చ‌రిత్ర సృష్టించిన సునీల్ నరైన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా | Sunil Narine Creates History! Sets New Record In T20s | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన సునీల్ నరైన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

May 25 2025 8:58 PM | Updated on May 25 2025 9:03 PM

Sunil Narine Creates History! Sets New Record In T20s

PC: BCCI/IPL.com

కోల్‌క‌తా నైట్‌రైడర్స్‌ స్టార్ ఆల్‌రౌండ‌ర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో ఒకే జట్టు తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌల‌ర్‌గా న‌రైన్ చ‌రిత్ర సృష్టించాడు. సునీల్‌ కేకేఆర్ తరుపన ఇప్పటివరకు ఐపీఎల్‌లో 191, ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20)లో 18 వికెట్లు తీశాడు. మొత్తంగా 209 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఐపీఎల్‌-2025లో భాగంగా ఢిల్లీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో నరైన్ ఈ ఫీట్ సాధించాడు. కాగా సునీల్ నరైన్ ఐపీఎల్ ఆరంభం నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కే ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఇక ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెట్ క్లబ్ నాటింగ్‌హామ్‌షైర్ బౌలర్ సమిత్ పటేల్ పేరిట ఉండేది. 

నాటింగ్‌హామ్‌షైర్ తరపున పటేల్ 208 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో స‌మిత్ వ‌ర‌ల్డ్ రికార్డును న‌రైన్ బ్రేక్ చేశాడు. నరైన్  పటేల్‌,  తర్వాతి స్ధానంలో హాంప్‌షైర్ బౌలర్ క్రిస్ వుడ్ 199 ఉన్నాడు. ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ 195 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

పురుషుల టీ20 క్రికెట్‌లో ఒక జట్టుకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
210* – సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
208 – సమిత్ పటేల్ (నాటింగ్‌హామ్‌షైర్)
199 – క్రిస్ వుడ్ (హాంప్‌షైర్)
195 – లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్)
193 – డేవిడ్ పేన్ (గ్లౌసెస్టర్‌షైర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement