2026 టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడం, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వడం వంటి గందరగోళాల మధ్య షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైంది. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఒకే ఒక మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 4న గత ఎడిషన్ రన్నరప్ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇదే వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత-ఏ జట్టు కూడా రెండు మ్యాచ్‌లు ఆడనుండటం విశేషం. చిన్న జట్లు యూఎస్‌ఏ, నమీబియాకు ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్‌లు షెడ్యూల్ చేయబడ్డాయి. ఫిబ్రవరి 2న భారత-ఏ జట్టు నవీ ముంబై వేదికగా యూఎస్‌ఏతో తలపడనుంది. 6న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో నమీబియాను ఢీకొట్టనుంది. మొత్తంగా మెగా టోర్నీ ప్రారంభానికి ముందు 16 వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఫిబ్రవరి 2
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)
భారత్-ఏ వర్సెస్ యూఎస్‌ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, మధ్యాహ్నం 3 గంటలకు)
కెనడా వర్సెస్ ఇటలీ (చెన్నై, రాత్రి 7 గంటలకు)
ఫిబ్రవరి 3
శ్రీలంక-ఏ వర్సెస్ ఒమన్ (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)
నెదర్లాండ్స్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం 3 గంటలకు)
నేపాల్ వర్సెస్ యూఏఈ (చెన్నై, సాయంత్రం 5 గంటలకు)
ఫిబ్రవరి 4
నమీబియా వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం ఒంటి గంటలకు)
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)
ఐర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)
ఫిబ్రవరి 5
ఒమన్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)
కెనడా వర్సెస్ నేపాల్ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)
ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)
న్యూజిలాండ్ వర్సెస్ యూఎస్‌ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)
ఫిబ్రవరి 6
ఇటలీ వర్సెస్ యూఎస్‌ఏ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)
భారత్-ఏ వర్సెస్ నమీబియా (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, సాయంత్రం 5 గంటలకు)
ఈ మ్యాచ్‌ల తర్వాత ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్ మెయిన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ కొలొంబో వేదికగా తలపడతాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు యూఎస్‌ఏతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది.


