడా ఉన్నాయి. కిందిస్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన మన హైద్రాబాదీ పేస్ బౌలర్ మరింత ఎత్తుకు ఎదగాలని మనసారా కోరుకుందాం.మళ్లీ ఎప్పడు?ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో రాణించి స్వదేశానికి పయమైన మహ్మద్ సిరాజ్.. మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. సెప్టెంబర్‌లో జరిగే టి20 ఆసియా కప్ 2025లో అతడు ఆడకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. బుమ్రాతో పాటు సిరాజ్‌కు కూడా ఈ టోర్నమెంట్ నుంచి విశ్రాంతి కల్పిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. చూడాలి మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో!చదవండి: నువ్వు గొప్పోడివి సిరాజ్.. విరాట్ కోహ్లి సోదరి పోస్ట్ వైరల్ -
నువ్వు గొప్పోడివి సిరాజ్: విరాట్ కోహ్లి సోదరి పోస్ట్ వైరల్
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓవల్ టెస్టు (Oval Test)లో తీవ్రమైన ఒత్తిడి ఉన్నా.. అతడు భారత్‌ను విజయతీరాలకు చేర్చడమే ఇందుకు కారణం. ఇంగ్లండ్ విజయానికి ఏడు పరుగులు.. టీమిండియా గెలుపునకు ఒక వికెట్ కావాల్సిన వేళ సిరాజ్ తనలోని అత్యుత్తమ బౌలర్‌ను వెలికితీసి అద్భుతం చేశాడు.సూపర్ డెలివరీతో గస్ అట్కిన్సన్ (17)ను పదో వికెట్‌గా వెనక్కి పంపి.. ఇంగ్లండ్ ఆట కట్టించాడు. దీంతో ఆఖరిదైన ఐదో టెస్టులో ఆరు పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చడం విశేషం.ఓ పొరపాటు.. తీవ్రమైన ఒత్తిడిఅయితే, ఓవల్ టెస్టులో నాలుగో రోజు ఆటలో భాగంగా సిరాజ్ కారణంగా పెద్ద పొరపాటే జరగింది. హ్యారీ బ్రూక్ (Harry Brook) 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టిన ఈ రైటార్మ్ పేసర్.. అనూహ్యంగా బౌండరీ లైన్ తొక్కేశాడు. దీంతో అవుట్ కావాల్సిన హ్యారీ బ్రూక్ సిక్సర్‌తో పండుగ చేసుకోవడమే కాదు.. ఆ తర్వాత ధనాధన్ ఇన్నింగ్స్‌తో శతక్కొట్టి (98 బంతుల్లో 111) మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పే ప్రయత్నం చేశాడు.అయితే, ఆఖరికి బ్రూక్ సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ తొలుత క్యాచ్ డ్రాప్ చేసినందుకు సిరాజ్‌పై విమర్శలు వచ్చాయి. అయినాసరే ఒత్తిడిని జయించిన సిరాజ్.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగి ఐదో రోజు అద్భుత ప్రదర్శనతో టీమిండియాను గెలిపించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిలతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సిరాజ్ మియాపై ప్రశంసలు కురిపించారు. ఇక విరాట్ కోహ్లి అక్క భావనా కోహ్లి ధింగ్రా సైతం సిరాజ్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ రాయడం విశేషం.సిరాజ్.. నువ్వు గొప్పోడివి‘‘ఈ ఆట ఎల్లప్పుడూ అద్భుతమైన అనుభవాలను అందించడంలో విఫలం కాదు. ఆశావహ, సానుకూల దృక్పథంతో.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ స్పూర్తిదాయక హీరోలు ఉన్నంత వరకు ఈ ఆట ఇలాకాక.. ఇంకెలా ఉంటుంది?! మహ్మద్ సిరాజ్.. నువ్వు గొప్పోడివి’’ అంటూ భావనా కోహ్లి ధింగ్రా తన ఇన్‌స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టగా.. వైరల్ అవుతోంది. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లండ్, రెండో టెస్టులో భారత్ గెలవగా.. మూడో టెస్టులో ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది. అనంతరం నాలుగో టెస్టు డ్రా కాగా.. ఐదో టెస్టులో భారత్ గెలిచింది. ఓవల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సిరాజ్ నిలవగా.. భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.చదవండి: బీసీసీఐ వేటు!.. నా ఫ్యామిలీ లాంటిది అంటూ భావోద్వేగం -
ICC rankings: రఫ్ఫాడించిన సిరాజ్.. ఏకంగా 12 స్థానాలు జంప్
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. ఇప్పుడు ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాకింగ్స్‌లోనూ సత్తాచాటాడు. సిరాజ్ మియా తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించాడు. సిరాజ్ 674 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 12 స్ధానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ హైదరాబాదీ టెస్టు బౌలర్ల ర్యాకింగ్స్లో టాప్ 15లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి.దుమ్ములేపిన సిరాజ్..ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ భారత ఫాస్ట్ బౌలర్ సంచలన ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఓవల్ టెస్టులో టీమిండియా చారిత్రత్మక విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి టెస్టులో సిరాజ్ తొమ్మది వికెట్లు పడగొట్టి భారత్‌కు మరుపురాని విజయాన్ని అందించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 23 సిరాజ్ వికెట్లతో సత్తాచాటాడు. ఇందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి.ప్రసిద్ద్ అదుర్స్..ఇక ఓవల్ టెస్టులో సిరాజ్‌తో పాటు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ద్ కృష్ణ సైతం తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. ప్రసిద్ద్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రసిద్ద్ ఐదో టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను కృష్ణ సాధించాడు. కాగా బౌలర్ల ర్యాకింగ్స్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(889) అగ్రస్దానంలో కొనసాగుతుండగా.. కగిసో రబాడ రెండో స్దానంలో నిలిచాడు.టాప్-5 లోకి జైశ్వాల్..ఇక ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ టాప్ 5లోకి తిరిగొచ్చాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో జైశ్వాల్ అద్బుత సెంచరీతో మెరిశాడు. అదేవిధంగా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమైన శుబ్‌మన్ గిల్ నాలుగు స్ధానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయాడు.చదవండి: IND vs ENG: వ్యాజ్‌లెన్ వాడారు.. గిల్ సేనపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు -
వ్యాజ్‌లెన్ వాడారు: టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు
ఓటమి ఖాయమనుకున్న సిరీస్‌లో టీమిండియా అద్భుతమే చేసింది. ఓవల్ టెస్టులో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా ఊహించని రీతిలో పుంజుకుని అసాధారణ ఆట తీరుతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆఖరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ (IND vs ENG)పై ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.అయితే, భారత దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ (Rohit Sharma) లేకుండానే.. ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా ఇలాంటి ప్రదర్శన చేయడం విశేషం. టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్.. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా మంచి మార్కులే దక్కించుకున్నాడు.అందరూ సమిష్టిగా రాణించిరికార్డు స్థాయిలో 754 పరుగులు సాధించడంతో పాటు.. ఎన్నో చిరస్మరణీయ రికార్డులు సొంతం చేసుకున్నాడు. మరోవైపు.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, పేసర్లు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ సత్తా చాటగా.. మహ్మద్ సిరాజ్ ఏకంగా 23 వికెట్లు కూల్చి సిరీస్‌ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.సూపర్ సిరాజ్ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన టెస్టులో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ విజయానికి ఏడు పరుగులు.. టీమిండియా ఒక వికెట్ దూరంలో ఉన్న వేళ.. అద్భుత డెలివరీతో చివరి వికెట్ తీసి భారత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు ఈ హైదరాబాదీ బౌలర్.ఈ నేపథ్యంలో గిల్ సేనతో పాటు సిరాజ్‌ను మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం.. ముఖ్యంగా దిగ్గజ బ్యాటర్ జో రూట్ సిరాజ్ నైపుణ్యాలను కొనియాడటం విశేషం.ఓర్వలేని పాక్ మాజీ క్రికెటర్.. సంచలన ఆరోపణలుటీమిండియా మొత్తం సంతోషంలో మునిగిన వేళ.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ దాయాది జట్టుపై విద్వేషం చిమ్మాడు. బాల్ ట్యాంపరింగ్ అంటూ భారత జట్టుపై నిరాధార ఆరోపణలు చేశాడు.‘‘నాకు తెలిసి.. ఇండియా బంతిపై వ్యాజ్‌లెన్ రాసి ఉంటుంది. అందుకే 80కి పైగా ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత కూడా.. బంతి ఇంకా కొత్తదానిలాగే మెరుస్తోంది. అంపైర్ ఆ బంతిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాలి’’ అని పాక్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షబ్బీర్ అహ్మద్ ఖాన్ ‘ఎక్స్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఇంతకు కుళ్లు దేనికి?ఈ నేపథ్యంలో షబ్బీర్ అహ్మద్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘టీమిండియా సంబరాలు చూసి ఓర్వలేకపోతున్నావా?.. దాయాది జట్టుపై ఇంత అక్కసు దేనికి?.. అక్కడా ఎవరూ అసలు దీని గురించి మాట్లాడలేదు. నీకెందుకు మరి ఈ చెత్త డౌట్ వచ్చింది.ఓహో మీ జట్టుకు ఇలాంటివి చేయడం.. ముఖ్యంగా ఫాస్ట్‌బౌలర్‌గా నీకు ఇలాంటివి బాగా అలవాటు కాబోలు. అందుకే పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా అన్నట్లు టీమిండియాను చూసినా నీకు అదే అనిపిస్తోంది. అయినా ఫేమస్ అవ్వడానికి ఈ మధ్య నీలాంటి వాళ్లు బాగానే తయారయ్యారు’’ అంటూ గట్టిగా చురకలు అంటిస్తున్నారు. కాగా పాకిస్తాన్ తరఫున 10 టెస్టులు, 32 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన షబ్బీర్ అహ్మద్.. ఆయా ఫార్మాట్లలో 51, 33 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20లలో బౌలర్‌గా అసలు అతడు బోణీ కొట్టలేదు. చదవండి: Dhruv Jurel: అతడికి నువ్వెందుకు చెప్పలేదు? గిల్‌తో సిరాజ్.. కొంప మునిగేదే! -
అతడికి నువ్వెందుకు చెప్పవు? గిల్‌తో సిరాజ్.. కొంప మునిగేదే!
ఐదో టెస్టు ఆఖరి రోజు వరకు ఉత్కంఠ రేపిన పోరులో భారత్ ఇంగ్లండ్‌పై గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఓటమి అంచుల వరకు వెళ్లినా.. అనూహ్య రీతిలో పుంజుకుని సంచలన విజయం సాధించింది. ఓవల్‌లో చివరిదైన ఐదో రోజు ఆటలో ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉండగా.. భారత్‌కు నాలుగు వికెట్లు అవసరమయ్యాయి.అద్భుతం చేసిన సిరాజ్ ఇలాంటి క్లిష్ట సమీకరణాల వేళ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుతమైన బౌలింగ్‌తో.. ఆఖరి రోజు నాలుగింటిలో మూడు వికెట్లు తానే పడగొట్టాడు. ముఖ్యంగా ఆఖరి వికెట్‌గా గస్ అట్కిన్సన్ను వెనక్కి పంపి భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చడం సిరీస్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.జురెల్ ఏమరపాటు కారణంగానిజానికి ఇంగ్లండ్ ఇంకాస్త ముందే ఈ వికెట్ కోల్పోయి ఉండేది. అయితే, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కాస్త ఏమరపాటుగా ఉండటంతో ప్రత్యర్థి జట్టుకు పరుగు లభించింది. దీంతో మరోసారి నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ సిరాజ్ సరైన సమయంలో అట్కిన్సన్ను అవుట్ చేయకపోయి ఉంటే.. జురెల్ చేసిన పొరపాటు కారణంగా టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది.అసలేం జరిగిందంటే.. ఓవల్ టెస్టు ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోగానే.. ఆ జట్టు ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం విరిగినప్పటికీ బ్యాటర్‌గా వచ్చాడు. అయితే, స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అట్కిన్సన్.. వోక్స్ బ్యాటింగ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి.. ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి.. మళ్లీ తానే క్రీజులోకి వచ్చేలా చూసుకున్నాడు.సిరాజ్ ప్లాన్ ఇదేఈ నేపథ్యంలో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)- సిరాజ్ కలిసి ఈ జోడీని రనౌట్ చేయాలి లేదంటే.. అద్భుతమైన డెలివరీతో అట్కిన్సన్ను వెనక్కి పంపాలని ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే 84వ ఓవర్లో వైడ్ లేదా యార్కర్ వేయాలని సిరాజ్- గిల్ ప్లాన్ చేశారు.అనుకున్నట్లుగానే అట్కిన్సన్ సిరాజ్ వేసిన బంతిని మిస్సయ్యాడు. అయినా సింగిల్‌కు వెళ్లాడు. అయితే, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సరైన సమయంలో బంతిని అందుకుని స్టంప్స్ వైపు గిరాటెయ్యలేకపోయాడు. ఫలితంగా ఆ ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి అట్కిన్సన్ మరోసారి క్రీజులోకి వచ్చాడు. దీంతో సిరాజ్ వెళ్లి గిల్‌తో కాస్త గట్టిగానే ఏదో వాదించినట్లుగా కనిపించింది.అయితే, ఆ మరుసటి ఓవర్లోనూ సింగిల్ తీయగలిగిన అట్కిన్సన్ (29 బంతుల్లో 17)ను.. 86వ ఓవర్ మొదటి బంతికే సిరాజ్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. భారత్ ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది.అతడికి ఎందుకు చెప్పవు?ఈ పరిణామాలపై స్పందించిన కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. ‘‘సిరాజ్ నా దగ్గరికి వచ్చి.. రనౌట్ చేసేందుకు ధ్రువ్ జురెల్‌ను సిద్ధంగా ఉండమని చెప్పాడు. అయితే, నేను ధ్రువ్‌తో ఈ మాట చెప్పే కంటే ముందే సిరాజ్ బౌలింగ్ చేసేందుకు రన్ మొదలుపెట్టాడు.దీంతో ధ్రువ్ వేగంగా స్పందించలేకపోయాడు. అతడు స్టంప్స్‌ను మిస్ చేయగానే సిరాజ్ నా దగ్గరికి వచ్చి.. ‘నువ్వు అతడికి ఎందుకు చెప్పవు?’’ అని నన్ను ప్రశ్నించాడు’’ అని గిల్ తెలిపాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా.. రెండు గెలిచి.. ఒకటి డ్రా చేసుకుంది. తద్వారా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గిల్‌కు ఇదే తొలి సిరీస్ అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్‌లో సిరాజ్ వెయ్యికి పైగా బంతులు వేసి 23 వికెట్లు కూల్చడం విశేషం.చదవండి: ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు: గంభీర్ స్పీచ్ వైరల్ज़िन्दगी देती है मौक़ा एक , अपनी पहचान बनाने काकुछ कर दिखाने का ✨@UltraTechCement | #SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia pic.twitter.com/atceen4I2W— Sony Sports Network (@SonySportsNetwk) August 5, 2025 -
నాన్నంటే వాడికి ప్రాణం.. ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు నాతో ఏమన్నాడంటే..
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం మార్మోగిపోతున్న పేరు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj). ఇంగ్లండ్‌తో ఓవల్ టెస్టులో ఈ హైదరాబాదీ అద్బుతమే చేశాడు. ఓటమి కోరల్లో చిక్కుకున్న టీమిండియాను తన అద్భుతమైన డెలివరీతో విజయతీరాలకు చేర్చాడు.బాగా ఆడి ఇండియాను గెలిపించాలిఇంగ్లండ్తో ఓవరాల్‌గా ఐదు టెస్టుల్లో 185 ఓవర్లు బౌల్ చేసి.. ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని భారత్ 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు బయల్దేరే ముందు సిరాజ్ తన తల్లితో అన్న మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.ఈ విషయం గురించి సిరాజ్ తల్లి షబానా బేగం టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘అమ్మా.. నాకోసం ప్రార్థన చేస్తూ ఉండు. నేను బాగా ఆడి ఇండియాను గెలిపించాలని ప్రార్థించు’’ అని కుమారుడు తనతో చెప్పాడన్నారు.నాన్నంటే వాడికి ప్రాణంఅదే విధంగా.. తండ్రి అంటే సిరాజ్‌కు ప్రాణమని.. ‘‘సిరాజ్‌కు వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. ఆయనను ఎంతగానో ప్రేమిస్తాడు. తండ్రి కోసం ఏం చేసేందుకైనా సిరాజ్ వెనకాడేవాడు కాదు. సిరాజ్ కోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను. నా కుమారుడు చేసే ప్రతి పనిలో విజయవంతం అయ్యేలా ఆ అల్లా దీవించాలి’’ అని షబానా మాతృప్రేమను చాటుకున్నారు.కాగా సిరాజ్ క్రికెటర్‌గా ఎదగడంలో అతడి కుటుంబం పాత్ర కీలకం. తండ్రి మహ్మద్ గౌస్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూనే.. కుమారుడి కల నెరవేరేలా ప్రోత్సహించారు. సిరాజ్ అంటే ఆయనకూ ప్రాణమే. ఆయన కోరుకున్నట్లే కొడుకు టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.కుమారుడి ఎదుగుదల చూడకుండానేముఖ్యంగా తనకు ఇష్టమైన టెస్టు ఫార్మాట్లో ఆడేందుకు సిద్ధమైన తరుణంలోనే.. దురదృష్టవశాత్తూ గౌస్ కన్నుమూశారు. 2021లో సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా గౌస్ మరణించారు. అయితే, దేశం కోసం ఆడటమే ముఖ్యమని ఆయన నేర్పిన విలువలకు తగ్గట్లుగా అక్కడే ఉండిపోయిన సిరాజ్ తండ్రిని కడసారి చూసుకోలేకపోయాడు.తండ్రి సమాధి దర్శించుకున్న తర్వాతేఅయితే, ఆయన కోరుకున్నట్లుగానే టీమిండియా టాప్ పేసర్‌గా ఎదిగి ఇలా ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా తాను సిరీస్ ఆడేందుకు సన్నద్ధమయ్యే ముందు ముందుగా సిరాజ్ తన తండ్రి సమాధిని దర్శించుకుని అక్కడ ప్రార్థన చేస్తాడు. తాజాగా ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు కూడా సిరాజ్ ఈ ఆనవాయితీని పాటించాడు. అత్యుత్తమ ప్రదర్శనతో భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.చదవండి: ‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా..All heart. All hustle. All 𝘋𝘩𝘢𝘢𝘬𝘢𝘥 💪A fightback that will go down in Indian cricket history ✨#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/bvXrmN5WAL— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025 -
ఇక్కడున్నా బిర్యానీ తక్కువే.. ఆ ఫుడ్ అసలే తినడు: సిరాజ్ సోదరుడు
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని టీమిండియా సమం చేయడంలో మహ్మద్ సిరాజ్‌ది కీలక పాత్ర. ఈ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఓటమి తప్పదనుకున్న చోట సిరాజ్ తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి భారత జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో సిరాజ్ మియా తొమ్మిది వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.ఒకే ఒక్కడు.. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు సిరీస్ అసాంతం మహ్మద్ సిరాజ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా సిరాజ్ ఫిట్నెస్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. ఈ సిరీస్‌లో తన సహచర ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యలతో ఒకట్రెండు మ్యాచ్‌లకు దూరమైనప్పటికి.. సిరాజ్ మాత్రం అలుపెరుగని యోధుడిలా అన్ని మ్యాచ్‌లల్లోనూ ఆడాడు. ఇంగ్లండ్ - భారత్ టెస్టు సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఏకైక బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ఎటువంటి వర్క్ లోడ్ భావించకుండా ఈ సిరీస్‌లో దాదాపు వెయ్యికి పైగా బంతులు వేశాడు. ఎన్నో లాంగ్ స్పెల్స్ కూడా బౌలింగ్ చేశాడు. కానీ ఎప్పుడూ కూడా సిరాజ్ అలిసిపోయినట్లు కన్పించలేదు. తాజాగా మహ్మద్ సిరాజ్ ఫిట్నెస్ సీక్రెట్‌ను అతడి సోదరుడు మొహమ్మద్ ఇస్మాయిల్ భయటపెట్టాడు."సిరాజ్ తన ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తాడు. అతడు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు. సరైన డైట్ ప్లాన్‌ను పాటిస్తాడు. సిరాజ్ హైదరాబాద్‌లో ఉన్నా కూడా బిర్యానీని చాలా అరుదుగా తింటాడు. అది కూడా ఇంట్లో తాయారు చేస్తే తింటాడు. కానీ పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్ల జోలికి అస్సలు పోడు. తన శరీరం పట్ల చాలా క్రమశిక్షణతో ఉంటాడు" అని ఇస్మాయిల్ ఇండియా టూడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో సిరాజ్ మొత్తంగా 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు ఫైవ్ వికెట్ హాల్స్ ఉన్నాయి.చదవండి: ‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా.. -
జవాన్లు కూడా ఇలాగే చేస్తే మన పరిస్థితి ఏంటి?: గావస్కర్ ఫైర్
టీమిండియా పేస్‌దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల్లా.. ఆటగాళ్లు జట్టు కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నాడు. విపత్కర పరిస్థితుల్లో జవాన్లు దగ్గు, జ్వరం అని పక్కకు వెళ్లిపోరని.. ప్రాణాలుపణంగా పెట్టి పోరాడేందుకే సిద్ధపడతారని పేర్కొన్నాడు.అలాగే క్రికెటర్లు కూడా ‘పనిభారం’ అనే సాకును పక్కనపెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని గావస్కర్ విజ్ఞప్తి చేశాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ (IND vs ENG Tests)లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ పేరిట నిర్వహించిన ఈ సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసింది.మూడే టెస్టులు ఆడిన బుమ్రాఇక ఈ సిరీస్ ఆరంభానికి ముందే పనిభారం తగ్గించే క్రమంలో బుమ్రాను కేవలం మూడు టెస్టుల్లోనే ఆడిస్తామని టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా స్పష్టం చేశాడు. అందుకు తగ్గట్లుగా లీడ్స్, లార్డ్స్, మాంచెస్టర్ టెస్టులు ఆడిన తర్వాత బుమ్రాను జట్టు నుంచి బోర్డు రిలీజ్ చేసింది. అయితే, బుమ్రా మోకాలి గాయంతో బాధపడుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.వారెవ్వా అనిపించిన సిరాజ్ మియామరోవైపు బుమ్రా గైర్హాజరీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్.. అలుపున్నదే లేక వెయ్యి బంతులకు పైగా బౌలింగ్ వేశాడు. విశ్రాంతి ఎరుగని పోరాట యోధుడిలా 185 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసి.. ఏకంగా 23 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.పంత్ సైతంముఖ్యంగా ఆఖరిదైన ఐదో టెస్టులో నరాలు తెగే ఉత్కంఠ రేపిన పోరులో సిరాజ్ మియా.. ఏకంగా తొమ్మిది వికెట్లు కూల్చి భారత్‌కు విజయం అందించాడు. ఇదిలా ఉంటే.. రిషభ్ పంత్ సైతం బొటనవేలు ఫ్రాక్చర్ అయినా మాంచెస్టర్ టెస్టులో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు.జవాన్లు కూడా ఇలాగే చేస్తే మన పరిస్థితి ఏంటి?ఈ నేపథ్యంలో సిరాజ్, పంత్‌ల పేర్లు ప్రస్తావిస్తూ సునిల్ గావస్కర్.. పనిభారం పేరిట తప్పుకొనే ఆటగాళ్ల తీరును విమర్శించాడు. ‘‘సరిహద్దులో దేశం కోసం రక్షణగా నిలబడే సైనికుల్లాగే.. దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు కూడా ఎల్లప్పుడూ తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలి.జవాన్లు కూడా మాకు జలుబు చేసింది.. దగ్గు, జ్వరం అని చెప్పి తప్పుకొంటే మన పరిస్థితి ఏంటి? వాళ్లు దేశం కోసం ప్రాణాలే అర్పిస్తారు. ఆటగాళ్లు తమ ప్రాణం పణంగా పెట్టక్కర్లేదు గానీ.. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఆ నొప్పి, ఈ బాధా అంటూ పక్కకు తప్పుకోకూడదు.వారిద్దరిని చూసి నేర్చుకోండిరిషభ్ పంత్ ఏం చేశాడో చూశారు కదా?!.. ఫ్రాక్చర్ అయినా జట్టు కోసం బ్యాట్‌తో బరిలోకి దిగాడు. మిగతా ఆటగాళ్ల నుంచి కూడా ఇలాంటి అంకితభావమే కావాలి. చిన్న చిన్న గాయాలను లెక్కచేయవద్దు.దేశం కోసం ఆడుతుంటే కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని గొప్పగా చూస్తారు. ఇండియాకు ప్రాతినిథ్యం వహించడం ఆటగాళ్లుగా మనకు దక్కిన గొప్ప అదృష్టం. దీనిని తేలిక చేయకూడదు.ఐదు టెస్టుల్లోనూ మహ్మద్ సిరాజ్ అలుపున్నదే లేక తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. దేశం కోసం ఆడటంలో ఉన్న సంతోషాన్ని మనకు చూపించాడు’’ అని గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. వర్క్‌లోడ్ పేరిట ఆటగాళ్లకు విశ్రాంతిస్తూ పోతే.. బెస్ట్ ప్లేయర్‌ను బరిలోకి దించలేమంటూ టీమిండియా మేనేజ్మెంట్ను విమర్శించాడు.చదవండి: నేనే గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటేనా: సిరాజ్ ఎమోషనల్.. గిల్ రియాక్షన్ వైరల్ -
‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా..
భారత జట్టు చివరిసారిగా ఇంగ్లండ్ గడ్డపై 2007లో 1–0తో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత నాలుగుసార్లు మన టీమ్ అక్కడకు వెళ్లింది. 2011లో 0–4తో చిత్తుగా ఓడిన జట్టు... 2014, 2018లలోనూ సిరీస్‌లు కోల్పోయింది. 2021 సిరీస్‌ను మాత్రం సమంగా ముగించగలిగింది. ఈసారి జట్టు ఇంగ్లండ్ బయల్దేరినప్పుడు కూడా ఎన్నో సందేహాలు. కోహ్లి, రోహిత్, అశ్విన్ రిటైర్ అయిన తర్వాత ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో పాటు ఎక్కువ మందికి అనుభవం పెద్దగా లేకపోవడంతో కూడా అంచనాలు తక్కువగా ఉన్నాయి.అవును.. ‘డ్రా’ కూడా గెలుపు సంబరమేభారత మాజీ క్రికెటర్లు సహా ప్రసారకర్తల బృందంలో ఉన్నవారంతా ఇంగ్లండ్ సిరీస్ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. భారత్ కొంత వరకు పోరాడుతుందని, సిరీస్ తుది ఫలితంలో మాత్రం మార్పు ఉండదని వారంతా వ్యాఖ్యానించారు. కానీ టీమిండియా తమ అసాధారణ ఆటతో అందరి నోళ్లు మూయించింది.ఈ పర్యటనకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడి, ఆపై ఆస్ట్రేలియాలో 1–3తో చిత్తయిన జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లి ఈ తరహా ఫలితంతో తిరిగి రావడం చాలా గొప్ప ప్రదర్శన. అంకెల్లో చూస్తే సిరీస్ ‘డ్రా’గా ముగిసిందని, భారత్ గెలవలేదని అనిపించవచ్చు కానీ మన కోణంలో చూస్తే ఇది విజయంతో సమానం. సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు చూసినవారు ఎవరైనా ఇదే విషయాన్ని అంగీకరిస్తారు. ఐదు టెస్టుల్లో వేర్వేరు దశల్లో, సెషన్లలో మన జట్టు ఆధిక్యం కనబర్చిన తీరు, వెనకబడిన ప్రతీసారి కోలుకున్న పట్టుదల చూస్తే ‘డ్రా’ కూడా గెలుపు సంబరమే. హోరాహోరీ పోరులో సత్తా చాటి... తొలి టెస్టులో భారత్ చిత్తుగా ఏమీ ఓడలేదు. మన జట్టు తరఫున ఐదు సెంచరీలు నమోదయ్యాయి. ఆ జట్టు దూకుడుగా ఆడి 371 పరుగులు ఛేదించగలిగింది. రెండో టెస్టులో ఏకంగా 336 పరుగులతో ఘన విజయం సాధించి సరైన రీతిలో మనం బదులిచ్చాం. లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్కోరు సమం. చివర్లో కాస్త అదృష్టం కలిసొస్తే ఈ మ్యాచ్ కూడా మన సొంతమయ్యేది. ఓల్డ్ట్రఫోర్డ్లో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 311 పరుగులు వెనుకబడి కూడా పోరులో నిలవడం, ఓటమిని తప్పించుకోవడం మన పోరాటపటిమను చూపించింది.రెండో ఇన్నింగ్స్‌లోనైతే సున్నాకి 2 వికెట్లు కోల్పోయిన తర్వాత మరో 2 వికెట్లు మాత్రమే చేజార్చుకొని 425 పరుగులు చేయడం అసాధారణం. ఒకదశలో ‘డ్రా’ కోసం ఇంగ్లండ్ ముందుకు రావడం, మన ఆటగాళ్లు నిరాకరించడం జట్టులో పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. ఇది తర్వాతి టెస్టులో కనిపిస్తుందని వేసిన అంచనాలు సరిగ్గా నిజమయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసి, ఆపై దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే నిలువరించగలిగింది. ఆకట్టుకున్న వ్యక్తిగత ప్రదర్శనలు... సిరీస్‌లో సమష్టి ప్రదర్శన జట్టును ముందంజలో నిలిపింది. సిరాజ్ 23 వికెట్లు పడగొట్టగా, 3 మ్యాచ్‌లలో బుమ్రా 14 వికెట్లు తీశాడు. పరుగులు భారీగా ఇచ్చినా... ప్రసిధ్ కృష్ణ (14), ఆకాశ్‌దీప్ (13) కీలక సమయాల్లో వికెట్లు తీశారు. జడేజా బౌలర్‌గా విఫలమైనా ఆ లోటును బ్యాటింగ్‌తో పూరించాడు. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేసి తామేంటో చూపించారు.శుబ్‌మన్ గిల్ (754), కేఎల్ రాహుల్ (532), జడేజా (516) చెలరేగగా... పంత్ (479), జైస్వాల్ (411) కూడా తమవంతు పాత్ర పోషించారు. మున్ముందు అశ్విన్ స్థానాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయగల ఆల్‌రౌండర్‌గా సుందర్ నిరూపించుకున్నాడు. మాంచెస్టర్‌లో సెంచరీతో పాటు చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను బాదిన 4 సిక్సర్లు తుది ఫలితంపై ప్రభావం చూపాయి. క్రికెట్‌ను మరో అవకాశం అడిగిన కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడకపోయినా...చివరి టెస్టు హాఫ్ సెంచరీ అతడికి మరో అవకాశం కల్పించవచ్చు.ఇద్దరికీ పాస్ మార్కులు... గెలుపు విలువ వారికే తెలుసుఈ టెస్టు సిరీస్ ప్రధానంగా కెప్టెన్‌గా గిల్, కోచ్ గంభీర్‌లకు వ్యక్తిగతంగా ఎంతో కీలకమైంది. ఈ సిరీస్‌కు ముందు పేలవ సగటుతో బ్యాటర్‌గా కూడా గొప్ప రికార్డు లేని గిల్ అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా కూడా నిరూపించుకోవాల్సిన స్థితి. ఇందులో ఏది విఫలమైనా అతనిపై తీవ్ర విమర్శలు వచ్చేవి. అయితే గిల్ ఇప్పుడు విజయవంతంగా దీనిని ముగించాడు. టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు కెప్టెన్‌గా సిరీస్‌ను కోల్పోలేదు.అక్కడక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా తొలి సిరీస్ కాబట్టి క్షమించే పరిస్థితి ఉంది. ఇక గత రెండు టెస్టు సిరీస్‌లు కోల్పోయిన తర్వాత గంభీర్‌పై కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. ముఖ్యంగా కోహ్లి, రోహిత్‌లను తానే సాగనంపి జట్టుపై పూర్తి పట్టు పెంచుకున్నాడనే వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో అతని ప్రతీ ప్రణాళికపై అందరి దృష్టీ ఉంది.ముఖ్యంగా ఇక్కడ ఓడితే కొన్ని అనూహ్య ఎంపికలకు అతను సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చేది. ఇక తాజా ప్రదర్శనతో గంభీర్ నిశ్చింతగా ఉండవచ్చు. భారత్ తమ తదుపరి టెస్టు సిరీస్‌ను స్వదేశంలో వెస్టిండీస్‌తో ఆడనుంది. 27 ఆలౌట్ తర్వాత ఆ జట్టు ఆడనున్న తొలి మ్యాచ్ ఇక్కడే కానుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత మన జట్టు ప్రదర్శనను విశ్లేషిస్తే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా జోరు కొనసాగడం ఖాయం. -సాక్షి క్రీడా విభాగం చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్.... గూస్బంప్స్ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్ -
గిల్ కాదు!.. ఆ అవార్డుకు అతడే అర్హుడు: మాట మార్చేసిన మెకల్లమ్
టెస్టు క్రికెట్ ప్రేమికులకు మజా అందించిన ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సోమవారంతో ముగిసింది. ఇంగ్లండ్- భారత్ (IND vs ENG) మధ్య జరిగిన ఈ ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమైంది. ఓవల్ మైదానంలో ఆఖరి రోజు వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఐదో టెస్టులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో జయభేరి మోగించి.. ఈ మేరకు సిరీస్‌ను డ్రా చేసుకుంది.ఇక చివరి టెస్టులో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో పాటు.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకున్నారు.నాలుగో రోజు వరకు గిల్‌కే ఓటుఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు నామినేషన్ల గురించి భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. టీమిండియా హెడ్‌కోచ్ హ్యారీ బ్రూక్ ప్రతిపాదించగా.. ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ శుబ్‌మన్ గిల్ పేరు చెప్పాడట.అయితే, ఐదో టెస్టు ఆట ఐదో రోజుకు చేరే సరికి మెకల్లమ్ తన నిర్ణయాన్ని మార్చుకోవడం విశేషం. గిల్‌ను కాదని సిరాజ్‌కు ఈ అవార్డు ఇస్తే బాగుంటుందని మెకల్లమ్ భావించాడట. ఈ విషయం గురించి కామెంట్రీ ప్యానెల్లో ఉన్న దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ మ్యాచ్ నాలుగో రోజే ముగిసి ఉంటే.. శుబ్‌మన్ గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు.బ్రెండన్ మెకల్లమ్ గిల్ పేరే చెప్పాడు. ఇందుకు తగ్గట్లుగానే మైక్ ఆథర్టన్ ప్రజెంటేషన్‌లో అడగాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసుకున్నాడు. శుబ్‌మన్ గిల్‌కు సంధించే ప్రశ్నల జాబితా రెడీ చేసుకున్నాడు.మాట మార్చేసిన మెకల్లమ్కానీ.. అరగంట.. 40 నిమిషాలు గడిచిన తర్వాత మెకల్లమ్ మహ్మద్ సిరాజ్ పేరు ప్రతిపాదించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ కూడా సిరాజ్ బౌలింగ్‌ను ఆస్వాదించానని చెప్పాడు’’ అని పేర్కొన్నాడు.కాగా ఐదో టెస్టులో సిరాజ్ మొత్తంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. గిల్ సిరీస్ మొత్తంలో కలిపి రికార్డు స్థాయిలో ఏకంగా 754 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 269. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులోనే గిల్ 430 (269+161) పరుగులు రాబట్టడం విశేషం.మరోవైపు.. హ్యారీ బ్రూక్ ఐదు టెస్టుల్లో కలిపి.. రెండు శతకాల సాయంతో 481 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 158. ఆఖరి టెస్టులో అతడు 98 బంతుల్లోనే 111 పరుగులు సాధించడం విశేషం. దీంతోనే మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లగా.. సిరాజ్ అద్భుత డెలివరీతో ఆఖరి వికెట్ తీసి.. భారత జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్👉టీమిండియా- 224 & 396👉ఇంగ్లండ్- 247 & 367✊ఆరు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం.చదవండి: నేనే గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటేనా: సిరాజ్ ఎమోషనల్.. గిల్ రియాక్షన్ వైరల్ -
నేను ఆ క్యాచ్ పట్టి ఉంటేనా: సిరాజ్ ఎమోషనల్.. గిల్ రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) క్యాచ్ మిస్ చేయడంపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) స్పందించాడు. తాను ఒకవేళ ఆ క్యాచ్ సరిగ్గా పట్టి ఉంటే.. ఆట ఐదో రోజుకు చేరి ఉండకపోయేదని అభిప్రాయపడ్డాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా కలిగిన బ్రూక్ విషయంలో తాను చేసిన పొరపాటు వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.ఓటమి అంచుల వరకు వెళ్లి..ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్‌లో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా అద్భుతం చేసింది. ఓటమి అంచుల వరకు వెళ్లి గెలుపులోని అసలైన మజాను రుచిచూసింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేసింది. నిజానికి ఓవల్ టెస్టులో టీమిండియా విజయంలో సిరాజ్‌దే కీలక పాత్ర.బౌండరీ లైన్ తొక్కేయడంతోనరాలు తెగే ఉత్కంఠ నడుమ.. ఇంగ్లండ్ విజయానికి ఏడు పరుగులు.. భారత్ గెలుపునకు ఒక వికెట్ దూరంలో ఉన్న వేళ.. సిరాజ్ ఆఖరి.. ఆ ఒక్క వికెట్ తీసి.. జట్టుకు సంచలన విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా సిరాజ్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.అయితే, నాలుగో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ ప్రమాదకర బ్యాటర్ హ్యారీ బ్రూక్.. 19 పరుగల వద్ద ఉండగా.. లడ్డూ లాంటి క్యాచ్ ఇచ్చాడు. ఫైన్ లెగ్‌లో ఉన్న సిరాజ్ దీనిని ఒడిసిపట్టినా.. బౌండరీ లైన్ తొక్కేయడంతో బ్రూక్‌కు లైఫ్ లభించింది.Out? Six!?What's Siraj done 😱 pic.twitter.com/hp6io4X27l— England Cricket (@englandcricket) August 3, 2025నిన్ను నువ్వు నమ్ముఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. 98 బంతుల్లోనే 111 పరుగుల సాధించి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పాడు. అయితే, ఆఖరికి.. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో మళ్లీ సిరాజే బ్రూక్ క్యాచ్ పట్టాడు.టీమిండియా విజయానంతరం సిరాజ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించాడు. ‘‘మొదటి రోజు నుంచి ఎంతో పోరాటపటిమ కనబర్చాం. ఇలాంటి ఫలితం రావడం చాలా సంతోషంగా ఉంది. సరైన చోట నిలకడగా బంతులు వేసి ఒత్తిడి పెంచాలనేదే నా వ్యూహం. ‘నిన్ను నువ్వు నమ్ము’ అని రాసి ఉన్న ఒక ఫోటోను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను.నిజానికి హ్యారీ బ్రూక్ అసాధారణ ఆటగాడు. కొంతమంది డిఫెన్సివ్‌గా ఉంటారు కానీ... అతడు మాత్రం ఎల్లప్పుడూ అటాకింగ్ మోడ్‌లో ఉంటాడు. నేను గనుక అప్పుడే ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది.అదొక గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అయ్యేది. అయితే, సీనియర్ బౌలర్‌గా నాకున్న పరిణతితో.. ఈ భారాన్ని మోయడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏదీ లేదని నాకు తెలుసు. ‘జరిగిందేదో జరిగిపోయింది. ఆటలో ఇలాంటివి సహజం’ అని నన్ను నేను సముదాయించుకున్నాను’’ అంటూ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు.గిల్ రియాక్షన్ వైరల్ఇంతలో పక్కనే ఉన్న కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కలుగజేసుకుంటూ.. ‘‘ఒకవేళ మేము ఆ క్యాచ్ పట్టి ఉంటే.. ఇంకాస్త సులువుగా గెలిచేవాళ్లం. మేము చాలా గొప్పగా ఆడాము.. అవునా? కాదా?’’ అంటూ సిరాజ్‌కు అండగా నిలిచాడు. గిల్ అలా అనగానే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు నవ్వులు చిందించారు.చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్.... గూస్బంప్స్ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్ All heart. All hustle. All 𝘋𝘩𝘢𝘢𝘬𝘢𝘥 💪A fightback that will go down in Indian cricket history ✨#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/bvXrmN5WAL— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025 -
కన్నీటిపర్యంతమైన గంభీర్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న వీడియో!
‘‘గౌతమ్ గంభీర్.. వన్డే, టీ20 ఫార్మాట్లకు కోచ్‌గా ఫర్వాలేదు. కానీ టెస్టులకు మాత్రం అతడు పనికిరాడు. అతడు హెడ్‌కోచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత పసికూన బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయాన్ని మినహాయిస్తే.. టీమిండియా అత్యంత ఘోరమైన పరాజయాలు చవిచూసింది.సొంతగడ్డపై చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా న్యూజిలాండ్ (IND vs NZ)తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్ అయింది. అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (IND vs AUS)ని చేజార్చుకుంది.ఇదంతా ఒక ఎత్తైతే.. ఇంగ్లండ్ టూర్‌కు ముందే దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడానికి గంభీర్ కూడా ఓ కారణం. అంతేకాదు.. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కెప్టెన్ కావడంలోనూ గౌతీదే కీలక పాత్ర.దిగ్గజాలు లేకుండా గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద గెలవాల్సిన తొలి జట్టులో టీమిండియా ఓడిపోవడానికి కోచ్, కెప్టెన్ వ్యూహాలు సరిగ్గా లేకపోవడమే కారణం’’.. ఇటీవలి కాలంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై వచ్చిన విమర్శలూ, ఆరోపణలూ ఇవీ. టెస్టుల్లో భారత్ వరుసగా విఫలం కావడంతో అతడిని కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లూ వచ్చాయి.ఈ సిరీస్ కూడా సమర్పయామి అంటూ..అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత గౌతీపై విమర్శల దాడికి కాస్త బ్రేక్ పడింది. కానీ ఆ తర్వాత మళ్లీ పాత కథే పునరావృతమైంది.లార్డ్స్ టెస్టులో ఓటమి.. మాంచెస్టర్‌లో మ్యాచ్ డ్రా కావడం.. ఆఖరిగా ఓవల్‌లో ఐదో టెస్టులోనూ ఆఖరి రోజు వరకు ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో ఉండటంతో .. ఇక ఈ సిరీస్ కూడా సమర్పయామి అంటూ మళ్లీ గంభీర్‌పై విమర్శలు మొదలయ్యాయి.అయితే, చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ టెస్టులో భారత్ సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్ విజయానికి 17 పరుగులు.. టీమిండియా విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉన్నవేళ ప్రసిద్ కృష్ణ జోష్ టంగ్‌ను బౌల్డ్ చేసి తొమ్మిదో వికెట్ పడగొట్టాడు.అద్భుతం చేసిన సిరాజ్ఇక విజయ సమీకరణాలు 7 పరుగులు.. ఒక వికెట్‌గా మారగా మహ్మద్ సిరాజ్ మరోసారి అద్భుతమే చేశాడు. అద్భుతమైన డెలివరీతో గస్ అట్కిన్సన్ను బౌల్డ్ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ దృశ్యాల్ని చూస్తున్న సగటు అభిమానులతో పాటు కోచ్ గంభీర్ హృదయం ఉప్పొంగిపోయింది.గంభీర్ కన్నీటి పర్యంతంగతంలో ఎన్నడూ లేనివిధంగా గౌతీ కంట నీరొలికింది. తీవ్ర భావోద్వేగానికి లోనైన గంభీర్.. సహచర సిబ్బందిని గట్టిగా ఆలింగనం చేసుకుని వారిని ఆప్యాయంగా ముద్దాడాడు. ఆనందభాష్పాలు రాలుస్తూ టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. గంభీర్‌కు ఈ గెలుపు ఎంత ముఖ్యమో.. ఎంత అవసరమో తెలియజేయడానికి ఈ దృశ్యాలు చాలు!!ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ‘‘నిజంగా ఈ వీడియో గూప్‌బంప్స్ తెప్పిస్తోంది భయ్యా. టీమిండియాకు, గంభీర్‌కు శుభాకాంక్షలు’’ అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓవల్‌లో విజయంతో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉భారత్- 224 & 396👉ఇంగ్లండ్- 247 & 367✊ఆరు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచిన భారత్.చదవండి: నన్ను నమ్మినందుకు థాంక్యూ విరాట్ భయ్యా: మహ్మద్ సిరాజ్𝗕𝗲𝗹𝗶𝗲𝗳. 𝗔𝗻𝘁𝗶𝗰𝗶𝗽𝗮𝘁𝗶𝗼𝗻. 𝗝𝘂𝗯𝗶𝗹𝗮𝘁𝗶𝗼𝗻!Raw Emotions straight after #TeamIndia's special win at the Kennington Oval 🔝#ENGvIND pic.twitter.com/vhrfv8ditL— BCCI (@BCCI) August 4, 2025 -
శభాష్ సిరాజ్ మియా.. ఓవల్ టెస్ట్‌లో టీమిండియా చిరస్మరణీయ విజయం (ఫొటోలు)
-
IND Vs ENG: జో జీతా వహి సిరాజ్
సిరీస్‌లో ఐదు టెస్టులూ చివరి వరకు ఆడిన ఏకైక పేస్ బౌలర్. ఏకంగా 1113 బంతులు... సిరీస్ తొలిరోజు నుంచి చివరిరోజు వరకు బౌలింగ్‌లో అదే వేగం, అంతే తీవ్రత... ప్రతీ బంతి వేసే సమయంలో 100 శాతం ఇవ్వాలనే తపన... చేసే పని భారంగా అనిపించలేదు... సుదీర్ఘ సిరీస్‌లో విశ్రాంతి తీసుకోలేదు. గాయంతో తప్పుకోలేదు, మ్యాచ్ మధ్యలో ఫిట్నెస్ సమస్యలతో ఒక్కసారి కూడా బౌలింగ్‌కు దూరం కాలేదు... చివరకు అద్భుత రీతిలో మ్యాచ్‌ను గెలిపించే వరకు ఆగిపోలేదు... ఇలాంటి పోరాటతత్వం, పట్టుదల హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్కే సాధ్యమైంది. 185.3 ఓవర్ల బౌలింగ్ తర్వాత కూడా అతను అలసిపోకుండా ఇప్పుడు మళ్లీ బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండి ‘సై’ అంటున్నాడు. ఈ సిరీస్‌లో అతని ప్రదర్శనను ప్రశంసించనివారు లేరు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు అథర్టన్, మైకేల్ వాన్, నాసిర్ హుస్సేన్ మాటల్లో చెప్పాలంటే సిరాజ్ సింహంలా పోరాడిన ఒక ‘లయన్ హార్ట్’ బౌలర్. అసలు అతను సిరీస్ ఆసాంతం ఒకే తరహాలో అంతే దూకుడుతో ఎలా బౌలింగ్ చేస్తున్నాడో వారికి కూడా ఆశ్చర్యపర్చింది. ‘దేశం తరఫున ఆడటం అనేదే ఒక ఆటగాడికి లభించే ఎంతో గొప్ప అవకాశం. అలాంటప్పుడు నేను ఎన్ని ఓవర్లు వేశాను, ఎంత ఎక్కువగా కష్టపడుతున్నాను అన్నది అస్సలు పట్టించుకోవాల్సిన విషయమే కాదు. నాలో సత్తా ఉన్నంత వరకు బౌలింగ్ చేస్తూనే ఉంటాను. అదృష్టవశాత్తూ ఇప్పుడు కూడా నేను ఫిట్‌గా ఉన్నాను’... చివరి టెస్టు ముగిసిన తర్వాత భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ వ్యాఖ్య ఇది. ముందుండి నడిపిస్తూ... టాప్ పేసర్ బుమ్రా మూడు టెస్టులే ఆడతాడని ఖాయమయ్యాక సహజంగానే సీనియర్ అయిన సిరాజ్‌పై ఎక్కువ బాధ్యత నిలిచింది. దానిని అతను సమర్థంగా నిర్వర్తించాడు. జట్టుకు అవసరమైన ప్రతీ సందర్భంలోనూ సిరాజ్ నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. కొత్త బంతి ఇస్తే దానిని సమర్థంగా ఉపయోగించాడు. కాస్త పాతబడిన బంతిని అప్పగిస్తే డ్యూక్ బంతులను వాడుకుంటూ స్వింగ్‌లో చెలరేగడం అతనికే చెల్లింది. కెప్టెన్ గిల్ అయితే ఇక చాలు బౌలింగ్ చేయలేడు అనిపించిన సమయాల్లో కూడా మళ్లీ సిరాజ్కే బంతిని అప్పగించాడు. కాస్త ఘాటుగా చెప్పాలంటే చెరకు మిషన్‌లో చెరకు గడను చివరి వరకు వాడుతూ పిప్పి చేసినట్లుగా సిరాజ్‌ను గిల్ ఉపయోగించుకున్నాడు. అయినా సరే ఎక్కడా తగ్గకుండా కీలక సమయాల్లో కీలక వికెట్లతో భారత్ మ్యాచ్‌లో పైచేయి సాధించేలా చేశాడు. బుమ్రా ఆడని రెండు టెస్టుల్లో భారత్ గెలిచింది. ఎడ్జ్‌బాస్టన్‌లో 7 వికెట్లు తీసిన సిరాజ్, ఓవల్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లో అతను రెండుసార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. రెండో టెస్టులో వరుస బంతుల్లో రూట్, స్టోక్స్‌లను అవుట్ చేయడం, క్రాలీని డకౌట్ చేయడం కీలక మలుపులు కాగా... ఓవల్ తొలి ఇన్నింగ్స్‌లో అతను తీసిన పోప్, రూట్, బ్రూక్ వికెట్లతోనే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం దక్కలేదు. మూడో రోజు క్రాలీని బౌల్డ్ చేసిన బంతిని ఎవరూ మర్చిపోలేరు. చివరి రోజు బౌలింగ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిలకడగా సత్తా చాటుతూ... మాంచెస్టర్ టెస్టులో 30 ఓవర్లలో 140 పరుగులు ఇచ్చి ఒకటే వికెట్ తీసినప్పుడు సిరాజ్ బౌలింగ్‌లో పదును తగ్గినట్లు అనిపించింది. అయితే తర్వాతి మ్యాచ్‌తోనే అతను తనపై వచ్చిన సందేహాలను పటాపంచలు చేశాడు. చాలా సందర్భాల్లో బుమ్రా నీడలో ఉన్నట్లుగా కనిపించిన సిరాజ్ అవకాశం దక్కిన ప్రతీసారి తానేంటో చూపిస్తున్నాడు. బుమ్రాతో కలిసి ఆడిన టెస్టుల్లోకంటే అతను లేని టెస్టుల్లో చెలరేగిపోతున్నాడు. ఏడాదిన్నర క్రితం కేప్‌టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికాపై 15 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీసినప్పుడే టెస్టు బౌలర్‌గా సిరాజ్ స్థాయి ఎంతో పెరిగింది. ఆ్రస్టేలియాతో సిరీస్‌లోనూ 20 వికెట్లు పడగొట్టినా... బుమ్రా అసాధారణ 32 వికెట్ల బౌలింగ్‌తో పాటు భారత్ సిరీస్ ఓడటంతో అతని ప్రదర్శనకు గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు ఓడిపోతుందనుకున్న సిరీస్‌ను సమం చేయడంలో సిరాజ్ పోషించిన పాత్ర అతడిని మరో మెట్టు పైకి ఎక్కించింది. చివరగా... నాలుగో రోజు హ్యారీ బ్రూక్ క్యాచ్ వదిలేయడంతో సిరాజ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతని అద్భుత బౌలింగ్‌నూ పట్టించుకోకుండా కొందరు వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ ఓడి ఉంటే అది అతడిని ఎప్పటికీ వెంటాడేది. కానీ ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న ఈ బౌలర్ అలాంటి అవకాశం ఇవ్వకుండా ఒంటిచేత్తో మ్యాచ్‌ను ముగించాడు. భారత్‌ను గెలిపించాడు. తానూ గెలిచాడు. ప్రశంసల వెల్లువటెస్టు క్రికెట్‌కు వన్నెతెచి్చన సిరీస్ ఇది. ఆఖరి మ్యాచ్ అయితే అద్భుతం. నిజంగా రోమాలు నిక్క»ొడుచుకునేలా చేసింది. సిరీస్ ఫలితం 2–2 అయి వుండొచ్చు. కానీ... ప్రదర్శనతో 10కి 10 మార్కులు తెచ్చుకున్నారు. టీమిండియన్స్ అంతా సూపర్‌గా ఆడారు. –భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కనబరిచిన నిబద్ధత, అంకితభావానికి హ్యాట్సాఫ్. సిరాజ్‌కు నా ప్రత్యేక అభినందనలు. జట్టు కోసం ఏదైనా చేసేందుకు ముందువరుసలో సిద్ధంగా ఉంటాడు. –విరాట్ కోహ్లిసంప్రదాయ క్రికెట్‌కు ఉన్న మ్యాజిక్‌ను ఆవిష్కరించిన మ్యాచ్ ఇది. ఓవల్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. అసాధారణ ఆటతీరుతో టెస్టు ఇమేజ్ పెంచిన భారత్, ఇంగ్లండ్ జట్ల సభ్యులకు నా ప్రత్యేక ప్రశంసలు. –ఐసీసీ చైర్మన్ జై షాసాక్షి క్రీడా విభాగం -
IND Vs ENG: సమంగా... సగర్వంగా...
35 పరుగులా... 4 వికెట్లా... ఓవల్ మైదానంలో అన్ని వైపులా తీవ్ర ఉత్కంఠ... ప్రసిధ్ కృష్ణ వేసిన తొలి రెండు బంతుల్లో ఒవర్టన్ 2 ఫోర్లు కొట్టడంతో చేయాల్సిన దాంట్లో 20 శాతం పరుగులు ఇంగ్లండ్‌కు వచ్చేశాయి... కానీ ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్ మొదలు పెట్టడంతో ఆట మళ్లీ మలుపు తిరిగింది. లక్ష్యం ఛేదించగల సత్తా ఉన్న జేమీ స్మిత్‌తోపాటు ఒవర్టన్‌ను వరుస ఓవర్లలో సిరాజ్ వెనక్కి పంపాడు. ఒకవైపు వాన పెద్దదిగా మారుతోంది... మళ్లీ ఆట ఆగిపోతుందా అనే సందేహాల నడుమ జోష్ టంగ్‌ను ప్రసిధ్ అవుట్ చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో జట్టును కాపాడేందుకు వోక్స్ చేతికి కట్టుతోనే క్రీజ్‌లోకి వచ్చాడు. ఒంటిచేత్తో సహచరుడికి అండగా నిలిచేందుకు అతను సిద్ధమయ్యాడు. సిరాజ్ ఓవర్లో అట్కిన్సన్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఆకాశ్‌దీప్ సరిగా అంచనా వేయక పోవడంతో అది సిక్స్‌గా మారింది. తర్వాతి ఓవర్లో మరో 3 పరుగులు రావడంతో లక్ష్యం ఇంకా తగ్గిపోయింది. కానీ మరుసటి ఓవర్ వేసిన సిరాజ్ తొలి బంతికే అద్భుతం చేశాడు. లో ఫుల్‌టాస్ బంతి అట్కిన్సన్ స్టంప్‌ను పడగొట్టడంతో భారత బృందం సంబరాల్లో మునిగిపోయింది. లార్డ్స్ టెస్టులో 23 పరుగులు చేయాల్సిన సమయంలో అనూహ్య రీతిలో చివరి వికెట్‌గా అవుటై గుండె పగిలిన సిరాజ్ ఇప్పుడు విజయానికి బాగా చేరువైన ప్రత్యరి్థని చివరి వికెట్‌గా అవుట్ చేసి జట్టును గెలిపించడం సినిమా స్క్రిప్‌్టకు ఏమాత్రం తగ్గని క్లైమాక్స్... సిరీస్ ఆద్యంతం 25 రోజుల పాటు (ఐదు టెస్టులు) రసవత్తరంగా సాగిన పోరును భారత్ సగర్వంగా ముగించింది. ఎన్నో మలుపులతో ఆధిపత్యం చేతులూ మారుతూ వచి్చన 73 సెషన్లలో చివరి క్షణాల్లో ఒత్తిడిని అధిగమించిన టీమిండియా ఈ సిరీస్‌ను సమం చేయడం విశేషం. లండన్: ఇంగ్లండ్ పర్యటనను భారత్ ఘనంగా ముగించింది. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ను 2–2తో సమం చేసింది. సోమవారం ఓవల్ మైదానంలో ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల అతి స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. విజయం కోసం రెండో ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్... ఓవర్‌నైట్ స్కోరు 339/6తో చివరి రోజు ఆటలో బరిలోకి దిగింది. అయితే ఆ జట్టు మరో 8.5 ఓవర్ల ఆటలో మరో 28 పరుగులు చేసి మిగిలిన వికెట్లు కోల్పోయింది. చివరకు 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు తీసి భారత్ విజయంలో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ టెస్టులో 9 వికెట్లు పడగొట్టిన సిరాజ్కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్ తరఫున శుబ్‌మన్ గిల్ (754 పరుగులు), ఇంగ్లండ్ తరఫున హ్యరీ బ్రూక్ (481 పరుగులు) ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు అందుకున్నారు. ఈ సిరీస్‌లో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో, లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవగా... బరి్మంగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టును భారత్ గెలుచుకుంది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) సిరాజ్ 14; డకెట్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 54; పోప్ (ఎల్బీ) (బి) సిరాజ్ 27; రూట్ (సి) జురేల్ (బి) ప్రసిధ్ 105; బ్రూక్ (సి) సిరాజ్ (బి) ఆకాశ్‌దీప్ 111; బెతెల్ (బి) ప్రసిధ్ 5; స్మిత్ (సి) జురేల్ (బి) సిరాజ్ 2; ఒవర్టన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 9; అట్కిన్సన్ (బి) సిరాజ్ 17; టంగ్ (బి) ప్రసిధ్ 0; వోక్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (85.1 ఓవర్లలో ఆలౌట్) 367. వికెట్ల పతనం: 1–50, 2–82, 3–106, 4–301, 5–332, 6–337, 7–347, 8–354, 9–357, 10–367. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 20–4–85–1, ప్రసిధ్ కృష్ణ 27–3–126–4, సిరాజ్ 30.1–6–104–5, వాషింగ్టన్ సుందర్ 4–0–19–0, రవీంద్ర జడేజా 4–0–22–0.రెండు జట్లూ తమ అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తూ అద్భుతంగా ఆడాయి. సిరాజ్, ప్రసిద్లాంటి బౌలర్లు జట్టులో ఉంటే కెప్టెన్సీ సులువవుతుంది. వీరిద్దరు ఈ రోజు చాలా బాగా బౌలింగ్ చేశారు. ఇంగ్లండ్ ఒత్తిడిలో ఉందని మాకు నాలుగో రోజే తెలుసు. దానినే కొనసాగించాలని భావించాం. సిరీస్‌లో ఆట జరిగిన తీరును బట్టి చూస్తే 2–2 సరైన ఫలితం. బ్యాటర్‌గా నేను అత్యధిక పరుగులు చేయాలని సిరీస్‌కు ముందు లక్ష్యంగా పెట్టుకున్నాను. దానిని సాధించడం కూడా సంతృప్తిగా ఉంది. ఎన్నడూ ఓటమిని అంగీకరించకూడదని ఈ సిరీస్ జరిగిన ఆరు వారాల్లో నేర్చుకున్నాను. – శుబ్‌మన్ గిల్, భారత జట్టు కెప్టెన్ -
నన్ను నమ్మినందుకు థాంక్యూ విరాట్ భయ్యా: మహ్మద్ సిరాజ్
"నేను జస్సీ భాయ్ (జస్ప్రీత్ బుమ్రా) మాత్రమే నమ్ముతాను. ఎందుంటే అతడొక గేమ్ ఛేంజర్". టీ20 ప్రపంచకప్-2024 విజయనంతరం మహ్మద్ సిరాజ్ చెప్పిన మాటలు ఇవి. ఆ సందర్భంగా సిరాజ్ ఇంగ్లీష్ సరిగ్గా మాట్లడకపోవడంతో చాలా మంది ట్రోలు చేశారు.కానీ ఇప్పుడు అవే మాటలు సిరాజ్‌కు సరిపోతాయి. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో సిరాజ్ పేరు మారు మ్రోగుపోతుంది. ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ మియా సంచలనం సృష్టించాడు. బుమ్రా పక్కన లేకపోయినప్పటికి ప్రత్యర్ధులను బెంబెలెత్తించాడు.భారత పేస్ ధళ నాయకుడిగా నిప్పులు చెరిగాడు. ఓటమి కోరుల్లో చిక్కుకున్న తన జట్టును వారియర్‌లా విజయతీరాలకు చేర్చాడు. విశ్రాంతి, విరామం లేకుండా ఓ యోదుడులా పోరాడాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి భారత జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్ ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ క్రమంలో సిరాజ్‌పై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు."ఓవల్‌లో టీమిండియా గొప్ప విజయం సాధించింది. సిరాజ్, ప్రసిద్ద్ల పట్టుదల, దృఢ సంకల్పం వల్లే భారత్‌కు ఈ అద్బుతమైన విజయం దక్కింది. జట్టు కోసం ప్రతీసారి ముందుండి పోరాడే సిరాజ్ ని చూస్తే చాలా ఆనందంగా ఉంది " అని విరాట్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా కోహ్లి ట్విట్‌పై సిరాజ్ స్పందించాడు. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు భయ్యా అంటూ సిరాజ్ రిప్లే ఇచ్చాడు.చదవండి: అతడొక సంచలనం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్ -
హైదరాబాది స్టైల్లో సిరాజ్‌పై ఓవైసీ ప్రశంసలు
సాక్షి,హైదరాబాద్: చివరి వరకు ఉత్కంఠగా సాగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఆరుపరుగుల తేడాతో ప్రత్యర్ధి జట్టు ఇంగ్లండ్‌ను భారత్ మట్టి కరిపించింది.ఈ మ్యాచ్ విజయంతో సిరీస్2-2 సమమైంది.మమ్మద్ సిరాజ్ ఈ సిరీస్‌లో మొత్తం 23 వికెట్లు తీసి మెరుపులు మెరిపించాడు.చివరి మ్యాచ్‌లో అతడు తీసిన ఫైవ్ వికెట్ హల్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.అయితే నరాలు తెగే ఉత్కంఠ పోరులో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన మహ్మద్ సిరాజ్‌పై హైదరాబాద్ ఎంపీ అహ్మద్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా సిరాజ్‌ను హైదరాబాద్ స్టైల్లో పొగడ్తలతో ముంచెత్తాడు. సిరాజ్ ‘ఎప్పుడూ విజేతే @mdsirajofficial! మన హైదరాబాదీలో మాట్లాడతే.. పూరా ఖోల్ దియే పాషా!’అంటూ అభినందించాడు. Always a winner @mdsirajofficial! As we say in Hyderabadi, poora khol diye Pasha! pic.twitter.com/BJFqkBzIl7— Asaduddin Owaisi (@asadowaisi) August 4, 2025 -
చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
ది ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. తన సంచలన బౌలింగ్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సిరాజ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సిరాజ్ సాధించిన రికార్డులు ఇవే..👉ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. సిరాజ్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో 46 టెస్టు వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది.కపిల్ దేవ్ తన టెస్టు కెరీర్లో ఇంగ్లండ్ గడ్డపై 43 వికెట్లు సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌లో స్మిత్‌ను ఔట్ చేసి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో జస్ప్రీత్ బుమ్రా(51), ఇషాంత్ శర్మ(51) సంయుక్తంగా ఆగ్రస్ధానంలో ఉన్నారు.👉అదేవిధంగా ఇంగ్లండ్‌లో జరిగిన ఒక టెస్టు సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డును సిరాజ్ సమం చేశాడు. బుమ్రా 2021-22 పర్యటనలో ఇంగ్లండ్‌పై 23 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మరో వికెట్ తీసి ఉంటే బుమ్రాను ఆధిగమించేవాడు.👉వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ హిస్టరీలో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన నాలుగో బౌలర్‌గా అక్షర్ పటేల్ రికార్డును సిరాజ్ సమం చేశాడు. అక్షర్ ఇప్పటివరకు 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించగా.. సిరాజ్ కూడా సరిగ్గా ఐదు సార్లు ఈ ఫీట్ సాధించాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక త్యధిక సార్లు ఫైవ్ వికెట్ హల్ సాధించిన బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా (12) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత అశ్విన్ (11), రవీంద్ర జడేజా (6) జడేజా కొనసాగుతున్నారు.ఇక ఈ సిరీస్‌లో సిరాజ్(23 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.చదవండి: అతడొక సంచలనం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్ -
అతడొక సంచలనం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా అద్బుతమైన విజయంతో ముగించింది. ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో 6 పరుగుల తేడాతో భారత్ చారిత్రత్మక విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్ధిని ఓడించి సిరీస్‌ను 2-2తో భారత్ సమం చేసింది.374 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ సైతం ఆఖరివరకు పోరాడింది. ఓటమి తప్పదనుకున్న చోట భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ అద్బుతం చేశారు. 339/6 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ నాలుగు వికెట్లు సాధించారు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి సిరాజ్ తొమ్మిది, ప్రసిద్ద్ 8 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. కీలక మ్యాచ్‌లో గెలిసి సిరీస్ సమం చేసినందుకు సంతోషంగా ఉందని గిల్ అన్నాడు."ఈ సిరీస్ అసాంతం రెండు జట్లు(భారత్, ఇంగ్లండ్) అద్బుతమైన ప్రదర్శన కనబరిచాయి. ఈ మ్యాచ్ ఐదో రోజు విషయానికి వస్తే.. ఇరు జట్లకు సమంగా విజయ అవకాశాలు ఉండేవి. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఆఖరికి ఈ ఉత్కంఠపోరులో మేము పై చేయి సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.అందుకే కొత్త బంతిని తీసుకోలేదు..సిరాజ్, ప్రసిద్ద్ లాంటి బౌలర్లు ఇంత అద్బుతంగా బౌలింగ్ చేస్తే ఎవరికైనా కెప్టెన్సీ చాలా సులభం అనిపిస్తుంది. వారిద్దరూ మ్యాచ్ విన్నింగ్ స్పెల్ బౌలింగ్ చేశారు. పాత బంతితో మాకు ఎటువంటి సమస్యలేదన్పించింది. బంతి రెండు వైపులా మంచిగా మూవ్ అయింది. అందుకే కొత్త బంతిని తీసుకులేదు. అయితే ఆరంభంలో మాపై కొంత మాపై ఒత్తడి ఉండేది. కానీ గెలుస్తామన్న నమ్మకం అయితే మాకు ఉండేది. వారిని ఒత్తిడి గురిచేయాలనుకున్నాము. ఒత్తిడిలో ఎటువంటి జట్టు అయినా తప్పిదాలు చేస్తోంది. మా ప్రణాళికలకు తగ్గట్టే బౌలర్లు అద్బుతంగా రాణించారు.ఒక్కడు చాలు..సిరాజ్ ఒక సంచలనం. అటువంటి బౌలర్ ఒకరు జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ మొత్తం అతడు ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ప్రతీ బంతిని ప్రాణం పెట్టి బౌలింగ్ చేస్తాడు.ఈ విజయానికి మేము అన్ని రకాల ఆర్హులం. ఇక ఈ సిరీస్‌లో టాప్ రన్‌స్కోరర్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు నేను చాలా కష్టపడ్డాడు. ఈ సిరీస్‌లో బెస్ట్ బ్యాటర్‌గా ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పుడు నా లక్ష్యాన్ని అందుకున్నాను" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. ఓవల్‌లో భారత్ చారిత్రత్మక విజయంसूरमा नहीं विचलित होते,क्षण एक नहीं धीरज खोते,विघ्नों को गले लगाते हैं,काँटों में राह बनाते हैं।#INDvsENGTest #OvalTest pic.twitter.com/j7W0q1y2RY— Office of Shivraj (@OfficeofSSC) August 4, 2025 -
ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. ఓవల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలోని ఆఖరి మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన టెస్టు క్రికెట్ మజాను అందించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై 6 పరుగుల తేడాతో టీమిండియా సంచలన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. ఈ విజయంలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌ది కీలక పాత్ర.సిరాజ్ అద్భుతం..లార్డ్స్ టెస్టులో బ్యాట్‌తో జట్టును గెలిపించలేకపోయిన సిరాజ్.. ఓవల్‌లో మాత్రం బంతితో తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ కీలక పోరులో సిరాజ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా లేని లోటును తెలియనివ్వలేదు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తాచాటాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.తొలి ఓవర్లోనే.. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరమవ్వగా.. భారత్ 4 వికెట్లు కావాల్సి వచ్చాయి. క్రీజులో జేమీ ఓవర్టన్, స్మిత్ ఉండగా.. తొలి ఓవర్ వేసే బాధ్యతను ప్రసిద్ద్ కృష్ణకు గిల్ అప్పగించాడు. అయితే ఆ ఓవర్లో ప్రసిద్ద్ వేసిన తొలి బంతినే ఓవర్టన్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత నాలుగో బంతికి ఫోర్ రావడంతో ఓ ఓవర్లో ఇంగ్లండ్‌కు 8 పరుగులు లభించాయి. ఇంగ్లండ్ విజయసమీకరణం 27 పరుగులు మారింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌తో పాటు అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.మియా ఎంట్రీ..ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన సిరాజ్ మియా.. తన వేసిన తొలి ఓవర్లోనే స్మిత్‌ను ఔట్ చేసి భారత శిబిరంలో గెలుపు ఆశలు చిగురించేలా చేశాడు. ఆ తర్వాత జేమీ ఓవర్టన్ను సిరాజ్ అద్బుతమైన ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. ఈ సమయంలో సిరాజ్‌కు ప్రసిద్ద్ తోడయ్యాడు.సంచలన బంతితో టెయిలాండర్ టంగ్‌ను ప్రసిద్ద్ బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. భుజం ఎముక విరిగినప్పటికి తన జట్టు కోసం వోక్స్ మైదానంలో అడుగుపెట్టాడు. నొప్పిని భరిస్తూనే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో అట్కిన్సన్కు సపోర్ట్‌గా వోక్స్ నిలిచాడు. అనంతరం 84వ ఓవర్లో సిరాజ్ బౌలింగ్‌లో అట్కిన్సన్ సిక్సర్ కొట్టడంతో మళ్లీ టెన్షన్ నెలకొంది. అంతకుతోడు ధ్రువ్ జురెల్ రనౌట్ మిస్ చేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.కానీ 86వ ఓవర్ వేసిన సిరాజ్ మియా.. అద్బుతమైన బంతితో అట్కిన్సన్ను బౌల్డ్ చేసి అభిమానుల ఉత్కంఠకు తెరదించాడు. దీంతో 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు ప్రసిద్ద్ కృష్ణ 8 వికెట్లతో సత్తాచాటాడు.చదవండి: ENG Vs IND: క్రికెట్ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన ఎంట్రీ.. ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు దిగిన వోక్స్ -
వాహ్ సిరాజ్ మియా.. చిరకాలం గుర్తుండిపోయేలా చేశావు..!
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన సహా మొత్తం 9 వికెట్లు తీసిన సిరాజ్.. ఆట చివరి రోజు అద్బుతం చేశాడు. ఇంగ్లండ్ గెలుపుకు 35 పరుగులు అవసరమైన దశలో తనలోని అత్యుత్తమ టాలెంట్‌ను వెలికి తీసి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్నాడు. చివరి రోజు ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్లు ఉండగా.. సిరాజ్ మ్యాజిక్ స్పెల్‌తో మూడు వికెట్లు తీశాడు. మరో వికెట్‌ను ప్రసిద్ద్ కృష్ణ పడగొట్టాడు.దీంతో ఇంగ్లండ్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. ఈ సిరీస్ మొత్తంలో సిరాజ్ విశేషంగా రాణించాడు. 5 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో అత్యధిక బంతులు వేసిన బౌలర్ కూడా సిరాజే.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలతో చెలరేగడంతో ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే భారత పేసర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో చివరి 7 వికెట్లు 66 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. సిరాజ్ చిరకాలం గర్తుండిపోయే స్పెల్ వేసి టీమిండియా అపూర్వ విజయాన్నిందించాడు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 1,3 మ్యాచ్‌లు గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్‌ల్లో నెగ్గింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. -
IND Vs ENG: సిరాజ్ అద్భుతం.. ఐదో టెస్టులో టీమిండియా సంచలన విజయం
లండన్‌లోని ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో 6 పరుగుల తేడాతో టీమిండియా సంచలన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని 2-2తో భారత్ సమం చేసింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది.ఆఖరి రోజు ఆటలో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు.. సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఓవరాల్‌గా సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.రూట్, బ్రూక్ సెంచరీలు వృథా..ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(105), హ్యారీ బ్రూక్(111) అద్బుతమైన సెంచరీలతో రాణించారు. ఓ దశలో వీరిద్దరూ తమ జట్టును సునయాసంగా గెలిపించేలా కన్పించారు. కానీ ప్రత్యర్ధి జట్టు వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో కథ తారుమారైంది.ఇంగ్లండ్ ఓటమిపాలవ్వడంతో రూట్, బ్రూక్ సెంచరీలు వృథా అయిపోయాయి. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌ను 247 పరుగులకు ముగించింది. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం భారత్ అదరగొట్టింది. యశస్వి జైశ్వాల్(118) సెంచరీ, ఆకాష్ దీప్(66), రవీంద్ర జడేజా(53), వాషింగ్టన్ సుందర్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్ధేశించింది. ఈ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు చేధించడంలో చతికలపడింది.చదవండి: IND vs ENG: ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. ఓవల్‌లో భారత్ చారిత్రత్మక విజయం -
ప్రసిద్ద్ కృష్ణకు సారీ చెప్పిన సిరాజ్.. వీడియో వైరల్!
లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. ఆఖరి రోజు ఆటలో భారత్ విజయానికి 4 వికెట్లు అవసరమవ్వగా.. ఇంగ్లడ్ తమ గెలుపునకు 35 పరుగులు దూరం నిలిచింది.తొలి సెషన్లో మ్యాచ్ ఫలితం తేలిపోనుంది. ప్రస్తుతం క్రీజులో జేమీ స్మిత్(2), జేమి ఓవర్టన్(0) ఉన్నారు. ఇంగ్లండ్‌ను ఎలాగైనా ఆలౌట్ చేసి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో భారత బౌలర్లు ఉన్నారు.అయితే మ్యాచ్ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చిన్న తప్పిదంతో విలన్‌గా మారిపోయాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించిన సిరాజ్.. ఫీల్డింగ్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు.కొంపముంచిన సిరాజ్..సెకెండ్ ఇన్నింగ్స్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ఆరంభంలోనే సిరాజ్ లైఫ్ ఇచ్చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 35వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో తొలి బంతిని హ్యారీ బ్రూక్ ఫైన్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఉన్న సిరాజ్ మియా క్యాచ్‌ను అందుకున్నాడు.అయితే క్యాచ్‌ను అందుకున్న సిరాజ్ తన వెనకే ఉన్న బౌండరీ రోప్‌ను టచ్ చేశాడు. దీంతో బ్యాటర్‌కు ఆరు పరుగులు లభించాయి. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బ్రూక్.. ఏకంగా 111 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.తర్వాత ప్రసిద్ద్ కృష్ణ వద్దకు సిరాజ్ వెళ్లి క్షమాపణలు చెప్పాడు. ప్రసిద్ద్ కృష్ణ నవ్వుతూ సిరాజ్‌ను హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే యాదృచ్ఛికంగా బ్రూక్ మళ్లీ సిరాజ్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.Prasidh Krishna was all of us, watching it unfold 😥 #SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/jB138cMO13— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2025 -
IND vs ENG: అదంతా ఫేక్.. సిరాజ్ ఎలాంటివాడంటే?!
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ (Joe Root) ప్రశంసలు కురిపించాడు. సిరాజ్ మియాను నిజమైన పోరాట యోధుడిగా అభివర్ణించిన రూట్.. అతడి లాంటి ఆటగాడు ప్రతి జట్టులోనూ ఉండాలంటూ కొనియాడాడు. కొన్నిసార్లు కోపం వచ్చినట్లు ‘నటించినా’.. నిజానికి సిరాజ్ చాలా మంచోడంటూ ప్రశంసించాడు.4 వికెట్లా?.. 35 పరుగులా?ఇంగ్లండ్- భారత్ (IND vs ENG) మధ్య ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐదు టెస్టుల్లో నాలుగు పూర్తికాగా.. ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య ఓవల్ టెస్టులో సోమవారం నాటి ఐదో టెస్టు ఐదో రోజు ఆటలో సిరీస్ ఫలితం తేలనుంది. టీమిండియా విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంటే.. ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగులు కావాలి.ఇక భారత్ విధించిన 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలవడానికి ప్రధాన కారణం.. జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111). ఈ ఇద్దరు అద్భుతమైన సెంచరీలతో రాణించి మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రూట్.. సిరాజ్‌ను ఆకాశానికెత్తాడు.అదంతా ఫేక్.. నిజానికి చాలా మంచోడు‘‘అతడికి పట్టుదల ఎక్కువ. అతడొక యోధుడు. నిజమైన పోరాట యోధుడు. అలాంటి ఆటగాడు తమ జట్టులో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. టీమిండియాను గెలిపించేందుకు సర్వస్వం ధారపోస్తాడు. అందుకు అతడిని తప్పక మెచ్చుకోవాల్సిందే.ఆటగాడిగా అతడి దృక్పథం బాగుంటుంది. ఒక్కోసారి కోపం వచ్చినట్లు నటిస్తాడు. కానీ అంతలోనే కూల్ అయిపోతాడు. నిజానికి సిరాజ్ మంచివాడు. కాకపోతే తాను కాస్త కఠినంగా ఉంటానని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడంతే!అతడు గొప్ప నైపుణ్యాలున్న ఆటగాడు. అందుకే వరుసగా వికెట్లు తీస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాడితో అతడితో తలపడటాన్ని నేను ఇష్టపడతాను. అతడి ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ చెరగదు. అతడు ఏం చేసినా అది జట్టు కోసమే!.. యువ ఆటగాళ్లకు అతడు స్ఫూర్తిదాయకం’’ అని రూట్ సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌లో ఇప్పటికే సిరాజ్ 20 వికెట్లు కూల్చి.. టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాదు ఇప్పటికే అత్యధికంగా వెయ్యి బంతులు వేశాడు కూడా!!టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు👉వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్👉టాస్: ఇంగ్లండ్.. మొదట బౌలింగ్👉తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 224👉తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోరు: 247👉రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 396👉374 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 339/6 (76.2).చదవండి: IND vs ENG: కామన్సెన్స్ లేదు.. నిజంగా సిగ్గుచేటు.. అరగంటలో ముగించేవారు!Mohammed Siraj lands a killer blow 💥He sends the set English captain back to the pavilion 👋#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @mdsirajofficial pic.twitter.com/Okwai75KaA— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2025 -
ENG VS IND 5th Test: అరుదైన ఘనత సాధించిన సిరాజ్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరీస్‌లో 1000 బంతులు వేసిన తొలి బౌలర్‌గా (ఇరు జట్ల తరఫున) అవతరించాడు. అలాగే 2002 జూన్ నుంచి ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక బంతులు బౌల్ చేసిన భారత ఫాస్ట్ బౌలర్‌గానూ నిలిచాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఈ ఘనతలు సాధించాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ కొనసాగుతున్నాడు. 5 మ్యాచ్‌ల్లో సిరాజ్ 20 వికెట్లు పడగొట్టాడు.ఐదో టెస్ట్ విషయానికొస్తే.. రసవత్తరంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111), జో రూట్ (105), జేకబ్ బేతెల్ (5) ఔట్ కాగా.. జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 3, సిరాజ్ 2, ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
అక్కడ నిల్చుని ఏం ఆలోచిస్తున్నావు సిరాజ్?.. రిక్కీ పాంటింగ్ ఫైర్!
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) తీరుపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిరాజ్ చేసిన తప్పు కారణంగా భారత జట్టు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య ఐదో టెస్టు తుది అంకానికి చేరుకుంది.దోబూచులాడుతున్న విజయంక్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందిస్తూ ఆఖరిదైన ఐదో రోజుకు చేరుకున్న ఆటలో సోమవారం ఫలితం వెలువడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే ఇంకా నాలుగు వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగుల దూరంలో నిలిచింది.నిజానికి ఓవల్ టెస్టులో టీమిండియాదే పైచేయి కావాల్సింది. కానీ హ్యారీ బ్రూక్ (Harry Brook- 111), జో రూట్ (105) శతకాలతో అదరగొట్టి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. నిజానికి బ్రూక్ 19 పరుగుల వద్దే అవుటవ్వాలి.సిరాజ్ చేసిన పొరపాటు వల్లకానీ సిరాజ్ చేసిన పొరపాటు ఇంగ్లండ్ శిబిరానికి బాగా కలిసి వచ్చింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్ వేసిన ప్రసిధ్ కృష్ణ తొలి బంతికి బ్రూక్ భారీ షాట్‌కు ప్రయత్నించగా... ఫైన్ లెగ్‌లో ఉన్న సిరాజ్ చక్కగా క్యాచ్‌ను ఒడిసిపట్టాడు.కానీ బంతి పట్టిన తర్వాత కుడికాలు కదిపి బౌండరీ లైన్ తొక్కేశాడు. దీంతో అది అనూహ్యంగా సిక్సర్ అయ్యింది. క్యాచ్ పట్టడంతోనే బౌలర్ ప్రసిధ్ సంబరం మొదలుపెడితే... సిక్సర్ కావడంతో బ్రూక్ పండగ చేసుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 137/3 మాత్రమే!ఇంగ్లండ్ ఇంకా లక్ష్యానికి 237 పరుగుల బహుదూరంలో ఉంది. ఇక్కడ బ్రూక్ ఒకవేళ నిష్క్రమించి ఉంటే... నాలుగో వికెట్ పడేది. ఇప్పటికే వోక్స్ అందుబాటులో లేకపోవడంతో చేతిలో ఉన్న 5 వికెట్లతో ఇంగ్లండ్ లక్ష్యఛేదన క్లిష్టమయ్యేది!అక్కడ నిల్చుని ఏం ఆలోచిస్తున్నావు సిరాజ్?కానీ తనకు దొరికిన లైఫ్‌లైన్‌ను సద్వినియోగం చేసుకున్న బ్రూక్ ఏకంగా సెంచరీ కొట్టేశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘అక్కడ నిల్చుని అతడు అసలు ఏం ఆలోచిస్తున్నాడు? నాకైతే అతడు బిక్కముఖం వేసుకుని చూస్తున్నాడనిపించింది.నిజానికి ఆ క్యాచ్ పట్టడానికి కదిలే పనేలేదు. ఉన్నచోటే ఉండి బంతిని ఒడిసిపట్టవచ్చు. ఈ తప్పిదం కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. బ్రూక్ ఎంత బాగా బ్యాటింగ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. టీ20 మ్యాచ్ మాదిరి టెస్టులోనూ అతడు బౌలర్లను రీడ్ చేసి అనుకున్న ఫలితాలు రాబట్టడంలో దిట్ట’’ అంటూ సిరాజ్ తీరును విమర్శించాడు.ఆట నిలిచే సమయానికి ఇలా..ఇక 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ సోమవారం వెలుతురులేమి కారణంగా ఆట నిలిచే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ రెండు, జేమీ ఓవర్టన్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ విజయానికి చేరువకావడంతో అవసరం పడితే.. ఆఖరి రోజు క్రిస్ వోక్స్ క్రీజులోకి దిగే అవకాశం ఉంది. కాగా గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఆబ్సెంట్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.చదవండి: యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్‌గా..Out? Six!?What's Siraj done 😱 pic.twitter.com/hp6io4X27l— England Cricket (@englandcricket) August 3, 2025 -
ENG VS IND 5th Test: సెంచరీ పూర్తి చేసిన సిరాజ్.. విదేశాల్లో మొనగాడు
ఓవల్ టెస్ట్‌లో భారత్ పట్టు సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ మరో 9 వికెట్లు తీయాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 324 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసింది. బెన్ డకెట్ 34 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. సిరాజ్ అద్బుతమైన బంతిలో జాక్ క్రాలేను (14) క్లీన్ బౌల్డ్ చేశాడు.క్రాలే వికెట్‌తో సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. విదేశీ టెస్ట్‌ల్లో సిరాజ్ 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని సిరాజ్ కేవలం 27 టెస్ట్‌ల్లో తాకాడు. టెస్ట్ కెరీర్లో మొత్తంగా 119 వికెట్లు తీసిన సిరాజ్ విదేశాల్లోనే సింహభాగం వికెట్లు తీసి ఓవర్సీస్ మొనగాడనిపించుకున్నాడు. సిరాజ్ స్వదేశంలో కేవలం 19 వికెట్లు (14 మ్యాచ్‌ల్లో) సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
IND vs ENG: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్..
ఓవల్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. వరుసగా రెండో రోజును బౌలర్లు శాసించారు. తొలి సెషన్లో ఇంగ్లండ్ బ్యాటర్లు అధిపత్యం చెలాయించినప్పటికి.. లంచ్ విరామం తర్వాత భారత బౌలర్లు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు.ముఖ్యంగా హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ బంతితో మ్యాజిక్ చేశాడు. మొదటి సెషన్లో భారీగా పరుగులు సమర్పించుకున్న సిరాజ్.. రెండో సెషన్లో మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సంచలన బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు.మొత్తంగా 16.2 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్, 86 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్‌తో పాటు ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.భారత్ ప్రస్తుతం 52 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఆఖరి టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.బుమ్రా రికార్డు బద్దలు..ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఫోర్ వికెట్ల హాల్స్ సాధించిన భారత బౌలర్‌గా బుమ్రాను సిరాజ్ అధిగమించాడు. సిరాజ్ మియా ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో 11 టెస్టులు ఆడి ఆరు సార్లు 4 వికెట్ల హాల్ సాధించాడు. 2021లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ సిరాజ్ నాలుగు వికెట్ల ఘనత సాధించాడు. ఆ తర్వాత 2022లో ఎడ్జ్‌బాస్టన్, 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 4 వికెట్లను సిరాజ్ పడగొట్టాడు. అదేవిధంగా ప్రస్తుత సిరీస్‌లో బర్మింగ్‌హామ్‌లో నాలుగుకు పైగా వికెట్లు తీసిన సిరాజ్.. మళ్లీ ఇప్పుడు ఓవల్ టెస్టులో 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ రేర్ ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. కాగా బుమ్రా ఇప్పటివరకు ఇంగ్లండ్ గడ్డపై 5 సార్లు 4 వికెట్ల హాల్ సాధించాడు.అంతేకాకుండా ఈ ఫీట్ సాధించిన ఏషియన్ బౌలర్‌గానూ వకార్ యూనిస్ రికార్డును సిరాజ్ సమం చేశాడు. పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ ఇంగ్లండ్ గడ్డపై 6 సార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించాడు.చదవండి: గ్రాహం థోర్ప్‌కు నివాళిగా... -
ENG VS IND 5th Test: చెలరేగిన సిరాజ్, ప్రసిద్ద్.. ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్
ఓవల్ టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (16.2-1-86-4), ప్రసిద్ద్ కృష్ణ (16-1-62-4), ఆకాశ్‌దీప్ (17-0-80-1) చెలరేగడంతో ఆతిథ్య జట్టు 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ మ్యాచ్ మొత్తానికి దూరం కావడంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు 247 పరుగుల వద్ద పుల్ స్టాప్ పడింది. ఆ జట్టుకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 64, బెన్ డకెట్ 43, ఓలీ పోప్ 22, జో రూట్ 29, హ్యారీ బ్రూక్ 53, జేకబ్ బేతెల్ 6, జేమీ స్మిత్ 8, జేమీ ఓవర్టన్ డకౌటయ్యరు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
నిప్పులు చెరుగుతున్న భారత పేసర్లు.. ఇంగ్లండ్ పతనాన్ని అడ్డుకున్న వరుణుడు
ఇంగ్లండ్ పతనాన్ని అడ్డుకున్న వరుణుడుతొలి ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పతనాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. 242 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ దాటి 18 పరుగుల ఆధిక్యంలో ఉంది. హ్యారీ బ్రూక్ (48), జోష్ టంగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రిస్ వోక్స్ ఆడే అవకాశం లేదు. గాయం కారణంగా వోక్స్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. తొలి రోజు ఆట సందర్భంగా వోక్స్ భుజానికి తీవ్ర గాయమైంది.ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో భారత పేసర్లు చెలరేగిపోతున్నారు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. సిరాజ్ (12-1-66-3), ప్రసిద్ద్ కృష్ణ (11.5-0-51-3), ఆకాశ్‌దీప్ (17-0-80-1) పోటీ పడి సత్తా చాటుతుండటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో పతనం అంచుల్లో ఉంది. రెండో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు 215 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.టీ విరామానికి ముందు ఓవర్లో ప్రసిద్ద్ విజృంభించాడు. ఐదు బంతుల వ్యవధిలో జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్‌లను పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 9 పరుగులు వెనుకపడి ఉంది. హ్యారీ బ్రూక్ (33) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 64, బెన్ డకెట్ 43, ఓలీ పోప్ 22, జో రూట్ 29, జేకబ్ బేతెల్ 6, జేమీ స్మిత్ 8, జేమీ ఓవర్టన్ డకౌటయ్యాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
ENG VS IND 5th Test: సిరాజ్ డబుల్ సెంచరీ
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో ఓలీ పోప్ వికెట్ తీయడంతో అంతర్జాతీయ క్రికెట్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. సిరాజ్ 41 టెస్ట్ మ్యాచ్‌ల్లో 117 వికెట్లు.. 44 వన్డేల్లో 71 వికెట్లు.. 16 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు.ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఓలీ పోప్ వికెట్ తర్వాత మరో రెండు వికెట్లు కూడా తీశాడు. జో రూట్, బేకబ్ బేతెల్లను పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఇప్పటివరకు 3 వికెట్లు తీశాడు. సిరాజ్ తీసిన 3 వికెట్లు ఎల్బీడబ్ల్యూలే కావడం విశేషం.సిరాజ్ చెలరేగడంతో టీమిండియా మ్యాచ్‌పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. సిరాజ్‌తో పాటు ఆకాశ్‌దీప్, ప్రసిద్ద్ కృష్ణ (తలో వికెట్) కూడా తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ 195 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (64), బెన్ డకెట్ (43), ఓలీ పోప్ (22), జో రూట్ (29), జేకబ్ బేతెల్ (6) ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ (22), జేమీ స్మిత్ (5) క్రీజ్‌లో ఉన్నారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
అవిశ్రాంత యోధుడు సిరాజ్.. కోహ్లిని కూడా దాటేశాడు..!
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలి కాలంలో టీమిండియా ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా మారిపోయాడు. ముఖ్యంగా టెస్ట్‌ల్లో అవిశ్రాంత యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మాంచెస్టర్ టెస్ట్‌లో పాల్గొన్న సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ దశాబ్దంలో (2020ల్లో) భారత్ తరఫున అత్యధిక టెస్ట్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని సైతం అధిగమించాడు. విరాట్ 2020 నుంచి టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు వరకు 39 టెస్ట్‌లు ఆడగా.. సిరాజ్ మాంచెస్టర్ టెస్ట్‌తో 40వ టెస్ట్ పూర్తి చేసుకున్నాడు. 2020 డిసెంబర్లో టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేసిన సిరాజ్.. ఆ ఏడాదంతా (2020) టెస్ట్‌లు ఆడకపోయినా ఈ దశాబ్దంలో భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవడం విశేషం.వర్క్ లోడ్ కారణంగా మేనేజ్మెంట్ రొటేషన్ పాలసీని ప్రవేశపెట్టినప్పటికీ సిరాజ్ టీమిండియా ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్‌లోనూ ఆడాల్సి వస్తుంది. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు క్రమం తప్పకుండా విశ్రాంతినిస్తున్న మేనేజ్మెంట్ సిరాజ్‌ను మాత్రం దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో ఆడిస్తుంది. లెక్కలు చూసుకోవడానికి ఇది బాగానే ఉన్నా పరిస్థితి ఇలాగే కొనసాగితే సిరాజ్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.పని భారం ఎక్కువై సిరాజ్ గాయాల బారిన పడితే కెరీర్ అర్దంతరంగా ముగిసే ప్రమాదం ఉంది. ఇప్పటికే సిరాజ్ వయసు 31 సంవత్సరాలు. ఇలా నిర్విరామంగా ఆడితే అతని కెరీర్ మరో రెండు, మూడేళ్లకు మించి కొనసాగే అవకాశం ఉండదు. టీమిండియా మేనేజ్మెంట్ ఇకనైనా మేల్కొని సిరాజ్‌కు కూడా వరుస విరామాల్లో విశ్రాంతి కల్పించకపోతే చేజేతులా ఓ టాలెంటెడ్ క్రికెటర్ కెరీర్‌ను ప్రమాదంలోకి తోసేసినట్లవుతుంది. సిరాజ్ తాజాగా ముగిసిన మాంచెస్టర్ టెస్ట్‌లో సింహభాగం బౌలింగ్ చేశాడు. 24 ఏళ్ల యువ పేసర్ అన్షుల్ కంబోజ్ కేవలం 18 ఓవర్లు వేస్తే సిరాజ్ బుమ్రా తర్వాత అత్యధికంగా 30 ఓవర్లు బౌలింగ్ చేశాడు. కెప్టెన్లకు సిరాజ్‌పై ఉన్న నమ్మకంతో అతనికే తరుచూ బౌలింగ్ రొటేట్ చేస్తున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇది సమంజసమే అయినప్పటికీ.. ఓ టాలెండెట్ బౌలర్ అర్దంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఉంది.సిరాజ్ త్వరలో తన కెరీర్లో 41వ టెస్ట్ ఆడటం కూడా దాదాపుగా ఖరారైంది. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో ఒకవేళ బుమ్రాకు విశ్రాంతినిచ్చినా సిరాజ్‌ను మాత్రం తప్పక ఆడిస్తారు. ఈ విషయంలో టీమిండియాకు మరో ఆప్షన్ కూడా లేదు. సత్తా చాటుతాడనుకున్న యువ పేసర్ అన్షుల్ కంబోజ్ నాలుగో టెస్ట్‌లో ప్రభావం చూపలేకపోయాడు. మరో ఆప్షన్ అయిన ప్రసిద్ద్ కృష్ణను మేనేజ్మెంట్ నమ్మే పరిస్థితుల్లో లేదు. మరో రెండు ఆప్షన్లైన ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్ గాయాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జులై 31 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్ట్‌లో సిరాజ్ ఆడటం దాదాపుగా ఖాయమనే చెప్పాలి. -
గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సరైన వ్యూహాలు అమలు చేయడంలో విఫలమయ్యాడని ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ అన్నాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో బౌలర్ల సేవలు సరిగ్గా వినియోగించుకోలేకపోయాడంటూ పెదవి విరిచాడు. శుక్రవారం నాటి తొలి సెషన్లో స్పిన్నర్ల చేతికి బంతిని ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో 1-2తో టీమిండియా వెనుకబడి ఉంది. మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో గెలిస్తేనే గిల్ సేనకు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే డ్రా కోసం టీమిండియా ప్రయత్నించడమే ఉత్తమంగా కనిపిస్తోంది.358 పరుగులకు ఆలౌట్‌టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు దీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్.. శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 544 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ కంటే 186 పరుగుల ఆధిక్యం సంపాదించింది.భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్టీమిండియా బౌలర్ల వైఫల్యం కారణంగా ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (113 బంతుల్లో 84), బెన్ డకెట్ (100 బంతుల్లో 94) మరోసారి ‘బజ్‌బాల్’ శైలిలో రెచ్చిపోయారు. మరోసారి జో రూట్ తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ రికార్డు శతకం (150)తో చెలరేగగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (77 నాటౌట్) కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆతిథ్య జట్టుకు ఈ మేర ఆధిక్యం లభించింది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేస్‌లో పదును తగ్గగా.. మహ్మద్ సిరాజ్‌తో పాటు అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ ముగ్గురూ తలా ఒక వికెట్ దక్కించుకోగా.. ఇక శార్దూల్ ఠాకూర్ మరోసారి విఫలమయ్యాడు. అయితే, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటారు.గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదుఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ తీరుపై మైకేల్ వాన్ విమర్శలు గుప్పించాడు. ‘‘నేనే గనుక గిల్ స్థానంలో ఉండి ఉంటే.. స్పిన్నర్లతో రోజును ఆరంభించేవాడిని. కనీసం వారికి రెండు- మూడు ఓవర్లు వేసే అవకాశం ఇచ్చేవాడిని.కానీ గిల్ అలా చేయలేదు. అందుకు కారణమేమిటో అతడే వివరించాలి. అతడు వ్యూహాత్మక తప్పిదాలు చేశాడు’’ అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. ఇక దురదృష్టవశాత్తూ బుమ్రా కూడా ఈ పిచ్‌పై రాణించలేకపోయాడని.. సిరాజ్ మాత్రం ఫర్వాలేదనిపించాడన్నాడు. అదే విధంగా.. గంటకు 78- 81 మైళ్ల వేగంతో బౌలింగ్ చేసే శార్దూల్ ఠాకూర్ నుంచి ఇక్కడ మెరుగైన ప్రదర్శన ఆశించడం కూడా తప్పేనని వాన్ అభిప్రాయపడ్డాడు. ఇక అన్షుల్ కొత్త వాడని.. ఆదిలోనే అతడు అద్భుతాలు చేయలేడని పేర్కొన్నాడు. వీరందరితో నెగ్గుకురావడం కాస్త కష్టమేనంటూ ఒకానొక సందర్భంలో గిల్‌కు మద్దతు పలికాడు.చదవండి: AUS vs WI: టిమ్ డేవిడ్ మెరుపు సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
IND Vs ENG: డీఎస్పీ ఆన్ ఫైర్.. గొడవలు అవసరమా సిరాజ్ భయ్యా?
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ(Mohammed Siraj) తన సహనాన్ని కోల్పోయాడు. రెండో రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌తో సిరాజ్ వాగ్వాదానికి దిగాడు.తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెన్ డకెట్(94), జాక్ క్రాలీ(84) అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు 166 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్‌ను బెన్ డకెట్ ఓ ఆట ఆడేసికున్నాడు. అతడి బౌలింగ్‌లో బౌండరీలు బాదుతూ డకెట్ పరుగులు రాబట్టుకున్నాడు.ఈ క్రమంలో తన ప్రశాంతతను కోల్పోయిన సిరాజ్.. డకెట్‌తో గొడవపడ్డాడు. ఏదో విషయంలో డకెట్ అంపైర్‌కు ఫిర్యాదు చేస్తుండగా బౌలింగ్ ఎండ్‌లో సిరాజ్ తన నోటికి పనిచెప్పాడు. వేలు చూపిస్తూ అతడిపై సీరియస్ అయ్యాడు. అందుకు బదులుగా డకెట్ సైతం మాటల యుద్దానికి దిగాడు. అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సిరాజ్ భయ్యా ఇది అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా డకెట్‌తో సిరాజ్ గొడవపడడం ఇది తొలిసారి కాదు. లార్డ్స్ టెస్టులో డకెట్‌ను అవుట్ చేసిన తర్వాత అతిగా సెలబ్రేట్ చేసుకున్నందుకు మహమ్మద్ సిరాజ్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా ఐసీసీ విధించింది. ఇప్పుడు కూడా అదేవిధంగా సిరాజ్ ప్రవర్తిస్తుండడంతో ఐసీసీ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశముంది. కాగా మాంచెస్టర్ టెస్టులో ఇప్పటివరకు 10 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్.. వికెట్ ఏమీ తీయకుండా 58 పరుగులు సమర్పించుకున్నాడు.Tempers flared between Ben Duckett and M. Siraj. 🔥#ENGvIND 👉 4th TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/Y3btplYguV pic.twitter.com/MmTP86rXNU— Star Sports (@StarSportsIndia) July 24, 2025 -
సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్ ఫైర్
మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ తనదైన శైలిలో ‘బజ్‌బాల్’ ఆటతో చెలరేగింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (Zak Crawley), బెన్ డకెట్ (Ben Ducket) దూకుడైన బ్యాటింగ్‌తో దుమ్ములేపారు. క్రాలీ 113 బంతుల్లోనే 84 పరుగులు చేయగా.. డకెట్ కేవలం 100 బంతుల్లోనే 94 పరుగులతో అలరించాడు. వన్డే మాదిరి బ్యాటింగ్ చేసిన వీరిద్దరిని ఆపడం టీమిండియా బౌలర్ల తరం కాలేదు.దీంతో ఒక్క సెషన్లోనే ఏకంగా 148 పరుగులు చేసిన ఇంగ్లండ్.. గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి పటిష్ట స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill), ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాలపై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ విమర్శలు గుప్పించాడు.సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా?అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్‌కు ముందుగానే బంతి ఇచ్చి గిల్ తప్పు చేశాడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అనుభవజ్ఞుడైన సిరాజ్‌ను కాదని అన్షుల్‌ను రంగంలోకి దించినందుకు భారత్ భారీ మూల్యమే చెల్లించిందన్నాడు.మరోవైపు.. బుమ్రా సైతం వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయలేకపోయాడని పాంటింగ్ విమర్శించాడు. ఈ మేరకు.. ‘‘ఆరంభం నుంచే టీమిండియా బౌలర్లు తడబడ్డారు. సిరాజ్‌ను కాదని అన్షుల్ కంబోజ్‌కు కొత్త బంతిని ఇచ్చి తప్పు చేశారు. అతడిని ముందే రంగంలోకి దించడం నాకైతే నచ్చలేదు.బుమ్రాకు ఏమైంది?డకెట్ కొట్టిన తొలి ఐదు బౌండరీలలో తొలి సిక్సర్ స్క్వేర్ లెగ్ మీదుగానే వచ్చింది. టీమిండియా వ్యూహాత్మక తప్పిదాలు చేసింది. ముఖ్యంగా బుమ్రా స్టాతమ్ ఎండ్ నుంచి కాకుండా ఆండర్సన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేసి పొరపాటు చేశాడు. నిజానికి ముందు కూడా స్టాతమ్ ఎండ్ నుంచే ఎక్కువ వికెట్లు పడ్డాయి’’ అంటూ పాంటింగ్ గిల్, బుమ్రా తీరును విమర్శించాడు.ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న భారత బౌలర్లుకాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతోంది. ఆతిథ్య జట్టు 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 264/4 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాటి ఆట మొదలుపెట్టిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. ఇందుకు ఇంగ్లండ్ దీటుగా బదులిస్తోంది. గురువారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి కేవలం రెండు వికెట్ల నష్టపోయి 46 ఓవర్లలోనే 225 పరుగులు చేసింది. క్రాలీని రవీంద్ర జడేజా అవుట్ చేయగా.. డకెట్ వికెట్‌ను అన్షుల్ దక్కించుకున్నాడు. ఓలీ పోప్ 20, జో రూట్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.#AnshulKamboj, welcome to Test cricket!Opens his wicket tally in style by removing a well-set Ben Duckett. 💥#ENGvIND 👉 4th TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/Y3btplYguV pic.twitter.com/aXAsyVjKjw— Star Sports (@StarSportsIndia) July 24, 2025 ఇక భారత బౌలర్లలో గురువారం బుమ్రా 13 ఓవర్లలో 37 పరుగులు, అన్షుల్ 10 ఓవర్లలో 48, సిరాజ్ 10 ఓవర్లలో 58 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 5 ఓవర్లలోనే 35 పరుగులు, రవీంద్ర జడేజా 8 ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకున్నారు.చదవండి: ‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ లేదు’ -
పంత్ ఫిట్.. బరిలో బుమ్రా
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో టెస్టులో ఆడటం ఖాయమైంది. ఈ విషయాన్ని జట్టు సభ్యుడు మొహమ్మద్ సిరాజ్ నిర్ధారించాడు. ఆటగాళ్ల గాయాల కారణంగా జట్టు కూర్పులో ప్రతి రోజూ మార్పులు జరుగుతున్నాయని... అయితే బుమ్రాను ఆడించాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు అతను వెల్లడించాడు. పని భారాన్ని తగ్గించడంలో భాగంగా ఈ సిరీస్‌లో బుమ్రా ఏవైనా మూడు టెస్టులు మాత్రమే ఆడతాడనే టీమ్ మేనేజ్మెంట్ ముందే ప్రకటించింది. ఈ నేపథ్యంలో చివరి రెండు టెస్టుల్లో అతను ఎందులో బరిలోకి దిగుతాడనే విషయం టీమ్ ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఓల్డ్ ట్రఫోర్డ్‌లో ఆడేందుకు సిద్ధం కావడంతో దీనిపై స్పష్టత వచి్చంది. గత టెస్టుకు, నాలుగో టెస్టుకు మధ్య ఎనిమిది రోజుల విరామం కూడా ఉండటంతో బుమ్రాకు తగినంత విశ్రాంతి కూడా లభించింది. భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో సమంగా నిలిస్తే ఓవల్‌లో జరిగే చివరి టెస్టులోనూ బుమ్రా ఆడే అవకాశం ఉంది. అర్‡్షదీప్ నాలుగో టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే మరో పేసర్ ఆకాశ్‌దీప్ ఆడటం కూడా సందేహంగానే ఉంది. సోమవారం అతను స్వల్పంగా ప్రాక్టీస్ చేసినా... దీని వల్ల ఫిట్‌నెస్‌పై ఇంకా ఎలాంటి అంచనాకు రాలేదు. మరో రెండు రోజుల సాధన తర్వాతే అతని విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. వికెట్ కీపర్ పంత్ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. సోమవారం ప్రాక్టీస్ సెషన్లో అతను బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేశాడు. సాయి సుదర్శన్‌కు చాన్స్! గాయంతో నితీశ్ కుమార్ రెడ్డి సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో రెగ్యులర్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు మాంచెస్టర్ టెస్టులో చోటు దక్కవచ్చు. సుదర్శన్ ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆడాడు. అతను ఆడితే పిచ్ పరిస్థితిని బట్టి ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్లలో ఒకరికే అవకాశం లభిస్తుంది. ఆకాశ్‌దీప్ కూడా తప్పుకుంటే ప్రసిధ్, కొత్త ఆటగాడు అన్షుల్లలో ఒకరిని ఎంపిక చేస్తారు. రెండు టెస్టులు ఆడిన ప్రసిధ్ పూర్తిగా విఫలం కాగా... ఆకాశ్‌దీప్ శైలిలోనే సీమ్ బౌలింగ్ చేసే అన్షుల్ అరంగ్రేటం చేసే చాన్స్ ఉంది. అయితే ఆటగాళ్ల గాయాలతో టీమ్‌లో ఎన్నో మార్పులు జరుగుతున్నా... ఆశ్చర్యకరంగా జట్టులో ఉన్న ఏకైక రెగ్యులర్ స్పిన్నర్, ఇంగ్లండ్‌పై మంచి ప్రభావం చూపే అవకాశం ఉన్న కుల్దీప్ యాదవ్ పేరు కూడా ప్రస్తావనకు రాకపోవడం ఆశ్చర్యకరం. టీమిండియా వ్యూహాల ప్రకారం చూస్తే కుల్దీప్ ఒక్క టెస్టూ ఆడకుండానే తిరిగి వచ్చేలా కనిపిస్తోంది. ఇంగ్లండ్ ఒక మార్పుతో... నాలుగో టెస్టుకు రెండు రోజుల ముందే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. గత టెస్టులో గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్ జట్టులోకి వచ్చాడు. 2017 తర్వాత అతనికి ఇదే తొలి టెస్టు కానుంది. ఇంగ్లండ్ తుది జట్టు: స్టోక్స్ (కెపె్టన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, డాసన్, క్రిస్ వోక్స్, కార్స్, జోఫ్రా ఆర్చర్. భారత్ తరఫున ఆడే అవకాశం రావడమే అన్నింటికీ ప్రేరణ అందిస్తుంది. దాంతోనే కావాల్సినంత ఉత్సాహం వస్తుంది. మైదానంలో వంద శాతం కష్టపడటమే నాకు తెలిసింది. దేవుని దయ వల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నాను. పని భారం తగ్గించడం ముఖ్యమే కావచ్చు కానీ చివరకు నేను ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశాననేదే స్కోరు బోర్డులో కనిపిస్తుంది. నాకు లభించిన అవకాశాన్ని సమర్థంగా వాడుకొని జట్టును గెలిపించడమే నా లక్ష్యం. కాబట్టి ఎక్కువ ఓవర్లు వేయడంలో ఎలాంటి రహస్యమూ లేదు. ఏ బౌలరైనా వికెట్లు పడగొట్టేందుకు ప్రయతి్నస్తాడు. నేను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నా కొన్నిసార్లు అదృష్టం కలిసి రావడం లేదు. గత సిరీస్‌తో పోలిస్తే ఈ సారి డ్యూక్స్ బంతులు తొందరగా మెత్త పడుతున్నాయనేది వాస్తవం. అయితే అన్నీ మనకు అనుకూలించవు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించడం ముఖ్యం. గత టెస్టులో చివరి వికెట్‌గా అవుటైనప్పుడు చాలా బాధపడ్డాను. దాని నుంచి కోలుకునేందుకు ఎంతో సమయం పట్టింది. మ్యాచ్ మేం గెలవాల్సింది. జడేజా, బుమ్రా బాగా ఆడినా మేం ఓడాం. చాలా ముందే 80 పరుగుల తేడాతో ఓడిపోయినా ఇంతగా బాధపడేవాళ్లం కాదేమో. చాలా చేరువగా వచ్చి గెలవలేకపోవడం నిరాశకు గురి చేసింది. – మీడియా సమావేశంలో సిరాజ్ -
సిరాజ్ సింహం లాంటోడు.. ఒక్కోసారి మేమే వారిస్తాం: టీమిండియా కోచ్
భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గురించి టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే (Ryan ten Doeschate) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పనిభారం గురించి అతడు అస్సలు ఆలోచించడని.. తామే ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. సిరాజ్ సింహం లాంటివాడని.. జట్టు ప్రయోజనాల కోసం ఎల్లవేళలా బంతితో సిద్ధంగా ఉంటాడంటూ ప్రశంసించాడు.నాలుగో టెస్టు గెలిస్తేనే..ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ-2025 (Anderson- Tendulkar Trophy) ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఐదింటిలో ఇప్పటికి మూడు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు గిల్ సేనపై 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలు సజీవంగా ఉంటాయి.బుమ్రా ఆడేది మూడేఅయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని టీమిండియా యాజమాన్యం ముందే చెప్పింది. అతడు కేవలం మూడు టెస్టులే ఆడతాడని స్పష్టం చేసింది. ఈ క్రమంలో లీడ్స్‌లో ఆడిన బుమ్రా.. ఎడ్జ్‌బాస్టన్‌లో విశ్రాంతి తీసుకుని.. లార్డ్స్‌లో మళ్లీ ఆడాడు.ఇక బుమ్రా గైర్హాజరీలో పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్న మరో సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ మెరుగ్గా రాణిస్తున్నాడు. మూడు టెస్టుల్లోనూ ఆడిన అతడు.. మొత్తంగా 13 (2, 6, 1, 2, 2) వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఆరు వికెట్లతో చెలరేగి భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.సిరాజ్ సింహం లాంటోడుఈ నేపథ్యంలో డస్కటే సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘అలాంటి ఆటగాడు మా జట్టులో ఉండటం మాకు సానుకూలాంశం. ఇక్కడ ఫాస్ట్‌బౌలర్‌గా అతడి నుంచి మనం అందరికంటే కాస్త ఎక్కువగానే వికెట్లు తీస్తాడని ఆశిస్తాం.అయితే, తను పనిభారం గురించి మాత్రం అస్సలు పట్టించుకోడు. అందుకే మేమే అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. సింహం లాంటి పోరాటపటిమ అతడి సొంతం.మేమే అతడిని వారిస్తాంలార్డ్స్లో స్టోక్స్ మాదిరి అదనపు ఓవర్లు వేసేందుకు సిరాజ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ అతడు ఫిట్‌గా ఉండేలా చూసుకోవడం మా పని. అందుకే ఒక్కోసారి మేనేజ్మెంట్ అతడిని వారించాల్సి వస్తుంది కూడా. ఏదేమైనా అతడి చేతిలో బంతి ఉందంటే కచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేస్తాడనే నమ్మకం ఉంటుంది’’ అంటూ ఆట పట్ల సిరాజ్ అంకితభావం గురించి డస్కటే వివరించాడు.కాగా 2023 నుంచి టీమిండియా ఆడిన 27 టెస్టులలో సిరాజ్ 24 మ్యాచ్‌లు ఆడాడు. టీమిండియా ఫాస్ట్బౌలర్లలో ఒక్కరు కూడా ఇలా వరుస మ్యాచ్‌లు ఆడలేదు. ఇక 2023 నుంచి ఇప్పటిదాకా అతడు 569.4 ఓవర్లు బౌల్ చేశాడు. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (721.2 ఓవర్లు), పేసర్ మిచెల్ స్టార్క్ (665.1) తర్వాత ఈ స్థాయిలో అలుపెరగకుండా బౌలింగ్ చేసిన ఏకైక భారత ఫాస్ట్‌బౌలర్ సిరాజ్. ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ వేదికగా జూలై 23-27 మధ్య భారత్- ఇంగ్లండ్ నాలుగో టెస్టు జరుగనుంది.చదవండి: భారత ఓపెనింగ్ జోడీ ప్రపంచ రికార్డు -
సిరాజ్ 3 సిక్సర్లతో గెలిపిస్తాడని అనుకున్నా!.. జోకులు ఆపండి: అశ్విన్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ ఓ సస్పెన్ష్ థ్రిల్లర్ సినిమా ను తలపించింది. ఇరు జట్ల ఆటగాళ్ల తమ విరోచిత పోరాటాలతో అభిమానులకు అసలు సిసలైన టెస్టు క్రికెట్ మజాను అందించారు. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో విజయం ఇంగ్లండ్ జట్టునే వరించింది.ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైనప్పటికి రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు తమ పోరాటాలతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి నేను వున్నా అంటూ జడేజా బ్యాటింగ్ చేసిన తీరు.. అతడికి టెయిలాండర్లు(జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్) సహకరించిన విధానం గురుంచి ఎంతచెప్పుకొన్నతక్కువే.విజయానికి 22 పరుగులు కావాల్సిన సమయంలో సిరాజ్ క్లీన్ బౌల్డ్ కావడంతో కోట్లమంది భారత అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. ఆఖరి వికెట్‌గా వెనుదిరిగిన సిరాజ్ సైతం మైదానంలోనే భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే లార్డ్స్ టెస్టులో ఓటమిపై టీమిండియా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ ఆశ్విన్ తాజాగా స్పందించాడు. మ్యాచ్ ఆఖరి రోజు ఆట సందర్భంగా తన తండ్రితో జరిగిన సంభాషణ గురించి ఆశ్విన్ వివరించాడు. సిరాజ్ మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపిస్తాడని నమ్మకంతో తన తండ్రి ఉన్నట్లు ఆశ్విన్ వెల్లడించాడు."లార్డ్స్ టెస్టులో భారత్ పోరాడి ఓడింది. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం అద్బుతమైన స్పెల్‌ను బౌల్ చేశాడు. ఓవైపు అలసిన శరీరంతో మైదానంలో పోరడాతూనే స్టోక్స్ తన బౌలింగ్‌ను కొనసాగించాడు. ఆఖరి రోజు ఆటను మా నాన్న నేను కలిసి టీవీలో వీక్షించాము.సిరాజ్ మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ఫినిష్ చేస్తాడని మా నాన్న నాతో అన్నారు. వెంటనే నేను జోకులు ఆపండి అని ఆయనతో అన్నాను. అదేవిధంగా స్టోక్స్‌ను కూడా ఆయన ప్రశంసించారు. రెండు ఎండ్స్ నుంచి అద్బుతంగా బౌలింగ్ చేశాడని ఆయన కొనియాడారు.తొలి ఇన్నింగ్స్‌లో కంటిన్యూగా 9.2 ఓవర్ల స్పెల్‌ను బౌలింగ్ చేసిన స్టోక్సీ.. రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ల మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌ను వేశాడు. అతడు 13-140 కిం కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు. ఓవైపు భారత తరపున జడేజా అడ్డుగోడలా నిలిచి తన పోరాటాన్ని కొనసాగిస్తుంటే.. మరోవైపు స్టోక్స్ కూడా ఇంగ్లండ్ తరపున అదే పనిచేశాడు" అని తన యూట్యూబ్ ఛానల్లో జడ్డూ పేర్కొన్నాడు.చదవండి: అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’లు అందుకుంది వీరే -
బ్యాట్‌ను నేలకేసి కొట్టిన సిరాజ్!.. ఓటమిపై స్పందన ఇదే
లార్డ్స్ టెస్టులో గెలుపు కోసం చివరిదాకా పోరాడిన టీమిండియాకు చేదు అనుభవమే మిగిలింది. మూడో టెస్టులో ఆఖరిదైన ఐదో రోజు ఆటలో అనూహ్య రీతిలో మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బౌల్డ్ కావడంతో గిల్ సేన ఓటమి ఖరారైంది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 22 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. మరోసారి లార్డ్స్‌లో తమకు తిరుగులేదని నిరూపించుకుంది.అంతేకాదు.. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. నిజానికి.. ఐదో రోజు ఆరంభంలోనే టీమిండియా వికెట్ల పతనం మొదలైంది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రిషభ్ పంత్ (9) బౌల్డ్ కాగా.. ఆ తర్వాత ఇన్ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (39) కూడా ఊహించని రీతిలో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు.జడేజా ఒంటరి పోరాటంఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ (0) డకౌట్ అయ్యాడు. అనంతరం నితీశ్ రెడ్డి (53 బంతుల్లో 13) కాసేపు నిలబడినా.. క్రిస్ వోక్స్ అద్భుత డెలివరీతో అతడిని వెనక్కిపంపించేశాడు. ఈ క్రమంలో బాధ్యతను నెత్తికెత్తుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (61 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు.అతడికి తోడుగా టెయిలెండర్ జస్ప్రీత్ బుమ్రా (54 బంతుల్లో 5) చాలాసేపు పట్టుదలగా నిలబడ్డాడు. కానీ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి సామ్ కుక్కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరగడంతో టీమిండియా అభిమానుల్లో గెలుపు ఆశలు దాదాపుగా చచ్చిపోయాయి. మహ్మద్ సిరాజ్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడంటూ అంతా ఉసూరుమన్నారు.పాపం సిరాజ్ మియా..అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సిరాజ్ మియా 29 బంతుల్ని ఎదుర్కొని డిఫెండ్ చేసుకున్నాడు. ముప్పైవ బంతిని కూడా బాగానే డిఫెంగ్ చేసుకున్నా అనుకున్నాడు. కానీ ఊహించని రీతిలో బంతి పిచ్ మీద రోల్ అయి లెగ్ స్టంప్‌ను తాకగా బెయిల్ ఎగిరిపడింది.ఊహించని ఈ పరిణామంతో సిరాజ్‌తో పాటు టీమిండియా హృదయం కూడా ముక్కలైంది. ఇంగ్లండ్ బౌలర్ షోయబ్ బషీర్ స్పిన్ మాయాజాలంతో అలా సిరాజ్ పదో వికెట్‌గా వెనుదిరగ్గా.. లార్డ్స్‌లో టీమిండియా మరోసారి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో కోపంతో సిరాజ్ బ్యాట్‌ను నేలకేసి కొట్టిన వీడియోతో పాటు.. ఓటమి నేపథ్యంలో అతడు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారాయి.ఓటమిపై స్పందన ఇదే‘‘కొన్ని మ్యాచ్‌లు మన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే, కేవలం ఫలితం ఆధారంగా మాత్రమే కాదు.. అవి నేర్పిన పాఠాల వల్ల అలా గుర్తుండిపోతాయి’’ అంటూ సిరాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు రెండు, పర్యాటక టీమిండియా ఒక మ్యాచ్ గెలిచాయి. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్‌లో నాలుగో మ్యాచ్ జరుగనుంది. చదవండి: వాళ్లిద్దరిలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరు?.. కుండబద్దలు కొట్టేసిన లారా pic.twitter.com/Bm2Hp9Cm8K https://t.co/f4wTxyJSyg— Babu Bhaiya (@Shahrcasm) July 15, 2025 -
సిరాజ్ ఔటైనప్పుడు ఎలా అనిపించింది.. గిల్‌కు బ్రిటన్ రాజు ప్రశ్న
లండన్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో చివరి బ్యాటర్ ఔటైనపుడు ఎలా అనిపించిందని బ్రిటన్ రాజు చార్లెస్-3 టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ప్రశ్నించారు. మంగళవారం లండన్‌లోని క్లారెన్స్ హౌస్ గార్డెన్లో కింగ్ చార్లెస్... భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లతో ముచ్చటించారు.ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. టాపార్డర్ ఆకట్టుకోలేకపోయినా... ఆఖర్లో టెయిలెండర్లు అద్భుతంగా పోరాడటంతో ఒకదశలో భారత జట్టు విజయం సాధిస్తుందనిపించింది.కానీ హైదరాబాదీ సిరాజ్ చివరి వికెట్ రూపంలో వెనుదిరగడంతో టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. బషీర్ వేసిన బంతిని సిరాజ్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా... బంతి నెమ్మదిగా వెళ్లి వికెట్లను తాకింది. దీంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.భారత జట్లకు ఆతిథ్యమిచ్చిన సందర్భంగా కింగ్ చార్లెస్ దీని గురించి భారత సారథితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లండ్‌లో భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి, డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా తదితరులు పాల్గొన్నారు.కింగ్ చార్లెస్‌తో భేటీ అనంతరం దానికి సంబంధించిన అంశాలను గిల్ పంచుకున్నాడు.‘కింగ్ చార్లెస్‌తో కలవడం చాలా బాగుంది. ఎన్నో విషయాల గురించి ఆయన మాట్లాడారు. మూడో టెస్టులో చివరి బ్యాట్స్‌మన్ ఔట్ అయిన విధానం చాలా దురదృష్టకరమని అన్నారు. అనుకోకుండా బంతి వికెట్ల మీదకు వెళ్లిందన్నారు. ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది అని ప్రశ్నించారు. అది దురదృష్టకరమని... సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేస్తామని కింగ్ చార్లెస్‌కు చెప్పాం.ఇంగ్లండ్‌లో ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా మాకు విశేష ఆదరణ దక్కుతుంది. అందుకు తగ్గట్లే జట్టు కూడా విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తోంది. సిరీస్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. మూడు మ్యాచ్‌లూ ప్రేక్షకులను అలరించాయి. టెస్టు మ్యాచ్ చివరి రోజు చివరి సెషన్లో ఒక జట్టు స్వల్ప తేడాతో మాత్రమే ఓడిందంటే... ఆ మ్యాచ్‌లో ‘క్రికెట్’ గెలిచినట్లే’ అని గిల్ అన్నాడు. ఇక భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కింగ్ చార్లెస్ ప్రయాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కింగ్‌తో భేటీ అనంతరం నాలుగో టెస్టు కోసం పురుషుల జట్టు మాంచెస్టర్‌కు బయలుదేరగా... మహిళల జట్టు వన్డే సిరీస్ కోసం సౌతాంప్టన్‌కు తిరుగు పయనమైంది. -
IND vs ENG: సిరాజ్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ మేర జరిమానా వేసింది. అంతేకాదు.. సిరాజ్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది.సమంగా..కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. మొదటి రెండింటిలో తలా ఓ టెస్టు గెలిచి ఇరుజట్లు ప్రస్తుతం 1-1తో సమంగా న్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లార్డ్స్‌లో గురువారం మూడో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది.టీమిండియా కూడా సరిగ్గా 387 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆదివారం నాటి నాలుగోరోజు ఆటలో భాగంగా 192 పరుగులకు ఆలౌట్ అయి.. టీమిండియాకు 193 పరుగుల లక్ష్యాన్ని విధించింది.కీలక వికెట్లు కూల్చిన సిరాజ్ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్.. ఇంగ్లిష్ జట్టు ఓపెనర్ బెన్ డకెట్ (12)తో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చి.. టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. అయితే, డకెట్‌ను అవుట్ చేసిన సమయంలో సిరాజ్ సంబరాన్ని పట్టలేక అత్యుత్సాహం ప్రదర్శించాడు. డకెట్ భుజాన్ని రాసుకుంటూ వెళ్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.THE AGGRESSION FROM DSP SIRAJ AFTER DISMISSING DUCKETT. 🥶pic.twitter.com/AehUlhE29t— Mufaddal Vohra (@mufaddal_vohra) July 13, 2025 అలా అయితే ఓ మ్యాచ్ నిషేధం!ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 నిబంధనను సిరాజ్ ఉల్లంఘించినట్లయింది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో ఓ బ్యాటర్ అవుటైనపుడు వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, వారితో అనుచిత రీతిలో ప్రవర్తించడం నేరం. ఇందుకు ప్రతిగా అత్యుత్సాహం ప్రదర్శించిన బౌలర్‌కు తగిన శిక్ష పడుతుంది. ఇప్పుడు సిరాజ్ విషయంలోనూ ఇదే జరిగింది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ.. గడిచిన 24 నెలలకాలంలో సిరాజ్ రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు గానూ ఇప్పటికే తన ఖాతాలో ఉన్న ఓ డీమెరిట్ పాయింట్‌కు మరొకటి జతచేసింది.ఒకవేళ 24 నెలల కాలంలో ఓ ప్లేయర్ ఖాతాలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు గనుక చేరినట్లయితే అతడిపై మ్యాచ్ నిషేధం పడుతుంది. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి ఆట పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 135 దూరంలో నిలిచింది. చదవండి: Divorce: సైనా అలా.. పారుపల్లి కశ్యప్ ఇలా!.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్ -
సిరాజ్ అత్యుత్సాహం.. కొట్టేస్తావా ఏంటి..?
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ అద్భుతమైన బంతితో బెన్ డకెట్‌ను (12) బోల్తా కొట్టించాడు. పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో డకెట్ బుమ్రాకు సునాయాసమైన క్యాచ్ అందించాడు.డకెట్‌ను ఔట్ చేశాక సిరాజ్ పట్టలేని ఆనందంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. డకెట్వైపు కోపంగా చూస్తూ పెవిలియన్‌వైపు అడుగులేస్తున్న అతన్ని భుజంతో ఢీకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. సిరాజ్ ప్రవర్తనపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అంత ఓవరాక్షన్ అవసరం లేదని అక్షింతలు వేస్తున్నారు. కొట్టేస్తావా ఏంటని ప్రశ్నిస్తున్నారు.DSP SIRAJ ON DUTY AT LORD's 🫡📢 pic.twitter.com/6Sb0LiEuGl— Johns. (@CricCrazyJohns) July 13, 2025కాగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్ మూడో రోజు చివర్లో కూడా ఇదే తరహా ప్రదర్శనతో నెటిజన్లచే చివాట్లు తిన్నాడు. మూడో రోజు ఆట ముగియడానికి ఆరు నిమిషాలు ఉండగా.. ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది.ఈ సమయంలో భారత్ కనీసం రెండు ఓవర్లు అయినా బౌలింగ్ చేయాలని తహతహలాడింది. కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం ఒక్క ఓవర్ ఆడి మూడో రోజు ఆటను ముగించాలని భావించారు. దీంతో బుమ్రా వేసిన తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ పదేపదే అంతరాయం కలిగించి సమయాన్ని వృథా చేశాడు.ఈ క్రమంలో సహనం కోల్పోయిన గిల్.. క్రాలీని పరుష పదజాలంతో దూషించాడు. దీంతో జాక్ క్రాలీ కూడా వేలు చూపిస్తూ వాగ్వాదానికి దిగాడు. గిల్‌కు తోడుగా సిరాజ్ కూడా సీన్లోకి కావడంతో కాసేపు ఫీల్డ్‌లో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత అంపైర్లు జోక్యంతో చేసుకోవడంతో గొడవ సద్దమణిగింది. గిల్, సిరాజ్ ప్రవర్తనను క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. ఇంత ఓవరాక్షన్ అవసరం లేదని హితవు పలుకుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండు వికెట్లు సిరాజే తీసుకున్నాడు. తొలుత డకెట్‌ను ఔట్ చేసిన సిరాజ్, ఆతర్వాత ఓలీ పోప్‌ను (4) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 12 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ స్కోర్ 42/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే.తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ రూట్ (104) సెంచరీ, జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ 387 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్ కేఎల్ రాహుల్ (100) సెంచరీ, పంత్ (74), జడేజా (72) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ చేసిన 387 పరుగుల వద్దనే ఆలౌటైంది. -
అదొక చెత్త నిర్ణయం.. గిల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం!
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తీరును ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుసేన్ విమర్శించాడు. ఓవైపు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా.. బంతిని మార్చాలంటూ అంపైర్‌ను ఒత్తిడి చేయడం సరికాదన్నాడు. అనవసరంగా బంతిని మార్చుకుని పెద్ద మూల్యమే చెల్లించారంటూ చురకలు అంటించాడు. అసలు విషయమేమిటంటే..ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ లార్డ్స్ (Lord's Test) వేదికగా మూడో మ్యాచ్ ఆడుతోంది. గురువారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 251/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు బుమ్రా వరుస షాకులిచ్చాడు.వరుస షాకులిచ్చిన బుమ్రాబెన్ స్టోక్స్ (44), క్రిస్ వోక్స్ (0), జో రూట్ (104) వికెట్లను పెవిలియన్‌కు పంపిన ఈ రైటార్మ్ పేసర్.. ఈ మేరకు కీలక వికెట్లు కూల్చి టీమిండియాలో జోష్ నింపాడు. అయితే, అదే సమయంలో అంటే రెండో రోజు 10.4 ఓవర్ల ఆట తర్వాత బంతిని మార్చాలని భారత్ కోరగా.. అంపైర్ హూప్ టెస్టు నిర్వహించాడు. బంతి ఆకారం మారిందని గుర్తించి మరో కొత్త బంతినిచ్చాడు.అయితే, అంపైర్ ఇచ్చిన బంతితో కెప్టెన్ గిల్, మరో పేసర్ మహ్మద్ సిరాజ్ సంతృప్తి చెందలేదు. మునుపటి బంతి కంటే ఇది మరింత పాతదిలా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గిల్ అంపైర్‌తో కాసేపు వాదించాడు కూడా!..అదొక చెత్త నిర్ణయంఈ విషయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ నాసిర్ హుసేన్ స్పందిస్తూ.. గిల్ తీరును తప్పుబట్టాడు. ‘‘బంతిని మార్చుకోవాలనే టీమిండియా నిర్ణయం వింతగా అనిపించింది. ఒకవేళ బంతి ఆకారం మారిందనుకుంటే అంపైరే స్వయంగా బంతిని మారుస్తాడు. లేదంటే.. ఉన్న బాల్‌తో తమకు ఎలాంటి ఉపయోగం లేదని కెప్టెన్ భావిస్తే బంతిని మార్చమని కోరతాడు.ఈ రెండు సందర్భాల్లోనే బంతిని మారుస్తారు. కానీ.. తొలి సెషన్లో బంతి బాగానే ఉంది. 63 డెలివరీలో మాత్రమే సంధించారు. అప్పటికి బుమ్రా ఆ బంతితోనే అద్భుతమైన స్పెల్ వేశాడు. కానీ మరో ఎండ్‌లో సిరాజ్ మాత్రం క్యాచ్‌లు డ్రాప్ చేశాడు.బంతి వికెట్ కీపర్ చేతికి కూడా బాగానే వచ్చింది. అంతా సజావుగా సాగుతోన్న సమయంలో బంతిని మార్చాలని కెప్టెన్ కోరాడు. అంతటితో అతడు ఆగలేదు.. అంపైర్‌తో గొడవ కూడా పడ్డట్లు కనిపించింది. అయితే, మార్చుకున్న బంతి మరింత పాతదానిలా ఉంది. దీంతో వాళ్లు మరోసారి అసహనానికి లోనయ్యారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ నిర్ణయాలు నాకైతే కాస్త చెత్తగానే అనిపించాయి.బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా.. ఎందుకిలా చేశావు?ఒకటి బంతిని మార్చమని అడిగి టీమిండియా తప్పటడుగు వేసింది. అందుకోసం అంపైర్‌తో వాదనకు దిగడం రెండో తప్పు. కొత్త బంతి పాత బంతి కంటే మరింత ఎక్కువగా వాడిన బంతిలా ఉండటంతో.. మంచి బంతిని చేజార్చుకున్నట్లయింది. ఇది మీ మూడో తప్పు. ఓవైపు బుమ్రా ఆ బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా.. అనవసరంగా మార్చి ప్రత్యర్థికి మంచి అవకాశం ఇచ్చారు’’ అని నాసిర్ హుసేన్ గిల్ తీరుపై విమర్శల వర్షం కురిపించాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగులకు ఆలౌట్ కాగా.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ 40 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ గిల్ (16) నిరాశపరచగా.. రిషభ్ పంత్ 19 పరుగులు, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అజేయ అర్ధ శతకం (53)తో క్రీజులో ఉన్నారు.చదవండి: చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను.. ఎందుకంటే: బుమ్రా -
చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను: బుమ్రా
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్టోక్స్ బృందానికి తన పేస్ పదును రుచిచూపించి.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ ఘనత సాధించి ఆనర్స్ బోర్డు (Lord's Hounours Board)పై తన పేరును లిఖించుకున్నాడు.స్పందించిన బుమ్రాఈ నేపథ్యంలో మూడో టెస్టులో శుక్రవారం నాటి రెండో రోజు ఆట అనంతరం బుమ్రా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా డ్యూక్స్ బాల్ (Dukes Ball) నాణ్యత, బంతి మార్పుపై చెలరేగుతున్న వివాదంపై ఈ పేస్ గుర్రం తనదైన శైలిలో స్పందించాడు. ‘‘మ్యాచ్‌లో బంతిని మార్చడం సహజమే.ఆ విషయంలో నేనేమీ చేయలేను. అంతేకాదు.. ఈ వివాదంపై స్పందించి నా డబ్బును పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను. ఎందుకంటే.. నేను మ్యాచ్‌లో చాలా ఓవర్లపాటు బౌలింగ్ చేసేందుకు ఎంతగానో శ్రమిస్తూ ఉంటాను.చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడనుకాబట్టి వివాదాస్పద వ్యాఖ్యలతో నా మ్యాచ్ ఫీజును తగ్గించుకోవాలని అనుకోవడం లేదు. ఏదేమైనా.. మాకు ఇచ్చిన బంతితోనే మేము బౌలింగ్ చేస్తాము. బంతి మార్పు అంశంలో ఆటగాళ్లుగా మేము చేయగలిగింది ఏమీ లేదు. అందుకోసం మేము పోరాడలేము కూడా!ఒక్కోసారి మనకు అనుకూలంగా ఫలితం రావచ్చు. మరోసారి చెత్త బంతినే మన చేతికి ఇవ్వవచ్చు’’ అని బుమ్రా విలేకరుల ప్రశ్నకు బదులిచ్చాడు. 2018లో తాను ఇంగ్లండ్‌లో ఆడినపుడు డ్యూక్స్ బాల్‌ను ఎక్కువగా మార్చాల్సిన అవసరం రాలేదని స్పష్టం చేశాడు. బంతి అప్పట్లో బాగా స్వింగ్ అయ్యేదని.. తాను అప్పుడు అవుట్స్వింగర్లనే ఎక్కువగా సంధించేవాడినని బుమ్రా గుర్తు చేసుకున్నాడు.1-1తో సమంగా సిరీస్‌కాగా ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో లీడ్స్‌లో తొలి టెస్టులో ఓడిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచి ప్రస్తుతం 1-1తో సిరీస్ సమం చేసింది. బుమ్రాకు ఐదు వికెట్లు.. ఇంగ్లండ్ 387 ఆలౌట్ఇక లార్డ్స్‌లో గురువారం మూడో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు దక్కించుకోగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు కూల్చారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.టీమిండియా @145ఇదిలా ఉంటే... తొలి టెస్టు నుంచి డ్యూక్స్ బాల్ నాణ్యత విషయంలో టీమిండియా అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. ఎర్ర బంతి త్వరగా రూపు మారడంతో పదే పదే బాల్‌ను మార్చాల్సి వస్తుండగా.. ఇప్పటికే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ అంపైర్లతో వాదనకు దిగారు. ఈ క్రమంలో తమకు అనుకూల ఫలితం రాకపోవడంతో బంతిని నేలకేసి కొట్టిన పంత్‌ను ఐసీసీ మందలించింది. అతడి ఖాతాలో ఓ డీ మెరిట్ పాయింట్ జమచేసింది.ఇక లార్డ్స్ టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా గిల్, సిరాజ్ బంతి మార్పు అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, బంతిని మార్చినప్పటికీ పాత బంతితో దానికి ఏమాత్రం పోలిక లేదంటూ ఇద్దరూ అసహనానికి గురయ్యారు. ఇదే విషయమై బుమ్రాను ప్రశ్నించగా పైవిధంగా స్పందించాడు. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. డ్యూక్స్ బాల్ అంటే..మొదట్లో డ్యూక్స్ కుటుంబం ఎర్ర బంతులను తయారు చేసేది. చేతితో ఆరు వరుసల దారంతో వీటిని కుడతారు. సీమ్‌కు అనుకూలంగా ఉండే ఈ బంతి దీర్ఘకాల మన్నికకు పెట్టిందిపేరు. ఇంగ్లిష్ కండిషన్లకు సరిగ్గా సరిపోతుంది. అయితే, తాజా సిరీస్‌లో త్వరత్వరగా బంతి రూపు మారడం వివాదానికి, బంతి నాణ్యతపై చర్చకు దారి తీసింది. ప్రస్తుతం డ్యూక్స్ బాల్ తయారీ కంపెనీ దిలీప్ జగ్‌జోడియా చేతిలో ఉంది.చదవండి: IND vs ENG 3rd Test: అంపైర్‌పై గిల్, సిరాజ్ అసహనం!.. గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు!DAY 1 ➡ 1 Wicket𝐃𝐚𝐲 𝟐 ➡ 𝐍𝐚𝐦𝐞 𝐨𝐧 𝐋𝐨𝐫𝐝'𝐬 𝐇𝐨𝐧𝐨𝐮𝐫𝐬 𝐁𝐨𝐚𝐫𝐝 🎖@Jaspritbumrah93, yet again, stole the show with a fiery 5/74 on Day 2 & etched his name into Lord’s rich legacy 💪#ENGvIND 👉 3rd TEST, DAY 3 | SAT, 12th JULY, 2:30 PM | Streaming on… pic.twitter.com/X3jqiobSko— Star Sports (@StarSportsIndia) July 11, 2025 -
అంపైర్‌పై గిల్, సిరాజ్ అసహనం!.. గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు!
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) మరోసారి అంపైర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పదే పదే ఇలా చేయడం సరికాదంటూ ఫీల్డ్ అంపైర్ వ్యవహారశైలిని విమర్శించాడు. అసలేం జరిగిందంటే.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య లార్డ్స్ వేదికగా గురువారం (జూలై 10) మూడో టెస్టు మొదలైంది.ఆదిలోనే షాకులుటాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి 83 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఈ క్రమంలో 251/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు బుమ్రా ఆదిలోనే షాకులు తగిలాయి. బెన్ స్టోక్స్ (44), క్రిస్ వోక్స్ (0), జో రూట్ (104) వికెట్లు కూల్చి బ్రేక్ ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 91వ ఓవర్ మధ్యలో కొత్త బంతి కావాలని టీమిండియా అడిగింది. 10.4 ఓవర్ల తర్వాత బంతిని మార్చాలని కోరగా.. అంపైర్ నుంచి వెంటనే సానుకూల స్పందన రాలేదు. అయితే, హూప్ టెస్టులో బంతి ఫెయిల్ కాగా.. అంపైర్ కొత్త బంతి ఇచ్చాడు. అయితే, అది చూసిన గిల్.. పాత బంతితో దీనికి ఏమాత్రం పోలిక లేదంటూ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు.పాతబడిన బంతిలా ఉందా? నిజమా?ఇంతలో బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కూడా వచ్చి.. ‘‘ఇది పది ఓవర్ల తర్వాత పాతబడిన బంతిలా ఉందా? నిజమా?’’ అంటూ సెటైర్ వేశాడు. అతడి మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. ఏదేమైనా అంపైర్ ఇచ్చిన కొత్త బంతితో గిల్, సిరాజ్ అసంతృప్తి చెందినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు ఈ నేపథ్యంలో అంపైర్ తీరును విమర్శిస్తూ టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ తనదైన శైలిలో చణుకులు విసిరాడు. ‘‘ఇక్కడ కూర్చుని చూసినా.. అది పది ఓవర్లు పాత బడిన బంతిలా కాదు.. 20 ఓవర్లకు పైనే వాడిన బంతిలా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే ఇండియాలో జరిగి ఉంటేనా.. బ్రిటిష్ మీడియా ఎంతలా గంతులు వేసేదో’’ అంటూ గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులోనూ గిల్, పంత్ బంతిని మార్చే విషయంలో అంపైర్లతో గొడవపడిన విషయం తెలిసిందే. ఇక లార్డ్స్ మ్యాచ్ విషయానికొస్తే.. శుక్రవారం ఆటలో భాగంగా 112.3 ఓవర్లలో 387 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.చదవండి: 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్Shubman Gill got angry on the field looking like Ricky Ponting is back 🥶⁰#INDvsENG #ENGvINDpic.twitter.com/lsmX5AYZU7— Kavya Maran (@Kavya_Maran_SRH) July 11, 2025 -
దమ్ముంటే ఇప్పుడు బాజ్‌బాల్ ఆడండి.. రూట్‌పై సిరాజ్ సెటైర్! వీడియో
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్‌ను స్లెడ్జింగ్ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్ క్రాలీ, డకెట్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు.కానీ నితీశ్ కుమార్ వేసిన ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. 44 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను ఓలీ పోప్, రూట్ అదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు.ఈ క్రమంలో 31 ఓవర్ వేసిన సిరాజ్.. అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి రూట్‌ను ఇబ్బందిపెట్టాడు. ఆ ఓవర్లో ఆరు బంతులు ఎదుర్కొన్న రూట్ కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో ఓవర్ పూర్తియ్యాక రూట్ వద్దకు సిరాజ్ వెళ్లి "దమ్ముంటే బాజ్‌బాల్ ఇప్పడు ఆడండి. నేను చూడాలనుకుంటున్నాను" సీరియస్‌గా అన్నాడు.ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా బ్రెండన్ మెకల్లమ్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత ఇంగ్లండ్ టెస్టుల్లో బాజ్ బాల్ పేరిట దూకుడుగా ఆడుతూ వస్తోంది. ఇక జో రూట్ 70 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.62 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్‌తో పాటు బెన్‌స్టోక్స్ ఉన్నారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు నితీశ్ కుమార్ రెడ్డి రెండు, జస్ప్రీత్ బుమ్రా, జడేజా తలా వికెట్ సాధించారు.DSP Siraj & Joe Root are Face 2 Face 🥵⚡️This one is really Crazy 👽@mdsirajofficial ✊️ @root66#siraj #ENGvIND #3rdTest #lords #LORDS #joeRoot #MohammedSiraj #london pic.twitter.com/4maGUJnK9o— Dheeraj Tanwar (@Dheerajtan23) July 10, 2025 -
IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటు
ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు టీమిండియా (Ind vs Eng) సిద్ధమైంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇరుజట్ల మధ్య గురువారం నుంచి టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించగా.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రావడం లాంఛనమే.అయితే, బుమ్రా రాక వల్ల ఎవరిపై వేటు పడుతుందనే చర్చ నడుస్తుండగా.. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఈ విషయంపై స్పందించాడు. ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna)ను జట్టు నుంచి తప్పించడం ఖాయమేనని స్పష్టం చేశాడు. కాగా లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. బర్మింగ్‌హామ్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే.1-1తో సమంఎడ్జ్బాస్టన్ వేదికగా ఆతిథ్య జట్టును ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా లేకపోయినా.. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్ దీప్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మొత్తంగా పది వికెట్లు కూల్చి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.ఇక సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ సైతం ఏడు వికెట్లతో సత్తా చాటగా.. ప్రసిద్ కృష్ణ మాత్రం కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. పేస్ దళంలో అతడొక్కడే ఇలా పూర్తిగా నిరాశపరిచాడు. బర్మింగ్‌హామ్‌లో మొత్తంగా 27 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ కర్ణాటక పేసర్.. 111 పరుగులు ఇచ్చుకున్నాడు.ప్రసిద్ కృష్ణపై వేటుపడక తప్పదుఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. బుమ్రా రాక కారణంగా ప్రసిద్ కృష్ణపై వేటుపడకతప్పదు. రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు.లీడ్స్‌లోనూ అంతే. వికెట్లు తీసినప్పటికీ జట్టుకు పెద్దగా ఉపయోగపడే ప్రదర్శన చేయలేదు’’ అని పేర్కొన్నాడు. కాబట్టి మేనేజ్మెంట్ అతడికి మరో అవకాశం ఇవ్వదని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. పచ్చికతో కూడుకున్న లార్డ్స్ పిచ్ ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించనుందన్న విశ్లేషణల నడుమ.. నలుగురు ఫ్రంట్‌లైన్ పేసర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది.బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్‌లతో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో ఈ మేరకు నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, పిచ్ స్వభావాన్ని బట్టి తాము 3+1 లేదంటే 3+2 కాంబినేషన్‌తో బరిలోకి దిగుతామని టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు.మూడో టెస్టుకు భారత తుదిజట్టు అంచనాశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇంగ్లండ్ గడ్డపై తొలి సిరీస్ కైవసం -
Ind vs Eng: పట్టుబిగించిన భారత్.. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబాటు!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్ సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. ఆది నుంచి పట్టుబిగించిన గిల్ సేన.. ఆతిథ్య జట్టుకు కొండంత లక్ష్యాన్ని విధించింది. బ్యాటింగ్‌లో దుమ్ములేపిన టీమిండియా.. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 427/6 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.తద్వారా ఇంగ్లండ్ ముందు ఏకంగా 608 పరుగుల టార్గెట్ ఉంచింది. 64/1 ఓవర్ నైట్ స్కోరుతో టీమిండియా శనివారం తమ ఆట మొదలుపెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269)తో చెలరేగిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ధనాధన్ దంచికొట్టాడు. 162 బంతుల్లో 161 పరుగులతో భారీ శతకం సాధించాడు.మిగతా వారిలో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (55), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65) అర్ధ శతకాలతో రాణించగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (69 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, షోయబ్ బషీర్ రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మహ్మద్ సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ జాక్ క్రాలే (0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు.ఇక మరో భారత పేసర్ ఆకాశ్ దీప్ మరో ఓపెనర్ బెన్ డకెట్ (25), జో రూట్ (6) వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 15, ఓలీ పోప్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరిదైన ఐదో రోజు భారత్ మిగిలిన ఏడు వికెట్లు కూల్చి గెలుపొందాలని పట్టుదలగా ఉండగా.. విజయానికి 536 పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లండ్ కనీసం డ్రా కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు-2025 (బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6))👉వేదిక: ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హామ్👉టాస్: ఇంగ్లండ్- మొదట బౌలింగ్👉భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు- 587 ఆలౌట్👉ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు- 407 ఆలౌట్ 👉భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం👉భారత్ రెండో ఇన్నింగ్స్- 427/6 డిక్లేర్డ్- తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని మొత్తం 607👉ఇంగ్లండ్ లక్ష్యం- 608👉శనివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 72/3 (16). -
నన్ను మూడో టెస్టులో ఆడిస్తారో?.. లేదో తెలియదు: టీమిండియా స్టార్
టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య రెండో టెస్టు రసవత్తరంగా మారింది. మొదటి రెండు రోజులు భారత్ ఏకపక్షంగా పైచేయి సాధించగా.. మూడో రోజు మాత్రం ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత బౌలర్ల ధాటికి ఒక దశలో 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్టోక్స్ బృందాన్ని జేమీ స్మిత్ (184 నాటౌట్), హ్యారీ బ్రూక్(158) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు.ఇద్దరూ సెంచరీలతో చెలరేగి ఏకంగా 303 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో టీమిండియా పట్టుతప్పినట్లే అనిపించింది. అయితే, పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ (Akash Deep) తమ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లతో మెరవగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు.180 పరుగుల మేర ఆధిక్యంభారత పేసర్ల దెబ్బకు ఇంగ్లండ్ బజ్‌బాల్ ఇన్నింగ్స్ 407 పరుగుల వద్ద ముగిసిపోయింది. 89.3 ఓవర్లలో ఈ మేర స్కోరు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల మేర ఆధిక్యం లభించింది. ఇక మ్యాచ్‌లో బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0), హ్యారీ బ్రూక్ (158) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చిన ఆకాశ్ దీప్.. క్రిస్ వోక్స్(5) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆకాశ్ దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తదుపరి మ్యాచ్‌లో ఆడతానో లేదో తెలియదని.. రెండో టెస్టులో మిగిలిన రెండు రోజుల్లో తానేంటో మరోసారి నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు.మూడో టెస్టులో ఆడిస్తారో?.. లేదో తెలియదు‘‘ఈ టెస్టు మ్యాచ్‌లో మాకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతాం. మూడో టెస్టు గురించి నేను ఇప్పుడే ఆలోచించడం లేదు. ఈ రెండు రోజుల్లో నా శాయశక్తులా జట్టు విజయం కోసం పనిచేయడమే ముఖ్యం.ఆ తర్వాతే మరో మ్యాచ్‌లో ఆడిస్తారా? లేదా? అన్న విషయం గురించి ఆలోచిస్తాను. ఈ విషయంలో మేనేజ్మెంట్దే తుది నిర్ణయం. లార్డ్స్ టెస్టు ఆడతారా? అంటే నాకైతే కచ్చితంగా తెలియదు. నేను ఆడొచ్చు.. ఆడకపోవచ్చు. మ్యాచ్‌కు ఒకరోజు ముందే మాకు ఆ విషయం తెలుస్తుంది’’ అని ఆకాశ్ దీప్ మీడియా ప్రశ్నలకు బదులిచ్చాడు.బుమ్రా స్థానంలోకాగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. లీడ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలు కాగా.. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం రెండో టెస్టు మొదలైంది.ఇక లీడ్స్‌లో తొలి టెస్టు ఆడిన భారత ప్రధాన జస్ప్రీత్ బుమ్రాకు.. రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చాడు. అయితే, బుమ్రాను తదుపరి లార్డ్స్ టెస్టులో ఆడించేందుకే ఇప్పుడు రెస్ట్ ఇచ్చామని కెప్టెన్ గిల్ చెప్పాడు. దీనిని బట్టి ఆకాశ్ దీప్‌నకు మూడో టెస్టులో చోటు దక్కదా? అన్న ప్రశ్నకు ఈ పేసర్ ఇలా బదులిచ్చాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి మూడో రోజు పూర్తయ్యేసరికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (28) పెవిలియన్ చేరగా.. కేఎల్ రాహుల 28, కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌పై భారత్ మూడో రోజు ఆట ముగిసే సరికి 244 పరుగుల ఆధిక్యంలో ఉంది.చదవండి: 'అతడిని ఆడించకపోవడం తెలివితక్కువ నిర్ణయం'.. గంభీర్‌పై ఇంజనీర్ ఫైర్ -
ఈ రోజు కోసమే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా: మహ్మద్ సిరాజ్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. తన సంచలన బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా లేని లోటును సిరాజ్ తీర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ మియా ఆరు వికెట్లతో సత్తాచాటాడు.రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన సిరాజ్.. ఆ తర్వాత మూడో రోజు బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ వంటి కీలక వికెట్లను పడగొట్టాడు. ఇంగ్లీష్ జట్టు టెయిలాండర్లను ఈ హైదారబాదీ వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపాడు.ఒక ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. తన ప్రదర్శనపై మూడో రోజు ఆట అనంతరం సిరాజ్ స్పందించాడు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమని అతడు చెప్పుకొచ్చాడు."ఇంగ్లండ్ గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా. అందుకే నమ్మశక్యంగా అనిపించడం లేదు. నిజానికి నేను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నా వికెట్లు మాత్రం రావడం లేదు. ఇప్పటి వరకు నాలుగు వికెట్లకు మించి తీయలేదు.ఇప్పుడు ఆరు వికెట్లు సాధించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. పిచ్ నెమ్మదిగా ఉన్నా క్రమశిక్షణతో సరైన చోట బంతులు వేస్తే ఫలితం రాబట్టవచ్చని నమ్మాను. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులు నిరోధించే ప్రయత్నం చేశాను. మిగతా ఇద్దరితో పోలిస్తే నాకే అనుభవం ఎక్కువ కాబట్టి ఆ సవాల్‌ను స్వీకరించి బాధ్యతగా బౌలింగ్ చేశాను. బుమ్రా లేకపోవడంతో పేస్ బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేశాను" అని విలేకరుల సమావేశంలో సిరాజ్ పేర్కొన్నాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్‌లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 158) భారీ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ 6వ వికెట్‌కు 303 పరుగులు జోడించారు.భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. తొలి భారత ప్లేయర్‌గా -
సిరాజ్ ‘సిక్సర్’
భారత బౌలింగ్ ధాటికి ఒకదశలో ఇంగ్లండ్ స్కోరు 84/5... ఇక మూడో రోజే మ్యాచ్ మన చేతికి చిక్కినట్లే అనిపించింది. అయితే జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ అసాధారణ బ్యాటింగ్‌తో ఎదురుదాడి చేసి ‘ట్రిపుల్ సెంచరీ’ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లండ్ తేరుకోగలిగింది. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్ల ప్రదర్శన శుక్రవారం ఆటలో హైలైట్‌గా నిలవగా, ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు ‘డకౌట్’ కావడం విశేషం. అయినా సరే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 180 పరుగులతో కలిపి ఇప్పటికే 244 పరుగులు ముందంజలో ఉన్న టీమిండియా మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. నేడు మన బ్యాటర్లు చెలరేగి ప్రత్యర్థి ముందు ఎంత లక్ష్యం ఉంచుతారనేది ఆసక్తికరం.బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో రెండో టెస్టుపై భారత్ పట్టు బిగించింది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం జట్టు ఓవరాల్‌గా 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. జైస్వాల్ (22 బంతుల్లో 28; 6 ఫోర్లు) అవుట్ కాగా... కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 28 బ్యాటింగ్; 6 ఫోర్లు), కరుణ్ నాయర్ (7 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 77/3తో శుక్ర వారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (207 బంతుల్లో 184 నాటౌట్; 21 ఫోర్లు, 4 సిక్స్‌లు), హ్యారీ బ్రూక్ (234 బంతుల్లో 158; 17 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 303 పరుగులు జోడించారు. భారత పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (6/70), ఆకాశ్‌దీప్ (4/88) కలిసి ప్రత్యరి్థని పడగొట్టారు. మెరుపు భాగస్వామ్యం... మూడో రోజు ఆటలో తొలి 10 బంతులు ముగిసేసరికి మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసినట్లు అనిపించింది! ‘హైదరాబాద్ పేసర్’ సిరాజ్ వరుసగా రెండు చక్కటి బంతులతో రూట్ (22), స్టోక్స్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రెండోసారి ఇంగ్లండ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ వికెట్ల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బ్రూక్, స్మిత్ కలిసి బౌండరీలతో చెలరేగిపోయారు. వీరిద్దరిని నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన స్మిత్ 80 బంతుల్లోనే సెంచరీ (14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సాధించడం విశేషం. తొలి సెషన్లో ఇంగ్లండ్ 27 ఓవర్లలో ఏకంగా 172 పరుగులు రాబట్టడం విశేషం. తప్పిన ఫాలోఆన్... లంచ్ తర్వాత కూడా బ్రూక్, స్మిత్ అంతే పట్టుదలతో బ్యాటింగ్‌ను కొనసాగించారు. ఈ క్రమంలో బ్రూక్ కూడా 137 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా, భాగస్వామ్యం 200 పరుగులు దాటింది. రెండో సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోని ఇంగ్లండ్ 28 ఓవర్లలో 106 పరుగులు జోడించింది. విరామానంతరం సిరాజ్ ఓవర్లో స్మిత్ స్వే్కర్ లెగ్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో పార్ట్నర్íÙప్ 300 పరుగులకు చేరింది. అయితే ఎట్టకేలకు ఈ జోడీని ఆకాశ్‌దీప్ విడదీశాడు. కొత్త బంతితో వేసిన మూడో ఓవర్లోనే బ్రూక్‌ను ఆకాశ్‌దీప్ బౌల్డ్ చేయగా... తర్వాతి ఓవర్లోనే ఇంగ్లండ్‌కు ఫాలో ఆన్ ప్రమాదం తప్పింది. అయితే ఆ తర్వాత 12 పరుగుల వ్యవధిలో చివరి 4 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 587; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) సిరాజ్ 19; డకెట్ (సి) గిల్ (బి) ఆకాశ్‌దీప్ 0; పోప్ (సి) రాహుల్ (బి) ఆకాశ్‌దీప్ 0; రూట్ (సి) పంత్ (బి) సిరాజ్ 22; బ్రూక్ (బి) ఆకాశ్‌దీప్ 158; స్టోక్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 0; స్మిత్ (నాటౌట్) 184; వోక్స్ (సి) నాయర్ (బి) ఆకాశ్‌దీప్ 5; కార్స్ (ఎల్బీ) (బి) సిరాజ్ 0; టంగ్ (ఎల్బీ) (బి) సిరాజ్ 0; బషీర్ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (89.3 ఓవర్లలో ఆలౌట్) 407.వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25, 4–84, 5–84, 6–387, 7–395, 8–396, 9–407, 10–407. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 20–2–88–4, సిరాజ్ 19.3–3–70–6, ప్రసిధ్ 13–1–72–0, నితీశ్ రెడ్డి 6–0–29–0, జడేజా 17–2–70–0, సుందర్ 14–0–73–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) (బి) టంగ్ 28; రాహుల్ (బ్యాటింగ్) 28; నాయర్ (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (13 ఓవర్లలో వికెట్ నష్టానికి) 64. వికెట్ల పతనం: 1–51. బౌలింగ్: వోక్స్ 5–0–28–0, కార్స్ 5–1–23–0, టంగ్ 3–1–12–1. ఒకే ఓవర్లో 23 పరుగులు... ప్రసిధ్ కృష్ణ ఓవర్లో స్మిత్ చెలరేగిన తీరు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో తొలి బంతికి పరుగు తీయని స్మిత్ ఆ తర్వాత వరుసగా 4, 6, 4, 4, (వైడ్), 4 బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. తొలి టెస్టులోనే ఆరుకు పైగా ఎకానమీతో చెత్త బౌలింగ్ ప్రదర్శన చేసిన ప్రసిధ్ ఈ టెస్టులోనూ ఘోరంగా విఫలమయ్యాడు.క్యాచ్‌లు చేజారె... మూడో రోజు ఆటలో బ్రూక్, స్మిత్ జోరును నిలువరించేందుకు కొన్ని అవకాశాలు వచి్చనా అవి వృథా అయ్యాయి. మరీ సులువైనవి కాకపోయినా... మూడు క్యాచ్‌లు వదిలేయడం ఇంగ్లండ్‌కు మేలు చేసింది. జడేజా బౌలింగ్‌లో బ్రూక్ (వ్యక్తిగత స్కోరు 63) ఇచ్చిన క్యాచ్‌ను గిల్ అందుకోలేకపోయాడు. వేగంగా వచి్చన బంతి అతని తలకు కూడా తగిలింది. తన బౌలింగ్‌లోనే స్మిత్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ (స్కోరు 90)ను సుందర్ చేజార్చాడు. ఆ తర్వాత నితీశ్ బౌలింగ్‌లో స్మిత్ (స్కోరు 121) ఇచి్చన క్యాచ్‌ను పంత్ నేలపాలు చేశాడు.⇒ 4 సిరాజ్ కెరీర్లో నాలుగో సారి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ నాలుగూ వేర్వేరు దేశాల్లో (ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్) రావడం విశేషం. -
ENG VS IND 2nd Test: ఆరేసిన సిరాజ్.. 407 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ సెంచరీలు చేసి ఇంగ్లండ్‌ను గట్టెక్కించారు. 84 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లండ్‌ను బ్రూక్, స్మిత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 303 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్‌ను తిరిగి ఆటలోకి తెచ్చారు. బ్రూక్, స్మిత్ ద్వయం సగం వికెట్లు కోల్పోయినా డిఫెన్స్‌లో పడకుండా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మిత్ 80, బ్రూక్ 137 బంతుల్లో సెంచరీలు పూర్తి చేశారు.387 పరుగుల వద్ద బ్రూక్ ఔటయ్యాక ఇంగ్లండ్ మరో 20 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది. జేమీ స్మిత్ అర్హమైన డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. అతనికి మరికొద్ది బంతులు అవకాశం దొరికినా డబుల్ పూర్తి చేసేవాడు. బ్రూక్‌ను ఆకాశ్‌దీప్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. ఆతర్వాత కొద్ది సేపటికే ఆకాశ్‌దీప్ క్రిస్ వోక్స్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. చివరి 3 వికెట్లను సిరాజ్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు (డకెట్, పోప్, స్టోక్స్, కార్స్, టంగ్, బసీర్) డకౌట్ అయ్యారు. క్రాలే 19, రూట్ 22, వోక్స్ 5 పరుగులు చేశారు. ఇంగ్లండ్ స్కోర్‌లో 80 శాతం పరుగులు బ్రూక్, స్మిత్‌లే చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ (6/70), ఆకాశ్‌దీప్ (4/88) అద్భుతంగా బౌలింగ్ చేసి మొత్తం వికెట్లు తీశారు. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. మొత్తంగా భారత్‌కు 180 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్.. శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 28 పరుగుల చేసి ఔట్ కాగా.. కే ఎల్ రాహూల్ 28 , కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 244 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ENG VS IND 2nd Test Day 3: ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్‌ను భారీ దెబ్బేశాడు. రెండో ఓవర్లోనే వరుస బంతుల్లో స్టార్ బ్యాటర్లు జో రూట్ (22), బెన్ స్టోక్స్‌లను (0) ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 88 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. DSP SIRAJ HAS TAKEN CHARGE AT EDGBASTON 🥶 pic.twitter.com/ycxlvrtuMC— Johns. (@CricCrazyJohns) July 4, 2025ప్రస్తుతం హ్యారీ బ్రూక్ (31), జేమీ స్మిత్ (4) క్రీజ్‌లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 499 పరుగులు వెనుకపడి ఉంది. భారత బౌలర్లలో సిరాజ్ 3, ఆకాశ్‌దీప్ 2 వికెట్లు తీశారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గట్టెక్కలేదు.ముందు రోజు (రెండో రోజు) టీ విరామం తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్ ప్రారంభించగానే వరుస షాక్‌లు తగిలాయి. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ వరుస బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ హీరోలు బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 13 పరుగులు మాత్రమే. 25 పరుగుల వద్ద ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో జాక్ క్రాలే (19) ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది.భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
బుమ్రా మూడు టెస్టులు ఆడితే.. షమీ కనీసం రెండు ఆడలేడా?
ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ఆరంభించిన టీమిండియా రెండో టెస్టులోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. బర్మింగ్‌హామ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. అయితే, ఈ మ్యాచ్‌కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అందుబాటులో ఉంటాడో, లేదోనన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులకు జట్టును ప్రకటించిన సమయంలోనే బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని యాజమాన్యం పేర్కొంది. బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్వయంగా వెల్లడించాడు.బుమ్రాపైనే భారంఇక ఈ టూర్‌కు పేస్ దళంలో నాయకుడు బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, యువ ఆటగాళ్లు ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్ (Akash Deep) కూడా ఎంపికయ్యారు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయగా.. సిరాజ్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఇక ప్రసిద్ కృష్ణ వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 27 ఓవర్ల బౌలింగ్‌లో 122 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్ల బౌలింగ్‌లో 51 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. మరోవైపు.. ప్రసిద్ కృష్ణ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్ల బౌలింగ్‌లో 128 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్ల బౌలింగ్‌లో 92 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు దక్కించుకోగలిగాడు.షమీ ఉంటే బాగుండేదిఅయితే, జట్టు బుమ్రాపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో అతడిపైనే భారం పడుతోంది. ఇలాంటి తరుణంలో మహ్మద్ షమీ ఉండి ఉంటే ఉపయోగకరంగా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పేస్ బౌలర్ 2023లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాపై చివరగా ఆడాడు.ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు చాలా కాలం దూరమైన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి ఒక ఫైఫర్ సాయంతో తొమ్మిది వికెట్లు కూల్చాడు. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం రాణించలేకపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన షమీ.. తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి కేవలం ఆరు వికెట్లే తీయగలిగాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో పర్యటనకు సెలక్టర్లు షమీ పేరును పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఫిట్నెస్ సమస్యలు కూడా ఇందుకు ఓ కారణం అని అగార్కర్ మాటల ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలో బుమ్రాకు పనిభారం తగ్గించినట్లుగా.. షమీకి కూడా ఓ అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బుమ్రా మూడు ఆడితే.. షమీ కనీసం రెండు ఆడలేడా?సిరాజ్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడం.. ప్రసిద్ అనుభవలేమి బౌలర్ కావడంతో షమీ పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది. బుమ్రాను మూడు టెస్టులు ఆడిస్తే.. షమీని కనీసం రెండు టెస్టుల్లో ఆడించాల్సిందనే వాదన వినిపిస్తోంది. కాగా 34 ఏళ్ల షమీ ఇప్పటి వరకు తన టెస్టు కెరీర్లో 64 మ్యాచ్‌లలో కలిపి 229 వికెట్లు కూల్చగా.. ఇందులో ఇంగ్లండ్ గడ్డ మీద 14 మ్యాచ్‌లు ఆడి 42 వికెట్లు తీశాడు.మరోవైపు సిరాజ్.. ఇప్పటికి ఆడిన 37 టెస్టుల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఏదేమైనా ఇంగ్లండ్ టూర్లో అనుభవజ్ఞుడైన షమీ ఉంటే పేస్ బౌలింగ్ విభాగం మరింత బలపడేదని విశ్లేషకులు అంటున్నారు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా రెండో టెస్టుకు జూలై 2-6 వరకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం.. చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్ -
వాళ్లంతా డుమ్మా!.. వీళ్లకు సీరియస్ వార్నింగ్.. సిరాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు నేపథ్యలో టీమిండియా (Ind vs Eng 2nd Test) ప్రాక్టీస్‌లో తలమునకలైంది. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు పునరావృతం చేయకుండా ఉండేందుకు కఠినంగా సాధన చేస్తోంది. ఇందులో భాగంగా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బ్యాట్‌తో నెట్స్‌లో శ్రమించడం విశేషంగా నిలిచింది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో పాటు యువ పేస్ బౌలర్ ప్రసిద్ కృష్ణ ట్రెయినింగ్ సెషన్‌కు గైర్హాజరు కాగా.. సిరాజ్‌తో ఇతర టెయిలెండర్లు కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో మునిగిపోవడం గమనార్హం. టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే.లోయర్ ఆర్డర్ కూడా దారుణంగా విఫలంఈ క్రమంలో లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరుగగా.. గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బౌలర్లు, ఫీల్డర్లు తేలిపోవడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, లోయర్ ఆర్డర్ కూడా దారుణంగా విఫలం కావడం ప్రభావం చూపింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి టెయిలెండర్లంతా కలిపి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.అదే సమయంలో ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్ ఉత్తమంగా రాణించి జట్టు విజయంలో భాగమైంది. ఈ నేపథ్యంలో భారత టెయిలెండర్లపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో సిరాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీరియస్ వార్నింగ్.. సిరాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్!బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ నిర్దేశకత్వంలో సిరాజ్ డిఫెన్సివ్ షాట్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. షార్ట్ బంతులు ఎదుర్కొన్న అతడు.. అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతుల్ని వదిలేశాడు. ఫార్వర్డ్ డిఫెన్స్ కూడా ప్రాక్టీస్ చేశాడు.సాధారణంగా బౌలర్లు.. ఇంతగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టరు. అయితే, మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు టెయిలెండర్లు బ్యాటింగ్‌పై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌కు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ డుమ్మా కొట్టినట్లు సమాచారం. కాగా గిల్ (147)తొలి టెస్టులో శతకం బాదగా.. వైస్ కెప్టెన్ పంత్ ఏకంగా రెండు సెంచరీలు (134, 118) బాదాడు.ఇక రెండో టెస్టుకు ప్రధాన పేసర్ బుమ్రా దూరం కానున్నాడన్న వార్తల నేపథ్యంలో అర్ష్‌దీప్ సింగ్ అరంగేట్రం చేయనున్నాడని తెలుస్తోంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సూచనల మేరకు నెట్స్‌లో అర్ష్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ఇందుకు కారణం. కాగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టుకు వేదిక. ఇరుజట్ల మధ్య జూలై 2-6 వరకు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు! -
కొంప ముంచిన జైస్వాల్.. కట్టలు తెంచుకున్న సిరాజ్ ఆగ్రహం!
టీమిండియాతో తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett) శతక్కొట్టాడు. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో.. 122 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా 2010 తర్వాత ఓ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తొలి ఓపెనింగ్ బ్యాటర్‌గా నిలిచాడు.చివరగా 2010లో బంగ్లాదేశ్‌తో మీర్పూర్ టెస్టులో అలిస్టర్ కుక్ ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే.. బెన్ డకెట్‌కు టెస్టుల్లో ఇది ఆరో శతకం. నిజానికి.. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఫీల్డింగ్ వైఫల్యం కారణంగానే డకెట్ సెంచరీ మార్కు అందుకున్నాడని చెప్పవచ్చు.జైసూ తప్పిదం..ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 39వ ఓవర్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో ఐదో ప్రయత్నంలో షార్ట్ బంతిని సంధించంగా.. దానిని ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన డకెట్.. బంతిని గాల్లోకి లేపాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లో ఉన్న వేళ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి పరిగెత్తుకు వచ్చిన జైస్వాల్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు.సిరాజ్ ఆగ్రహంఅప్పటికి డకెట్ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. కొరకరాని కొయ్యగా మారిన అతడిని అవుట్ చేసే అవకాశాన్ని జైసూ జారవిడవడంతో సిరాజ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. గాల్లోకి పంచ్‌లు విసురుతూ ఆగ్రహం వెళ్లగక్కాడు. మరోవైపు.. భారత జట్టు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా అసహనానికి లోనయ్యాడు.కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో జైస్వాల్ క్యాచ్‌లు డ్రాప్ చేయడం ఇది నాలుగోసారి. తొలి ఇన్నింగ్స్‌లో మూడుసార్లు ఇదే తరహాలో జైసూ కారణంగా ప్రత్యర్థి బ్యాటర్లు అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నారు. క్యాచ్ విన్ మ్యాచెస్ అంటారు కదా! కానీ జైసూ ఇలా కీలక సమయాల్లో పదే పదే క్యాచ్‌లు మిస్ చేయడం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి! ఒకవేళ వీటి కారణంగా మ్యాచ్ ఫలితం గనుక తారుమారైతే జైస్వాల్‌పై విమర్శల జడి కురవడం ఖాయం.వర్షం వల్ల ఆగిన మ్యాచ్ఇక బ్యాటర్‌గా మాత్రం ఈ యువ ఓపెనర్ లీడ్స్ టెస్టులో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం (101) బాదిన జైసూ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. కాగా భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ నిలకడైన ఆటతో ముందుకు సాగుతోంది. మంగళవారం నాటి ఆఖరి రోజు ఆటలో 40.5 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఇంగ్లండ్ బ్యాటింగ్ నిలిచిపోయింది. అప్పటికి ఓపెనర్లు డకెట్ 105, జాక్ క్రాలే 59 పరుగులతో ఉండగా.. ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసింది. విజయానికి భారత్ ఇంకా పది వికెట్ల దూరంలో ఉండగా.. ఇంగ్లండ్ గెలుపునకు 190 పరుగులు అవసరం.UPDATE: Ind vs Eng 1st Test: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమిచదవండి: గిల్ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్!.. ఆఖరికి మేమే గెలిచాం! -
రెచ్చగొట్టిన మహ్మద్ సిరాజ్.. ఇచ్చిపడేసిన ఇంగ్లండ్ బ్యాటర్! వీడియో
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బౌలింగ్ చేసేటప్పుడు తన మాటలతో, చేష్టలతో ప్రత్యర్ధి బ్యాటర్లను రెచ్చగొడుతూ ఉంటాడు. తాజాగా సిరాజ్ మియా మరోసారి తన చర్యలతో వార్తల్లో నిలిచాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో సిరాజ్ తన సహనాన్ని కోల్పోయాడు. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌తో ఈ హైదరాబాదీ వాగ్వాదానికి దిగాడు. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ 84వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో బ్రూక్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఆ తర్వాతి బంతిని సిరాజ్ షర్ప్ ఇన్‌స్వింగర్‌గా సంధించాడు. ఆ బంతిని ఆడడానికి హ్యారీ ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలో బ్రూక్ వైపు సిరాజ్ సీరియస్ లూక్ ఇచ్చాడు. అంతేకాకుండా అతడిని ఏదో మాట అన్నాడు.అందుకు బదులుగా బ్రూక్.. బౌలింగ్ వేసేందుకు రన్ ఆప్ మార్క్ చేసుకో అంటూ సమాధనమిచ్చాడు. బ్రూక్‌ను రెచ్చగొట్టి ఔట్ చేయాలన్న సిరాజ్ వ్యూహాం ఫలించలేదు. 86వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌ను బ్రూక్ ఓ ఆట ఆడేసికున్నాడు. ఆ ఓవర్లో సిరాజ్ ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ దురదృష్టవశాత్తూ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. టీమిండియా ప్రస్తుతం 96 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.👀😯🗣️ Tensions rising in the middle!#MohammedSiraj and #HarryBrook in a fiery exchange as the heat is on at Headingley! 🔥#ENGvIND 1st Test Day 3 LIVE NOW Streaming on JioHotstar 👉 https://t.co/SIJ5ri9fiC pic.twitter.com/nKZTSeFZt1— Star Sports (@StarSportsIndia) June 22, 2025 -
బిజినెస్ రంగంలోకి సిరాజ్.. బంజారా హిల్స్‌లో లగ్జరీ రెస్టారెంట్
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్(రోడ్ నంబర్ 3)లో 'జోహార్ఫా' పేరిట సరికొత్త లగ్జరీ రెస్టారెంట్‌ను సిరాజ్ ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. కస్టమర్ల కోసం పర్షియన్, అరేబియన్, మొఘలాయ్, చైనీల్ లాంటి రకరకాల వంటకాలు తమ రెస్టారెంట్లో అందించనున్నట్లు తెలిపాడు.ఈ ఫుడ్ బిజినెస్‌లో అతడి సోదరుడు భాగస్వామి ఉన్నట్లు సిరాజ్ మియా పేర్కొన్నాడు. అయితే ఈ రెస్టారెంట్ ప్రారంభ తేదీ ఎప్పుడో ఇంకా సిరాజ్ వెల్లడించలేదు. కాగా భారత క్రికెటర్లు ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఇదేమి తొలిసారి కాదు. ఇప్పటికే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. బెంగళూరు, ముంబై, పుణే, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్‌లో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఉన్నాయి. కోహ్లితో పాటు రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ వంటి క్రికెట్ దిగ్గజాలు సైతం ఫుడ్‌బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. ఇక సిరాజ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి భారత బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది.చదవండి: నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలనుకుంటున్నా: గిల్ -
కోపంతో ఊగిపోయిన సిరాజ్.. ఇదేంటి మియా?.. ఇలాగేనా ప్రవర్తించేది?
గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు కోపమొచ్చింది. సహచర ఆటగాడిపై మైదానంలోనే అతడు కోపంతో ఊగిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. విషయమేమిటంటే..చేదు అనుభవంఐపీఎల్-2025 (IPL 2025) లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో శుబ్‌మన్ సేన 83 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగాలంటే మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ ఆది నుంచే గుజరాత్‌కు కలిసిరాలేదు. టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 230 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34), డెవాన్ కాన్వే (35 బంతుల్లో 52) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37) దానిని కొనసాగించాడు.The word 'fear' isn't in their dictionary 🔥#CSK's young guns Ayush Mhatre and Urvil Patel added to the Ahmedabad heat with their knocks 👏Updates ▶ https://t.co/P6Px72jm7j#TATAIPL | #GTvCSK | @ChennaiIPL pic.twitter.com/KcM4XW9peg— IndianPremierLeague (@IPL) May 25, 2025 ఇక శివం దూబే (8 బంతుల్లో 17) కాసేపు మెరుపులు మెరిపించగా.. డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57) ధనాధన్ దంచికొట్టాడు. రవీంద్ర జడేజా (18 బంతుల్లో 21 నాటౌట్) కూడా ఈసారి ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.అదనపు పరుగులుకాగా సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ను సిరాజ్ వేశాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొన్న ఉర్విల్ పటేల్.. మిడాఫ్ దిశగా బాల్‌ను తరలించాడు. కాన్వేతో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్నాడు. అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ డైరెక్ట్ త్రో ద్వారా వికెట్లను గిరాటేయాలని చూడగా.. మిస్ ఫీల్డ్ అయింది. ఓవర్ త్రో కారణంగా చెన్నై మరో పరుగు తీయగలిగింది.ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. గిల్ వేసిన ఓవర్ త్రోను అందుకునేందుకు స్క్వేర్ లెగ్ వద్ద నుంచి పరిగెత్తుకు వచ్చిన ఆర్. సాయి కిషోర్ బంతిని అందుకుని మిడ్ వికెట్ వద్ద కలెక్ట్ చేసుకున్నాడు. అనుకోకుండా బంతి అతడి నుంచి చేజారగా.. ఇంతలో సీఎస్కే బ్యాటర్లు మూడో పరుగు కూడా పూర్తి చేసుకున్నారు.ఇదేంటి మియా? ఇలాగేనా ప్రవర్తించేది?దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ కిషోర్‌ను ఉద్దేశించి గట్టిగానే తిట్టినట్లు కనిపించింది. అంతేకాదు.. బంతిని కూడా గ్రౌండ్‌కేసి కొడుతూ తన ఆగ్రహం వెళ్లగక్కాడు. ఇంతలో గిల్ వచ్చి సిరాజ్ భుజం తడుతూ నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘ఇదేంటి మియాన్’’ అంటూ ఇలాగేనా ప్రవర్తించేది? అన్నట్లుగా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. కాగా లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన గుజరాత్... 18.3 ఓవర్లలో కేవలం 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది. చదవండి: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గాpic.twitter.com/8UKU1ibO6o— The Game Changer (@TheGame_26) May 25, 2025 -
MI vs GT: అందరికీ అప్పుడే.. సిరాజ్‌కు ఇప్పుడు!
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు... భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టీ20 ప్రపంచకప్ విజేత ఉంగరాన్ని అందించాడు. గతేడాది జరిగిన పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కప్ గెలిచిన ఆ జట్టులోని సభ్యులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలి వార్షిక అవార్డుల కార్యక్రమంలో ప్రత్యేక ఉంగరాలు బహుకరించింది.అందరికీ అప్పుడే.. సిరాజ్‌కు ఇప్పుడు!ముంబై వేదికగా జరిగిన ఈ వేడుకకు సిరాజ్ గైర్హాజరు కాగా... సోమవారం వాంఖడే స్టేడియంలో సిరాజ్‌కు రోహిత్ శర్మ ఈ బహుమతిని అందించాడు. ఐపీఎల్లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సిరాజ్‌కు ముంబై స్టార్ రోహిత్ ఈ ఉంగరాన్ని అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రింగ్‌లో ఆటగాడి పేరు, జెర్సీ నంబర్‌తో పాటు జాతీయ చిహ్నం అశోక చక్రను పొందుపరిచారు.ముంబైతో మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు గుడ్న్యూస్ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. రిక్రియేషనల్ (సరదా కోసం తీసుకునే) డ్రగ్స్ వాడటం వల్ల అతడిపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) తాత్కాలిక నిషేధం విధించగా... సస్పెన్షన్ సమయంలో ‘సబ్‌స్టాన్స్ అబ్యూస్’ చికిత్స పూర్తి చేయడంతో అతడిపై నిషేధాన్ని తొలగించారు. దీంతో రబడ ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు అందుబాటులోకి వచ్చాడు.ఈ మేరకు దక్షిణాఫ్రికా ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రగ్ ఫ్రీ స్పోర్ట్ (ఎస్‌ఏఐడీఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. ‘రబడ డోపింగ్‌కు పాల్పడినట్లు ఏప్రిల్ 1న నిర్ధారణ అయింది. దీంతో అతడిపై తాత్కాలిక నిషేధం విధించారు. ఆ సమయంలో ఐపీఎల్ ఆడుతున్న రబడ తక్షణమే దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికా డోపింగ్ నిరోధక నియమాల ప్రకారం ప్రత్యేకంగా నిర్వహించే సబ్‌స్టాన్స్ అబ్యూస్ చికిత్స తీసుకున్నాడు. రెండు సెషన్లు పూర్తి కావడంతో అతడిపై విధించిన తాత్కాలిక నిషేధం ముగిసింది.నా వృత్తిపై గౌరవం, భక్తితో ఉంటానుఅతడు నెల రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. రబడ ఇప్పుడు నిరభ్యంతరంగా మ్యాచ్‌లు ఆడోచ్చు’ అని ఎస్‌ఏఐడీఎస్ వెల్లడించింది. ‘ఈ సంఘటనతో కుంగిపోను. ముందుకు సాగడమే నా లక్ష్యం. నిరంతరం కష్టపడుతూ నా వృత్తిపై గౌరవం, భక్తితో ఉంటాను’అని రబడ అన్నాడు. క్రీడల్లో మెరుగైన ప్రదర్శనకు ఉపయోగపడే డ్రగ్స్ తరహాలో కాకుండా కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి వాటిని రిక్రియేషనల్ డ్రగ్స్‌గా వ్యవహరిస్తారు.ఆటగాళ్లు వీటిని వాడితే నిబంధనల ప్రకారం గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం పడే అవకాశం ఉన్నా... సరదా కోసమే వాటిని వాడినట్లు... ఆ సమయంలో ఎలాంటి మ్యాచ్‌లు లేకపోవడంతోనే అలా చేసినట్లు ప్లేయర్ నిరూపించగలిగితే స్వల్ప నిషేధంతో తప్పించుకోవచ్చు. ఇక ముప్పై ఏళ్ల రబడ ఈ ఏడాది జనవరిలో ఎస్ఏ20 సందర్భంగా ఈ డ్రగ్ తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది. ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేయడంతో వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు రబడ అందుబాటులో ఉండనున్నాడు. చదవండి: వయసుతో పనేంటి?.. అతడు మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు: వరుణ్ చక్రవర్తి 𝙈𝙤𝙢𝙚𝙣𝙩 𝙩𝙤 𝘾𝙝𝙚𝙧𝙞𝙨𝙝 👏@mdsirajofficial receives a special ring from #TeamIndia Captain @ImRo45 for his impactful contributions in the team's victorious ICC Men's T20 World Cup 2024 campaign 💍@Dream11 pic.twitter.com/dHSnS4mwu1— BCCI (@BCCI) May 5, 2025 -
సందీప్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే
రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్ సందీప్ శర్మ (Sandeep Sharma) అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఆఖరి ఓవర్లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్‌గా సందీప్ నిలిచాడు. ఐపీఎల్-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శర్మ ఈ చెత్త రికార్డును నెలకొల్పాడు.ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన సందీప్ ఏకంగా 11 బంతులు విసిరాడు. ఆ ఓవర్లో సందీప్ నాలుగు వైడ్లు, ఓ నోబాల్ వేయడం గమనార్హం. ఆఖరి ఓవర్లో శర్మ మొత్తంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా ఈ చెత్త రికార్డు సాధించిన నాలుగో బౌలర్‌గా సందీప్ నిలిచాడు. సందీప్ కంటే ముందు మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్ పాండే, శార్ధూల్ ఠాకూర్ 11 బంతలు ఒకే ఓవర్లో వేశారు. అయితే ఈ ముగ్గురు ఆఖరి ఓవర్ కాకుండా వేర్వేరు ఓవర్లల్లో 11 బంతులు విసిరారు.ఐపీఎల్లో ఒకే ఓవర్లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్లు..👉11 బంతులు మొహమ్మద్ సిరాజ్ vs ముంబై ఇండియన్స్ 2023 (ఓవర్ 19)👉11 బంతులు తుషార్ దేశ్‌పాండే vs లక్నో సూపర్ జెయింట్స్ 2023 (ఓవర్ 4)👉11 బంతులు శార్దూల్ ఠాకూర్ vs కేకేఆర్ 2025 (ఓవర్ 13)👉11 బంతులు సందీప్ శర్మ vs ఢిల్లీ క్యాపిటల్స్ 2025 (ఓవర్ 20)కాగా చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. సూపర్ ఓవర్లో రాజస్తాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అయితే సూపర్ ఓవర్లో కూడా సందీప్ శర్మనే బౌలింగ్ చేయడం గమనార్హం. 12 పరుగుల టార్గెట్‌ను సందీప్ డిఫెండ్ చేసుకోలేకపోయాడు.చదవండి: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది' -
SRH VS GT: ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను.. అదే నన్ను పైకి లేపింది: సిరాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో సిరాజ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. నిన్న (ఏప్రిల్ 6) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీశాడు. తద్వారా గుజరాత్ సన్‌రైజర్స్‌ను వారి సొంత ఇలాకాలో (ఉప్పల్ స్టేడియంలో) చిత్తుగా ఓడించింది. ఈ ప్రదర్శనకు గానూ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ (4-0-19-3) సిరాజ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఆ ప్రదర్శనకు కూడా సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు గుజరాత్ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించడంలోనూ సిరాజ్ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో సిరాజ్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు (రోహిత్ శర్మ, రికెల్టన్లను క్లీన్ బౌల్డ్ చేశాడు) తీశాడు.సిరాజ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రెచ్చిపోవడంతో గుజరాత్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన ఈ జట్టు ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. గుజరాత్ ఈ స్థాయిలో సత్తా చాటడంలో సిరాజ్‌దే ప్రధాన పాత్ర. సన్‌రైజర్స్‌పై ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం సిరాజ్ ఇలా అన్నాడు. సొంత మైదానంలో ఆడటం ఓ ప్రత్యేకమైన అనుభూతి. ఇవాళ మ్యాచ్‌లో నా కుటుంబ సభ్యులు జనం మధ్యలో ఉన్నారు. అదే నన్ను పైకి లేపింది. నేను ఏడు సంవత్సరాలు ఆర్సీబీకి ఆడాను. నా బౌలింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు చాలా కష్టపడ్డాను. అది నాకు ఇప్పుడు పనిచేస్తోంది. ఓ సమయంలో నేను దానిని జీర్ణించుకోలేకపోయాను (ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కానందుకు).అయినా నిరాశపడకుండా ఫిట్నెస్ మరియు ఆటపై దృష్టి పెట్టాను. నేను చేసిన తప్పులపై వర్కౌట్ చేశాను. ప్రస్తుతం నా బౌలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. టీమిండియా తరఫున స్థిరంగా ఆడుతున్నప్పుడు జట్టులో స్థానం కోల్పోవడం నిజంగా బాధించింది. అయినా నన్ను నేను ఉత్సాహపరుచుకున్నాను. ఐపీఎల్ కోసం ఎదురు చూశాను. కసితో వర్కౌట్ చేసి సత్ఫలితాలు సాధిస్తున్నాను. -
‘ట్రావిషేక్’ మళ్లీ ఫెయిల్!.. ఇదేం బ్యాటింగ్? సహనం కోల్పోయిన కావ్యా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు రోజురోజుకీ అధ్వానంగా తయారవుతోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసిన కమిన్స్ బృందం.. తాజాగా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైంది. సొంత మైదానం ఉప్పల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.సమిష్టి వైఫల్యంతో పరాజయాల సంఖ్యను నాలుగుకు పెంచుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం టాపార్డర్ దారుణంగా విఫలం కావడమే. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్లుగా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma), ట్రవిస్ హెడ్ (Travid Head) దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకోవడం.. జట్టులోకి కొత్తగా వచ్చి వన్‌డౌన్‌లో ఆడుతున్న టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ కూడా వరుస మ్యాచ్‌లలో చేతులెత్తేయడం తీవ్ర ప్రభావం చూపుతోంది.టాపార్డర్ మరోసారి కుదేలుగుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ ఈ బ్యాటింగ్ త్రయం దారుణంగా విఫలమైంది. అభిషేక్ 16 బంతుల్లో 18 చేసి నిష్క్రమించగా.. హెడ్ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేశాడు. ఈ ఇద్దరి వికెట్లను హైదరాబాదీ స్టార్, గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు.Hyderabad + New ball = Miyan Magic!#MohammedSiraj rocks #SRH early with the big wicket of #TravisHead in the opening over! 👊🏻Watch LIVE action ➡ https://t.co/meyJbjwpV0#IPLonJioStar 👉 SRH 🆚 GT | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star Sports 2… pic.twitter.com/Vokiul9meR— Star Sports (@StarSportsIndia) April 6, 2025 సహనం కోల్పోయిన కావ్యా మారన్ఇక ఓపెనర్ల వరుస వైఫల్యాలతో విసుగెత్తిన సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘‘అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇంత ఘోరంగా అవుటవుతారా? ఇదేం బ్యాటింగ్’’ అన్నట్లుగా హావభావాలు పలికిస్తూ తలను బాదుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Ruk jao bhai kya kar rahe ho Normal cricket khel lo ab 🤣🤣Kavya maran's reactions 🤌🏽🤣 pic.twitter.com/O39QTMNgPc— ••TAUKIR•• (@iitaukir) April 6, 2025సిరాజ్ ‘స్ట్రోక్’ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (18), ట్రవిస్ హెడ్ (8), ఇషాన్ కిషన్ (17) మరోసారి చేతులెత్తేయగా.. నితీశ్ రెడ్డి (31) రాణించాడు. హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 27), కమిన్స్ (9 బంతుల్లో 22) వేగంగా ఆడి స్కోరును 150 పరుగుల మార్కు దాటించారు.గుజరాత్ బౌలర్లలో లోకల్ బాయ్ సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు కూల్చారు. లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌కు రైజర్స్ పేసర్ షమీ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ సాయి సుదర్శన్‌ను 5 పరుగులకే పెవిలియన్‌కు పంపించాడు.గిల్, వాషీ, రూథర్‌ఫర్డ్ ధనాధన్అదే విధంగా.. ప్రమాదకర బ్యాటర్ జోస్ బట్లర్‌ను కెప్టెన్ కమిన్స్ డకౌట్ చేశాడు. అయితే, రెండు కీలక వికెట్లు తీసిన ఆనందం సన్‌రైజర్స్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. నాలుగో స్థానంలో వచ్చిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ధనాధన్ (29 బంతుల్లో 49) దంచికొట్టాడు.ఆఖర్లో షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (16 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 35) తన పవర్ హిట్టింగ్తో గిల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గిల్, వాషీ, రూథర్‌ఫర్డ్ ఇన్నింగ్స్ కారణంగా 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయఢంకా మోగించింది.Glorious shots on display 🫡Captain Shubman Gill led from the top and remained unbeaten with a well constructed innings of 61(43) 👏Scorecard ▶ https://t.co/Y5Jzfr7tkC#TATAIPL | #SRHvGT | @ShubmanGill pic.twitter.com/1CWQU5gd82— IndianPremierLeague (@IPL) April 6, 2025 చదవండి: SRH VS GT: వారి పేసర్లను ఎదుర్కోవడం మా బ్యాటర్ల వల్ల కాలేదు: కమిన్స్ -
‘నాలుగు’తో నగుబాటు
ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు ముగిసేవరకు ఒక్క సిక్స్ కూడా లేదు... ఒకదశలో వరుసగా 6 ఓవర్ల పాటు కనీసం ఫోర్ కూడా రాలేదు... విధ్వంసక బ్యాటింగ్‌తో మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలతో విరుచుకుపడే సన్‌రైజర్స్ జట్టేనా ఇది? మొదటి మ్యాచ్ తర్వాత గతి తప్పిన బ్యాటింగ్‌తో హైదరాబాద్ అదే వైఫల్యాన్ని కనబర్చింది. ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఫలితంగా ఐపీఎల్ 18వ సీజన్లో వరుసగా నాలుగో ఓటమితో సన్‌రైజర్స్ ఆఖరి స్థానంతోనే మరింత అథమ స్థితికి చేరింది. గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తన సొంతగడ్డపై నాలుగు వికెట్లతో చెలరేగి సన్‌రైజర్స్‌ను కుప్పకూల్చాడు. పవర్‌ప్లేలో అతను ఓపెనర్లను అవుట్ చేసిన తర్వాత హైదరాబాద్ జట్టు కోలుకోలేకపోయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ ఆడుతూ పాడుతూ అలవోకగా ఛేదించింది. గిల్, సుందర్, రూథర్‌ఫోర్డ్ రాణించడంతో మరో 20 బంతులు మిగిలి ఉండగానే టైటాన్స్ జట్టు గెలుపు ఖాయమైంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఉప్పల్ స్టేడియంలోనూ కోలుకోలేకపోయిన జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడింది. ఆదివారం జరిగిన ఈ పోరులో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 31; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ సిరాజ్ (4/17) పదునైన బౌలింగ్‌తో రైజర్స్‌ను దెబ్బ తీయగా... సాయికిషోర్, ప్రసిధ్ కృష్ణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం టైటాన్స్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు), తొలిసారి టైటాన్స్ తరఫున ఆడిన వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) భాగస్వామ్యంతో జట్టు గెలుపు సులువైంది. వీరిద్దరు మూడో వికెట్‌కు 56 బంతుల్లో 90 పరుగులు జోడించారు. గిల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 21 బంతుల్లో 46 పరుగులు భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ముగించారు. ఓపెనర్లు విఫలం... టి20 క్రికెట్లో తొలిసారి ట్రవిస్ హెడ్ (5 బంతుల్లో 8; 2 ఫోర్లు)కు సిరాజ్ బౌలింగ్ చేశాడు. అయితే ఈ పోరాటం ఐదు బంతులకే పరిమితమైంది. మొదటి ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన హెడ్‌ను చివరి బంతికి సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత తన మూడో ఓవర్లో అభిషేక్ శర్మ (16 బంతుల్లో 18; 4 ఫోర్లు)ను కూడా సిరాజ్ వెనక్కి పంపడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఓపెనర్లను కోల్పోయిన హైదరాబాద్ 45 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (14 బంతుల్లో 17; 2 ఫోర్లు) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో నితీశ్, హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే నితీశ్ మరీ నెమ్మదిగా ఆడాడు. భారీ షాట్లు ఆడటంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఐదో ఓవర్ నుంచి 10వ ఓవర్ వరకు హైదరాబాద్ బ్యాటర్లు ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయారు. 13వ ఓవర్ నాలుగో బంతికి గానీ తొలి సిక్స్ నమోదు కాలేదు. రషీద్ బౌలింగ్‌లో క్లాసెన్ ఈ సిక్స్ బాదాడు. నాలుగో వికెట్‌కు నితీశ్, క్లాసెన్ 39 బంతుల్లో 50 పరుగులు జోడించారు. క్లాసెన్ అవుటైన తర్వాత తక్కువ వ్యవధిలో నితీశ్, కమిందు (1), అనికేత్ వర్మ (18) కూడా వెనుదిరిగారు. చివర్లో ప్యాట్ కమిన్స్ (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కాస్త ధాటిగా ఆడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. 15–19 ఓవర్ల మధ్య 34 పరుగులే రాబట్టిన రైజర్స్ ఇషాంత్ వేసిన ఆఖరి ఓవర్లో గరిష్టంగా 17 పరుగులు సాధించింది. భారీ భాగస్వామ్యం... ఛేదనలో టైటాన్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. షమీ తన తొలి ఓవర్లో సాయి సుదర్శన్ (5)ను వెనక్కి పంపగా, బట్లర్ (0)ను కమిన్స్ అవుట్ చేశాడు. అయితే సన్‌రైజర్స్ ఆనందం ఇక్కడికే పరిమితమైంది. గిల్, సుందర్ కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో వారికి హైదరాబాద్ బౌలర్ల నుంచి ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. సిమర్జిత్ ఓవర్లో సుందర్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో టైటాన్స్ స్కోరు 48 పరుగులకు చేరింది. మరోవైపు గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. 36 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు షమీ బౌలింగ్‌లో అనికేత్ అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగిన సుందర్ అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. 41 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన రూథర్‌ఫోర్డ్ చెలరేగిపోయాడు. అభిషేక్ ఓవర్లో అతను 4 ఫోర్లు బాదడం విశేషం. ఆ తర్వాత మ్యాచ్ ముగించేందుకు టైటాన్స్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. 19 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 100 వికెట్లు పడగొట్టిన 19వ భారతీయ బౌలర్‌గా, ఓవరాల్‌గా 26వ బౌలర్‌గా సిరాజ్ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు 97 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మొత్తం 102 వికెట్లు పడగొట్టాడు. 4/17 ఐపీఎల్ చరిత్రలో సిరాజ్ తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. 2023లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. స్కోరు వివరాలుసన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) తెవాటియా (బి) సిరాజ్ 18; హెడ్ (సి) సుదర్శన్ (బి) సిరాజ్ 8; ఇషాన్ కిషన్ (సి) ఇషాంత్ (బి) ప్రసిధ్ 17; నితీశ్ రెడ్డి (సి) రషీద్ (బి) సాయికిషోర్ 31; క్లాసెన్ (బి) సాయికిషోర్ 27; అనికేత్ (ఎల్బీ) (బి) సిరాజ్ 18; కమిందు (సి) సుదర్శన్ (బి) ప్రసిధ్ 1; కమిన్స్ (నాటౌట్) 22; సిమర్జిత్ (బి) సిరాజ్ 0; షమీ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–9, 2–38, 3–50, 4–100, 5–105, 6–120, 7–135, 8–135. బౌలింగ్: సిరాజ్ 4–0–17–4, ఇషాంత్ శర్మ 4–0–53–0, ప్రసిధ్ కృష్ణ 4–0–25–2, రషీద్ ఖాన్ 4–0–31–0, సాయికిషోర్ 4–0–24–2. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయిసుదర్శన్ (సి) అనికేత్ (బి) షమీ 5; గిల్ (నాటౌట్) 61; బట్లర్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 0; సుందర్ (సి) అనికేత్ (బి) షమీ 49; రూథర్‌ఫోర్డ్ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.4 ఓవర్లలో 3 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–15, 2–16, 3–106. బౌలింగ్: షమీ 4–0–28–2, కమిన్స్ 3.4–0–26–1, సిమ్రన్‌జీత్ 1–0–20–0, ఉనాద్కట్ 2–0–16–0, అన్సారీ 4–0–33–0, కమిందు మెండిస్ 1–0–12–0, అభిషేక్ శర్మ 1–0–18–0. ఐపీఎల్లో నేడుముంబై X బెంగళూరు వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. 'సెంచరీ' కొట్టిన మహ్మద్ సిరాజ్
ఐపీఎల్-2025లో టీమిండియా ఫాస్ట్ బౌలర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిరాజ్ నిప్పులు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతడిని ఆడటం హైదరాబాద్ బ్యాటర్ల తరం కాలేదు.అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లను సిరాజ్ ఔట్ చేశాడు. ఓవరాల్‌గా సిరాజ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన వందో ఐపీఎల్ వికెట్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 12వ ఇండియన్ ఫాస్ట్ బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 26వ బౌలర్‌గా సిరాజ్ మియా రికార్డులకెక్కాడు. సిరాజ్ తన 97వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ రికార్డును సాధించాడు. ఈ ఏడాది సీజన్లో సిరాజ్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో సిరాజ్ రెండో స్ధానంలో ఉన్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్(27),కమ్మిన్స్(22) రాణించారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌తో పాటు ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు డబుల్ గుడ్‌న్యూస్ -
#SRHvsGT : సిరాజ్, గిల్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే (ఫొటోలు)
-
డీఎస్పీ సిరాజ్‌కు సెల్యూట్.. ఆర్సీబీ ఓడను ముంచేశాడు: హర్భజన్
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బుధవారం(ఏప్రిల్ 2) చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ చిత్తు చేసింది. ఈ విజయంలో గుజరాత్ స్పీడ్ స్టార్ మహ్మద్ సిరాజ్‌ది కీలక పాత్ర. తన మాజీ జట్టుపై సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫిల్ సాల్ట్ (13 బంతుల్లో 14), దేవ్‌దత్ పడిక్కల్ (3 బంతుల్లో 4), లియామ్ లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54)లను సిరాజ్ ఔట్ చేశాడు. సిరాజ్తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సిరాజ్‌పై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కుర్పించాడు. తన మాజీ జట్టుపై సిరాజ్ ప్రతీకారం తీర్చుకున్నాడని హర్భజన్ అన్నాడు."ఐపీఎల్-2025లో మహ్మద్ సిరాజ్ మంచి రిథమ్‌లో ఉన్నాడు. ఆర్సీబీపై తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే చాలా సీజన్ల పాటు ఆర్సీబీకి ఆడినప్పటికి అతడిని వారు రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు అదే సిరాజ్ ఆర్సీబీ ఓడను ముంచేశాడు. డీఎస్సీ సిరాజ్‌కు సెల్యూట్. ఇది ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనే. సిరాజ్‌కు అభినందనలు.రషీద్ ఖాన్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్‌లో కూడా గుజరాత్ బాగా రాణించింది" అని తన యూట్యూబ్ ఛానల్లో భజ్జీ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్(54) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జితేష్ శర్మ(33), టిమ్ డేవిడ్(32) రాణించారు.గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌తో పాటు సాయికిషోర్ రెండు, అర్షద్, ప్రసిద్ద్, ఇషాంత్ తలా వికెట్ సాధించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. జోస్ బట్లర్(73) ఆజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సాయిసుదర్శన్(49) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: IPL 2025: గుజరాత్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన రబాడ -
నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్
గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. జాతీయ జట్టుకు దూరమైన కసి అతడి ఆటలో కనిపిస్తోందని.. త్వరలోనే అతడు టీమిండియాలో పునరాగమనం చేస్తాడని పేర్కొన్నాడు. కాగా హైదరాబాదీ పేసర్ చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తరఫున ఆడాడు.ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)జట్టులోనూ చోటివ్వలేదు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన సిరాజ్.. జట్టు ప్రయోజనాల దృష్ట్యానే సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తనను పక్కనపెట్టి ఉంటారని పేర్కొన్నాడు.ఆర్సీబీ వదిలేసిందిఅయితే, జాతీయ జట్టుకు దూరం కావడం వల్ల దొరికిన విశ్రాంతిని పొడగించకుండా.. ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తానని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025కి ముందు ఈ పేస్ బౌలర్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఏడేళ్ల పాటు తమతో ప్రయాణం చేసిన సిరాజ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలేసింది.టైటాన్స్ అక్కున చేర్చుకుందిఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు సిరాజ్‌ను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్-2025లో తమ ఆరంభ మ్యాచ్‌లలో అంతంత మాత్రంగా రాణించిన సిరాజ్.. తన పాత జట్టు ఆర్సీబీపై మాత్రం అదరగొట్టాడు. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కీలక వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు.నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్ స్టోన్ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా.. గుజరాత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు సిరాజ్. నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించిందిఈ నేపథ్యంలో భారత మాజీ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు అతడిని ఎంపిక చేయలేదు. అతడిలో ఆ కసి కనిపించింది. యువ ఫాస్ట్ బౌలర్ నుంచి మనం ఇంతకంటే గొప్పగా ఏమి ఆశిస్తాం. అతడు తిరిగి గాడిలో పడ్డాడు.అంతేకాదు.. ‘మీరు నన్ను తీసుకోలేదు కదా!.. నేనేంటో ఇప్పుడు చూపిస్తాను’ అన్నట్లుగా చెలరేగిపోయాడు. ఇదే తరహాలో సిరాజ్ ముందుకు దూసుకవెళితే కచ్చితంగా భారత జట్టులో త్వరలోనే పునరాగమనం చేస్తాడు.కొత్త బంతితో చిన్నస్వామి స్టేడియంలో అద్భుతంగా రాణించాడు. తన మొదటి మూడు ఓవర్లలో కేవలం 12 లేదా 13 పరుగులు మాత్రమే ఇవ్వడం ఇందుకు నిదర్శనం. అయితే, నాలుగో ఓవర్లో మాత్రం కాస్త తడబడ్డాడు. లేదంటే.. ఇంకో వికెట్ అతడి ఖాతాలో చేరేదే. కొత్త బంతిని స్వింగ్ చేస్తూ అనుకున్న ఫలితాన్ని రాబట్టడం సానుకూలాంశం’’ అని హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన సమయంలో సిరాజ్ గురించి ప్రశ్న ఎదురుకాగా.. ‘‘అతడు కొత్త బంతితో మెరుగ్గా రాణించలేడు. అందుకే పక్కనపెట్టాం’’ అని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ సిరాజ్‌ను ఉద్దేశించి పైవిధంగా స్పందించాడు.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ఆర్సీబీ స్కోరు: 169/8 (20)గుజరాత్ టైటాన్స్ స్కోరు: 170/2 (17.5)ఫలితం: ఆర్సీబీపై ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ విజయంచదవండి: అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు! -
ఏడేళ్లు ఆర్సీబీకి ఆడాను.. అందుకే అలా సెలబ్రేట్ చేసుకున్నా: సిరాజ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జైత్రయాత్రకు గుజరాత్ టైటాన్స్ (GT) అడ్డుకట్ట వేసింది. ఆర్సీబీని వారి సొంత మైదానంలోనే ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా ఐపీఎల్-2025లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన బెంగళూరు జట్టు ఖాతాలో తొలి పరాజయం నమోదు కాగా.. టైటాన్స్‌కు వరుసగా రెండో విజయం లభించింది.ఇక ఆర్సీబీపై టైటాన్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఏడేళ్ల పాటు ప్రాతినిథ్యం వహించిన జట్టుపై ఇలాంటి ప్రదర్శన నమోదు చేయడం మిశ్రమ అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నాడు.భావోద్వేగానికి గురి చేసింది‘‘నేను కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. ఏడేళ్ల పాటు ఇక్కడే (ఆర్సీబీ) ఉన్నాను. రెడ్ జెర్సీ నుంచి బ్లూ జెర్సీకి మారటం నన్ను భావోద్వేగానికి గురి చేసింది. అయితే, బంతి చేతిలోకి రాగానే నా మూడ్ మారిపోయింది.చాలా రోజులుగా ఆటతో నేను బిజీగానే ఉన్నాను. అయితే, అనుకోకుండా లభించిన విశ్రాంతి కారణంగా.. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడంతో పాటు బౌలింగ్‌లో నా తప్పులను సరిదిద్దుకునేందుకు కావాల్సినంత సమయం దొరికింది. వేలంలో గుజరాత్ టైటాన్స్ నన్ను కొనుగోలు చేయగానే.. మొదట ఆశిష్ (ఆశిష్ నెహ్రా) భాయ్‌తో మాట్లాడాను.బౌలింగ్‌ను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లాలని.. ఇతర విషయాలను పట్టించుకోవద్దని ఆయన నాకు చెప్పాడు. అదే విధంగా.. ఇషూ భాయ్ (ఇషాంత్ శర్మ) కూడా లైన్ అండ్ లెంగ్త్ తప్పవద్దని నాకు సూచించాడు. వారు నాలో ఆత్మవిశ్వాసం నింపారు.పిచ్ ఎలా ఉన్నా.. పర్లేదు మనపై మనకు నమ్మకం ఉన్నపుడు పిచ్ పరిస్థితులు మన ప్రదర్శనను ప్రభావితం చేయలేవు. నేను రొనాల్డో అభిమానిని. కాబట్టే వికెట్ తీసిన ప్రతిసారీ అలా సెలబ్రేట్ చేసుకున్నా’’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.A Phil Salt orbiter 🚀followed by...A Mohd. Siraj Special \|/ 🫡It's all happening in Bengaluru 🔥Updates ▶ https://t.co/teSEWkWPWL #TATAIPL | #RCBvGT | @mdsirajofficial pic.twitter.com/a8whsXHId3— IndianPremierLeague (@IPL) April 2, 2025 సిరాజ్ పేస్ పదును.. ఆర్సీబీకి షాకులుఈ క్రమంలో ఆరంభంలోనే ఓపెనర్ విరాట్ కోహ్లి (7)ని అర్షద్ ఖాన్ వెనక్కి పంపగా.. అతడి స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్‌ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఫిల్ సాల్ట్ (14)ను కూడా అదే రీతిలో పెవిలియన్‌కు పంపాడు.ఇలా టాపార్డర్ కుప్పకూలడంతో ఆర్సీబీ కష్టాల్లో కూరుకుపోగా.. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రజత్ పాటిదార్ (12) కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడం ప్రభావం చూపింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో అతడు లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. లియామ్ లివింగ్ స్టోన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 40 బంతుల్లో 54 పరుగులతో లియామ్ జోరు మీదున్న వేళ సిరాజ్ మరోసారి తన పేస్ పదును చూపించి.. ఆర్సీబీని దెబ్బకొట్టాడు.ఇక వికెట కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (21 బంతుల్లో 33) వేగంగా ఆడే ప్రయత్నం చేయగా.. సాయి కిషోర్ అతడిని అవుట్ చేశాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులు (18 బంతుల్లో 32) మెరిపించగా.. ప్రసిద్ కృష్ణ అతడి జోరుకు అడ్డుకట్ట వేశాడు. మిగతా వాళ్లలో కృనాల్ పాండ్యా (5), భువనేశ్వర్ కుమార్ (1 నాటౌట్) విఫలం కాగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.సిరాజ్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ ఒక్కో వికెట్‌తో రాణించారు. సాయి కిషోర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక లక్ష్య ఛేదనలో టైటాన్స్ ఆరంభంలోనే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (14) వికెట్ కోల్పోయింది.బట్లర్ ధనాధన్అయితే, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49)కు జతైన వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 73 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడితో పాటు షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (18 బంతుల్లో 30) వేగంగా ఆడి.. సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో 17.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి టైటాన్స్ పని పూర్తి చేసింది.రూ. 12.25 కోట్లకు కొనుగోలుఇదిలా ఉంటే.. సిరాజ్ ఏడేళ్ల పాటు ఆర్సీబీకి ఆడిన విషయం తెలిసిందే. అయితే, మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ అతడిని విడిచిపెట్టింది. వేలంపాటలోనూ సిరాజ్‌పై ఆర్సీబీ ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.ఇక ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో సిరాజ్ విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో సెలక్టర్లు అతడికి చోటివ్వలేదు. మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు పెద్దపీట వేసి.. సిరాజ్‌ను తప్పించారు. దీంతో సిరాజ్‌కు విరామం లభించగా.. ఫిట్నెస్ మెరుగుపరచుకుని.. మరింత కఠినంగా సాధన చేశాడు. చదవండి: భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల -
RCB Vs GT: బెంగళూరుకు సిరాజ్ షాక్
ఏడేళ్ల పాటు బెంగళూరు ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ సిరాజ్... తొలిసారి ఆ జట్టుకు ప్రత్యర్థిగా ఆడుతూ నిప్పులు చెరిగాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున తన పాత సహచరులపై బుల్లెట్ బంతులతో ప్రతాపం చూపాడు. ఫలితంగా ఐపీఎల్లో టైటాన్స్ రెండో విజయం నమోదు చేసుకోగా... రెండు విజయాల తర్వాత బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. సిరాజ్ ధాటికి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైన బెంగళూరు జట్టు... ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా ఎలాంటి మెరుపులు లేకుండా ఓటమిని ఆహ్వానించింది. బ్యాటింగ్‌లో బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో మరో 13 బంతులు మిగిలుండగానే గుజరాత్ గెలుపొందింది. బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఐపీఎల్ 18వ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన బెంగళూరు... బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది. గత సీజన్ వరకు ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ సిరాజ్ (3/19) గుజరాత్ టైటాన్స్ తరఫున చెలరేగిపోగా... అతడి బౌలింగ్‌ను ఆడలేక బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... జితేశ్ శర్మ (33; 5 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (7), దేవదత్ పడిక్కల్ (4) కెప్టెన్ రజత్ పాటీదార్ (12), ఫిల్ సాల్ట్ (14), కృనాల్ పాండ్యా (5) విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిరాజ్ 3 వికెట్లు, సాయికిషోర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్), రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. సూపర్ సిరాజ్... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. అర్షద్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో అనవసర షాట్‌కు యత్నించిన కోహ్లి ఫైన్ లెగ్‌లో ప్రసిధ్ చేతికి చిక్కాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తదుపరి ఓవర్లో పడిక్కల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ టైటాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఇక కొన్ని మంచి షాట్లు ఆడిన సాల్ట్‌ను కూడా సిరాజ్ బుట్టలో వేసుకున్నాడు. ఈ మధ్య పాటీదార్‌ను ఇషాంత్ శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో... బెంగళూరు జట్టు 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జితేశ్ శర్మ, లివింగ్‌స్టోన్... చివర్లో డేవిడ్ ధాటిగా ఆడారు. 15 ఓవర్లు ముగిసేసరికి 105/6తో ఉన్న ఆర్సీబీ... చివరి 5 ఓవర్లలో 64 పరుగులు జోడించింది. రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో 3 సిక్స్‌లు బాదిన లివింగ్‌స్టోన్‌ను తదుపరి ఓవర్లో సిరాజ్ అవుట్ చేశాడు. చివరి ఓవర్లో డేవిడ్ 4, 6, 4 కొట్టడంతో బెంగళూరు ఆ మాత్రం స్కోరు చేసింది. అలవోకగా... ఛేదనలో గుజరాత్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదు. లక్ష్యం చిన్నది కావడంతో ఆ జట్టు ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయలేకపోయిన ఆర్సీబీ... బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (14) త్వరగానే అవుటైనా... మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగిన ఈ జంట రెండో వికెట్‌కు 47 బంతుల్లో 75 పరుగులు జతచేసింది. అనంతరం సుదర్శన్ అవుట్ కాగా... రూథర్‌ఫోర్డ్‌తో కలిసి బట్లర్ మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (బి) సిరాజ్ 14; కోహ్లి (సి) ప్రసిధ్ కృష్ణ (బి) అర్షద్ 7; దేవదత్ పడిక్కల్ (బి) సిరాజ్ 4; పాటీదార్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 12; లివింగ్‌స్టోన్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 54; జితేశ్ శర్మ (సి) తెవాటియా (బి) సాయికిషోర్ 33; కృనాల్ పాండ్యా (సి అండ్ బి) సాయికిషోర్ 5; టిమ్ డేవిడ్ (బి) ప్రసిధ్ కృష్ణ 32; భువనేశ్వర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–8, 2–13, 3–35, 4–42, 5–94, 6–104, 7–150, 8–169. బౌలింగ్: సిరాజ్ 4–0–19–3; అర్షద్ ఖాన్ 2–0–17–1; ప్రసిధ్ కృష్ణ 4–0–26–1; ఇషాంత్ 2–0–27–1; సాయికిషోర్ 4–0–22–2; రషీద్ ఖాన్ 4–0–54–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) జితేశ్ శర్మ (బి) హాజల్‌వుడ్ 49; గిల్ (సి) లివింగ్‌స్టోన్ (బి) భువనేశ్వర్ 14; బట్లర్ (నాటౌట్) 73; రూథర్‌ఫోర్డ్ (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–32, 2–107. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–23–1, హాజల్‌వుడ్ 3.5–0–43–1; యశ్ దయాళ్ 3–0–20–0; రసిక్ సలామ్ 3–0–35–0; కృనాల్ పాండ్యా 3–0–34–0; లివింగ్‌స్టోన్ 1–0–12–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X హైదరాబాద్‌వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
RCB VS GT: అదిరిపోయే రీతిలో ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు చెలరేగడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఆ జట్టు 16 ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. లివింగ్‌స్టోన్ (33), టిమ్ డేవిడ్ (6) క్రీజ్‌లో ఉండటంతో ఆర్సీబీ ఇంకా ఆశలు పెట్టుకుంది.రెండు వరుస విజయాల తర్వాత ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేస్తుంది. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ఆర్సీబీని పేసర్ అర్షద్ ఖాన్ తొలి దెబ్బేశాడు. రెండో ఓవర్లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (7) ఔట్ చేశాడు. ఆతర్వాత ఆర్సీబీ మాజీ ఆటగాడు సిరాజ్ లైన్లోకి వచ్చాడు. సిరాజ్ అతని వరుస ఓవర్లలో పడిక్కల్ (4), సాల్ట్‌ను (14) క్లీన్ బౌల్డ్ చేశాడు. Mo Siraj 🔥pic.twitter.com/2cbgtJIhNi— CricTracker (@Cricketracker) April 2, 2025ఆతర్వాత ఇషాంత్ అద్భుతమైన బంతితో కెప్టెన్ పాటిదార్‌ను (12) ఎల్బీడబ్ల్యూ చేశాడు. లేట్‌గా (11వ ఓవర్) బౌలింగ్‌కు దిగిన సాయికిషోర్ తన రెండో ఓవర్లోనే మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన జితేశ్ శర్మను (33) ఔట్ చేశాడు. సాయి కిషోర్ తన మూడో ఓవర్లో మరో ఫలితం రాబట్టాడు. ఈసారి కిషోర్ కృనాల్ పాండ్యాను (5) బోల్తా కొట్టించాడు. భారీ హిట్టర్లు లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉండటంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోర్‌పై ఆశలు పెట్టుకుంది.కాగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్ సాల్ట్ వికెట్ తీసిన విధానం అందరినీ ఆకర్శించింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్ మూడో బంతికి సాల్ట్ సిరాజ్ బౌలింగ్‌లో 105 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. ఆతర్వాతి బంతికి సిరాజ్ సాల్ట్‌పై తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. సాల్ట్ వికెట్లు వదిలి మరో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. సిరాజ్ బంతిని నేరుగా వికెట్లపైకి సంధించి సాల్ట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ సీజన్లో సిరాజ్ ఇప్పటివరకు తీసిన నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్లే కావడం విశేషం. సిరాజ్ బౌలింగ్‌లో సాల్ట్ కొట్టిన సిక్సర్ ఈ సీజన్లో అత్యంత భారీ సిక్సర్‌గా రికార్డైంది. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు ట్రవిస్ హెడ్ కూడా 105 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. -
సిరాజ్ సూపర్ బాల్.. రోహిత్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌటైన రోహిత్ శర్మ.. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌పై అదే తీరును కనబరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి హిట్‌మ్యాన్ ఔటయ్యాడు. గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్బుతమైన బంతితో రోహిత్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్.. వరుసగా రెండు బంతుల్లో బౌండరీలు బాది మంచి టచ్‌లో కన్పించాడు. కానీ సిరాజ్ అదే ఓవర్లో ఐదో బంతిని రోహిత్‌కు ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని రోహిత్ శర్మ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్బుతంగా టర్న్ అయ్యి బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో రోహిత్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. రోహిత్‌ను ఔట్ చేసిన వెంటనే సిరాజ్ క్రిస్టియానో రొనాల్డో వింటేజ్ ''కాల్మా స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత ర్యాన్ రికెల్టన్ను కూడా సిరాజ్ బోల్తా కొట్టించాడు. కాగా మహ్మద్ సిరాజ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.Siraj is not effective🤣🤣pic.twitter.com/7cueS6DmvT— Mayank. (@PrimeKohlii) March 29, 2025 -
అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్‌కు అంతా తెలుసు: సిరాజ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో కొత్త ఫ్రాంఛైజీ తరఫున ఆడబోతున్నాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. దాదాపు ఏడేళ్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ఆడిన ఈ హైదరాబాదీని.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో రూ. 12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సిరాజ్‌ను కొనుగోలు చేసింది.బౌలర్ల కెప్టెన్‌ఇక ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా గుజరాత్ మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ‘బోరియా సీజన్ సిక్స్’తో ముచ్చటించిన సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుబ్‌మన్ గిల్ (Shubman Gill) బౌలర్ల కెప్టెన్. గొప్ప సారథి.బౌలర్లు ఏది అడిగినా.. కాదనడు. వాళ్లకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాడు. స్వేచ్ఛనిస్తాడు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నేను, రిషభ్ పంత్, శుబ్‌మన్, అక్షర్ పటేల్.. కలిసి తరచుగా డిన్నర్లకు వెళ్తూ ఉంటాం. గిల్, నేను ఒకేసారి టెస్టుల్లో అడుగుపెట్టాము. అందుకే మా బంధం ఇంతగా బలపడి ఉంటుంది’’ అని గిల్‌తో తనకున్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు.ఆయనొక లెజెండ్ఇక గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయనొక లెజెండ్. నెహ్రా భాయ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ఎలా ఉండాలో ఆయనను చూసే తెలుసుకున్నా. గతంలో షమీ భాయ్ ఈ ఫ్రాంఛైజీకి ఆడాడు.నేను కూడా తనలా అద్భుతంగా ఆడి వికెట్లు తీయడం మీద మాత్రమే దృష్టి పెట్టాను. జట్టు విజయాల కోసం నా శాయశక్తులా కృషి చేస్తా’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఇక ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో చోటు దక్కకపోవడం గురించి ప్రస్తావన రాగా.. ఈ హైదరాబాదీ పేసర్ హుందాగా స్పందించాడు.అస్సలు జీర్ణించుకోలేకపోయా.. ‘‘జట్టు గురించి ప్రకటన రాగానే తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఐసీసీ ఈవెంట్ ఆడే జట్టులో నాకు చోటు లేదే అని బాధపడ్డాను. అయితే, జట్టు ప్రయోజనాల గురించే రోహిత్ భాయ్ ఆలోచిస్తాడని నాకు తెలుసు.దుబాయ్‌లో పేసర్లకు పెద్దగా పని ఉండదని భాయ్‌కు తెలుసు. ఆయన ఎంతో అనుభవజ్ఞుడైన కెప్టెన్. అక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని ఆయనకు తెలుసు. అందుకే నన్ను పక్కనపెట్టాలని వాళ్లు నిర్ణయించుకున్నారు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు.విశ్రాంతి దొరికిందిఏదేమైనా దేశం కోసం ఆడేటప్పుడు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందని.. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడని సిరాజ్ అన్నాడు. ఇక చాంపియన్స్‌ట్రోఫీ జట్టులో లేనందు వల్ల తనకు చాలాకాలం పాటు విశ్రాంతి లభించిందని.. ఆ సమయాన్ని ఫిట్నెస్ మెరుగుపరచుకునేందుకు ఉపయోగించుకున్నానని తెలిపాడు.కాగా పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడింది. ఇక ఈ మెగా వన్డే టోర్నమెంట్లో గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది.ఇక సిరాజ్ చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఆడాడు. తదుపరి జూన్‌లో ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే జట్టుకు అతడు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక మళ్లీ పరిమిత ఓవర్ల జట్టులో తిరిగి స్థానం సంపాదించాలంటే సిరాజ్ మియా.. ఐపీఎల్-2025లో సత్తా చాటాల్సి ఉంటుంది.చదవండి: ‘గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’ -
సిరాజ్‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన మహిర శర్మ
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌తో డేటింగ్ రూమర్స్‌పై బిగ్‌బాస్ సెలబ్రిటీ మహిర శర్మ స్పందించింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని వివరణ ఇచ్చింది. తనపై వస్తున్న ఊహాగానాలను ఆపాలని సోషల్‌మీడియా వేదికగా కోరింది. ఇదే విషయంపై సిరాజ్ కూడా స్పందించాడు. మహిరతో డేటింగ్ చేయడం లేదని సోషల్‌మీడియా వేదికగా స్పష్టం చేశాడు. జర్నలిస్ట్‌లు ఈ విషయంపై తనను ప్రశ్నించడం మానుకోవాలని కోరాడు. తాను మహిరతో డేటింగ్ చేయడమనేది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే సిరాజ్ తన సోషల్‌మీడియా ఖాతా నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. సిరాజ్ ఏదో దాయాలనే ప్రయత్నం చేస్తున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. కాగా, సోషల్‌మీడియాలో మహీరకు చెందిన ఓ పోస్ట్‌ను సిరాజ్ లైక్ చేయడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. అనంతరం సిరాజ్, మహిర ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో పుకార్లు బలపడ్డాయి. ఓ దశలో సిరాజ్, మహిర పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వదంతులు వ్యాపించాయి. సిరాజ్‌తో డేటింగ్ రూమర్లను మహిర తల్లి చాలాసార్లు ఖండించారు. అయినా ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పడలేదు.ఇటీవల ముంబైలో జరిగిన ఓ క్రికెట్ అవార్డుల ఫంక్షన్లో మహిర కనిపించినప్పుడు జర్నలిస్ట్‌లు ఈ విషయమై ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. త్వరలో జరుగబోయే ఐపీఎల్లో ఆమెకు ఇష్టమైన జట్టు ఏదని పదేపదే ప్రశ్నించి రాక్షసానందం పొందారు.ఇంతకీ ఈ మహిర ఎవరు..?రియాలిటీ షో బిగ్ బాస్-13 సీజన్‌తో మహిర శర్మ ఫేమస్ అయ్యింది. మహిర.. నాగిన్ 3, కుండలి భాగ్య, బెపనా ప్యార్ వంటి షోలలో పనిచేస్తూ టీవీ పరిశ్రమలో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. గతంలో మహిర బిగ్ బాస్ ద్వారా పరిచయమైన టీవీ నటుడు పరాస్ ఛబ్రాతో డేటింగ్ చేసింది. మహిర ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా నటిస్తుంది.ఇదిలా ఉంటే, ఈ ఐపీఎల్ సీజన్లో సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. గతేడాది మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్‌ను వదిలేయగా.. మెగా వేలంలో గుజరాత్ సిరాజ్‌ను రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. 2018 నుంచి సిరాజ్ ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఈ సీజన్లో గుజరాత్ తమ తొలి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 25న జరుగనుంది. -
సాహసోపేత నిర్ణయాలు.. టైటాన్స్ ఈసారి విజృంభిస్తుందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే (2022)లో టైటిల్ సాధించి తనదైన ముద్రవేసింది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans). ఆ తర్వాత సీజన్లో మళ్ళీ ఫైనల్లోకి ప్రవేశించింది. కానీ టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమితో రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. అయితే, గతేడాది గుజరాత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టుకి స్ఫూర్తిదాయకంగా నిలిచి ముందుండి నడిపించిన భారత్ అల్ రౌండర్, జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు బదిలీ అయ్యాడు.ఈ మార్పుతో భారత్ యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు కెప్టెన్‌గా పగ్గాలు అప్పగించారు. కానీ గత సీజన్ గుజరాత్ కి పెద్దగా కలిసిరాలేదు. కేవలం 5 విజయాలు, 7 ఓటములతో గుజరాత్ 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనితో కొత్త సీజన్ కోసం గుజరాత్ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది.భారత్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, దక్షిణాఫ్రికాకి చెందిన డేవిడ్ మిల్లర్ వంటి సీనియర్ ఆటగాళ్ళని పక్కకుపెట్టాలని నిర్ణయించారు. ఇందుకు బదులుగా కొత్త తరహా జట్టుని నిర్మించాలని నిర్ణయించారు. ప్రపంచ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది.మాజీ ఆరెంజ్ క్యాప్ విజేత జోస్ బట్లర్, దక్షిణాఫ్రికా పేస్ స్పియర్‌హెడ్ కగిసో రబాడను దక్కించుకోవడానికి గుజరాత్ పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో తన వీరోచిత ప్రదర్శనలతో అందరినీ ఆశ్చర్యపరిచిన గ్లెన్ ఫిలిప్స్‌ను కూడా తీసుకున్నారు.వేలంలో గుజరాత్ ఎలా రాణించింది?ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. గిల్, రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ మరియు షారుఖ్ ఖాన్‌లతో పాటు రషీద్ ఖాన్‌ను వేలానికి ముందు రెటైన్ చేసింది. వేలంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ని రూ 15.75 కోట్లు కు కనుగోలు చేసారు.ఇంకా భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ( (రూ12.25 కోట్లు), రబాడ (రూ 10.75 కోట్లు) మరియు ప్రసిధ్ కృష్ణ (రూ 9.5 కోట్లు) ముగ్గురితో పేస్ బౌలింగ్ ని బలోపేతం చేశారు. గత సీజన్లో వారికి సమస్యగా ఉన్న రంగాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఇక మిల్లర్ స్థానంలో జిటి ఫిలిప్స్ మరియు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌లను జట్టులోకి తీసుకువచ్చారుగుజరాత్ టైటాన్స్ జట్టులో ప్రధాన ఆటగాళ్లుశుబ్మన్ గిల్ఒకప్పుడు భారత టీ20ఐ జట్టులో ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇప్పుడు మునుపటి రీతిలో రాణించలేక పోతున్నాడన్నది వాస్తవం. 2023 ఐపీఎల్ లో చెలరేగిపోయిన గిల్ దాదాపు 900 పరుగులు సాధించాడు.గత సీజన్‌ను ఆశాజనకంగా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అతని ఫామ్ తగ్గింది . 2024లో తన మొదటి ఆరు మ్యాచ్‌ల్లో 151.78 స్ట్రైక్ రేట్‌తో 255 పరుగులు చేశాడు, కానీ ఆ తర్వాత 147.40 సగటుతో 426 పరుగులు చేశాడు. ఈ సీజన్లో గిల్ మళ్ళీ మునుపటి ఫామ్ ని ప్రదర్శించాలని, జట్టుని విజయ బాటలో నడిపించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు.జోస్ బట్లర్జట్టులో అత్యంత ఖరీదైన ఆటగాడు కావడంతో, బట్లర్ పై అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహం లేదు. 2022 ఐపిఎల్ లో ఏకంగా 863 పరుగులు చేసిన తర్వాత, బట్లర్ 2023 మరియు 2024 సీజన్లలో 400 కి మించి పరుగులు చేయలేకపోయాడు. అయితే గత సంవత్సరం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా పై జరిగిన ఫైనల్లో 224 పరుగుల లక్ష్యం సాధించడంలో బట్లర్ చేసిన సెంచరీ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది. బట్లర్ ఈ సీజన్ లో గిల్ తో కలిసి గుజరాత్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. లేదా గత సీజన్లో లేని ఫైర్‌పవర్‌ను అందించడానికి 3వ స్థానంలోకి వస్తాడని భావిస్తున్నారు. అదనంగా అతన్ని స్టంప్స్ వెనుక కూడా చూడవచ్చు.రషీద్ ఖాన్గాయం నుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరోసారి గుజరాత్‌కు ట్రంప్ కార్డ్ గా భావించవచ్చు. గత సీజన్లో, రషీద్ శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నందున తన పూర్తి స్థాయిలో ఆడలేక పోయాడు. ఈసారి మాత్రం గుజరాత్ టైటిల్ సాధించాలన్న ఆశయాన్ని సాధించడంలో రషీద్ పెద్ద పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.కగిసో రబాడపంజాబ్ కింగ్స్ తరుపున ఆది కాస్త నిరాశబరిచిన కగిసో రబాడ ఇప్పుడు గుజరాత్ జట్టులో చేరడంతో కోచ్ ఆశిష్ నెహ్రా ఆధ్వర్యంలో మళ్ళీ పుంజుకోగలడని భావిస్తున్నారు.మహ్మద్ సిరాజ్ఇటీవలి కాలంలో పెద్దగా రాణించలేక పోతున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కి మళ్ళీ మునుపటి వైభవం సాధించడానికి ఐపీఎల్ మంచి అవకాశం కల్పిస్తోంది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు లో స్థానం పొందలేకపోయిన సిరాజ్ తన విమర్శకులను సమాధానము చెప్పాలని, తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నాడు.గుజరాత్ టైటాన్స్ జట్టురషీద్ ఖాన్, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, జోస్ బట్లర్. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిషాంత్ సింధు, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్ర, అనుజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, జెరాల్డ్ కోట్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా. చదవండి: విధ్వంసకర వీరులు.. పంత్‌కు పగ్గాలు.. లక్నో ఫైనల్ చేరుతుందా? -
‘ఎంపిక నా చేతుల్లో లేదు’
బెంగళూరు: పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌తో పాటు టీమిండియా విజేతగా నిలిచిన చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోనూ అతనికి స్థానం లభించలేదు. అయితే ఈ హైదరాబాదీ పేసర్ జాతీయ జట్టులోకి త్వరలోనే పునరాగమనం చేస్తానని ఆశాభావంతో ఉన్నాడు. ప్రస్తుతం అంతగా ఆందోళన చెందడం లేదని, ఐపీఎల్లో సత్తా చాటాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నట్లు అతను చెప్పాడు.ఐపీఎల్లో సిరాజ్ ఈసారి గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ‘భారత జట్టు ఎంపిక నా చేతుల్లో ఉండదనేది వాస్తవం. నా చేతుల్లో బంతి మాత్రమే ఉంటుంది. దాంతో ఏం చేయగలను అనేదే ముఖ్యం. టీమ్ సెలక్షన్ గురించి అతిగా ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకోను. అలా చేస్తే నా ఆటపై ప్రభావం పడుతుంది. మున్ముందు ఇంగ్లండ్ పర్యటన, ఆసియా కప్లాంటివి ఉన్నాయనే విషయం నాకు తెలుసు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికి దృష్టంతా ఐపీఎల్ పైనే ఉంది’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు. టీమిండియా తరఫున ఆడని సమయంలో బౌలింగ్ మెరుగుపర్చుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు సిరాజ్ వెల్లడించాడు. ‘గత కొన్నేళ్లుగా నిరంతరాయంగా ఆడుతున్నాను. సాధారణంగా విశ్రాంతి తక్కువగా దొరుకుతుంది. కానీ ఈసారి మంచి విరామం లభించింది. అందుకే బౌలింగ్, ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టా. కొత్త బంతులు, పాత బంతులతో బౌలింగ్ చేశాం. స్లో బంతులు, యార్కర్ల విషయంలో ప్రత్యేక సాధన చేశాను. కొత్తగా నేర్చుకున్న అంశాలను ఐపీఎల్లో ప్రదర్శిస్తా’ అని అతను చెప్పాడు. శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు సిరాజ్ వెల్లడించాడు. ‘బెంగళూరు జట్టుకు దూరం కావడం కొంత బాధకు గురి చేసిందనేది వాస్తవం. కోహ్లి అన్ని రకాలుగా అండగా నిలిచాడు. అయితే ఇక్కడా గిల్ సారథ్యంలో చాలా మంచి జట్టుంది. గిల్ కెపె్టన్సీలో బౌలర్లకు మంచి స్వేచ్ఛ ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ఎప్పుడూ వారించడు. మేమిద్దరం ఒకే టెస్టుతో అరంగేట్రం చేశాం. వ్యక్తిగతంగా కూడా మంచి సాన్నిహిత్యం ఉంది’ అని సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. తమ టీమ్‌లో రబాడ, రషీద్, ఇషాంత్, కొయెట్జీ లాంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉండటం సానుకూల విషయమని, ఇది అందరిపై ఒత్తిడి తగ్గిస్తుందని అతను అభిప్రాయ పడ్డాడు. గత సీజన్ వరకు ఇదే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ షమీతో తనను పోల్చడంపై స్పందిస్తూ... ‘టైటాన్స్ టీమ్ తరఫున షమీ భాయ్ చాలా బాగా ఆడాడు. కీలక సమయాల్లో స్వింగ్‌తో వికెట్లు తీశాడు. నేను కూడా ఆయనలాగే పెద్ద సంఖ్యలో వికెట్లు తీసి జట్టుకు ఉపయోగపడితే చాలు. మొతెరా మైదానంలో కొత్త బంతితో షమీ వికెట్లు తీయడం నేను చూశాను. అదే తరహాలో పవర్‌ప్లేలో వికెట్లు తీయడమే నా పని’ అని సిరాజ్ చెప్పాడు. టైటాన్స్ కోచ్‌గా ఉన్న మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాతో కలిసి పని చేసేందుకు, ఆయన వద్ద కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఈ హైదరాబాదీ పేర్కొన్నాడు. -
సిరాజ్‌తో 'బిగ్‌బాస్' బ్యూటీ డేటింగ్.. లైక్ కొట్టడం వల్లే ఇదంతా
భారత క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీతో టచ్‌లో ఉన్న వారితో ఆయన ప్రేమలో పడినట్లు నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే లెజెండరీ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో ప్రేమలో ఉన్నాడని రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే, వాటిని సిరాజ్ ఖండించారు. ఆమె తనకు సోదరిలాంటిదని చెప్పేశాడు. అయితే, ఇప్పుడు హిందీ బిగ్‌బాస్ ఫేమ్ మహిరా శర్మ (Mahira Sharma)తో సిరాజ్ డేటింగ్లో ఉన్నాడంటూ బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చేసింది.కొద్దిరోజుల క్రితం మహిరా శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌కు సిరాజ్ లైక్ కొట్టడమే కాకుండా ఫాలో అయ్యాడు. దీంతో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై మహిరా శర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చింది. ' సిరాజ్‌తో నేను డేటింగ్లో ఉన్నానంటూ వచ్చిన వార్తలను చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. సోషల్‌మీడియాతో పాటు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ కావడంతో నాపై ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అభిమానుల పేరుతో చాలామంది మమ్మల్ని ఎవరితోనైనా కనెక్ట్ చేయవచ్చు. మేము వారిని ఆపలేము. చిత్ర పరిశ్రమలో చాలామందితో కలిసి పనిచేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో మేము కొన్ని ఎదుర్కొవాల్సిందే. ఒక్కోసారి మా ఫోటోలను వారు ఎడిట్లు కూడా చేస్తారు. కానీ వీటన్నింటికీ నేను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను. కానీ, ఇలాంటి రూమర్స్ ఎవరు చేసినా తప్పేనని చెబుతాను.' అని ఆమె చెప్పింది.సిరాజ్‌తో డేటింగ్ వార్తలపై మహిరా శర్మ తల్లి సానియా శర్మ కూడా గతంలో రియాక్ట్ అయ్యారు. ఇలాంటి రూమర్స్ ఎవరూ నమ్మద్దొని ఆమె కోరారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాటిని ఖండించారు. నా కూతురు గురించి మీడియా వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బయట వాళ్లు ఎన్నో అంటారు.. అవన్నీ నిజాలు అయిపోతాయా..? నా కూతురు ఒక సెలబ్రిటీ కాబట్టే ఇలాంటి రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. కొందరు అభిమానులే ఇలాంటి పనిచేస్తున్నారు. వాటిని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు.' అని సానియా శర్మ చెప్పారు.హిందీ టీవీ సీరియల్స్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు మహిరా శర్మ దగ్గరైంది. అలా బిగ్‌బాస్ 13లో అవకాశం రావడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత వెబ్‌సిరీసుల్లోనూ ఛాన్సులు దక్కించుకుని మరింత పాపులర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, బిగ్‌బాస్ సమయంలో పరాస్ ఛాబ్రాతో మహిరా శర్మ ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని పరాస్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ, కొద్దిరోజుల్లోనే తాము బ్రేకప్ చెప్పుకున్నామని కూడా ఆయన పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Mahira Sharma (@mahirasharma) -
మరో సిరాజ్ కోసం.. పాతబస్తీలో ఎమ్మెస్కే వేట (ఫోటోలు)
-
‘మరో సిరాజ్’ వేటలో...
సాక్షి, హైదరాబాద్: పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ గత కొంత కాలంగా భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. పలు చిరస్మరణీయ విజయాల్లో భాగంగా ఉన్న అతను టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడు. ఎంతో మంది యువ ఆటగాళ్లతో పోలిస్తే అతని ప్రస్థానం ఎంతో ప్రత్యేకం. పేదరిక నేపథ్యం, ఆటోడ్రైవర్‌గా పని చేసే తండ్రి, కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడే స్థితి నుంచి అతను అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగాడు.ఒకదశలో షూస్ కూడా కొనుక్కోలేకపోయిన అతను డబ్బుల కోసం టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. ఆ తర్వాత కేవలం తన కఠోర శ్రమ, పట్టుదలతో పైకి ఎదిగాడు. ఇప్పుడు అలాంటి సిరాజ్‌లను వెతికి సానబెట్టేందుకు భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యేకంగా నగరంలోని పాతబస్తీలో ఉన్న పేద పేస్ బౌలర్ల కోసం ఒక ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘హూ ఈజ్ అవర్ నెక్స్ట్ సిరాజ్’ పేరుతో ఈ కార్యక్రమం ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎంఎస్కేఎస్ఐసీఏ) ఆధ్వర్యంలో జరిగింది. దీనికి స్వయంగా సిరాజ్ హాజరై తన అనుభవాలను పంచుకున్నాడు. కెరీర్లో ఎదిగే క్రమంలో తనకు ఎదురైన కష్టాలను గుర్తు చేసుకున్న అతను... ప్రతిభావంతులైన కుర్రాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో గొప్ప బౌలర్లుగా ఎదగాలని ఆకాంక్షించాడు. అత్తాపూర్‌లోని విజయానంద్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు. ఇలాంటి ప్రయత్నాలు క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకోవాలనుకునే యువ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతాయని, ప్రతిభ గలవారిని తీర్చిదిద్దుతున్న ఎమ్మెస్కే ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తన బాల్య స్నేహితుడు మునీర్ అహ్మద్, కోచ్ రహ్మతుల్లా బేగ్ గౌరవార్ధమే ప్రత్యేకంగా పాతబస్తీ క్రికెటర్ల కోసం ‘హూ ఈజ్ అవర్ నెక్స్ట్ సిరాజ్’ కార్యక్రమాన్ని లాభాపేక్ష లేకుండా నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎమ్మెస్కే చెప్పారు. సుమారు 400 మంది యువ పేస్ బౌలర్లు ఈ ట్రయల్స్‌కు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాజీ క్రికెటర్లు షహాబుద్దీన్, ఫసీర్ రహమాన్, సత్యప్రసాద్, మనోజ్‌సాయి, ప్రకాశ్‌బాబు, అమానుల్లా ఖాన్‌లతో పాటు టీఎన్జీఏ ప్రధాన కార్యదర్శి ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. -
చాంపియన్స్ ట్రోఫీ: ‘భారత తుదిజట్టులో ఇషాన్, చహల్’!
క్రికెట్ అభిమానులకు వినోదం పంచేందుకు చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) రూపంలో మెగా ఈవెంట్ సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19న ఈ ఐసీసీ టోర్నమెంట్ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఇక ఈ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొనున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్... అదే విధంగా గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. బీసీసీఐ కూడా పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలు వెల్లడించింది.అయితే, టీమిండియాలో ప్రతిభ గల ఆటగాళ్లకు కొదవలేదు. కానీ కొన్ని సందర్భాల్లో తుదిజట్టు కూర్పు, పిచ్ స్వభావం, టోర్నీకి ముందు ప్రదర్శన.. తదితర అంశాల ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికకాని స్టార్లు చాలా మందే ఉన్నారు. మరి వారితో కూడిన భారత జట్టు, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో చూద్దామా?..ఓపెనర్లుగా ఆ ఇద్దరురుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)లను ఓపెనర్లుగా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. రుతు లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో 56.15 సగటు కలిగి ఉండి.. ఫార్మాట్ చరిత్రలోనే అత్యధిక యావరేజ్ కలిగిన ఐదో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.మరోవైపు జైస్వాల్ బ్యాటింగ్ సగటు కూడా ఇందులో 52.62గా ఉంది. 33 మ్యాచ్‌లు ఆడిన అతడి ఖాతాలో ఐదు శతకాలు, ఒక డబుల్ సెంచరీ కూడా ఉన్నాయి ఇక వీరిద్దరికి అభిషేక్ శర్మను బ్యాకప్ ప్లేయర్‌గా జట్టులోకి తీసుకోవచ్చు.వికెట్ కీపర్‌గా ఇషాన్మరో ఓపెనింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్ కోటాలో ఎంపిక చేయవచ్చు. వన్డేల్లో అతడి ఖాతాలో ఏకంగా ద్విశతకం ఉంది. అంతేకాదు.. వన్డే ప్రపంచకప్-2023లోనూ ఆడిన అనుభవం కూడా పనికి వస్తుంది.శతకాల ధీరుడు లేకుంటే ఎలా?ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారా అంటే.. కరుణ్ నాయరే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో అతడు పరుగుల వరద పారించాడు. తాజా సీజన్లో ఏకంగా ఐదు శతకాలు బాది 750కి పైగా పరుగులు చేశాడు. కానీ అతడిని టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు.ఏదేమైనా మిడిలార్డర్లో తిలక్ వర్మతో కలిసి కరుణ్ నాయర్ ఉంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఇక ఆల్రౌండర్లుగా శివం దూబే, రియాన్ పరాగ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. వీరిద్దరు గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడారు.బౌలర్ల దళంచాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లకు దుబాయ్ వేదికగా కాబట్టి పరాగ్‌తో పాటు ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లను తుదిజట్టులోకి తీసుకుంటే బెటర్. యుజువేంద్ర చహల్‌తో పాటు ఆర్. సాయికిషోర్ ఇక్కడ మన ఛాయిస్. ఈ ముగ్గురు మూడు రకాల స్పిన్నర్లు.పరాగ్ రైట్, కిషోర్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు అయితే.. చహల్ మణికట్టు స్పిన్నర్.. వీరికి బ్యాకప్‌గా రవి బిష్ణోయి ఉంటే సానుకూలంగా ఉంటుంది.ఇక పేసర్ల విషయానికొస్తే.. ముగ్గురు జట్టులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. మహ్మద్ సిరాజ్‌తో పాటు ప్రసిద్ కృష్ణ.. వీరికి బ్యాకప్‌గా ఆవేశ్ ఖాన్. ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్‌కు బ్యాకప్‌గా ధ్రువ్ జురెల్‌ను రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఇక యశస్వి జైస్వాల్‌తో పాటు శివం దూబే చాంపియన్స్ ట్రోఫీ నాన్- ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్ల లిస్టులో ఉన్న విషయం తెలిసిందే.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక కాని, అత్యుత్తమ భారత తుదిజట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, కరుణ్ నాయర్, శివమ్ దూబే*, రియాన్ పరాగ్, ఆర్. సాయి కిషోర్, యుజువేంద్ర చహల్, మహమ్మద్ సిరాజ్*, ప్రసిద్ కృష్ణ.బెంచ్: అభిషేక్ శర్మ, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ధృవ్ జురెల్.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
టీమిండియా ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడు.. అతడి స్థానానికి ఎసరు!
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. రానున్న కాలంలో భారత బౌలింగ్ దళంలో ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో హర్షిత్ అద్భుత ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హర్షిత్.. స్వదేశంలో ఇంగ్లండ్(India vs England)తో పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అరంగేట్రం చేశాడు. తొలుత టీ20లలో ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ పేసర్.. అనంతరం వన్డేల్లోనూ చోటు దక్కించుకున్నాడు.బుమ్రా స్థానంలో ఐసీసీ టోర్నీకిఇంగ్లండ్తో ఆడిన టీ20 మ్యాచ్‌లో మూడు వికెట్లతో మెరిసిన రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. మూడు వన్డేల్లో కలిపి ఆరు వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ రెండు సిరీస్‌లలో టీమిండియా గెలవడంలో తాను భాగమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని బీసీసీఐ హర్షిత్ రాణాతో భర్తీ చేసింది.ఈ నేపథ్యంలో కామెంటేటర్, భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ హర్షిత్ రాణా ఆట తీరును కొనియాడాడు. రాణా రాకతో అర్ష్‌దీప్ సింగ్‌కు గట్టి పోటీ తప్పదని అభిప్రాయపడ్డాడు. ‘‘ఇటీవలి కాలంలో హర్షిత్ రాణా పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంది.టీమిండియా ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడుతన ప్రదర్శనతో అతడు జట్టు విజయాలపై ప్రభావం చూపగలిగాడు. అతడి ఆటిట్యూడ్ కూడా ముచ్చటగొలిపేలా ఉంది. సమీప భవిష్యత్తులోనే అతడు టీమిండియా బౌలింగ్ బిగ్ స్టార్‌గా అవతరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఆట పట్ల అతడి అంకితభావం, ఆలోచనా ధోరణి నాకెంతో నచ్చింది. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ తుదిజట్టులో సీనియర్‌గా అర్ష్‌దీప్ సింగ్‌కే ప్రాధాన్యం దక్కుతుంది. అయితే, దీర్ఘ కాలంలో రాణా వల్ల అర్ష్‌దీప్‌నకు కష్టాలు తప్పవు. సెకండ్ సీమర్‌గా అతడికి హర్షిత్ నుంచి పోటీ ఎదురవుతుంది.సిరాజ్ రీ ఎంట్రీ కష్టమే!కచ్చితంగా హర్షిత్ రాణా అర్ష్‌కు గట్టిపోటీగా మారతాడు. అతడి వల్ల ఇప్పటికే సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేయడం కష్టంగా మారింది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగాడు హర్షిత్ రాణా.గత ఎడిషన్‌లో మొత్తంగా పదమూడు మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లతో మెరిసిన ఈ ఢిల్లీ బౌలర్.. కోల్‌కతాను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక నాడు కోల్‌కతా జట్టు మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్ కావడంతో హర్షిత్‌కు టీమిండియా ఎంట్రీ కాస్త సులువుగానే దక్కింది.చదవండి: Champions Trophy: ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా? -
అసిస్టెంట్ కమాండెంట్ గా ఛార్జ్ తీసుకున్న క్రికెటర్ మహ్మద్ సిరాజ్
-
CT 2025: ‘నాణ్యమైన బౌలర్.. సిరాజ్‌ను ఎలా పక్కనపెట్టారు?’
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ బంగర్(Sanjay Bangar)మద్దతుగా నిలిచాడు. అతడిని ఇంగ్లండ్‌తో వన్డేలకు, చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ హైదరాబాదీ స్టార్ నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్ అని.. అలాంటి ఆటగాడిని పక్కనపెట్టడం సరికాదని యాజమాన్యానికి హితవు పలికాడు.వన్డేలకు సిద్ధమైన రోహిత్ సేనకాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో టెస్టు సిరీస్ కోల్పోయిన అనంతరం.. టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లతో బిజీ అయింది. ఇప్పటికే సూర్యకుమార్ సేన ఐదు టీ20లలో నాలుగింట గెలిచి బట్లర్ బృందాన్ని చిత్తు చేసి సిరీస్ గెలుచుకోగా.. తాజాగా రోహిత్ సేన వన్డేలకు సిద్ధమైంది.అందుకే చోటివ్వలేదుఅయితే, ఆసీస్ పర్యటన తర్వాత విశ్రాంతి పేరిట సిరాజ్‌ను టీ20 సిరీస్ నుంచి తప్పించిన మేనేజ్మెంట్.. వన్డేల్లోనూ చోటివ్వలేదు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక సమయంలోనూ అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. సిరాజ్‌ను పక్కనపెట్టడానికి గల కారణాన్ని వెల్లడించాడు.ఇన్నింగ్స్ ఆరంభంలో కొత్త బంతితో రాణించగలుగుతున్న సిరాజ్.. డెత్ ఓవర్లలో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడని రోహిత్ పేర్కొన్నాడు. అందుకే మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో చోటిచ్చినట్లు తెలిపాడు.నాణ్యమైన బౌలర్.. అతడిని ఎలా పక్కనపెట్టారుఇక ఇంగ్లండ్‌తో గురువారం నుంచి టీమిండియా వన్డే సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో ఈ విషయాలపై సంజయ్ బంగర్ స్పందించాడు. ‘‘జట్టు విజయాల్లో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించిన సిరాజ్‌ను పక్కనపెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కొన్ని మ్యాచ్‌లలో అయితే తన అద్భుత ప్రదర్శనతో అతడే జట్టును గెలిపించాడు.ఉదాహరణకు అహ్మదాబాద్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయంలో తన పాత్ర కూడా ఉంది. అయితే, పాత బంతితో రాణింలేకపోతున్నాడన్న కారణం చూపి అతడిని పక్కనపెట్టడం సరికాదు. అతడొక క్వాలిటీ ప్లేయర్. ఏ దశలో బాగా బౌలింగ్ చేస్తాడన్న అంశంతో సంబంధం లేకుండా నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాడికి జట్టులో చోటివ్వాలి’’ అని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.కాగా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లోనూ సిరాజ్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఏడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ లంక 50 పరుగులకే కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా టీమిండియా సునాయాస విజయానికి బాటలు వేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ రెండు కీలక వికెట్లు తీసి భారత్ విజయంలో పాలుపంచుకున్నాడు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా గడ్డ మీద మాత్రం సిరాజ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అలా అయితే సిరాజ్‌కు చోటుకానీ టెస్టులు.. వన్డే ఫార్మాట్ వేరు కాబట్టి సిరాజ్‌కు ఇంగ్లండ్‌తో వన్డేల్లోనైనా అవకాశం ఇచ్చి చూడాల్సిందని సంజయ్ బంగర్ పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ నాటికి జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోతే.. సిరాజ్‌కు దుబాయ్ ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉందని మరో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరుగుతుంది. అనంతరం ఆదివారం(ఫిబ్రవరి 9) కటక్‌లో రెండో వన్డే.. అదే విధంగా అహ్మదాబాద్‌లో బుధవారం(ఫిబ్రవరి 12) మూడో వన్డే జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ సంయుక్త వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్లో భారత్ తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడుతుంది.చదవండి: ఇదేం పద్ధతి?: రోహిత్ శర్మ ఆగ్రహం -
టీమిండియాలో చోటు గల్లంతు.. అయినా ఆకట్టుకోలేకపోయిన సిరాజ్
ఇటీవలికాలంలో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇవ్వలేక ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj).. ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్‌లోనూ (Ranji Trophy) ఆకట్టుకోలేకపోయాడు. చాలాకాలం తర్వాత హైదరాబాద్ (Hyderabad) తరఫున రంజీ బరిలోకి దిగిన సిరాజ్.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఒక వికెట్‌కు పరిమితమయ్యాడు. భారీ అంచనాలతో ఈ మ్యాచ్ బరిలోకి దిగిన సిరాజ్ అతి సాధారణ బౌలర్లా బౌలింగ్ చేశాడు. కొత్త బంతితో మ్యాజిక్ చేసే సిరాజ్ ఈ మ్యాచ్‌లో తన తొలి 15 ఓవరల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అతనికి దక్కిన ఏకైక వికెట్ చివరి స్పెల్‌లో లభించింది. ఈ మ్యాచ్ జరుగుతున్న నాగ్‌పూర్ పిచ్ పేసర్లకు సహకరించలేదా అంటే అదేమీ లేదు. సిరాజ్ సహచర పేసర్లు చింట్ల రక్షన్ రెడ్డి, చామ మిలింద్ కలిపి ఐదు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ రాణించకపోయినా మిగతా బౌలర్లు రాణించి విదర్భను 190 పరుగులకే ఆలౌట్ చేశారు. రక్షన్ రెడ్డి, అనికేత్ రెడ్డి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. చామ మిలింద్ రెండు, తనయ్ త్యాగరాజన్ ఓ వికెట్ దక్కించుకున్నారు. విదర్భ ఇన్నింగ్స్‌లో హర్ష్ దూబే (46 బంతుల్లో 65; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మెరుపు అర్ద సెంచరీ చేసి జోష్ మీదున్న హర్ష్ దూబేను ఔట్ చేయడమే సిరాజ్‌కు ఊరట కలిగించే అంశం. విదర్భ ఇన్నింగ్స్‌లో హర్ష్‌తో పాటు అక్షయ్ వాద్కర్ (29), దనిష్ మలేవార్ (13), పార్థ్ రేఖడే (23), యశ్ రాథోడ్ (16), యశ్ ఠాకూర్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ (3) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 1.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. అభిరథ్ రెడ్డి 5 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. తన్మయ్ అగర్వాల్ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నాడు.బీజీటీలోనూ అంతంతమాత్రమే..!ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ప్రధాన బౌలర్‌గా చలామణి అయిన సిరాజ్.. ఆ సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ 5 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసినప్పటికీ.. జట్టు విజయానికి అతని ప్రదర్శనలు ఏమాత్రం అక్కరకు రాలేదు. బీజీటీలో సిరాజ్ బుమ్రా కంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయినా అతని నుంచి ఆశించిన ఫలితాలు రాలేదు. 2023 ఆరంభంలో మంచి ఫామ్‌లో ఉండిన సిరాజ్ ఆతర్వాత కొంత కాలం పాటు తన ఫామ్‌ను కొనసాగించగలిగాడు. 2023 నుంచి ఇప్పటివరకు 57 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 27.89 సగటున 104 వికెట్లు తీశాడు. ఈ మధ్యకాలంలో అతను మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. 2023 నుంచి ఇప్పటివరకు 683.5 ఓవర్లు వేసిన సిరాజ్.. ఈ మధ్యకాలంలో అత్యధిక ఓవర్లు వేసిన భారత పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. -
మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ(Deepti Sharma)కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగం ఇచ్చింది. ‘డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(Deputy Superintendent Of Police-డీఎస్పీగా)’గా ఆమెను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారుకు దీప్తి కృతజ్ఞతలు తెలియజేసింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తానని పేర్కొంది.కాగా భారత మహిళా క్రికెట్ జట్టు(Indian Women Cricket Team)లో దీప్తి శర్మ గత కొంతకాలంగా కీలక సభ్యురాలిగా ఉంది. రెండేళ్ల క్రితం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ రజత పతకం గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.గతేడాది అత్యుత్తమంగానిలకడైన ఆట తీరుతో ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2024 జట్టులో దీప్తి స్థానం దక్కించుకుంది. గతేడాది ఆమె బంతితో అత్యుత్తమంగా రాణించింది. 6.01 ఎకానమీతో అంతర్జాతీయ టీ20లలో ముప్పై వికెట్లు కూల్చింది.ఇక రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన 27 ఏళ్ల దీప్తి శర్మ.. ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడి 319 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు తీసింది. అదే విధంగా.. 101 వన్డేల్లో 2154 రన్స్ సాధించడంతో పాటుగా.. 130 వికెట్లు పడగొట్టింది. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లలో 124 మ్యాచ్‌లు ఆడిన దీప్తి శర్మ 1086 పరుగులు చేసింది. అదే విధంగా.. 138 వికెట్లతో సత్తా చాటింది.రూ. 3 కోట్ల క్యాష్ రివార్డుతో పాటుఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్న దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. క్రీడా రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా రూ. 3 కోట్ల క్యాష్ రివార్డుతో పాటు డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వనున్నట్లు గతేడాది ప్రకటించింది. తాజాగా విధుల్లో చేరేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.ఇందులో భాగంగా మొరదాబాద్‌లో సోమవారం అధికారికంగా ఉద్యోగంలో చేరిన దీప్తి శర్మ.. డీఎస్పీ యూనిఫామ్‌లో మెరిసింది. ఆమె తండ్రి భగవాన్ శర్మ, సోదరులు సుమిత్ శర్మ, ప్రశాంత్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆగ్రా ఆల్‌రౌండర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది.ప్రతిజ్ఞ చేస్తున్నా‘‘ఈ మైలురాయిని చేరినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. నాకు మద్దతుగా నిలిచి.. ఈస్థాయికి చేరుకునేలా ప్రోత్సహించిన నాకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నా.అలాగే.. ప్రజలకు సేవ చేసేందుకు వీలుగా ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞురాలినై ఉంటాను. ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా నా కొత్త పాత్రలో ఒదిగిపోవడంతో పాటుగా.. విధి నిర్వహణలో పూర్తి అంకితభావంతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా’’ అని దీప్తి శర్మ పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మన క్రికెటర్లలో మరో డీఎస్పీఈ క్రమంలో దీప్తికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘తొలుత సిరాజ్.. ఇప్పుడు మన క్రికెటర్లలో మరో డీఎస్పీ’’ అంటూ ఓ నెటిజన్ పేర్కొనడం హైలైట్‌గా నిలిచింది. కాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇటీవలే అధికారికంగా అతడికి నియామక ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.చదవండి: 13 ఏళ్ల తర్వాత రంజీ బరిలో కోహ్లి.. పోటెత్తిన జనం.. తొక్కిసలాట.. -
జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని సిరాజ్, మహిరా సన్నిహితులు ధ్రువీకరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కలిసి కన్పించలేదు.అయినప్పటికి సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేయడం, ఫోటోలకు లైక్‌లు చేయడం వంటి చర్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ మొదలయ్యాయి. కాగా సిరాజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవ్వడం ఇదేమి తొలిసారి కాదు.ఇటీవలే లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జానాయ్ భోస్లేతో ఈ స్టార్ పేసర్ ప్రేమలో ఉన్నాడని వార్తలు విన్పించాయి. కానీ వాటిని వారిద్దరూ కొట్టిపారేశారు. తమది అన్నాచెల్లెళ్ల బంధమంటూ చెప్పుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు మరోసారి సిరాజ్ డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి.ఎవరీ మహిరా శర్మ?మహిరా శర్మ.. వర్ధమాన భారతీయ నటీమణులలో ఒకరు. నాగిన్-2, బేపనా ప్యార్, కుండలీ భాగ్యలాంటి సీరియల్స్ తో పాపులర్ అయింది. పలు పంజాబీ మ్యూజిక్ వీడియోలలో కూడా ఆమె కన్పించింది. అయినప్పటికి బిగ్ బాస్ 13లో పాల్గొన్న తర్వాత ఆమె మరింత ఫేమస్ అయ్యింది. అక్కడ తోటి కంటెస్టెంట్ పరాస్ ఛబ్రాతో ఆమె ప్రేమయాణం నడిపింది. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు.స్పందించిన మహిరా తల్లి..అయితే ఈ వార్తలపై మహిరా తల్లి సానియా శర్మ తాజాగా స్పందించింది. అసలేమి మాట్లాడుతున్నారు. వారిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. ప్రజలు ఎదైనా మాట్లాడుతారు. ఇప్పుడు నా కుమార్తె సెలబ్రిటీ కాబట్టి ఎటువంటి వార్తలు రావడం సహజం. వీటిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఈ వార్త పూర్తిగా అబద్ధమని టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా శర్మ పేర్కొంది.రంజీల్లో ఆడనున్న సిరాజ్..కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాని సిరాజ్ రంజీ బాట పట్టాడు. గురువారం నుంచి నాగ్‌పూర్‌లో విదర్భ జట్టుతో జరిగే ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తరపున బరిలోకి దిగుతున్నాడు. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో చివరి రంజీ మ్యాచ్ కూడా విదర్భతోనే ఆడిన సిరాజ్... మళ్లీ ఆ ప్రత్యర్థితోనే దేశవాళీ ఆట ఆడబోతున్నాడు.చదవండి: అందరి చూపు కోహ్లి వైపు -
రంజీల్లో ‘స్టార్స్’ వార్!
ఆహా... ఎన్నాళ్లకెన్నాళ్లకు... మనస్టార్లు దేశవాళీ బాటపట్టారు. కింగ్ కోహ్లి ఢిల్లీ తరఫున ఆడితే... హైదరాబాద్‌కు సిరాజ్ పేస్ తోడైతే... కేఎల్ రాహుల్ కర్ణాటకకు జై కొడితే... జడేజా ఆల్‌రౌండ్ ఆటతో సౌరాష్టకు ఆడితే అవి రంజీ మ్యాచ్‌లేనా? రసవత్తర మ్యాచ్‌లు కావా? కచ్చితంగా అవుతాయి. తదుపరి రంజీ దశ పోటీలు తారలతో కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. అభిమానులకు నాలుగు రోజులూ ఇక క్రికెట్ పండగే! చూస్తుంటే గంభీర్ సిఫార్సులతో రూపొందించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త మార్గదర్శకాలు ఎంతటి స్టార్లయినా దేశవాళీ కోసం తగ్గాల్సిందేనని నిరూపించబోతున్నాయి. న్యూఢిల్లీ: దేశవాళీ రంజీ ట్రోఫీలోని చివరి రౌండ్ మ్యాచ్‌లూ పసందుగా సాగనున్నాయి. అభిమాన క్రికెటర్లు నాలుగు రోజుల ఆటకు అందుబాటులోకి రావడమే దేశవాళీ క్రికెట్‌కు సరికొత్త పండగ తెస్తోంది. ఇదివరకు చెప్పినట్టుగానే విరాట్ కోహ్లి ఢిల్లీ ఆడే తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఢిల్లీ డి్రస్టిక్ట్స్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించడమే కాదు... రైల్వేస్ జట్టుతో ఈ నెల 30 నుంచి జరిగే పోరుకోసం ఢిల్లీ జట్టును ప్రకటించింది. అందులో కింగ్ కోహ్లి ఉండటమే విశేషం. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫిబ్రవరి 2వ తేదీ వరకు అతను తన అభిమానులను దేశవాళీ మ్యాచ్ ద్వారా అలరించేందుకు సిద్ధమయ్యాడు. కేవలం మ్యాచ్ రోజుల్లోనే కాదు... ఢిల్లీ సహచరులతో పాటు కలిసి కసరత్తు చేసేందుకు అతను మంగళవారం జట్టుతో చేరతాడని ఢిల్లీ కోచ్ శరణ్‌దీప్ సింగ్ ధ్రువీకరించారు. కొన్నిరోజులుగా టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ (ప్రస్తుత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోచ్)తో కలిసి బ్యాటింగ్‌లో శ్రమిస్తున్నాడు. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడు రంజీతో అతను రియల్‌గా బ్యాటింగ్ చేయనున్నాడు. ఇదే జరిగితే 2012 తర్వాత కోహ్లి రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో డీడీసీఏ తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సెక్యూరిటీ సిబ్బందిని పెంచింది. ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చింది. సౌరాష్ట్రతో ఢిల్లీ ఆడిన గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం కాస్త వెలతే! కానీ ‘రన్ మెషిన్’ కోహ్లి శతక్కొట్టే ఇన్నింగ్స్ ఆడితే మాత్రం ఆ వెలతి తీరుతుంది. హైదరాబాద్ పేస్‌కా బాస్... సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా, షమీలాంటి అనుభవజ్ఞులతో పాటు భారత జట్టు పేస్ దళానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సిరాజ్ ఇప్పుడు హైదరాబాద్ బలం అయ్యాడు. గురువారం నుంచి నాగ్‌పూర్‌లో విదర్భ జట్టుతో జరిగే ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్ బరిలోకి దిగుతున్నాడు. నాగ్‌పూర్ ట్రాక్ పేస్‌కు అవకాశమిచ్చే వికెట్. ఈ నేపథ్యంలో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగే అవకాశముంది. అతను నిప్పులు చెరిగితే సొంతగడ్డపై విదర్భకు కష్టాలు తప్పవు! సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో చివరి రంజీ మ్యాచ్ కూడా విదర్భతోనే ఆడిన సిరాజ్... మళ్లీ ఆ ప్రత్యర్థితోనే దేశవాళీ ఆట ఆడబోతున్నాడు. జడేజా వరుసగా రెండో మ్యాచ్ ఎలైట్ గ్రూప్ ‘డి’లో ఉన్న సౌరాష్ట్ర తరఫున ఈ నెల 23 నుంచి ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ఆడిన స్టార్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్ ఆడేందుకు సై అంటున్నాడు. గత మ్యాచ్‌లో అతని ఆల్‌రౌండ్ ‘షో’ వల్లే నాలుగు రోజుల మ్యాచ్ కాస్త రెండే రోజుల్లో ముగిసింది. రెండు ఇన్నింగ్స్ (5/66, 7/38)ల్లో కలిపి 12 వికెట్లు తీసిన జడేజా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో 38 పరుగులు కూడా చేశాడు. సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. గురువారం నుంచి అస్సామ్‌తో జరిగే పోరులో మళ్లీ జోరు కనబరచాలనే లక్ష్యంతో రంజీ బరిలోకి దిగుతున్నాడు. అస్సామ్ను హిట్టర్ రియాన్ పరాగ్ నడిపిస్తున్నాడు. భుజం గాయం నుంచి కోలుకున్న పరాగ్ ఐపీఎల్ ద్వారానే అందరికంటా పడ్డాడు. ఫిట్నెస్తో రాహుల్ రెడీ కర్ణాటక తరఫున ఎలైట్ గ్రూప్ ‘సి’లో పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ ఆడాలనుకున్నాడు. కానీ మోచేతి గాయం కారణంగా ఆ రంజీ పోరు ఆడలేకపోయిన స్టార్ ఓపెనర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో హరియాణా జట్టుతో ఢీకొనేందుకు రెడీ అయ్యాడు. రాహుల్ చివరి సారిగా 2020లో బెంగాల్‌తో జరిగిన రంజీ సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఐదేళ్ల తర్వాత సొంతరాష్ట్రం తరఫున దేశవాళీ మ్యాచ్ ఆడనున్నాడు. అతని చేరికతో కర్ణాటక బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం అయ్యింది. అంతేకాదు. దేవదత్ పడిక్కల్, సీమర్ ప్రసిధ్ కృష్ణలు కూడా ఆడుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ ముగ్గురు ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రోహిత్, జైస్వాల్, అయ్యర్ గైర్హాజరు ఈ రంజీ ట్రోఫీలో ముంబై ఆడాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ భారత కెపె్టన్ రోహిత్ శర్మ సహా యువ సంచలనం యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్లు ఆసక్తి కనబరిచారు. ఈ త్రయం జమ్మూకశ్మీర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్‌తో వచ్చే నెల 6, 9, 12 తేదీల్లో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం వీరంతా భారత జట్టులో చేరాల్సివుండటంతో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే పోరుకు అందుబాటులో ఉండటం లేదని ముంబై వర్గాలు వెల్లడించాయి. -
చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి సిరాజ్! కారణం ఇదే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 భారత జట్టులో మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ ఐసీసీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రకటించిన జట్టులో ఒకే ఒక్క పేసర్ పూర్తి ఫిట్‌గా ఉండటం ఇందుకు కారణమని పేర్కొన్నాడు. మిగతా ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల ఫిట్‌నెస్‌పై స్పష్టత రావడం లేదు కాబట్టి.. సిరాజ్ మియా దుబాయ్ ఫ్లైట్ ఎక్కడం ఖాయంగానే కనిపిస్తుందని పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది. హైదరాబాదీ పేసర్‌కు దక్కని చోటుఈ నేపథ్యంలో జనవరి 18న బీసీసీఐ ఈ మెగా ఈవెంట్‌కు తమ జట్టును ప్రకటించగా.. ఇందులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం చోటు దక్కలేదు. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో పాటు మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేసిన సెలక్టర్లు.. యువ తరంగం, పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా స్థానం ఇచ్చారు. అందుకే పక్కన పెట్టామన్న కెప్టెన్ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉంటాడో లేదో తెలియదు. ఇక షమీతో పాటు అర్ష్‌దీప్ కొత్త బంతితో రాణించగలడు. అంతేకాదు.. డెత్ ఓవర్లలోనూ బాగా బౌలింగ్ చేయగలడు. అయితే, సిరాజ్ మాత్రం ఆరంభంలో చూపినంత ప్రభావం ఆఖర్లో చూపలేకపోతున్నాడు. అందుకే అతడిని పక్కనపెట్టాల్సి వచ్చింది’’ అని వివరణ ఇచ్చాడు.వైల్డ్ కార్డ్ ఎంట్రీఅయితే, తాజా పరిస్థితులు చూస్తుంటే సిరాజ్‌కు చాంపియన్స్ ట్రోఫీ జట్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. టోర్నీ నాటికి బుమ్రా వంద శాతం ఫిట్నెస్ సాధించే సూచనలు కనిపించడం లేదు. అదే విధంగా.. షమీ కూడా ఇంత వరకు రీఎంట్రీ ఇవ్వలేదు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20లకు అతడు దూరమైనా.. నెట్స్‌లో కుంటుతూ బౌలింగ్ చేసిన దృశ్యాలు అభిమానులను కలవరపెడుతున్నాయి.సిరాజ్‌కు చోటు పక్కాఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘షమీ గురించి కాసేపు పక్కనపెడతాం. బుమ్రా గురించి మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాచారం రావడం లేదు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో ఒక్క పేసర్ మాత్రమే ఫిట్‌గా ఉన్నాడు.మిగతా ఇద్దరు(బుమ్రా, షమీ) సంగతి తెలియదు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు జట్టుకు దూరమైతే.. ఆటోమేటిక్‌గా సిరాజ్ జట్టులోకి వచ్చేస్తాడు. కాబట్టి సిరాజ్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి.చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోతున్నానని భావించి పూర్తి ఫిట్‌గా.. అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలి. గాయం నుంచి కోలుకున్న తర్వాత షమీ ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఇక బుమ్రా ఒక్క వన్డేలోనూ భాగం కాలేదు. కాబట్టి సిరాజ్‌కు గనుక చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం వస్తే నాకైతే సంతోషమే’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన ప్రాథమిక జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.చదవండి: పరాయి స్త్రీలను తాకను.. ఇంత పొగరు పనికిరాదు! -
ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్ వార్తలపై సిరాజ్ రియాక్షన్
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) పెళ్లి వార్తలపై స్పందించాడు. గత రెండు రోజులుగా బాలీవుడ్ మీడియాతో పాటు నెట్టింట కూడా సిరాజ్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. లెజండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు.. సింగర్ జనై భోస్లే (Zanai Bhosle)తో కొంత కాలంగా ఆయన ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ముంబయిలోని ఆమె నివాసంలో తన 23వ పుట్టినరోజు వేడుకులను చాలా ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో సిరాజ్ కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట భారీగా వైరల్ అయ్యాయి. ఫొటోలో వారిద్దరూ కాస్త సన్నిహితంగా ఉన్నట్లు కనిపించడంతో ఈ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. చాలా కాలంగా వారు డేటింగ్లో ఉన్నారని కూడా పలు హిందీ, తెలుగు వెబ్సైట్లు పేర్కొన్నాయి. మరింత స్పీడ్‌గా ఈ వార్తలు వ్యాప్తి చెందుతుండటంతో సిరాజ్ తాజాగా రియాక్ట్ అయ్యాడు.సోషల్‌మీడియా వేదికగా మహ్మద్ సిరాజ్ రియాక్ట్ అయ్యాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఇలా పేర్కొన్నాడు. దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. జనై తనకు చెల్లెలు లాంటిదని తన ఇన్‌స్టా స్టోరీలో తెలిపాడు. ఈ క్రమంలో ఆయన ఒక ఫోటోను కూడా పంచుకున్నాడు. జనై లాంటి చెల్లెలు నాకు ఎవరూ లేరు. ఆమె లేకుండా నా జీవితం ఉండదు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాల మధ్య చంద్రుడు ఒక్కడే ఉన్నట్లుగా ఆమె వెయ్యి మందిలో ఒకరు' అని సిరాజ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇదే సమయంలో జనై కూడా ఈ రూమర్స్‌పై రియాక్ట్ అయింది. సిరాజ్ అంటూ తనకు చాలా ఇష్టమైన సోదరుడు అంటూ పేర్కొంది. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) -
ప్రముఖ సింగర్‌తో మహమ్మద్ సిరాజ్ డేటింగ్..!
భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రేమల్లో పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ సింగర్‌తో మన టీమిండియా స్టార్, హైదరాబాదీ డేటింగ్లో ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె బర్త్ డే వేడుకల్లోనూ సిరాజ్ కనిపించడంతో సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ సింగర్ ఎవరో తెలుసుకుందాం.ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆశా భోంస్లే మనవరాలు జనాయి భోంస్లే ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ సిరాజ్ భాయ్ డేటింగ్లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరినొకరు ఇన్‌స్టాలో ఫాలో అవుతుండడంతో ఈ రూమర్స్ మరింత వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పుట్టిన రోజు వేడుకల్లో మరో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కూడా పాల్గొన్నారు.కాగా.. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సింగర్ జనాయి భోంస్లేకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు జనాయి భోంస్లే విషయానికొస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఆశా భోంస్లే కుమారుడైన ఆనంద్ భోంస్లే కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇటీవల జరిగిన పుట్టినరోజు వేడుకల్లో నటుడు జాకీ ష్రాఫ్, ఆశా భోంస్లే, సిద్ధేష్ లాడ్, సుయాష్ ప్రభుదేశాయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయేషా ఖాన్, ముంజ్య స్టార్ అభయ్ వర్మ కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) -
‘అతడిని తప్పించి మంచి పనిచేశారు.. ఇది విన్నింగ్ టీమ్’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టును సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB de Villiers) సమర్థించాడు. ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్న టీమ్ అని కొనియాడాడు. అతడిని తప్పించి మంచి పనిచేశారుఅదే విధంగా.. ఈ జట్టు నుంచి పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను తప్పించడం కూడా సరైన నిర్ణయమేనని డివిలియర్స్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. అనంతరం మార్చి 2న న్యూజిలాండ్‌తో పోటీపడుతుంది.రోహిత్ శర్మ కెప్టెన్సీలోఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి వారం క్రితమే(జనవరి 18) బీసీసీఐ తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో సిరాజ్‌కు చోటు దక్కలేదు. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. మరో సీనియర్ మహ్మద్ షమీ, యువ తరంగం అర్ష్‌దీప్ సింగ్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ విషయంపై స్పందించిన ఏబీ డివిలియర్స్.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో సిరాజ్ లేకపోయినా టీమిండియాపై పెద్దగా ప్రభావం పడబోదని పేర్కొన్నాడు. గత కొంతకాలంగా అతడు కాస్త ఆందోళనగా కనిపిస్తున్నాడన్న ఏబీడీ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం ఇందుకు కారణం కావొచ్చన్నాడు.కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలిఆసీస్ టూర్లో తన శక్తి మొత్తాన్ని ఖర్చు చేసిన సిరాజ్ కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంటేనే బాగుంటుందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేగాక కంగారూ గడ్డపై అతడి ప్రదర్శన అంతగొప్పగా కూడా లేదని.. ఇప్పట్లో అతడు బరిలోకి దిగకపోవడమే మంచిదని పేర్కొన్నాడు. అయితే, అద్భుతమైన నైపుణ్యాలున్న సిరాజ్.. త్వరలోనే టీమిండియాలోకి తిరిగి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.ఇదొక విన్నింగ్ టీమ్ఇక చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే జట్టు గురించి ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘‘టోర్నమెంట్ విన్నింగ్ టీమ్ ఇది. భారత జట్టు తమ మ్యాచ్‌లను యూఏఈలో ఆడబోతోంది. కాబట్టి బ్యాటర్లు ప్రధామైన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.ఐసీసీ టోర్నమెంట్లలో గెలవాలంటే పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన జట్టు ఉండాలి. వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఆస్ట్రేలియా అనుసరించే వ్యూహాలను మనం చూస్తూనే ఉంటాం. వారి బ్యాటింగ్ ఆర్డర్ డీప్‌గా ఉంటుంది. వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గనిస్తాన్‌పై వీరోచిత డబుల్ సెంచరీ చేసి.. మ్యాచ్‌ను గెలిపించిన గ్లెన్ మాక్స్వెల్ ప్రదర్శన ఇందుకు నిదర్శనం.ఇక ఈ జట్టులో హార్దిక్ పాండ్యాతో పాటు ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. లోయర్ ఆర్డర్లో ఈ ముగ్గురు నెగ్గుకురాగలరు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటడం ఖాయమని డివిలియర్స్ రోహిత్ సేనకు మద్దతు ప్రకటించాడు.ఎనిమిది జట్లుకాగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి. ఇక టీమిండియా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది.చదవండి: జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి? చీఫ్ సెలక్టర్‌గా ఉంటే.. -
CT 2025: అతడి కంటే బెటర్!.. నాకు చోటు దక్కాలి కదా!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వన్డే ఫార్మాట్లో అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి సిరాజ్‌ను పక్కన పెట్టడం క్రీడా వర్గాల్లో చర్చానీయాంశమైంది.అతడి స్ధానంలో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. కనీసం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా ఈ హైదరాబాదీని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్‌తో వన్డేలకు సిరాజ్ బదులుగా మరో యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానాను ఎంపిక చేశారు.సెలక్టర్ల తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్‌ను తప్పిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని కార్తీక సమర్ధించాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి కోసం వెళ్లే జట్టులో లేకపోవడం కొంతవరకు బాధకారమనే చెప్పాలి. ఈ నిర్ణయం సిరాజ్‌ను నిరాశపరిచుండొచ్చు. కానీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. బుమ్రా, షమీ, అర్ష్‌దీప్‌లకు ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఛాన్స్ ఇచ్చారు.వీరు ముగ్గురు వైట్‌బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు తనను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడం సిరాజ్‌ను మరింత బాధ కలిగించుంటుంది. ఈ సమయంలో సిరాజ్.. రాణా కంటే తన ఎంతో బెటర్ అని భావిస్తుండవచ్చు. ఇది అతడిని తనను తాను మరింత నిరూపించుకోవడానికి ప్రేరేపిస్తుంది.కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక విషయంలో అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం సరైనదే అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన సిరాజ్ 71 వికెట్లు పడగొట్టాడు. ఆసియాకప్-2023ను భారత్ కైవసం చేసుకోవడంలో సిరాజ్‌ది కీలక పాత్ర. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: #Shardul Thakur: ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్.. కట్‌చేస్తే! సూపర్ సెంచరీ -
జడేజా స్ధానంలో అతడికి ఛాన్స్ ఇవ్వాల్సింది: ఆకాష్ చోప్రా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చానీయంశమైంది. అతడి స్ధానంలో యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు.దీంతో సెలక్టర్ల నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేరాడు. జడేజా స్ధానంలో సిరాజ్‌కు ఛాన్స్ ఇచ్చి ఉంటే జట్టు బౌలింగ్ యూనిట్ బలంగా ఉండేది అని చోప్రా అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే భారత జట్టు.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లతో కూడిన బలమైన పేస్ బౌలింగ్ ఎటాక్‌ను కలిగింది. అయినప్పటికి గత రెండేళ్ల నుంచి వన్డేల్లో అద్బుతంగా రాణిస్తున్న సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించడం క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గత 43 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 24.04 యావరేజ్‌తో 71 వికెట్లు తీశాడు మహ్మద్ సిరాజ్. 5.18 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. కొన్నాళ్లపాటు వన్డే నెం1 బౌలర్‌గా కూడా సిరాజ్ కొనసాగాడు."చాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే భారత జట్టులో మహ్మద్ సిరాజ్‌కు ఛాన్స్ ఇవ్వాల్సింది. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా రూపంలో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు. వారిలో ఒకరిని పక్కన పెట్టాల్సింది. నా వరకు అయితే రవీంద్ర జడేజా స్ధానంలో సిరాజ్‌ను ఎంపిక చేయాల్సింది. సిరాజ్ జట్టులో ఉండి ఉంటే కొత్త బంతితో అద్బుతంగా బౌలింగ్ చేసేవాడు. నిజం చెప్పాలంటే జడేజాకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. అటువంటి అతడిని ఎంపిక చేయడం ఎటువంటి లాభం ఉండదు. అదే సిరాజ్‌ను తీసుకుని ఉంటే ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారేవాడు" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: చాంపియన్స్ ట్రోఫీ జట్టులో నో ఛాన్స్: సిరాజ్ కీలక నిర్ణయం!? -
చాంపియన్స్ ట్రోఫీ జట్టులో నో ఛాన్స్: సిరాజ్ కీలక నిర్ణయం!?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అతడి స్ధానంలో యువ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్‌కు చోటు ఇచ్చారు. గత రెండేళ్లగా వన్డే ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్న సిరాజ్‌ను సెలక్టర్లు పక్కన పెట్టడాన్ని పలువురు మాజీలు తప్పుబడుతున్నారు.ఇంగ్లండ్‌తో వన్డేలకు కూడా సిరాజ్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే సిరాజ్ తిరిగి మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాకపోవడంతో సిరాజ్ మరో ఐదు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలో హైదరాబాదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో హైదరాబాద్ తరఫున ఓ మ్యాచ్ ఆడనున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో ఐదు టెస్టు మ్యాచ్‌లాడిన సిరాజ్... పని భారం కారణంగా ఈ నెల 23 నుంచి హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.అయితే గ్రూప్ దశలో హైదరాబాద్ ఆడే చివరి మ్యాచ్‌లో సిరాజ్ బరిలోకి దిగనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వర్గాలు వెల్లడించాయి. కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిరాజ మోస్తారు ప్రదర్శన కనబరిచాడు. ఐదు టెస్టుల్లో మొత్తంగా 20 వికెట్లు పడగొట్టి పర్వాలేదన్పించాడు.అందుకే పక్కన పెట్టాము: రోహిత్ శర్మకాగా ఛాంపియన్స్ ట్రోఫీకి సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. కొత్త బంతి, పాత బంతితో ప్రభావం చూపే బౌలర్ తమకు కావాలని, అందుకే సిరాజ్ స్ధానంలో అర్ష్‌దీప్‌కు ఛాన్స్ ఇచ్చామని రోహిత్ చెప్పుకొచ్చాడు.బంతి పాతబడినప్పుడు మహమ్మద్ సిరాజ్ ప్రభావం తగ్గుతుందని భారత కెప్టెన్ పేర్కొన్నాడు. ఇక పాక్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరగనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.ఇంగ్లండ్‌తో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్).భారత్‌తో వన్డేలకు/చాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.చదవండి: పొట్టి ప్రపంచకప్‌లో పెను సంచలనం.. న్యూజిలాండ్‌కు షాకిచ్చిన పసికూన -
సిరాజ్ మెరుగులు దిద్దుకుంటాడా?
త్వరలో జరగనున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్, తర్వాత ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాల్గొనే భారత్ జట్టుకి హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఈ జట్టులో సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తో పాటు ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు స్థానం లభించింది. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కి వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు.30 ఏళ్ల సిరాజ్ గత మూడు సంవత్సరాలుగా వన్డే ఫార్మాట్లో భారత్ ప్రధాన పేస్ బౌలర్లలో ఒకడిగా రాణిస్తున్నాడు. 2023లో శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన (6/21)తో ప్రత్యర్థి జట్టును 50 పరుగులకే ఆలౌట్ చేసాడు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో సైతం రాణించి 14 వికెట్లు తీసి భారత్ జట్టు రన్నరప్ గా నిలవడంతో తన వంతు పాత్ర పోషించాడు. ఇంతవరకు 44 వన్డే మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసిన సిరాజ్ కి భారత్ జట్టులో స్థానం దక్కక పోవడం ఆశ్చర్యకర పరిణామం.అయితే బుమ్రా పూర్తిగా కోలుకుంటాడో లేదో ఇంకా పూర్తిగా తెలీదు. ఏంతో అనుభవజ్ఞుడైన ప్పటికీ గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వస్తున్న షమీ ఎలా రాణిస్తాడో తెలీదు. ఈ నేపధ్యం లో సిరాజ్‌కు బదులుగా ఇప్పటివరకు ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడిన ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్‌ను జట్టుకి ఎంపిక చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ ముగ్గురితో పాటు, దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు హార్దిక్ పాండ్యా భారత పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గ జట్టు లో ఉంటాడు.సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం బుమ్రా ఫిట్నెస్ గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు, కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, “జస్ప్రీత్ బుమ్రా ఆడతాడో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు. అందుకే కొత్త బంతితో మరియు పాత బంతితో బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్ ని జట్టులోకి తీసుకున్నాము. జట్టులో సిరాజ్ లేకపోవడం దురదృష్టకరం," అని అన్నాడు.అయితే ఇటీవల జరిగిన గవాస్కర్-బోర్డర్ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సిరాజ్ రాణించినప్పటికీ, జట్టుకి అవసరమైన సమయంలో అతను వికెట్లు తీయలేక పోయాడన్నది వాస్తవం. బుమ్రా ఐదు టెస్టుల్లో 34.82 సగటు తో 32 వికెట్లు పడగొట్టాడు. విదేశీ పర్యటన లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్ లో అయిదు టెస్ట్ మ్యాచ్ లు ఆడి 31.15 సగటు తో 20 వికెట్లు పడగొట్టినప్పటికీ కీలక సమయంలో మరో వైపు రాణిస్తున్న బుమ్రాకి సిరాజ్ సరైన చేయూత ఇవ్వలేకపోయాడు. బహుశా ఈ కారణంగానే సెలెక్టర్లు సిరాజ్ ని జట్టు నుంచి తప్పించారని భావించాలి. అయితే తన లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ జట్లులోకి రాగాల సత్తా సిరాజ్ కి ఉంది. అయితే ఇందుకోసం సిరాజ్ చిత్తశుద్ధి తో ప్రయత్నించాలి. షమీ మళ్ళీ జట్టు లోకి వచ్చినప్పటికీ 34 ఏళ్ళ వయస్సులో సుదీర్ఘ కాలం జట్టులో కొనసాగే అవకాశాలు తక్కువే. ఇప్పటికే అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాణించి ఎంతో అనుభవం సంపాదించిన సిరాజ్ తన బౌలింగ్ కి మరింత మెరుగులు దిద్దుకొని రాణిస్తాడని ఆశిద్దాం. -
సిరాజ్‌లో పదును తగ్గిందా!
ముంబై: 2023 నుంచి చూస్తే 28 మ్యాచ్‌లలో 22.7 సగటుతో 47 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ కూడా చాలా మెరుగ్గా (5.41) ఉంది. ఎలా చూసినా ఇది చెప్పుకోదగ్గ ప్రదర్శనే. సిరాజ్ చాలా వరకు నిలకడగా రాణించాడు. అతను మరీ ఘోరంగా విఫలమైన మ్యాచ్‌లు కూడా అరుదు. అయినా సరే...నలుగురు స్పిన్నర్లతో ఆడాలనే టీమిండియా ప్రణాళికల కారణంగా అతనికి చోటు దక్కలేదు.కెప్టెన్ రోహిత్ శర్మ మాటల్లో చెప్పాలంటే ఆరంభ ఓవర్లలో కొత్త బంతితో చెలరేగినంతగా సిరాజ్ చివర్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. బంతి పాతబడిన కొద్దీ అతని ప్రభావం తగ్గుతోంది. ఇప్పటికే టి20ల్లో తనను తాను నిరూపించుకోవడంతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకముంచారు. ఎడమచేతి వాటం బౌలర్ కావడం అతనికి మరో అదనపు అర్హతగా మారింది. ‘ఆరంభంలో, చివర్లో కూడా బాగా బౌలింగ్ చేయగలిగే ఆటగాడు మాకు కావాలి. కొత్త బంతితో షమీ ఏం చేయగలడో అందరికీ తెలుసు. చివర్లో ఆ బాధ్యతఅర్ష్దీప్ తీసుకోగలడు. సరిగ్గా ఇక్కడే సిరాజ్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. అతను కొత్త బంతితో తప్ప చివర్లో ఆశించిన ప్రదర్శన ఇవ్వడం లేదు. దీనిపై మేం చాలా సుదీర్ఘంగా చర్చించాం. ఆల్‌రౌండర్లు కావాలి కాబట్టి ముగ్గురు పేసర్లనే తీసుకున్నాం. సిరాజ్ లేకపోవడం దురదృష్టకరమే కానీ కొన్ని రకాల బాధ్యతల కోసం కొందరిని తీసుకొని మరికొందరిని పక్కన పెట్టక తప్పదు’ అని రోహిత్ వివరించాడు. -
అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదు: రోహిత్ శర్మ
అభిమానుల నిరీక్షణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎట్టకేలకు శనివారం తెరదించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా(Champions Trophy India Squad)ను ప్రకటించింది. ఇక మెగా టోర్నీకి రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్‌గా కొనసాగనుండగా.. శుబ్‌మన్ గిల్(Shubman Gill) అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు.బుమ్రా గాయంపై రాని స్పష్టతఅంతేకాదు.. ఈ ఓపెనింగ్ జోడీకి బ్యాకప్‌గా యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులోనూ చోటు సంపాదించుకున్నాడు. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం గురించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆఖరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా అతడు వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే.అయితే, చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా అందుబాటులోకి వస్తాడని సెలక్టర్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని ఐసీసీ ఈవెంట్‌కు ఎంపిక చేశారు. కానీ హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం ఈ జట్టులో స్థానం దక్కలేదు.వన్డే వరల్డ్‌కప్-2023లో లీడింగ్ వికెట్(24 వికెట్లు) టేకర్‌గా నిలిచిన మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో జట్టును ప్రకటిస్తున్న సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మకు సిరాజ్ గురించి ప్రశ్న ఎదురైంది.అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదుఇందుకు స్పందిస్తూ.. ‘‘బుమ్రా ఈ టోర్నీలో ఆడతాడా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు. కాబట్టి కొత్త బంతితో, పాత బంతితోనూ ఫలితాలు రాబట్టగల పేసర్ల వైపే మొగ్గుచూపాలని భావించాం. బుమ్రా మిస్సవుతాడని కచ్చితంగా చెప్పలేం.కానీ ఏం జరిగినా అందుకు సిద్ధంగా ఉండాలి. అందుకే అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేసుకున్నాం. కొత్త బంతితో షమీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అందరికీ తెలుసు. అయితే, న్యూ బాల్ లేకపోతే సిరాజ్ తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేడు. అందుకే అతడిని ఎంపిక చేయలేదు’’ అని రోహిత్ శర్మ వివరించాడు.సీమ్ ఆల్‌రౌండర్లు లేరుఇక చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండటం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘దురదృష్టవశాత్తూ మనకు ఎక్కువగా సీమ్ ఆల్‌రౌండర్లు లేరు. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ డెప్త్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నంతలో స్పిన్ ఆల్‌రౌండర్లనే ఎంపిక చేసుకున్నాం’’ అని తెలిపాడు.కాగా స్పిన్ విభాగంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. సీమ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు.. అతడికి బ్యాకప్‌గా ట్రావెలింగ్ రిజర్వ్స్లో యువ సంచలనం, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డికి చోటిచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
టీమిండియా యువ బౌలర్‌కు వెన్నునొప్పి.. మరో పేసర్ అవుట్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సత్తా చాటి.. టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన భారత క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకోవడం ద్వారా యువకులు అంతర్జాతీయ టీ20లలోనూ ఆడే అవకాశం దక్కించుకుంటున్నారు. నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా ఆ కోవకు చెందిన వాడే. ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ గతేడాది ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు.అరేంగేట్ర మ్యాచ్లోనేలక్నో సూపర్ జెయింట్స్ తరఫున అరేంగేట్ర మ్యాచ్‌లోనే మయాంక్ యాదవ్.. తన పేస్ పదనుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతిని విసిరి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు ఈ స్పీడ్‌స్టర్. అయితే, కేవలం నాలుగు మ్యాచ్‌లు ఆడిన తర్వాత గాయం కారణంగా.. ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో సత్తా చాటిఅనంతరం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన మయాంక్ యాదవ్.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. బంగ్లాతో మూడు మ్యాచ్‌లలోనూ ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.అయితే, ఆ తర్వాత మళ్లీ గాయం తిరగబెట్టడంతో మయాంక్ యాదవ్ టీమిండియాకు దూరమయ్యాడు. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగనున్న టీ20 సిరీస్‌కైనా ఎంపికవుతాడని భావిస్తే.. ఈసారి కూడా గాయం అతడికి అడ్డంకిగా మారింది. వెన్నునొప్పితో బాధపడుతున్న మయాంక్ యాదవ్ ఇంకా కోలుకోలేదని సమాచారం.వెన్నునొప్పి వేధిస్తోందిఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘అతడిని వెన్నునొప్పి వేధిస్తోంది. కాబట్టి ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి ఫిట్నెస్ సాధించకపోవచ్చు. సెకండ్ లెగ్‌లో భాగంగా జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో మ్యాచ్ ఆడనున్న ఢిల్లీ రంజీ జట్టులో కూడా మయాంక్ పేరు లేకపోవడం గమనించే ఉంటారు’’ అని పేర్కొన్నాయి.కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్ కూడా ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో తీరికలేకుండా గడిపిన ఈ ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని.. ఇంగ్లండ్‌తో వన్డేలకు మాత్రం తిరిగి రానున్నట్లు సమాచారం. మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా అప్పుడే రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక బుమ్రా, సిరాజ్, షమీ గైర్హాజరీలో అర్ష్‌దీప్ సింగ్ టీ20 సిరీస్‌లో పేస్ దళాన్ని ముందుకు నడిపించనున్నట్లు సమాచారం.భారత్ వర్సెస్ ఇంగ్లండ్.. టీ20 సిరీస్, వన్డే షెడ్యూల్టీ20లుతొలి టీ20- జనవరి 22- కోల్కతారెండో టీ20- జనవరి 25- చెన్నైమూడో టీ20- జనవరి 28- రాజ్కోట్నాలుగో టీ20- జనవరి 31- పుణెఐదో టీ20- ఫిబ్రవరి 2- ముంబైవన్డేలుతొలి వన్డే- ఫిబ్రవరి 6- నాగ్పూర్రెండో వన్డే- ఫిబ్రవరి 9- కటక్మూడో వన్డే- ఫిబ్రవరి 12- అహ్మదాబాద్.చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్! -
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)... ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ ఇదే మాట చెబుతారనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ దళ నాయకుడిగా కొనసాగుతున్న బుమ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 సిరీస్‌లోనూ భారమంతా తానే మోస్తున్నాడు. గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సారథిగా భారత్‌కు భారీ విజయం అందించిన బుమ్రా.. సిడ్నీ టెస్టు సందర్భంగా మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులంతా బుమ్రా నామసర్మణ చేస్తున్నారు. ఆసీస్‌తో ఆఖరి టెస్టు గండాన్ని గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రా మాత్రమే అని విశ్వసిస్తున్నారు. నిజానికి.. స్వదేశంలో జరిగే సిరీస్‌లలో టీమిండియా స్పిన్నర్లదే పైచేయి గా నిలుస్తుంది. కానీ విదేశీ గడ్డపై జరిగే సిరీస్‌లలో అక్కడి పిచ్‌లకు అనుగుణంగా పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. అయితే ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ముందు చూపుతూ వ్యవహరించడంలో విఫలమైందని చెప్పవచ్చు.షమీ ఉంటే బుమ్రాపై భారం తగ్గేదిఆస్ట్రేలియా వంటి ఎంతో ప్రాముఖ్యం గల సిరీస్ ముందుగా పేస్ బౌలర్లని పదును పెట్టడంలో బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి గాయంతో దూరం కావడం భారత్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. షమీ ఎంతో అనుభవజ్ఞుడు. పైగా ఆస్ట్రేలియాలో గతంలో రాణించి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. షమీ అండగా ఉన్నట్లయితే బుమ్రా పై ఇంతటి ఒత్తిడి ఉండేది కాదన్నది వాస్తవం.గతంలో బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు భారత్ పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండేది. మహమ్మద్ సిరాజ్ చాల కాలంగా జట్టులో ఉన్నప్పటికీ, నిలకడగా రాణించడం లో విఫలమయ్యాడనే చెప్పాలి.యువ బౌలర్లకు సరైన మార్గదర్శకత్వం ఏది?ఈ నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంతోమంది యువ బౌలర్లు రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ వారికి సరైన తర్ఫీదు ఇవ్వడంలోనూ.. సీనియర్ బౌలర్లు గాయాల బారిన పడకుండా వారిని సరైన విధంగా మేనేజ్ చేయడంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు విఫలమైంది. ఐపీఎల్ పుణ్యమా అని భారత్ క్రికెట్‌కు ప్రస్తుతం పేస్ బౌలర్ల కొరత లేదు. కానీ ఉన్నవారికి సరైన తర్ఫీదు ఇచ్చి వారు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో రాణించే విధంగా తీర్చిదిద్దడం కచ్చితంగా బోర్డుదే బాధ్యత. ఇటీవల కాలంలో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, శార్దూల ఠాకూర్, అర్షదీప్ సింగ్, వరుణ్ ఆరోన్, టి నటరాజన్ వంటి అనేక మంది యువ బౌలర్లు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. వారికి భారత్ క్రికెట్ జట్టు అవసరాలకి అనుగుణంగా సరైన రీతిలో తర్ఫీదు ఇస్తే బాగుంటుంది.వాళ్లకు అనుభవం తక్కువఇక తాజా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్‌లతో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యారు. అయితే, ఈ ముగ్గురూ అదనపు పేసర్లుగా అందుబాటులో ఉన్నప్పటికీ బుమ్రా, సిరాజ్‌లపైనే భారం పడింది. అయితే, సిరాజ్ నిలకడలేమి కారణంగా బుమ్రా ఒక్కడే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.నిజానికి.. బుమ్రా ఈ సిరీస్ లో సంచలనం సృష్టించాడు. ఒంటి చేత్తో తొలి టెస్టులో భారత జట్టుకి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్‌లో ఇంతవరకు 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.మూడు మార్లు ఐదు కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్‌లో అధిగమించడం విశేషం. అయితే, ఆఖరిదైన సిడ్నీ టెస్టులో భాగంగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. అయితే, మైదానం నుంచి నిష్క్రమించే ముందు బుమ్రా కీలకమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ని అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.చివరి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌పై అనిశ్చితి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరుగుతున్న ఐదవ మరియు చివరి టెస్టులో రెండో రోజు ఆటలో అసౌకర్యానికి గురైన బుమ్రా మ్యాచ్ మధ్యలో వైదొలిగాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. మ్యాచ్ అనంతరం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ బుమ్రా పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. బుమ్రా పరిస్థితిని భారత వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నాడు. "జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి ఉంది. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది" అని వ్యాఖ్యానించాడు.3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడునిజానికి 2024 నుంచి ఇప్పటి దాకా(జనవరి 4) టెస్టుల్లో అత్యధిక బంతులు బౌల్ చేసింది బుమ్రానే. ఏకంగా 367 ఓవర్లు అంటే.. 2202 బాల్స్ వేసింది అతడే!.. ఈ విషయంలో బుమ్రా తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్(1852 బాల్స్) ఉన్నాడు.ఇక బుమ్రా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 908 బంతులు వేశాడు. అంటే 151.2 ఓవర్లు అన్నమాట. ఇది ఐపీఎల్ మూడు సీజన్లలో ఒక బౌలర్ వేసే ఓవర్లకు దాదాపు సమానం. ఐపీఎల్లో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడి.. ప్రతి మ్యాచ్‌లోనూ నాలుగు ఓవర్ల కోటాను బౌలర్ పూర్తి చేశాడంటే.. మూడు సీజన్లు కలిపి అతడి ఖాతాలో 168 ఓవర్లు జమవుతాయి. అదే.. 13 మ్యాచ్‌లు ఆడితే 156 ఓవర్లు. అదీ సంగతి. ఇంతటి భారం పడితే ఏ పేసర్ అయినా గాయపడకుండా ఉంటాడా? ఇందుకు బోర్డు బాధ్యత వహించనక్కర్లేదా?!చదవండి: నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా -
సిరాజ్ టెన్షన్ పెట్టాడు.. కానీ అతడి వల్లే.: నితీశ్ రెడ్డి తండ్రి కామెంట్స్ వైరల్
నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) మెల్బోర్న్లో సాధించిన ఘనత తమ జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని అతడి తండ్రి ముత్యాలరెడ్డి అన్నారు. ఇదొక ప్రత్యేకమైన అనుభూతి అని.. తన కుమారుడి కష్టానికి ప్రతిఫలం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా టీమిండియా తరఫున టీ20ల ద్వారా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు నితీశ్ రెడ్డి.పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన 21 ఏళ్ల ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)కి ఎంపికయ్యాడు. కంగారూ దేశంలోని పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసిన తుదిజట్టులోనూ స్థానం సంపాదించాడు. తొలి టెస్టు నుంచే బ్యాట్‌తో చెలరేగిన నితీశ్ రెడ్డి.. తాజాగా మెల్బోర్న్ వేదికగా శతకంతో మెరిశాడు.97 పరుగుల వద్ద ఉండగా ఎనిమిదో వికెట్బాక్సింగ్ డే టెస్టులో భాగంగా శనివారం నాటి మూడో రోజు ఆటలో ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ... భారత్ తరఫున తొలి సెంచరీ సాధించాడు. అయితే, నితీశ్ రెడ్డి 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. వాషింగ్టన్ సుందర్(50) ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు.99.. తొమ్మిదో వికెట్ డౌన్ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. అయితే, అతడు పరుగుల ఖాతా తెరవకముందే కమిన్స్ బుమ్రాను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోగా.. అప్పటికి నితీశ్ 99 పరుగుల వద్ద ఉన్నాడు. దీంతో బుమ్రా స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మద్ సిరాజ్ వికెట్ కాపాడుకుంటాడా?.. నితీశ్ రెడ్డి సెంచరీ పూర్తి చేసుకోగలడా? అనే ఉత్కంఠ పెరిగింది.ఫోర్ బాది వంద పరుగుల మార్కుకుఅయితే, సిరాజ్ కమిన్స్ బౌలింగ్‌లో మూడు బంతులను చక్కగా డిఫెన్స్ చేసుకోవడంతో.. నితీశ్ రెడ్డికి లైన్‌క్లియర్ అయింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో అతడు ఫోర్ బాది వంద పరుగుల మార్కు అందుకున్నాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.Nitish Kumar Reddy hits his maiden Test century and receives a standing ovation from the MCG crowd ❤️ #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/Vbqq5C26gz— cricket.com.au (@cricketcomau) December 28, 2024 ఇక నితీశ్ రెడ్డి శతకం బాదినపుడు అతడి కుటుంబం కూడా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో నితీశ్ తండ్రి ముత్యాలరెడ్డి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ ఆడం గిల్‌క్రిస్ట్ ముత్యాలరెడ్డిని ఇంటర్వ్యూ చేశాడు.సిరాజ్ వల్లే సాధ్యమైందిఈ సందర్భంగా ముత్యాలరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబానికి ఇదెంతో ప్రత్యేకమైన రోజు. జీవితాంతం ఈ క్షణాలు గుర్తుండిపోతాయి. 14- 15 ఏళ్ల వయసు నుంచే నితీశ్ అద్భుతంగా రాణిస్తున్నాడు.ఇప్పుడిక అంతర్జాతీయ క్రికెట్లోనూ సత్తా చాటుతుండటం సంతోషం. ఈ భావనను మాటల్లో వర్ణించలేను. నిజానికి నితీశ్ 99 పరుగుల వద్ద ఉన్నపుడు నాకు టెన్షన్‌గా అనిపించింది. అప్పటికి ఒకే వికెట్ చేతిలో ఉన్నా.. సిరాజ్ అద్భుతం చేశాడు. అతడు వికెట్ కాపాడుకున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు😭😭pic.twitter.com/IFTEjVw0uS https://t.co/4p2BAImzGW— Kraken (@krak3nnnnnn) December 28, 2024Adam Gilchrist asked Nitish Reddy's fathe,Nitish Reddy at 99 and Md Siraj was facing 3 balls. HIS FATHER SAID TENSION #nitishkumarreddy #fatherson #MOMENT pic.twitter.com/DVeyQOy7Io— The Comrade (@Yogeshp89973385) December 28, 2024 -
చెప్పి మరీ.. అతడిపై వేటు వేయండి: టీమిండియా దిగ్గజం
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఘాటు విమర్శలు చేశాడు. అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేయాలని యాజమాన్యానికి సూచించాడు. విశ్రాంతి పేరిట పక్కన పెడుతున్నామని చెబితే సరిపోదని.. జట్టు నుంచి తప్పిస్తున్నామని స్పష్టంగా చెప్పాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.ఆసీస్‌తో 1-1తో సమంగా టీమిండియాబోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు.. పెర్త్‌లో గెలుపొంది శుభారంభం చేసింది. అయితే, అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఓటమి చెందిన రోహిత్ సేన.. బ్రిస్బేన్‌లో మూడో టెస్టును డ్రా చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది.బుమ్రాపై అదనపు భారం మోపుతున్న సిరాజ్? అయితే, ఈ సిరీస్‌లో భారత పేసర్ సిరాజ్ ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి పదమూడు వికెట్లు తీశాడు. కానీ కొత్త బంతితో మ్యాజిక్ చేయలేకపోతున్న ఈ హైదరాబాదీ బౌలర్.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం మోపుతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కీలక సమయంలో సిరాజ్ వికెట్లు తీయకపోవడంతో బుమ్రాపై పనిభారం ఎక్కువవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.వేటు వేస్తున్నామని స్పష్టంగా చెప్పండిఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్(Sunil Gavaskar Comments) మాట్లాడుతూ.. ‘‘సిరాజ్‌కు బ్రేక్ ఇవ్వాలి. నా ఉద్దేశం.. విశ్రాంతి పేరిట పక్కన పెట్టాలని కాదు. ‘నీ ఆట తీరు బాగాలేదు. కాబట్టి నిన్ను జట్టు నుంచి తప్పిస్తున్నాం’ అని స్పష్టంగా అతడికి చెప్పాలి.కొన్నిసార్లు ఆటగాళ్ల పట్ల కాస్త పరుషంగా వ్యవహరించడంలో తప్పులేదు. ఎందుకంటే.. విశ్రాంతినిస్తున్నామని చెబితే.. వాళ్లు మరోలా ఊహించుకుంటారు. కాబట్టి వేటు వేస్తున్నామని వారికి తెలిసేలా చేయాలి.సిరాజ్ స్థానంలో వారిని తీసుకోండి అప్పుడే వారిలో కసి పెరుగుతుంది. కచ్చితంగా ఆట తీరును మెరుగుపరచుకుంటారు’’ అని పేర్కొన్నాడు. జట్టులో మార్పులు చేయాలనుకుంటే.. సిరాజ్‌ను తప్పించి ప్రసిద్ కృష్ణ లేదంటే హర్షిత్ రాణాను పిలిపించాలని గావస్కర్ ఈ సందర్భగా సూచించాడు. బుమ్రాకు వారు సపోర్టుగా ఉంటారని పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజూ ఆసీస్దేకాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య గురువారం బాక్సింగ్ డే టెస్టు మొదలైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ పటిష్ట స్థితిలోనే ఉంది.తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన కంగారూ జట్టు.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి సగం వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టింది. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మరో పేసర్ స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీయగా.. 46 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(82) రనౌట్ కావడంతో భారత్‌కు గట్టి షాక్ తగిలింది.చదవండి: కోహ్లికి అవమానం.. ఇంత నీచంగా ప్రవర్తిసారా?.. తగ్గేదేలే అంటూ దూసుకొచ్చిన కింగ్ -
IND Vs AUS: ఆస్ట్రేలియా- భారత్ నాలుగో టెస్టు టెస్టు హైలెట్స్ (ఫొటోలు)
-
వర్షం ఎఫెక్ట్.. ఆస్ట్రేలియా- భారత్ మూడో టెస్టు హైలెట్స్ (ఫొటోలు)
-
అలా శాసించే అలవాటు మాకు లేదు: బుమ్రా
బ్రిస్బేన్: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన స్థాయిని ప్రదర్శిస్తూ 6 వికెట్లతో చెలరేగాడు. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్‌లో ఇప్పటికే 18 వికెట్లు తీసిన అతను... ఆస్ట్రేలియా గడ్డపై 50 వికెట్లు తీసిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అయితే మూడో టెస్టులో బుమ్రాకు మిగతా బౌలర్ల నుంచి తగిన సహకారం లభించకపోవడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ఈ నేపథ్యంలో ఇతర బౌలర్లపై వచ్చిన విమర్శలను బుమ్రా తిప్పికొట్టాడు. వారిలో చాలా మంది కొత్తవారేనని, ఇంకా నేర్చుకుంటున్నారని మద్దతు పలికాడు. ‘జట్టులో ఇతర సభ్యుల వైపు వేలెత్తి చూపించే పని మేం చేయం. నువ్వు ఇది చేయాలి, నువ్వు అది చేయాలి అంటూ శాసించే దృక్పథం కాదు మాది. ఎంతో మంది కొత్త ఆటగాళ్లు వస్తున్నారు. ఆస్ట్రేలియాలాంటి చోట రాణించడం అంత సులువు కాదు. ముఖ్యంగా మా బౌలింగ్‌లో సంధి కాలం నడుస్తోంది. కొన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవంతో వారికి నేను అండగా నిలవాలి. వారంతా ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. ఈ ప్రయాణంలో మున్ముందు మరింత మెరుగవుతారు’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు. జట్టు బ్యాటింగ్ వైఫల్యంపై కూడా అతను స్పందించాడు. ‘బ్యాటర్లు విఫలమయ్యారని, వారి వల్ల మాపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పడం సరైంది కాదు. జట్టులో 11 మంది ఉన్నాం. కొందరికి అనుభవం చాలా తక్కువ. వారు నేర్చుకునేందుకు తగినంత అవకాశం ఇవ్వాలి. ఎవరూ పుట్టుకతోనే గొప్ప ఆటగాళ్లు కాలేరు. నేర్చుకునే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. సవాళ్లు ఎదురైనప్పుడు కొత్త తరహాలో వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లో మూడు భిన్నమైన పిచ్‌లు ఎదురయ్యాయి. నేను వాటి కోసం సిద్ధమయ్యాను. గతంలో అంచనాల భారంతో కాస్త ఒత్తిడి ఉండేది. ఇప్పుడు వాటిని పట్టించుకోవడంలేదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నిస్తా. నేను బాగా ఆడని రోజు మిగతా బౌలర్లు వికెట్లు తీయవచ్చు’ అని బుమ్రా వివరించాడు. సిరాజ్‌కు గాయం! ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న మరో పేసర్ సిరాజ్‌కు బుమ్రా అండగా నిలిచాడు. అతను స్వల్ప గాయంతో బాధపడుతూనే బరిలోకి దిగాడని, సిరాజ్‌లో పోరాట స్ఫూర్తి చాలా ఉందని మెచ్చుకున్నాడు. ‘మైదానంలోకి దిగిన తాను బాగా బౌలింగ్ చేయకపోతే జట్టుపై ఒత్తిడి పెరుగుతుందని సిరాజ్‌కు తెలుసు. అందుకే స్వల్ప గాయంతో ఉన్నా బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. కొన్నిసార్లు బాగా బౌలింగ్ చేసినా వికెట్లు దక్కవని, పోరాడటం ఆపవద్దని అతనికి చెప్పా. ఎందరికో రాని అవకాశం నీకు వచ్చిందంటూ ప్రోత్సహించా. అతనిలో ఎలాంటి ఆందోళన లేదు. ఎంతకైనా పట్టుదలగా పోరాడే అతని స్ఫూర్తి నాకు నచ్చుతుంది. అది జట్టుకూ సానుకూలాశం’ అని బుమ్రా అభిప్రాయపడ్డాడు. -
సిరాజ్‌పై మండిపడ్డ జడేజా!.. నీకు ఎందుకంత దూకుడు?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు బ్రిస్బేన్‌లో వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మూడో టెస్టు సందర్భంగా ఈ హైదరాబాదీ బౌలర్‌ను ఆస్ట్రేలియా అభిమానులు పరుష పదజాలం వాడుతూ హేళన చేశారు. అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో ట్రవిస్ హెడ్‌కు సిరాజ్ సెండాఫ్ ఇచ్చిన తీరును విమర్శిస్తూ.. అవమానించేలా గట్టిగా అరిచారు.ఆస్ట్రేలియా- భారత్ మధ్య శనివారం గబ్బా మైదానంలో మొదలైన మూడో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా సిరాజ్‌ను కించపరిచేలా ఆసీస్ ఫ్యాన్స్ ప్రవర్తించారు. తాజాగా ఆదివారం నాటి రెండో రోజు ఆటలోనూ సిరాజ్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. సహచర ఆటగాడు రవీంద్ర జడేజా.. ఈ స్పీడ్‌స్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.సిరాజ్‌పై మండిపడ్డ జడేజా!కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో భారత్, అడిలైడ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి.ఇక ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో మూడో టెస్టు జరుగుతోంది. వర్షం వల్ల శనివారం నాటి తొలిరోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆసీస్.. 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.బుమ్రాకు ఐదుఈ క్రమంలో ఆదివారం రెండో రోజు ఆట మాత్రం సజావుగా సాగింది. ట్రవిస్ హెడ్ భారీ శతకం(152), స్టీవ్ స్మిత్(101) సెంచరీ కారణంగా ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఏడు వికెట్లు నష్టపోయి 405 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.జడ్డూ కోపానికి కారణం అదేఇక మూడో టెస్టుతో భారత తుదిజట్టులోకి వచ్చిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఆదివారం బంతితో బరిలో దిగాడు. పదహారు ఓవర్ల పాటు బౌల్ చేసి 76 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, వికెట్ మాత్రం తీయలేకపోయాడు. అయితే, లంచ్ తర్వాత తాను బౌలింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డర్ సిరాజ్ వ్యవహరించిన తీరు జడ్డూ కోపం తెప్పించింది.జడేజా బౌలింగ్‌లో ట్రవిస్ హెడ్ ఆఫ్‌సైడ్ దిశగా బంతిని తరలించి.. సింగిల్‌కు వచ్చాడు. ఈ క్రమంలో బాల్‌ను అందుకున్న సిరాజ్ కాస్త నిర్లక్ష్య రీతిలో నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు బంతిని విసిరినట్లు కనిపించింది. హెడ్ తలమీదుగా వచ్చిన ఆ బంతిని అందుకునే క్రమంలో జడ్డూ చేతి వేళ్లకు బలంగా తగిలింది.దీంతో జడేజా కోపంతో సిరాజ్ వైపు చూస్తూ ఏదో అన్నట్లుగా కనిపించింది. అంత దూకుడు అవసరమా అన్నట్లు అసహనం ప్రదర్శించాడు. ఇందుకు చిన్నబుచ్చుకున్న సిరాజ్.. సారీ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.నా వేలును విరగ్గొట్టేశావు పో..ఈ నేపథ్యంలో కామెంటేటర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ స్పందిస్తూ.. సిరాజ్ అత్యుత్సాహం జడేజాతో మాటల యుద్ధానికి దారి తీసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నిజానికి జడ్డూ చేసింది సరైందేనని.. ‘‘నా వేలును విరగ్గొట్టేశావు పో.. ఏంటిది ఫ్రెండ్.. కాస్త సంయమనం పాటించు’’ అన్నట్లుగా అతడు లుక్ ఇచ్చాడని నికోలస్ పేర్కొన్నాడు.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్రpic.twitter.com/iJC2zadOh7— Sunil Gavaskar (@gavaskar_theman) December 15, 2024pic.twitter.com/oCw1kXmsYl— The Game Changer (@TheGame_26) December 15, 2024 -
'సిరాజ్‌కు కొంచెం కూడా తెలివి లేదు.. ఇది అస్సలు ఊహించలేదు'
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ పేస్‌ర్ మహ్మద్ సిరాజ్ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. తొలి సెషన్లో సిరాజ్ కాస్త పర్వాలేదన్పించినప్పటికి.. రెండో సెషన్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఆసీస్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, స్మిత్‌లు సిరాజ్‌ను ఓ ఆట ఆడేసికుంటున్నారు. ఇప్పటివరకు 18.2 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 69 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ను కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన బౌలింగ్ రిథమ్‌ను కోల్పోయినట్లు కన్పిస్తున్నాడు.ఈ నేపథ్యంలో సిరాజ్‌పై ఆసీస్ మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ విమర్శలు గుప్పించాడు. సిరాజ్ తన బౌలింగ్ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడంలో విఫలమయ్యాడని కటిచ్ మండిపడ్డాడు. కాగా ఆసీస్ ఇన్నింగ్స్ 60 ఓవర్ వేసిన సిరాజ్ తొలి బంతిని షార్ట్ డెలివరీగా సంధించాడు. అయితే ఆ బంతిని హెడ్ ర్యాంప్ షాట్ ఆడి థర్డ్‌మ్యాన్ దిశగా బౌండరీగా మలిచాడు. అయితే ఆ ఓవర్ ముందువరకు థర్డ్-మ్యాన్‌లో ఫీల్డర్ ఉండేవాడు. కానీ సిరాజ్ సూచన మెరకు తన ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ థర్డ్‌మ్యాన్ ఫీల్డర్‌ను తొలిగించాడు. ఈ క్రమంలో సిరాజ్ నిర్ణయాన్ని కటిచ్ తప్పు బట్టాడు."మహ్మద్ సిరాజ్ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఆ ఓవర్‌కు ముందు థర్డ్-మ్యాన్ స్ధానంలో ఓ ఫీల్డర్ ఉన్నాడు. సిరాజ్ బౌలింగ్ వేసేందుకు వచ్చినప్పుడు థర్డ్-మ్యాన్‌లో ఫీల్డర్‌ను తొలిగించమని సూచించాడు. ఇది నిజంగా తెలివితక్కువ నిర్ణయం. థర్డ్ మ్యాన్‌లో ఫీల్డర్ లేనిప్పుడు షార్డ్ డెలివరీని ఎందుకు వేయాలి. సిరాజ్ సరైన ప్రణాళికతో బౌలింగ్ చేయలేదు. హెడ్‌కు వ్యతిరేకంగా లెగ్ సైడ్‌లో ఇద్దరు ఫీల్డర్లను, డీప్ పాయింట్లో ఓ ఫీల్డర్‌ను ఉంచారు. కానీ థర్డ్‌మ్యాన్‌లో మాత్రం ఫీల్డర్‌ను తీసేశారు. హెడ్ ఆ షాట్ ఆడాక మళ్లీ తిరిగి థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డర్‌ను తీసుకొచ్చారు" అని గబ్బా టెస్టు కామెంటరీలో భాగంగా కటిచ్ పేర్కొన్నాడు.రెండో రోజు ఆసీస్‌దే..ఇక ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ(45), మిచెల్ స్టార్క్(7) పరుగులతో ఉన్నారు. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(152), స్మిత్(101) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో మెరిశాడు. -
ఆసీస్‌తో మూడో టెస్టు.. సిరాజ్‌కు చేదు అనుభవం
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా జట్టు అభిమానులు ఈ హైదరాబాదీ బౌలర్‌పై అక్కసు వెళ్లగక్కారు. సిరాజ్‌ను ఉద్దేశించి పరుష పదజాలం వాడుతూ, గట్టిగా అరుస్తూ అతడి ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించారు. భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా ఈ ఘటన జరిగింది. బ్రిస్బేన్ వేదికగాబోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో విజయం సాధించిన భారత్.. అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ మ్యాచ్‌లో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఇరుజట్లు చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శనివారం మూడో టెస్టు మొదలైంది.సిరాజ్‌ను టీజ్ చేసిన ఆసీస్ఫ్యాన్స్.. కారణం ఇదేగబ్బా మైదానంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. ఆసీస్ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌ను సిరాజ్ వేశాడు. అయితే, అతడు బంతి పట్టుకుని రంగంలోకి దిగగానే.. ఆస్ట్రేలియా అభిమానులు గట్టిగా అరుస్తూ అతడిని విమర్శించారు. గత మ్యాచ్‌లో సిరాజ్.. ఆసీస్ స్టార్ ట్రవిస్ హెడ్‌తో వ్యవహరించిన తీరే ఇందుకు కారణం.ఇద్దరికీ షాకిచ్చిన ఐసీసీఅడిలైడ్ టెస్టులో హెడ్ భారీ శతకం(141 బంతుల్లో 140)తో ఆకట్టుకున్నాడు. అతడిని అవుట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి రాగా.. ఎట్టకేలకు సిరాజ్ అద్భుత యార్కర్‌తో అతడికి చెక్ పెట్టాడు. అయితే, తన బౌలింగ్‌లో ట్రవిస్ హెడ్ బౌల్డ్ కాగానే.. ‘ఇక వెళ్లిపో’ అన్నట్లుగా రియాక్షన్స్ ఇస్తూ సిరాజ్ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన హెడ్ సైతం గట్టిగానే అతడికి బదులిచ్చాడు.ఈ ఘటన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వీళ్లిద్దరికీ గట్టి షాక్ ఇచ్చింది. పరస్పరం దూషించుకున్న ఈ ఇద్దరు స్టార్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత విధించింది. అంతేకాదు.. చెరో డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది. గత రెండేళ్లలో ఇద్దరిదీ తొలి తప్పిదం కాబట్టి ఈమాత్రం శిక్షతో సరిపెట్టింది. లేదంటే ఇద్దరూ నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చేది.వర్షం వల్ల అంతరాయంఇక సిరాజ్- హెడ్ గొడవపై క్రికెట్ పండితులు విమర్శలు గుప్పించగా.. ఆసీస్ ఫ్యాన్స్ మాత్రం మూడో టెస్టు సందర్భంగా సిరాజ్‌ను హేళన చేస్తున్నట్లుగా కామెంట్లు చేశారు. కాగా బ్రిస్బేన్ టెస్టుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వరణుడి వల్ల తొలుత టాస్ ఆలస్యమైంది. ఆ తర్వాత మ్యాచ్ మొదలైనా.. 13.2 ఓవర్ల ఆట ముగిసే సరికి మళ్లీ వాన కురిసింది. ఈ నేపథ్యంలో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి ఆస్ట్రేలియా ఒక్క వికెట్ నష్టపోకుండా 28 పరుగులు సాధించింది.చదవండి: అవునా.. నాకైతే తెలియదు: కమిన్స్‌కు ఇచ్చిపడేసిన గిల్Big boo for siraj from the crowd#AUSvIND #TheGabba pic.twitter.com/rQp5ekoIak— ٭𝙉𝙄𝙏𝙄𝙎𝙃٭ (@nitiszhhhh) December 14, 2024 -
సిరాజ్‌ను సీనియర్లే నియంత్రించాలి: ఆసీస్ మాజీ కెప్టెన్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ సమయంలో చేసుకునే అనుచిత సంబరాలపై సీనియర్లు నచ్చజెబితే బాగుంటుందని ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో సిరాజ్ చేస్తున్న పదేపదే అప్పీళ్లపై, ముందస్తు సంబరాలపై పలువురు ఆస్ట్రేలియన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.మాజీ కెప్టెన్ టేలర్ మాట్లాడుతూ భారత సీనియర్లే తమ పేసర్‌ను నియంత్రించాలన్నాడు. కొన్ని సందర్భాల్లో సిరాజ్ అప్పీల్ చేసి అంతటితో ఆగట్లేదు! అంపైర్ నిర్ణయం వెలువరించకపోయినా... తను మాత్రం వికెట్ తీసినట్లుగా సంబరాలు చేసుకోవడం కంగారూ క్రికెటర్లను అసహనానికి గురి చేస్తోంది. ‘సిరాజ్‌కు తోటి సీనియర్లే సర్దిచెప్పాలి. ఒక్క ట్రవిస్ హెడ్ అవుట్ విషయంలోనే కాదు... పదేపదే అతను అప్పీల్ చేయడం. అవుటయ్యాడా... నాటౌట్‌గా ఉన్నాడా అనే కనీస విచక్షణ కూడా మరిచి... అంపైర్ వేలు ఎత్తకపోయినా (నిర్ణయం) తను చేసుకునే పరిపక్వత లేని సంబరాలు చూసేందుకు ఏమాత్రం బాగోలేవు. ఇది ఆటకు కూడా అంత మంచిది కాదని నా అభిప్రాయం’ అని టేలర్ అన్నాడు. సిరాజ్ మంచి బౌలరని చెప్పుకొచ్చిన మాజీ కెపె్టన్ అతని ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకోగలనని చెప్పాడు. ‘బౌలింగ్‌లో అతని ఉత్సాహం నన్ను ఆకట్టుకుంటుంది. తన పోటీతత్వాన్ని ఇష్టపడతాను. ఇరు జట్ల మధ్య మంచి సిరీస్ జరుగుతుంటే సిరాజ్ ఆటను కూడా గౌరవించాలి కదా. ఇదే విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా సహచరులు చెప్పాలి’ అని టేలర్ చెప్పాడు. మాజీ కెప్టెన్ క్లార్క్ స్పందిస్తూ హెడ్ అవుటైనపుడు చేసిన సంజ్ఞల కంటే కూడా మితిమీరిన అప్పీళ్లకే రిఫరీ శిక్ష వేయాలని అన్నాడు.చదవండి: అభిషేక్ శర్మ విధ్వంసంమాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ మాట్లాడుతూ సిరాజ్‌కు ఆ క్షణంలో (హెడ్ అవుటైనపుడు) బుర్ర దొబ్బిందో ఏమో! లేకపోతే ఆ సమయంలో శ్రుతిమించిన సంబరాలెందుకు చేసుకుంటాడని అన్నాడు. సిరాజ్ చికాకు తెప్పించాడని మిచెల్ స్టార్క్ పేర్కొన్నాడు. -
సిరాజ్.. నీకు అసలు బుద్ది ఉందా..?
అడిలైడ్ టెస్ట్ సందర్భంగా టీమిండియా పేసర్ మొహహ్మద్ సిరాజ్- ఆసీస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ మధ్య జరిగిన ఫైట్ గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశంపై గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు సిరాజ్ అతి చేశాడని అంటుంటే, మరికొందరు హెడ్‌ను తప్పుబడుతున్నాడు. ఏదిఏమైనప్పటికీ ఐసీసీ ఇద్దరిపై చర్యలు తీసుకుంది. హెడ్‌కు ఓ డీ మెరిట్ పాయింట్ ఇవ్వగా.. సిరాజ్‌కు డీ మెరిట్ పాయింట్‌తో పాటు 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడింది.సిరాజ్-హెడ్ గొడవపై సోషల్‌మీడియాలో డిబేట్లు జరుగుతున్నప్పటికీ వారిద్దరూ మ్యాచ్ జరుగుతుండగానే రాజీ పడ్డారు. ఒకరినొకరు కౌగిలించుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాడు. హెడ్ చేసిన వ్యాఖ్యలను తాను తప్పుగా అర్దం చేసుకున్నానని సిరాజ్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ గొడవలో సిరాజ్ తప్పు ఎంతన్నది పక్కన పెడితే, అతని ఆన్ ఫీల్డ్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సిరాజ్‌ను తప్పుబట్టే వారిలో టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా చేరిపోయాడు.హెడ్ పట్ల సిరాజ్‌ది పిచ్చి ప్రవర్తన అని దుయ్యబట్టాడు. హెడ్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసినందుకు అభినందించాల్సి పోయి అతనితో వాగ్వాదానికి దిగడం ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ శ్రీకాంత్ ఇలా అన్నాడు.హే సిరాజ్.. హెడ్ నీ బౌలింగ్‌ను నిర్దాక్షిణ్యంగా ఛేదించాడు. అతను నీ బౌలింగ్‌ను ఎడాపెడా వాయించాడు. నీ బౌలింగ్‌లో బౌండరీలు, సిక్సర్లు అలవోకగా కొట్టగలిగాడు. ఇందుకు సిగ్గు పడాల్సింది పోయి.. అతనికి సెండ్ ఆఫ్ ఇస్తావా..? అసలు నీకు బుద్ధి ఉందా..? పిచ్చి పట్టినట్లు ప్రవర్తించావు. దీన్ని స్లెడ్జింగ్ అంటారా? ఇది కేవలం పిచ్చి మాత్రమే అని అన్నాడు.హెడ్‌ను అగౌరవపరిచినందుకు శ్రీకాంత్ సిరాజ్‌ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడు. భారత బౌలర్ల పట్ల, ముఖ్యంగా అశ్విన్ లాంటి అనుభవజ్ఞుల పట్ల హెడ్ నిర్భయ విధానాన్ని మెచ్చుకున్నాడు.శ్రీకాంత్ మాటల్లో.. "ఓ బ్యాటర్ 140 పరుగులు చేశాడు. అతనికి క్రెడిట్ ఇవ్వాలి. అతని నాక్ను మెచ్చుకోవాలి. అలా చేయాల్సింది పోయి అగౌరవపరిచే రీతిలో సెండ్ ఆఫ్ ఇస్తావా..? నువ్వు హెడ్‌ను సున్నా పరుగులకో లేక పది పరుగులకో ఔట్ చేసి ఉంటే అది వేరే విషయం. నువ్వు ఏదో ప్లాన్ చేసి అతని వికెట్ తీసినట్లు సంబురపడిపోయావు. అతను నీ బౌలింగ్‌ను ఎడాపెడా వాయించిన విషయం ఎలా మరిచిపోతావు..? హెడ్ విరుచుకుపడుతుంటే ఏ ఒక్క భారత బౌలర్ దగ్గర సమాధానం లేదు. అతను ఇష్టారీతిన సిక్సర్లు కొట్టాడు. అతను అశ్విన్ అసలు స్పిన్నర్‌గా గుర్తించలేదు. వికెట్లు వదిలి ముందుకు వచ్చి అలవోకగా సిక్సర్లు బాదాడు" -
సిరాజ్ మంచి వ్యక్తిత్వం కలవాడు: జోష్ హాజిల్‌వుడ్
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టుతో ఆస్ట్రేలియా అభిమానులకు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ విలన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్‌తో సిరాజ్ వాగ్వాదమే ఇందుకు కారణం.ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన అనంతరం సిరాజ్ చూపించిన అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు గురిచేసింది. హెడ్ కంటే ముందు మార్నస్ లబుషేన్ పట్ల కూడా ఈ హైదరాబాదీ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ సైతం సిరాజ్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ జరుగుతుండగానే అడిలైడ్ ప్రేక్షకులు సిరాజ్‌ను స్లెడ్జ్ చేశారు. సిరాజ్ తీరును సునీల్ గవాస్కర్ వంటి భారత దిగ్గజాలు కూడా తప్పుబట్టారు. ఆఖరికి ఐసీసీ కూడా అతడికి షాక్ ఇచ్చింది. సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. ఈ నేపథ్యంలో సిరాజ్‌ను ఆసీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోషల్ హాజిల్‌వుడ్ ప్రశంసించడం గమనార్హం. అతడు మంచి వ్యక్తిత్వం కలవాడని కొనియాడాడు. కాగా సిరాజ్-హాజిల్‌వుడ్ ఇద్దరూ ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కలిసి ఆడిన సంగతి తెలిసిందే."సిరాజ్ చాలా మంచివాడు. కానీ కొన్నిసార్లు దూకుడుగా కూడా వ్యవహరిస్తాడు. సిరాజ్‌తో కలిసి ఆర్సీబీలో గడిపిన సమయాన్ని బాగా ఎంజాయ్ చేశాను. విరాట్ కోహ్లిలా కూడా అతడిది దూకుడైన స్వభావం. చాలా ఉద్వేగభరితమైనవాడు.అతడు మైదానంలో ఉన్నంత సేపు తన స్వభావంతో అభిమానులను అలరిస్తాడు. సిరాజ్ గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో అద్భతమైన బౌలింగ్ స్పెల్‌లు వేశాడు అని హాజిల్‌వుడ్ పేర్కొన్నాడు. కాగా హాజిల్‌వుడ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. -
సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత
అడిలైడ్: మైదానంలో భారత పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, ఆ్రస్టేలియా స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ల అనుచిత ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. డే నైట్ రెండో టెస్టు సందర్భంగా ధాటిగా శతకం బాదిన హెడ్‌ను సిరాజ్ క్లీన్»ౌల్డ్ చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్ ని్రష్కమిస్తుంటే చేతిని అతనివైపు చూపిస్తూ ‘పో... పో...’ అని సంజ్ఞలు చేశాడు. దీనికి బదులుగా హెడ్ కూడా ఏదో పరుషంగా మాట అని పెవిలియన్ వైపు నడిచాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు ఆటగాళ్లను మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళె పిలిచి మాట్లాడారు. ఇద్దరు తమ తప్పును అంగీకరించడంతో తదుపరి విచారణేది లేకుండా ఐసీసీ శిక్షలు ఖరారు చేసింది. నోరు పారేసుకోవడం, దూషించడంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆరి్టకల్ 2.5ను అతిక్రమించినట్లేనని ఇందుకు శిక్షగా మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. పరుషంగా మాట అని వెళ్లిపోయిన హెడ్ నియమావళిలోని 2.13 ఆరి్టకల్‌ను అతిక్రమించాడని, దీంతో అతను జరిమానా నుంచి తప్పించుకున్నప్పటికీ... డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. సిరాజ్‌కు జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. వచ్చే 24 నెలల్లో ఇలాంటి ప్రవర్తనతో మళ్లీ డీ మెరిట్ పాయింట్లకు గురైతే మ్యాచ్ నిషేధం విధించే అవకాశాలుంటాయి. ఇదిలా ఉండగా ఆదివారం మ్యాచ్ ముగియగానే ఇద్దరు కరచాలనం చేసుకొని అభినందించుకున్నారు. మా మధ్య వివాదమేమీ లేదని చెప్పారు. సిరాజ్...ఏమైనా పిచ్చిపట్టిందా? సిరాజ్ ప్రవర్తనను భారత దిగ్గజాలు విమర్శిస్తున్నారు. ఇదివరకే గావస్కర్, రవిశా్రస్తిలాంటి వారు అలా సంజ్ఞలు చేయాల్సింది కాదని అన్నారు. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా విమర్శించారు. ‘హెడ్ మనతో ఓ ఆట ఆడుకున్నాడు. నిర్దాక్షిణ్యంగా బాదాడు. సిరాజ్ నీకేమైనా మతి చెడిందా? నువ్వేం చేశావో తెలుసా? నీ బౌలింగ్‌లో అతను అదేపనిగా దంచేశాడు. చకచకా 140 పరుగులు సాధించాడు. అతని ప్రదర్శనకు ప్రశంసించాల్సింది పోయి ఇలా చేస్తావా? ఒకవేళ నీవు అతన్ని డకౌట్ లేదంటే 10 పరుగుల లోపు అవుట్ చేస్తే సంబరాలు చేసుకోవాలి. కానీ నువ్వు అదరగొట్టిన ఆటగాడిపై దురుసుగా ప్రవర్తించావు’ అని శ్రీకాంత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. -
సిరాజ్, హెడ్లకు షాకిచ్చిన ఐసీసీ
టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్లకు ఐసీసీ షాకిచ్చింది. భారత్-ఆసీస్ మధ్య జరిగిన అడిలైడ్ టెస్ట్‌లో వీరిద్దరూ పరస్పరం దూషించుకున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఐసీసీ వీరిద్దరి మ్యాచ్ ఫీజుల్లో 20 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు గానూ వీరిద్దరికి చెరో డీమెరిట్ పాయింట్ కూడా లభించింది. గత 24 నెలల్లో చేసిన మొదటి తప్పిదం కావడంతో సిరాజ్, హెడ్ నిషేధం బారి నుంచి తప్పించుకున్నారు. వీరిద్దరు తాము చేసిన తప్పిదాలను ఒప్పుకుని మ్యాచ్ రిఫరీ విధించిన పెనాల్టీని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.కాగా, అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో సిరాజ్, హెడ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకుని జోష్ మీద ఉన్న హెడ్‌ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన హెడ్.. సిరాజ్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇందుకు ప్రతిగా సిరాజ్ కూడా నోటికి పని చెప్పాడు. సిరాజ్ ఒక అడుగు ముందుకేసి హెడ్‌ను పెవిలియన్‌కు వెళ్లాల్సిందిగా సైగలు చేశాడు. ఈ ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ.. సిరాజ్, హెడ్ మ్యాచ్ ఫీజ్‌ల్లో 20 శాతం కోత విధించడంతో పాటు చెరో డీమెరిట్ పాయింట్ సాంక్షన్ చేసింది.ఇదిలా ఉంటే, అడిలైడ్ టెస్ట్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. బౌలింగ్‌లో సిరాజ్, బుమ్రా పర్వాలేదనిపించారు. బ్యాటింగ్ విషయానికొస్తే.. టీమిండియా రెండు ఇన్నింగ్స్‌ల్లో పేక మేడలా కూలింది. నితీశ్ కుమార్ రెడ్డి మెరుపులు మినహా బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ విశేషాలేవీ లేవు. అంతకుముందు తొలి టెస్ట్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి మొదలవుతుంది. -
ట్రావిస్ హెడ్, సిరాజ్‌లకు ఐసీసీ షాక్!?
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఆతిథ్య ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం కన్న స్టార్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్‌ల మధ్య జరిగిన వాగ్వాదమే ఎక్కువగా హైలెట్ అయింది.రెండో రోజు ఆట సందర్భంగా ఈ స్టార్ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. సెంచరీతో చెలరేగిన హెడ్(140)ను సిరాజ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మంచి ఊపుమీద ఉన్న సిరాజ్ ట్రావిస్ హెడ్‌ను పెవీలియన్‌కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. హెడ్ కూడా బౌల్డ్ అయ్యాక సిరాజ్‌ను ఏదో అనడం కెమెరాలో రికార్డు అయింది. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం వారిద్దరూ స్పందించారు.బాగా బౌలింగ్ చేశావని సిరాజ్‌ను మెచ్చుకున్నాని, అతడు తప్పుగా ఆర్ధం చేసుకున్నాడని హెడ్ తెలిపాడు. సిరాజ్ మాత్రం హెడ్ అబద్దం చెబుతున్నాడని పేర్కొన్నాడు. ఏదమైనప్పటికి వీరిద్దరూ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.ఐసీసీ సీరియస్..!ఈ క్రమంలో వీరిద్దరిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ది డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. సిరాజ్, హెడ్ ఇద్దరూ ఐసీసీ క్రమశిక్షణా విచారణను ఎదుర్కోనున్నట్లు సమాచారం.అయితే ఐసీసీ ప్రవర్తనా నియమావళిని వీరిద్దరూ పూర్తి స్ధాయిలో ఉల్లఘించకపోవడంతో సస్పెన్షన్ నుంచి తప్పించుకోనున్నారు. ఇది నిజంగా ఇరు జట్లు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. అయితే ఐసీసీ వీరిద్దరిని కేవలం మందలింపుతో విడిచిపెట్టే అవకాశముంది.చదవండి: జట్టులో బుమ్రా ఒక్కడే లేడు కదా.. అందరూ ఆ బాధ్యత తీసుకోవాలి: రోహిత్ -
ట్రావిస్ హెడ్ అబద్దం చెప్పాడు.. అతడు నన్ను తిట్టాడు: సిరాజ్
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. హెడ్‌ను అద్బుతమైన యార్కర్‌తో ఔట్ చేసిన అనంతరం సిరాజ్.. కాస్త దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.అందుకు హెడ్ సైతం ఏదో అంటూ కౌంటరిచ్చాడు. దీంతో సిరాజ్ మరింత సీరియస్ అయ్యాడు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో అన్నట్లు సైగలు చేశాడు. ఈ క్రమంలో సిరాజ్ తీరును చాలా మంది తప్పుబట్టారు. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం ట్రావిస్ హెడ్ స్పందించాడు.హెడ్ మాట్లాడుతూ.. తాను బాగా బౌలింగ్ చేశావని సిరాజ్‌ను మెచ్చుకున్నానని, అంతకుమించి ఏమి అనలేదని చెప్పుకొచ్చాడు. కానీ సిరాజ్ మాత్రం తన మాటలను తప్పుగా ఆర్ధం చేసుకున్నాడని, అతడి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయానని ఈ ఆసీస్ స్టార్ తెలిపాడు. అయితే తాజాగా హెడ్ వ్యాఖ్యలకు సిరాజ్ కౌంటరిచ్చాడు. హెడ్ అబద్దం చెబుతున్నాడని, నిజంగానే హెడ్ దుర్భాషలాడాడని సిరాజ్"ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన తర్వాత నేను నా స్టైల్లో సంబరాలు చేసుకున్నాను. ఆ తర్వాత నన్ను అతడు దుర్భాషలాడాడు. ఇది లైవ్‌లో కూడా కన్పించింది. కావాలంటే ఇప్పుడు టీవీ రిప్లేలో కూడా చూడవచ్చు.నా సెలబ్రేషన్స్‌ను నేను చేసుకున్నా అంతే. అతడిని నేను ఏమి అనలేదు. విలేకరుల సమావేశంలో అతడు అబద్దం చెప్పాడు. అతడు నన్ను బాగా బౌలింగ్ చేశావని అనలేదు. మేము ప్రతీ ఒక్క ప్లేయర్‌ను గౌరవిస్తాము.ఎందుకంటే క్రికెట్‌ను జెంటిల్మన్ గేమ్‌గా భావిస్తాము కాబట్టి. ట్రావిస్ హెడ్ తీరు నాకు నచ్చలేదు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.చదవండి: IND vs AUS 2nd Test: పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర ఓటమి.. -
సిరాజ్ కాస్త తగ్గించుకో.. అతడొక లోకల్ హీరో: సునీల్ గవాస్కర్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన అనంతరం సిరాజ్ మితిమీరి ప్రవర్తించాడు.అద్భుతమైన యార్కర్‌తో హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. అతడి వద్దకు వెళ్లి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అందుకు హెడ్ రియాక్ట్ కావడంతో సిరాజ్ మరింత రెచ్చిపోయాడు. ఆడింది చాలు ముందు ఇక్కడ నుంచి వెళ్లు అన్నట్లు సైగలు చేశాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఆ తర్వాత ఈ హైదరాబాదీ అసీస్ అభిమానుల అగ్రహానికి గురయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌ను చేస్తున్న సిరాజ్‌ను ఫ్యాన్స్ స్లెడ్జింగ్ చేశారు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిరాజ్ ఫీల్డింగ్ పొజిషన్‌ను మార్చేశాడు.ఈ నేపథ్యంలో సిరాజ్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అగ్రహం వ్యక్తం చేశాడు. అద్బుతమైన సెంచరీ చేసిన ఆటగాడి పట్ల సిరాజ్ ప్రవర్తించిన తీరు సరికాదని గవాస్కర్ మండిపడ్డాడు."సిరాజ్ అలా ప్రవర్తించడం సరి కాదు. హెడ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడేమి నాలుగైదు పరుగులు చేసి ఔట్ కాలేదు. 140 పరుగులు చేసిన ఆటగాడిని గౌరవించాల్సింది పోయి అంత ఆగ్రహాంగా సెంఢాఫ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సిరాజ్ ఇలా చేసినందుకు ఆసీస్ అభిమానుల నుంచి వచ్చిన ప్రతిస్పందన నన్ను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదు.ట్రావిస్ హెడ్ లోకల్ హీరో. సెంచరీ చేసి ఔటైన తర్వాత సిరాజ్ చప్పట్లు కొట్టి అతడిని అభినందించి ఉంటే కచ్చితంగా హీరో అయ్యి ఉండేవాడు. కానీ మితి మీరి ప్రవర్తించడంతో సిరాజ్ ఇప్పుడు విలన్ అయ్యాడు" అని స్టార్ స్పోర్ట్స్ టీ టైమ్ షోలో సన్నీ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IND vs AUS: జస్ప్రీత్ బుమ్రాకు గాయం.. కీలక అప్డేట్ ఇచ్చిన బౌలింగ్ కోచ్ -
‘ఇక్కడి నుంచి వెళ్లిపో’.. సెంచరీ వీరుడిపై కోపంతో ఊగిపోయిన సిరాజ్!
టీమిండియాతో పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరు సాధించింది. శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో భారత్‌ను 180 పరుగులకే ఆలౌట్ చేసిన కంగారూలు.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. 86/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆటను మొదలుపెట్టిన కమిన్స్ బృందం మరో 251 పరుగులు జమ చేసి ఆలౌట్ అయింది.ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(64) అర్ధ శతకంతో మెరవగా.. ఐదో నంబర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్(140) భారీ శతకం బాదాడు. టీమిండియా బౌలర్లకు కొరకాని కొయ్యగా మారి.. 141 బంతుల్లోనే 140 పరుగులు స్కోరు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం.అద్భుత యార్కర్‌తో హెడ్‌కు చెక్అయితే, ప్రమాదకారిగా మారిన హెడ్‌ను పెవిలియన్‌కు పంపేందుకు భారత బౌలర్లు కఠినంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సిరాజ్‌కు అతడి వికెట్ దక్కించుకోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ 82వ ఓవర్లో బంతితో బరిలోకి దిగిన సిరాజ్.. అద్భుత యార్కర్‌తో హెడ్‌ను బౌల్డ్ చేశాడు.‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’ ఇక కీలక వికెట్ దక్కిన ఆనందంలో సిరాజ్.. హెడ్‌ను ఉద్దేశించి ‘‘ఇక వెళ్లు’’ అన్నట్లుగా సైగ చేస్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా హెడ్ సైతం అతడికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో మరింతగా కోపం తెచ్చుకున్న సిరాజ్.. ‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’ అన్నట్లు ఉగ్రరూపం ప్రదర్శించాడు. అయితే, హెడ్ మాత్రం తన సెంచరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రేక్షకులకు అభివాదం చేస్తూ మైదానాన్ని వీడాడు.డీఎస్పీ సర్‌కు కోపం వచ్చిందిఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘డీఎస్పీ సర్‌కు కోపం వచ్చింది. శతకం బాదిన ఆటగాడికి తనదైన స్టైల్లో సెండాఫ్ ఇచ్చాడు’’ అంటూ అభిమానులు సరదాగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘అతి చేయవద్దు సిరాజ్.. కాస్త సంయమనం పాటించు’’ అని హితవు పలుకుతున్నారు.కాగా భారత బౌలర్లలో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నాలుగేసి వికెట్లతో చెలరేగగా..నితీశ్ రెడ్డి ఒక వికెట్ దక్కించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో 295 పరుగులతో ఆసీస్‌ను ఓడించిన భారత్.. రెండో టెస్టులో కాస్త తడబడుతోంది. అడిలైడ్ వేదికగా ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌లో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి కమిన్స్ బృందం.. రోహిత్ సేనపై 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: IND vs AUS: జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. విరాట్ కోహ్లి రియాక్షన్ వైరల్The end of a sensational innings! 🗣️#AUSvIND pic.twitter.com/kEIlHmgNwT— cricket.com.au (@cricketcomau) December 7, 2024 -
సిరాజ్ మియా అంత దూకుడెందుకు.. ? ఫ్యాన్స్ ఫైర్
అడిలైడ్ వేదికగా భారత్‌తో మొదలైన పింక్‌బాల్ టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. తొలుత బౌలింగ్‌లో టీమిండియాను 180 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా అదరగొడుతోంది.మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి ఆసీస్ జట్టు 88 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి రోజు ఆటలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆఖరి క్షణంలో తప్పుకున్నాడన్న కోపంతో సహనం కోల్పోయిన సిరాజ్.. ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌పై బంతిని విసిరాడు.అసలేం జరిగిందంటే?ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవర్లో 5వ బంతిని వేసేందుకు సిరాజ్ సిద్దమయ్యాడు. స్ట్రైక్‌లో మార్నస్ లబుషేన్ ఉన్నాడు. అయితే సైట్ స్క్రీన్ వద్ద ప్రేక్షకుడు బీర్ స్నేక్(ఖాళీ బీర్ ప్లాస్టిక్ కప్పులు) తీసుకుని నడవడంతో ఏకాగ్రత కోల్పోయిన లబుషేన్ ఆఖరి క్షణంలో పక్కకు తప్పుకున్నాడు.దీంతో బంతిని వేసేందుకు రనప్‌తో వేగంగా వచ్చిన సిరాజ్ కూడా మధ్యలో ఆగిపోయాడు. అయితే సిరాజ్ తన బౌలింగ్‌ను ఆఖరి నిమిషంలో అపినప్పటికి.. ప్రత్యర్ధి బ్యాటర్‌పై కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సహానం కోల్పోయిన సిరాజ్ బంతిని లబుషేన్ వైపు త్రో చేశాడు. లబుషేన్ అలా చూస్తూ ఉండిపోయాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడిని ఆసీస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలు చేస్తున్నారు. భారత అభిమానులు సైతం అతడి చర్యలను తప్పుబడుతున్నారు. సిరాజ్ మియా అంత దూకుడెందుకు? అంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ Mohammed Siraj was not too pleased with this 😂#AUSvIND pic.twitter.com/1QQEI5NE2g— cricket.com.au (@cricketcomau) December 6, 2024 -
అతడి వల్లే తొలి టెస్టులో రాణించా.. వాళ్లిద్దరు కూడా అండగా ఉన్నారు: సిరాజ్
పేలవ ఫామ్‌తో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. తొలి టెస్టులోనే సత్తా చాటాడు. పెర్త్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగి జట్టు గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, తాను మునుపటి లయ అందుకోవడానికి కారణం పేస్ దళ నాయకుడు, ఆసీస్‌తో మొదటి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన జస్ప్రీత్ బుమ్రానే అంటున్నాడు సిరాజ్. అప్పటికీ వికెట్లు లభించకపోతే‘నేను తరచుగా నా బౌలింగ్ గురించి బుమ్రాతో చర్చిస్తూనే ఉంటా. తొలి టెస్టుకు ముందు కూడా నా పరిస్థితి గురించి అతడికి వివరించా. బుమ్రా నాకు ఒకటే విషయం చెప్పాడు. ఎలాగైనా వికెట్ సాధించాలనే లక్ష్యంతో దాని గురించే అతిగా ప్రయత్నించవద్దు. నిలకడగా ఒకే చోట బంతులు వేస్తూ బౌలింగ్‌ను ఆస్వాదించు. అప్పటికీ వికెట్లు లభించకపోతే నన్ను అడుగు అని బుమ్రా చెప్పాడు. అతడు చెప్పిన మాటలను పాటించా. వికెట్లు కూడా దక్కాయి’ అని సిరాజ్ తన సీనియర్ పేసర్ పాత్ర గురించి చెప్పాడు.మోర్నీ మోర్కెల్ కూడాఇక భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా తనతో దాదాపు ఇవే మాటలు చెప్పి ప్రోత్సహించాడని కూడా సిరాజ్ పేర్కొన్నాడు. ఆరంభంలో సిరాజ్ కెరీర్‌ను తీర్చిదిద్దడంతో భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కీలకపాత్ర పోషించాడు. అందుకే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అరుణ్‌ను సంప్రదించడం సిరాజ్‌కు అలవాటు.అరుణ్ సర్‌ను అడిగాఈ విషయం గురించి సిరాజ్ మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ కాలంగా నా బౌలింగ్ గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే నాకు ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ అరుణ్ సర్‌ను అడిగా. ఆయన కూడా వికెట్లు తీయడంకంటే ఒక బౌలర్ తన బౌలింగ్‌ను ఆస్వాదించడం ఎంతో కీలకమో, ఫలితాలు ఎలా వస్తాయో చెప్పారు’ అని వెల్లడించాడు.ఇక ఆస్ట్రేలియాకు బయలుదేరడానికి ముందు భారత ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్‌కే చెందిన దిలీప్‌తో కలిసి సాధన చేసిన విషయాన్ని కూడా సిరాజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. మరోవైపు అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టు కోసం ‘పింక్ బాల్’తో సిద్ధమవుతున్నట్లు సిరాజ్ చెప్పాడు.అలాంటి స్థితిలో ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు‘గులాబీ బంతి సింథటిక్ బంతి తరహాలో అనిపిస్తోంది. ఎరుపు బంతితో పోలిస్తే భిన్నంగా, గట్టి సీమ్‌తో ఉంది. నా దృష్టిలో ఈ బాల్‌తో షార్ట్ ఆఫ్ లెంగ్త్ తరహాలో బంతులు వేస్తే బాగుంటుంది.దీంతో ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత పట్టు చిక్కుతుంది. అయితే లైట్లు ఉన్నప్పుడు ఎక్కువగా స్వింగ్ అవుతుందని విన్నా. నేను అలాంటి స్థితిలో ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు. అడిలైడ్‌లో అలాంటి వాతావరణంలో ప్రాక్టీస్ చేస్తా’ అని సిరాజ్ వివరించాడు. కాగా స్వదేశంలో భారత జట్టు ఆడిన గత ఐదు టెస్టుల్లో నాలుగింటిలో హైదరాబాద్ పేసర్ సిరాజ్ బరిలోకి దిగాడు. వీటన్నింటిలో కలిపి అతడు మొత్తం కేవలం ఆరు వికెట్లే పడగొట్టగలిగాడు. అయితే, ఆస్ట్రేలియాలో అతడు తిరిగి ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. ఇక భారత్- ఆసీస్ మధ్య డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు -
టీమిండియా స్టార్ సిరాజ్‌పై రూమర్లకు కారణం ఈ ఫొటోలే! (ఫొటోలు)
-
బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!
టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఐపీఎల్ మెగా వేలం-2025లో భారీ మొత్తమే దక్కింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని వదిలేసినా.. గుజరాత్ టైటాన్స్ పట్టుబట్టి మరీ కొనుగోలు చేసింది. రూ.12.25 కోట్లు వెచ్చించి సిరాజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది అతడు టైటాన్స్ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.ఇదిలా ఉంటే.. సిరాజ్ వ్యక్తిగత విషయానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్‌కు చెందిన ఓ నటితో అతడు డేటింగ్ చేస్తున్నాడనేది దాని సారాంశం. సదరు నటి పేరు మహీరా శర్మ అని, ఆమె హిందీ బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్ అని సమాచారం.రూమర్లకు కారణం ఇదే!అయితే, సిరాజ్ గురించి ఇలాంటి వదంతులు పుట్టుకురావడానికి కారణం మాత్రం మహీరా ఇన్‌స్టా పోస్టులు. మహీరా తాను బ్లాక్ కలర్ డ్రెస్‌తో గ్లామరస్ లుక్‌లో కనిపిస్తున్న ఫొటోలను షేర్ చేయగా.. సిరాజ్ వాటిని లైక్ చేశాడు. లైక్ కొట్టినంత మాత్రానఅంతే.. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లతో వీరిద్దరి పేర్లను ముడిపెట్టి గాసిప్‌రాయుళ్లు తమకు నచ్చిన రీతిలో కథనాలు అల్లేస్తున్నారు. దీంతో సిరాజ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. లైక్ కొట్టినంత మాత్రాన ఇలాంటి అసత్యపు ప్రచారం చేయడం తగదని హితవు పలుకుతున్నారు. క్రికెట్‌కు- బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధంకాగా క్రికెట్‌కు- బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నాటి క్రికెటర్ పటౌడీ అలీఖాన్ నుంచి జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వరకు బాలీవుడ్ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు.గతంలో వీరిపై కూడా ఇలాంటి ప్రచారమేఇక భారత ఆల్‌రౌండర్, వేలంలో రూ. 23.75 కోట్లతో(కేకేఆర్) జాక్‌పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్ కూడా సిరాజ్ మాదిరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ నటి ప్రియాంక జువాల్కర్ ఫొటోలకు లైక్ కొట్టినందుకు వచ్చిన చిక్కు అది. అయితే, ఇటీవలే అతడు పెళ్లి చేసుకోవడంతో రూమర్లకు చెక్ పడింది. శుబ్‌మన్ గిల్- సారా అలీఖాన్‌ల పేర్లు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి.అంతేకాదు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి గతంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. నటి అనుపమా పరమేశ్వరన్ పేరుతో అతడిని ముడిపెట్టగా.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ను పెళ్లాడిన బుమ్రా.. వదంతులు వ్యాప్తి చేసేవారి నోళ్లు మూయించాడు.ఆస్ట్రేలియా పర్యటనలోఇదిలా ఉంటే.. సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాతో అక్కడికి వెళ్లాడు. ఇక ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా.. జట్టుకు భారీ విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో గెలిచి ఆసీస్ గడ్డపై అతిపెద్ద విజయంతో చరిత్ర సృష్టించింది. ఈ టెస్టులో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2025: ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా..! View this post on Instagram A post shared by Tellychakkar Official ® (@tellychakkar) -
సిరాజ్‌కు షాకిచ్చిన ఆర్సీబీ.. ఆఖరికి ఆ జట్టు సొంతం.. ధర మాత్రం..
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడబోతున్నాడు. మెగా వేలంలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సిరాజ్‌కు షాకివ్వగా.. టైటాన్స్ మాత్రం భారీ మొత్తం వెచ్చించింది. కాగా హైదరాబాద్‌కు చెందిన సిరాజ్ సన్‌రైజర్స్ తరఫున 2017లో క్యాచ్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు.ఏడేళ్లు అక్కడేఅయితే, ఆ మరుసటి ఏడాది(2018) ఆర్సీబీ అతడిని రెండున్నర కోట్లకు పైగా వెచ్చించి కొనుక్కుంది. 2022లో రూ. 7 కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకుని అంతే మొత్తానికి 2024 వరకు కొనసాగించింది. అయితే, 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్‌ను వదిలేసింది. దీంతో అతడు ఆక్షన్‌లోకి వచ్చాడు.చెన్నై కూడా రేసులోఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన ఆదివారం నాటి వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో అతడు రేసులోకి వచ్చాడు. గుజరాత్ అతడి కోసం ఆదినుంచే పోటీ పడగా.. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆసక్తి చూపాయి. అయితే, రూ. 8 కోట్ల వరకు గుజరాత్‌తో నువ్వా- నేనా అన్నట్లు తలపడిన చెన్నై.. ఆ తర్వాత రేసు నుంచి నిష్క్రమించింది.మాకు వద్దు.. సిరాజ్‌ను మొత్తంగా వదిలేసుకున్న ఆర్సీబీఈ దశలో రాజస్తాన్ మళ్లీ పోటీకి రాగా.. గుజరాత్ రూ. 12.25 కోట్ల మెరుగైన ధరకు సిరాజ్‌ను సొంతం చేసుకుంది. అయితే, సిరాజ్ విషయంలో రైటు మ్యాచ్ కార్డును వినియోగించుకుంటారా అని ఆక్షనీర్ మల్లికా సాగర్ ఆర్సీబీని అడుగగా.. సదరు ఫ్రాంఛైజీ మాత్రం అంత ధర పెట్టే ఉద్దేశం తమకు లేదంటూ సిరాజ్‌ను మొత్తంగా వదిలేసుకుంది. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ కుడిచేతి వాటం పేసర్ 93 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో సిరాజ్‌కు గుజరాత్ మూడో ఫ్రాంఛైజీ. అదే విధంగా ఇదే అత్యధిక ధర.ఇక ఐపీఎల్-2022 ద్వారాక్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ మొదటి ప్రయత్నంలోనే చాంపియన్‌గా నిలిచింది. గతేడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే, ఈసారి మాత్రం ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.చదవండి: IPL 2025 Mega Auction: కేఎల్ రాహుల్‌కు భారీ షాక్.. -
బ్రో అక్కడ ఉన్నది డీఎస్పీ.. లబుషేన్‌కు ఇచ్చిపడేసిన సిరాజ్! వీడియో
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. తొలుత భారత బ్యాటర్లు నిరాశపరిచినప్పటకి బౌలర్లు మాత్రం అదరగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని భారత ఫాస్ట్ బౌలర్లు ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.టీమిండియా బౌలర్లను ఎదుర్కొనేందుకు కంగారు బ్యాటర్లు విల్లవిల్లాడారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో అత్యధికంగా జోష్ హాజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు.సిరాజ్-లబుషేన్ డిష్యూం.. డిష్యూంఇక మొదటి రోజు ఆటలో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన సిరాజ్ మూడో బంతిని మార్నస్కు షార్ట్ బాల్‌గా సంధించాడు. అయితే ఆ బంతిని లెగ్ సైడ్ షాట్ ఆడటానికి సదరు బ్యాటర్ ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్‌కు కాకుండా తొడ ప్యాడ్ తాకి స్టంప్స్ దగ్గరలో పడింది. అయితే లబుషేన్ మాత్రం బంతిని చూడకుండా పరుగుకోసం ప్రయత్నించాడు. వెంటనే బంతి క్రీజు వద్దే ఉందని గమనించిన లబుషేన్ పరుగును ఉపసంహరించుకున్నాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ఫాల్ త్రూలో వేగంగా క్రీజు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి రనౌట్ చేయాలనకున్నాడు. కానీ లబుషేన్ మాత్రం సిరాజ్ రనౌట్ చేస్తాడనే భయంతో బంతిని తన బ్యాట్‌తో పక్కకు నెట్టాడు. అయితే లబుషేన్ బంతిని పక్కకు నెట్టేటప్పుడు క్రీజులో లేడు. దీంతో సదరు ఆసీస్ బ్యాటర్ అలా చేయడం సిరాజ్‌కు కోపం తెప్పించింది. వెంటనే అతడి వద్దకు వెళ్లి సిరాజ్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాడు. అంతలోనే విరాట్ కోహ్లి వెళ్లి స్టంప్స్‌ను పడగొట్టాడు.కానీ లబుషేన్ అప్పటికే క్రీజులో ఉన్నాడు. కానీ కోహ్లి మాత్రం అతడి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు కావాలనే అలా చేశాడు. ఇందుకు సబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అక్కడ ఉన్నది డీఎస్పీ బ్రో.. జాగ్రత్తగా ఉండాలంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. Things are heating up! Siraj and Labuschagne exchange a few words.#INDvsAUS pic.twitter.com/leKRuZi7Hi— 彡Viя͢ʊs ᴛᴊ ᴘᴇᴛᴇʀ र (@TjPeter2599) November 22, 2024 -
చెలరేగిన బుమ్రా.. రాణించిన రాణా, సిరాజ్.. పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. పేసర్ల విజృంభణ కారణంగా పటిష్ట స్థితిలో నిలిచింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ టూర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్‌లో మొదటి టెస్టు ఆరంభమైంది.ఆసీస్ పేసర్లు ఆది నుంచే చెలరేగడంతోటాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, బాల్ ఆది నుంచే బాగా స్వింగ్ కావడంతో భారత బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. తమకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసీస్ పేసర్లు ఆది నుంచే చెలరేగారు. మిచెల్ స్టార్క్ టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను డకౌట్ చేసి ఆసీస్‌కు శుభారంభం అందించాడు.అదే విధంగా.. క్రీజులో నిలదొక్కున్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(26)ను సైతం స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు. మరోవైపు.. జోష్ హాజిల్‌వుడ్ వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(0)ను అవుట్ చేసి తన ఖాతా తెరిచాడు. అంతేకాదు కీలకమైన విరాట్ కోహ్లి(5) వికెట్‌ను కూడా తానే దక్కించుకున్నాడు.పంత్, నితీశ్ రాణించగా..అయితే, రిషభ్ పంత్(37), అరంగేట్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(41) పట్టుదలగా నిలబడి.. ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ .. టీమిండియాను మెరుగైన స్కోరు దిశగా నడిపించారు. వీరిద్దరు రాణించడం వల్ల.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. మిగతా వాళ్లలో ధ్రువ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4), హర్షిత్ రాణా(7), కెప్టెన్ బుమ్రా(8) నిరాశపరిచారు.వికెట్ల వేట మొదలు పెట్టిన బుమ్రా ఆసీస్ పేసర్లలో హాజిల్‌వుడ్ ఓవరాల్‌గా నాలుగు, కమిన్స్, స్టార్క్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు.. బుమ్రా ఆది నుంచే చుక్కలు చూపించాడు. ఓపెనర్, అరంగేట్ర బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ(10)ని అవుట్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టాడు.ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసిఆ తర్వాత ఒకే ఓవర్లో స్టీవ్ స్మిత్(0), ఉస్మాన్ ఖవాజా(8)లను అవుట్ చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడిన వేళ.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ పరుగులు చేయకపోయినా.. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. హర్షిత్ రాణాకు తొలి వికెట్మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసిన లబుషేన్‌ను సిరాజ్ అవుట్ చేశాడు. అంతకు ముందు మార్ష్(6) వికెట్‌ను కూడా సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ట్రవిస్ హెడ్(11)ను బౌల్డ్ చేసి హర్షిత్ రాణా టెస్టుల్లో తన తొలి వికెట్ నమోదు చేయగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3) వికెట్‌ను భారత సారథి బుమ్రా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా 27 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 67 మాత్రమే పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే 83 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా అలెక్స్ క్యారీ(19*), స్టార్క్(6*) మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఓవరాల్‌గా నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు, రాణా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బుమ్రాను ఒప్పించిన కోహ్లి.. ఆరంభంలోనే ఆసీస్‌కు షాకులు -
Mohammed Siraj: సిరాజ్‌కు అసలేమైంది? ఫామ్‌పై ఆందోళన!
న్యూఢిల్లీ: భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ చాలా కాలంగా టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. షమీ కూడా లేకపోవడంతో బుమ్రాకు జతగా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే పేస్‌కు అనుకూలించే విదేశీ మైదానాలతో పోలిస్తే సొంతగడ్డపై అతని ప్రదర్శన పేలవంగా ఉంది. 17 విదేశీ టెస్టుల్లో సిరాజ్ 61 వికెట్లు పడగొట్టాడు. భారత గడ్డపై మాత్రం 13 టెస్టుల్లో 192.2 ఓవర్లు బౌలింగ్ చేసి 36.15 సగటుతో 19 వికెట్లే తీయగలిగాడు! ఇందులో కొన్ని సార్లు స్పిన్‌కు బాగా అనుకూలమైన పిచ్‌లపై దాదాపుగా బౌలింగ్ చేసే అవకాశమే రాకపోవడం కూడా ఒక కారణం. అయితే పిచ్‌తో సంబంధం లేకుండా స్వదేశంలో కూడా ప్రత్యరి్థపై చెలరేగే బుమ్రా, షమీలతో పోలిస్తే సిరాజ్ విఫలమవుతున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో బుమ్రా తరహాలో వికెట్లు అందించలేకపోతున్నాడు. ముఖ్యంగా గత ఏడు టెస్టుల్లో అతను 12 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి న్యూజిలాండ్‌తో పుణేలో జరిగే రెండో టెస్టులో అతని స్థానంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. సిరాజ్ స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరును మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సిరాజ్ బౌలింగ్‌లో స్వల్ప సాంకేతిక లోపాలే భారత్‌లో వైఫల్యాన్ని కారణమని మాజీ కోచ్ ఒకరు విశ్లేíÙంచారు. ‘టెస్టుల్లో సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శనలన్నీ కేప్‌టౌన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, బ్రిస్బేన్వంటి బౌన్సీ పిచ్‌లపైనే వచ్చాయి. బంతి పిచ్ అయిన తర్వాత బ్యాటర్ వరకు చేరే క్రమంలో అక్కడి లెంగ్త్‌కు ఇక్కడి లెంగ్త్‌కు చాలా తేడా ఉంటుంది. దీనిని అతను గుర్తించకుండా విదేశీ బౌన్సీ వికెట్ల తరహా లెంగ్త్‌లో ఇక్కడా బౌలింగ్ చేస్తున్నాడు. దీనికి అనుగుణంగా తన లెంగ్త్‌ను మార్చుకోకపోవడంతో ఫలితం ప్రతికూలంగా వస్తోంది. ఈ లోపాన్ని అతను సరిదిద్దుకోవాల్సి ఉంది. వన్డే, టి20ల్లో అయితే లెంగ్త్ ఎలా ఉన్నా కొన్ని సార్లు వికెట్లు లభిస్తాయి. కానీ టెస్టుల్లో అలా కుదరదు. బ్యాటర్ తగిన విధంగా సన్నద్ధమై ఉంటాడు. అయితే నా అభిప్రాయం ప్రకారం ఆ్రస్టేలియాకు వెళితే సిరాజ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు’ అని ఆయన వివరించారు. -
కాన్వే జాగ్రత్తగా ఉండు.. అతడు ఇప్పుడు డీఎస్పీ: గవాస్కర్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మొదటి టెస్టులో భారత్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వర్షం కారణంగా తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోవడంతో రెండో రోజు(గురువారం) మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఘోర పరాభావం ఎదురైంది. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి భారత్ కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. 92 ఏళ్ల తమ టెస్టు క్రికెట్ హిస్టరీల భారత జట్టుకు స్వదేశంలో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా.. రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(20) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌లో కూడా కివీస్ అదరగొడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.అతడొక డీఎస్పీ..కాగా రెండో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు ఓపెనర్లు లాథమ్, కాన్వే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. లాథమ్గా స్లోగా ఆడినప్పటకి మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.ఈ క్రమంలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్.. కాన్వేను స్లెడ్జ్ చేశాడు. ఆ ఓవర్లో మూడో బంతిని కాన్వే బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత నాలుగో బంతిని డెవాన్ డిఫెండ్ చేశాడు. వెంటనే సిరాజ్ కాన్వే వైపు సీరియస్‌గా చూస్తూ ఏదో అన్నాడు. కాన్వే మాత్రం సిరాజ్ మాటలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫన్నీ వ్యాఖ్యలు చేశాడు. "అతడు ఇప్పుడు డీఎస్పీ అన్న విషయం మర్చిపోవద్దు. అతనికి సహచరులు సెల్యూట్ చేశారా? లేదా? ఒక వేళ చేస్తే కచ్చితంగా నేను షాక్ అవుతాను" అని గవాస్కర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 పోస్ట్ కింద డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. Siraj telling his real Instagram I'd to Conway pic.twitter.com/OMTZbP4VSY— John_Snow (@MrSnow1981) October 17, 2024 -
IND Vs NZ: అసలేం చేశావు నువ్వు?: రోహిత్ శర్మ ఆగ్రహం
క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు ఉపయోగపడే పనులేవీ చేతకావా అంటూ మండిపడుతున్నారు. బ్యాటింగ్‌తో పాటు.. ఫీల్డింగ్‌లోనూ విఫలం కావడాన్ని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాగా రోహిత్ సేన న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది.వర్షం కారణంగాఇందులో భాగంగా బెంగళూరు వేదికగా బుధవారం మొదలు కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా గురువారం మొదలైంది. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బౌలర్ల విజృంభణ కారణంగా 46 పరుగులకే ఆలౌట్ అయింది.పరుగుల ఖాతా తెరవకుండానేభారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ యువ పేసర్ విలియం రూర్కీ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కేఎల్ రాహుల్.. అజాజ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఈజీ క్యాచ్ మిస్ చేసిన రాహుల్ఇక ఇలా బ్యాటింగ్‌లో విఫలమై పరుగుల ఖాతా తెరవకుండానే అవుటైన రాహుల్.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఈజీ క్యాచ్‌ను వదిలేశాడు. పదమూడవ ఓవర్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన రెండో బంతి.. కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ బ్యాట్‌ను తాకి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంది. ఈ క్రమంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి, రాహుల్ మధ్య సమన్వయ లోపం ఏర్పడింది.అయితే, బంతి తన వైపునకే వస్తున్నా రాహుల్ క్యాప్ పట్టడంలో నిర్లక్ష్యం వహించాడు. దీంతో రాహుల్ చేతిని తాకి మిస్ అయిన బాల్.. బౌండరీ వైపు వెళ్లింది. దీంతో కివీస్ ఖాతాలో నాలుగు పరుగులు చేరాయి. రోహిత్ శర్మ ఆగ్రహంఈ క్రమంలో బౌలర్ సిరాజ్ తీవ్ర అసంతృప్తికి లోనుకాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం.. ‘‘అసలేం ఏం చేశావు నువ్వు?’’ అన్నట్లుగా రాహుల్‌వైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో రాహుల్ కావాలనే క్యాచ్ విడిచిపెట్టినట్లుగా ఉందంటూ టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.చదవండి: NZ vs IND 1st Test: రోహిత్ శర్మ తప్పు చేశాడా?You can't convince me that kl Rahul didn't drop this catch intentionally.Rohit Sharma is surrounded by snakes. 💔pic.twitter.com/ASh7qzHbBO— Vishu (@Ro_45stan) October 17, 2024 -
డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్
తెలంగాణ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ నియమితులైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ విజయంతో పాటు భారత జట్టుకు అందించిన సేవలకుగానూ సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1(డీఎస్పీ) ఉద్యోగంతో పాటు 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ జితేందర్ తాజాగా సిరాజ్‌కు నియమాక పత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ యూనిఫాంలో ఉన్న మహ్మద్ సిరాజ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా సిరాజ్..డీజీపీని కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. దీంతో ఈ భారత స్టార్ బౌలర్‌కు నెటిజన్లు కంగ్రాట్స్ తెలుపున్నారు.Siraj is finally coming to arrest everyone who made his fake account. pic.twitter.com/zRCIWNc1A4— Silly Point (@FarziCricketer) October 12, 2024 ఇక బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ అనంతరం సిరాజ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో సిరాజ్ మియా మళ్లీ బీజీ కానున్నాడు. కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో సిరాజ్‌కు చోటు దక్కింది. ఈ సిరీస్‌లో సిరాజ్.. జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్తో వంటి పేసర్లతో కలిసి బంతిని పంచుకోనున్నాడు.న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), ధృవ్ జురెల్ (డబ్ల్యుకె), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్ట్రావెలింగ్ రిజర్వ్స్: హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ ప్రసిద్ధ్ కృష్ణ Congratulations Mohammad Siraj for the post of DSP in Telangana State#MohammadSiraj #MohammedSiraj #Telangana pic.twitter.com/kfKtmebEkG— Rahul (@Rahul64590994) October 12, 2024 -
డీఎస్పీగా క్రికెటర్ సిరాజ్ బాధ్యతల స్వీకారం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ బృందంలో సభ్యునిగా టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్‌కు గ్రూప్–1 ఆఫీసర్ పోస్టును ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం విదితమే. ముఖ్యమంత్రి ఇచి్చన హామీ మేరకు ఆయనను పోలీసు శాఖలో డీఎస్పీగా నియమించారు.శుక్రవారం ఆయన డీజీపీ జితేందర్‌కు రిపోర్ట్ చేసి, డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. సిరాజ్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో రాజ్యసభసభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, తెలంగాణ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ చైర్మన్ ఫహీముద్దీన్ ఖురేషీ పాల్గొన్నారు. తనను డీఎస్పీగా నియమించినందుకు ఈ సందర్భంగా సిరాజ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్, ఐజీ ఎం.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్పీగా నియామక పత్రాన్ని అందుకున్న క్రికెటర్ సిరాజ్
టీమిండియా స్టార్ బౌలర్, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా (డీఎస్పీ) నియామక పత్రాన్ని అందుకున్నారు. తెలంగాణ డీజీపీ జితేందర్ సిరాజ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిరాజ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.టీ20 వరల్డ్‌కప్-2024 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సిరాజ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రూప్-1 ఉద్యోగాన్ని ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయించారు. తనకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు స్థలాన్ని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి సిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.30 ఏళ్ల సిరాజ్ 2017లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి టీమిండియా ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. సిరాజ్ టీ20 వరల్డ్‌కప్-2024తో పాటు అంతకుముందు జరిగిన ఆసియా కప్‌లో విశేషంగా రాణించాడు. సిరాజ్ తన తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసి కూడా ఆస్ట్రేలియాలో అద్భుతాలు చేశాడు.సిరాజ్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 28 టెస్ట్‌లు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడాడు. ఇందులో 161 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ అందరూ బౌలర్లలా కాకుండా ఆల్ ఫార్మాట్ బౌలర్‌గా రాటుదేలాడు. ఐపీఎల్ ద్వారా సిరాజ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. సిరాజ్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడతాడు. ఐపీఎల్లో అతను 93 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు. చదవండి: చివరి స్థానానికి పడిపోయిన పాకిస్తాన్ -
గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో రోహిత్ సంచలన క్యాచ్!
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుత రీతిలో ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టి అభిమానులకు కనువిందు చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో గెలుపొంది.. 1-0తో ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన.. ప్రస్తుతం కాన్పూర్‌లో రెండో మ్యాచ్ ఆడుతోంది.233 పరుగులకు బంగ్లా ఆలౌట్శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో గ్రీన్ పార్క్ స్టేడియంలో టాస్ గెలిచిన టీమిండియా.. బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్యపడగా.. రెండు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దై పోయింది. ఈ క్రమంలో సోమవారం వరణుడు కరుణించడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ 74.2 ఓవర్లలో 233 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అయితే, బంగ్లా ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుకు సింగిల్ హ్యాండెడ్ క్యాచ్ సహచరులతో పాటు.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లనూ ఆశ్చర్యపరిచింది. 50వ ఓవర్లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతిని బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ బౌండరీకి తరలించాలనే యోచనతో షాట్ బాదినట్లు కనిపించింది. ఒక్క ఉదుటున పైకెగిరి ఒంటిచేత్తో క్యాచ్ఈ క్రమంలో 30 యార్డ్ సర్కిల్ లోపలి ఫీల్డింగ్ పొజిషన్లో ఉన్న రోహిత్.. తన తల మీదుగా వెళ్తున్న బంతిని ఒక్క ఉదుటన పైకెగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో సిరాజ్‌తో పాటు లిటన్ దాస్, భారత ఫీల్డర్లు నమ్మలేమన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అలా లిటన్‌దాస్(13) రూపంలో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా మూడు, సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్ రెండు వికెట్లు దక్కించుకోగా.. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన టీమిండియా 55 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మెహది హసన్ మిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ 23 పరుగుల వద్ద నిష్క్రమించాడు.చదవండి: పూరన్ సుడిగాలి శతకంHits blinks Out! ☝🏻🥳 #IndvBan #WhistlePodupic.twitter.com/A32vPxSlyP— Chennai Super Kings (@ChennaiIPL) September 30, 2024 -
IND vs BAN: కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు దూకుడు ప్రదర్శించారు. 107/3 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. బుమ్రా (3/50), సిరాజ్ (2/57), అశ్విన్ (2/45), ఆకాశ్‌దీప్ (2/43), జడేజా (1/28) ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ హక్ అజేయ సెంచరీతో (107) బంగ్లాదేశ్‌ను ఆదుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో జకీర్ హసన్ 0, షద్మాన్ ఇస్లాం 24, నజ్ముల్ హసన్ షాంటో 31, ముష్ఫికర్ రహీం 11, లిట్టన్ దాస్ 13, షకీబ్ అల్ హసన్ 9, మెహిది హసన్ మిరాజ్ 20, తైజుల్ ఇస్లాం 5, హసన్ మహమూద్ 1, ఖలీద్ అహ్మద్ 0 పరుగులు చేసి ఔటయ్యారు.నిప్పులు చెరిగిన బుమ్రానాలుగో రోజు ఆటలో బుమ్రా చెలరేగిపోయాడు. ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ముష్ఫికర్ రహీంను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా, ఆతర్వాత మెహిది హసన్, తైజుల్ ఇస్లాంలను పెవిలియన్‌కు పంపాడు. బుమ్రా ధాటికి బంగ్లా బ్యాటింగ్ లైనప్ విలవిలలాడిపోయింది.WHAT A BLINDER BY CAPTAIN ROHIT SHARMA. 🔥- Captain Rohit leads by example for India...!!!! 🙌 pic.twitter.com/XqJORqHvF6— Tanuj Singh (@ImTanujSingh) September 30, 2024రోహిత్ సూపర్ క్యాచ్నాలుగో రోజు తొలి సెషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు. సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ నమ్మశక్యం కాని రీతిలో గాల్లోకి ఎగురుతూ అద్బుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. రోహిత్ విన్యాసం చూసి గ్రౌండ్లో ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు.• @fairytaledustt_ pic.twitter.com/yqDDcJcTCq— V. (@was_fairytale) September 30, 2024కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న సిరాజ్నాలుగో రోజు ఆటలో భారత ఫీల్డర్లు రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకున్నారు. తొలుత లిట్టన్ దాస్ క్యాచ్‌ను రోహిత్.. ఆతర్వాత షకీబ్ క్యాచ్‌ను సిరాజ్ నమ్మశక్యం కాని రీతిలో అద్భుతమైన క్యాచ్‌లుగా మలిచారు. షకీబ్ క్యాచ్‌ను సిరాజ్ వెనక్కు పరిగెడుతూ సూపర్ మ్యాన్‌లా అందుకున్నాడు. రోహిత్, సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో రెండు, మూడు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2025: ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్లు వీరే..? -
పంత్‌పై సిరాజ్ ఆగ్రహం.. రోహిత్ కూడా ఇలా చేస్తాడనుకోలేదు!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు వికెట్ దక్కకపోవడానికి పరోక్ష కారణమైనందుకు ఫైర్ అయ్యాడు. అయితే, పొరపాటును తెలుసుకున్న పంత్ తనకు సారీ చెప్పడంతో సిరాజ్ శాంతించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.టీమిండియా 376 ఆలౌట్ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో చెన్నైలో ఇరు జట్ల మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన బంగ్లా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 376 పరుగుల వద్ద ఆలౌట్ అయిన భారత్... తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ రెండేసి వికెట్లు కూల్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) పాపం సిరాజ్నిజానికి ఈ మ్యాచ్‌లో సిరాజ్‌కు మూడో వికెట్ కూడా దక్కేది. కానీ పంత్ కారణంగా మిస్ అయ్యింది. అసలేం జరిగిందంటే.. బంగ్లా ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ను సిరాజ్ వేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న జకీర్ హసన్.. ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ అయినట్లు సిరాజ్ భావించాడు. దీంతో వికెట్ కోసం బిగ్గరగా అప్పీలు చేశాడు.రివ్యూ వద్దని చెప్పాడుఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ .. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను సంప్రదించగా... ‘‘బాల్ మరీ అంత హైట్‌కి రాలేదు. కానీ లెగ్ స్టంప్ మాత్రం మిస్సవుతోంది’’ అని బదులిచ్చాడు. దీంతో రివ్యూ తీసుకోవాలన్న సిరాజ్ అభ్యర్థనను రోహిత్ తిరస్కరించాడు. కానీ.. రీప్లేలో జకీర్ అవుటైనట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. పంత్ చేయి పైకెత్తుతూ సారీ అన్నట్లుగా సైగ చేశాడు. అలా పంత్ చెప్పింది రోహిత్ విన్న కారణంగా సిరాజ్ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.చదవండి: హెడ్ ఊచకోత.. పరుగుల విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు pic.twitter.com/bcyWefmJ7H— Nihari Korma (@NihariVsKorma) September 20, 2024 -
ఆ టీమిండియా బౌలర్‌తో పోటీ అంటే ఇష్టం: ఆసీస్ స్టార్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్నస్ లబుషేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బౌలర్లలో ఓ స్టార్ పేసర్‌తో తనకు అనుబంధం ఉందని.. అయితే, అదే సమయంలో ప్రత్యర్థిగా అతడితో పోటీ తనకు పూనకాలు తెప్పిస్తుందని తెలిపాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. ఈ ఏడాది నవంబరులో ఇరు జట్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో తలపడనున్నాయి.టీమిండియాదే పైచేయిఇందులో భాగంగా ఆసీస్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లనుంది. ఇక ఈ టోర్నీలో గత నాలుగు దఫాలుగా భారత జట్టునే విజయం వరిస్తోంది. రెండేళ్లకొకసారి జరిగే ఈ ఈవెంట్లో చివరగా రెండుసార్లు ఆసీస్‌లో, రెండుసార్లు సొంతగడ్డపై టీమిండియానే గెలిచింది.ఇప్పటి నుంచే హైప్ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ ఓవరాల్‌గా పదిసార్లు గెలవగా.. ఆస్ట్రేలియా ఐదుసార్లు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ ప్రణాళికల గురించి వెల్లడిస్తున్నారు. ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్.. టీమిండియాతో పోటీ గురించి చెబుతూ.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లతో తమకు ప్రమాదం పొంచి ఉందని తెలిపాడు.మరోవైపు.. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, కామెరాన్‌గ్రీన్ తదితరులు టీమిండియా భవిష్యత్తు సూపర్స్టార్ల గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లు రానున్న కాలంలో టీమిండియాకు కీలకం కానున్నారని.. వారిని కట్టడి చేసేందుకు తమ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సిరాజ్‌తో పోటీ అంటే ఇష్టంతాజాగా ఆల్‌రౌండర్ మార్నస్ లబుషేన్ మాట్లాడుతూ.. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు. సిరాజ్ కెరీర్ తొలినాళ్ల నుంచి అతడిని చూస్తున్నానని.. ఈ హైదరాబాదీ సరైన దిశలో తన భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నాడని ప్రశంసించాడు. అక్కడే అరంగేట్రంఏదేమైనా టీమిండియా బౌలర్లలో సిరాజ్‌తో పోటీ అంటేనే తనకు మజా వస్తుందని లబుషేన్ తెలిపాడు. కాగా 2020 నాటి బోర్డర్- గావస్కర్ సందర్భంగానే సిరాజ్ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు 27 టెస్టులు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడిన సిరాజ్ ఖాతాలో వరుసగా 74, 71, 14 వికెట్లు ఉన్నాయి. మరోవైపు.. ఆసీస్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లబుషేన్ 50 టెస్టుల్లో 4114 పరుగులు చేయడంతో పాటు 13 వికెట్లు తీశాడు. 52 వన్డేలు ఆడి 1656 రన్స్ సాధించడంతో పాటు 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: ఇంగ్లండ్ కూడా అలాగే అనుకుంది: బంగ్లాకు రోహిత్ శర్మ వార్నింగ్ -
Duleep Trophy: ఆ ముగ్గురు దూరం.. బీసీసీఐ ప్రకటన
టీమిండియా స్టార్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ దులిప్ ట్రోఫీ- 2024 టోర్నీకి దూరమయ్యారు.ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాదీ పేసర్ సిరాజ్, కశ్మీరీ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. టోర్నీ మొదలయ్యే నాటికి వీరిద్దరు అందుబాటులో ఉండే పరిస్థితి లేదని తెలిపింది.సిరాజ్, ఉమ్రాన్ స్థానాల్లో వీరేఫిట్నెస్ కారణాల దృష్ట్యా సిరాజ్, ఉమ్రాన్ దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొత్తానికి దూరం కానున్నట్లు పేర్కొంది. మరోవైపు.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను టీమ్-బి నుంచి విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, ఇందుకు గల కారణం మాత్రం తెలపలేదు. ఇక టీమ్-బిలో భాగమైన సిరాజ్ దూరం కావడంతో.. అతడి స్థానంలో హర్యానా రైటార్మ్ పేసర్ నవదీప్ సైనీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.అదే విధంగా.. టీమ్-సిలో ఉమ్రాన్ మాలిక్ స్థానాన్ని పాండిచ్చేరి ఫాస్ట్ బౌలర్ గౌరవ్ యాదవ్‌తో భర్తీ చేసినట్లు తెలిపింది. అయితే, జడ్డూ రీప్లేస్‌మెంట్‌ను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. ఇక టీమ్-బిలో ఉన్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే ఈ టోర్నీలో పాల్గొంటాడని తెలిపింది.కాగా నాలుగు రోజుల ఫార్మాట్లో జరిగే దులిప్ ట్రోఫీ 2024-25 ఎడిషన్ సెప్టెంబరు 5 నుంచి మొదలుకానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.దులిప్ ట్రోఫీ- 2024 రివైజ్డ్ టీమ్స్ఇండియా-ఏశుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఇండియా-సిరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డిశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన