
Photo Courtesy: BCCI
గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు కోపమొచ్చింది. సహచర ఆటగాడిపై మైదానంలోనే అతడు కోపంతో ఊగిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. విషయమేమిటంటే..
చేదు అనుభవం
ఐపీఎల్-2025 (IPL 2025) లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో శుబ్‌మన్ సేన 83 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగాలంటే మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.
అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ ఆది నుంచే గుజరాత్‌కు కలిసిరాలేదు. టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 230 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34), డెవాన్ కాన్వే (35 బంతుల్లో 52) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37) దానిని కొనసాగించాడు.
The word 'fear' isn't in their dictionary 🔥#CSK's young guns Ayush Mhatre and Urvil Patel added to the Ahmedabad heat with their knocks 👏
Updates ▶ https://t.co/P6Px72jm7j#TATAIPL | #GTvCSK | @ChennaiIPL pic.twitter.com/KcM4XW9peg— IndianPremierLeague (@IPL) May 25, 2025
ఇక శివం దూబే (8 బంతుల్లో 17) కాసేపు మెరుపులు మెరిపించగా.. డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57) ధనాధన్ దంచికొట్టాడు. రవీంద్ర జడేజా (18 బంతుల్లో 21 నాటౌట్) కూడా ఈసారి ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.
అదనపు పరుగులు
కాగా సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ను సిరాజ్ వేశాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొన్న ఉర్విల్ పటేల్.. మిడాఫ్ దిశగా బాల్‌ను తరలించాడు. కాన్వేతో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్నాడు. అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ డైరెక్ట్ త్రో ద్వారా వికెట్లను గిరాటేయాలని చూడగా.. మిస్ ఫీల్డ్ అయింది. ఓవర్ త్రో కారణంగా చెన్నై మరో పరుగు తీయగలిగింది.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. గిల్ వేసిన ఓవర్ త్రోను అందుకునేందుకు స్క్వేర్ లెగ్ వద్ద నుంచి పరిగెత్తుకు వచ్చిన ఆర్. సాయి కిషోర్ బంతిని అందుకుని మిడ్ వికెట్ వద్ద కలెక్ట్ చేసుకున్నాడు. అనుకోకుండా బంతి అతడి నుంచి చేజారగా.. ఇంతలో సీఎస్‌కే బ్యాటర్లు మూడో పరుగు కూడా పూర్తి చేసుకున్నారు.
ఇదేంటి మియా? ఇలాగేనా ప్రవర్తించేది?
దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ కిషోర్‌ను ఉద్దేశించి గట్టిగానే తిట్టినట్లు కనిపించింది. అంతేకాదు.. బంతిని కూడా గ్రౌండ్‌కేసి కొడుతూ తన ఆగ్రహం వెళ్లగక్కాడు. ఇంతలో గిల్ వచ్చి సిరాజ్ భుజం తడుతూ నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘ఇదేంటి మియాన్’’ అంటూ ఇలాగేనా ప్రవర్తించేది? అన్నట్లుగా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. కాగా లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన గుజరాత్... 18.3 ఓవర్లలో కేవలం 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
చదవండి: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
— The Game Changer (@TheGame_26) May 25, 2025