Kolkata Knight Riders
-
‘మా మామ గారికి అంకితం’
చాన్నాళ్ల తర్వాత ఐపీఎల్-2026లో కోల్‌కతా రైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఈ యూపీ ఆటగాడు అదరగొట్టాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 బంతులు ఎదుర్కొన్న రింకూ.. 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.కోల్‌కతా విజయంలో అంతా తానే..రింకూ ప్రదర్శన కారణంగానే కోల్‌కతా 155 పరుగుల మార్కు అందుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా కోల్‌కతా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నాలుగు సిక్స్‌లు.. ఫీల్డింగ్‌లో నాలుగు క్యాచ్‌లు, సూపర్ ఓవర్లో నాలుగు పరుగులు ఇలా... జట్టు విజయంలో రింకూనే కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మా మామ గారికే అంకితంఇక ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రింకూ సింగ్ కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj) లక్నోలోని ఏకనా స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా రింకూ ప్రదర్శన పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘‘నేను ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. రింకూ మా మామ గారి కోసం ఆడాడు. ఈరోజు ఆయనను మేము ఎంతగానో మిస్సవుతున్నాము. రింకూ ప్రదర్శన మా మామ గారికే అంకితం’’ అని ప్రియా సరోజ్ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders)చిన్న పిల్లలా గంతులేశారుకాగా రింకూ సిక్సర్లు బాదుతున్న వేళ ప్రియా సరోజ్ చిన్న పిల్లలా గంతులేశారు. నవ్వులు చిందిస్తూ కాబోయే భర్త విజయాన్ని సెలబ్రేట చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన ప్రియా సరోజ్.. ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిచహర్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున లోక్‌సభకు ఎంపికయ్యారు. రింకూతో పరిచయం ప్రేమగా మారగా.. గతేడాది పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే రింకూ తండ్రి మరణించిన విషయం విదితమే. చదవండి: వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
అంగ్క్రిష్ రఘువంశీపై కఠిన చర్యలు
కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీపై ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో మ్యాచ్ ఫీజులో కోత విధించింది. ఐపీఎల్-2026లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఏకనా స్టేడియంలో లక్నో- కోల్‌కతా జట్లు తలపడ్డాయి. అనూహ్య రనౌట్ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) ఆదిలోనే చెలరేగి ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (0), అజింక్య రహానే (10) వికెట్లు కూల్చాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన అంగ్క్రిష్ రఘువంశీ అనూహ్యంగా రనౌటయ్యాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ చివరి బంతిని మిడాఫ్ దిశగా ఆడిన రఘువంశీ సింగిల్ కోసం ముందుకొచ్చాడు.అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్అయితే మరో ఎండ్‌లో ఉన్న కామెరాన్ గ్రీన్ నిరాకరించడంతో వెనుదిరిగాడు. ఈ క్రమంలో మిడాఫ్ దగ్గర బంతి అందుకున్న మహ్మద్ షమీ వికెట్ల వైపు విసిరాడు. ఆ బాల్ కాస్త రఘువంశీకి తాకగా... లక్నో జట్టు ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కోసం అప్పీల్ చేసింది.KKR ತಂಡಕ್ಕಂತೂ ಇದು ನಿಜಕ್ಕೂ ನುಂಗಲಾರದ ತುತ್ತು! 'Obstruction of Field' ಅಂತ Raghuvanshi ಗೆ ಔಟ್ ಕೊಡಲಾಗಿದೆ.☝️ ನಿಮ್ಮ ಪ್ರಕಾರ ಇದು Out? ಅಥವಾ Not Out? 👀 ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #LSGvsKKR | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL #AngkrishRaghuvanshi pic.twitter.com/cPsuy1J2p7— Star Sports Kannada (@StarSportsKan) April 26, 2026తీవ్ర అసంతృప్తిదీంతో పలుమార్లు రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్... రఘువంశీ దిశ మార్చుకున్నాడని నిర్ధారించి అతడిని అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై రఘువంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోపంగా మైదానాన్ని వీడాడు. హెల్మెట్‌ను విసిరేసి అసంతృప్తి వెళ్లగక్కాడు.జరిమానాతో పాటు..ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి చర్యలకు దిగింది. ‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ పరికరాలు, క్లాతింగ్ తదితర వస్తువులకు హాని కలిగించకూడదు. లక్నోతో మ్యాచ్ సందర్భంగా రఘువంశీ ఈ నిబంధనను ఉల్లంఘించాడు.అందుకే అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డిమెరిట్ పాయింట్ కూడా జత చేస్తున్నాం’’ అని ప్రకటన విడుదల చేసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా- లక్నో జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సరిసమానంగా చెరో 155 పరుగులు చేశాయి. ఈ క్రమంలో సూపర్ ఓవర్ నిర్వహించగా.. కోల్‌కతా విజయం సాధించింది.చదవండి: LSG Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాం -
వీరేంద్ర సెహ్వాగ్ ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన రింకూ సింగ్
రింకూ సింగ్.. ప్రపంచ టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడు. మరోసారి అతడిలోని ఫినిషర్ బయటకు వచ్చాడు. ఐపీఎల్-2026 సీజన్లో ఆదివారం ఏకానా స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.తన సూపర్ బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో కేకేఆర్‌కు సంచలన విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కేవలం 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రింకూ వీరోచిత పోరాటం కనబరిచాడు. చివరి రెండో ఓవర్లలో రింకూ లక్నో బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన స్పిన్నర్ దిగ్వేష్ రాఠీకి ఈ యూపీ క్రికెటర్ చుక్కలు చూపించాడు. వరుసగా నాలుగు సిక్స్‌లు బాది ఐపీఎల్-2023 సీజన్‌ను రింకూ గుర్తు చేశాడు. ఆఖరి బంతిని రింకూ మిస్స్ చేసుకున్నాడు. లేదంటే మూడేళ్ల కిందట సీన్ రిపీట్ అయ్యి ఉండేది. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌ను సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోడు. గుజరాత్ విజయానికి చివరి ఓవర్లో 29 పరుగులు అవసరమవ్వగా.. రింకూ వరుసగా ఐదు సిక్స్‌లు బాది తమ జట్టును విజయతీరాలకు తేచ్చాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఆఖరి ఓవర్లో ఇన్ని పరుగులు ఛేజ్ చేయడం అదే మొదటిసారి. అప్పటిలో రింకూ ఇన్నింగ్స్‌పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు."టీ20 క్రికెట్ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు. ఆఖరి ఓవర్లో ఇన్ని పరుగులు చేయడం అంత సులుభం కాదు. విజయానికి 5 సిక్సర్లు కావాల్సినప్పుడు రింకూ ఇలా చేయడం నిజంగా అద్భుతం. కానీ రింకూ సింగ్ మళ్ళీ ఎప్పటికీ దీన్ని రిపీట్ చేయలేడు" అని క్రిక్‌బజ్ లైవ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. అయితే సెహ్వాగ్ అంచనా తప్పిందని నెటిజన్లు అంటున్నారు. రింక్ దాదాపుగా మరోసారి చివరి ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టేంత పనిచేశాడని పోస్ట్‌లు పెడుతున్నారు.చదవండి: Virender Sehwag: వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదుRINKU SINGH SMASHED 4 SIXES IN THE FINAL OVER AGAINST DIGVESH RATHI. - An iconic 83* (50) by Rinku. pic.twitter.com/V6dFUvtBWl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2026 -
‘అందుకే సూపర్ ఓవర్లో అతడిని పంపించాం’
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ వైఫల్యం కొనసాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో రిషభ్ సేన ఓటమిపాలైంది. ఏకనా స్టేడియంలో నిర్ణీత 20 ఓవర్లలో ఇరుజట్లు సమానంగా 155 పరుగులు సాధించాయి. ఈ క్రమంలో సూపర్ ఓవర్ నిర్వహించగా.. లక్నో ఓటమి పాలైంది.సూపర్ ఓవర్ సాగిందిలా... ‘సూపర్ ఓవర్’లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో మూడు బంతుల్లో ఒక్కపరుగు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ వేసిన తొలి బంతికే నికోలస్ పూరన్ (0) క్లీన్ బౌల్డ్ కాగా... బౌండరీ వద్ద పావెల్, రింకూ సింగ్ పట్టిన చక్కటి రిలే క్యాచ్‌కు ఐడెన్ మార్క్రమ్ (0) వెనుదిరిగాడు. కెప్టెన్ రిషభ్ పంత్ (1 నాటౌట్) అజేయంగా నిలిచాడు.అంతా రింకూ మయంఇక రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా తొలి బంతికే గెలుపు ఖాతాలో వేసుకుంది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో రింకూ (4 నాటౌట్) తొలి బంతికే ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు. చివరి ఓవర్లో నాలుగు సిక్స్‌లు, ఫీల్డింగ్‌లో నాలుగు క్యాచ్‌లు, సూపర్ ఓవర్లో నాలుగు పరుగులు ఇలా... కోల్‌కతా విజయంలో ఎక్కడ చూసిన రింకూ సింగ్ ప్రతిభే ప్రస్ఫుటించింది. అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.#KKR win the first SUPER OVER of the season 🤩@kkriders with a hard earned win after 42 overs of topsy turvy cricket 👏Scorecard ▶️ https://t.co/elFxwvCeWO#TATAIPL | #KhelBindaas | #LSGvKKR pic.twitter.com/yIoX0vQOMv— IndianPremierLeague (@IPL) April 26, 2026అతడిని ఎలా ఆడిస్తారు?మరోవైపు.. ఫామ్‌లో లేని నికోలస్ పూరన్‌ను సూపర్ ఓవర్లో ఆడించడం పట్ల లక్నో నాయకత్వ బృందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించిన తీరు కూడా వైరల్‌గా మారింది. ‘‘మాకు కచ్చితంగా విరామం కావాలి. మళ్లీ సరికొత్తగా తిరిగివస్తాం. ఇలాంటి మ్యాచ్‌లలో ఒత్తిడి సహజం.అయితే, మేము దీనిపై బహిరంగంగా స్పందించాల్సిన అవసరం లేదు. అంతర్గతంగా కూర్చుని చర్చిస్తాం. ఒకరూ.. ఇద్దరూ కాదు.. ఇది సమిష్టి వైఫల్యం. కాబట్టి జట్టులోని ప్రతి ఒక్కరు ఇందుకు జవాబుదారీగా ఉండాల్సిందే.పంత్ స్పందన ఇదేఇక పూరన్ విషయంలోనూ మేమంతా కలిసికట్టుగానే నిర్ణయం తీసుకున్నాం. సూపర్ ఓవర్లో ఎవరిని పంపించాలన్న ప్రశ్న వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నిక్కీ పేరునే సూచించారు. అతడు ఇప్పుడు అత్యుత్తమ ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే నిక్కీ వంటి స్టార్లపై నమ్మకం ఉంచాలి.అయితే, ఇక్కడ మా వ్యూహం ఫలించలేదు. మ్యాచ్‌లో సానుకూల అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాము. కానీ ఈరోజు మాకు అంతగా కలిసిరాలేదు. అయితే, విరామం తర్వాత మళ్లీ సరికొత్తగా తిరిగివస్తామనే నమ్మకం ఉంది’’ అని పంత్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ 12 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు.. పంత్ 38 బంతుల్లో 42 పరుగులు రాబట్టగలిగాడు. చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు' -
ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్లో లక్నోపై కేకేఆర్ విజయం
ఐపీఎల్-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మాజాను అందించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్ ఓవర్లో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్‌ను రింకూ తన విరోచిత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు.రింకూ సింగ్ కేవలం 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83 పరుగులు అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో లక్నో పేసర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. మొహ్సిన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సెన్సేషనల్ షమీఅనంతరం లక్ష్య చేధనలో లక్నో కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. కార్తీక్ త్యాగి వేసిన చివరి ఓవర్లో లక్నో విజయానికి 17 పరుగులు అవసరమవ్వగా.. షమీ చివరి బంతికి సిక్స్ కొట్టడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్‌తో ఫలితం తేల్చాలని అంపైర్లు నిర్ణయించారు. అయితేసూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో మూడు బంతుల్లో రెండు వికెట్ల నష్టానికి కేవలం ఒక్క పరుగు చేసింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో తొలి బంతికి పూరన్ క్లీన్ బౌల్డ్ కాగా.. రెండో బంతికి పంత్ సింగిల్ తీసి మార్క్రమ్కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి మార్క్రమ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రూల్స్ ప్రకారం.. సూపర్ ఓవర్లో రెండు వికెట్లు వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత తొలి బంతికే రింకూ సింగ్ ఫోర్ కొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు. -
ఫినిషర్ ఈజ్ బ్యాక్.. రఫ్ఫాడించిన రింకూ సింగ్
ఐపీఎల్-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ రింకూ సింగ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్‌ను రింకూ తన విరోచిత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఓ దశలో ఆచితూచి ఆడిన రింకూ.. చివరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.మహ్మద్ షమీ వేసిన 19 ఓవర్లో 17 పరుగులు రాబట్టిన రింకూ సింగ్.. ఆ తర్వాత ఆఖరి ఓవర్లో స్పిన్నర్ దిగ్వేష్ రాఠీని ఓ ఆడుకున్నాడు. ఆ ఓవర్లో రింకూ వరుసగా నాలుగు సిక్స్‌లు బాది 26 పరుగులు పిండుకున్నాడు. మరో రెండు పరుగులు వైడ్స్ రూపంలో వచ్చాయి.కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రింకూ సింగ్.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రింకూ సింగ్‌కు ఐపీఎల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం.నిప్పులు చెరిగిన మొహ్సిన్ఇక రింకూ సునామీకి ముందు లక్నో పేసర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో కేకేఆర్ టాపర్డర్‌ను మోహ్షిన్ కుప్పకూల్చాడు. మొహ్సిన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో లిండే ఓ వికెట్ సాధించారు. మహ్మద్ షమీతో సహా మిగితా బౌలర్లందా దారుణంగా విఫలమయ్యారు.చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు'Rinku Singh and multiple sixes in the last over - we've seen this before 🔥pic.twitter.com/6LOikbBKMG— Cricbuzz (@cricbuzz) April 26, 2026 -
ఇది అవుటా? నాటౌటా? పాపం రఘువంశీ
ఐపీఎల్-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీని దురదృష్టం వెంటాడింది. క్రికెట్లో అరుదుగా కన్పించే 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' (ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించడం) నిబంధన ప్రకారం రఘువంశీ ఔటయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ ప్రకారం ఔటైన నాలుగో బ్యాటర్‌గా రఘువంశీ నిలిచాడు.ఏమి జరిగిందంటే?కోల్‌కతా ఇన్నింగ్స్ 5వ ఓవర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి రఘువంశీ మిడ్-ఆన్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే మిడ్ ఆన్‌లో ఉన్న మహ్మద్ షమీ బంతిని వేగంగా అందుకోవడంతో.. రఘువంశీ సగం దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించాడు.అయితే వెనక్కి వెళ్లే క్రమంలో షమీ త్రో చేసిన బంతి రఘువంశీ కాలికి తగిలి వికెట్ కీపర్ పంత్ చేతికి వెళ్లలేదు. అయితే రఘువంశీ కావాలనే తన దారిని మార్చుకుని వెనుక్కి పరిగెత్తాడని పంత్ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌కు అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. చాలా సేపు రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్.. రఘువంశీ కావాలనే ఫీల్డర్ విసిరిన బంతికి అడ్డుపడ్డాడని నిర్ధారించారు.దీంతో ఆర్టికల్ 37 ప్రకారం అతడిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద అవుట్‌గా ప్రకటించారు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై రఘువంశీతో పాటు హెడ్ కోచ్ అభిషేక్ నాయర్, మెంటార్లు షేన్ వాట్సన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. రఘువంశీ మైదానాన్ని వీడే క్రమంలో తన బ్యాట్‌ను, హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అతడు క్రీజులోకి చేరుకోవాలనే ఉద్దేశంతోనే అలా పరిగెత్తాడని, అలా ఎలా ఔట్ ఇస్తారని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. మరో యూజర్ రూల్స్ ప్రకారం ఇది అవుటేనని కామెంట్ చేశాడు. Obs 🥵Angkrish Raghuvanshi !! Obstructing the field #LSGvsKKR #CSKvsGTpic.twitter.com/2mTxfZlbJU— Baba Jaipuriya (@BabaJaipuriya) April 26, 2026 -
లక్నో వర్సెస్ కేకేఆర్ మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ సిద్దార్ధ్ స్ధానంలో లిండే తుది జట్టులోకి వచ్చాడు. కేకేఆర్ మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే(కెప్టెన్), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), కెమెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగిలక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్ -
‘అందుకే శ్రేయస్ అయ్యర్‌ను వదులుకున్నాం’
భారత దేశీ క్రికెట్లో కోచ్‌గా చంద్రకాంత్ పండిట్‌కు మంచి పేరుంది. అతడి మార్గదర్శనంలోనే మధ్యప్రదేశ్ తొలి రంజీ టైటిల్ అందుకుంది. రంజీ 2021-22 సీజన్లో చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ బాధ్యతలు చేపట్టాడు.చంద్రకాంత్ మార్గ నిర్దేశనం, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలో కేకేఆర్ 2024లో చాంపియన్‌గా అవతరించింది. అయితే, వీరి కంటే నాటి మెంటార్ గౌతం గంభీర్‌కే క్రెడిట్ ఎక్కువగా వచ్చింది. ఇక 2024 తర్వాత కేకేఆర్ శ్రేయస్‌ను వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది.ఏకంగా ఫైనల్కుఅందుకు తగినట్లుగానే శ్రేయస్ అయ్యర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి పంజాబ్‌ను గతేడాది ఫైనల్‌కు చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలో పంజాబ్ ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు.. శ్రేయస్‌ను వదులుకున్న కేకేఆర్ వరుస పరాజయాలతో డీలా పడి.. విమర్శలు మూటగట్టుకుంటోంది.ఈ నేపథ్యంలో కేకేఆర్ మాజీ హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్ శ్రేయస్ అయ్యర్‌ను వదులుకోవడంపై తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ ఆరోజు మేము అతడి సేవలు కోల్పోయాము. శ్రేయస్ అద్భుతమైన ఆటగాడు. కెప్టెన్‌గా కేకేఆర్‌కు ట్రోఫీ అందించాడు.అతడు జట్టును నడిపించే విధానానికి నేను అభిమానిని. అయితే, కొన్నిసార్లు దీర్ఘకాల ప్రయోజనాలు, వ్యూహాల దృష్ట్యా కొంతమంది ప్లేయర్లను వదులుకోవాల్సి వస్తుంది. నిజానికి ఆరోజు కేకేఆర్ కోచ్‌గా నేను ఈ విషయంలో చాలా బాధపడ్డాను.అందుకే అతడిని వదులుకున్నాముఅయితే, కావాలని మేము అతడిని వదులుకోలేదు. అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. శ్రేయస్ ఒక్కడినే కాదు.. ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లను కూడా మేము వదిలేశాము. ఏదేమైనా కోచ్‌గా ఉన్న సమయంలో కేకేఆర్ యజమానులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతా, సీఈఓ వెంకీ మైసూర్ నాకు అండగా ఉన్నారు’’ అని చంద్రకాంత్ పండిట్ రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.కాగా 2025 సీజన్ తర్వాత చంద్రకాంత్ పండిట్‌కు ఉద్వాసన పలికిన కేకేఆర్.. 2026కు గానూ అభిషేక్ నాయర్‌ను హెడ్‌కోచ్‌గా ప్రకటించింది. గతేడాది అజింక్య రహానే కెప్టెన్సీలో పద్నాలుగింట కేవలం ఐదు గెలిచిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికి ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచి అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. చదవండి: ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు? -
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
-
PSL: తప్పు ఒప్పుకొన్న పాక్ బోర్డు.. ఊహించని ట్విస్ట్!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ పట్ల పీసీబీ వ్యవహారశైలి ఇందుకు కారణం. టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియా జట్టుపై సత్తా చాటడంతో ముజర్‌బానీకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)కు చెందిన ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంఛైజీ ముజర్బానీని సొంతం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేసింది. వెస్టిండీస్ యువ పేసర్ షమార్ జోసెఫ్ స్థానంలో ఈ జింబాబ్వే పేసర్‌ను తమ జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.కేకేఆర్‌లో చేరిన ముజర్బానీఅయితే.. ఆ తర్వాత అనూహ్య రీతిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి ముజర్‌బానీకి పిలుపువచ్చింది. బంగ్లాదేశ్‌తో ఉద్రికత్తల నేపథ్యంలో తమ జట్టు నుంచి తొలగించిన ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ స్థానాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్.. ముజర్బానీతో భర్తీ చేయాలని భావించింది.రెండేళ్ల నిషేధంఈ నేపథ్యంలో ఐపీఎల్ వైపు మొగ్గుచూపిన ముజర్బానీ.. పీఎస్ఎల్ను వీడి కేకేఆర్‌లో చేరాడు. దీంతో పీసీబీ సంచలన ప్రకటన చేసింది. ‘‘ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడేవాళ్లు పారదర్శకంగా, స్థిరంగా ఉండాలి. ముందుగా ఒప్పందం కుదుర్చుకొని అది అమలులో ఉండగా... దానికి విరుద్ధమైన ఒప్పందంలోకి ప్రవేశించడం ఆట ప్రమాణాలను పాటించకపోవడమే. ముజర్‌బానీపై రెండేళ్లు నిషేధం విధిస్తున్నాం’’ అని పేర్కొంది. దీంతో అతడిపై పాక్ ఫ్యాన్స్ విద్వేష విషం చిమ్మారు.ఈ క్రమంలో ముజర్బానీ ఏజెంట్ తాజాగా ఘాటుగా స్పందించాడు. అసలు ముజర్బానీ ఏ కాంట్రాక్టుపైనా సంతకం చేయలేదని.. అలాంటి ఆటగాడిపై నిషేధం ఎలా విధిస్తారని ప్రశ్నించాడు. అంతేకాదు.. అభిమానుల ముసుగులో పిరికిపందలు అతడిపై విషం చిమ్ముతూ ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించాడు. అకారణంగా బ్లెస్సింగ్‌పై చర్యలు తీసుకున్నారని.. వెంటనే నిషేధం ఎత్తివేయాలని పీసీబీకి విజ్ఞప్తి చేశాడు.తప్పు ఒప్పుకొన్న పాక్ బోర్డు.. ఊహించని ట్విస్ట్!దీంతో వివాదం ముదిరిపోగా.. పీసీబీ స్పందించినట్లు తెలుస్తోంది. PTI అందించిన వివరాల ప్రకారం.. ముజర్బానీ ఏజెంట్ చేసిన ఆరోపణలు నిజమేనని పీసీబీ ధ్రువీకరించింది. పీసీబీ గానీ.. ఇస్లామాబాద్ గానీ ఈ జింబాబ్వే పేసర్‌తో రాతపూర్వక ఒప్పందం చేసుకోలేదని అంగీకరించింది.అయితే, మౌఖికంగా మాత్రం అతడు పీఎస్ఎల్లో ఆడేందుకు ఆమోదం తెలిపాడని పేర్కొంది. ఏదేమైనా ముజర్బానీ నిబంధనలను ఉల్లంఘించాడని.. అందుకే అతడిపై నిషేధం కొనసాగుతుందని పీసీబీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పీసీబీ తప్పును సగమే ఒప్పుకొందని.. అకారణంగా ముజర్‌బానీపై చర్యలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ముజర్బానీతో పాటు ఈ ఏడాది శ్రీలంక కెప్టెన్ దసున్ షనక, ఆస్ట్రేలియా స్టార్ స్పెన్సర్ జాన్సన్ కూడా పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరిన సంగతి తెలిసిందే.చదవండి: టీ20 క్రికెట్ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్‌గా క్రిస్ గేల్ -
PSL: పిరికిపందలు.. పాక్ క్రికెట్ బోర్డుకు దిమ్మతిరిగే కౌంటర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ ఏజెంట్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటికే పీసీబీ ఘర్షణ వాతావరణం నెలకొనేలా చేసిందని.. తాము మాత్రం అలాంటి పనులకు వ్యతిరేకం అన్నాడు. అకారణంగా ముజర్‌బానీపై ద్వేషం ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేశాడు.ఐపీఎల్ కోసం భారత్కుకాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే తరఫున మంచి ప్రదర్శన కనబర్చిన ముజర్బానీ (Blessing Muzarabani)ని పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)కు చెందిన ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకుంది. అయితే ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి పిలుపు రావడంతో ఈ పేస్ బౌలర్ పీఎస్ఎల్ను వీడి.. ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చేశాడు.రెండేళ్ల నిషేధం ఈ నేపథ్యంలో పీసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. ముజర్‌బానీపై రెండేళ్ల నిషేధం విధించింది. ‘‘ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడేవాళ్లు పారదర్శకంగా, స్థిరంగా వ్యవహరించాలి. ముందుగా ఒప్పందం కుదుర్చుకొని అది అమలులో ఉండగా... దానికి విరుద్ధమైన ఒప్పందంలోకి ప్రవేశించడం ఆట ప్రమాణాలను పాటించకపోవడమే.ఇలాంటి ప్రవర్తనను అనుమతించేది లేదు. అందుకు గాను అతడిపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నాం’ అని పీఎస్ఎల్ పాలక మండలి గత మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముజర్బానీ ఏజెంట్ తాజాగా స్పందించాడు.మేము మీలా కాదు‘‘గత ఆరు వారాలుగా మేము బహిరంగంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎందుకంటే మేము ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వాలనుకోవడం లేదు. ఈ విషయంలో పీఎస్ఎల్, పీసీబీ ఇప్పటికే ఘర్షణపూరిత వాతావరణం సృష్టించింది. అయితే, మాకు అలా చేయడం ఇష్టం లేదు.బ్లెస్సింగ్ మీద సోషల్ మీడియాలో పీఎస్ఎల్ అభిమానులు విషం చిమ్ముతున్నారు. అతడిని విమర్శించడం తప్పుకాదు. కానీ విమర్శిస్తున్న వంక మీద ఇష్టారీతిన కామెంట్లు చేస్తే ఇకపై సహించేది లేదు.మీరంతా పిరికిపందలుబ్లెస్సింగ్ ఎక్కడ ఆడినా అక్కడి అభిమానులను ఎంతగానో ప్రేమిస్తాడు. ఫ్యాన్స్ కోసం సమయం కేటాయిస్తాడు. తను అద్భుతమైన వ్యక్తి. వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌గా పరిణతి చెందుతున్నాడు. ఇలాంటి సమయంలో కొందరు సోకాల్డ్ ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో అతడిపై విద్వేష విషం చిమ్ముతున్నారు.మీరంతా పిరికిపందలు. మీకసలు మానవత్వం అన్న పదానికి అర్థం కూడా తెలియదు. అయినా గతంలో.. పీఎస్ఎల్ కాంట్రాక్టు వదిలేసుకున్న ఆటగాళ్లపై పీసీబీ ఎప్పుడూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాదు పీఎస్ఎల్ను వదులుకున్న విషయంలో గతంలో ఏ ఆటగాడు కూడా ఇంతగా విమర్శలకు గురికాలేదు.ఇది మీవైపు నుంచి జరిగిన తప్పుఇందులో అసలు అతడి తప్పేముంది? అసలు అతడు కాంట్రాక్టు మీద సంతకం చేయనేలేదు కదా!.. పరిస్థితులను అర్థం చేసుకుని పీసీబీ నిషేధం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది వారి పాలక మండలి తప్పిదం అని అనుకుంటున్నా. ఇంతకంటే ఎక్కువగా చెప్పాల్సిందేమీ లేదు’’ అని బ్లెస్సింగ్ ముజర్బానీ ఏజెంట్ పీసీబీకి ఘాటు సమాధానం ఇచ్చాడు. కాగా ముజర్బానీ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.చదవండి: లక్నోను మట్టికరిపించిన అనంతరం శ్రేయస్ వ్యాఖ్యలివే..! -
రఫ్ఫాడించిన రింకూ
ఐపీఎల్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు ఈ సీజన్లో గెలుపు రుచి చూసింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో నైట్‌రైడర్స్‌ను విజయం వరించింది. గత నెల 28న లీగ్ ప్రారంభం కాగా... దాదాపు 20 రోజుల తర్వాత ఏడో మ్యాచ్‌లో కోల్‌కతా బోణీ కొట్టింది. మొదట స్పిన్నర్లు సత్తా చాటడంతో రాజస్తాన్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసిన రహానే బృందం... స్వల్ప లక్ష్యఛేదనలోనూ తడబడ్డా కష్ట కాలంలో ‘ఫినిషర్’ రింకూ సింగ్ అజేయ అర్ధశతకంతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన తొలి పోరులో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపొందింది. స్పిన్నర్లు సత్తా చాటడంతో... ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన నైట్‌రైడర్స్ ఆ తర్వాత స్వల్ప స్కోరును ఛేదించేందుకు కూడా తీవ్రంగా ఇబ్బందిపడి చివరి ఓవర్లో గట్టెక్కింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (28 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (29 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తమకు అలవాటు అయిన శైలిలో దూకుడుగా ఆడగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. కోల్‌కతా స్పిన్నర్లు కట్టిపడేయడంతో రాయల్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా... కార్తీక్ త్యాగి ఖాతాలో 3 వికెట్లు చేరాయి. నరైన్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. రింకూ సింగ్ (34 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించాడు. అనుకూల్ రాయ్ (16 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశాడు. రాయల్స్ బౌలర్లలో జడేజా 3 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. చివరి 10 ఓవర్లలో 60/8 రాయల్స్ ఇన్నింగ్స్‌ను రెండు భాగాలుగా చూడొచ్చు. ఓపెనర్లు దంచికొట్టడంతో ఆరంభంలో మెరుపు వేగంతో దూసుకెళ్లిన రాజస్తాన్... 10 ఓవర్లు ముగిసేసరికి 95/1తో నిలిచింది. ఆ తర్వాత కోల్‌కతా స్పిన్నర్లు పట్టు బిగించడంతో పరుగుల రాక గగనం కావడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తదుపరి ఓవర్లలో 60 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ధ్రువ్ జురేల్ (5), పరాగ్ (12), హెట్‌మైర్ (15), డొనోవాన్ ఫెరీరా (7), జడేజా (9) పెవిలియన్‌కు వరుస కట్టారు. 85/6 నుంచి... స్వల్ప లక్ష్యఛేదనలోనూ కోల్‌కతా తడబడింది. ఓపెనర్ సీఫెర్ట్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే క్లీన్ బౌల్డ్ కాగా... కెపె్టన్ అజింక్య రహానే (0) కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. అంగ్క్రిష్ రఘువంశీ (10) విఫలం కాగా... జురేల్ చేసిన మెరుపు స్టంపౌట్‌కు గ్రీన్ (13 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ బాటపట్టాడు. రావ్మన్ పావెల్ (20 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్), రమణ్‌దీప్ (10) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో నైట్‌రైడర్స్ 85/6తో ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ దశలో రింకూ సింగ్ చెలరేగిపోయాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భారీ షాట్లతో లక్ష్యాన్ని కరిగించాడు. అతడికి అనుకూల్ నుంచి చక్కటి సహకారం దక్కింది. కోల్‌కతా విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా... బ్రిజేశ్ వేసిన చివరి ఓవర్లో రింకూ 4, 4, 6తో జట్టును గెలిపించాడు. రింకూ క్యాచ్ మిస్రింకూ సింగ్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను బర్గర్ వదిలేశాడు. అప్పటికే ప్రధాన ఆటగాళ్లందరూ పెవిలియన్ చేరిపోయిన ఆ సమయంలో రింకూ వికెట్ కోల్పోయి ఉంటే... నైట్‌రైడర్స్ పరిస్థితి ఎలా ఉండేదో!1 ఐపీఎల్లో అత్యధిక (12) సార్లు డకౌట్ అయిన ఓపెనర్‌గా రహానే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. పార్థివ్ పటేల్ (11), శిఖర్ ధావన్ (10), గౌతమ్ గంభీర్ (10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) రహానే (బి) నరైన్ 39; వైభవ్ (సి) రమణ్‌దీప్ (బి) వరుణ్ 46; జురేల్ (స్టంప్డ్) సైఫెర్ట్ (బి) వరుణ్ 5; పరాగ్ (బి) వరుణ్ 12; హెట్‌మైర్ (సి) రఘువంశీ (బి) త్యాగి 15; డొనోవాన్ (సి అండ్ బి) నరైన్ 7; జడేజా (సి) గ్రీన్ (బి) త్యాగి 9; ఆర్చర్ (రనౌట్) 8; రవి బిష్ణోయ్ (సి) సీఫెర్ట్ (బి) త్యాగి 0; బ్రిజేశ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–81, 2–97, 3–99, 4–117, 5–124, 6–144, 7–146, 8–146, 9–155. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–37–0; కార్తీక్ త్యాగి 4–0–22–3; గ్రీన్ 2–0–27–0; నరైన్4–0–26–2; వరుణ్ చక్రవర్తి 4–0–14–3; రమణ్‌దీప్ 2–0–26–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (బి) ఆర్చర్ 0; రహానే (సి) జురేల్ (బి) బర్గర్ 0; రఘువంశీ (ఎల్బీ) (బి) జడేజా 10; గ్రీన్ (స్టంప్డ్) జురేల్ (బి) రవి బిష్ణోయ్ 27; పావెల్ (సి) డొనోవాన్ (బి) జడేజా 23; రింకూ సింగ్ (నాటౌట్) 53; రమణ్‌దీప్ (బి) యశ్ రాజ్ 10; అనుకూల్ రాయ్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–0, 2–5, 3–37, 4–52, 5–70, 6–85. బౌలింగ్: ఆర్చర్ 4–0–35–1; బర్గర్ 2–0–20–1; బిష్ణోయ్ 4–0–41–1; యశ్ రాజ్ 4–0–25–1; జడేజా 3–0–8–2; పరాగ్ 1–0–10–0; బ్రిజేశ్ 1.4–0–21–0. -
కేకేఆర్ రాత మార్చిన రింకూ సింగ్!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని సాధించింది. ఐదు పరాజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచిన కేకేఆర్ ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపు రుచి చూసింది. ఒక దశలో 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి చవిచూస్తుందని అంతా భావించారు. కానీ జట్టు వైస్‌కెప్టెన్ రింకూ సింగ్ తన సహచర బ్యాటర్ అనుకుల్ రాయ్‌తో కలిసి వరుస ఓటములతో ఢీలా పడిన కేకేఆర్ రాతను మార్చాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తనకు లభించిన లైఫ్‌ను రింకూ సింగ్ చక్కగా వినియోగించుకున్నాడు. రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను నండ్రీ బర్గర్ వదిలేయడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ ఇదే అని చెప్పొచ్చు. మొత్తంగా రింకూ సింగ్ 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.తనకు లైఫ్ వస్తే ఎంత డేంజర్ అనేది రింకూ సింగ్ రాజస్తాన్ బౌలర్లకు రుచి చూపించాడు.ఈ సీజన్లో ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని రింకూ సింగ్ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో తన విలువను చూపించాడు. అనుకుల్ రాయ్ క్రీజులోకి వచ్చేసరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 85 పరుగులతో ఉంది. విజయానికి ఆరు ఓవర్లలో 69 పరుగులు కావాలి. అనుకుల్ రాయ్ నుంచి మంచి సహకారం అందడంతో రింకూ సింగ్ స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝలిపించాడు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 37 బంతుల్లోనే 76 పరుగుల విన్నింగ్ భాగస్వామ్యం నమోదు చేసి కేకేఆర్‌కు సీజన్లో మొదటి విజయాన్ని అందించారు. మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ మాట్లాడాడు. ‘కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి వస్తుందంటారు. ఇవాళ మ్యాచ్‌లో నా విషయంలో అదే జరిగింది. నిజానికి 8 పరుగుల వద్ద నాకు లైఫ్ లభించినప్పుడు అదృష్టం ఇవాళ నాతోనే ఉందని భావించాను. 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మేము దాదాపు ఓటమి అంచున నిలిచాం. అయితే నాకు లభించిన లైఫ్‌ను రెండో చాన్స్ అనుకుని ఆడాను. అనుకుల్ రాయ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. తొలుత నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాను. ఈ సీజన్లో బ్యాటింగ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యాను. అయితే ఒక పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తూ వచ్చాను. అది ఈరోజు నెరవేరింది. బ్యాటింగ్‌లో నాకు నిర్ధిష్టమైన స్థానమంటూ లేదు. జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇవాళ్టి ఇన్నింగ్స్ పట్ల పూర్తి సంతోషంగా ఉన్నా. సీజన్లో మా జట్టకు ఇదే తొలి విజయం కాబట్టి, మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పొచ్చు. ఇదే ఊపును రాబోయే మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఇక రింకూకు సపోర్ట్ ఇచ్చిన అనుకుల్ రాయల్ (16 బంతుల్లో 29 నాటౌట్) జీవితంలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.SENSATIONAL FINISH 🤯Rinku Singh & Anukul Roy, take a bow! 💜Scorecard ▶️ https://t.co/776nTdODZL#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/HY9R9Kh0lT— IndianPremierLeague (@IPL) April 19, 2026చదవండి: ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్‌కు చుక్కలు -
ఎట్టకేలకు బోణీ కొట్టిన కేకేఆర్.. రాజస్తాన్‌పై విజయం
ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(46), యశస్వి జైశ్వాల్(39) తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎట్టుకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో వరుణ్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు కార్తీక్ త్యాగి మూడు, సునీల్ నరైన్ రెండు వికెట్లు సాధించాడు.గెలిపించిన రింకూ, అనుకుల్అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్లు టిమ్ సీఫర్ట్, రహానే ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత గ్రీన్(27) కాస్త దూకుడుగా ఆడి రాజస్తాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు.దూకుడుగా ఆడిన గ్రీన్ కూడా బిష్ణోయ్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. వెంటనే రఘువంశీ కూడా ఔటయ్యాడు. ఈ క్రమంలో రింకూ సింగ్, పావెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పావెల్(23) కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రమణ్‌దీప్(10) ప్రభావం చూపలేకపోయాడు.దీంతో కేకేఆర్‌కు మరో ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ రింకూ సింగ్(53 నాటౌట్), అనుకుల్ రాయ్(29 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు తొలి విజయాన్ని అందించారు. ఫలితంగా 156 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. -
అజింక్య రహానే చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానే ఖాతా తెవకుండానే పెవిలియన్‌కు చేరాడు. రాజస్తాన్ పేసర్ నండ్రీ బర్గర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రహానే ఔటయ్యాడు.అంతకుముందు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రహానే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఈ వెటరన్ ఆటగాడు ఓ అవాంఛనీయ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఓపెనర్‌గా రహానే నిలిచాడు. రహానే ఇప్పటివరకు 12 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్ధివ్ పటేల్(11) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో పార్ధివ్‌ను రహానే అధిగమించాడు.ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ఓపెనర్లు వీరే12 - అజింక్య రహానే*11 - పార్థివ్ పటేల్10 - శిఖర్ ధావన్10 - గౌతమ్ గంభీర్9 - డేవిడ్ వార్నర్ -
కేకేఆర్‌కు తొలి విజయం.. రాజస్తాన్‌పై గెలుపు
IPL 2026 KKR vs RR Live updates: ఐపీఎల్-2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 156 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయింది.కేకేఆర్ విజయంలో రింకూ సింగ్(53 నాటౌట్), అనుకుల్ రాయ్(29 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్,బర్గర్, బిష్ణోయ్, యశ్‌రాజ్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.తీవ్ర ఉత్కంఠకేకేఆర్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్(37), అనుకుల్ రాయ్(19) ఉన్నారు.కేకేఆర్ స్కోరెంతంటే?16 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 116/6. కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 40 పరుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్(26), అనుకుల్ రాయ్(13) ఉన్నారు.కేకేఆర్ ఆరో వికెట్ డౌన్కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రమణ్‌దీప్.. యశ్‌రాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 87/6కేకేఆర్ ఐదో వికెట్ డౌన్70 పరుగుల వద్ద కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన పావెల్.. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేకేఆర్ విజయానికి 54 బంతుల్లో 82 పరుగులు కావాలి. 11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 74/5కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రఘువంశీ.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు.కేకేఆర్ మూడో వికెట్ డౌన్37 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్.. రవి బిష్ణయ్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే(0) మరోసారి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.టిమ్ సీఫెర్ట్ గోల్డెన్ డక్రాజస్తాన్తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో టిమ్ సీఫెర్ట్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.చెలరేగిన కేకేఆర్ బౌలర్లు.. రాజస్తాన్ స్కోరెంతంటే?ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జైశ్వాల్(39) రాణించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్ రెండు వికెట్లు సాధించాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు18 ఓవర్ వేసిన కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత రవీంద్ర జడేజా(9), షిమ్రాన్ హెట్‌మైర్(15), బిష్ణోయ్(0) ఔటయ్యాడు.రాజస్తాన్ ఐదో వికెట్ డౌన్124 పరుగుల వద్ద రాజస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ఫెరీరా.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్117 పరుగుల వద్ద రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో షిమ్రాన్ హెట్‌మైర్ వచ్చాడు. 13 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 109/3రాజస్తాన్ రెండో వికెట్ డౌన్97 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ధ్రువ్ జురుల్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్81 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ధ్రువ్ జురెల్ వచ్చాడు.6 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 63/06 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్ సూర్యవంశీ(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), యశస్వి జైశ్వాల్(21) ఉన్నారు.3 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 20/03 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్ సూర్యవంశీ(11), యశస్వి జైశ్వాల్(9) ఉన్నారు.ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. హెట్‌మైర్, బ్రిజేష్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. కేకేఆర్ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్యా రహానే(కెప్టెన్), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చకరవర్తిఇంపాక్ట్ సబ్‌లు: మనీష్ పాండే, ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ, తేజస్వి సింగ్, నవదీప్ సైనీరాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్ఇంపాక్ట్ సబ్స్: సందీప్ శర్మ, శుభమ్ దూబే, లువాన్-డ్రే ప్రిటోరియస్, రవి సింగ్, యష్ పుంజా -
మీ కెప్టెన్, వైస్ కెప్టెన్ శుద్ధ దండగ: మాజీ క్రికెటర్ ఫైర్
కోల్‌కతా నైట్ రైడర్స్ కథ మారలేదు. ఐపీఎల్-2026లో కేకేఆర్ ఐదో ఓటమిని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఇంత వరకు ఈ సీజన్లో ఇప్పటి వరకు గెలుపున్నదే ఎరుగని ఏకైక జట్టుగా కేకేఆర్ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కేకేఆర్ నాయకత్వ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సారథి అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రింకూ సింగ్ జట్టులో శుద్ధ దండగ అంటూ మండిపడ్డాడు. కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో రహానే డకౌట్ కాగా.. రింకూ ఒకే ఒక్క పరుగు చేశాడు.వీరిద్దరి వైఫల్యం కారణంగా మిగతా బ్యాటర్ల మీద భారం పడగా.. వాళ్లు ఒత్తిడిలో చిత్తయ్యారు. రూ. 25 కోట్ల ఆటగాడు కామెరాన్ గ్రీన్ 79 పరుగులతో కేకేఆర్ టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ కేకేఆర్ తీరును విమర్శించాడు.మీ కెప్టెన్, వైస్ కెప్టెన్ శుద్ధ దండగ‘‘వాళ్లు కనీసం 200 పరుగులైనా చేసి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లు. ఫైనల్ ఓవర్లలో కేకేఆర్ పూర్తిగా తడబడింది. ఇక కెప్టెన్ అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రింకూ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. అసలు ఏం చేస్తున్నామన్న సోయి కూడా ఉన్నట్లు కనిపించలేదు. ఇద్దరూ ఫామ్‌లేమితో సతమతమవుతున్నారు. జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్ శుద్ధ దండగ అయినప్పుడు ఇక జట్టు సభ్యులు ఎలా ఆడతారో మనం అర్థం చేసుకోవచ్చు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.దారుణంగా విఫలమవుతున్న రింకూకాగా అహ్మదాబాద్‌లో గుజరాత్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో రహానే ఇప్పటికి 152 పరుగులు చేయగా.. రింకూ కేవలం 79 పరుగులే చేశాడు.చదవండి: నాకు అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్!2⃣ points in the bag ✅Hat-trick of wins ✅@gujarat_titans wrap a fantastic all-round show at home 🥳🏠 Scorecard ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/mVnSg3ZI5p— IndianPremierLeague (@IPL) April 17, 2026 -
అందుకే IPL కాదని.. PSLలో ఆడుతున్నా: మొయిన్ అలీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అమ్ముడుపోని విదేశీ క్రికెటర్లలో చాలా మంది పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో చేరతారు. ఒకవేళ మళ్లీ ఐపీఎల్ నుంచి గనుక ఆఫర్ వస్తే భారత్‌కు వచ్చేస్తారు. తాజా ఎడిషన్‌లో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ, శ్రీలంక కెప్టెన్ దసున్ షనక, ఆస్ట్రేలియా స్టార్ స్పెన్సర్ పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరారు.నాకిప్పుడు 38 ఏళ్లుఅయితే, తాను మాత్రం ఈ కోవకు చెందినవాడిని కాదంటున్నాడు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ మొయిన్ అలీ (Moeen Ali). తాను కావాలనే IPLను కాదని PSLను ఎంచుకున్నట్లు తెలిపాడు. ‘‘నాకిప్పుడు 38 ఏళ్లు. అయినప్పటికీ నేనింకా క్రికెట్ ఆడాలనే అనుకుంటున్నాను. వీలైనంతగా నా కెరీర్‌ను పొడిగించుకోవాలని భావిస్తున్నాను.షార్ట్‌టైమ్ టోర్నీకరాచీ కింగ్స్‌లో నాకు ఈ స్వేచ్ఛ దొరికింది. ముఖ్యంగా పీఎస్ఎల్ తక్కువ వ్యవధిలోనే ముగిసిపోయే టోర్నీ. కాబట్టి ఆటగాడిగా నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూనే కుటుంబానికి తగిన సమయం కేటాయించే వీలు దొరుకుతుంది.గతేడాది నేను ఐపీఎల్లో ఆడాను. అయితే సగం మ్యాచ్‌లలో కూడా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బహుశా రెండుసార్లు నేను బ్యాటింగ్ చేసి ఉంటాను. నిజానికి నాకు బ్యాటింగ్ చేయడం ఇష్టం. నా కెరీర్ చరమాంకంలోనూ ఎక్కువగా బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా.అయితే, ఏ జట్టులోనైనా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుకు గ్యారెంటీ ఉండదు. పీఎస్ఎల్లో కూడా అంతే. అయితే, ఆటను వీలైనంతగా ఆస్వాదించాలని భావిస్తున్నా. ఒక్కసారైనా పీఎస్ఎల్ ఆడాలని అనుకున్నా.షెడ్యూల్ క్లాష్ కానీ.. దురదృష్టవశాత్తూ ఐపీఎల్‌తో పీఎస్ఎల్ షెడ్యూల్ క్లాష్ అవుతోంది. అందుకే ఈ సారి ఐపీఎల్‌కు దూరమయ్యాను’’ అని మొయిన్ అలీ తన నిర్ణయానికి గల కారణాలు వెల్లడించాడు.కాగా ఐపీఎల్- 2025 మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఈ ఏడాది పీఎస్ఎల్లో కరాచీకి ఆడుతున్న అతడు రూ. 2 కోట్లకు పైగా జీతం అందుకుంటున్నాడు. కాగా ఈ సీజన్లో అతడు ఇప్పటికి 126 పరుగులు చేసి.. మూడు వికెట్లు తీయగలిగాడు. ఇక 2024లో మొయిన్ అలీ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి -
కోల్ ‘కథ’ మారలేదు
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన రహానే సారథ్యంలోని నైట్‌రైడర్స్... మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో కోల్‌కతాను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. పాతిక కోట్ల విలువైన ప్లేయర్ కామెరాన్ గ్రీన్ (55 బంతుల్లో 79; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఎట్టకేలకు రాణించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. రషీద్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్న గ్రీన్ భారీ షాట్లతో పరుగులు రాబట్టాడు. గుజరాత్ ఫీల్డింగ్ లోపాలు కూడా అతడికి కలిసి రావడంతో ఈ సీజన్లో తొలి అర్ధశతకం తన పేరిట లిఖించుకున్నాడు. పావెల్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ అజింక్యా రహానే (0), రఘువంశీ (8), సీఫెర్ట్ (19), అనుకూల్ రాయ్ (9), రింకూ సింగ్ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, అశోక్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (50 బంతుల్లో 86; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో టైటాన్స్‌కిది మూడో విజయం. శుబ్‌మన్ దూకుడు... ఓపెనర్లు చెలరేగడంతో గుజరాత్‌కు శుభారంభం దక్కింది. తొలి ఓవర్లో ఓ ఫోర్ కొట్టిన శుబ్‌మన్, రెండో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో గిల్, సాయి సుదర్శన్ (16 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్) కలిసి 3 సిక్స్‌లు కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా గిల్ దూకుడు కొనసాగడంతో పవర్‌ప్లేలో గుజరాత్ 71 పరుగులు చేసి సుదర్శన్ వికెట్ కోల్పోయింది. వచ్చీ రావడంతోనే 4, 6, 4 కొట్టిన బట్లర్ (15 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)... వరుణ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ క్రమంలో గిల్ 27 బంతుల్లో హాఫ్‌సెంచరీ సాధించాడు. బట్లర్, సుందర్ (13) వెనుదిరిగినా... ఛేదించాల్సిన లక్ష్యం పెద్దది కాకపోవడంతో గుజరాత్‌కు ఇబ్బంది లేకుండా పోయింది. సెంచరీ చేసేలా కనిపించిన గిల్... గ్రీన్ పట్టిన చక్కటి క్యాచ్‌కు పెవిలియన్ బాటపట్టాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సైఫెర్ట్ (సి) ఫిలిప్స్ (బి) రబాడ 19; రహానే (సి) రబాడ (బి) సిరాజ్ 0; రఘువంశీ (సి) బట్లర్ (బి) రబాడ 8; గ్రీన్ (సి) బట్లర్ (బి) రషీద్ 79; పావెల్ (సి) సిరాజ్ (బి) అశోక్ 27; రాయ్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 9; రింకూ (సి) బట్లర్ (బి) రబాడ 1; రమణ్‌దీప్ (సి) సిరాజ్ (బి) అశోక్ 17; నరైన్ (సి) ఫిలిప్స్ (బి) సిరాజ్ 0; కార్తీక్ (రనౌట్) 6; వైభవ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–5, 2–21, 3–32, 4–87, 5–147, 6–148, 7–165, 8–166, 9–173, 10–180. బౌలింగ్: సిరాజ్ 4–0–23–2; రబాడ 4–0–29–3; ప్రసిధ్ 4–0–32–1; అశోక్ 4–0–45–2; రషీద్ 4–0–44–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) కార్తీక్ (బి) నరైన్ 22; గిల్ (సి) గ్రీన్ (బి) అరోరా 86; బట్లర్ (సి) గ్రీన్ (బి) వరుణ్ 25; సుందర్ (సి) కార్తీక్ (బి) వరుణ్ 13; ఫిలిప్స్ (సి) రింకూ (బి) రమణ్‌దీప్ 19; తెవాటియా (నాటౌట్) 7; షారుక్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–57, 2–95, 3–141, 4–158, 5–177. బౌలింగ్: వైభవ్ 4–0–35–1; కార్తీక్ 4–0–40–0; అనుకూల్ రాయ్ 3–0–37–0; నరైన్ 4–0–28–1; వరుణ్ 4–0–34–2; రమణ్‌దీప్ 0.4–0–5–1. -
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.కెప్టెన్ గిల్ (86) సూపర్ ఇన్నింగ్స్‌తో గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. బట్లర్ (25), సాయి సుదర్శన్ (22) పర్వాలేద నిపించారు. గిల్ ఔటయ్యాక కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (17), రాహుల్ తెవాటియా (7 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్, రమన్‌దీప్, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (79) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గ్రీన్ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్ల పడగొట్టారు. ఈ విజయంతో గుజరాత్ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా, కేకేఆర్ వరుసగా ఐదో పరాజయంతో అట్టడుగు స్థానంలో నిలిచింది.2⃣ points in the bag ✅Hat-trick of wins ✅@gujarat_titans wrap a fantastic all-round show at home 🥳🏠 Scorecard ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/mVnSg3ZI5p— IndianPremierLeague (@IPL) April 17, 2026 -
IPL 2026: ఉత్కంఠపోరులో గుజరాత్ విజయం
Gujarat Titans Vs KKR Updates..ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గిల్ 86 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్, రమన్‌దీప్, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. కేకేఆర్ 180 పరుగులకు ఆలౌటైంది. కామెరున్ గ్రీన్ (79) పరుగులతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్లు పడగొట్టారు.86 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ వైభవ్ అరోరా బౌలింగ్‌లో కామెరున్ గ్రీన్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. గిల్ 81, పిలిప్స్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వాషింగ్టన్ సుందర్ (13) వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వెనుదిరిగాడు.గిల్ అర్థశతకం.. గుజరాత్ 101/2కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అర్థశతకం సాధించాడు. గిల్ 27 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అంతకముందు గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన జాస్ బట్లర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్కేకేఆర్తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన సాయి సుదర్శన్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో కార్తిక్ త్యాగికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది.దంచికొడుతున్న గుజరాత్181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఛేదనను దూకుడుగిఆ ఆరంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (22), గిల్ (34) క్రీజులో ఉన్నారు.గుజరాత్ టార్గెట్ 181 పరుగులుగుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ 180 పరుగులకు ఆలౌటైంది. కామెరున్ గ్రీన్ (79) పరుగులతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. రోవ్‌మెన్ పావెల్ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఒక దశలో 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులతో పటిష్టంగా కనిపించిన కేకేఆర్ చివరి ఐదు ఓవర్లలో కేవలం 32 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్లు పడగొట్టారు.16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అంతకముందు రింకూ సింగ్ రబాడ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు.ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ 147 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన అనుకుల్ రాయ్ ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కామెరున్ గ్రీన్ 75 పరుగులతో బ్యాటింగ్ ఆడుతున్నాడు.87 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. పావెల్ (27).. అశోక్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.8 ఓవర్లలో కేకేఆర్ 59/38 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. పావెల్ (21), గ్రీన్ (8) క్రీజులో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన సీఫెర్ట్ రబాడ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్8 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ రబాడ బౌలింగ్‌లో జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేకేఆర్ 2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది.రహానే గోల్డెన్ డక్గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే సిరాజ్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్‌ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫిన్ అలెన్ స్థానంలో టిమ్ సీఫెర్ట్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్ మాత్రం జట్టులో ఏ మార్పు చేయలేదు. ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటి పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దు కావడంతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ముఖాముఖి పోరులో నాలుగుసార్లు తలపడగా గుజరాత్ మూడుసార్లు, కేకేఆర్ ఒకసారి గెలుపొందాయి.కోల్‌కతా నైట్ రైడర్స్: టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్),వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ. -
రహానేపై వేటు.. కేకేఆర్‌కు కొత్త కెప్టెన్!?
ఐపీఎల్-2026లో మూడు సార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు కేకేఆర్ బోణీ కొట్టలేదు. 5 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ నాలుగింట ఓటమి చవిచూడగా.. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో కోల్‌కతా జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేపై తీవ్రస్ధాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రహానే వ్యక్తిగత ప్రదర్శనల పరంగా ఫర్వాలేదన్పిస్తున్నప్పటికి, కెప్టెన్సీ పరంగా జట్టును విజయ పథంలో నడిపించలేకపోతున్నాడు. తాజాగా రహానే కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్ క్రిష్ణమచారి శ్రీకాంత్ నిప్పులు చెరిగాడు. రహానేను తప్పించి కేకేఆర్ జట్టు పగ్గాలను స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అప్పగించాలని శ్రీకాంత్ సూచించాడు. ఈ ఏడాది సీజన్లో రహానే ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు 152 పరుగులు సాధించాడు. అయితే పవర్ ప్లే తర్వాత తన దూకుడును రహానే కొనసాగించలేకపోతున్నాడు."రహానేకు మరో ఒకటి లేదా రెండు అవకాశాలు ఇవ్వండి. అప్పటికీ మార్పు రాకపోతే అతడిని జట్టు నుంచి తప్పించి, సీజన్ మధ్యలోనే సునీల్ నరైన్‌ను కెప్టెన్ చేయండి. రహానే అవసరం ఉంటేనే దిగాలి. లేదంటే అతడు కేవలం కెప్టెన్‌గా మాత్రమే వ్యవహరించాలి. ఓపెనర్‌గా సక్సెస్ కాలేకపోతున్నాడు. పవర్‌ప్లే తర్వాత పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. మిడిలార్డర్‌కు కూడా సరిపోడు. అసలు రహానేను కెప్టెన్ చేయడమే తప్పుడు నిర్ణయం. కానీ ఇప్పుడు సీజన్ మధ్యలో తొలగించే ధైర్యం మేనేజ్మెంట్కు ఉందా? కేకేఆర్ ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్‌లను కూడా జట్టు నుంచి తప్పించాలి.వారిద్దరి స్ధానంలో రచిన్ రవీంద్ర, పతిరానాలకు అవకాశమివ్వాలి. అప్పుడు రచిన్ రవీంద్ర, రహానేలు ఇన్నింగ్స్‌ను ప్రారంభించవచ్చు. టీమ్ కాంబనేషన్ బ్యాలన్స్డ్గా ఉంటుంది. కేకేఆర్ ఆటగాళ్ల కంటే వారి సపోర్ట్ స్టాపే మెరుగ్గా కనిపిస్తున్నారు" అని శ్రీకాంత్ ఎద్దేవా చేశాడు. కాగా కేకేఆర్ శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది.చదవండి: IPL 2026: వరుస ఓటములు.. హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం! -
‘గోపాల్‌గంజ్ కా రబాడ’
సాక్షి క్రీడా విభాగం: రెండేళ్ల క్రితం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. అయితే ఆ సీజన్లో జట్టులో భాగంగా ఉన్న పేసర్ సాకిబ్ హుస్సేన్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఫైనల్ మ్యాచ్ తర్వాత సాకిబ్ తల్లిదండ్రులు జట్టు కోచ్ గౌతమ్ గంభీర్‌ను కలిశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడిన గంభీర్ ‘మీ వాడిలో చాలా ప్రతిభ ఉంది. జట్టు కూర్పులో భాగంగా అవకాశం ఇవ్వలేకపోయాం కానీ మున్ముందు అతను ఐపీఎల్లో తప్పక రాణిస్తాడు’ అని భరోసానిచ్చాడు. తర్వాతి సీజన్లో కేకేఆర్ అతడిని కొనసాగించకపోగా, ఈ ఏడాది సన్‌రైజర్స్ అతడిని ఎంచుకుంది. అతి సాధారణ నేపథ్యం ఉన్నా... కేవలం శ్రమ, పట్టుదలతో దూసుకొచ్చిన సాకిబ్ గాథ స్ఫూర్తిదాయకం. పేదరికం నుంచి వచ్చి... బిహార్‌లో బాగా వెనుకబడిన జిల్లాల్లో గోపాల్‌గంజ్ కూడా ఒకటి. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన సాకిబ్‌కు ఎప్పటికైనా ఆర్మీలో చేరాలనేది కోరిక. అందుకే 15 ఏళ్ల వయసులో స్థానిక ఆర్మీ గ్రౌండ్లో రన్నింగ్, ఎక్సర్సైజ్లు అలవాటుగా మార్చుకున్నాడు. అయితే తన స్నేహితుల ద్వారా క్రికెట్‌పై కొంత ఆసక్తి పెంచుకొని టెన్నిస్ బంతితో బౌలింగ్ ప్రారంభించిన అతను అదే బంతిపై పట్టు పెంచుకొని రాటుదేలాడు. స్థానికంగా జరిగే లేదా దాదాపు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నాకు వెళ్లి టోర్నీలు ఆడి వచ్చేవాడు. మ్యాచ్ ఆడిన రోజు రూ.500–1000 వరకు లభించేవి.తమ టీమ్‌కు వరుస విజయాలు అందిస్తున్న సాకిబ్ను అంతా ‘గోపాల్‌గంజ్ కా రబాడ’ అని పిలిచేవాళ్లు. మరోవైపు వ్యవసాయదారుడు అయిన తండ్రి ఆదాయం చాలా స్వల్పం. క్రికెటర్‌గా శిక్షణ అందించే స్థాయి లేదు. ఇదే సమయంలో అతనికి మోకాలికి దెబ్బ తగలడంతో వ్యవసాయం కూడా కష్టంగా మారిపోయింది. ఇలాంటి స్థితిలో సాకిబ్ తెచ్చే చిన్న మొత్తం కూడా కుటుంబానికి ఉపయోగపడ్డాయి. క్రికెట్లో ఎదగాలని ప్రయతి్నస్తున్న సమయంలో రూ. 10 వేల విలువైన బౌలింగ్ స్పైక్స్ కొనే స్థోమత లేకపోగా...ఏదైతే అది అవుతుందని తల్లి తన వద్ద ఉన్న కాస్త నగలు అమ్మి స్పైక్స్ కొనిచ్చింది. లోపాలు సరిదిద్దుకొని... సాకిబ్ గురించి బాగా విన్న పట్నాలోని జెన్ నెక్ట్స్ అకాడమీ కోచ్ రాబిన్ సింగ్ ఈ కుర్ర పేసర్‌కు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యాడు. కోచ్ మార్గనిర్దేశనంలో అతని బౌలింగ్ ఎంతో మెరుగైంది. ఈ క్రమంలో వరుసగా వేర్వేరు వయో విభాగాల్లో అవకాశాలు వచ్చాయి. అండర్–19 స్థాయిలో ఆకట్టుకున్న తర్వాతి 18 ఏళ్ల వయసులో ముస్తాక్ అలీ ట్రోఫీలో బిహార్ తరఫున టి20ల్లో అరంగేట్రం జరిగింది. అయితే నిలకడ లేక జట్టులో స్థానం కోల్పోయాడు. కానీ ఎరుపు బంతితో మరింత కష్టపడిన సాకిబ్ 2024లో తొలి రంజీ మ్యాచ్ ఆడాడు.ఇక్కడా కర్ణాటకపై ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 నోబాల్స్ వేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కానీ తన లోపాల నుంచి పాఠాలు నేర్చుకొని అతను ఎంతో మెరుగయ్యాడు. టి20ల్లో బౌలింగ్‌పై మరింత దృష్టి పెట్టిన అతనికి చెన్నై నెట్ బౌలర్‌గా అవకాశం లభించింది. ఆ తర్వాత కోల్‌కతా టీమ్‌లోకి తీసుకుంది. మ్యాచ్ ఆడలేకపోయినా... ఈ అనుభవాలు అతనికి తన ఆటను తీర్చిదిద్దుకునేందుకు పనికొచ్చాయి. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకిబ్ బౌలింగ్‌లో వైవిధ్యం కనిపించింది. ఆరంభంలో, డెత్‌లో కూడా పదునైన బంతులు వేయగల నైపుణ్యాన్ని అతను ప్రదర్శించాడు. ఇదే ఆటను కొనసాగిస్తే మున్ముందు సాకిబ్‌కు మంచి భవిష్యత్తు ఉండవచ్చు. -
చెన్నై గెలుపు చమక్
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌దే పైచేయి అయింది. సొంతగడ్డ చెపాక్‌లో అసాధారణ ప్రదర్శన లేకపోయినా... ప్రత్యర్థితో పోలిస్తే మెరుగైన ఆటతీరు కనబర్చిన సీఎస్కే మరో రెండు పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. సామ్సన్, బ్రెవిస్ తమ బ్యాటింగ్‌తో చెప్పుకోదగ్గ స్కోరును అందించగా, బౌలింగ్‌లో నూర్ అహ్మద్ మూడు వికెట్లతో జట్టు విజయానికి బాటలు వేశాడు. మరోవైపు కోల్‌కతా ప్రతీ మ్యాచ్‌కు దిగజారుతున్న ఆటతో అట్టడుగున తాము నిలిచిన స్థానాన్ని మరింత స్థిరపర్చుకున్నట్లయింది. అన్ని రంగాల్లో విఫలమైన మాజీ చాంపియన్ ఐదు మ్యాచ్‌ల తర్వాత కూడా ఒక్కటీ గెలవలేక చతికిలపడింది. చెన్నై: వరుసగా మూడు ఓటముల తర్వాత కోలుకొని గత మ్యాచ్‌లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు ఐపీఎల్ 19వ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో చెన్నై 32 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (32 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), బ్రెవిస్ (29 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 38; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నూర్ అహ్మద్ (3/21) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. కెప్టెన్ మళ్లీ విఫలం... అరోరా వేసిన ఇన్నింగ్స్ తొలి మూడు బంతులను ఫోర్లుగా మలచి సామ్సన్ శుభారంభం అందించగా, మరోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7) వైఫల్యం కొనసాగింది. ఆ తర్వాత గ్రీన్ ఓవర్లో మాత్రే చెలరేగిపోయాడు. రెండో బంతికి ఫోర్ కొట్టిన అతను, చివరి మూడు బంతుల్లో వరుసగా 4, 6, 6, బాదాడు. అరోరా ఓవర్లో కూడా తొలి మూడు బంతుల్లో వరుసగా ఫోర్లు కొట్టిన మాత్రే అదే ఓవర్ చివరి బంతికి వెనుదిరిగాడు.పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 72/2కు చేరింది. ఈ దశలో సామ్సన్, బ్రెవిస్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే త్యాగి బౌలింగ్‌లో అద్భుత సిక్స్ కొట్టిన సామ్సన్ 148.1 కిలోమీటర్ల వేగంతో దూసుకొచి్చన తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. అనంతరం వరుణ్, అరోరా ఓవర్లలో కలిపి సర్ఫరాజ్ ఖాన్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), బ్రెవిస్ 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35 పరుగులు రాబట్టడంతో జట్టు కోలుకుంది. అయితే వీరిద్దరు 9 పరుగుల వ్యవధిలో అవుట్ కాగా... సీఎస్కే చివరి 4 ఓవర్లలో కేవలం 3 ఫోర్లతో 30 పరుగులు మాత్రమే సాధించగలిగింది! టపటపా... ఛేదనలో కోల్‌కతా పూర్తిగా తడబడింది. ఫిన్ అలెన్ (1) మళ్లీ విఫలం కాగా, సునీల్ నరైన్ (17 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పవర్‌ప్లేలో కేకేఆర్ 36 పరుగులు మాత్రమే సాధించింది. ప్రత్యర్థి పవర్‌ప్లేతో పోలిస్తే ఇవి సగం పరుగులు మాత్రమే! ఇక్కడే జట్టు విజయావకాశాలకు దెబ్బ పడింది. ఆ తర్వాత కూడా టీమ్ ఏమాత్రం కోలుకోలేకపోయింది. నూర్ వరుస బంతుల్లో రహానే (22 బంతుల్లో 28; 2 సిక్స్‌లు), గ్రీన్ (0)లను అవుట్ చేశాడు. నూర్ తర్వాతి ఓవర్లో రింకూ సింగ్ (6) కూడా డగౌట్ చేరడంతో కోల్‌కతా గెలుపు ఆశలు ముగిసిపోయాయి. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) త్యాగి 48; రుతురాజ్ (సి) పావెల్ (బి) రాయ్ 7; మాత్రే (సి) రమణ్‌దీప్ (బి) అరోరా 38; బ్రెవిస్ (సి) అరోరా (బి) త్యాగి 41; సర్ఫరాజ్ (బి) నరైన్ 23; దూబే (నాటౌట్) 13; ఒవర్టన్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–25, 2–72, 3–111, 4–162, 5–171. బౌలింగ్: అరోరా 4–0–55–1, గ్రీన్ 2–0– 30–0, అనుకూల్ 3–0–21–1, నరైన్ 4–0–21–1, వరుణ్ 3–0–26–0, త్యాగి 4–0–35–2. కోల్‌కతానైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: అలెన్ (సి) దూబే (బి) కంబోజ్ 1; నరైన్ (సి) గుర్జప్నీత్ (బి) ఖలీల్ 24; రహానే (సి) రుతురాజ్ (బి) నూర్ 28; రఘువంశీ (సి) బ్రెవిస్ (బి) హొసీన్ 27; రింకూ (సి) దూబే (బి) నూర్ 6; గ్రీన్ (బి) నూర్ 0; పావెల్ (నాటౌట్) 31; రమణ్‌దీప్ (సి) సర్ఫరాజ్ (బి) కంబోజ్ 35; రాయ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–13, 2–29, 3–79, 4–85, 5–85, 6–90, 7–153. బౌలింగ్: ఖలీల్ 3.5–0–24–1, కంబోజ్ 4–0– 32–2, హొసీన్ 4–0–26–1, నూర్ 4–0– 21–3, గుర్జప్నీత్ 1.1–0–23–0, ఒవర్టన్ 3–0–32–0. -
IPL 2026: నల్ల రిబ్బన్లతో బరిలోకి.. కారణమదే!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా 22వ మ్యాచ్‌లో సీఎస్కే, కేకేఆర్ తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు ఇరుజట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడం ఆసక్తి కలిగించింది. అయితే ఇరుజట్ల ఆటగాళ్లు ఏకకాలంలో నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడం వెనుక ఒక కారణముంది. గత వారం (ఏప్రిల్ 9న) భారత అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, చెన్నై క్రికెట్ దిగ్గజం దొరైస్వామి గోపీనాథ్ (96) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా సీఎస్కే, కేకేఆర్ ఫ్రాంచైజీలు నివాళి ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే గోపీనాథ్ మరణం పట్ల గౌరవసూచకంగా ఆటగాళ్లంతా నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. కాగా 1951లో ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గోపీనాథ్ తన కెరీర్లో భారత్ తరపున 8 టెస్టులు ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మద్రాస్ తరపున ఆడన 83 మ్యాచ్‌లు ఆడారు. గోపీనాథ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే మెరుపుగలు మెరిపించాడు. తన అరంగేట్ర టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొదటి ఇన్నింగ్స్‌లో 50 (నాటౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆయన 8 మ్యాచ్‌లలో 242 పరుగులు చేశారు. .@ChennaiIPL and @KKRiders are wearing black armbands as a mark of respect to former India cricketer C.D. Gopinath, who breathed his last on April 9.#TATAIPL | #CSKvKKR pic.twitter.com/Zv9NxNjAp6— IndianPremierLeague (@IPL) April 14, 2026 -
KKR పేసర్‌పై రెండేళ్ల నిషేధం
జింబాబ్వే క్రికెటర్ బ్లెస్సింగ్ ముజర్‌బానీపై నిషేధం పడింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆడకుండా పాక్ క్రికెట్ బోర్డు అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. చాలా మంది ఆటగాళ్ల మాదిరే ముజర్బానీ ఇటు ఐపీఎల్.. అటు పీఎస్ఎల్ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు.కానీ రెండు లీగ్‌లకు సంబంధించిన ఫ్రాంఛైజీలలో ఒక్కటి కూడా ముజర్బానీని కొనుగోలు చూసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అదే సమయంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే అదరగొట్టింది.ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడుఏకంగా ఆస్ట్రేలియాను ఓడించి సూపర్-8లో అడుగుపెట్టింది. ఇందులో ముజర్బానీది కీలక పాత్ర. ఆసీస్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్ ఫ్రాంఛైజీ ఇస్లామాబాద్ యునైటెడ్ షమార్ జోసెఫ్ స్థానంలో ముజర్బానీతో ఒప్పందం కుదుర్చుకుంది.అయితే, అనూహ్యంగా ముజర్‌బానీకి ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి ఆఫర్ వచ్చింది. భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ తమ జట్టు నుంచి బంగ్లా స్టార్ ముస్తాఫిజుర్‌ను తొలగించింది. అతడి స్థానంలో మరో ఫాస్ట్‌బౌలర్ ముజర్బానీని జట్టులో చేర్చుకోవాలని భావించింది.పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లోఇందుకు సమ్మతించిన ముజర్బానీ.. పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో కేకేఆర్‌తో చేరాడు. దీంతో పాక్ బోర్డు అతడిపై చర్యలు చేపట్టింది. ‘‘ఫ్రాంఛైజీ ఆధారిత క్రికెట్ ఆడేవాళ్లు పారదర్శకత ప్రదర్శించాలి. ప్రొఫెషనల్‌గా వ్యవహరించాలి.ఒకేసారి రెండు జట్లతో ఒప్పందం చేసుకోవడం.. ఒక జట్టు కోసం మరో జట్టును వీడటం సరికాదు. ఇలాంటి ప్రవర్తనను చూసీచూడనట్లు వదిలివేయలేము. ఫ్రాంఛైజీల విశ్వసనీయత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రెండేళ్ల నిషేధం విధిస్తున్నాం’’ అని పీఎస్ఎల్ పేర్కొంది. కాగా ముజర్బానీతో పాటు దసున్ షనక, స్పెన్సర్ జాన్సన్ కూడా ఈ ఏడాది పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరిన సంగతి తెలిసిందే. వీరిపై కూడా నిషేధం పడే అవకాశం ఉంది.చదవండి: BCCI: సూర్యకుమార్ యాదవ్‌పై వేటు! -
నాన్న త్యాగం...ధోనిపై అభిమానం
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ ముకుల్ చౌదరీ గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఏడు సిక్సర్లతో మోత మోగించి తన జట్టును గెలిపించాడు. అయితే ఈ ఏడింటిలో తాను కొట్టిన మొదటి సిక్సర్ అన్నింటికంటే ఎక్కువగా నచ్చిందని ముకుల్ మ్యాచ్ తర్వాత చెప్పాడు. వైభవ్ అరోరా వేసిన 17వ ఓవర్లో ఈ సిక్స్ వచ్చింది. అరోరా వేసిన యార్కర్‌ను హెలికాప్టర్ షాట్‌తో లాంగాన్ మీదుగా సిక్స్ బాదిన ముకుల్ తాను ఆరాధించే ధోనిని గుర్తుకు తెచ్చాడు. ధోనిపై ఇష్టంతో క్రికెట్లోకి వచ్చిన ముకుల్ ఇప్పుడు ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌తో స్టార్‌గా మారిపోయాడు. – సాక్షి క్రీడా విభాగంరాజస్తాన్కు చెందిన ముకుల్ ఐపీఎల్లో తన తొలి సీజన్ ఆడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో 14 పరుగులకే పరిమితమైన అతను రెండో మ్యాచ్‌లో 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆడిన ఐదు బంతుల్లోనూ అతను కాస్త తడబడ్డాడు. అయితే ఎక్కువగా ఆందోళన చెందవద్దని, నచ్చినట్లుగా ఆడమని కెపె్టన్ రిషభ్ పంత్ ధైర్యాన్నందించాడు. దాంతో కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ముకుల్ అన్నాడు. ‘ఐదు మ్యాచ్‌లు ఆడినా 50 మ్యాచ్‌లు ఆడినా ఎవరిపైనైనా ఒత్తిడి సహజం. అందులోనూ నేను తొలిసారి ఐపీఎల్లో ఆడుతున్నాను. కాబట్టి జట్టు మనపై నమ్మకం ఉంచినప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో కూడా ఒత్తిడి ఉంటుంది. దేశవాళీ క్రికెట్లో కూడా మంచి ప్రదర్శన తర్వాతే ఇక్కడి వరకు వచ్చాం. అయితే ఇక్కడ బాగా ఆడినప్పుడు వచ్చే గుర్తింపు, పేరు ఎంతో భిన్నం. బయటి అంశాల గురించి పట్టించుకోకుండా మనపై మనం నమ్మకం ఉంచి ఆడటం ముఖ్యం’ అని ముకుల్ వ్యాఖ్యానించాడు. ఆ షాట్ అంటే ఇష్టం... అరోరా బౌలింగ్‌లో ముకుల్ కొట్టిన హెలికాప్టర్ షాట్‌పై అన్ని వైపుల నుంచి నుంచి ప్రశంసలు కురిశాయి. ‘మొదటి నుంచి నేను ధోనికి వీరాభిమానిని. వికెట్ కీపర్ అయిన నేను ధోనిలాగే ఏడో స్థానంలో ఆడుతున్నా. ఆయన మ్యాచ్‌లను ముగించే తీరు నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచే హెలికాప్టర్ షాట్‌ను ఎంతో ప్రాక్టీస్ చేశాను. ఆ షాట్ నాకు చాలా నచ్చేది. యార్కర్‌ను ధోని సిక్సర్‌గా మలిచేవాడు. అలాంటి బంతిని సిక్స్ కొట్టడం అంటే బౌలర్‌పై మన ఆధిపత్యం ఏమిటో తెలుస్తుంది. భారీ షాట్లు కొట్టే విధంగా బలమైన శరీర నిర్మాణం నాకుంది. నేను సాధన కూడా చాలా చేస్తాను. ప్రతీ రోజూ దాదాపు 100–150 సిక్సర్లు ప్రాక్టీస్ చేస్తా. గత ఐదారు నెలలుగా ఇదే తరహాలో ఆడటం ఇప్పుడు ఫలితం చూపించింది’ అని 21 ఏళ్ల ముకుల్ వివరించాడు. దేశవాళీలో చెలరేగి... నాలుగు నెలల క్రితం సరిగ్గా ఇదే తరహా ఆటతో ముకుల్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో దృష్టిలో పడ్డాడు. దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో అప్పటికే సత్తా చాటిన ముకుల్ ఢిల్లీతో జరిగిన పోరులో మరింతగా చెలరేగాడు. ఐపీఎల్లో గురువారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లాగానే రాజస్తాన్ 176 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.ముకుల్ 26 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లతో అజేయంగా 62 పరుగులు చేసి చివరి బంతికి సిక్స్‌తో జట్టును గెలిపించాడు. ఆయుశ్ బదోని వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి కావాల్సిన 25 పరుగులను అతను రాబట్టడం విశేషం. ఈ ఇన్నింగ్స్ తర్వాతే వేలంలో లక్నో రూ.2 కోట్ల 60 లక్షలకు తీసుకుంది. గతంలో ఈ ఫీట్ నమోదు చేసిన కారణంగానే తనపై తనకు నమ్మకం ఉందని, ఇప్పుడు దానిని పునరావృతం చేశానని అతను చెప్పాడు. లాంగర్ ప్రోత్సాహంతో... ఐపీఎల్లో లక్నో జట్టుకు ఎంపికైన తర్వాత టీమ్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఈ కుర్రాడిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. తన బ్యాటింగ్‌పై నమ్మకంతో పాటు భారీ సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం కోచ్‌ను ఆకట్టుకున్నాయి. రాబోయే కొన్ని రోజుల్లో ‘అత్యంత ప్రమాదకర’ మిడిలార్డర్ బ్యాటర్‌గా ముకుల్‌ను తీర్చిదిద్దుతానని చెప్పి కోచ్ ప్రోత్సాహాన్నందించాడు. ‘అంత పెద్ద కోచ్ నా గురించి ఇలా మాట్లాడాడంటే నాలో ఏదో ప్రత్యేకత ఆయనకు కనిపించి ఉండవచ్చు. ప్రతీ రోజూ 15 నిమిషాల పాటు నా కోసం ప్రత్యేకంగా కేటాయించి సాధన చేయించడమే కాకుండా నేను ఆడాల్సిన ఆట శైలి గురించి వివరించేవారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెలరేగాలని నేనూ గట్టిగా కోరుకున్నా. ఇప్పుడు నా ఆటను చూపించాను’ అని ముకుల్ వెల్లడించాడు. రెండేళ్ల క్రితం బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా తొందరపాటు ప్రదర్శించే వాడినని... అయితే సాధన తర్వాత చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను గెలిపించాలనే పట్టుదల తనలో పెరిగిందని ముకుల్ గుర్తు చేసుకున్నాడు. కోల్‌కతాతో పోరులో బౌలర్ ఏదో ఒక దశలో తప్పు చేస్తాడనే నమ్మకంతోనే వేచి చూశానని చెప్పాడు. తన ఈ ప్రదర్శనను తండ్రికి అంకితం ఇస్తున్నట్లు అతను చెప్పాడు.కుటుంబ త్యాగాలతో... ముకుల్ తండ్రి దలీప్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన తన పెళ్లి కూడా కాకముందే కొడుకు పుడితే క్రికెటర్‌ను చేయాలని నిర్ణయించుకున్నాడు. ముకుల్‌ను 10 ఏళ్ల వయసులో క్రికెట్లోకి తీసుకొచ్చిన సమయంలో తండ్రి ఆరి్థక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. కొడుకు శిక్షణలో అండగా నిలిచేందుకు ముందుగా ఆయన తన ఉద్యోగాన్ని వదిలేశాడు. తనకు వాటాగా వచ్చిన ఇంటిని అమ్మేసి ముకుల్ శిక్షణ కోసం వెచ్చించాడు. రాజస్తాన్‌లోని స్వస్థలం ఝన్‌ఝునులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో జైపూర్‌లోని ఆరావళి అకాడమీలో చేరి్పంచాడు. ఆరంభంలో మీడియం పేసర్‌గా మొదలు పెట్టినా... అకాడమీలో వికెట్ కీపర్లు ఎవరూ లేకపోవడంతో అవకాశాల కోసం అటువైపు మళ్లాడు. అయితే భారీ షాట్లు ఆడే ముకుల్ శైలిని గుర్తించిన కోచ్‌లు ఆ దిశగా బ్యాటింగ్‌లో ప్రోత్సహించారు. ఆరంభంలో సరైన అవకాశాలు రాకపోయినా ఆ తర్వాత అతని ఆట పదునెక్కింది. బీసీసీఐ అండర్–23 టోర్నీలో రాజస్తాన్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా కెరీర్ దూసుకుపోయింది. టి20ల్లో మారిన పవర్ హిట్టింగ్‌ను మరింత సాధన చేసేందుకు వీలుగా మధ్యలో కొన్ని నెలల పాటు అతను ఢిల్లీలోని గుర్గావ్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అతని కఠోర శ్రమ, పట్టుదల ఇప్పుడు ఐపీఎల్లో ఫలితం చూపించింది. -
‘భారత్‌లోనే ప్రమాదకర బ్యాటర్.. ఈ మ్యాచ్‌తో నిరూపించాడు’
ముకుల్ చౌదరి.. ఒక్క మ్యాచ్‌తో భారత క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయిందీ పేరు. ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గురువారం నాటి పోరులో.. ఈ లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లక్నో విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు అవసరం కాగా... ఇందులో 54 తానొక్కడే చేశాడు.27 బంతుల్లోకోల్కతా విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ముకుల్ చౌదరి.. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా లక్నోను విజయతీరాలకు చేర్చి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో లక్నో హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్ ముకుల్ చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా.. ‘‘వచ్చే నాలుగు నెలల్లో ఇండియాలోనే ఆరు లేదంటే ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా ముకుల్ ఎదగడం ఖాయం’’ అని లాంగర్ అన్నాడు.What JL said 🧿 pic.twitter.com/c7y4oI4Sgn— Lucknow Super Giants (@LucknowIPL) April 9, 2026ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో కోల్‌కతాతో మ్యాచ్ సందర్భంగా ముకుల్ గురించి లాంగర్ చెప్పిన మాటలు నిజమయ్యాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ ముకుల్ చౌదరి?రాజస్తాన్‌కు చెందిన 21 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరి జైపూర్ అకాడమీలో శిక్షణ పొందాడు. ముందుగా పేస్ బౌలర్‌గా మొదలు పెట్టినా... అకాడమీలో వికెట్ కీపర్లు లేకపోవడంతో ఆ వైపు దృష్టి సారించాడు. అండర్–23 టోర్నీలో 102 సగటుతో 617 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.ఇక దేశీ టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా 199 స్ట్రయిక్‌రేట్‌తో 173 పరుగులు చేయడంతో ఐపీఎల్లో లక్నో రూ. 2.60 కోట్లకు తీసుకుంది. ‘వచ్చే నాలుగైదు నెలల్లో ఇతను ఆరు లేదా ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా ఎదగడం ఖాయం’ అని లాంగర్ ఐపీఎల్‌కు ముందు వ్యాఖ్యానించగా... ఇప్పుడు తన సిక్సర్లతో ముకుల్ దానిని నిరూపించడం విశేషం. This is 𝐂𝐈𝐍𝐄𝐌𝐀 🫡🤯 pic.twitter.com/JTxw0DUgqM— Lucknow Super Giants (@LucknowIPL) April 10, 2026చదవండి: Yuvraj Singh: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’ -
‘ఈ ఇన్నింగ్స్ మా నాన్నకు అంకితం’
ఐపీఎల్ 2026 సీజన్లో ముకుల్ చౌదరీ రూపంలో నయా స్టార్ పుట్టుకొచ్చాడు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయే స్థితిలో ఉన్న లక్నో సూపర్‌జెయింట్స్‌ను ఒంటిచేత్తో గెలిపించిన ముకుల్ చౌదరీ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ముకుల్ చౌదరీ మాట్లాడాడు. ఈరోజుతో తన నాన్న కల నెరవేరిందని.. ఇన్నింగ్స్‌ను ఆయనకు అంకిత మిస్తున్నట్లు తెలిపాడు.‘నేను క్రికెటర్ కావాలన్నది మా నాన్న కల. అయితే నా చిన్నతనంలో మా కుటుంబ పరిస్థితి అంత బాగుండక పోవడంతో క్రికెట్‌ను ఆడలేకపోయాను. అయితే 12-13 ఏళ్ల వయస్సులో తొలిసారి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. ఆరోజుల్లో క్రికెట్ అకాడమీలు ఎక్కువగా ఉండేవి కావు. అందుకే మాకు దగ్గర్లో ఉన్న సికర్‌లోని ఎస్బీఎస్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. అక్కడే ఒక ఐదు నుంచి ఆరేళ్ల పాటు ఆటలో మెళుకువలు నేర్చుకోవడంతో పాటు క్రికెటర్‌గా ట్రెయిన్ అయ్యాను. ఆ తర్వాత హయ్యర్ లెవెల్‌కు ఆడాలనే ఉద్దేశంతో జైపూర్‌కు నా మకాం మార్చాను. ఆ తర్వాత టీ20 క్రికెట్ ఉన్నతస్థాయికి చేరుకోవడంతో గుర్గావ్లో మూడు నుంచి నాలుగు నెలలల పాటు శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత ఢిల్లీలో ఆడిన చాలా మ్యాచ్‌లు నా కెరీర్‌కు ఉపయోగపడ్డాయి. ఇక యూపీతో జరిగిన అండర్-19 మ్యాచ్‌లో నా ప్రదర్శనను చూసి నేను క్రికెటర్ అవుతాననే విషయాన్ని మా నాన్న నమ్మాడు. అది లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ మా జట్టులో ఎవరు పెద్దగా ఆడలేదు. నేను మాత్రమే మంచి స్కోర్ సాధించాను. అప్పుడే క్రికెట్లో నేను పెద్ద స్థాయికి చేరుతానన్న నమ్మకం మా నాన్నకు కలిగింది. ఇక ఫ్లడ్ లైట్ల కింద నేను ఆడిన రెండో మ్యాచ్ ఇది. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఒత్తిడిలా కాకుండా గోల్డెన్ ఛాన్స్‌లా చూశాను. చివరి వరకు ఆడాలనేదే నా ప్లాన్. నేను క్రీజులో ఉంటే జట్టును గెలిపించగలననే నమ్మకం నాకుంది. ఈరోజు కొట్టిన మొదటి సిక్స్ నాకు ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజు నేను కొట్టిన మొదటి సిక్స్ అదే. ఆఖరి ఓవర్లో ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. ఏదో ఒక బంతి నా జోన్లోకి వస్తుందని తెలుసు. ఒక్క సిక్స్ కొడితే చాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను హిట్టింగ్ చేస్తున్నాను. బంతి నా జోన్లో ఉంటే బాదేస్తాను. సిక్సర్లు కొట్టడం నాకు చాలా ఇష్టం. ఇవాళ రాత్రి నువ్వు ఒక జవాన్లా (దేశానికి సేవ చేసే సైనికుల్లో చాలా మంది రాజస్తాన్‌లోని ఝున్ఝు ప్రాంతం నుంచి వచ్చేవారు. ఇది ముకుల్ చౌదరీ స్వస్థలం)ఆడావు అని చాలా మంది మెచ్చుకుంటున్నారు. అవును సార్.. అది నా రక్తంలోనే ఉంది. నేను ఇక్కడ గ్రౌండ్లో ఆడుతున్నాను.. వాళ్లు సరిహద్దులో కాపలా కాస్తూ దేశానికి సేవ చేస్తున్నారు.’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికి వస్తే 182 పరుగుల ఛేదనలో లక్నో 6 ప్రధాన వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది. 32 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరీ 27 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 54 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్‌కు ఇది హ్యాట్రిక్ ఓటమి కాగా, లక్నోకు ఇది రెండో విజయం.Pressure? What pressure? 🤷♂️🎥 🗣️ It's all about belief and rising to the occasion for Mukul Choudhary 🙌Scorecard ▶️ https://t.co/ov5gAlAtPH #TATAIPL | #KhelBindaas | #KKRvLSG | @LucknowIPL pic.twitter.com/M2Y1F9x3ym— IndianPremierLeague (@IPL) April 9, 2026 Another day, another #TATAIPL thriller 🤩@LucknowIPL get over the line in a last-ball finish, courtesy of Mukul Choudhary's heroics 🫡Scorecard ▶️ https://t.co/ov5gAlAtPH #KhelBindaas | #KKRvLSG pic.twitter.com/VLthHCB8Cm— IndianPremierLeague (@IPL) April 9, 2026చదవండి: జైస్వాల్ బ్యాట్ వెనుక ఇంత కథ దాగుందా! -
ముకుల్ సిక్సర్ల మోత
182 పరుగుల ఛేదనలో 6 వికెట్లు కోల్పోయి ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరగ్గా... లక్నో విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు కావాలి. ఈ దశలో కోల్‌కతా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ యువ ఆటగాడు ముకుల్ చౌదరీ భిన్నంగా ఆలోచించాడు. చివరి మూడు ఓవర్లలో రెండేసి సిక్సర్లతో చెలరేగిపోయి కేకేఆర్ పని పట్టాడు.57లో తానొక్కడే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి లక్నోకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆఖరి 4 ఓవర్లలో వరుసగా 11, 13, 16, 14 పరుగులు రాబట్టి సూపర్ జెయింట్స్ మ్యాచ్ గెలుచుకుంది. సొంత మైదానంలో విజయానికి చేరువగా వచ్చిన కోల్‌కతా మరో ఓటమితో తీవ్ర నిరాశకు గురైంది. కోల్‌కతా: ఐపీఎల్లో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పైచేయి సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రఘువంశీ (33 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజింక్య రహానే (24 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రావ్మన్ పావెల్ (24 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (24 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. రెండో వికెట్‌కు రహానే, రఘువంశీ 52 బంతుల్లో 84 పరుగులు చేయగా... ఐదో వికెట్‌కు గ్రీన్, పావెల్ 40 బంతుల్లో అభేద్యంగా 70 పరుగులు జోడించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ముకుల్ చౌదరీ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, ఆయుశ్ బదోని (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అర్ధసెంచరీ సాధించాడు. బ్యాటింగ్ తడబాటు... ప్రిన్స్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఫిన్ అలెన్ (8) అదే ఓవర్లో వెనుదిరిగాడు. బౌండరీ వద్ద రాఠీ పట్టిన ఈ క్యాచ్ చర్చకు దారి తీసింది. క్యాచ్ పట్టే సమయంలో అతని కాలు తగిలి కుషన్ స్వల్పంగా కదిలినట్లు అనిపిస్తున్నా... మూడో అంపైర్ వేర్వేరు కోణాల్లో పరీక్షించకుండానే అలెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు! ఈ దశలో రఘువంశీ, రహానే కలిసి కీలక పరుగులు జోడించారు. అయితే లక్నో బౌలర్లు చెలరేగడంతో ఒక్కసారిగా కోల్‌కతా జోరు తగ్గింది. 19 బంతుల వ్యవధిలో 12 పరుగులు మాత్రమే చేసి జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఒకదశలో వరుసగా 31 బంతుల పాటు బౌండరీనే రాలేదు! ఇలాంటి స్థితిలో గ్రీన్, పావెల్ దూకుడుగా ఆడారు. చివరి 4 ఓవర్లలో కేకేఆర్ 54 పరుగులు రాబట్టింది. బదోని అర్ధ సెంచరీ... ఛేదనలో మార్క్రమ్ (22), మార్ష్(15) తొలి వికెట్‌కు 25 బంతుల్లో 41 పరుగులు జోడించి లక్నోకు మెరుగైన ఆరంభం అందించారు. సైనీ ఓవర్లో మార్క్రమ్ వరుసగా 4, 6, 4తో ధాటిని ప్రదర్శించాడు. అయితే అరోరా ఒకే ఓవర్లో వీరిద్దరిని వెనక్కి పంపి దెబ్బ కొట్టగా... ఎట్టకేలకు ఈ సీజన్లో బౌలింగ్‌కు దిగిన గ్రీన్ తన తొలి ఓవర్లోనే పంత్ (10)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత పూరన్ (13), సమద్ (2) విఫలం కాగా, బదోని కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. బదోని అవుటైన తర్వాత లక్నో దాదాపు ఆశలు కోల్పోగా... ముకుల్ అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించాడు. రాజస్తాన్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరీ జైపూర్ అకాడమీలో శిక్షణ పొందాడు. ముందుగా పేస్‌బౌలర్‌గా మొదలు పెట్టినా...అకాడమీలో వికెట్ కీపర్లు లేకపోవడంతో ఆ వైపు మళ్లాడు. అండర్–23 టోర్నీలో 102 సగటుతో 617 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా 199 స్ట్రయిక్‌రేట్‌తో 173 పరుగులు చేయడంతో ఐపీఎల్లో లక్నో రూ. 2.60 కోట్లకు తీసుకుంది. ‘వచ్చే నాలుగైదు నెలల్లో ఇతను ఆరు లేదా ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా ఎదగడం ఖాయం’ అని లక్నో కోచ్ లాంగర్ ఐపీఎల్‌కు ముందు వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తన సిక్సర్లతో ముకుల్ దానిని నిరూపించాడు. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X బెంగళూరు వేదిక: గువాహటిరాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్,జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) షమీ (బి) రాఠీ 41; అలెన్ (సి) రాఠీ (బి) ప్రిన్స్ 9; రఘువంశీ (సి) మార్క్రమ్ (బి) సిద్ధార్థ్ 45; గ్రీన్ (నాటౌట్) 32; రింకూ (బి) అవేశ్ 4; పావెల్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–15, 2–99, 3–105, 4–111. బౌలింగ్: షమీ 4–0–27–0, ప్రిన్స్ యాదవ్ 4–0–47–1, సిద్ధార్థ్ 4–0–34–1, దిగ్వేశ్ రాఠీ 4–0–25–1, అవేశ్ 4–0–44–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్(సి) రఘువంశీ (బి) అరోరా 15; మార్క్రమ్ (సి) పావెల్ (బి) అరోరా 22; పంత్ (సి) త్యాగి (బి) గ్రీన్ 10; బదోని (సి) రింకూ (బి) రాయ్ 54; పూరన్ (సి) రమణ్‌దీప్ (బి) త్యాగి 13; సమద్ (బి) రాయ్ 2; ముకుల్ (నాటౌట్) 54; షమీ (సి) రాయ్ (బి) నరైన్ 1; అవేశ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–41, 2–42, 3–73, 4–95, 5–104, 6–125, 7–128. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–38–2, రాయ్ 4–0–32–2, సైనీ 3–0–37–0, నరైన్ 4–0–13–1, త్యాగి 3–0–31–1, గ్రీన్ 2–0–28–1. -
ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి
ఐపీఎల్-2026లో వరుసగా రెండో మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 3 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.ఈ విజయంలో ముకుల్ చౌదరిది కీలక పాత్ర. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో పవర్‌ప్లేలోనే ఓపెనర్లు మార్క్రమ్(22), మార్ష్(15) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే రిషబ్ పంత్(10), నికోలస్ పూరన్(13), సమద్(2) కూడా వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరాడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆయూశ్ బదోని మాత్రం కేకేఆర్ బౌలర్లను టార్గెట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన అనంతరం బదోని(54) కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో లక్నో ఓటమి ఖాయమని అంతా భావించారు.ముకుల్ సంచలనంకానీ అప్పుడే క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి అందరి అంచనాలను తారుమారు చేశాడు. తొలి ఆరు బంతుల్లో కేవలం 6 పరుగులు చేసిన ముకుల్.. ఆ తర్వాత మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చివరి రెండు ఓవర్లలో లక్నో విజయానికి 30 పరుగులు అవసరమవ్వగా.. ముకుల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 6, 4, 6 బాది 16 పరుగులు రాబట్టేశాడు. దీంతో లక్నో విజయ సమీకరణం 6 బంతుల్లో 14 పరుగులుగా మారింది. తొలి బంతికి అవేష్ ఖాన్ సింగిల్ తీసి స్ట్రైక్ ముకుల్ చౌదరికి ఇచ్చాడు. రెండో బంతికి సిక్సర్ బాదిన ముకుల్ చౌదరి, ఆ తర్వాత 2 డాట్ బాల్స్ ఆడాడు. చివరి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సి వచ్చింది. దీంతో ఇరు జట్ల డగౌట్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఐదో బంతిని ముకుల్ సిక్సర్‌గా బాది స్కోర్లను సమం చేశాడు. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు లభించడంతో లక్నో విజయం సాధించింది. వికెట్ కీపర్ రఘువంశీ డైరెక్ట్ త్రో చేయడంలో విఫలమయ్యాడు.ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా లక్నో 182 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, అనుకుల్ రాయ్ తలా రెండు వికెట్లు సాధించగా.. సునీల్ నరైన్, గ్రీన్, త్యాగీ చెరో వికెట్ పడగొట్టారు.అంతకముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్(32), రావ్మన్ పావెల్(39) రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్దార్ధ్, దిగ్వేష్ సింగ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2026: 'అతడొక సంచలనం.. టీమిండియా సూపర్ స్టార్ అవుతాడు' -
ఫిన్ అలెన్‌ది ఔటా? నాటౌటా?
ఐపీఎల్ 2026లో అంపైరింగ్ నిర్ణయాలు తీవ్ర వివాదస్పదమవుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ అవుటైన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. లక్నో ఫీల్డర్ దిగ్వేష్ రాఠీ పట్టిన క్యాచ్ క్లీన్ క్యాచ్ కాదా? అనే సందేహం అందరిలోనూ నెలకొంది.ఏమి జరిగిందంటే?కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో లక్నో పేసర్ ప్రిన్స్ యాదవ్ వేసిన నాలుగో బంతిని ఫిన్ అలెన్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని డీప్ థర్డ్ మ్యాన్ వైపు వెళ్ళింది. అక్కడ ఉన్న దిగ్వేష్ రాఠీ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టే సమయంలో రాఠీ కాలు బౌండరీ లైన్‌కు తాకినట్లు కన్పించింది.సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయాలి. కానీ ఆశ్చర్యకరంగా ఫీల్డ్ అంపైర్లు అలెన్‌ను నేరుగా అవుట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత రిప్లేలో అతడి కాలి బౌండరీ రోప్‌కు తాకినట్లు అన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇది చూసిన నెటిజన్లు అది క్లియర్‌గా నాటౌట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతకుముందు ఇదే సీజన్లో సన్‌రైజర్స్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ క్యాచ్‌లు కూడా వివాదస్పదమయ్యాయి.Finn Allen robbed pic.twitter.com/5Jqb7r6IVl— Nickk Knight (@KnightNick34590) April 9, 2026 -
ఉత్కంఠపోరులో లక్నో విజయం
KKR vs LSG Live updates: కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠపోరులో లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముకుల్ చౌదరి(27 బంతుల్లో 54) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో లక్నోను గెలిపించాడు. చివరి ఓవర్లో లక్నో విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికి అవేష్ ఖాన్ సింగిల్ తీసి స్ట్రైక్ ముకుల్ చౌదరికి ఇచ్చాడు. ముకుల్ రెండో బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో లక్నో విజయ సమీకరణం 4 బంతుల్లో 7 పరుగులగా మారింది. అయితే తర్వాతి రెండు బంతులకు ఎటువంటి పరుగులు రాలేదు. చివరి రెండు బంతులకు 7 పరుగులు అసవరమయ్యాయి. మళ్లీ ఐదో బంతికి ముకుల్ సిక్సర్ బాదాడు. దీంతో స్కోర్లు సమమయ్యాయి. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు లభించడంతో లక్నో విజయం సాధించింది. వికెట్ కీపర్ రఘువంశీ డైరెక్ట్ త్రో చేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా లక్నో 182 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతి చేధించింది.దుమ్ములేపుతున్న ముకుల్ చౌదరికేకేఆర్ విజయానికి ఆఖరి ఓవర్లో 14 పరుగులు కావాలి. ముకుల్ చౌదరి అద్భుతంగా ఆడుతున్నాడు.18 ఓవర్లకు లక్నో స్కోర్: 152/718 ఓవర్లు ముగిసేసరికి లక్నో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ముకుల్ చౌదరీ(26) దూకుడుగా ఆడుతున్నాడు.కేకేఆర్ ఆరో వికెట్ డౌన్కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన ఆయూశ్ బదోని.. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14.4 ఓవర్లకు లక్నో స్కోర్: 125-6లక్నో నాలుగో వికెట్ డౌన్‌లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన నికోలస్ పూరన్.. కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.లక్నో మూడో వికెట్ డౌన్రిషబ్ పంత్ రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రిషబ్ పంత్.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8.2 ఓవర్లకు లక్నో స్కోర్: 74-3లక్నో రెండో వికెట్ డౌన్‌లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు.లక్నో తొలి వికెట్ డౌన్41 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన మార్క్రమ్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చాడు.4 ఓవర్లకు లక్నో స్కోరెంతంటే?4 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(22), మిచెల్ మార్ష్(22) ఉన్నారు.రాణించిన కేకేఆర్ బ్యాటర్లు.. లక్నో టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్(32), రావ్మన్ పావెల్(39) రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్దార్ధ్, దిగ్వేష్ సింగ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 144/417 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రీజులో పావెల్(25), గ్రీన్(15) ఉన్నారు.కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్రింకూ సింగ్ రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రింకూ సింగ్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. కేకేఆర్ మూడో వికెట్ డౌన్కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన రఘువంశీ.. సిద్దార్ధ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్అజింక్య రహానే రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన రహానే.. దిగ్వేష్ సింగ్ రాథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 102/27 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 65/17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో రఘువంశీ(26), అజింక్య రహానే(27) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఫిన్ అలెన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రఘువంశీ వచ్చాడు. 2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 16/1ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌కు దూరమైన కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.దీంతో బ్లెస్సింగ్ ముజర్బానీ బెంచ్‌కే పరిమితయమ్యాడు. అయితే స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాత్రం తన చేతి వేలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. మరోవైపు లక్నో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎస్ఆర్హెచ్తో ఆడిన టీమ్‌నే కొనసాగించింది.జట్లు:కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగిఇంపాక్ట్ సబ్‌లు - మనీష్ పాండే, వైభవ్ అరోరా, తేజస్వి దహియా, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(కెప్టెన్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్‌లు - ఆయుష్ బడోని, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్, -
కేకేఆర్ ఫ్యాన్స్ ఫైర్.. స్పందించిన అయ్యర్ సోదరి
-
ఒక్కో రన్ కు ఒక్కో కోటి రూపాయలు
ఐపీఎల్-2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ నాలుగో మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. కేకేఆర్ ఈ ధనధాన్ లీగ్‌లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైన కేకేఆర్.. లక్నోపై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది.అయితే ఈ మ్యాచ్‌కు కేకేఆర్‌కు గుడ్ న్యూస్ అందింది. స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా క్లియరెన్స్ ఇచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అతడు బౌలింగ్ చేసే అవకాశముంది. గతేడాది జరిగిన మినీ వేలంలో గ్రీన్‌ను రూ.25.2 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది.ఆల్‌రౌండర్‌గా ఉపయోపడతాడని గ్రీన్‌పై అంత భారీ మొత్తాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ వెచ్చింది. కానీ గ్రీన్ మాత్రం ఇప్పటివరకు కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ కేవలం స్పెషలిస్టు బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగాడు. దీంతో చాలా మంది మాజీలు విమర్శలు వర్షం కురిపించారు. ఈ మాత్రం దానికి అంత ధర ఎందుకు అని కేకేఆర్‌పై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు.అయితే అతడు వెన్ను గాయం నుంచి కోలుకుని గతేడాది ఆఖరిలో పోటీ క్రికెట్లోకి పునరాగమనం చేశాడు. ఆస్ట్రేలియా తరపున కూడా అతడు చాలా మ్యాచ్‌లలో కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడాడు. ఈ క్రమంలో అతడి ఫిట్నెస్, వర్క్‌లోడ్ మేనెజ్మెంట్లో భాగంగా గ్రీన్‌కు ఐపీఎల్లో బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇవ్వలేదు. కానీ అతడు ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించి నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో అతడికి సీఎ వైద్య బృందం క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం.బ్యాటింగ్‌లో కూడా అట్టర్ ప్లాప్!బౌలింగ్ విషయాన్ని పక్కన పెడితే బ్యాటింగ్‌లో కూడా అట్టర్ ప్లాప్ అవుతున్నాడు. టాపార్డర్‌లో బ్యాటింగ్ వస్తున్న గ్రీన్ కనీస ప్రభావం చూపలేకపోతున్నాడు. మూడు మ్యాచ్‌లలో 24 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతానికి అతడి ప్రదర్శన చూస్తుంటే ఒక్కో రన్ కు ఒక్కో కోటి రూపాయలు తీసుకున్నట్లు ఉంది. కనీసం తర్వాత మ్యాచ్‌లలోనైనా గ్రీన్ తన ధరకు తగ్గ న్యాయం చేస్తాడో లేదో చూడాలి.చదవండి: IPL 2026: వైభవ్, ఆయూశ్ కాదు.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్! -
కేకేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. దిగొచ్చిన అయ్యర్ సోదరి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కేకేఆర్‌కు ఘనమైన రికార్డు ఉంది. మూడుసార్లు చాంపియన్ అయిన కేకేఆర్ ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకసారి భారీ స్కోరు చేసి కూడా గెలవకపోవడం, మరొకసారి తక్కువ స్కోరుకే ఆలౌటయ్యి పరాజయం మూటగట్టుకుంది. ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనైనా గెలిచి శుభారంభం చేయాలనుకున్న కేకేఆర్ ఆశలపై వరుణుడు అమాంతం నీళ్లు చల్లాడు. సీజన్లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ వర్షంతో రద్దయిన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఒక బంతి కూడా పడకుండానే రద్దవ్వడంతో ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. అయితే మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన కేకేఆర్‌ను ఉద్దేశించి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ పెట్టిన పోస్టు వివాదాస్పదంగా మారింది. కేకేఆర్, పంజాబ్ మ్యాచ్ రద్దయిన కాసేపటికే ఇన్స్టాగ్రామ్ వేదికగా శ్రేష్ట్ అయ్యర్ ఒక వీడియోను షేర్ చేసింది. 'మా పంజాబీల మనసు చాలా పెద్దది. అందుకే కేకేఆర్‌కు ఒక పాయింట్ ఇచ్చేశాం. బతికి బట్టకట్టండి’ అని పంజాబీలో వ్యాఖ్యానిస్తూ డ్యాన్సులు చేసింది. అయితే శ్రేష్ఠ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రేష్ఠ వ్యాఖ్యలపై కేకేఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ అన్న కెప్టెన్సీలోనే కేకేఆర్ విజేతగా నిలిచిందన్న సంగతి మరిచిపోయారా! అంటూ ట్రోల్ చేశారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను విజేతగా నిలబెట్టాడు. కానీ ఈ క్రెడిట్ పూర్తిగా గౌతమ్ గంభీర్‌కు పోయింది. దాంతో అతను ఆ జట్టును వదిలి పంజాబ్ కింగ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొనే శ్రేష్ట అయ్యర్ కేకేఆర్‌ను ట్రోల్ చేసినట్లు అర్థమవుతుంది.తాజాగా శ్రేష్ఠ అయ్యర్ తనపై వచ్చిన విమర్శలకు బదులిచ్చింది. ‘నేను ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టలేదు. ఫన్నీ తరహాలోనే పెట్టాను. ఆటను ఆటగానే చూడండి. నాకు ఏ జట్టుపైన ద్వేషం లేదు. ప్రతి ఒక్కరు దీనిని క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలి. ఎవరినీ ట్రోల్ చేయాలనుకోలేదు. ఇంత చిన్న విషయాన్ని మీరు భూతద్ధంలో నుంచి చూస్తున్నారు. దయచేసి శాంతించండి’ అని పేర్కొన్నారు.కానీ గతేడాది కూడా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షంతో తుడుచు కుపెట్టుకుపోయింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పూర్తవ్వగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం అంతరాయం కలిగించింది. కానీ తాజా మ్యాచ్‌లో 36.2 ఓవర్ల ఆటను వరణుడు మింగేసాడు. View this post on Instagram A post shared by Shresta Iyer (@shrestaiyer29)చదవండి: ఒక్క మ్యాచ్‌తో ఇన్ని రికార్డులా.. మాములోడివి కాదు! -
నోటితో కాదు.. ఆటతో సమాధానం చెప్పు: సెహ్వాగ్ ఫైర్
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ అజింక్య రహానే వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు. విమర్శకులకు కౌంటర్ ఇస్తూ రహానే సమయాన్ని వృథా చేసుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ల పేర్లను వీరూ ప్రస్తావించాడు.గతేడాది కేకేఆర్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు రహానే. ఐపీఎల్-2025 సీజన్లో కేకేఆర్ దారుణ ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికి మూడు మ్యాచ్‌లలో ఒకటి కూడా గెలవలేకపోయింది.వారినే అడగండి!భారీ అంచనాలతో రూ. 25 కోట్లకు పైగా వెచ్చించి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను కొనుగోలు చేస్తే.. అతడు ఘోరంగా విఫలమవుతున్నాడు. ఆరంభ మ్యాచ్‌లలో బౌలింగ్ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో రహానే స్పందిస్తూ.. గ్రీన్ బౌలింగ్ ఎందుకు చేయడం లేదో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)నే అడగాలనే అనుచితంగా మాట్లాడాడు.అసూయతోనేఇందుకు సీఏ సైతం బదులిచ్చింది. గ్రీన్ వెన్నునొప్పి కారణంగా ఎక్కువగా బౌలింగ్ చేయలేడన్న విషయం కేకేఆర్‌కు ముందుగానే చెప్పామని పేర్కొంది. ఇక తన స్ట్రైక్‌రేటు గురించి వస్తున్న విమర్శలపై రహానే స్పందిస్తూ.. ‘‘నాపై ఎందుకంత ద్వేషం.. నేను ఆడకూడదా? అయినా నాపై అసూయతోనే కొందరు ఇలా మాట్లాడుతున్నారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఈ రెండు సందర్భాల్లో రహానే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వీరేందర్ సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘అతడు ఓ జట్టుకు కెప్టెన్. కామెరాన్ గ్రీన్ గురించి అడిగినపుడు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఒకవేళ మాట్లాడినా నేరుగా సమాధానం ఇవ్వకుండా క్రికెట్ ఆస్ట్రేలియాను అడగమని చెప్పడం దేనికి?‘ఎండుల్కర్’ అంటూ..ఇక స్ట్రైక్‌రేటు విషయానికొస్తే.. బాగా ఆడినపుడు ప్రశంసించే వాళ్లు కొన్నిసార్లు విమర్శిస్తారు కూడా! అంత మాత్రాన ఇలా కౌంటర్లు ఇచ్చుకుంటూ పోవడం సరికాదు. గ్రీన్ విషయంలో ఒకలా.. తన విషయంలో మరోలా రహానే స్పందించాడు.ఒకానొక సందర్భంలో సచిన్ టెండుల్కర్ గురించి.. ‘ఎండుల్కర్’ అంటూ కెరీర్ ముగిసిపోయిందనే వార్తలు రాశారు. కానీ సచిన్ వాటిని పట్టించుకోకుండా ఆటతో సమాధానమిచ్చి అందనంత ఎత్తుకు ఎదిగాడు. అమితాబ్ బచ్చన్ సైతం ఎప్పుడూ విమర్శకులను సమాధానం ఇస్తూ సమయం వృథా చేయలేదు.కాబట్టి రహానే నిశ్శబ్దంగా ఉండటం మంచిది. నోటితో కాకుండా ఆటతో సమాధానం చెప్పాలి. ఒక్క సెంచరీ చేస్తే అంతా సైలెంట్ అయిపోతారు. అంతమాత్రానికి ఇలాంటి మాటలు ఎందుకు?’’ అని సెహ్వాగ్ రహానే తీరును విమర్శించాడు.చదవండి: RR vs MI: ‘వైభవ్ సూర్యవంశీ గురించి తెలుసు.. అతడికి అంత సీన్ లేదు’ -
18 కోట్ల క్రికెటర్ ఆగమనం.. కేకేఆర్ భవిష్యత్తు మారేనా!
ఐపీఎల్ 2026 సీజన్లోకి మరో ఇద్దరు విదేశీ స్టార్లు త్వరలోనే అడుగుపెట్టే అవకాశముంది. శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ, మతీశా పతీరానాలు త్వరలోనే ఫిట్నెస్ టెస్టులో పాసయ్యి లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ పొందేందుకు సిద్ధమవుతున్నారు. ఐపీఎల్లో హసరంగ లక్నో సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పతీరానా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడనున్నాడు. హసరంగను రూ. 2 కోట్ల కనీస ధరకు లక్నో దక్కించుకోగా, పతీరానాను కేకేఆర్ రూ. 18 కోట్ల భారీ ధర చెల్లించి కొనుగోలు చేసింది. పతీరానా రాకతో కేకేఆర్ బౌలింగ్ లైనప్ ఫుంజుకునే అవకాశముంది. నిఖార్సైన బౌలర్ లేక కేకేఆర్ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనే పరాజయాలనే మూటగట్టుకుంది. కాగా టీ20 ప్రపంచకప్‌కు ముందు గాయాలతో హసరంగ, పతీరానాలు మేజర్ టోర్నీకి దూరమయ్యారు. ఐర్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా తొడ వెనుక కండరాల్లో చీలిక రావడంతో హసరంగ టోర్నీ నుంచి తప్పుకోగా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు పతీరానా కండరాల గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. అప్పటినుంచి ఈ ఇద్దరు కొలంబోలోని ఫిట్నెస్ అకాడమీలో చికిత్స పొందుతున్నారు. లంక క్రికెట్లో సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న 15 మంది ఆటగాళ్ల జాబితాలో హసరంగ, పతీరానాలు చోటు దక్కడంతో బయటి లీగుల్లో ఆడాలంటే లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ తప్పనిసరి. ప్రస్తుతం గాయంతో కోలుకున్న ఈ ఇద్దరు ఫిట్నెస్ టెస్టు పాసయ్యేందుకు శ్రమిస్తున్నారు. అయితే వీరిలో హసరంగా ఐపీఎల్లో ఆడేందుకు ఎన్వోసీకి దరఖాస్తు చేసుకోకపోవడంతో అతడు ఐపీఎల్ ఆడతాడా లేదా అన్నది స్పష్టత రాలేదు.పతీరానా మాత్రం ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో మరో రెండు రోజుల్లో అతను ఫిట్నెస్ టెస్టుకు హాజరవనున్నాడు. ఫిట్నెస్ టెస్టులో క్లియరన్స్ వచ్చిన మరుక్షణం లేదా ఏప్రిల్ మూడో వారంలో పతీరానా కేకేఆర్‌తో కలిసే అవకాశముంది. ఇక పతీరానా ఐపీఎల్లో 32 మ్యాచ్‌లాడి 47 వికెట్లు పడగొట్టాడు. ఇక హసరంగ ఐపీఎల్లో 37 మ్యాచ్‌లాడి 46 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 19వ సీజన్లో కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓటములు ఎదురవ్వగా.. పంజాబ్‌తో మ్యాచ్ వర్షార్పణమయింది. ఇక లక్నో సూపర్‌జెయింట్స్ తొలి మ్యాచ్‌లో ఓటమి చెందినప్పటికీ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో గెలిచి సీజన్లో బోణీ చేసింది.చదవండి: అన్నింటా విఫలం.. ‘తలా’ లేక సీఎస్కే ఆగమాగం! -
‘తప్పు చేశావ్.. కెప్టెన్‌గా అదొక చెత్త నిర్ణయం’
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఇంకా బోణీ కొట్టలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన కేకేఆర్ పంజాబ్ కింగ్స్‌తో పోరులో ఎలాగైనా గెలిచి ఖాతా తెరవాలని భావించింది. కానీ వరుణుడి అడ్డంకితో మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో పాయింట్ల ఖాతా తెరిచినప్పటికీ విజయం మాత్రం ఇంకా దరిచేరలేదు. అయితే తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రహానే బౌలింగ్‌కు బదులు బ్యాటింగ్ తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. బహుశా తాను టాస్ గెలిచి ఉంటే బౌలింగ్‌కు మొగ్గు చూపేవాడినని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొనడంతో రహానేపై విమర్శలు పెరిగిపోయాయి. ఇదే విషయమై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్‌ఫించ్ సైతం రహానే నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఫించ్ మాట్లాడుతూ.. ‘కేకేఆర్ కెప్టెన్ రహానే తీసుకున్న నిర్ణయం ఒక రకంగా అర్థం లేనిది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న సంగతి రహానేకు ముందే తెలుసు. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచడం, వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంలో అర్థం లేదు. రహానే చేసింది ఎంత పెద్ద తప్పు అనేది కాసపటికే కేకేఆర్‌కు తెలిసొచ్చింది. 25 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పిచ్‌పై ఉండే పచ్చికను ఉపయోగించుకోవాల్సింది పోయి రహానే గుడ్డిగా బ్యాటింగ్ ఎంచుకోవడం విమర్శలకు తావిచ్చింది. రహానే ఇటీవల తన కెప్టెన్సీపై అసూయ పడేవారు పెరిగిపోయారని పేర్కొన్నాడు. కానీ రహానే వ్యాఖ్యలు నన్ను నిరాశపరిచాయి. ఒక జట్టుకు నాయకుడిగా ఉన్న ఆటగాడికి ఏకాగ్రత దెబ్బతిన్నప్పుడే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. మనల్ని విమర్శించివారిని తిరిగి దూషించడం కెప్టెన్‌గా సరైన చర్య ఎంతమాత్రం కాదు. రహానే నువ్వు చాలా మంచి ఆటగాడివి. ఓపెనర్‌గా కొనసాగిస్తున్న దూకుడు అలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. తొలి మ్యాచ్‌లో 220 పరుగులు చేసి కూడా ఓటమి పాలవ్వడం, రెండో మ్యాచ్‌లో ఛేదనలో చతికిలపడడం చూస్తుంటే జట్టులో సమతుల్యం దెబ్బతిన్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆటతో పాటు నాయకత్వంపై కూడా దృష్టి పెడితే బాగుంటుంది’ అని పించ్ పేర్కొన్నాడు.చదవండి: వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది! -
కేకేఆర్ ప్లాఫ్ షో.. షారుక్ ఖాన్ అసంతృప్తి
ఐపీఎల్లో మూడుసార్లు చాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) 2026 సీజన్లో మాత్రం ఇంకా బోణీ చేయలేదు. సోమవారం పంజాబ్‌తో మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఒక పాయింట్ సాధించినప్పటికీ విజయం మాత్రం ఇంకా ఆ జట్టు దరి చేరలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయిన సమయంలో కెమెరాలు ఒక్కసారిగా డ్రెసింగ్ రూమ్‌వైపు తిరిగాయి. అప్పటికే అక్కడ షారుక్ ఖాన్ కేకేఆర్ సీఈవో వైంకీ మైసూర్‌తో సుదీర్ఘ చర్చలో మునిగినట్లు కనిపించింది. ముఖ్యంగా సీజన్లో కేకేఆర్ ఆటతీరుపై, కామెరున్ గ్రీన్ వైఫల్యంపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడంపై కూడా షారుక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అనిపిస్తోంది. మ్యాచ్ జరిగి ఉంటే కేకేఆర్ తక్కువ స్కోరుకే వెనుదిరిగేదేమో అని భావించినట్లు తెలుస్తోంది.ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్ ఓటములపై కూడా విశ్లేషించినట్లుగా అర్థమవుతోంది. మొత్తంగా కేకేఆర్ ప్లాఫ్ షోపై షారుక్ ఖాన్ అసం తృప్తిగా ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 220 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ కేకేఆర్ ఓడిపోయింది. బౌలింగ్ వైఫల్యంతో పరాజయాన్ని మూటగ ట్టుకుంది. ఇక సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఈసారి బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి చవిచూసింది. 227 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ 161 పరుగులకే ఆలౌటైంది. కనీసం మూడో మ్యాచ్ ద్వారానైనా సీజన్లో బోణీ కొట్టాలని భావించిన కేకేఆర్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్ లభించినప్పటికీ ఉపయోగం లేదు. కనీసం ఏప్రిల్ 9న లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్‌లోనైనా కేకేఆర్ విజయం సాధించి సీజన్లో ఖాతా తెరవడంతో పాటు షారుక్ ఖాన్ శాంతించేలా చేస్తుందేమో చూడాలి. pic.twitter.com/HaBuw3lHz8— Nihari Korma (@NihariVsKorma) April 6, 2026చదవండి: హ్యాట్రిక్ కొట్టాడు.. ఇంకెన్ని దారుణాలు చూడాలో! -
హ్యాట్రిక్ కొట్టాడు.. ఇంకెన్ని దారుణాలు చూడాలో!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో విఫలమై హ్యాట్రిక్ నమోదు చేశాడు. సోమవారం కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమయింది. ఓపెనర్ ఫిన్ అలెన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రీన్ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. మొదటి బంతికి ఫోర్ కొట్టినప్పటికీ ఆ మరుసటి బంతికే ఔటయ్యాడు. జేవియర్ బార్ట్లెట్ వేసిన అవుట్ స్వింగర్ బంతిని బ్యాట్‌తో ముద్దాడి కీపర్ ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 18, 2, 4 పరుగులు సాధించాడు. మొత్తంగా ఈ సీజన్లో ఆడిన మ్యాచ్‌ల్లో గ్రీన్ కేవలం 24 పరుగులు మాత్రమే చేసి 10 కంటే తక్కువ సగటు నమోదు చేయడం కోల్‌కతా మేనేజ్మెంట్ను తీవ్రంగా కలవరపెడుతోంది. ఆల్‌రౌండర్‌గా జట్టుకు సమతుల్యత ఇస్తాడని భావించి భారీ ధర పెట్టి కొనుగోలు చేసినందుకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా సందేశం మేరకు బౌలింగ్‌కు దూరంగా ఉన్న కామెరున్ గ్రీన్ ఇప్పుడు బ్యాటింగ్‌లోనూ దారుణంగా ఆడుతూ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రూ. 25.2 కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన గ్రీన్ ఇప్పుడు కేకేఆర్‌కు భారంగా మారిపోయాడు. కనీసం తర్వాతి మ్యాచ్‌లోనైనా ఫుంజుకొని తనకు పెట్టిన ధరకు న్యాయం చేస్తాడేమో చూడాలి. మరోవైపు కేకేఆర్ అభిమానులు మాత్రం గ్రీన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు పెట్టి కొనుక్కున్న కేకేఆర్‌కు పంగనామం పెడుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి కామెరున్ గ్రీన్ పెద్ద ని ఖార్సైన ఆల్‌రౌండర్ కాదన్న సంగతి అతని గణాంకాలు చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా తరఫున 37 టెస్టులాడిన గ్రీన్ 1736 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 7 అర్థసెంచరీలున్నాయి. 31 వన్డేల్లో 782 పరుగులు, 28 టీ20ల్లో 638 పరుగులు సాధించాడు. ఈ మాత్రానికే కేకేఆర్ అంత డబ్బులు పెట్టి గ్రీన్‌ను ఎందుకు కొనుగోలు చేసిందన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. ఇక వర్షం పడే సమయానికి కేకేఆర్ 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. వర్షం తెరిపినిచ్చినప్పటికీ ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ నిర్వహణ కష్టమైంది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసిన అంపైర్లు ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 5 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంటే, సీజన్లో ఇప్పటికీ బోణీ చేయని కేకేఆర్ ఒక పాయింట్‌తో 8వ స్థానంలో కొనసాగుతుంది.చదవండి: ‘ఇష్టం లేకపోతే తప్పుకో’.. సీఎస్కే ఫ్యాన్స్ ఆగ్రహం -
వరుణుడి ఖాతాలో...
కోల్‌కతా: ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య సోమవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఆట ప్రారంభమైన 15 నిమిషాలకే వర్షం ముంచెత్తింది. మైదానం మొత్తాన్ని కవర్స్‌తో కప్పినా... ఎంతకూ వరుణుడు తెరిపినివ్వకపోవడంతో ఆట సాధ్యపడలేదు. పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అనంతరం రాత్రి 11 గంటల సమయంలో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్ధ ఉన్న ఈడెన్ గార్డెన్స్‌లో కటాఫ్ సమయానికి ముందే వరుణుడు శాంతించాడు. అయితే బౌండరీకి దగ్గర నీరు ఎక్కువగా నిలిచింది. దాంతో ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు కటాఫ్ సమయానికల్లా మైదానం సిద్ధమయ్యే పరిస్థితి కనిపించలేదు. ఈ ఐపీఎల్ సీజన్లో మ్యాచ్ రద్దు కావడం ఇదే తొలిసారి కాగా... ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. గతేడాది కూడా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం. సొంతగడ్డపై టాస్ గెలిచిన కోల్‌కతా మొదట బ్యాటింగ్ ఎంచుకోగా... వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (6), కామెరాన్ గ్రీన్ (4) విఫలం కాగా... కెప్టెన్ అజింక్య రహానే (8 నాటౌట్), అంగ్క్రిష్ రఘువంశీ (7) అజేయంగా నిలిచారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో పంజాబ్ పేసర్ జేవియర్ బార్ట్లెట్ ఈ ఇద్దరినీ కీపర్ క్యాచ్‌ల ద్వారా వెనక్కి పంపాడు. -
కేకేఆర్-పంజాబ్ మ్యాచ్ వర్షార్పణం
ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 3.4 ఓవర్ వద్ద ఆట నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి కేకేఆర్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తొలుత తేలికపాటి వర్షం పడడంతో తగ్గముఖం పడుతుందని అభిమానులు భావించారు. కానీ తర్వాత నెమ్మదిగా వర్షం తీవ్రత పెరిగింది. దాదాపు రెండు గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే అప్పటికే ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో పాటు కట్-ఆఫ్ టైమ్ కూడా దగ్గరపడడం కాణంగా అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్(5) అగ్రస్థానానికి చేరుకుంది. కేకేఆర్ ఖాతాలో తొలిపాయింట్ వచ్చి చేరింది. -
ఈ చెత్త ఆటకేనా? రూ. 25 కోట్లు
ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచిన గ్రీన్.. తన ఆట పరంగా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ వరుసగా మూడో మ్యాచ్‌లో విఫలమయ్యాడు.ఈడెన్‌గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గ్రీన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. బార్ట్లెట్ బౌలింగ్‌లో తను ఎదుర్కొన్న తొలి బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గ్రీన్.. ఆ తర్వాత బంతికి మాత్రం వికెట్ల వెనక దొరికిపోయాడు. అంతకుముందు ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం రెండు పరుగులు చేశాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా గ్రీన్ 18 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లు కలిపి గ్రీన్ కేవలం 24 పరుగులు చేశాడు. దీంతో అతడిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ మాత్రం ఆటకు రూ.25.2 కోట్ల దండగ అని పోస్టులు పెడుతున్నారు. కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో అతడిని కేకేఆర్ రూ.25.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు ప్రస్తుతం కేవలం బ్యాటర్‌గా మాత్రమే తన సేవలను అందిస్తున్నాడు. గాయం కారణంగా అతడికి బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఇంకా అనుమతి లభించలేదు.చదవండి: IPL 2026: అవేశ్ అత్యుత్సాహం.. బీసీసీఐకి సన్‌రైజర్స్ ఫిర్యాదు? -
వర్షం కారణంగా పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ రద్దు
IPL 2026 KKR vs PBKS Live Updates: ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 3.4 ఓవర్ వద్ద ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.ఈడెన్ గార్డెన్స్‌లో భారీ వర్షంఈడెన్ గార్డెన్స్‌లో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. మ్యాచ్ ఇప్పటిలో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కన్పించడం లేదు. మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు.వర్షం అంతరాయంఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆట నిలిచిపోయే సమయానికి కేకేఆర్ స్కోర్:25-2కేకేఆర్‌కు భారీ షాక్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. జేవియర్ బార్టలెట్ వేసిన రెండో ఓవర్లో డేంజరస్ బ్యాటర్లు ఫిన్ అలెన్(6),కామెరూన్ గ్రీన్(4) వికెట్లను కేకేఆర్ కోల్పోయింది. ఐపీఎల్-2026లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కేకేఆర్ స్టార్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ దూరమయ్యారు.వారిద్దరి స్ధానంలో నవ్‌దీప్ సైనీ, పావెల్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది. కాగా పంజాబ్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి జోష్‌లో ఉండగా.. కేకేఆర్ మాత్రం ఎలాగైనా బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది.తుది జట్లు:పంజాబ్ కింగ్స్ : ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కొన్నోలీ, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్‌లు: ప్రియాంష్ ఆర్య, సూర్యాంశ్ షెడ్గే, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే, హర్‌ప్రీత్ బ్రార్కోల్కతా నైట్ రైడర్స్ : ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగిఇంపాక్ట్ సబ్‌లు: బ్లెస్సింగ్ ముజారబానీ, మనీష్ పాండే, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, సౌరభ్ దూబే -
ఓటమి బాధలో ఉన్న కేకేఆర్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైన కేకేఆర్.. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. కేకేఆర్ బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి, బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోతోంది.ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానంలో జట్టులోకి వచ్చిన జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజర్బానీ ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు పడగొట్టినప్పటికి, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.అతడితో పాటు వైభవ్ ఆరోరా, కార్తీక్ త్యాగి, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. కేకేఆర్ బౌలింగ్ ఎటాక్‌లో యువపేసర్ హర్షిత్ రాణా లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. రాణా స్ధానంలో జట్టులోకి వచ్చిన నవ్దీప్సైనీకి ఇప్పటివరకు ఇంకా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. అయితే వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన బాధలో ఉన్న కేకేఆర్‌కు గుడ్ న్యూస్. శ్రీలంక స్టార్ పేసర్ మతీషా పతిరానా త్వరలోనే కేకేఆర్‌తో జట్టుతో చేరే అవకాశముంది. గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.18 కోట్ల భారీ ధరకు పతిరానాను కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే టీ20 వరల్డ్‌కప్-2026 సమయంలో గాయపడిన పతిరానా.. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో అతడు ఇంకా శ్రీలంకలోనే ఉన్నాడు. ఐపీఎల్లో ఆడేందుకు అతడికి శ్రీలంక క్రికెట్ ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అతడికి మరో వారం రోజుల్లో శ్రీలంక క్రికెట్ ఫిట్నెస్ టెస్టును నిర్వహించే అవకాశముంది. ఇందులో అతడు పాసైతే ఐపీఎల్ ఆడేందుకు లైన్ క్లియర్ అయినట్లే.ప్రాక్టీస్ మొదలు పెట్టిన పతిరానా..కాగా పతిరానా కూడా నెట్స్‌లో తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. త్వరలోనే వచ్చేస్తున్నా అనే క్యాప్షన్‌తో తన ప్రాక్టీస్ వీడియాను పతిరానా షేర్ చేశాడు. అతడు పోస్ట్ చేసిన వీడియో కేకేఆర్ శిబిరంలో ఆశలు ఆశలు చిగురింపజేసింది. అయితే అతడు ఇంకా పూర్తి వేగంతో బౌలింగ్ మాత్రం చేయడం లేదు. ఏప్రిల్ మూడో వారంలో అతడు జట్టుతో చేరే ఛాన్స్ ఉంది. చదవండి: తెలంగాణపై కావ్య మారన్ చిన్న చూపు -
అజింక్య రహానేకు భారీ షాక్.. కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ?
ఐపీఎల్-2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో ఓటమిని మూటకట్టుకుంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో కేకేఆర్ చిత్తు అయింది. 2012 తర్వాత కేకేఆర్ వరుసగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.దీంతో అజింక్య రహానే కెప్టెన్సీపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గత సీజన్లో కూడా కేకేఆర్‌ను విజయపథంలో రహానే నడిపించలేకపోయాడు. కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరుకుండానే కేకేఆర్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి కూడా అదే సూచనలు కన్పిస్తున్నాయి.రహానేపై వేటు?ఈ క్రమంలో అజింక్యా రహానేను సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పించే ఆలోచనలో కేకేఆర్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. రహానే స్ధానంలో స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ జట్టు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని 'రాయ్‌స్పోర్ట్స్' ప్రతినిధి సందీపన్ బెనర్జీ పేర్కొన్నారు. రింకూ ప్రస్తుతం కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో కూడా రహానే గాయంతో మైదానం వీడినప్పుడు రింకూ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.కానీ 221 పరుగుల భారీ ఛేదనను అడ్డుకోవడంలో అతను విఫలమయ్యాడు. కానీ రింకూ సింగ్‌కు మాత్రం కెప్టెన్‌గా అనుభవం ఉంది. 2024-25 డొమాస్టిక్ సీజన్లో యూపీ జట్టు కెప్టెన్‌గా రింకూ వ్యవహరించాడు. ఈ క్రమంలోనే అతడికి పూర్తి స్ధాయి బాధ్యతలను అప్పగించాలని కేకేఆర్ మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.తనపై వస్తున్న విమర్శలపై రహానే స్పందించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ.. నేను ఆడటం కొందరికి ఇష్టం లేదు. నా విజయాలను చూసి వారు అసూయపడుతున్నారు. నేను బయట వ్యక్తుల మాటలను పట్టించుకోను. నేను ఏం చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. కేవలం ఒక ఇన్నింగ్స్ విఫలమైతే విమర్శలు చేయడం సరికాదు అని పేర్కొన్నాడు.చదవండి: PSL 2026: ఉన్నపళంగా పాక్ నుంచి వెళ్లిపోయిన డేవిడ్ వార్నర్? -
‘ఎందుకంత ద్వేషం.. నేను ఆడడం ఇష్టం లేదా?’
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో కేకేఆర్ ఓటమిపాలైంది. అయితే మ్యాచ్‌లో కెప్టెన్ రహానే 10 బంతులాడి 8 పరుగులే చేయడం విమర్శలకు దారి తీసింది. అయితే రహానే మాత్రం తనపై వచ్చిన విమర్శలకు ధీటుగానే బదులిచ్చాడు. తన సక్సెస్‌ను చూడలేకనే కొంతమంది తన స్ట్రైక్‌రేట్ విషయంలో ఒక అజెండాతో విమర్శలు చేస్తున్నారని రహానే తెలిపాడు. కేవలం ఒక్క మ్యాచ్‌లో విఫలం కావడంతోనే విమర్శలు చేయడం సరికాదన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కేకేఆర్(KKR) కెప్టెన్ రహానే మీడియాతో మాట్లాడాడు.‘2023 నుంచి నా బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్ అత్యుత్తమంగా ఉందని నేను భావిస్తున్నా. అయితే నా బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్ గురించి మాట్లాడుతున్న వారంతా బహుశా నా ఆటను చూడకపోవచ్చు లేదంటే ఒక అజెండాతో నాపై నెగెటివ్ వ్యాఖ్యలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నార నిపిస్తుంది. వాస్తవానికి నేను ఆడడం వారికి ఇష్టం లేదనుకుంటా. అందుకే నా ఆటను చూసేందుకు ఇష్టపడడం లేదు. నా సక్సెస్ చూసి వారికి అసూయ కలిగినట్లు అనిపిస్తోంది. కేవలం ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే చూసి నేను సరిగ్గా ఆడడం లేదని పేర్కొనడం తగదు. అజింక్యా రహానే ఆటను మార్చుకున్నాడంటే అస్సలు సహించడం లేదు. అంతిమంగా రహానే గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. అది పాజిటివ్ లేదా నెగెటివ్ కావచ్చు. ఏదైనా సరే నేనేమీ మాట్లాడుకుండా వారిని అడ్డుకోను.’అని చెప్పుకొచ్చాడు.కాగా అజింక్యా రహానే 2023లో చెన్నై సూపర్‌కింగ్స్‌లో చేరిన తర్వాత తన ఆటను పూర్తిగా మార్చుకున్నాడు. హిట్టింగ్‌కు అధిక ప్రాధాన్య మిచ్చిన రహానే ఆ సీజన్లో సీఎస్కే తరఫున 172.49 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. ఆ సీజన్లో చెన్నై టైటిల్ కొట్టడంలోనూ రహానే ఓపెనింగ్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. అయితే 2024 సీజన్ రహానేకు అంతగా కలిసిరాలేదు. 2024లో రహానే 123.47 స్ట్రైక్‌రేట్‌తో 242 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రహానేను సీఎస్కే విడుదల చేయడంతో 2025 సీజన్‌కు ముందు అతడిని కేకేఆర్ కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. ఐపీఎల్ 18వ సీజన్లో రహానే మరోసారి మెరిశాడు. కెప్టెన్‌గానే గాక బ్యాటర్‌గా 13 మ్యాచ్‌ల్లో 147 స్ట్రైక్‌రేట్‌తో 390 పరుగులు సాధించి కేకేఆర్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2026 ఐపీఎల్ సీజన్‌ను కూడా రహానే మంచి ఈజ్‌తో ప్రారంభించాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అర్థసెంచరీ సాధించి తన విలువను చాటిచెప్పాడు.Ajinkya Rahane did not hold back in the post-match press conference 😮#KKRvsSRH #IPL2026 pic.twitter.com/b9IxVcrQJZ— Cricbuzz (@cricbuzz) April 2, 2026చదవండి: కపిల్, ధోనీలకు యువరాజ్ క్షమాపణ! -
బంగ్లా ప్లేయర్ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్ చైర్మన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 మినీ వేలంలో అమ్ముడుపోయిన ఏకైక బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్. మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అతడిని రూ. 9.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కేకేఆర్ యాజమాన్యం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.బంగ్లాదేశ్ ఆటగాడిని వెంటనే ఐపీఎల్ నుంచి తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందుకు తలొగ్గిన బీసీసీఐ.. ముస్తాఫిజుర్ రహమాన్‌ను రిలీజ్ చేయాల్సిందిగా కేకేఆర్‌ను ఆదేశించింది. దీంతో అతడు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు భారత్‌కు రాలేమంటూ బంగ్లాదేశ్ టోర్నీ నుంచే తప్పుకొంది.దురదృష్టకరంఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను తొలగించడంపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తొలిసారి స్పందించాడు. ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అదొక దురదృష్టకర సంఘటన అని చెప్పగలను. ఒక్కోసారి పరిస్థితులకు తగినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది.ఏదేమైనా ప్రభుత్వానికి క్రికెట్లో జోక్యం చేసుకోవాలనే ఆలోచన మాత్రం లేదు. ఎల్లవేళలా మాకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అయితే, ముందుగా చెప్పినట్లు కొన్నిసార్లు పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు.ఏది జరిగినా మన మంచికేపరిణామాలకు తగినట్లుగానే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది జరిగినా మన మంచికే అన్న సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని అరుణ్ ధుమాల్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ నుంచి తొలగించిన తర్వాత ముస్తాఫిజుర్ రహమాన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడేందుకు వెళ్లాడు. మరోవైపు.. పీఎస్ఎల్ను వీడి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ కేకేఆర్‌లో ముస్తాఫిజుర్ స్థానాన్ని భర్తీ చేశాడు.చదవండి: IPL 2026: ‘నేనైతే ఫుల్ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్ భావోద్వేగం! -
కేకేఆర్ ఓడినా ఆ ఒక్కడు గెలిచాడు!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఛేదనలో మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోవడంలో కేకేఆర్ బ్యాటర్లు విఫలమయ్యారు. దీనికి తోడు టార్గెట్ ఎక్కువగా ఉండడం కూడా కేకేఆర్ కొంపముంచింది. అయితే జట్టు ఓడినా ఒక్క ఆటగాడు మాత్రం గెలిచాడు. అతడే జింబాబ్వేకు చెందిన బ్లెసింగ్ ముజరబానీ.ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసి 34 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ గురువారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మాత్రం ముజరబానీ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన ముజరబానీ 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ పరంగా చూసుకుంటే ఓవర్‌కు 10 పరుగుల చొప్పున ఇచ్చినప్పటికీ బ్యాటింగ్ పిచ్‌పై ముజరబానీ ప్రదర్శన తీసిపారేయలేము. పైగా అతడు తీసిన నాలుగు వికెట్లలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. ఈ ఐపీఎల్లో సికందర్ రజా తర్వాత జింబాబ్వే నుంచి ఆడుతున్న క్రికెటర్ ముజరబానీ మాత్రమే. మొదట వేలంలో అమ్ముడుపోని ఆటగాడు ఇవాళ కేకేఆర్ మ్యాచ్ ఓడినా తన ప్రదర్శనతో మాత్రం అభిమానుల మనుసులు గెలుచుకున్నాడు.వేలంలో అమ్ముడుపోలేదు..జింబాబ్వే ఆటగాడు అయిన బ్లెసింగ్ ముజరబానీకి ఇదే తొలి ఐపీఎల్ సీజన్. రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి దిగిన ముజరబానీని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఇష్టపడలేదు. దీంతో అతడు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. అయితే అదృష్టం ముజరబానీని ముస్తాఫిజుర్ రెహ్మాన్ రూపంలో వెతుక్కుంటూ వచ్చింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, ఇతర కారణాల రీత్యా బంగ్లా ఆటగాళ్లను ఐపీఎల్లో పాల్గొనకూడదంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. దీంతో బీసీసీఐ ఐపీఎల్లో ఆయా ఫ్రాంచైజీల్లో ఉన్న బంగ్లా ఆటగాళ్లను బహిష్కరించాలని సందేశాలు పంపింది. దీంతో కేకేఆర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి విడుదల చేసింది.వెతుక్కుంటూ అవకాశం..అతడి స్థానంలో నిఖార్సైన బౌలర్ కోసం వెతికింది. ఈ నేపథ్యంలోనే అప్పటికే టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే తరఫున 6 మ్యాచ్‌లాడిన బ్లెసింగ్ ముజరబానీ 7.88 ఎకానమీ రేట్‌తో 13 వికెట్లు పడగొట్టాడు. మొదట అసలు వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచిన ముజరబానీపై కేకేఆర్ కన్ను పడింది. దీంతో ముస్తాఫిజుర్ స్థానంలో ముజరబానీని రీప్లేస్ చేస్తున్నట్లు కేకేఆర్ యాజమాన్యం ప్రకటించింది.ఎవరీ ముజరబానీ?29 ఏళ్ల ముజరబానీ జింబాబ్వేలోని మురేవా అనే చిన్న పట్టణంలో జన్మించాడు. ఏడేళ్ల ప్రాయంలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న ముజరబానీకి అతని హైట్ ప్లస్ అయింది. 6 అడుగుల 8 అంగుళాల పొడవు ఉండే ముజరబానీ వేసే బౌన్సర్లు బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాయి. అలా 2017లో జాంబాబ్వే మాజీ క్రికెటర్ తెటెండా తైబు కళ్లలో పడిన ముజరబానీ రైజింగ్ స్టార్స్ అకాడమీలో మూడు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకొని బౌలింగ్‌లో మరింత రాటుదేలాడు. 2017లో జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ముజరబానీ ఇప్పటివరకు 18 టెస్టుల్లో 67 వికెట్లు, 57 వన్డేల్లో 70 వికెట్లు, 88 టీ20ల్లో 105 వికెట్లు పడగొట్టాడు.మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 243 వికెట్లు పడగొట్టిన ముజరబానీ జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 2026 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించడంలో ముజరబానీదే కీలకపాత్ర. ఆ మ్యాచ్‌లో ముజరబానీ 17 పరుగులకే 4 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అంతేకాదు రిచర్డ్ నగరవా, సికందర్ రజా తర్వాత జింబాబ్వే తరఫున టీ20ల్లో వంద వికెట్లు తీసిన మూడో బౌలర్‌గానూ ముజరబానీ నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన నితీశ్‌కుమార్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.చదవండి: మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది?The creative says it 😌 pic.twitter.com/Ta6bZ4lm5B— KolkataKnightRiders (@KKRiders) April 2, 2026Petition to change the word 𝐬𝐚𝐟𝐞 in dictionary to 𝐑𝐢𝐧𝐤𝐮 😌💜pic.twitter.com/3q7gcyXvVo— KolkataKnightRiders (@KKRiders) April 2, 2026 -
ఈడెన్‌లో ‘సన్’ మెరిసెన్
ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో 201 పరుగులు చేసి కూడా సన్‌రైజర్స్ ఓటమిని ఎదుర్కొంది. కానీ ఈసారి అదే బ్యాటింగ్ బలంతో గెలుపు బోణీ చేసింది. క్లాసెన్, అభిషేక్, హెడ్ల దూకుడుతో ఈ సీజన్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు దానిని నిలబెట్టుకుంది. సొంత మైదానంలో పేలవ బౌలింగ్‌తో భారీగా పరుగులిచ్చిన కేకేఆర్ ఛేదనలో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే కుప్పకూలింది. ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోగా... ఈ సీజన్లో గత ఐదు మ్యాచ్‌లకు భిన్నంగా తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు మొదటిసారి గెలవడం విశేషం. కోల్‌కతా: ఐపీఎల్ మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్లో తమ రెండో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం ఏకపక్షంగా సాగిన పోరులో హైదరాబాద్ 65 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (35 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, అభిషేక్ శర్మ (21 బంతుల్లో 48; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రవిస్ హెడ్ (21 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), నితీశ్ కుమార్ రెడ్డి (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం కోల్‌కతా 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. అంగ్కృష్ రఘువంశీ (29 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ఓపెనర్ల దూకుడు... హెడ్, అభిషేక్ అంచనాలకు అనుగుణంగా తమ విధ్వంసక బ్యాటింగ్‌తో హైదరాబాద్‌కు శుభారంభం అందించారు. అరోరా ఓవర్లో తొలి బంతికి ఫోర్ కొట్టిన హెడ్, ఆ తర్వాత అదే ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. 34 పరుగుల వద్ద హెడ్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను రహానే వదిలేశాడు. వరుణ్ వేసిన తొలి ఓవర్లో చెలరేగిపోయిన అభిషేక్ 2 సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టడంతో 25 పరుగులు లభించాయి. పవర్‌ప్లే ముగిసేసరికే స్కోరు 84 పరుగులకు చేరడం విశేషం. అయితే హెడ్‌ను అవుట్ చేసి త్యాగి తొలి వికెట్ తీయగా... ఆ తర్వాత 7 పరుగుల వ్యవధిలో ఇషాన్ కిషన్ (14), అభిషేక్, అనికేత్ వర్మ (1) వికెట్లు కోల్పోయింది. అభిషేక్ ఇచ్చిన క్యాచ్‌ను వరుణ్ అందుకునే సమయంలో బంతి నేలకు తాకినట్లు అనిపించినా...వరుస రీప్లేల తర్వాత అంపైర్ నితిన్ మేనన్ అవుట్‌గా ప్రకటించాడు. ఈ దశలో క్లాసెన్, నితీశ్ కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. క్లాసెన్ 34 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్‌ను అందుకోగా, ఆఖరి 3 ఓవర్లలో జట్టు 4 వికెట్లు చేజార్చుకొని 42 పరుగులు రాబట్టింది. కేకేఆర్ బౌలర్ ముజరబాని 4 వికెట్లు తీశాడు. రఘువంశీ అర్ధసెంచరీ... పేన్ వేసిన మొదటి ఓవర్ తొలి బంతికి రహానే సింగిల్ తీయగా... తర్వాతి ఐదు బంతుల్లో ఫిన్ అలెన్ (7 బంతుల్లో 28; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా 4, 4, 6, 6, 4 బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. అయితే కేకేఆర్ దూకుడు ఈ ఒక్క ఓవర్‌కే పరిమితమైంది. దూబే వేసిన రెండో ఓవర్లోనే అలెన్ వెనుదిరగ్గా... రహానే (8), గ్రీన్ (2) విఫలమయ్యారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన రఘువంశీ 27 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రఘువంశీ, అనుకూల్ రాయ్ (0) ఒకే స్కోరు వద్ద అవుటైన తర్వాత రింకూ సింగ్, రమణ్‌దీప్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 39 బంతుల్లో 88 పరుగులు చేయాల్సిన స్థితిలో రింకూ అవుట్ కావడంతో కోల్‌కతా ఆశలు కోల్పోయింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) గ్రీన్ (బి) త్యాగి 46; అభిషేక్ (సి) వరుణ్ (బి) ముజరబాని 48; ఇషాన్ కిషన్ (సి) రింకూ (బి) ముజరబాని 14; క్లాసెన్ (సి) రమణ్‌దీప్ (బి) ముజరబాని 52; అనికేత్ (సి) రింకూ (బి) రాయ్ 1; నితీశ్ రెడ్డి (సి) వరుణ్ (బి) అరోరా 39; సలీల్ (బి) అరోరా 0; దూబే (నాటౌట్) 9; శివాంగ్ (సి) రహానే (బి) ముజరబాని 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–82, 2–111, 3–112, 4–118, 5–200, 6–200, 7–222, 8–226. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–47–2, ముజరబాని 4–0–41–4, నరైన్ 4–0–39–0, వరుణ్ చక్రవర్తి 2–0–31–0, కార్తీక్ త్యాగి 4–0–48–1, అనుకూల్ రాయ్ 2–0–16–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: అలెన్ (సి అండ్ బి) దూబే 28; రహానే (సి) మలింగ (బి) ఉనాద్కట్ 8; రఘువంశీ (రనౌట్) 52; గ్రీన్ (రనౌట్) 2; రింకూ (సి) ఉనాద్కట్ (బి) నితీశ్ 35; అనుకూల్ (సి) అండ్ (బి) నితీశ్ 0; రమణ్‌దీప్ (సి) ఉనాద్కట్ (బి) మలింగ 10; నరైన్ (సి) అనికేత్ (బి) మలింగ 12; త్యాగి (సి) ఇషాన్ కిషన్ (బి) ఉనాద్కట్ 5; వైభవ్ (నాటౌట్) 1; వరుణ్ (బి) ఉనాద్కట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16 ఓవర్లలో ఆలౌట్) 161. వికెట్ల పతనం: 1–30, 2–67, 3–74, 4–120, 5–120, 6–139, 7–154, 8–159, 9–161, 10–161. బౌలింగ్: పేన్ 2–0–35–0, హర్ష్ దూబే 2–0–17–1, అభిషేక్ 1–0–15–0, ఉనాద్కట్ 3–0–21–3, ఇషాన్ మలింగ 2–0–14–2, శివాంగ్ 4–0–41–0, నితీశ్ 2–0–17–2. ఎట్టకేలకు... జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా... హైదరాబాద్ జట్టు సగటు అభిమాని మన తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి రాణించాలని కోరుకోవడం సహజం. అయితే గత సీజన్ మొత్తం నితీశ్ తీవ్రంగా నిరాశపర్చాడు. 11 ఇన్నింగ్స్‌లలో కలిపి పేలవమైన స్ట్రయిక్ రేట్ 118.95తో మొత్తం 182 పరుగులే చేసిన అతని అత్యధిక స్కోరు 32 మాత్రమే. బౌలింగ్‌లో రెండే వికెట్లు తీశాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో విఫలమైన అతను ఇక్కడ దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా అరోరా బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ హైలైట్‌గా నిలిచింది. బౌలింగ్‌లో కూడా కీలకమైన రింకూ సింగ్ వికెట్ అతను పడగొట్టాడు. 200 ఐపీఎల్లో రహానేకు ఇది 200వ మ్యాచ్. ఈ మైలురాయిని అందుకున్న 11వ ఆటగాడు రహానే. అతను లీగ్‌లో ఆరు జట్లకు (కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, ముంబై, రాజస్తాన్, పుణే) ప్రాతినిధ్యం వహించాడు. -
ఎవరిదో తొలి విజయం!
కోల్‌కతా: ఐపీఎల్లో మాజీ చాంపియన్లు అయిన రెండు జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్‌లో నేడు జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. ఈ రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌లలో ఓడిన నేపథ్యంలో మొదటి గెలుపుపై దృష్టి పెట్టాయి. సొంత మైదానంలో ప్రత్యర్థికంటే కేకేఆర్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. 201, 220... తమ మొదటి మ్యాచ్‌లో బెంగళూరుపై హైదరాబాద్, ముంబైపై కోల్‌కతా చేసిన స్కోర్లు ఇవి. అయినా సరే వాటికి ఓటమి తప్పలేదు. బౌలింగ్ బలహీనతల కారణంగా పరాజయం ఎదుర్కొన్న టీమ్‌లు ఎలా వ్యూహరచన చేస్తాయనేది ఆసక్తికరం. ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో ఇప్పటికే హైదరాబాద్ బౌలింగ్‌లో పస తగ్గింది. జైదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే బౌలింగ్‌తో కోల్‌కతాను ఏమాత్రం నిలువరించగలరో చూడాలి. తొలి మ్యాచ్‌లో విఫలమైన హెడ్, అభిషేక్ శర్మ చెలరేగితే తిరుగుండదు. ఇషాన్, క్లాసెన్ తమ ఫామ్‌ను ఇప్పటికే చూపించు కున్నారు. మరోవైపు కేకేఆర్ బౌలింగ్ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. వైభవ్ తేలిపోగా, ముజరబానికి తగినంత అనుభవం లేదు. వరుణ్ కూడా భారీగా పరుగులివ్వడంతో టీమ్‌లో ఆందోళన రేపే అంశం. బ్యాటింగ్‌లో రహానే, అలెన్ శుభారంభం అందించాల్సి ఉంది. ఐపీఎల్లో కోల్‌కతా, హైదరాబాద్ మధ్య 30 మ్యాచ్‌లు జరిగాయి. 20 మ్యాచ్‌ల్లో కోల్‌కతా, 10 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ గెలిచింది. కోల్‌కతాపై హైదరాబాద్ అత్యధిక స్కోరు 278 కాగా, అత్యల్ప స్కోరు 113. హైదరాబాద్‌పై కోల్‌కతా అత్యధిక స్కోరు 208 కాగా, అత్యల్ప స్కోరు 101గా ఉంది. -
IPL 2026: ’ప్రేక్షకుల్ని మురిపించడానికి ఆడను’
తనను విమర్శించే వారికి భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత కోల్‌కతా నైట్‌రైడర్స్ సారథి అజింక్య రహానే గట్టి కౌంటర్ ఇచ్చాడు. తాను క్రికెట్ ఆడేది పూర్తిగా తన వ్యక్తిగతమని.. ప్రేక్షకుల్ని మురిపించడానికో.. విమర్శకులకు తానేంటో నిరూపించడానికో కాదని స్పష్టం చేశాడు. ఆటగాడిగానేతన భవిష్యత్తుపై, రిటైర్మెంట్పై వచ్చే ఊహాగానాలను రహానే (Ajinkya Rahane) కొట్టిపారేశాడు. 37 ఏళ్ల రహానే గత సీజన్లో ముంబై రంజీ ట్రోఫీ సారథ్యం నుంచి తప్పుకున్నాడు. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ నాయకుడిగా కాకుండా ఆటగాడిగానే కొనసాగాడు. దీంతో ఇక విమర్శకులు అదేపనిగా రహానే రిటైర్మెంట్ ఖాయమనే వ్యాఖ్యలు చేస్తున్నారు. 20 ఏళ్లుగా అదే పని ముంబైతో మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో దీనిపై రహానే స్పందిస్తూ ‘ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటారు. ఇవేమి కొత్తకాదు కదా! దాదాపు 20 ఏళ్లుగా నా గురించి మాట్లాడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లని అలాగే కొనసాగనివ్వండి. నేనేమో నా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తాను. వాళ్లనలా చూడనివ్వండినా ఆటతీరేంటో నాకు తెలుసు. నా ప్రదర్శన పట్ల సంతృప్తికరంగా ఉన్నాను. అంతేతప్ప నేనేంటో... నా ప్రతిభేంటో కొత్తగా ఎవరికీ చూపించుకోవడానికి ఆడట్లేదు. ప్రేక్షకులు చూస్తున్నారు. వాళ్లనలా చూడనివ్వండి. విమర్శకులు విమర్శిస్తారు. వీళ్లను అలాగే చేయనివ్వండి’ అని అన్నాడు. ముంబైతో జరిగిన పోరులో రహానే మెరుపు ఫిఫ్టీతో అదరగొట్టాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన ‘జింక్స్’... 5 సిక్సర్లు, మూడు బౌండరీలు బాదాడు. గత రెండు మూడేళ్లుగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో నా బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకున్న తీరుపట్ల తానెంతో సంతోషంగా ఉన్నానన్నాడు. ఓ క్రికెటర్‌గా, బ్యాటర్‌గా ఎదగడం ముఖ్యమని, తానిప్పుడు చేస్తున్నది కూడా అదేనని రహానె చెప్పుకొచ్చాడు. ముంబైతో జరిగిన పోరులో తాము బాగానే ఆడామని, కీలకమైన తరుణంలో మరిన్ని ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండగా చేయలేకపోయామని అన్నాడు.మా ఓటమికి కారణం అదే‘ముందుగా మేం 220 స్కోరు చేస్తే చాలానుకున్నాం. కానీ ఓ దశలో 235 నుంచి 240 పరుగులు చేస్తామని కూడా అనిపించింది. అయితే బుమ్రా స్పెల్ మా జోరుకు అడ్డుకట్ట వేసింది. అతని రెండు ఓవర్ల స్పెలే మరిన్ని పరుగులు చేయకుండా నిరోధించింది’ అని రహానే అన్నాడు.అనుభవలేమి బౌలింగ్ కూడా తమ ఓటమికి కారణమని రహానే చెప్పాడు. వైభవ్, కార్తీక్ త్యాగి, ముజరబానిలు తేలిపోయారని చెప్పాడు. ముజరబానికి అంతర్జాతీయ అనుభవమైతే ఉండొచ్చు కానీ ఐపీఎల్ అనుభవమైతే లేదన్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాయాజాలం కూడా పనిచేయలేదని, దీనివల్లే ముంబై జోరుకు ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయామన్నాడు. చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీని పంపండి: మైకేల్ వాన్ -
కేకేఆర్‌ను మోసం చేసిన గ్రీన్?.. రీఫండ్ చెల్లించాల్సిందే!
భారత క్రికెట్ వర్గాల్లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గురించి చర్చ నడుస్తోంది. ఐపీఎల్-2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడి కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసింది. ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతడికి సరైన వారసుడిగా గ్రీన్‌ను భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.అయితే, ఊహించని రీతిలో కేకేఆర్‌కు షాక్ తగిలింది. ఈ సీజన్లో కేకేఆర్ తొలుత ముంబై ఇండియన్స్‌తో తలపడగా.. ఆ మ్యాచ్‌లో గ్రీన్ బౌలింగ్ చేయనేలేదు. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు.. అందుకు క్రికెట్ ఆస్ట్రేలియా బదులిచ్చిన తీరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది.క్రికెట్ ఆస్ట్రేలియానే అడగండి‘ఆ విషయం ఏదో క్రికెట్ ఆస్ట్రేలియానే (CA) అడగండి’... ముంబైతో మ్యాచ్‌లో కామెరాన్ గ్రీన్ (Cameron Green) బౌలింగ్ చేయకపోవడంపై అడిగిన ప్రశ్నకు అజింక్య రహానే సమాధానమిది. ఒక ఐపీఎల్ టీమ్ సారథిగా తన జట్టు సభ్యుడి గురించి తనకే తెలీదన్నట్లుగా ఒకింత అసహనంతో రహానే ఈ మాట చెప్పడం వివాదాన్ని రేపింది. 10–12 రోజుల్లో దీనిపై ఆస్ట్రేలియా వెంటనే స్పందించింది. ‘గ్రీన్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతనిపై భారం ఎక్కువ పడకూడదని బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. 10–12 రోజుల్లో అతను బౌలింగ్ చేయవచ్చు. ఈ విషయం కేకేఆర్ యాజమాన్యానికి కూడా తెలుసు’ అని సీఏ స్పష్టం చేసింది. ఒక ఆల్‌రౌండర్ బౌలింగ్ చేయలేకపోవడం కోల్‌కతా తుది జట్టులో కూర్పుకు సమస్యగా మారింది. నిజానికి మ్యాచ్‌కు రెండు రోజుల ముందు, మ్యాచ్ ఆరంభానికి కొద్ది సేపు ముందు కూడా గ్రీన్ బౌలింగ్ చేశాడు. కానీ మ్యాచ్‌లో మాత్రం అతను బంతిని అందుకోలేదు! ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో అన్ని మ్యాచ్‌లూ కలిపి గ్రీన్ 19 బంతులే వేశాడంటే ఇప్పటికి దీనిపై కోల్‌కతా యాజమాన్యానికి స్పష్టత వచ్చేసి ఉంటుంది. రూ.25.20 కోట్లా!!!.. తెలివైన మోసం?నిజానికి తాజా పరిస్థితికి నైట్‌రైడర్స్ స్వయంకృతమే కారణం అనిపిస్తుంది. గ్రీన్ తన వైపు నుంచి తెలివిగా వేలంలోకి అడుగు పెట్టాడు. రిజిస్ట్రేషన్‌లో కేవలం ‘బ్యాటర్’ జాబితాలోనే తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇలా ఎందుకని అడిగితే తన మేనేజర్ పొరపాటు అని, బౌలింగ్ కూడా చేస్తానని చెప్పాడు. కానీ అది సాంకేతికంగా ముందు జాగ్రత్త కోసమే ‘ఆల్‌రౌండర్’ జాబితాలో పేరు నమోదు చేసుకోలేదు. ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్తో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్ ఒక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం చూస్తోంది. ఇలాంటి సమయంలో గ్రీన్ పేరు వచ్చింది. వేలం నిబంధనల ప్రకారం మొదటి ‘సెట్’లో బ్యాటర్లు వస్తారు. ఆ సమయంలో అన్ని జట్ల వద్ద భారీ మొత్తంలో డబ్బు ఉంటుంది. వెర్రిగా వేలంలో ముందుకు వెళ్లిసహజంగానే జట్లు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ‘బ్యాటర్’ జాబితాలో వచ్చిన గ్రీన్ కోసం కేకేఆర్ తీవ్రంగా పోటీ పడింది. అప్పటికే గ్రీన్ బౌలింగ్ గురించి టీమ్‌కు సమాచారం ఉండే ఉంటుంది. ఎందుకంటే 2025 డిసెంబర్లో వేలం జరగ్గా... అంతకుముందు సంవత్సరంపాటు సెప్టెంబరు 24 నుంచి అక్టోబర్ 2025 వరకు గాయంతో గ్రీన్ బౌలింగ్ చేయలేదు. టీ20ల్లో బ్యాటర్‌గా గ్రీన్ రికార్డు ఏమీ ఘనంగా లేదు. పైగా కొన్ని బంతుల్లో మ్యాచ్ గమనాన్ని మార్చే విధ్వంసకర బ్యాటర్ కూడా కాదు. అయినా సరే వెర్రిగా వేలంలో ముందుకు వెళ్లిన కేకేఆర్ కేవలం అతని బ్యాటింగ్ కోసం ఏకంగా రూ.25.20 కోట్లు ఖర్చు చేసింది! విఫల సమర్థనఇప్పుడేమో బౌలింగ్ చేయడం లేదని వాపోతోంది. నిజానికి గ్రీన్ కోసం వెచ్చించిన మొత్తంపై సంతోషమే అంటూ కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ విఫల సమర్థన కొత్త కాదు. 2025 సీజన్ కోసం వెంకటేశ్ అయ్యర్‌కు రూ. 23.75 కోట్లు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఆ సీజన్లో అతను అన్ని మ్యాచ్‌లు కూడా ఆడలేదు. 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఒకే అర్ధసెంచరీతో 142 పరుగులు చేసిన వెంకటేశ్ ఒక్క బంతి కూడా బౌల్ చేయలేదు! రీఫండ్ చెల్లించాల్సిందే!ఇదిలా ఉంటే.. గ్రీన్ విషయంలో భారత మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా కోల్‌కతా జట్టుకు అండగా నిలిచాడు. ‘ఒకవేళ మనం ఆల్‌రౌండర్‌గా ఆడే వ్యక్తికి భారీ మొత్తం చెల్లిస్తే.. అతడు కేవలం బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటే.. రీఫండ్ పొందడం కనీస అర్హత’ అని ట్వీట్ చేశాడు. అయితే, అతడి పోస్ట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరేమో గ్రీన్ కేకేఆర్‌ను తెలివిగా మోసం చేశాడని అంటుండగా.. మరికొందరు మాత్రం అన్నీ తెలిసే కేకేఆర్ ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుందని చివాట్లు పెడుతున్నారు. చదవండి: IPL 2026: నిషేధిత బ్యాట్‌తో దొరికిపోయిన సర్ఫరాజ్ ఖాన్ -
చెత్త కెప్టెన్సీ.. అతడికి ఎందుకు బంతి ఇవ్వలేదు?
ఐపీఎల్-2024లో చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ గత సీజన్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. అజింక్య రహానే సారథ్యంలో పద్నాలుగింట ఐదు మ్యాచ్‌లే గెలిచి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక తాజా ఎడిషన్‌ను కూడా కేకేఆర్ ఓటమితోనే ఆరంభించింది.ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 220 పరుగుల భారీ స్కోరు చేసిన కోల్‌కతా (KKR vs MI).. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81), రోహిత్ శర్మ (38 బంతుల్లో 78) ధనాధన్ దంచికొట్టడంతో ముంబై ఇండియన్స్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.Sealed in style 🔒@mipaltan begin their #TATAIPL 2026 campaign with an impressive 6⃣-wicket victory at home 💙Scorecard ▶️ https://t.co/JmJcgsoHQ7#KhelBindaas | #MIvKKR pic.twitter.com/zOnWb5Sc8U— IndianPremierLeague (@IPL) March 29, 2026ఆరు వికెట్ల తేడాతోవాంఖడే స్టేడియంలో 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 224 పరుగులు సాధించి.. ఆరు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై ముంబై గెలిచింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్.. కేకేఆర్ సారథి అజింక్య రహానే వ్యూహాలను విమర్శించాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో సునిల్ నరైన్‌కు బంతి ఇవ్వకపోవడాన్ని భజ్జీ తప్పుబట్టాడు.పవర్ ప్లేలో అదే అత్యుత్తమంజియోస్టార్ షోలో మాట్లాడుతూ.. ‘‘పవర్ ప్లేలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్‌తో బౌలింగ్ చేయించడం అత్యుత్తమ నిర్ణయం. అతడితో కనీసం రెండు ఓవర్లు అయినా వేయించాల్సింది. తద్వారా రోహిత్ శర్మను టార్గెట్ చేసే వీలు ఉండేది.నరైన్‌కు రోహిత్‌పై మంచి రికార్డు ఉంది. ఒకవేళ ఈరోజు కూడా రోహిత్‌ను త్వరగా అవుట్ చేసి ఉంటే.. ముంబై ఒత్తిడిలో కూరుకుపోయేది. ఇక పవర్ ప్లే సంగతి పక్కన పెడితే నరైన్‌కు పూర్తి కోటా బౌలింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. కెప్టెన్సీ ఎంత చెత్తగా ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనం’’ అని హర్భజన్ సింగ్ రహానే కెప్టెన్సీని విమర్శించాడు.వారిద్దరు అద్బుతంఏదేమైనా రోహిత్ శర్మ, రికెల్టన్‌లకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని భజ్జీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. వారిద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని.. కేకేఆర్ బౌలర్లను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదని ప్రశంసించాడు. కాగా ముంబైతో మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన సునిల్ నరైన్.. 30 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తిలక్ వర్మ (18) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: బంగ్లాదేశ్‌కు బ్యాడ్‌న్యూస్!.. షాకిచ్చిన జియోస్టార్! -
నేను ముందే చెప్పాను కదా!: అంపైర్‌తో రోహిత్ శర్మ
టీమిండియా దిగ్గజ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ ఐపీఎల్-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తుచేశాడు. కేవలం 38 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు.Rohit Sharma in his element 🙌🎥 Enjoy his scintillating early smacks for six 👊#MI are 64/0 after 5 overs.Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR | @mipaltan | @ImRo45 pic.twitter.com/ys8k0JNHlW— IndianPremierLeague (@IPL) March 29, 2026ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కోల్‌కతా (KKR vs MI)పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా 2012 తర్వాత తొలిసారి ఐపీఎల్లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై గెలుపు జెండా ఎగురవేసింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా అంపైర్‌తో రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది.గేజ్ టెస్టు నిర్వహిస్తుండగా.. కేకేఆర్ విధించిన 221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో.. అంపైర్ అతడి బ్యాట్‌ను పరీక్షించాడు. బ్యాట్ పరిమాణం సరిగ్గా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు గేజ్ టెస్టు నిర్వహిస్తుండగా.. రోహిత్ తన బ్యాట్ సరిగ్గానే ఉందంటూ రియాక్షన్ ఇచ్చాడు.నేను ముందే చెప్పాను కదా!అయితే, నిబంధన ప్రకారం బ్యాట్‌ను టెస్టు చేసిన అంపైర్ సంతృప్తి వ్యక్తం చేయగా.. ‘నేను ముందే చెప్పాను కదా!’ అన్నట్లుగా రోహిత్ శర్మ నవ్వులు చిందిస్తూ మైదానంలోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు హిట్‌మ్యాన్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి.కాగా గతేడాది ఎక్కువగా ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రోహిత్.. ఈసారి మాత్రం తుదిజట్టులో భాగంగా బరిలోకి దిగుతున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ అందించిన ఘనత రోహిత్ శర్మది. కెప్టెన్ హోదాలో ముంబైని సైతం ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అయితే, 2024లో ముంబై రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. చదవండి: IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్ చేయలేరు!?pic.twitter.com/0A7i9X5ybq— • (@ClassyCricket) March 30, 2026 -
'బాబు నీ మిస్టరీ.. హిస్టరీ అయిపోయింది'
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2026 నాకౌట్ మ్యాచ్‌లలో దారుణంగా విఫలమైన వరుణ్.. ఇప్పుడు ఐపీఎల్-2026లో అదే తీరును కనబరుస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ తరపున వరుణ్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అయితే చక్రవర్తి బౌలింగ్‌ను ఉతికారేశాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కూడా వరుణ్‌కు చుక్కలు చూపించాడు. ఈ తమిళనాడు స్పిన్నర్ మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో 48 పరుగులిచ్చి వికెట్ లెస్‌గా వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో చక్రవర్తిపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరుణ్ బౌలింగ్‌లో ఇక ఏమాత్రం 'మిస్టరీ' మిగిలిలేదని, అతడి పని అయిపోయందని శ్రీకాంత్ విమర్శించాడు."వరుణ్ చక్రవర్తి బంతిని స్పిన్ చేయడం నేర్చుకోకపోతే కచ్చితంగా ఇబ్బంది పడతాడు. ఎప్పుడూ గూగ్లీలే వేస్తానంటే కుదరదు. బౌలింగ్‌లో వైవిధ్యం ఉండాలి. తన లెగ్ స్పిన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి. అతడి బౌలింగ్‌లో ఇప్పుడు ఎలాంటి మిస్టరీ లేదు.అతడి మిస్టరీ కాస్త హిస్టరీ అయిపోయింది. లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ, బంతిని బ్యాటర్లకు కాస్త దూరంగా వేయాలి. అప్పుడే బ్యాటర్లు షాట్లు ఆడేందుకు భయపడతారు. అంతేకాకుండా పవర్‌ప్లేలో అతడితో బౌలింగ్ చేయించకూడదు" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. పవర్ ప్లేలో వరుణ్ వేసిన నాలుగో ఓవర్లో రోహిత్ శర్మ ఏకంగా 15 పరుగులు పిండుకున్నాడు. వరుణ్ బంతితో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వికెట్ల విషయం పక్కన పెడితే కనీసం పరుగులు కూడా కట్టడి చేయలేకపోయాడు. మరి తర్వాతి మ్యాచ్‌లలో ఎలా రాణిస్తాడో చూడాలి మరి.చదవండి: జడ్డూ, సందీప్ శర్మను కాదని అతడికే పగ్గాలు.. ఎందుకంటే?: సంగక్కర -
అతడొక అద్భుతమైన ఫీల్డర్.. ఎందుకిలా చేశారు?: మాజీ కెప్టెన్ ఫైర్
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అనుసరించిన వ్యూహాలను టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టాడు. ఇద్దరు కీలక పేసర్లను కాదని పవర్ ప్లేలో కెప్టెన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు ఎందుకు బౌలింగ్ చేశాడని ప్రశ్నించాడు.ఆరు వికెట్ల తేడాతోఅదే విధంగా సూర్యకుమార్ యాదవ్ విషయంలో యాజమాన్యం వ్యవహారశైలి ఏమిటో తనకు అర్థం కావడం లేదని చిక్కా విమర్శించాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 టోర్నీలో ముంబై బోణీ కొట్టిన విషయం తెలిసిందే. సొంతమైదానం వాంఖడే వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.తద్వారా పద్నాలుగేళ్ల విరామం తర్వాత తొలిసారి.. ఓ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లో ముంబై జయభేరి మోగించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినా.. ఆ జట్టు అనుసరించిన వ్యూహాలు మాత్రం తనకు ఆశ్చర్యం కలిగించాయని క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు.ఇది అసలు అంతుపట్టని విషయంతన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇది అసలు అంతుపట్టని విషయం. భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు తుదిజట్టులో చోటు ఇవ్వలేదు. సూర్యను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడం సరికాదు.అతడొక అద్భుతమైన ఫీల్డర్అతడొక అద్భుతమైన ఫీల్డర్. సూర్యకు బదులు రూథర్‌ఫర్డ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపాల్సింది. ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా పంపి సూర్యకు అన్యాయం చేశారు’’ అని చిక్కా ముంబై యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.మరో వ్యూహాత్మక తప్పిదం ఇదిఇక పవర్ ప్లేలో ముంబై అనుసరించిన వ్యూహాలను ప్రస్తావిస్తూ.. ‘‘ముంబై చేసిన మరో వ్యూహాత్మక తప్పిదం ఇది. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉన్నా.. వారి సేవలను పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. వారిద్దరు ఆలస్యంగా బంతితో రంగంలోకి దిగారు.ఇక తన తొలి ఓవర్లోనే బుమ్రా ఐదు స్లో బంతులు ఎందుకు వేశాడో నాకైతే అర్థం కాలేదు. తనదైన సహజశైలిలో స్వింగ్, సీమ కలగలిపి అతడు బౌలింగ్ చేయలేదు. మరోవైపు.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు తానే వేశాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో బౌల్ట్ నాలుగు ఓవర్ల కోటాలో 38 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. మరోవైపు.. పాండ్యా 3 ఓవర్లలో 39 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయగా.. బుమ్రా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగానేఇదిలా ఉంటే.. సూర్యను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించడంతో విమర్శలు రాగా.. హెడ్‌కోచ్ మహేళ జయవర్దనె స్పందించాడు. సూర్య గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్నందు వల్లే అతడిని ఎక్కువగా శ్రమపెట్టదలచుకోలేదని తెలిపాడు. ఫిట్నెస్ సమస్యలు తీవ్రం కాకుండా చూసుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.చదవండి: అంతుచిక్కని శార్దూల్ ఠాకూర్! -
ముంబై మెరిసె... నిరీక్షణ ముగిసె...
గత 13 సీజన్లుగా ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయిన ముంబై ఇండియన్స్... ఎట్టకేలకు ఆ అడ్డంకిని అధిగమించింది. 2012 తర్వాత తొలిసారి ముంబై జట్టు విజయంతో ఐపీఎల్ సీజన్‌ను ప్రారంభించింది. వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన పోరులో బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల దూకుడు తోడవడంతో ముంబై ఘనవిజయం సాధించింది.‘లోకల్ బాయ్’ శార్దుల్ ఠాకూర్ చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగా... బ్యాటింగ్‌లో రోహిత్, రికెల్టన్ మెరుపులతో హార్దిక్ పాండ్యా బృందం గెలుపు బోణీ కొట్టింది. తాజా సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200కు మించి స్కోరు చేసినా... దానిని కాపాడుకోవడంలో విఫలమైంది. ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌ను ముంబై ఇండియన్స్ విజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. పచ్చికతో కనిపించిన పిచ్ బౌలర్లకు సహకరిస్తుందనుకుంటే... వాంఖడేలో ఇరు జట్ల బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. అజింక్య రహానే (40 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా... అంగ్క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక అర్ధశతకం చేశాడు. ఫిన్ అలెన్ (17 బంతుల్లో 37; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (33 నాటౌట్; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 39 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), రోహిత్ శర్మ (38 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో విజృంభించారు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ముంబైకిదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం. 10 ఓవర్లలో 120... అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు శుభారంభం దక్కింది. తొలి రెండు ఓవర్లలో 14 పరుగులు రాగా... మూడో ఓవర్ నుంచి మోత మొదలైంది. గజన్ఫర్ బౌలింగ్‌లో అలెన్ 4, 6, 6తో విజృంభించాడు. ఇక హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రహానే, అలెన్ దంచికొట్టారు. తొలి రెండు బంతులకు రహానే సిక్స్‌లు బాదితే... చివరి మూడు బంతులకు అలెన్ ఫోర్లు కొట్టాడు. దీంతో 26 పరుగులు వచ్చాయి. ఫలితంగా 4 ఓవర్లు ముగిసేసరికి నైట్‌రైడర్స్ 57 పరుగులు రాబట్టింది. తదుపరి ఓవర్లో రెండు ఫోర్లు రాగా... చేంజ్ బౌలర్‌గా వచ్చిన శార్దుల్ ఈ జోడీని విడదీశాడు. అయినా రహానే నిలకడగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 120/2తో నిలిచింది. ఆ తర్వాత ముంబై బౌలర్లు పట్టు బిగించడంతో పరుగుల రాక గగనమైంది. ముంబై కుర్రాడు అంగ్క్రిష్ రఘువంశీ చక్కటి షాట్లు ఆడినా... వైస్ కెప్టెన్ రింకూ సింగ్ ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. దీంతో చివరి 10 ఓవర్లలో కోల్‌కతా 100 పరుగులకు పరిమితమైంది. శార్దుల్ ‘లక్కీ హ్యాండ్’ 2015 నుంచి ఐపీఎల్ ఆడుతున్న శార్దుల్ ఠాకూర్ ఆరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత... ఈ సీజన్లో ముంబై గూటికి చేరాడు. దేశవాళీల్లో ముంబై జట్టుకు సారథ్యం వహించే శార్దుల్... ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. తన తొలి ఓవర్లోనే ప్రమాదకర అలెన్‌ను వెనక్కి పంపిన అతడు... రెండో ఓవర్లో గ్రీన్ (18; 1 ఫోర్, 1 సిక్స్)ను బుట్టలో వేసుకున్నాడు. ధాటిగా ఆడుతున్న రహానేను సైతం అతడే అవుట్ చేసి కోల్‌కతా మరింత భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. అలవోకగా... ఐపీఎల్లో తమ అత్యధిక లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ పోటీపడి బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్లో 4, 6, 4తో రఫ్ఫాడించిన రోహిత్... కార్తీక్ త్యాగీ ఓవర్లో మరో రెండు సిక్స్‌లతో 23 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ‘హిట్‌మ్యాన్’కు ఇదే వేగవంతమైన అర్ధశతకం. మరో ఎండ్‌లో రికెల్టన్ కూడా దూకుడు కనబర్చడంతో పవర్‌ప్లేలో ముంబై 88 పరుగులు చేసింది. ఈ క్రమంలో రికెల్టన్ 24 బంతుల్లో ‘ఫిఫ్టీ’ఖాతాలో వేసుకున్నాడు. తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలో 148 పరుగులు చేశాక రోహిత్ అవుట్ కాగా... ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సూర్యకుమార్ యాదవ్ (16; 3 ఫోర్లు) ప్రభావం చూపలేకపోయాడు. రికెల్టన్ దురదృష్టవశాత్తు రనౌట్ కాగా... తిలక్ వర్మ (20; 4 ఫోర్లు), కెప్టెన్ హార్దిక్ (18 నాటౌట్; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయడంతో ముంబై మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.కెప్టెన్ కామెంట్చాలా ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్‌లో విజయం సాధించాం. 13 ఏళ్ల అనంతరం సీజన్ ఆరంభ పోరులో గెలవడం ఆనందంగా ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా అనిపించింది. 220 లక్ష్యం పెద్దదేం కాదు. అందుకు తగ్గట్లే రోహిత్, రికెల్టన్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చారు. శార్దుల్ ఠాకూర్ నుంచి జట్టు ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. ఇక అతడి కెరీర్ ముగిసే వరకు ముంబై ఇండియన్స్‌తోనే ఉంటాడు. –హార్దిక్ పాండ్యా, ముంబై కెప్టెన్ 221 ఐపీఎల్లో ముంబైకు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌పై చేజ్ చేసిన 219 పరుగుల లక్ష్యం రెండో స్థానానికి చేరింది. 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ముంబైకిది ఆరోసారి. పంజాబ్ కింగ్స్ ఎనిమిదిసార్లు ఈ ఘనత సాధించింది.గ్రీన్ విఫలం ఐపీఎల్ 19వ సీజన్ వేలంలో భారీ ధర (రూ. 25.20 కోట్లు) పెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 18 పరుగులే చేసిన అతడు... బౌలింగ్‌లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. » 2024 టి20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ట్రోఫీ అందించిన తర్వాత ఆడిన ఐపీఎల్లో రోహిత్ శర్మ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా దర్శనమివ్వగా... ఇప్పుడు తాజా టి20 ప్రపంచకప్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగాడు. » దక్షిణాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్‌ను కాదని... అదే దేశానికి చెందిన ర్యాన్ రికెల్టన్కు ముంబై తుది జట్టులో చోటు కల్పించగా... అతడు ఐపీఎల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరుతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. » కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్లు ఫిన్ అలెన్ (న్యూజిలాండ్), ముజరబాని (జింబాబ్వే)తో పాటు ముంబై ఇండియన్స్ ఆటగాడు గజన్ఫర్ (అఫ్గానిస్తాన్) ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేశారు. » ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ సారథి అజింక్య రహానే కండరాలు పట్టేయడంతో నాలుగో ఓవర్లో అతడు మైదానాన్ని వీడాడు. మిగతా మ్యాచ్‌లో రింకూ సింగ్ జట్టుకు నాయకత్వం వహించాడు. 1161 ఐపీఎల్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ (కోల్‌కతాపై 1161 పరుగులు) గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లి (పంజాబ్ కింగ్స్‌పై 1159 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. 190 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విదేశీ ప్లేయర్‌గా సునీల్ నరైన్ గుర్తింపు పొందాడు. కీరన్ పొలార్డ్ (189 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును నరైన్ సవరించాడు.స్కోరు వివరాలుకోల్కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) హార్దిక్ (బి) శార్దుల్ 67; అలెన్ (సి) తిలక్ (బి) శార్దుల్ 37; గ్రీన్ (సి) రూథర్‌ఫోర్డ్ (బి) శార్దుల్ 18; రఘువంశీ (సి) తిలక్ (బి) హార్దిక్ 51; రింకూ (నాటౌట్) 33; రమణ్‌దీప్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 220. వికెట్ల పతనం: 1–69, 2–109, 3–145, 4–205. బౌలింగ్: బౌల్ట్ 4–0–38–0; హార్దిక్ 3–0–39–1; గజన్ఫర్ 4–0–51–0; బుమ్రా 4–0–35–0; శార్దుల్ 4–0–39–3; మార్కండే 1–0–16–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (రనౌట్) 81; రోహిత్ (సి) అనుకూల్ (బి) అరోరా 78; సూర్యకుమార్ (సి) రింకూ (బి) కార్తీక్ 16; తిలక్ (సి) (సబ్) మనీశ్ (బి) నరైన్ 20; హార్దిక్ (నాటౌట్) 18; నమన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–148, 2–179, 3–184, 4–215. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–52–1; ముజరబాని 3–0–34–0; వరుణ్ చక్రవర్తి 4–0–48–0; కార్తీక్ త్యాగి 4–0–43–1; నరైన్ 3–0–30–1; అనుకూల్ రాయ్ 1.1–0–15–0. -
ముంబై ఇండియన్స్ ‘ట్రిపుల్ సెంచరీ’
ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా ముంబై ఇండియన్స్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 300 టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ జట్టుగా గుర్తింపు పొందింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి (2008) కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు 2013, 2015, 2017, 2019, 2020లలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ముంబై జట్టు మరోసారి ఐపీఎల్ టైటిల్‌ను సాధించడంలో విఫలమైంది. గత ఏడాది ముంబై జట్టు క్వాలిఫయర్–2లో పంజాబ్ కింగ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక అత్యధిక టి20 మ్యాచ్‌లు ఆడిన జట్ల జాబితాలో పాకిస్తాన్ జాతీయ జట్టు, సోమర్సెట్ కౌంటీ క్రికెట్ క్లబ్ జట్టు 303 మ్యాచ్‌లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. 296 మ్యాచ్‌లతో హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ నాలుగో స్థానంలో, 287 మ్యాచ్‌లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదో స్థానంలో ఉన్నాయి. -
అనుకున్నదే జరిగింది.. రూ.25 కోట్ల ప్లేయర్ అట్టర్ ప్లాప్
ఐపీఎల్-2026 సీజన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ పేలవంగా ఆరంభించాడు. ఐపీఎల్లో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచిన గ్రీన్.. తను ఆడిన తొలి మ్యాచ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 10 బంతులు ఎదుర్కొన్న గ్రీన్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు అజింక్య రహానే(67), ఫిన్ అలెన్(37) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఫిల్ అలెన్ ఔటయ్యాక క్రీజులోకి గ్రీన్ వచ్చాడు. గ్రీన్ ఓ ఫోర్, సిక్సర్ బాది జోష్‌లో కన్పించాడు. కానీ గ్రీన్ తన జోరును కొనసాగించలేకపోయాడు. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రూథర్ ఫర్డ్‌కు క్యాచ్ ఇచ్చి గ్రీన్ ఔటయ్యాడు.కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధర వెచ్చించి కేకేఆర్ మరి కొనుగోలు చేసింది. అయితే చాలా మంది గ్రీన్‌కు అంత ధర వెచ్చించడాన్ని తప్పుబట్టారు. ఇప్పుడు అందరూ అంచనా వేసినట్లే తొలి మ్యాచ్‌లోనే గ్రీన్ విఫలమయ్యాడు. అంతకుముందు జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లోనూ గ్రీన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ అదే తీరును కొనసాగించేలా కన్పిస్తున్నాడు.తుది జట్లు..ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ఘజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాకేకేఆర్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ -
కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
221 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ (38 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకాలతో ముంబై గెలుపును ఖరారు చేశారు. అంతకుముందు రహానే (40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులు), ఫిన్ అలెన్ (17 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు), అంగ్క్క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు), రింకూ సింగ్ (21 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 నాటౌట్) సత్తా చాటడంతో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది.రికెల్టన్ (81) ఔట్15.2వ ఓవర్- 184 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. అనుకూల్ రాయ్ అద్భుతమైన త్రో వేయడంతో ర్యాన్ రికెల్టన్ (81) ఔటయ్యాడు.సూర్యకుమార్ యాదవ్ (16) ఔట్14.2వ ఓవర్-179 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో రింకూ సింగ్ క్యాచ్ పట్టడంతో సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. రోహిత్ శర్మ 78 (38) ఔట్11.5వ ఓవర్- 148 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. వైభవ్ అరోరా బౌలింగ్‌లో అనుకూల్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ ఔటయ్యాడు. రికెల్టన్కు (67) జతగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడు.లక్ష్యం దిశగా దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ దూసుకుపోతుంది. 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 111 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (59), రికెల్టన్ (50) అర్ద సెంచరీలు పూర్తి చేసి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు.ముంబై ఇండియన్స్ టార్గెట్ ఎంతంటే..?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. రహానే (67), రఘువంశీ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. రింకూ సింగ్ (33 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో ఫిన్ అలెన్ (37) సైతం మెరుపులు మెరిపించాడు. భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న కెమరూన్ గ్రీన్ (18) దారుణంగా విఫలం కాగా.. రమన్‌దీప్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్ చేయగా..హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్18.3వ ఓవర్- 205 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి రఘువంశీ (51) ఔటయ్యాడు. రహానే (67) ఔట్13.3వ ఓవర్- 146 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి రహానే (67) ఔటయ్యాడు. రఘువంశీకి (17) జతగా రింకూ సింగ్ క్రీజ్‌లోకి వచ్చాడు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. గ్రీన్ ఔట్8.5 ఓవర్- 109 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రూథర్‌ఫోర్డ్‌కు క్యాచ్ ఇచ్చి కెమరూన్ గ్రీన్ (18) ఔటయ్యాడు. రహానేకు (49) జతగా రఘువంశీ క్రీజ్‌లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్5.2 ఓవర్- 69 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఫిన్ అలెన్ (37) ఔటయ్యాడు. రహానేకు (28) జతగా గ్రీన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 29) జరుగుతున్న ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, AM ఘజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాకేకేఆర్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ -
తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించనున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ ముంబై తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఒక అద్భుతమైన మైలు రాయిని అందుకోనుంది. ముంబై జట్టుకు ఇది 300వ టీ20 మ్యాచ్ కావడం గమానర్హం. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా ముంబై సరికొత్త రికార్డు సృష్టించనుంది.కాగా ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో తమకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకుంది. ముంబై జట్టు ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. తద్వారా అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా సీఎస్కేతో కలిసి సంయుక్తంగా ముంబై అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 299 మ్యాచ్‌లలో 162 విజయాలు నమోదు చేసింది. ఓవవరాల్‌గా అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో ముంబై ఇండియన్స్ మూడో స్ధానంలో నిలిచింది. మొదటి స్దానంలో పాకిస్తాన్(303) ఉండగా, రెండో సోమర్సెట్(303) కొనసాగుతోంది.అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన టాప్-5 ఐపీఎల్ జట్లుముంబై ఇండియన్స్-299రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-287కోల్‌కతా నైట్‌రైడర్స్-281చెన్నై సూపర్ కింగ్స్-277ఢిల్లీ క్యాపిటల్స్-274చదవండి: SA vs NZ: ఉత్కంఠ పోరు.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిచిన సౌతాఫ్రికా -
ఫేవరెట్‌గా ముంబై.. భయం గుప్పిట్లో కేకేఆర్!
ఐపీఎల్ 19వ సీజన్లో ఇవాళ ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా ముంబై కనిపిస్తున్నప్పటికీ కేకేఆర్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. కానీ రెండు జట్లలో కేకేఆర్‌పై ఒత్తిడి కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే ముంబైని వారి సొంత గ్రౌండ్లో కేకేఆర్ ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఓడించగలిగింది. వాంఖడేలో ఇరు జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరిగితే 10 సార్లు ముంబై విజయం సాధించడం విశేషం. అయితే ఈసారి దానిని తిరగరాసి విజయంతో సీజన్‌ను ఆరంభించాలని కేకేఆర్ ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు ముంబై టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్నప్పటికీ, దాదాపు ప్రతీ ఐపీఎల్ సీజన్‌ను ముంబై ఓటమితోనే ప్రారంభించిన దాఖలాలున్నాయి. మరి ఈసారి తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి దానికి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. ముంబై ఇండియన్స్ ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) చాంపియన్స్‌గా నిలిచింది. 2020లో చివరిసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై అప్పటినుంచి ఆరో టైటిల్ కోసం నిరీక్షిస్తూనే వస్తోంది. మూడుసార్లు (2012, 2014, 2024) ఐపీఎల్ విజేతగా నిలిచిన కేకేఆర్ మరో టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి చూసుకుంటే ఇప్పటిరవరకు 35 సార్లు తలపడగా ముంబై 24 సార్లు నెగ్గితే, కేకేఆర్ 11 సార్లు విజయం సాధించింది. బలబలాల విషయానికొస్తే.. కేకేఆర్‌తో పోలిస్తే ముంబై బ్యాటింగ్ లైనప్ కాస్త బలంగా ఉంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలోని నలుగురు (పాండ్యా, సూర్యకుమార్, తిలక్ వర్మ, బుమ్రా) ముంబై జట్టులో ఉండడం బలమని చెప్పొచ్చు. వీరితో సహా రూథర్‌ఫోర్డ్, రికిల్టన్లతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్లుగా మయాంక్ లేదా శార్ధూల్ కూడా కీలకం కానున్నారు. బౌలింగ్‌లో బుమ్రా మరోసారి కీలకం కానుండగా, కివీస్ మాజీ బౌలర్ బౌల్ట్ కూడా ప్రమాదకారే.ఇక కేకేఆర్ బ్యాటింగ్ విషయానికొస్తే రహానే, సునీల్ నరైన్, సీఫెర్ట్, రఘువంశీ, రింకూ సింగ్‌తో పాటు ఆల్‌రౌండర్లు రమణ్‌దీప్, కామెరున్ గ్రీన్‌లు కీలకం కానున్నారు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ముజరబానీ కీలకం. కేకేఆర్‌పై రోహిత్ శర్మ 127 స్ట్రైక్‌రేట్‌తో 967 పరుగులు సాధించగా, సునీల్ నరైన్ ముంబైతో ఆడిన మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టాడు.ముంబై తుది జట్టు అంచనా: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, రియాన్ రికిల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్, రూథర్‌ఫోర్డ్, నమన్ ధిర్, గజన్ఫర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్లు: మయాంక్ మార్కండే/ శార్దూల్ ఠాకూర్కేకేఆర్ తుది జట్టు అంచనా: అజింక్యా రహానే (కెప్టెన్), సునీల్ నరైన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీపర్)/ ఫిన్ అలెన్, కామెరున్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ముజరబానీఇంపాక్ట్ ప్లేయర్స్: రాహుల్ త్రిపాఠి/ కార్తిక్ త్యాగి చదవండి: ‘బౌలర్ల వైఫల్యం మా కొంపముంచింది’ -
’ముందు షారుఖ్ ఖాన్.. ఆ తర్వాత అతడే’
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ అజింక్య రహానే సహచర ఆటగాడు రింకూ సింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన ఆట తీరుతో అనతికాలంలోనే రింకూ కేకేఆర్ ముఖచిత్రంగా మారిపోయాడని కొనియాడాడు. కాగా టీమిండియా స్టార్, విధ్వంసకర ఆటగాడు రింకూ సింగ్‌ను కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మూడుసార్లు విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు ప్రస్తుతం అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.అభిషేక్ నాయర్ సూచనతోనేఅయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అతడి డిప్యూటీగా రింకూ సింగ్‌ను నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ మంగళవారం వెల్లడించింది. ‘మైదానంలో వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్ (Rinku Singh)... రహానేకు చేదోడు వాదోడుగా నిలవనున్నాడు’ అని కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ తెలిపాడు. ఫ్రాంచైజీ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.‘చాన్నాళ్లుగా రింకూను గమనిస్తున్నా. జట్టు కోసం ఏదైనా చేయాలని తాపత్రయ పడుతుంటాడు. అందుకే అతడికి కాస్త అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నాం. దానికి ఇదే సరైన సమయం అని భావించాం’ అని నాయర్ అన్నాడు.రూ. 80 లక్షల నుంచి రూ. 13 కోట్లకుకాగా 2018లో రూ. 80 లక్షలు పెట్టి రింకూను తీసుకున్న కోల్‌కతా ఫ్రాంచైజీ... గతేడాది అతడికి రూ. 13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. ఇక 2023 ఐపీఎల్లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్లో ఆఖరి ఐదు బంతులకు సిక్స్‌లు బాది జట్టును గెలిపించిన రింకూ సింగ్ ఒక్కసారిగా స్టార్‌గా ఎదిగాడు. ఫినిషర్ పాత్రఆ తర్వాత కూడా నిలకడ కొనసాగిస్తూ జట్టుకు అవసరమైన సమయంలో ఫినిషర్ పాత్ర పోషించాడు. దీంతో ఫ్రాంచైజీ అతడిపై నమ్మకముంచింది. ఈ నేపథ్యంలో ‘టీమ్ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు. వైస్ కెప్టెన్‌గా ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. జట్టు విజయం కోసం నావంతు కృషి చేస్తా’ అని రింకూ పేర్కొన్నాడు. ఇక రహానే మాట్లాడుతూ.. ‘‘రింకూ ఎదిగిన తీరు అద్బుతం.కేకేఆర్ గురించి చర్చ వస్తే మొదటగా గుర్తొచ్చే పేరు షారుఖ్ ఖాన్. తర్వాత రింకూ సింగే అందరికీ గుర్తుకు వస్తాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. కాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నటి జూహీ చావ్లా, ఆమె భర్త జై మెహతా కేకేఆర్ సహ యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే.చదవండి: రూ. 15 వేల కోట్లకు RR అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే? -
ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం!
ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌కు అరుదైన గౌరవం కల్పించింది. గత సీజన్లో రస్సెల్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేకేఆర్ రసెల్ జెర్సీ నంబర్ 12కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మూడు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో మంగళవారం రాత్రి కేకేఆర్ ‘నైట్స్ అన్ప్లగ్డ్’ పేరిట ప్రీ సీజన్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా రస్సెల్ జెర్సీ నంబర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేసింది. ఇదే విషయమై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. ‘రస్సెల్.. నీకు కేకేఆర్ ఇస్తున్న బహుమానం ఇదే. నీ జెర్సీ నంబర్ 12కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాం. ఇక మీదట 12 జెర్సీ నంబర్ నీకే సొంతం’ అని తెలిపారు. అయితే ఐపీఎల్ చరిత్రలో ఒక ఫ్రాంచైజీ ఆటగాడి జెర్సీ నంబర్‌కు అధికారిక రిటైర్మెంట్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి హాజరైన రస్సెల్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘దశాబ్దానికి పైగా ఈ జట్టుతో ఎన్నో విజయాలు సాధించాను. రెండు టైటిల్స్ గెలిచాం. ఆ జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు మెదిలాయి. అది చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. ప్రతి మ్యాచ్‌ను నా చివరి మ్యాచ్‌లా ఆడాను’ అని వెల్లడించాడు.దశాబ్దానికి పైగా..కేకేఆర్ జట్టుతో దశాబ్దానికి పైగా అనుబంధం కలిగిన రస్సెల్.. 2014, 2024 టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కేకేఆర్ తరఫున రస్సెల్ 2,651 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు పడగొట్టాడు.గతంలో సచిన్, ధోని..ఇది వరకు భారత క్రికెట్లో బీసీసీఐ మాత్రమే జెర్సీ నంబర్లను రిటైర్ చేసింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10, ఎంఎస్ ధోనీ జెర్సీ నంబర్ 7లను రిటైర్ చేశారు. అయితే ఐపీఎల్లో ఇలాంటి నిర్ణయం ఇప్పటివరకు ఎప్పుడూ తీసుకోలేదు. తాజా సీజన్‌కు ముందు రస్సెల్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ఆసక్తికరంగా అతను వేలంలోకి వెళ్లకుండా కేకేఆర్ ఆఫర్‌ను అంగీకరించి ‘పవర్ కోచ్’గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. ఇకపై యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టనున్నాడు.ICYMI: Jersey no. 12 forever belongs to DRE RUSS 💜 pic.twitter.com/D1cFfhuYvI— KolkataKnightRiders (@KKRiders) March 24, 2026 చదవండి: ‘ఐపీఎల్ మరో స్థాయికి వెళ్లిపోయింది’ -
భవిష్య కెప్టెన్‌గా రింకూ సింగ్.. ప్రకటన విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కీలక ప్రకటన చేసింది. తమ జట్టు వైస్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్, టీ20 ప్రపంచకప్ విజేత రింకూ సింగ్‌ను నియమించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి కేకేఆర్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఐపీఎల్-2024లో కేకేఆర్ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) జట్టును చాంపియన్‌గా నిలిపాడు. అయితే, మెగా వేలం-2025కి ముందు యాజమాన్యంతో విభేదాలు తలెత్తగా అతడు జట్టును వీడాడు. ట్రోఫీ అందించిన కెప్టెన్ అయినప్పటికీ కేకేఆర్ అతడిని ఆపే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వచ్చాయి. కెప్టెన్‌గా రహానేఇక మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు శ్రేయస్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌ను చేసింది. ప్రతిగా 2025లో జట్టును ఫైనల్‌కు చేర్చి అతడు సత్తా చాటాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ స్థానంలో కేకేఆర్ అనూహ్య రీతిలో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానేను కెప్టెన్‌గా నియమించింది.గతేడాది రహానే సారథ్యంలో కేకేఆర్ పద్నాలుగు మ్యాచ్‌లకు కేవలం ఐదే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ కేకేఆర్ ఈ ఏడాది కూడా రహానేను కెప్టెన్‌గా కొనసాగించనుంది.భవిష్య కెప్టెన్ రింకూనేనిజానికి రింకూకే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు సైతం రింకూ చుట్టు జట్టును అభివృద్ధి చేయాలని సూచించారు. అయితే, తాజాగా అతడిని రహానే డిప్యూటీగా నియమిస్తూ కేకేఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిని బట్టి కేకేఆర్ భవిష్య కెప్టెన్ రింకూనే అని యాజమాన్యం సంకేతాలు ఇచ్చినట్లు అయింది.కాగా 2018 నుంచి రింకూ సింగ్ కేకేఆర్‌తో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 59 మ్యాచ్‌లలో కలిపి 1099 పరుగులు సాధించాడు. ఫినిషర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే జోరులో టీమిండియా తరఫునా ఎంట్రీ ఇచ్చి టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్టులో రిజర్వు ప్లేయర్‌గా ఉన్నాడు. ఇక ఇటీవల ముగిసిన పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ 2026 గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. పేద కుటుంబంఉత్తరప్రదేశ్కు చెందిన రింకూది పేద కుటుంబం. అయినప్పటికీ అనేక సవాళ్లకు ఎదురు నిలిచి క్రికెటర్‌గా ఎదిగాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది లైమ్‌లైట్‌లోకి వచ్చిన రింకూ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. గతేడాది మినీ వేలానికి ముందు కేకేఆర్ రింకూను రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, అతడి విజయాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించకుండానే.. ముఖ్యంగా టెస్టుల్లో రింకూ ఆడాలన్న కోరిక తీరకుండానే అతడి తండ్రి ఇటీవలే మరణించాడు.లోక్‌సభ ఎంపీతో నిశ్చితార్థంవరల్డ్కప్ సమయంలో తండ్రి కన్నుమూసినా బాధను దిగమింగి.. అంత్యక్రియలు ముగిసిన తర్వాత రింకూ మళ్లీ జట్టుతో చేరాడు. మరోవైపు.. త్వరలోనే రింకూ పెళ్లి బంధంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభ ఎంపీ, సుప్రీంకోర్టు లాయర్ ప్రియా సరోజ్‌తో గతేడాది అతడి నిశ్చితార్థం జరిగింది.చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?God’s plan has a new chapter ✨ pic.twitter.com/2Gsy55mipi— KolkataKnightRiders (@KKRiders) March 24, 2026 -
విమర్శలొచ్చినా వెనక్కి తగ్గని రహానే!
గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) నిరాశజనక ప్రదర్శన చేసింది. జట్టుగా కేకేఆర్ విఫలమైనా, బ్యాటర్‌గా మాత్రం టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. 14 మ్యాచ్‌ల్లో 390 పరుగులు సాధించి కేకేఆర్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో రహానే సారథ్యంలో 14 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన కేకేఆర్ 8వ స్థానంలో నిలిచి లీగ్ దశలోనే వైదొలగింది. రహానే తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా జట్టు ఓటములపై ప్రభావం చూపించింది. అయితే ఈసారి మాత్రం ఆ తప్పు చేయకుండా కేకేఆర్ టైటిల్ కొట్టాలని రహానే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ తన ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి మరో నాలుగు రోజులు మిగిలిఉన్న నేపథ్యంలో అన్ని జట్లు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లతో బిజీగా గడుపుతున్నాయి. సోమవారం రాత్రి కేకేఆర్ జట్టు కూడా ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో రహానే బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. 25 బంతుల్లోనే 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్ల నుంచి బ్యాటింగ్‌లో గేర్ మార్చిన రహానే దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లోనూ రహానే అదే జోరు కనబరిచాడు. ఉన్నంతసేపు ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. మరో బ్యాటర్ కామెరున్ గ్రీన్ కూడా 30 బంతుల్లో 52 పరుగులు చేసి వెనుదిరిగాడు. న్యూజిలాండ్ సంచలనం ఫిన్ అలెన్ కూడా ఉన్నంతసేపు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. గాయపడిన ఆకాశ్‌దీప్ స్థానంలో జట్టులోకి వచ్చిన సౌరబ్ దూబే ఫిన్ అలెన్‌ను వెనక్కి పంపించాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత రహానే నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈడెన్ గార్డెన్లో స్పిన్ వనరులను వినియోగించుకోవడంలో విఫలమైన రహానే కెప్టెన్‌గా తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా జట్టుపై ప్రభావం చూపించాయి. అయితే తాజా సీజన్ ప్రారంభానికి ముందే బ్యాటర్‌గా తానేంటో నిరూపించుకున్న రహానే కెప్టెన్సీలోనూ అదే జోరు చూపించాలని భావిస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.చదవండి: విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు! -
కేకేఆర్ జట్టులోకి స్వింగ్ కింగ్.. ఎవరంటే?
ఐపీఎల్-2026 సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పీడ్ స్టార్ ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఆకాష్ దీప్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి సుమారు 8 నుంచి 12 వారాల సమయం పట్టనుంది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని విదర్భ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ దూబేతో కేకేఆర్ భర్తీ చేసింది.ఐపీఎల్-2022లో దూబేను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసినప్పటికి, గాయం కారణంగా అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది సీజన్ మినీ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నప్పటికి ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఆకాష్ దీప్ గాయం బారిన పడడంతో లక్కీగా ఐపీఎల్లో ఆడే అవకాశం దూబేకు దక్కింది.ఈ విదర్భ పేసర్‌కు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా అతడి ఉంది. అంతేకాకుండా బౌన్సీ పిచ్‌లపై బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. 2019 ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో భారత అండర్-23 జట్టు తరపున దూబే అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఒకే మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.ఆ సమయంలో భారత అండర్-23 జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉండడం విశేషం. ద్రవిడ్ వంటి దిగ్గజం నుంచి కూడా అతడు పాఠాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి మహా వేదికపై సత్తాచాటేందుకు సౌరభ్ సిద్దమయ్యాడు.కాగా కేకేఆర్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ దూరం కాగా.. శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరానా ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఐపీఎల్-19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్..! -
కోల్‘కథ’ హిట్ అవుతుందా?
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ల తర్వాత ‘ఐపీఎల్’ బుక్‌లో తమ కంటూ చరిత్ర లిఖించుకున్న ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్). మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఈ ‘త్రీ స్టార్’ చాంపియన్ గతేడాది మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. 2024లో విజేతగా నిలిచిన కేకేఆర్... గత సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి పేలవమైన ప్రదర్శనతో ఏకంగా ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇప్పుడు మాత్రం ఈ మరకను మరిచి... ఇంకో ఐదు రోజుల్లో ఆరంభమయ్యే లీగ్‌లో మెరుగైన ప్రదర్శనతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమైంది. –సాక్షి క్రీడా విభాగంఐపీఎల్ లీగ్‌లో ఫైనల్ చేరితే టైటిల్స్‌ను ఉడుం పట్టులా పట్టిన జట్టేదైనా ఉందంటే అది కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక్కటే! నాలుగుసార్లు 2012, 2014, 2021, 2024లలో తుదిపోరుకు అర్హత సంపాదించిన కేకేఆర్ ఒకే ఒక్కసారి (2021లో) మాత్రమే రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మిగతా మూడుసార్లు లీగ్ అసాంతం అసాధారణంగా రాణించిన జట్లను ఫైనల్లో బోల్తా కొట్టించి మరీ టైటిళ్లను ఎగరేసుకుపోయిన ఘనత కోల్‌కతాకే దక్కుతుంది. ఇప్పుడు కూడా ఇలాంటి ఆశల పల్లకితోనే ఈ సీజన్ బరిలోకి దిగుతోంది. అనుభవజ్ఞుడైన అజింక్య రహానే సారథ్యం గత సీజన్‌కు అక్కరకు రాలేదు. అలాగని అన్నీసార్లు అదే జరగదు! పైగా ఇది పొట్టి ఫార్మాట్! ఒక్క ఓవర్ చాలు ఫలితం తారుమారయ్యేందుకు..! కాబట్టి ప్రపంచ శ్రేణి హిట్టర్లు అందుబాటులో ఉన్న నైట్‌రైడర్స్ జట్టును గత సీజన్ ప్రదర్శనను బట్టి తక్కువ అంచనా వేయలేం. గ్రీన్‌పై గంపెడాశలతో...కోల్‌కతా జట్టులో మేటి బ్యాటర్లున్నారు. స్టార్ ఆల్‌రౌండర్లు సైతం అందుబాటులో ఉన్నారు. అయినా సరే పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆస్ట్రేలియన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్‌ను (రూ.25.20 కోట్లు) పాతిక కోట్లు పోసి కొనుక్కొంది. ఇంత భారీ మొత్తం పెట్టిన గ్రీన్ స్పెషలిస్టు టాపార్డర్ బ్యాటర్. ఓపెనింగ్ లేదంటే వన్‌డౌన్‌లో బ్యాటింగ్ దిగేందుకే ఇష్టపడతాడు. కానీ టాప్–3లో అందరూ పాతుకుపోయిన బ్యాటర్లే బోలెడు మంది ఉన్నారు. కెప్టెన్ రహానే సహా సునీల్ నరైన్, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్‌లు టాపార్డర్ బ్యాటర్లే. అంతే కాదు... నలుగురు విదేశీ ఆటగాళ్లు (నరైన్, ఫిన్, టిమ్, గ్రీన్)లు తుది జట్టుకు ఆడే ఆటగాళ్లు. అందుకే జట్టు మేనేజ్మెంట్కు బ్యాటింగ్ ఆర్డర్ సర్దుబాటే అతిపెద్ద సవాలుగా మారింది. ఇంపాక్ట్ ఓకే... మరి కూర్పు?విదేశీ స్టార్లే కాదు... భారత మేటి ఆటగాళ్లు సైతం నైట్‌రైడర్స్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ టి20ల్లోనే ప్రమాదకర బ్యాటర్. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో కివీ డాషింగ్ ఓపెనర్ దక్షిణాఫ్రికాపై సెమీస్‌లో 33 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు. సీఫెర్ట్ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగని భారత ఆటగాళ్లు తక్కువ కాదు. అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, రాహుల్ త్రిపాఠిలతో కూడిన బ్యాటింగ్ బెంచ్ అసాధరణమని చెప్పొచ్చు. ముఖ్యంగా రఘువంశీ, త్రిపాఠి, త్యాగిలు ఇంపాక్ట్ ప్లేయర్లుగా బరిలోకి దింపినా... రెగ్యులర్ జట్టులో రింకూ, రమణ్‌దీప్‌లు కూడా హిట్టర్లు. వీరందరూ టి20 ఫార్మాట్‌కు అవసరమైన వారే. కానీ తుది 11 మంది కూర్పు కోసం జట్టు మేనేజ్మెంట్ పెద్ద కసరత్తే చేయాలి. స్పిన్నర్లపైనే భారమంతా...బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనపడుతోంది. కానీ బౌలింగే ఆందోళన పరుస్తోంది. కీలకమైన పేసర్లు గాయాల బారిన పడటంతో ఇప్పుడు బౌలింగ్ భారమంతా స్పిన్నర్లపైనే పడింది. తిప్పేసే సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలే కోల్‌కతా బలమైనా... దళమైనా! డెత్ ఓవర్లను నియంత్రించే హర్షిత్ రాణాలాంటి పేసర్ స్థానంలో ముజరబాని (జింబాబ్వే)ను తీసుకున్నారు. ఇది ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి. మొత్తానికి ఒక్క పేస్ బౌలింగ్ కళ తప్పినా... ఆల్‌రౌండ్ సత్తా చాటే ఆటగాళ్లు కోల్‌కతాకు అందుబాటులో ఉన్నారు.గాయాల బెడదతో దడదడ!జట్టును ప్రధానంగా వేధిస్తున్న సమస్య గాయాలు. భారత పేస్ బౌలర్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ సీజన్ మొత్తానికే దూరమయ్యారు. శ్రీలంక యార్కర్ స్పెషలిస్ట్ పతిరణ పరిస్థితి కూడా అదే! ఇప్పటికైతే ఆరంభ మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ సింహళ సీమర్ అందుబాటులోకి వచ్చేది అనుమానమే. దీంతో బౌలింగ్ దళం... ప్రత్యేకించి పేస్ విభాగం బలహీనమైంది. దీనివల్ల అందుబాటులో ఉన్న బౌలర్లపై అదనపు భారమే కాదు... ఒత్తిడి కూడా పడినట్లయింది.కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, కామెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, ఉమ్రాన్ మాలిక్, రమణ్‌దీప్ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ముజరబాని, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, అనుకూల్ రాయ్, దక్ష్ కమ్రా, సార్థక్ రంజన్, మనీశ్ పాండే, అంగ్క్రిష్ రఘువంశీ, రాహుల్ త్రిపాఠి, తేజస్వి సింగ్, ప్రశాంత్ సోలంకి, పతిరణ.ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గణాంకాలుఆడిన మ్యాచ్‌లు 265 గెలిచినవి 136ఓడినవి 127రద్దు 2అత్యుత్తమ ప్రదర్శన: చాంపియన్ (2012, 2014, 2024), రన్నరప్ (2021). -
వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! ఇప్పుడు కేకేఆర్‌లోకి
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కాగా.. ఇప్పుడు మరో ఫాస్ట్ బౌలర్ ఈ జాబితాలోకి చేరాడు. స్పీడ్ స్టార్ ఆకాష్ దీప్ సైతం గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకొన్నాడు.మరోవైపు శ్రీలంక మతీషా పతిరానకు ఇంకా ఎన్వోసీ లభించలేదు. అతడు ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా బంగ్లాస్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను కూడా కేకేఆర్ కోల్పోయింది. అతడి స్ధానంలో ఇప్పటికే జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజరాబానీని జట్టులోకి కేకేఆర్ తీసుకుంది. అయితే ఇప్పుడు హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ స్ధానాలను భర్తీ చేసే పనిలో పడింది.కేకేఆర్‌లోకి సిమర్జీత్ హర్షిత్ రాణా స్ధానంలో ఢిల్లీ పేసర్ సిమర్జీత్ సింగ్‌ను తీసుకోవాలని కేకేఆర్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అతడిని ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సిమర్జీత్ గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అంతకుముందు సీఎస్కే తరపున మూడు సీజన్ల పాటు ఆడాడు. పవర్‌ప్లేలో బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా అద్భుతమైన యార్కర్లు కూడా సంధించగలడు. అయితే గతేడాది జరిగిన వేలంలో మాత్రం అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఇప్పుడు హర్షిత్ రాణా గాయం రూపంలో అతడికి మరోసారి ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కనుంది. ఇక ఆకాష్ దీప్ స్ధానాన్ని ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌తో భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్వాల్‌కు ఐపీఎల్ అనుభవం ఉంది. ఐపీఎల్-2023 ఎలిమినేటర్‌లో 5 వికెట్లు తీసి సత్తాచాటాడు. అయితే మధ్వాల్ కూడా వేలంలో అమ్ముడుపోలేదు. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా!? ఎప్పుడంటే? -
ఐపీఎల్‌కు ఆకాశ్‌దీప్ దూరం
కోల్‌కతా: మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో ఇప్పటికే పేస్ బౌలర్ హర్షిత్ రాణా ఈ మెగా టోర్నీకి దూరంకాగా... అతని సరసన మరో ఫాస్ట్ బౌలర్ ఆకాశ్‌దీప్ కూడా చేరాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఆకాశ్‌దీప్ కోలుకోవడానికి కనీసం ఎనిమిది నుంచి 12 వారాలు పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈనెల 28 నుంచి మొదలయ్యే ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఆకాశ్‌దీప్ తప్పుకున్నాడు. అఫ్గానిస్తాన్‌తో జూన్ తొలి వారంలో జరిగే ఏకైక టెస్టుకు కూడా ఆకాశ్‌దీప్ దూరమయ్యే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బిహార్‌కు చెందిన 29 ఏళ్ల ఆకాశ్‌దీప్ దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున 10 టెస్టులు ఆడిన అతను 28 వికెట్లుపడగొట్టాడు. ఐపీఎల్లో 2022 నుంచి 2024 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ఆడిన ఆకాశ్‌దీప్ గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆకాశ్‌దీప్ 10 వికెట్లు తీశాడు. -
కేకేఆర్‌కు మరో దెబ్బ.. కీలక ఆటగాడు దూరం!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే మూడుసార్లు చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కుడి మోకాలి గాయం కారణంగా కేకేఆర్ స్టార్ బౌలర్ హర్షిత్ రానా ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. తాజాగా కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్ ఆకాశ్‌దీప్ నడుము కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆకాశ్ దీప్ దాదాపు ఎనిమిది వారాల పాటు ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కోల్‌కతా ఫ్రాంచైజీ ధృవీకరించాల్సి ఉంది.‘ఆకాశ్ దీప్ నడుము కింది భాగం స్ట్రెస్‌కు గురి కావడంతో నొప్పి తీవ్రత పెరిగింది. అతడు కోలుకునేందుకు కనీసం 8 నుంచి 12 వారాల సమయం పట్టే అవకాశముంది. దీంతో ఐపీఎల్లో పాల్గొనే అవకాశాలు లేవు’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా ఆకాశ్‌దీప్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. కోటికి కొనుగోలు చేసింది. మరోవైపు శ్రీలంక పేసర్ మతీషా పతిరానా విషయంలోనూ ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ సీజన్లో రానా ఆడుతాడా? లేదా? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఎదురుదెబ్బలతో ప్రస్తుతం కేకేఆర్ బౌలింగ్ విభాగంలో వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, బ్లెసింగ్ ముజరబానీ, కార్తిక్ త్యాగి మాత్రమే ఉన్నారు. ఇప్పటికే వీరితో ట్రయల్ బౌలింగ్‌ను ప్రారంభించింది.చదవండి: అమ్ముడుపోని బౌలర్ విధ్వంసం! -
అమ్ముడుపోని బౌలర్ విధ్వంసం!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తన ప్రాక్టీస్‌ను ఆరంభించింది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన నవదీప్ సైనీ విజృంభించాడు. న్యూజిలాండ్ విధ్వంసరకర బ్యాటర్ ఫిన్ అలెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాక్టీస్‌లో భాగంగా కేకేఆర్ ఆటగాళ్లంతా శుక్రవారం పర్పుల్ నైట్స్, గోల్డెన్ నైట్స్‌గా విడిపోయి ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడారు. గోల్డెన్ నైట్స్ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పర్పుల్ నైట్స్‌కు శుభారంభం లభించింది. ఫిన్ అలెన్ 10 బంతుల్లోనే 23 పరుగులు బాదాడు. అయితే వేలంలో అమ్ముడుపోని నవదీప్ సైనీ బౌలింగ్‌కు వచ్చిన తరుణంలో అతడు వేసిన తొలి బంతిని ఫిన్ అలెన్ సిక్సర్‌గా మలిచాడు. అయితే ఆ తర్వాత బంతిని సైనీ యార్కర్ వేయగా ఫిన్ అలెన్ వికెట్ నుంచి పక్కకు జరిగి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఫిన్ అలెన్ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. కాగా ఫిన్ అలెన్‌ను కోల్‌కతా రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్పుల్ నైట్స్ 6 వికెట్ల తేడాతో గోల్డెన్ నైట్స్‌పై విజయం సాధించింది. అంగ్క్రిష్ రఘువంశీ 55 బంతుల్లోనే 103 పరుగుల మెరుపు సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు గోల్డెన్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ (45), సార్థక్ రాజన్ (37), రింకూ సింగ్ (40) రాణించారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో ఫిన్ అలెన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 200 స్ట్రైక్‌రేట్‌తో 298 పరుగులు సాధించాడు. ఇందులో సౌతాఫ్రికాపై 33 బంతుల్లోనే సెంచరీ సాధించిన ఫిన్ అలెన్ అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. తొలి విడతలో ముంబైతో పాటు ఎస్ఆర్హెచ్, పంజాబ్, లక్నోతో ఆడనుంది.Finn Allen got out early but the trailer has been shown, the picture will be seen in the IPL match. pic.twitter.com/eYBvOwCHdO— Ayush🎃 (@AyushBandhe) March 20, 2026చదవండి: ‘అతడితోనే వైరం.. జైషాకు సంబంధం లేదు’ -
జట్లకు వార్నింగ్.. కేకేఆర్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ
ఐపీఎల్ 2026 సీజన్ కోసం మూడు సార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తీవ్రంగా శ్రమిస్తోంది. గత సీజన్లో దారుణంగా విఫలమైన కేకేఆర్.. ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తమ ట్రైనింగ్ క్యాంపును కేకేఆర్ ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో శుక్రవారం కేకేఆర్ సభ్యులు రెండు జట్లగా విడిపోయి ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడాడు. గోల్డెన్ నైట్స్ జట్టుకు రింకూ సింగ్ కెప్టెన్ కాగా.. 'పర్పుల్ నైట్స్' జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రహానే జట్టుకు ప్రాతినిథ్యం వహించిన యువ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 55 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడితో పాటు కివీ స్టార్ ఫిన్ అలెన్ కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా లక్ష్యాన్ని పర్పుల్ నైట్స్ జట్టు 19.2 ఛేదించింది.అయితే ఈ ఏడాది సీజన్లో రఘువంశీ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఇంకా స్పష్టత లేదు. గత సీజన్లో కొన్ని సార్లు మూడో స్ధానంలో, మరికొన్ని మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. అయితే ఇప్పుడు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్య రహానే, కామెరాన్ గ్రీన్ వంటి టాపార్డర్ బ్యాటర్లు ఉండడంతో రఘువంశీని మరి ఎలా ఉపయోగిస్తారో చూడాలి. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.చదవండి: IPl 2026: 'ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు'.. సహచరులకు కోహ్లి వార్నింగ్ -
దుమ్ములేపిన పప్పు యాదవ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే
ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ ప్రాక్టీస్ జోరు పెంచింది. శుక్రవారం కేకేఆర్ ఆటగాళ్లు రెండు జట్లగా విడిపోయి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడారు. గోల్డెన్ నైట్స్ జట్టుకు రింకూ సింగ్ కెప్టెన్ కాగా.. 'పర్పుల్ నైట్స్' జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించాడు.అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు, ఎంపీ పప్పు యాదవ్ తనయుడు సార్థక్ రంజన్ విధ్వంసం సృష్టించాడు. తన పవర్ ఫుల్ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 'గోల్డెన్ నైట్స్' జట్టు తరపున ఆడిన సార్థక్.. కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేశారు. వైభవ్ ఆరోరా వేసిన మూడో ఓవర్లో అతడు ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు.ఆఖరికి బ్లెస్సింగ్ ముజారబానీ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ దిశగా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు సార్థక్ రంజన్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌తో పాటు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడికి ఈ అవకాశం దక్కింది. డొమాస్టిక్ క్రికెట్లో దుమ్ములేపిన సార్థక్.. ఇప్పుడు ఐపీఎల్ వంటి మహా వేదికపై సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు.ఐపీఎల్-2026 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు: అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, ఎఫ్ గ్రీన్ అరోరా, వరుణ్ చకరన్, ఎఫ్. పతిరణ, తేజస్వి సింగ్, కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్.చదవండి: ఆర్సీబీ టికెట్ కొంటే మెట్రోలో ఫ్రీ జర్నీ -
ఐపీఎల్ నుంచి హర్షిత్ రాణా అవుట్
కోల్‌కతా: భారత్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా ఇదివరకే గాయంతో టి20 ప్రపంచకప్ ఆడలేకపోయాడు. ఇప్పుడు మెరుపుల లీగ్ ఐపీఎల్‌కు సైతం దూరమయ్యాడు. అతను ఆడటంపై మొదటి నుంచి సందేహం ఉన్నప్పటికీ శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. రాణా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని తెలిపింది. ‘మాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. కొన్నేళ్లుగా హర్షిత్ మా జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ముఖ్యంగా గతేడాది కాలంగా మరింత రాటుదేలాడు. అలాంటి ఆటగాడు సీజన్ అసాంతం దూరమవడం మాకు చాలా ఇబ్బందికరం. ఉన్నపళంగా అతని స్థానాన్ని భర్తీ చేయడం కూడా కష్టమే’ అని కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ అన్నారు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ పతిరణ గాయంతో లంక పేసర్ సేవల్ని సైతం కోల్పోయింది. ఇంతకీ అతనికేమైంది? టీమిండియా జట్టులో సీనియర్ల గైర్హాజరీతో జట్టులోకి వచ్చిన హర్షిత్ సీమ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో భారీ షాట్లతో అలరించాడు. దీంతో టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టుకూ అతన్ని కొనసాగించారు. కానీ దురదృష్టవశాత్తూ దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా అతని కుడి మోకాలికి గాయమైంది. దీంతో జట్టుకు దూరమైన రాణా టీమిండియా జగజ్జేత బృందంలో భాగం కాలేకపోయాడు. అనంతరం హర్షిత్ మోకాలికి సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం పునరావాస శిబిరంలో ఉన్నప్పటికీ అతను పూర్తిగా కోలుకునేందుకు రీహాబిలిటేషన్ ప్రక్రియ ఇంకొంత కాలం కొనసాగించాల్సి ఉండటంతో ఇప్పుడప్పుడే అతను బరిలోకి దిగే అవకాశమైతే లేదు. -
'గొప్ప క్రికెటరేమి కాదు.. అతడికెందుకు రూ.25 కోట్లు'
ఐపీఎల్-2026 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామోరాన్ గ్రీన్‌పై కాసుల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. గ్రీన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.25.5 కోట్ల భారీ ధర వెచ్చించి మరి సొంతం చేసుకుంది. దీంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది.ఈ ఏడాది సీజన్లో గ్రీన్ ఎలా రాణిస్తాడో అని ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గ్రీన్‌ను అంత భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయడాన్ని బద్రీనాథ్ తప్పుబట్టాడు.కేవలం హైప్ వల్లే గ్రీన్ అంత భారీ ధరకు అమ్ముడయ్యాడని, అంతే తప్ప అతడేమి పెద్ద క్రికెటర్ కాదని ఈ సీఎస్కే మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. కాగా గ్రీన్ ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. యాషెస్ సిరీస్‌తో పాటు ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ గ్రీన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ఈ నేపథ్యంలో బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "గ్రీన్‌ను వేలంలో రూ.25 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అతడేమో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరపున అతడు ఎలా ఆడాడో చూశాం.కేవలం అతడిపై ఉన్న హైప్ కారణంగానే అంత భారీ ధరకు అమ్ముడయ్యాడు. వాస్తవానికి అతడు అంత విలువైన క్రికెటర్ కాదు. ఐపీఎల్లో అతడు ఒంటిచేత్తో గెలిపించిన మ్యాచ్ ఒక్కటైనా ఉందా? ఆస్ట్రేలియా ఆటగాళ్లపై ప్రతీసారి అనవసరమైన హైప్ సృష్టిస్తారు. ఇప్పుడు గ్రీన్ విషయంలో కూడా అదే జరిగింది. కేకేఆర్ మాత్రం అతడిపై అంత భారీ మొత్తాన్ని వెచ్చించి తప్పు చేసింది అని పేర్కొన్నాడు. కాగా గ్రీన్ గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. అయితే గాయం కారణంగా గత సీజన్‌కు గ్రీన్ దూరమయ్యాడు. తర్వాత తన పునరాగమనంలో గ్రీన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక ఐపీఎల్-19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IPL 2026: 'సెహ్వాగ్‌ను చూసి నేర్చుకో'.. అభిషేక్‌కు కుంబ్లే వార్నింగ్ -
రూ. 18 కోట్లు.. ఫిట్‌గా ఉన్నా అనుమతి లేదు?
ఐపీఎల్-2026 ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను కేకేఆర్ జట్టు నుంచి తొలగించింది.పతిరణకూ గాయం!ఇక కేకేఆర్ మరో ఆటగాడు, టీమిండియా స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. పేస్ దళాన్ని పటిష్టం చేసే క్రమంలో రాణాతో పాటు రాణిస్తాడని భావించిన శ్రీలంక బౌలర్ మతీశ పతిరణ కూడా గాయపడ్డాడు.ఫిట్‌గా ఉన్నా అనుమతి లేదు?టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా పతిరణ కాలికి గాయం కాగా.. అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే అతడు ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) మాత్రం ఐపీఎల్లో ఆడేందుకు పతిరణకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చే విషయంలో జాప్యం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పతిరణ ఫిట్నెస్ విషయంలో తమకు సంతృప్తికరమైన సమాచారం వచ్చినపుడే NOC ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి కేకేఆర్ సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘వాళ్లు (SLC) అతడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్న అంశంపై ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.విమాన టికెట్లు బుకింగ్, రద్దుమేము వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. దాదాపుగా ప్రతిరోజు పతిరణ కోసం విమాన టికెట్లు బుక్ చేయడం, రద్దు చేయడం జరుగుతోంది’’ అని పేర్కొన్నాయి. కాగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన పతిరణ.. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రియ శిష్యుడిగా పేరొందాడు.చెన్నై వదిలేయగా.. రూ. 18 కోట్లకు కొనుగోలుఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన 23 ఏళ్ల మతీశ పతిరణ.. 47 వికెట్లు తీశాడు. అయితే, 2026 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలివేయగా.. కేకేఆర్ రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఓవైపు హర్షిత్ రాణా జట్టుకు దూరం కాగా.. పతిరణ విషయంలోనూ సస్పెన్స్ కొనసాగడం కేకేఆర్‌కు తలనొప్పిగా మారింది.మరోవైపు.. పతిరణ మేనేజర్ మాత్రం అతడు త్వరలోనే అందుబాటులోకి వస్తాడనేలా సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ముస్తాఫిజుర్ రహమాన్ స్థానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీని కేకేఆర్ జట్టులో చేర్చుకున్న సంగతి తెలిసిందే.చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్ -
ఐపీఎల్ ఖరీదైన ఆటగాడి అసహనం!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో 10 రోజుల సమయముంది. ఈ నేపథ్యంలో గతేడాది తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోని కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 18వ సీజన్లో ఎలాగైనా టైటిల్ కొట్టాలనే ధ్యేయంతో సరికొత్తగా సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు కామెరున్ గ్రీన్ పై చాలా ఆశలే పెట్టుకుంది. గతేడాది జరిగిన వేలంలో ఈ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్‌ను కేకేఆర్ రూ.25.20 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి ఇంత ఖర్చు చేయడం ఇదే తొలిసారి. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కామెరున్ గ్రీన్ ఆకట్టుకున్న దాఖలాలు తక్కువే. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లోనూ గ్రీన్ అంతగా ఆకట్టుకోలేదు. మరో పది రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ఇది కేకేఆర్‌కు ఒక రకంగా బ్యాడ్‌న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్లో వెస్ట్ ఆస్ట్రేలియా తరఫున కామెరున్ గ్రీన్ మూడంకెల స్కోరును అందుకున్నాడు. న్యూసౌత్‌వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్ సెంచరీ మార్క్ సాధించాడు. ఈ సందర్భంగా ఆసీస్ మీడియాకు చెందిన ఒక రిపోర్టర్ సెంచరీ చేయడం ఎలా అనిపిస్తోందని గ్రీన్‌ను అడిగాడు. ‘ఇది నాకు గ్రేట్ ఫీలింగ్ కలిగిస్తోంది. మొదటి మూడురోజులు మంచి స్టార్ట్ లభించింది. కచ్చితంగా మ్యాచ్ గెలవబోతున్నాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే దీనికి ముందు ఫామ్‌లేమీతో ఇబ్బంది పడడం ఎలా అనిపించిందంటూ మరో ప్రశ్న వేశాడు. దీనికి ‘నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పదలచుకోలేను. వేరే ప్రశ్నకు వెళ్లండి’ అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. ప్రశ్నలు లేవు అనడంతో ఇంటర్వ్యూను అక్కడితో ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో గ్రీన్ ‘వేస్ట్ ఆఫ్ టైమ్’ అంటూ తనలో తాను గొణుక్కుంటూ వెళ్లిపోయాడని రిపోర్టర్ వాపోయాడు. ఆ తర్వాత వెస్ట్ ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ బ్యూకాసన్.. గ్రీన్ తరఫున మీడి యాకు క్షమాపణ చెప్పడం ఆసక్తి కలిగించింది.చదవండి: గొడవ పడిన బంగ్లా కెప్టెన్‌కు బెస్ట్ ర్యాంకు! -
నడవలేని స్థితిలో టీమిండియా స్టార్ క్రికెటర్.. వీడియో
ఐపీఎల్-2026కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు హర్షిత్ రాణా రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి అతడు దూరమయ్యే అవకాశముంది. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన రానా నడవలేని స్థితిలో కన్పించాడు.ఊతకర్రల సాయంతో హర్షిత్ కుంటుతూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అతడు త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ అవార్డు హర్షిత్ రాణాకు దక్కింది. ఈ అవార్డు అందుకోవడానికి రాణా వేదికపైకి కూడా రాలేకపోయాడు. దీంతో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ స్వయంగా వేదిక దిగి రాణాకు ఈ అవార్డును అందజేశారు.కాగా హర్షిత్ గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్-2026 వార్మాప్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. అనంతరం అతడికి అస్ప్రత్రికి తరలించి పలు స్కాన్లు నిర్వహించగా.. సర్జరీ అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో టీ20 ప్రపంచకప్‌కు కూడా అతడు దూరమయ్యాడు.అనంతరం ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్-19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.Harshit Rana’s injury is quite serious. He is not able to walk properly and is using a stick to walk. Even then, he came to the Naman Awards show today. If he had not come, it would have been completely understandable. Because of this injury, he will also not play in this year’s… pic.twitter.com/KIGdiSdHYV— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 15, 2026చదవండి: IPL 2026: సన్‌రైజర్స్, సీఎస్కే, ముంబై కాదు.. ఆ జట్టే ఐపీఎల్ విజేత! -
పీఎస్ఎల్ వద్దు.. ఐపీఎల్ ముద్దు! స్టార్ ప్లేయర్‌పై పీసీబీ సీరియస్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకొన్న జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజారబానీపై పాక్ క్రికెట్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ముజారబానీ వాస్తవానికి ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్లో ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది.వెస్టిండీస్ పేసర్ షమీర్ జోసెఫ్ స్థానంలో ముజారబానీతో ఇస్లామాబాద్ పీకేఆర్ 1.1 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ చివరి నిమిషంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి ఆఫర్ రావడంతో ముజారబానీ తన మనసు మార్చుకున్నాడు.పీఎస్ఎల్ బదులుగా ఐపీఎల్లో ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. రాజకీయ ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానంలో ముజారబానీని కేకేఆర్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో ముజారబానీపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు సమాచారం.ఏడాది పాటు పీఎస్ఎల్ ఆడకుండా అతడిపై నిషేధం విధించాలని పీసీబీ భావిస్తోందంట. కాగా పీఎస్ఎల్ ఒప్పందాన్ని కాదని ఐపీఎల్ వైపు ఆటగాళ్లు వెళ్లడం ఇది రెండోసారి. గతేడాది కూడా దక్షిణాఫ్రికా పేసర్ కోర్బిన్ బాష్ ఇలాగే పెషావర్ జల్మీని వదిలి ముంబై ఇండియన్స్‌లో చేరారు.దీంతో పీసీబీ అతడిపై ఏడాది నిషేధం విధించింది. ఈ రెండు టోర్నీలు ఒకే సమయంలో జరగనుండడంతో ఈ సమస్య తలెత్తుంది. పీఎస్ఎల్ 11వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. అక్కడికి రెండు రోజులకే ఐపీఎల్ షురూ కానుంది.చదవండి: BAN vs PAK: 'క్రీడా స్ఫూర్తికే మాయని మచ్చ'.. బంగ్లా కెప్టెన్‌పై కైఫ్ ఫైర్ -
IPL 2026: కేకేఆర్‌కు మరో భారీ షాక్
ఐపీఎల్-2026కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది సీజన్‌కు ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్, యువ సంచలనం హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. హర్షిత్ గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మాప్ మ్యాచ్‌లో గాయపడ్డాడు.దీంతో తన బౌలింగ్ స్పెల్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత పలు స్కాన్ల తర్వాత అతడికి మోకాలి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో రాణా ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నాడు. అతడు ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు.అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఐపీఎల్-19 సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. హర్షిత్ తన ఐపీఎల్(2022) తన అరంగేట్రం నుంచి కేకేఆర్కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఐపీఎల్-2024 టైటిల్ కేకేఆర్ గెలవడంలో హర్షిత్ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్లో కూడా హర్షిత్ 15 వికెట్లతో సత్తాచాటాడు. అంతేకాకుండా టీమిండియా తరపున కూడా అద్బుతమైన ప్రదర్శనలు కనబరిచాడు. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌కు శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరాన సైతం గాయం కారణంగా దూరమయ్యే అవకాశముంది.గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో పతిరానను రూ.18 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది. కానీ టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా పతిరాన కూడా గాయపడ్డాడు. అతడు ఇంకా శ్రీలంకలోనే ఉన్నాడు. ఇక ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి కేకేఆర్ తీసుకుంది.చదవండి: BAN vs PAK: పాకిస్తాన్ ప్లేయర్ వింత రనౌట్.. క్రికెట్ చరిత్రలోనే! -
IPL 2026: జింబాబ్వే బౌలర్‌కు బంపరాఫర్?
ఐపీఎల్-2026 సీజన్ మరో రెండు వారాల్లో షురూ కానుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో పడింది. అతడి స్దానంలో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీని తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం.ముజరబానీ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. జింబాబ్వే సూపర్-8 స్టేజ్‌కు చేరుకోవడంలో ఈ రైట్ ఆర్మ్ పేసర్‌ది కీలక పాత్ర. ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముజరబానీ నాలుగు వికెట్లు పడగొట్టి జింబాబ్వేకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.అతడికి పవర్‌ప్లేతో డెత్ ఓవర్లలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఈ క్రమంలోనే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు కేకేఆర్ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ముజరబానీ ఇప్పటివరకు ఐపీఎల్లో అరంగేట్రం చేయలేదు. గత సీజన్ ఆఖరిలో ఆర్సీబీ జట్టులోకి వచ్చినప్పటికి.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు.ముస్తాఫిజుర్‌పై వేటు..కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ వేలం అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోవడంతో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిని జట్టు నుంచి రిలీజ్ చేయాలని కేకేఆర్ సూచింది.బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ విడుదల చేసింది. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే కేకేఆర్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రూ.18 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్ మతీషా పతిరానా, భారత ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గాయాలతో పోరాడుతున్నారు. వీరిద్దరి అందుబాటుపై ఇంకా స్పష్టత రాలేదు.కేకేఆర్ పూర్తి జట్టు:అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ (కీపర్), అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కామెరాన్ గ్రీన్, మతీషా పతిరానా, తేజస్వి సింగ్, ఫిన్ అలెన్ (కీపర్), కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, టిమ్ సీఫెర్ట్ (కీపర్), రాహుల్ త్రిపాఠి, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, సార్థక్ రంజన్.చదవండి: భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్ ఆటగాళ్ల లిస్టు -
కేకేఆర్‌కు భారీ షాక్.. రూ.18 కోట్ల ప్లేయర్ ఔట్?
ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ షాక్ తగిలే అవకాశముంది. శ్రీలంక స్టార్ పేసర్ మతీషా పతిరానా గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. గత డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో పతిరానాను రూ.18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.అయితే టీ20 వరల్డ్‌కప్-2026 మధ్యలో గాయపడిన అతడు ఇంకా కోలుకోలేదు. పల్లెకెలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూపు స్టేజ్ మ్యాచ్‌లో పతిరాన కాలిపిక్క గాయానికి గురయ్యాడు. దీంతో అతడు ప్రపంచకప్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. ఈ జూనియర్ మలింగ తాజాగా తన గాయంపై అప్డేట్ ఇచ్చాడు.తాను ఇంకా శ్రీలంకలోనే ఉన్నానని, కోలుకోవడానికి మరింత సమయంపడుతుందని బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను పతిరాన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ తక్కువ సమయంలో పతిరాన పూర్తి ఫిట్నెస్ సాధించి కేకేఆర్ క్యాంపులో చేరే సూచనలు కన్పించడం లేదు. ఒకవేళ ఇదే జరిగితే కేకేఆర్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. గతంలో సీఎస్కే తరపున ఆడిన అనుభవం ఉన్న పతిరానను, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా భావించి కేకేఆర్ భారీ మొత్తాన్ని వెచ్చించింది. ఇప్పుడు టోర్నీ ఆరంభ సమయానికి అతడు కోలుకోకపోతే ప్రత్యామ్నాయ బౌలర్ కోసం కేకేఆర్ వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఐపీఎల్-2026కు కేకేఆర్ జట్టుఅజింక్య రహానే, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, రాహుల్ త్రిపాఠి, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, క్యామెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మతీష పతిరానా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మతీష పతిరానా , వైభవ్ అరోరా -
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ కోచ్‌గా యాజ్ఞిక్
కోల్‌కతా: వికెట్ కీపర్ బ్యాటర్ దిశాంత్ యాజ్ఞిక్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఫీల్డింగ్ కోచ్‌గా నియమించుకుంది. దేశవాళీలతో పాటు... ఐపీఎల్ అనుభవం ఉన్న ఈ రాజస్తాన్ ప్లేయర్ రాకతో తమ శిక్షణ బృందం బలం మరింత పెరుగుతుందని కేకేఆర్ యాజమాన్యం భావిస్తోంది. ‘యాజ్ఞిక్‌కు అపార అనుభవం ఉంది. అది జట్టుకు ఉపకరించనుంది. ఈసారి ఐపీఎల్‌కు కొత్త సపోర్టింగ్ స్టాఫ్‌తో బరిలోకి దిగనున్నాం. హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్, మెంటార్‌గా డ్వేన్ బ్రావో, అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్, బౌలింగ్ కోచ్‌గా టిమ్ సౌతీ, పవర్ కోచ్‌గా ఆండ్రీ రసెల్ వ్యవరిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో యాజ్ఞిక్ చేరుతున్నాడు. అతడి కోచింగ్ జర్నీలో ఇది ప్రత్యేకంగా నిలవడం ఖాయం’ అని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవాళీల్లో రాజస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యాజ్ఞిక్... 2011 నుంచి 2014 మధ్య 25 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం వివిధ జట్లకు శిక్షణనిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26 నుంచి మే 31 వరకు జరగనుంది. -
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టరీ స్పిన్నర్
కర్ణాటక మిస్టరీ స్పిన్నర్ కేసీ కరియప్ప సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం 31 ఏళ్ల వయస్సులోనే భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కరియప్ప షాకిచ్చాడు. అతడు సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు."స్ట్రీట్ క్రికెట్ నుంచి స్టేడియంలో ఫ్లడ్ లైట్లలో ఆడడం వరకు నా ప్రయాణం ఒక్క అద్భుతం. గర్వంగా జెర్సీ ధరించి, ఒకప్పుడు నేను కన్న కలలను నిజం చేసుకున్నాను. అయితే ఈ రోజు భారత క్రికెట్ నుంచి నేను వైదొలుగుతున్నా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. విజయాలు చిరునవ్వును ఇస్తే, ఓటములు నన్ను రాటుదేల్చాయి. నా ఈ జర్నీలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు" తన రిటైర్మెంట్ నోట్లో పేర్కొన్నాడు.కాగా బీసీసీఐతో పూర్తిగా తెగదింపులు చేసుకున్న కరియప్ప విదేశీ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడే అవకాశముంది. కరియప్ప తన డొమెస్టిక్ కెరీర్లో కర్ణాటక, మిజోరం జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 157 వికెట్లు పడగొట్టారు. అయితే ఐపీఎల్ 2015 వేలంతో కరియప్ప వెలుగులోకి వచ్చాడు.ఏ మాత్రం అనుభవం లేనిప్పటికి కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని రూ.2.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం అప్పటిలో పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాతి సీజన్లలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు గతకొంతకాలంగా అతడికి దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు కూడా ఛాన్స్‌లు రావడం లేదు. ఈ క్రమంలోనే భారత క్రికెట్‌కు కరియప్ప విడ్కోలు పలికాడు. -
ఐపీఎల్ నుంచి ఔట్.. ముస్తాఫిజుర్‌కు పరిహారం అందుతుందా?
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అతడు కూడా ఆడకుండా బీసీసీఐ నిషేదం విధించింది బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ ప్రస్తుత పరిణామాల దృష్ట్యా అతడిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.తమ దేశ క్రికెటర్‌ను అర్ధాంతరంగా తప్పించడాన్ని బంగ్లా జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలో భద్రతను కారణంగా చూపుతూ టీ20 ప్రపంచకప్‌లో పాల్గోనేందుకు భారత్‌కు వెళ్లబోము అని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని ఆ లేఖలో బీసీబీ రాసుకొచ్చింది. అయితే బీసీబీ అభ్యర్ధను ఐసీసీ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది.భారీ ధరకు అమ్ముడైనా..అయితే ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కేకేఆర్ అనుహ్యంగా జట్టు నుంచి రిలీజ్ చేయడంతో అతడికి ఏమైనా పరిహరం చెల్లిస్తుందా? అన్న ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలో రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓసారి పరిశీలిద్దాము. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. కాంట్రాక్ట్ పొందిన ఆటగాడికి సదురు ఫ్రాంచైజీకి ఇన్సూరెన్స్ చేయిస్తోంది.ఒక జట్టులో చేరిన తర్వాత లేదా టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో గాయపడితే భీమా వర్తిస్తోంది. అటువంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు సదరు ఆటగాడికి ఏభై శాతం వరకు జీతాన్ని చెల్లిస్తాయి. కానీ ముస్తాఫిజుర్ పరిస్థితి అందుకు భిన్నం. అతడు ఇంకా కేకేఆర్ క్యాంపులోనే చేరలేదు. దౌత్యపరమైన కారణాల వద్ద అతడి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. రాజకీయ ఉద్రిక్తతలు, బోర్డు ఆదేశాలు వంటివి ఇన్సూరెన్స్ పరిధిలోకి రావు. కాబట్టి కేకేఆర్ యాజమాన్యం నుంచి అతడికి ఒక్క పైసా కూడా అందదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.అదొక్కటే మార్గం..అయితే చట్టపరంగా పోరాడటం ఒక్కటే ముస్తాఫిజుర్ రెహమాన్ ముందున్న మార్గం. ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు భారత చట్టపరిధిలోకి వస్తుంది. కానీ ఏ విదేశీ క్రికెటర్ భారత కోర్టులలో గానీ అంతర్జాతీయ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ (CAS)లో కేసు వేసే అంత సహసం చేయరు. ఎందుకంటే ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ.చదవండి: బంగ్లాదేశ్ మరో సంచలన నిర్ణయం! -
IPL 2026: బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన ప్రకటన
బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఫ్రాంఛైజీ క్రికెట్లో మేటి లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రసారాలను తమ దేశంలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు.. "భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను తమ జట్టు నుంచి విడుదల చేసింది.బాధ, వేదనకు గురిచేసిందిమార్చి 26, 2026 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి అతడిని తొలగించింది. జాతీయ భద్రతకు సంబంధించి ఎలాంటి ముప్పు పొంచి ఉందని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు. అయితే, ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ప్రజలను బాధ, వేదనకు గురిచేసింది.ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ (IPL) ప్రసారాలను దేశంలో నిలిపివేయాలని బ్రాడ్కాస్టర్లకు విజ్ఞప్తులు వచ్చాయి. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధికారుల అనుమతితో ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం’’ అని బంగ్లాదేశ్ పేర్కొంది.కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీల మీద హత్యాకాండ నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.కుదరని చెప్పిన బీసీసీఐఅంతేకాదు.. టీమిండియాతో సెప్టెంబరులో ఆడాల్సిన టీ20, వన్డేల గురించి బంగ్లా బోర్డు షెడ్యూల్ విడుదల చేయగా.. బీసీసీఐ మాత్రం దీనిని ధ్రువీకరించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడబోడమని బంగ్లా బోర్డు ప్రకటించింది.తమ మ్యాచ్‌ల వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి లేఖ రాసింది. అయితే, ఇప్పటికే టోర్నీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తికావడం.. బంగ్లాదేశ్‌తో ఆడే ప్రత్యర్థులు తమ టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ వేదికలను తరలించడం సాధ్యం కాదని బీసీసీఐ పేర్కొంది. ఐసీసీ సైతం బీసీసీఐ వాదనవైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. చదవండి: T20 WC 2026: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ?! -
వారు తొలిగిస్తే నేనేం చేయగలను?
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై కొనసాగుతున్న దాడుల సెగ ఐపీఎల్‌కు తగిలింది. 2026 సీజన్ కోసం వేలం ద్వారా ఎంపికైన ఏకైక బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తమ జట్టునుంచి విడుదల చేస్తున్నట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ప్రకటించింది.ఐపీఎల్-2026 వేలంలో ముస్తాఫిజుర్ ను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముస్తఫిజుర్‌ను ఐపీఎల్లో ఆడనివ్వకూడదని భారత్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.అంతేకాకుండా ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకున్నందుకు కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. కొందరు రాజకీయ నాయకులు అతడిని "దేశద్రోహి" అని కూడా మండిపడ్డారు. ఈ పరిస్థితులను గమనించిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాల్సిందిగా కేకేఆర్ యాజమాన్యానికి సూచించారు.దీంతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి తప్పించింది. ఇక ఈ విషయంపై ముస్తఫిజుర్ తొలిసారి స్పందించాడు. "వారు నన్ను విడుదల చేస్తే, నేను మాత్రం ఏం చేయగలను?" అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది సీజన్ కోసం ముస్తఫిజుర్ స్ధానాన్ని మరొక ఆటగాడితో కేకేఆర్ భర్తీ చేయనుంది.ఇక ఇది ఇలా ఉండగా.. ముస్తఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని, ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాదేశ్‌లో నిలిపివేయాలని అక్కడి క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఆదేశించడం గమనార్హం. అదేవిధంగా టీ20 వరల్డ్‌కప్-2026లో తమ లీగ్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను కోరనున్నట్లు తెలుస్తోంది.చదవండి: T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! పాక్ బాటలోనే బంగ్లాదేశ్? -
KKR: బీసీసీఐ సంచలన ప్రకటన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేకేఆర్ తమ జట్టు నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది.బీసీసీఐ ప్రకటనఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) అధికారికంగా ధ్రువీకరించారు. వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత పరిణామాల దృష్ట్యా.. కేకేఆర్ తమ జట్టులోని బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది.ఒకవేళ కేకేఆర్ అతడికి ప్రత్యామ్నాయంగా ఇంకో ఆటగాడిని ఎంచుకుంటామని కోరితే.. బీసీసీఐ అందుకు అనుమతినిస్తుందని కూడా తెలియజేశాము’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. కాగా ఐపీఎల్ మినీ వేలం-2026 ఐదుగురికి పైగా బంగ్లాదేశ్ ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలుఅయితే, ఫామ్, గత ప్రదర్శనల దృష్ట్యా ముస్తాఫిజుర్ రెహ్మాన్ మాత్రమే అమ్ముడుపోయాడు. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన ఈ పేస్ బౌలర్‌ను.. ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ కేకేఆర్ ఏకంగా రూ. 9.20 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. తుదిజట్టులోనూ అతడు ఆడటం దాదాపు ఖాయమే. అయితే, ఇప్పుడు బీసీసీఐ అతడిని పక్కనపెట్టాలని చెప్పడంతో కేకేఆర్ భారీ షాక్ తగిలినట్లయింది.బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలుకాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గమైన హిందువులపై దాడులు పెరిగిపోతున్న విషయం విదితమే. ఇప్పటికే నలుగురు ఉన్మాదుల చేతిలో హత్యకు గురయ్యారు. మరోవైపు.. నేతలుగా చెప్పుకొనే మరి కొంతమంది భారత్‌ను రెచ్చగొట్టేలా కవ్వింపు వ్యాఖ్యలు చేస్తూ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొనే పరిస్థితులు తీసుకువచ్చారు.ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేత ఒకరు.. కేకేఆర్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌ను ‘ద్రోహి’గా అభివర్ణించారు. ముస్తాఫిజుర్‌ను అతడి జట్టు కొనుగోలు చేసినందుకు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ నుంచి విడుదల చేయాలనే డిమాండ్లు పెరగగా.. బీసీసీఐ అందుకు అనుగుణంగా తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక అతడి స్థానాన్ని కేకేఆర్ ఎవరితో భర్తీ చేస్తుందో చూడాల్సి ఉంది. కాగా ఐపీఎల్లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత కేకేఆర్‌ది.చదవండి: T20 WC: జింబాబ్వే అనూహ్య నిర్ణయం.. సంచలన ఎంపికలు #WATCH | Guwahati | BCCI secretary Devajit Saikia says, "Due to the recent developments that are going on all across, BCCI has instructed the franchise KKR to release one of their players, Mustafizur Rahman of Bangladesh, from their squad and BCCI has also said that if they ask… pic.twitter.com/53oxuRcmZp— ANI (@ANI) January 3, 2026 -
KKR: అతడొక ద్రోహి.. బీసీసీఐ స్పందన ఇదే
ప్రపంచంలోనే మేటి టీ20 లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొనసాగుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఈ టోర్నమెంట్ కారణంగా ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు.కేవలం భారత్‌కు చెందిన ఆటగాళ్లే కాకుండా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్ ద్వారా భారీ స్థాయిలో సంపాదించడంతో పాటు పేరు తెచ్చుకుంటున్నారు కూడా!ఐపీఎల్ ఆడకుండా నిషేధంఅయితే, ఆరంభంలో పాకిస్తాన్ ప్లేయర్లు సైతం క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడేవారు. వసీం అక్రం, షోయబ్ అక్తర్, మిస్బా ఉల్ హక్, ఉమర్ గుల్, కమ్రాన్ అక్మల్, షోయబ్ మాలిక్, సొహైల్ తన్వీర్ వంటి వాళ్లు ఆరంభ సీజన్లో ఆడారు. అయితే, ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2009 నుంచి పాక్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించింది బీసీసీఐ.తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్లకు సైతం ఇదే దుస్థితి కలిగే అవకాశం ఉంది. భారత్ నుంచి ఎల్లవేళలా మద్దతు, సాయం పొందిన బంగ్లాదేశ్ కొన్నాళ్లుగా విచిత్ర పోకడలకు పోతోంది. ఆ దేశంలోని కొంతమంది నేతలు భారత్‌ను విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లా ప్లేయర్లను నిషేధించాలనే డిమాండ్లుఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నలుగురు హిందువులు దారుణ హత్యకు గురైనట్లు వార్తలు వచ్చాయి.ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్లను నిషేధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కాగా ఐపీఎల్-2026 మినీ వేలంలో ఐదు నుంచి ఆరుగురు క్రికెటర్లు పేరు నమోదు చేసుకోగా.. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ మాత్రమే అమ్ముడుపోయాడు. షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.అతడొక ద్రోహి..ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేత సంగీత్ సింగ్ సోమ్ షారుఖ్ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన ప్లేయర్‌ను కొన్న షారుఖ్‌ను ద్రోహిగా అభివర్ణించారు. ఈ క్రమంలో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ ఆయనకు కొంతమంది మద్దతు తెలపగా..కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించారు.బీసీసీఐ స్పందన ఇదేఅంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రమాణాలకు అనుగుణంగా బీసీసీఐ ఈ లీగ్‌ను నిర్వహిస్తోందని.. ఇందులో రాజకీయ జోక్యం అనవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఈ పరిణామాలపై స్పందించారు. ఇన్సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ శత్రు దేశమేమీ కాదు. ఇప్పటికైతే బంగ్లాదేశ్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాల్సిన అవసరం కనబడటం లేదు’’ అని పేర్కొన్నారు. కాబట్టి ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఈ ఏడాది ఐపీఎల్ బరిలో దిగే అవకాశం ఉంది.ఎలాంటి ఆదేశాలు రాలేదుమరోవైపు బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా IANSతో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో మేము పెద్దగా స్పందించాలనుకోవడం లేదు. మా చేతుల్లో ఏమీ లేదు. అయితే, బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి నిషేధించే అంశమై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేము’’ అని పేర్కొన్నాయి. చదవండి: న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టు ఇదే!.. వాళ్లిద్దరికి మొండిచేయి! -
పెట్టిన సొమ్ముకు.. అతడి ఆటకు సంబంధమే లేదు! అయినా..
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ప్రయాణం ముగిసింది. ఐపీఎల్-2026లో అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన మినీ వేలంలో వెంకటేశ్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, కేకేఆర్, ఆర్సీబీ మధ్య పోటీ నెలకొంది.ఈ క్రమంలో రూ. 3.2 కోట్ల ధర దాటిని తర్వాత లక్నో, గుజరాత్ తప్పుకోగా.. కేకేఆర్ (KKR) రూ. 6.8 కోట్ల వరకు బిడ్ వేసింది. అయితే, ఆఖరికి రూ. 7 కోట్లకు ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. కాగా 2021లో కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన మధ్యప్రదేశ్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer).. 2025 వరకు అదే జట్టుతో కొనసాగాడు.ధరలో హై జంప్రూ. 20 లక్షల కనీస ధరతో కేకేఆర్‌లో చేరిన వెంకీ అద్భుత ప్రదర్శన కనబరచగా.. మరుసటి ఏడాది వేలానికి ముందు ఏకంగా రూ. 8 కోట్లకు జట్టు రిటైన్ చేసుకుంది. 2023, 24 సీజన్లలోనూ ఈ మేర భారీ మొత్తమే చెల్లించింది. అయితే, 2024లో జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన వెంకీ వేలానికి ముందు జట్టును వీడాడు.అనూహ్య రీతిలో రూ. 23.75 కోట్లుఈ క్రమంలో ఆక్షన్‌లో అతడి కోసం కేకేఆర్ ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసింది. నిజానికి అతడి స్థాయికి అది మించిన ధరే అని చెప్పవచ్చు. అయినప్పటికీ కేకేఆర్ వెంకీ కోసం పర్సు నుంచి భారీ మొత్తమే వెచ్చించి అతడిని మళ్లీ జట్టులో చేర్చుకుంది. అయితే, ఈసారి అతడు కనీస స్థాయి ప్రదర్శన కూడా కనబరచలేదు.పెట్టిన సొమ్ముకు.. అతడి ఆటకు సంబంధమే లేకుండా పోయింది. పదకొండు మ్యాచ్‌లు ఆడి కేలం 142 పరుగులే చేశాడు. ఇక ఈ పేస్ ఆల్‌రౌండర్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు కేకేఆర్ అతడిని విడిచిపెట్టింది. అయినప్పటికీ తిరిగి తెచ్చుకోవాలని భావించగా.. ఆర్సీబీ ఈసారి పట్టు వీడకుండా అతడిని తమ సొంతం చేసుకుంది.తక్కువ ధరకే కొందాం అనుకొన్నాంఈ పరిణామాల నేపథ్యంలో కేకేఆర్ హెడ్‌కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ ఎల్లప్పుడూ తమ ఆటగాళ్ల వెంటే పడుతుందని పేర్కొన్నాడు. జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘తన కెరీర్ ఆరంభం నుంచి వెంకటేశ్ అయ్యర్ మా ఫ్రాంఛైజీతోనే ఉన్నాడు.అతడిని తిరిగి సొంతగూటికి తీసుకురావాలని మేము ప్రయత్నించాము. వైవిధ్యభరితమైన ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు తమ డబ్బును సేవ్ చేసుకుంటాయని అనుకున్నాము. కాబట్టి వెంకటేశ్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని భావించాము.ఆర్సీబీ మా వాళ్ల వెంటే పడుతుందిఅయితే, ఆర్సీబీ ఎల్లప్పుడూ మా ఆటగాళ్ల వెంటే పడుతుంది కదా!.. ఈసారి ఎట్టకేలకు అతడిని సొంతం చేసుకుంది. చాలా ఏళ్లుగా వెంకటేశ్ మా జట్టుతో ఉన్నాడు. ఐపీఎల్లో అతడి కొత్త ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నా’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు.కాగా అభిషేక్ నాయర్ చెప్పినట్లు ఆర్సీబీ మరీ కేకేఆర్ ఆటగాళ్ల వెంబడే పడినట్లు ఎప్పుడూ కనిపించలేదు. అయితే, కేకేఆర్ మాజీ ప్లేయర్లు ఫిల్ సాల్ట్, క్రిస్ గేల్, సూయశ్ శర్మ తదితరులు ఆర్సీబీ ఆడారు. ఫ్రాంఛైజీ క్రికెట్లో ఇలాంటివి సహజమే. ఇక వెంకటేశ్ అయ్యర్‌కు బదులు కేకేఆర్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను జట్టులో చేర్చుకుంది. ఇందుకోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చుపెట్టింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు.చదవండి: Rohit Sharma: చాలా బాధపడ్డాను.. క్రికెట్ వదిలేయాలనుకున్నా -
రూ.25 కోట్ల ఆటగాడు అట్టర్ ప్లాప్
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ యాషెస్ సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన గ్రీన్.. ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో అదే తీరును కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన గ్రీన్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బౌలింగ్‌లోనూ కేవలం ఒక్క వికెట్ పడగొట్టాడు.కేకేఆర్‌కు హెడ్‌ఎక్..ఇటీవల దుబాయ్‌లో జరిగిన మినీ వేలంలో గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. గ్రీన్‌ను ఒక కంప్లీట్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకున్న కేకేఆర్.. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణిస్తాడని నైట్‌రైడర్స్ ఆశిస్తోంది. కానీ రెడ్ బాల్ క్రికెట్లో అతడి ప్రస్తుత ఫామ్ కోల్‌కతా మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో ఆడలేక వికెట్ పారేసుకోవడం చర్చనీయంగా మారింది.భారీ ఆధిక్యం దిశగా ఆసీస్..అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ జోరు కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కంగారూ జట్టు ప్రస్తుతం 356 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ అడిలైడ్ టెస్టులో ట్రావిస్ హెడ్ సెంచరీతో సత్తాచాటాడు. 142 పరుగులతో హెడ్ నాటౌట్‌గా ఉన్నాడు. అతడితో పాటు అలెక్స్ కారీ(52) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది.చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము' -
వేలంలో రూ. 25.20 కోట్లు.. చేతికి రూ. 18 కోట్లు మాత్రమే!
భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ముగ్గురు ఆటగాళ్ల గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. వీరిలో ఒకరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green).. మరో ఇద్దరు దేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు కార్తీక్ శర్మ (Kartik Sharma), ప్రశాంత్ వీర్ (Prashant Veer).రాజస్తాన్‌కు చెందిన పందొమిదేళ్ల కార్తీక్ శర్మను, ఉత్తరప్రదేశ్ ఆటగాడు ప్రశాంత్ వీర్లకు చెన్నై సూపర్ కింగ్స్ కోట్లాభిషేకం చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలు అందించే కార్తీక్ కోసం రూ. 14.20 కోట్లు.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం కూడా అంతే మొత్తం చెన్నై వెచ్చించింది. అత్యధిక ధరఇక ఈసారి మినీ వేలంలో టాప్‌లో నిలిచిన గ్రీన్‌ను.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా అతడు నిలిచాడు. అయితే, కోల్‌కతా వెచ్చించిన రూ. 25.20 కోట్ల మొత్తం అతడు అందుకోలేడు. వేలంలో ఈ మేర భారీ ధర పలికినా.. గ్రీన్‌కు గరిష్టంగా రూ.18 కోట్లు మాత్రమే లభిస్తాయి.కారణం ఇదేఐపీఎల్ నిబంధనల ప్రకారం మినీ వేలంలో విదేశీ ఆటగాడికి ఎంత విలువ పలికినా... ఆటగాళ్ల గరిష్ట రీటెయినింగ్ ఫీజు (రూ.18 కోట్లు) లేదా.. మెగా వేలంలో ఆటగాడికి దక్కిన మొత్తం (రూ.27 కోట్లు; రిషభ్ పంత్)కు ఇది మించరాదు. రెండింటిలో ఏది తక్కువైతే అంతే మొత్తం.. సదరు ఆటగాడికి లభిస్తుంది.ఆసీస్ ఆల్‌రౌండర్ అయిన కామెరాన్ గ్రీన్‌కు ఈ నిబంధన వర్తిస్తుంది. కాబట్టి రీటెయింగ్ ఫీజుకు సమానంగా అతడికి రూ. 18 కోట్లు దక్కుతాయి. కేకేఆర్ అతడి కోసం పర్సు నుంచి తీసిన మొత్తంలో.. మిగిలిన రూ.7.20 కోట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్ల సంక్షేమ నిధికి చేరతాయి. అత్యధిక పర్సు వాల్యూతో..కాగా ఈసారి అత్యధిక పర్సు వాల్యూ రూ. 64.3 కోట్లతో వేలం బరిలో దిగింది కోల్‌కతా. విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వీలుగా గ్రీన్ కోసం రికార్డు స్థాయిలో ఖర్చు చేసింది. అదే విధంగా శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ కోసం రూ. 18 కోట్లు, బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ కోసం రూ. 9.20 కోట్లు వెచ్చించింది.వీరితో పాటు తేజస్వి సింగ్ (రూ.3 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్ అలెన్ (రూ.2 కోట్లు), సీఫెర్ట్ (రూ.1.50 కోట్లు), ఆకాశ్‌దీప్ (రూ.1 కోటి), రాహుల్ త్రిపాఠి (రూ. 75 లక్షలు), దక్ష్ కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్ రంజన్ (రూ.30 లక్షలు), ప్రశాంత్ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ.30 లక్షలు)లను వేలంలో కొనుగోలు చేసింది.ఐపీఎల్-2026కు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇదేఅజింక్య రహానే, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువన్షి, సునిల్ నరైన్, అనుకుల్ రాయ్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మనీశ్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్ కామెరాన్ గ్రీన్, మతీశ పతిరణ, ముస్తఫిజుర్ రెహ్మాన్, తేజస్వి సింగ్ , రచిన్ రవీంద్ర, ఫిన్ అలెన్ , సీఫెర్ట్, ఆకాశ్‌దీప్, రాహుల్ త్రిపాఠి , కామ్రా , సార్థక్ రంజన్ , ప్రశాంత్ సోలంకి, కార్తీక్ త్యాగి.చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు -
ఐపీఎల్ వేలంలో రూ. 25 కోట్లు.. కట్ చేస్తే! అక్కడ డకౌట్
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన గ్రీన్.. వేలం ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన పేలవ ప్రదర్శనతో అందరిని నిరాశపరిచాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మూడో టెస్టులో గ్రీన్ డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గ్రీన్ తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 2 బంతులు ఎదుర్కొని జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో బ్రైడన్ కార్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో నెటిజన్లు గ్రీన్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఐపీఎల్లో కూడా ఇలానే ఆడుతావా? కేకేఆర్ భయపడుతోంది అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. గాయం కారణంగా గత ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న గ్రీన్.. ఈసారి కేకేఆర్ తరపున బరిలోకి దిగనున్నాడు.గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. దాదాపు ఆరు నెలల తర్వాత పోటీ క్రికెట్లో తిరిగొచ్చిన గ్రీన్.. టెస్టుల్లో మాత్రం రాణించలేకపోతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం పర్వాలేదన్పిస్తున్నాడు. అయితే కామెరూన్ తనదైన రోజున ఒంటి చేత్తో జట్టును గెలిపించగలడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ(106) సూపర్ సెంచరీతో చెలరేగగా.. ఉస్మాన్ ఖవాజా(126 బంతుల్లో 82), ఇంగ్లిష్(32) రాణించారు. ప్రస్తుతం క్రీజులో మిచెల్ స్టార్క్(33), లియోన్(0) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, బ్రైడన్ కార్స్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: 'డేల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లా'.. ఢిల్లీ జట్టులోకి పేస్ సంచలనం -
కేకేఆర్‌లోకి పప్పు యాదవ్ కొడుకు.. ధర ఎంతంటే?
అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ బిడ్డింగ్స్‌తో ఆశ్చర్యపరిచింది. రూ. 64.30 కోట్ల భారీ పర్సుతో వేలంలోకి దిగిన కేకేఆర్.. మొత్తం 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి తమ జట్టును పటిష్టం చేసుకుంది.ఈ వేలంలో కేకేఆర్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ఏకంగా రూ. 25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. అదేవిధంగా కేకేఆర్.. భారత అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం కూడా తమ పర్స్‌లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది. కేకేఆర్ కొనుగోలు చేసిన మొత్తం 13 మంది ఆటగాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ (పప్పు యాదవ్) కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు. సార్థక్‌ను రూ. 30 లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. 29 ఏళ్ల సార్థక్ ఐపీఎల్‌కు ఎంపిక కావడం ఇదే తొలిసారి.సార్థక్ రంజన్ డొమెస్టిక్ క్రికెట్లో ఢిల్లీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 9.33 సగటుతో 28 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 105, టీ20ల్లో 5 మ్యాచ్‌లు 66 పరుగులు చేశాడు. ఇక తన కుమారుడు ఐపీఎల్‌కు ఎంపిక కావడం పట్ల పప్పు యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు."అభినందనలు సార్థక్! నీ టాలెంట్‌తో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో, నీ కలలను నిజం చేసుకో" అంటూ ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా పప్పు యాదవ్ బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్! -
సీఎస్కే వదిలేసింది.. కట్ చేస్తే! వేలంలో కోట్ల వర్షం
ఐపీఎల్-2026 మినీ వేలంలో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరానాకు జాక్ పాట్ తగిలింది. అతడిని రూ. 18 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పతిరానా కోసం తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీ పోటీనుంచి తప్పుకోవడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ జూనియర్ మలింగ కోసం కేకేఆర్, లక్నో మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. లక్నో అతడిని దక్కించుకునేందుకు ఆఖరివరకు ప్రయత్నాలు చేసింది. కానీ కేకేఆర్ మాత్రం బిడ్‌ను పెంచుకుంటూ పోతుండడంతో లక్నో వెనక్కి తగ్గింది. దీంతో ఈ యార్కర్ల కింగ్ కేకేఆర్ సొంతమయ్యాడు.పతిరానా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే నాలుగు సీజన్ల పాటు తమ జట్టుకు ఆడిన పతిరానాను సీఎస్కే.. ఐపీఎల్-2026 వేలంకు ముందు రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలోకి వచ్చిన పతిరానాపై కాసుల వర్షం కురిసింది. గత సీజన్లో సీఎస్కే నుంచి రూ.13 కోట్లు అందుకున్న పతిరానా.. ఇప్పుడు కేకేఆర్ నుంచి రూ.18 కోట్లు అందుకోనున్నాడు. కాగా పతిరానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. పతిరానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. పతిరానా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటికి.. సీఎస్కే లెజెండ్ ధోని సారథ్యంలో ఎంతగానో రాటుదేలాడు. మిడిల్ ఓవర్లలో కూడా తన పేస్ బౌలింగ్ బ్యాటర్లను కట్టడి చేయగలడు. అంతేకాకుండా ఈ జూనియర్ మలింగా యార్కర్లను కూడా అద్భుతంగా సంధించగలడు. ఈ కారణంతోనే అతడిపై కేకేఆర్ కోట్ల వర్షం కురిపించింది. మతీషా పతిరానా ఐపీఎల్లో ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2026: కామెరూన్ గ్రీన్‌కు భారీ ధర.. ఐపీఎల్ చరిత్రలోనే! ఎన్ని కోట్లంటే? -
ముగిసిన ఐపీఎల్-2026 మినీ వేలం
IPL 2026 Auction LIVE Updates And Highlights: అబుదాబి వేదికగా ఐపీఎల్-2026 మినీ వేలం ముగిసింది. మొత్తం పది ఫ్రాంచైజీలు 77 స్ధానాలను భర్తీ చేశాయి. ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ నిలిచాడు. రూ.25.20 కోట్ల భారీ ధరకు అతడిని కేకేఆర్ సొంతం చేసుకుంది. అన్ క్యాప్డ్ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను రూ.14.20 కోట్ల రికార్డు ధరకు సీఎస్కే కొనుగోలు చేసుకుంది. వారిద్దరి కోసమే చెన్నై రూ.28 కోట్ల పైగా ఖర్చు చేసింది.👉ఆంధ్ర పేసర్ పృథ్వీ రాజ్ యర్రాను రూ.30 లక్షల కనీస ధరకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.👉పృథ్వీ షాను రూ.75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.👉హైదరాబాద్ ఆటగాడు అమన్ రావు పేరాలను రూ.30 లక్షలకు తీసుకున్న రాజస్తాన్ రాయల్స్👉ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్‌ను రూ.8.60 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.👉లుంగీ ఎంగిడిని రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.👉రాహుల్ చాహర్‌ను రూ.5.20 కోట్లకు సీఎస్కే సొంతం చేసుకుంది.👉ఆసీస్ బౌలర్ బెన్ దుర్హనియస్‌ను రూ.4.40 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.👉ఆకాష్ దీప్‌ను, మాట్ హెన్రిలను కేకేఆర్, సీఎస్కే కొనుగోలు చేశాయి. రూ.2 కోట్ల కనీస ధరకే దక్కించుకున్నాయి.👉కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను రూ.2 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది.👉ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లైమ్ లివింగ్‌స్టోన్‌ను రూ.13 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.👉పృథ్వీషా, దీపక్ హుడా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.👉టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను రూ.75 లక్షలకు సీఎస్కే సొంతం చేసుకుంది. తొలి రౌండ్లో అమ్ముడుపోని సర్ఫరాజ్‌ను.. ఆఖరి రౌండ్లో చెన్నై దక్కించుకుంది.👉అమిత్ కుమార్‌ను రూ. 30 లక్షలకు ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది.👉భారత అన్క్యాప్డ్ ప్లేయర్ మంగేష్ యాదవ్‌ను రూ.5.20 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ దక్కించుకుంది.👉సైల్ ఆరోరాను రూ. 1.50 కోట్లకు ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది.👉రవిసింగ్‌ను రూ.30 లక్షలకు రాజస్తాన్ కైవసం చేసుకుంది.👉డానిష్ మలేవార్ రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.👉 భారత అన్క్యాప్డ్ అక్షత్ రఘువంశీని రూ.2.20 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.👉బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను రూ.9.20 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.👉వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను రూ.7 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. అదేవిధంగా ఆసీస్ ప్లేయర్ మాథ్యూ షార్ట్‌ను సీఎస్కే రూ.1.50 కోట్లకు దక్కించుకుంది.👉రాహుల్ త్రిపాఠీని రూ.75 లక్షల కనీస ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది.👉శ్రీలంక స్టార్ ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంకను రూ.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.👉నమన్ తివారీని కోటిరూపయాలకు లక్నో సొంతం చేసుకుంది.👉అన్క్యాప్డ్ ప్లేయర్లు ముకుల్ చౌదరిని రూ. 2.60 కోట్లకు లక్నో, తేజస్వీ సింగ్‌ను రూ.3 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది.కార్తీక్ శర్మకు రూ. 14. 25 కోట్లుఐపీఎల్-2026 వేలంలో మరో అన్క్యాప్డ్ ప్లేయర్ పంట పండింది. రాజస్తాన్‌కు చెందిన కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.యూపీ ఆటగాడికి జాక్ పాట్.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అన్క్యాప్డ్ ఆటగాడు ప్రశాంత్ వీర్‌పై కాసుల వర్షం కురిసింది. రూ.14.20 కోట్ల భారీ ధరకు సీఎస్కే కొనుగోలు చేసింది. 20 ఏళ్ల ప్రశాంత్ కోసం సీఎస్కేతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. కానీ చివరికి ఈ యువ ఆటగాడు సీఎస్కే సొంతమయ్యాడు.భారత వెటరన్ ప్లేయర్ విజయ్ శంకర్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.అన్క్యాప్డ్ ప్లేయర్‌కు భారీ ధర..జమ్ముకాశ్మీర్ పేసర్ అకిబ్ నబీకి ఊహించని ధర దక్కింది. రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీని రూ.8.4 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.👉విండీస్ స్పిన్నర్ అకిల్ హోస్సేన్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు సీఎస్కే సొంతం చేసుకుంది.బిష్ణోయ్‌కు భారీ ధర..భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను రూ. 7.20 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.👉సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జేను రూ. 2 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.పతిరానాకు జాక్‌పాట్..శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరానాను రూ. 18 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ఆర్సీబీలోకి కివీ స్టార్ పేసర్న్యూజిలాండ్ స్టార్ పేసర్ జాకబ్ డఫీని రూ.2 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి డకెట్..బెన్ డకెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోగా.. అలెన్‌ను కేకేఆర్ దక్కించుకుంది. వీరిద్దరూ రూ. 2 కోట్ల బెస్ ప్రైస్‌కు అమ్ముడుపోయారు.ముంబైలోకి డికాక్..సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్‌ను రూ. కోటి రూపాయల కనీస ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.👉దీపక్ హుడా, కేఎస్ భరత్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.ఆర్సీబీలోకి వెంకటేశ్ అయ్యర్..భారత ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రూ.7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. అయ్యర్ కోసం కేకేఆర్, ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడ్డాయి. కేకేఆర్, లక్నో పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్ బెంగళూరు ఫ్రాంచైజీలోకి చేరాడు.లక్నోలోకి హసరంగశ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగాను రూ. 2 కోట్ల బెస్‌ప్రెస్‌కు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.👉ఇంగ్లండ్ క్రికెటర్ గస్ అట్కిన్సన్, కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్, లైమ్ లివింగ్ స్టోన్, అమ్ముడుపోలేదు.సర్ఫరాజ్ ఖాన్ అన్సోల్డ్భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. కనీస ధర రూ.75లక్షలతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేదు.గ్రీన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 25.20 కోట్లకు కేకేఆర్ సొంతంఊహించినట్లుగానే ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై కాసులు వర్షం కురిసింది. గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతానైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. అతడిని దక్కించుకునేందుకు మొదటిలో కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత రాయల్స్ పోటీ నుంచి తప్పుకోవడంతో సీఎస్కే ఎంట్రీ ఇచ్చింది. సీఎస్కే, కేకేఆర్ మధ్య తీవ్రమైన బిడ్డింగ్ వార్ జరిగింది. ఆఖరిలో సీఎస్కే రేసు నుంచి తప్పుకోవడంతో గ్రీన్ కేకేఆర్ సొంతమయ్యాడు.పృథ్వీ షా అన్‌సోల్డ్..టీమిండియా ప్లేయర్ పృథ్వీ షాకు మరోసారి నిరాశే ఎదురైంది. రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన షాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుందుకు ముందుకు రాలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అతడితో పాటు కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వే సైతం అమ్ముడు పోలేదు.ఢిల్లీకి డేవిడ్ మిల్లర్ఐపీఎల్-2026 మినీ వేలంలో అమ్ముడుపోయిన తొలి ప్లేయర్‌గా డేవిడ్ మిల్లర్ నిలిచాడు. మిల్లర్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.మెక్‌గర్క్‌కు షాక్..ఐపీఎల్-2026 మినీ వేలం ప్రారంభమైంది. ఈ వేలంలోకి వచ్చిన తొలి ప్లేయర్‌గా ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ నిలిచాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.మరి కాసేపట్లో ఐపీఎల్ వేలం..ఐపీఎల్-2026 మినీ వేలం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 77 స్ధానాలను గాను ఈ వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 369 ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు ఉన్నాయి. కేకేఆర్ తర్వాత స్ధానంలో చెన్నై సూపర్ కింగ్స్(43.4 కోట్లు) నిలిచింది. పది ఫ్రాంఛైజీల్లో రూ.2.75 కోట్ల పర్స్‌తో ముంబై ఇండియన్స్ చివరిస్థానంలో ఉంది. గ్రీన్‌పై అందరి కళ్లు?ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. గతేడాది సీజన్‌కు దూరంగా ఉన్న గ్రీన్‌ను ఈసారి తమ జట్టులోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ముఖ్యంగా కేకేఆర్, సీఎస్కే మధ్య పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. అతడితో రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి ఆటగాళ్లకు భారీ ధర దక్కనున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
IPL 2026: గ్రీన్ ధర రూ. 30.50 కోట్లు.. ఎవరు కొన్నారంటే?
క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంపైనే కేంద్రీకృతమై ఉంది. అబుదాబి వేదికగా మంగళవారం (డిసెంబరు 16) వేలంపాట నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, అంతకంటే ముందు టీమిండియా మాజీ స్టార్లతో బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ మాక్ వేలాన్ని నిర్వహించింది.ఆ మాక్ ఆక్షన్‌లో ముప్పై మంది ప్లేయర్లను వేలం వేయనున్నారు. ఇందులో భాగంగా పది ఫ్రాంఛైజీల తరఫున పది మంది భారత మాజీ క్రికెటర్లు మాక్ వేలంలో పాల్గొన్నారు. వీరిలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు ప్రాతినిథ్యం వహించిన రాబిన్ ఊతప్ప తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. క్లారిటీ ఇచ్చిన గ్రీన్వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green)పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, అతడు పూర్తిస్థాయి బ్యాటర్‌గా పేరు నమోదు చేసుకోవడం గందరగోళానికి గురిచేసింది. ఈ పేస్ ఆల్‌రౌండర్ బౌలింగ్ సేవలు అందిస్తాడా? లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి.ఈ విషయంపై గ్రీన్ ఇటీవల స్వయంగా స్పందించాడు. తాను బౌలింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని.. తన మేనేజర్ తప్పిదం వల్లే అనుకోకుండా ప్యూర్ బ్యాటర్ బ్యాక్స్ టిక్ చేసినట్లు ఉన్నారని తెలిపాడు. ఈ నేపథ్యంలో మాక్ వేలంలో గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సురేశ్ రైనా, కోల్‌కతా తరఫున రాబిన్ ఊతప్ప పోటీపడ్డారు.రూ. 30.50 కోట్ల భారీ ధరతోఈ క్రమంలో గ్రీన్ ధర ఏకంగా రూ. 27 కోట్లు దాటింది. అయినప్పటికీ తగ్గేదేలే అన్నట్లు రైనా, ఊతప్ప పట్టువీడలేదు. ఏకంగా రూ. 30.50 కోట్ల భారీ ధరతో గ్రీన్‌ను కొనుగోలు చేశాడు ఊతప్ప. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర. గతేడాది మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను రూ. 27 కోట్ల అసలైన ధరకు కొనుక్కుంది.ఇక ఈ మాక్ వేలంలో ఊతప్ప గ్రీన్‌కు ఈ మేర.. పర్సులో దాదాపు సగం మొత్తం గ్రీన్ కోసం కేటాయించడం విశేషంగా నిలిచింది. ఇక గ్రీన్‌తో పాటు జానీ బెయిర్ స్టో (రూ. 2.5 కోట్లు)ను కూడా కొనుగోలు చేసిన ఊతప్ప.. శ్రీలంక యువ పేసర్, చెన్నై మాజీ బౌలర్ మతీశ పతిరణ కోసం ఏకంగా రూ. 13 కోట్లు వెచ్చించాడు.అత్యధికంగా రూ. 64.3 కోట్లుకాగా ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు)ల రూపంలో ఖరీదైన ఆటగాళ్లను వదిలేసింది. ఈ క్రమంలో కేకేఆర్ పర్సులో అత్యధికంగా రూ. 64.3 కోట్లు చేరింది. అయితే, మాక్ వేలంలో ఒక్క గ్రీన్ కోసమే ఊతప్ప రూ. 30 కోట్లు వెచ్చించడం విశేషం. రసెల్ రిటైర్మెంట్తో ఏర్పడిన ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేసే సరైన ఆప్షన్ అని భావించే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా కేకేఆర్‌లో మొత్తంగా 13 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. చదవండి: Ashes: మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
కేకేఆర్ కీలక నిర్ణయం..! కెప్టెన్‌గా అతడే?
ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయో సీజన్లో కూడా తమ జట్టు కెప్టెన్‌గా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేను కొనసాగించాలని కేకేఆర్ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు సమాచారం.డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనున్న మినీ వేలానికి కూడా అతడు హాజరు కానున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. గత సీజన్లో రహానే కెప్టెన్సీలో కేకేఆర్ దారుణ ప్రదర్శన కనబరిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన నైట్‌రైడర్స్ ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్దానంలో నిలిచింది. అజింక్య తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించలేకపోయాడు. దీంతో ఐపీఎల్-2026లో రహానేను కేకేఆర్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని వార్తలు వచ్చాయి. కానీ కేకేఆర్ యాజమాన్యం మాత్రం రహానేకు మరో అవకాశమిచ్చేందుకు సిద్దమైంది. ఇదే విషయంపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.ఈ సీజన్లో అజింక్య రహానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి. అదేవిధంగా మరోసారి అతడు కేకేఆర్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశముంది. ఎందుకంటే కెప్టెన్సీ సత్తా ఉన్న ఆటగాడు ఎవరూ వేలంలో లేరు. యువ ఆటగాడు రఘువంశీ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అతడిని వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఉపయోగించుకోవాలని కేకేఆర్ భావిస్తుందని బంగర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.గ్రీన్‌పై కన్ను..కాగా కేకేఆర్ రూ. 64.30 కోట్లు పర్స్‌తో వేలంలోకి వెళ్లనుంది. ఇది అన్ని జట్ల కంటే అత్యధిక మనీ కేకేఆర్ వద్దే ఉంది. నైట్‌రైడర్స్ మొత్తంగా 13 స్ధానాలను భర్తీ చేయనుంది. అందులో విదేశీ ఆటగాళ్ల స్ధానాలు ఆరు ఉన్నాయి. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను దక్కించుకునేందుకు కేకేఆర్ ప్రయత్నించే అవకాశముంది.ఈ వేలానికి ముందు కేకేఆర్ రహానే పాటు రింకూ సింగ్, సునీల్ నరైన్, రోవ్‌మన్ పావెల్, వరుణ్ చక్రవర్తి, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, అంకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, వైభవ్ అరోరాతో సహా మొత్తం 12 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.వదేలిసిన ఆటగాళ్లు వీరే..ఆండ్రీ రస్సెల్ (₹12 కోట్లు)వెంకటేష్ అయ్యర్ (₹23.75 కోట్లు)క్వింటన్ డి కాక్రహమనుల్లా గుర్బాజ్అన్రిచ్ నోర్ట్జేమొయిన్ అలీచదవండి: IPL 2026: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ బౌలర్ల మీదే! -
భారీగా తగ్గిన ధర!.. మళ్లీ కేకేఆర్కే వెంకటేశ్ అయ్యర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలానికి సమయం ఆసన్నమైంది. అబుదాబి వేదికగా డిసెంబరు 16న వేలంపాట నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అత్యధికంగా రూ. 63.30 కోట్ల పర్సుతో రంగంలోకి దిగనుంది.పదమూడు ఖాళీలువేలానికి ముందు తమ జట్టులోని అత్యంత ఖరీదైన ఆల్‌రౌండర్లు వెంకటేశ్ అయ్యర్ (27.75 కోట్లు), ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు)ను వదులుకోవడంతో కేకేఆర్ పర్సులో భారీగా సొమ్ము చేరింది. ఇక ఆ జట్టులో పదమూడు ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఆరు విదేశీ ప్లేయర్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.మాక్ వేలంఇదిలా ఉంటే.. గతంలో మాదిరే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈసారి కూడా మాక్ వేలం నిర్వహించాడు. ఇందులో పది ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ అభిమానులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వెంకటేశ్ అయ్యర్ పేరు వేలంలోకి రాగానే... చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అతడి కోసం పోటీపడ్డాయి.భారీగా తగ్గిన ధర!.. ఇంతలో కేకేఆర్ కూడా రంగంలోకి దిగింది. చెన్నై, ముంబైలతో పోటీపడి ఎట్టకేలకు వెంకటేశ్ అయ్యర్‌ను దక్కించుకుంది. అయితే, గతేడాది పేలవ ప్రదర్శన దృష్ట్యా ఈసారి వెంకీ ధర ఆరు కోట్లు తగ్గిపోయింది. మాక్ వేలంలో కేకేఆర్ అతడిని రూ. 17.5 కోట్లకు కొనుక్కుంది. కాగా 2025లో పదకొండు మ్యాచ్‌లలో కలిపి కేవలం 142 పరుగులే చేశాడు. సీజన్ మొత్తంలో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను కేకేఆర్ ఏకంగా రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. గతేడాది అతడు ఆర్సీబీ (రూ. 8.75 కోట్లు) తరఫున పేలవంగా ఆడాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి 90 పరుగులే చేశాడు. రెండు వికెట్లు తీశాడు. అయితే, ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు మాక్ వేలంలో కేకేఆర్ లివింగ్‌స్టోన్‌ను కొనుక్కోవడం గమనార్హం.చదవండి: ఆసియా కప్- 2025: భారత్ ఘన విజయం -
నీ ఒంటికి వేరే జెర్సీ సూట్ అవ్వదు: షారుఖ్ ఖాన్ పోస్ట్ వైరల్
వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు వీడ్కోలు పలికాడు. గత పన్నెండు సీజన్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. 2026 మినీ వేలానికి ముందు లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్పందిస్తూ.. రసెల్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత ట్వీట్ చేశాడు.నీ ఒంటిపై కేకేఆర్ తప్ప ఏ జట్టు జెర్సీ అయినా..‘‘మాకెన్నో మధురమైన, అద్భుతమైన జ్ఞాపకాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆండ్రీ. నీ అద్భుత ఆట తీరుతో క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నావు. కేకేఆర్ (KKR)కు నువ్వు అందించిన సేవలు మరువలేనివి.ఇక క్రీడాకారుడిగా నీ జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. పవర్ కోచ్‌గా మాతో నీ ప్రయాణం కొనసాగుతుంది. నీ తెలివి, శక్తిని మన ఆటగాళ్లకు బదిలీ చేసెయ్. వారిని చాంపియన్లుగా నిలిపే ఉత్ప్రేరకంగా మారు.ఏదేమైనా నీ ఒంటిపై కేకేఆర్ తప్ప ఏ జట్టు జెర్సీ అయినా అంత బాగా కనిపించదు ఆండ్రీ. లవ్ యూ రసెల్. ఆటను ప్రేమించే ప్రతి ఒక్కరి తరఫున నేను ఈ మాట చెబుతున్నా’’ అంటూ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan).. రసెల్‌తో తమ జట్టుకు ఉన్న అనుబంధాన్ని మాటల్లో వ్యక్తపరిచాడు. కాగా... కేకేఆర్ యాజమాన్యం రసెల్ (Andre Russell)ను తమ జట్టు ‘పవర్ కోచ్’గా నియమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.నాలో సిక్స్‌లు కొట్టే సత్తా ఉందిఇదిలా ఉంటే.. 2012 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న 37 ఏళ్ల రసెల్ 2014 నుంచి ఇప్పటి వరకు కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటైర్మెంట్ సందర్భంగా.. ‘కేకేఆర్‌తో బంధం విడదీయలేనిది. ఇప్పటికీ నాలో సిక్స్‌లు కొట్టే సత్తా... మ్యాచ్‌లు గెలిపించగల పట్టుదల ఉన్నాయి. కానీ వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయం అని భావించా.ఇక మీద కొత్త అవతారంలో దర్శనమిస్తా. 2026 సీజన్లో అదే ఉత్సాహంతో కేకేఆర్ ‘పవర్ కోచ్’గా పనిచేయనున్నాను. 12 సీజన్లుగా కోల్‌కతా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఇక్కడ నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇతర లీగ్‌ల్లో ఆటగాడిగా కొనసాగుతున్నా... ఐపీఎల్లో మాత్రం ప్లేయర్‌గా కాకుండా వేరే బాధ్యతలు నిర్వర్తించనున్నా. ఇంకా ఆడే సత్తా ఉన్నప్పుడే తప్పుకోవాలనేది నా అభిమతం.ఎంతో నమ్మకముంచారుఅందుకే ఇంకొన్నాళ్లు ఆడే దమ్ము ఉన్నప్పటికీ ముందే వీడ్కోలు పలుకుతున్నా. ఆటగాడిగా రిటైర్ అయినా... కేకేఆర్ కుటుంబంలో నేనెప్పుడూ భాగమే. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఫ్రాంచైజీ యాజమాన్యంతో సుదీర్ఘంగా చర్చించా. వాళ్లు నాపై ఎంతో నమ్మకముంచారు. ఇన్నాళ్లు మైదానంలో ప్లేయర్‌గా నిర్వర్తించిన బాధ్యతలను ఇకపై ‘పవర్ కోచ్’గా డగౌట్లో ఉండి చక్కబెట్టమని సూచించారు. అందుకు అంగీకరించా’ అని రసెల్ వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు.కాగా తొలి రెండు సీజన్ల పాటు ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రసెల్... ఓవరాల్‌గా ఐపీఎల్లో 140 మ్యాచ్‌లాడి 174.18 స్ట్రయిక్‌రేట్‌తో 2,651 పరుగులు చేశాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా తన బౌలింగ్‌తోనూ ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాలు అందించిన రసెల్ 123 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
ఆండ్రీ రసెల్ కీలక నిర్ణయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)- 2026 వేలానికి వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఆటగాడిగా మాత్రమే క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్‌బై చెప్పిన రసెల్.. మరో కొత్త అవతారంలో అభిమానుల ముందుకు రానున్నట్లు తెలిపాడు.ఐపీఎల్-2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సహాయక సిబ్బంది బృందంలో చేరనున్నట్లు రసెల్ వెల్లడించాడు. ఈ సందర్భంగా కేకేఆర్ జట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని తెలిపేలా రసెల్ (Andre Russel) ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. సుదీర్ఘ కాలంగా తనకు అండగా నిలిచిన కేకేఆర్ యాజమాన్యంతో పాటు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. వేలంలోకి వదిలిన కేకేఆర్కాగా 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన రసెల్.. 2014లో కేకేఆర్‌లో చేరాడు. ఇక అప్పటి నుంచి కోల్‌కతానే ప్రయాణం సాగించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. గతేడాది టైటిల్ గెలిచిన కేకేఆర్ టీమ్‌లో అతడు మెంబర్ కూడా!ఈ క్రమంలో ఐపీఎల్-2025 వేలానికి ముందు కేకేఆర్ రసెల్‌ను రూ. 12 కోట్ల భారీ మొత్తానికి రిటైన్ చేసుకుంది. ఈ ఏడాది 10 ఇన్నింగ్స్ ఆడి 167 పరుగులు చేసిన రసెల్.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ సీజన్లో రహానే సారథ్యంలోని కేకేఆర్ చేదు ఫలితాలు చవిచూసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ కేకేఆర్‌తోనే..ఈ నేపథ్యంలో తమ ఖరీదైన ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), రసెల్ (రూ. 12 కోట్లు) 2026 వేలానికి ముందు కేకేఆర్ విడిచిపెట్టింది. దీంతో రసెల్‌ను తిరిగి తక్కువ ధరకు కేకేఆర్ దక్కించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. అతడు రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. అయితే, కోచింగ్ సిబ్బందిలో ఒకడిగా కేకేఆర్‌తో కొనసాగుతానన్న 37 ఏళ్ల రసెల్ ప్రకటన పట్ల ఆ జట్టు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐపీఎల్లో 140 మ్యాచ్‌లు ఆడిన రస్సెల్ 2,651 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు తీశాడు. చదవండి: IPL: సంచలన నిర్ణయం తీసుకున్న 'డుప్లెసిస్' -
IPL 2026: ‘కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడతా’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటిదాకా వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) ఒకే జట్టుతో కొనసాగాడు. రూ. 20 లక్షల కనీస ధరతో ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను 2021లో కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వరుస అవకాశాలు ఇచ్చి అతడిని ప్రోత్సహించింది.ఇందుకు తగ్గట్లుగానే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వెంకటేశ్ అయ్యర్.. ఫ్రాంఛైజీ నమ్మకాన్ని చూరగొన్నాడు. ఫలితంగా జట్టులో చేరిన మరుసటి ఏడాదే అంటే.. 2022లో వేలానికి ముందు కేకేఆర్ అతడిని ఏకంగా రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. భారీ హైక్ ఇచ్చి వరుస మ్యాచ్‌లలో ఆడించింది.మెరుపు అర్ధ శతకంతో ఇక 2023, 2024 సీజన్లలోనూ వెంకీకి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించింది. గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ టైటిల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో వెంకటేశ్ అయ్యర్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన వెంకీ మెరుపు అర్ధ శతకంతో చెలరేగాడు.హైదరాబాద్ విధించిన 114 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (32 బంతుల్లో 39) ఓ మోస్తరుగా రాణించగా.. సునిల్ నరైన్ (6) విఫలమయ్యాడు. ఇలాంటి తరుణంలో వన్‌డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచి.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా చెన్నై వేదికగా రైజర్స్‌ను ఓడించిన కేకేఆర్ ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.ఏకంగా రూ. 23.75 కోట్లుఈ క్రమంలో ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ రిలీజ్ చేసింది. ఆక్షన్‌లో భారీ పోటీ నెలకొన్నా.. రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసి అతడిని మళ్లీ సొంతం చేసుకుంది. తద్వారా అతడి మొదటి జీతానికి దాదాపు 3900 శాతం హైక్ ఇచ్చింది.కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడతాఅయితే, ఈసారి వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా నిరాశపరిచాడు. పదకొండు మ్యాచ్‌లలో కలిపి కేవలం 142 పరుగులే సాధించిన అతడు.. సీజన్ మొత్తంలో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. దీంతో తాజాగా మరోసారి కేకేఆర్ వెంకటేశ్‌ను వేలంలోకి వదిలింది. కానీ ఈసారి అతడిని మళ్లీ సొంతం చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించకపోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో వెంకటేశ్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడుతూ.. ‘‘నాలాంటి ఆటగాళ్లకు ఐపీఎల్లో ఆడటమే గొప్ప అదృష్టం. ఏ జట్టుకు ఆడినా.. నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా.ఒకవేళ నా హృదయం చెప్పినట్లు వినాలంటే.. ఇప్పటికీ కేకేఆర్‌తోనే ఉండాలని కోరుకుంటున్నా. కేకేఆర్‌తో కలిసి చాంపియన్‌గా నిలిచాను. అక్కడే కొనసాగాలని అనుకుంటున్నాను. కేకేఆర్‌కు మరింత పేరు తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నాను.నాయకత్వ బృందంలో ఉండటం ఇష్టంఎందుకంటే ఐదేళ్ల పాటు వాళ్లు నాపై పూర్తి నమ్మకం ఉంచారు. నన్ను ప్రోత్సహించారు. అయితే, ఈసారి వేలంలో ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడాల్సి వస్తుంది. ఏదేమైనా.. ఎక్కడికి వెళ్లినా నా సర్వస్వం ధారబోసి జట్టును గెలిపించేందుకు కృషి చేస్తానని అందరికీ తెలుసు.బ్యాటింగ్, బౌలింగ్ పరంగానే కాదు.. నాయకత్వ బృందంలో ఉండటం నాకు ఇష్టం. కెప్టెన్‌కు అవసరమైన సలహాలు ఇచ్చేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటాను’’ అని వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా 2025లో వెంకీని కెప్టెన్ చేస్తారని భావించగా.. అనూహ్య రీతిలో కేకేఆర్ వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేను సారథిగా నియమించింది. అతడి కెప్టెన్సీలో ఘోర పరాభవం చవిచూసింది. పద్నాలుగింట కేవలం ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. చదవండి: IND Vs PAK: మళ్లీ భారత్ × పాకిస్తాన్ ఫైనల్? -
IPL 2026: ఎనిమిది మంది కెప్టెన్లు ఫిక్స్!.. మరి ఆ రెండు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్‌కు ఫ్రాంఛైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అట్టిపెట్టుకునే, విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన పది జట్లు.. వేలానికి సన్నద్ధమయ్యాయి. ఖరీదు అనుకున్న ఆటగాళ్లను ఆక్షన్‌లోకి వదిలి.. తిరిగి తక్కువ ధరకు సొంతం చేసుకోవాలని కొన్ని ఫ్రాంఛైజీలు భావిస్తుండగా.. భారం అనుకున్న ఆటగాళ్లను మరికొన్ని ఫ్రాంఛైజీలు ట్రేడ్ చేసుకున్నాయి.జడ్డూకు బదులుగా సంజూఇక ట్రేడింగ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాజస్తాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన ఒప్పందం హైలైట్‌గా నిలిచింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్‌కు ఇచ్చేసిన సీఎస్కే.. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌ను తమ ఫ్రాంఛైజీలోకి ఆహ్వానించింది. సంజూ రిటైన్ ధర రూ. 18 కోట్లు చెల్లించి మరీ రాజస్తాన్ నుంచి అతడిని చెన్నై ట్రేడ్ చేసుకుంది.రుతురాజ్ గైక్వాడ్‌కే ఓటుఈ నేపథ్యంలో సంజూకు సీఎస్కే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగగా.. చెన్నై మాత్రం రుతురాజ్ గైక్వాడ్‌కే ఓటు వేసింది. రిటెన్షన్, రిలీజ్ జాబితా విడుదల చేసిన వెంటనే రుతును తమ కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తాజాగా అదే బాటలో నడువగా.. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీలు కూడా తమ పాత కెప్టెన్లనే 2026లోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.ఇంకా సారథిని ప్రకటించని ఆ రెండు జట్లుఅయితే, కెప్టెన్ సంజూను సీఎస్కేకు ట్రేడ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ మాత్రం కొత్త సారథి పేరును ఇంకా ప్రకటించలేదు. మరోవైపు.. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా తమ కెప్టెన్‌గా అజింక్య రహానేను కొనసాగిస్తారా? లేదా? అన్న విషయం గురించి స్పష్టతనివ్వలేదు. కాగా డిసెంబరు 16న అబుదాబి వేదికగా ఐపీఎల్-2026 మినీ వేలం జరుగనుంది.ఐపీఎల్-2026లో జట్ల కెప్టెన్లు వీరే👑చెన్నై సూపర్ కింగ్స్- రుతురాజ్ గైక్వాడ్👑సన్‌రైజర్స్ హైదరాబాద్- ప్యాట్ కమిన్స్👑గుజరాత్ టైటాన్స్- శుబ్‌మన్ గిల్👑లక్నో సూపర్ జెయింట్స్- రిషభ్ పంత్👑రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రజత్ పాటిదార్👑ఢిల్లీ క్యాపిటల్స్- అక్షర్ పటేల్👑పంజాబ్ కింగ్స్- శ్రేయస్ అయ్యర్👑ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా.చదవండి: వెంకటేశ్ అయ్యర్‌కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
IPL 2026: కేకేఆర్ కీలక ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ శిక్షణా సిబ్బందిలో న్యూజిలాండ్ దిగ్గజ బౌలర్‌ను చేర్చుకుంది. కాగా అభిషేక్ నాయర్‌ను ఇప్పటికే హెడ్‌కోచ్‌గా ప్రమోట్ చేసిన కేకేఆర్.. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకున్నట్లు గురువారం వెల్లడించింది.‘వాట్సన్‌కు కేకేఆర్ కుటుంబం స్వాగతం పలుకుతోంది. ప్లేయర్‌గా, కోచ్‌గా ఈ ఆస్ట్రేలియన్కున్న విశేషానుభవం మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆటగాడిగా నిరూపించుకున్న అతడి కోచింగ్‌లో మా జట్టు సన్నాహాలు మరో స్థాయిలో ఉంటాయని ఆశిస్తున్నాం. అతడి సేవలతో మా జట్టు ఉన్నతశిఖరాలు అధిరోహిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని కోల్‌కతా ఫ్రాంచైజీ సీఈఓ వెంకీ మైసూర్ అన్నారు.ఇక తన నియామకం పట్ల ఆనందం వ్యక్తం చేసిన వాట్సన్... కేకేఆర్ బృందంలో చేరేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. కోల్‌కతా మరోసారి టైటిల్ గెలిచేందుకు తనవంతు కృషి చేస్తానన్నాడు. కాగా ఈ మాజీ ఆల్‌రౌండర్ కంగారూ తరఫున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టి20ల0 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పైచిలుకు పరుగులు, 280 వికెట్లు తీశాడు. 2007, 2015 వన్డే ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడిగా ఉన్నాడు.ఐపీఎల్‌లోనూ వాట్సన్‌ది సుదీర్ఘమైన కెరీర్ అని చెప్పొచ్చు. ప్రారంభ ఐపీఎల్ సీజన్ 2008 నుంచి 2020 వరకు 12 ఏళ్ల పాటు లీగ్ క్రికెట్ ఆడాడు. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్‌కింగ్స్ టైటిళ్లలోనూ భాగమయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సైతం అతను ప్రాతినిధ్యం వహించాడు.ఇదిలా ఉంటే.. తాజాగా తమ కొత్త బౌలింగ్ కోచ్ పేరును కేకేఆర్ ప్రకటించింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీని బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు తెలిపింది. కాగా ఇంతకు ముందు భరత్ అరుణ్ కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా ఉండగా.. అతడు లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరేందుకు కోల్‌కతా ఫ్రాంఛైజీని వీడాడు. ఈ క్రమంలో సౌతీతో అరుణ్ భరత్ స్థానాన్ని కేకేఆర్ భర్తీ చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఇక సౌతీ 2021, 2023 సీజన్లలో ఆటగాడిగా కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. చంద్రకాంత్ పండిట్ మార్గదర్శనంలో 2023లో టైటిల్ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. కాగా.. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు సౌతీ ఆడాడు.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున 2008- 2024 వరకు ఆడిన సౌతీ.. 107 టెస్టులు, 161 వన్డేలు, 126 టీ20లలో కలిపి 776 వికెట్లు కూల్చాడు. తద్వారా కివీస్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఐపీఎల్లో మొత్తంగా 54 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్.. 47 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడు కావడం పట్ల 36 ఏళ్ల సౌతీ స్పందిస్తూ.. ‘‘కేకేఆర్ నా సొంత జట్టు లాంటిది. కొత్త పాత్రలో జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. 2026లో జట్టు విజయం సాధించేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని హర్షం వ్యక్తం చేశాడు. -
కేకేఆర్ జట్టులోకి షేన్ వాట్సన్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు 'అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను కేకేఆర్ నియమించింది. కోల్‌కతా హెడ్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి వాట్సన్ పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ధ్రువీకరించాడు.షేన్ వాట్సన్‌ను కేకేఆర్ కుటంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆటగాడిగా, కోచ్‌గా అతడి అనుభవం మా జట్టు సన్నద్దతకు ఉపయోగపడుతోంది. టీ20 ఫార్మాట్‌పై అతడి అవగహన మా జట్టును మరో స్ధాయి తీసుకువెళ్తుందని ఆశిస్తున్నాము అని వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ట్రాక్ రికార్డు అదుర్స్కాగా ఐపీఎల్లో షేన్ వాట్సన్ ఆటగాడిగా, కోచ్‌గా తన సేవలను అందించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన వాట్సన్.. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. 2013 సీజన్లో కూడా మరోసారి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు. ఐపీఎల్-2018 సీజన్లో సీఎస్కే ఛాంపియన్‌గా నిలవడంలో వాట్సన్‌ది కీలక పాత్ర. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో షేన్ చెలరేగాడు. ఇకఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా కూడా వాట్సన్ పనిచేశాడు. ఇప్పుడు తొలిసారి కేకేఆర్ కోచింగ్ స్టాప్‌లో ఈ ఆసీస్ దిగ్గజం భాగంకానున్నాడు. ఇక కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక కావడం పట్ల షేన్ వాట్సన్ ఆనందం వ్యక్తం చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ వంటి అద్భుత ఫ్రాంచైజీలో భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవం. కోల్‌కతాకు మరో టైటిల్‌ను అందించడానికి అన్ని విధాలగా కృషి చేస్తానని వాట్సన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్.. గత సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. దీంతో హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌పై కేకేఆర్ వేటు వేసింది.చదవండి: నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న మరో భారత స్టార్ క్రికెటర్ -
కేకేఆర్‌లోకి రోహిత్ శర్మ ‘కన్ఫామ్’!.. స్పందించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్‌గా నియమించింది ముంబై ఇండియన్స్. జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన దిగ్గజ సారథి రోహిత్‌ను కాదని హార్దిక్ (Hardik Pandya)కు పగ్గాలు అప్పగించింది.ఈ నేపథ్యంలో అవమానభారంతో కుంగిపోయిన రోహిత్ శర్మ 2025లో ముంబై జట్టును వీడతాడనే ప్రచారం జరిగింది. అయితే, ఊహించని విధంగా హిట్‌మ్యాన్ అంబానీల సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగాడు. ఈ ఏడాది అదే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.కేకేఆర్‌లోకి రోహిత్ శర్మ!ఐపీఎల్-2025 వేలానికి ముందు ముంబై రోహిత్‌ను రూ. 16.30 కోట్లతో రిటైర్ చేసుకుంది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినందున తనకు ఇది సరైన ధరేనని అతడు స్వయంగా వ్యాఖ్యానించడం విశేషం. అయితే, తాజాగా రోహిత్ శర్మ జట్టు మార్పు గురించి మరో వార్త తెర మీదకు వచ్చింది.కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్టే ఇందుకు కారణం. కాగా ఆస్ట్రేలియా ఇటీవలి వన్డే సిరీస్‌లో విజృంభించిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ నంబర్‌వన్ వన్డే బ్యాటర్గాసుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించిన రోహిత్ శర్మ ప్రపంచ నంబర్‌వన్ వన్డే బ్యాటర్‌గా నిలవడం మాత్రం ఇదే మొదటిసారి కావడం విశేషం. సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్ తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన ఐదో భారతీయ క్రికెటర్‌గా రోహిత్ గుర్తింపు పొందాడు. ఆసీస్‌తో ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 202 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన 38 ఏళ్ల రోహిత్... తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగు పరుచుకొని ‘టాప్’ ప్లేస్ దక్కించుకున్నాడు. రోహిత్ 781 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలవగా... భారత వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (745 పాయింట్లు) రెండు స్థానాలు కోల్పోయి మూడో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు.కన్ఫామ్ అంటూ కేకేఆర్ పోస్ట్ఈ నేపథ్యంలో కేకేఆర్.. ‘‘పురుషుల వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ కన్ఫామ్’’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో రోహిత్ శర్మ కేకేఆర్‌లో చేరుతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఇందుకు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వింగ్ గట్టిగానే బదులిచ్చింది.స్పందించిన ముంబైరోహిత్ శర్మ ఫొటోను పంచుకుంటూ.. ‘‘సూర్యుడు రేపు ఉదయించడం నిజమే.. కానీ రాత్రి (K)night మాత్రం సూర్యుడు రావడం కుదరదు. ఇది అసాధ్యం కూడా’’ అంటూ హిట్‌మ్యాన్ తమతోనే ఉంటాడన్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. కాగా రోహిత్ శర్మ ప్రాణ స్నేహితుడు, ఫిట్నెస్ కోచ్ అభిషేక్ నాయర్ కేకేఆర్ హెడ్‌కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోహిత్ జట్టు మార్పు ఉంటుందేమోననే సందేహాలు నెలకొనగా.. ముంబై ఫ్రాంఛైజీ ఇలా స్పష్టతనిచ్చేసింది.చదవండి: ఆమె ఒక అద్భుతం.. జెమీమా మాటలు ఆశ్చర్యపరిచాయి: భారత కెప్టెన్ -
కేకేఆర్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్..
ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్‌ను కేకేఆర్ నియమించింది. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ధ్రువీకరించారు.గత సీజన్లో హెడ్‌కోచ్‌గా పనిచేసిన చంద్రకాంత్ పండిట్ స్థానాన్ని నాయర్ భర్తీ చేయనున్నాడు. "అభిషేక్ నాయర్ 2018 నుంచి కేకేఆర్ సెటాప్‌లో భాగంగా ఉన్నాడు. ఎంతో మంది మా ఆటగాళ్లను అభిషేక్ తీర్చిదిద్దాడు. హెడ్ కోచ్‌గా అతడు మా జట్టును విజయ పథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నామని" వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా నాయర్ 2018 నుంచి కేకేఆర్ బ్యాక్ రూమ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. అంతకుముందు కేకేఆర్ అకాడమీలో యువ ఆటగాళ్లను తాయారు చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.నాయర్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. భారత జట్టు సహాయక కోచ్‌గా కూడా నాయర్ పనిచేశాడు. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ కారణంగా అసిస్టెంట్ కోచ్‌లపై వేటు వేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో నాయర్ తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఐపీఎల్-2025లో కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు కేకేఆర్ జట్టు ప్రధాన కోచ్‌గా కూడా అతడు బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కాగా నాయర్ ఇటీవలే డబ్ల్యూపీఎల్ జట్టు యూపీ వారియర్స్ హెడ్ కోచ్‌గా కూడా ఎంపికయ్యాడు. -
కేకేఆర్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!?
రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025కు ముందు రాయల్స్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. కేవలం ఒక్క సీజన్‌కే తన పదవికి రాజీనామా చేశాడు.అయితే ఫ్రాంచైజీలో అంతర్గత విభేదాల కారణంగా ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. కానీ రాజస్తాన్ మాత్రం అతడు తప్పుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు ద్రవిడ్ తదుపరి అడుగు ఏంటన్న చర్చ క్రికెట్ వర్గాల్లో నెలకొంది.కేకేఆర్ హెడ్ కోచ్‌గా.. ఐపీఎల్-2026కు ముందు రాహుల్ ద్రవిడ్‌ను తమ జట్టు హెడ్‌కోచ్‌గా నియమించుకోవాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ భావిస్తుందంట. ఈ ఏడాది సీజన్ తర్వాత కేకేఆర్ ప్రధాన కోచ్ పదవి నుంచి చంద్రకాంత్ పండిత్ తప్పుకొన్నాడు. ప్రస్తుతం కేకేఆర్ హెడ్‌కోచ్ పదవి ఖాళీగా ఉంది.దీంతో అతడి స్ధానాన్నిఅనుభవజ్ఞుడైన ద్రవిడ్‌తో భర్తీ చేయాలని కోల్‌కతా యాజయాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ కరేబియన్ దీవుల నుంచి వచ్చిన వెంటనే ద్రవిడ్‌తో సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. కానీ ద్రవిడ్ కేకేఆర్ ఆఫర్‌ను అంగీకరిస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే గత ఏడు ఎనిమిదేళ్ల నుంచి వివిధ జట్లకు కోచింగ్ ఇస్తూ ద్రవిడ్ బీజీబీజీగా గడిపాడు. అతడు ప్రస్తుతం తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో భారత హెడ్‌కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకొన్నాడు. అయితే కేకేఆర్ అతడికి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఆఫర్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఐపీఎల్-2025లో అట్టర్ ప్లాప్..కాగా ఈ ఏడాది సీజన్లో అజింక్య రహానే సారథ్యంలోని కోల్‌కతా జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో నైట్‌రైడర్స్ నిలిచింది. కెప్టెన్ రహానేపై కూడా వేటు పడే అవకాశముంది.చదవండి: Ashes 2025: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. బుమ్రాను ఫాలో కానున్న కమ్మిన్స్!? -
నైట్‌రైడర్స్ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా నికోలస్ పూరన్ ఎంపిక
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2025కు ముందు ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR) ఫ్రాంచైజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఎంపికయ్యాడు. గత ఆరు సీజన్లగా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన లెజెండరీ కీరన్ పొలార్డ్ స్దానాన్ని పూరన్ భర్తీ చేయనుంది. దీంతో టీకేఆర్లో కొత్త శకం మొదలు కానుంది. పూరన్ సీఎపీఎల్ తొలి సీజన్(2013)లో టీకేఆర్కే ప్రాతినిథ్యం వహించాడు. అప్పటిలో ఆ జట్టును ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్ స్టీల్ అని పిలిచేవారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ట్రినిడాడ్ జట్టును కొనుగొలు చేయడంతో టీకేఆర్గా మారింది.అయితే 2015లో ట్రినిడాడ్ నుంచి బయటకు వెళ్లిన పూరన్ బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత తిరిగి సీపీఎల్-2022 సీజన్‌కు ముందు మళ్లీ టీకేఆర్తో పూరన్ జతకట్టాడు. ఇప్పుడు ఏకంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమయ్యాడు. ఇక కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం పూరన్ స్పందించాడు."ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించడమే అదృష్టంగా భావించాను. ఇప్పుడు ఏకంగా ఈ ఫ్రాంచైజీకి నాయకత్వం వహించే అవకాశం లభించడం నాకు దక్కిన అరుదైన గౌరవం. జట్టును విజయపథంలో నడిపించేందుకు అన్ని విధాలగా ప్రయత్నిస్తాను. కెప్టెన్‌గా సరైన వ్యూహాలతో ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. ఈ కెప్టెన్సీ డ్వేన్ బ్రావో (2013 - 2019) నుంచి పొలార్డ్((2019 - 2024)కు ఇప్పుడు నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. పొలార్డ్ ఇప్పటికి మాతో కలిసి ఆడుతుండడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా జట్టులో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ ఉన్నారు. వీరి ముగ్గురికి చాలా అనుభవం ఉందని" టీకేర్ రిలీజ్ చేసిన వీడియోలో పూరన్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీపీఎల్ సీజన్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: గిల్ ఒక అత్యద్బుతం.. వారిద్దరూ కూడా నిజంగా గ్రేట్: యువరాజ్ -
వీడి వల్ల డబ్బు దండగ!.. వాళ్ల ఫోన్లు కూడా ఎత్తను: టీమిండియా స్టార్
‘వీడి వల్ల ఏమవుతుందిలే? క్రికెట్ ఆడుతున్న ప్రతోడు సచిన్, కోహ్లి అయిపోతారా ఏంటి? వీడిపై పెట్టుబడి దండగ. డబ్బు వృథా’ అంటూ గేలి చేసిన వాళ్ల ముందే టీమిండియాకు ఆడటమే కాదు.. చిన్న వయసులోనే ఐసీసీ ట్రోఫీని ముద్దాడితే.. ఆ కిక్కే వేరప్పా!!భారత యువ పేసర్ హర్షిత్ రాణా Harshit Rana) విషయంలో ఇదే నిజమైంది. తనను హేళన చేసిన బంధువుల ముందే తండ్రిని సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు 23 ఏళ్ల ఈ ఫాస్ట్‌బౌలర్. దండగ అంటూ తిట్టినోళ్లే తనను పొగిడేలా చేసుకున్నాడు. అప్పుడు కనీసం తనతో మాట్లాడని వాళ్లు కూడా.. ఇప్పుడు ఫోన్లు చేస్తుంటే కాస్త గొప్పగానే అనిపిస్తున్నా.. వారికి రిప్లై మాత్రం ఇవ్వడం లేదంటున్నాడు హర్షిత్ రాణా.పేరుప్రఖ్యాతులు రాగానే..దేశానికి ఆడే స్థాయికి చేరుకునే క్రమంలో తనకు బంధువుల నుంచి ఎదురైన తిరస్కారం గురించి హర్షిత్ రాణా స్వయంగా వెల్లడించాడు. ‘‘మనకు ఒక్కసారి పేరుప్రఖ్యాతులు రాగానే.. అప్పటిదాకా దూరంగా ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ‘దగ్గరై బంధువు’లైపోతారు.నిరాశపరిచే వారే ఎక్కువనేను క్రికెటర్ అవుతానంటే నవ్విన నా సోదరసోదరీమణులు, మా బంధువులు.. అనవసరంగా వాడి కోసం కష్టపడుతున్నావంటూ మా నాన్నను వెనక్కిలాగే ప్రయత్నం చేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.వాళ్ల కాల్స్ లిఫ్ట్ చేయనువీడి వల్ల ఏం కాదు.. క్రికెట్లో అసలేం ఉందని నిరాశపరిచిన వాళ్లే ఎక్కువ. అయితే, ఈరోజు వాళ్లే మళ్లీ మా నాన్నకు ఫోన్ చేసి.. నీ కష్టానికి ఫలితం దక్కిందంటూ పొగడటం వింతగా అనిపిస్తుంది. వాళ్లు నాకు కూడా ఫోన్లు చేస్తారు. కానీ నేను మాత్రం వాళ్ల కాల్స్ లిఫ్ట్ చేయను.ఇదేమీ నా ఓవర్ ఆటిట్యూడ్ కాదు. గతంలో వాళ్లు నన్ను చాలా మాటలు అన్నారు. అలాంటి వాళ్లతో ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదనే అనుకుంటాను’’ అంటూ హర్షిత్ రాణా ఉద్వేగానికి లోనయ్యాడు. యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాదియా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్.. తన మనసులోని భావాలు పంచుకున్నాడు.ఐపీఎల్ నుంచి టీమిండియా బాటకాగా 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అడుగుపెట్టిన హర్షిత్ రాణా.. గతేడాది అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 2024లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో ఈ రైటార్మ్ పేసర్ తన వంతు పాత్ర పోషించాడు.ఈ క్రమంలోనే టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన హర్షిత్ రాణా.. 2024లోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది వన్డే, టీ20లలోనూ టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పటి వరకు తన కెరీర్లో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన 23 ఏళ్ల హర్షిత్ రాణా.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 4, 10, 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడు. చివరగా ఈ మెగా వన్డే టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ ఆడి ఓ వికెట్ తీశాడు కూడా! చదవండి: Mohammed Siraj: అసదుద్దీన్ ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదే.. పోస్ట్ వైరల్ -
IPL 2026: రహానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్!
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఐపీఎల్-2026కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుందన్నది ఆ వార్త సారాంశం. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ కర్ణాటక ఆటగాడిని రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 539 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.కేకేఆర్ అట్టర్ ప్లాప్..అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో నైట్‌రైడర్స్ నిలిచింది.ఈ క్రమంలోనే రాహుల్‌ను ఎలాగైనా ట్రేడ్ చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని కేకేఆర్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేకేఆర్ ప్రస్తుత జట్టులో భారత వికెట్ కీపర్ ఒక్కరు కూడా లేరు. జట్టులోని ఇద్దరు కీపర్లు(క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్భాజ్) విదేశాలకు చెందినవారే.అయినా వీరిద్దరూ తమ స్ధాయికి తగ్గప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. అందుకే రాహుల్‌ను తీసుకుంటే కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా ఉపయోగపడతాడని కేకేఆర్ యోచిస్తోంది. కానీ రాహుల్ వంటి అద్బుతమైన ఆటగాడిని ట్రేడ్ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పుకొంటుందో లేది వేచి చూడాలి. మరోవైపు చంద్రకాంత్ పండిత్ కేకేఆర్ హెడ్‌కోచ్‌కు రాజీనామా చేశాడు. అతడి స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను ప్రధాన కోచ్‌గా నియమించేందుకు కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఐపీఎల్-2026 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరిగే అవకాశముంది.చదవండి: టీమిండియా అద్భుత పోరాటం.. కానీ ఓ చెత్త రికార్డు.. ప్రపంచంలోని తొలి జట్టుగా.. -
IPL 2026: కేకేఆర్ హెడ్‌కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టుకు కొత్త హెడ్‌కోచ్ రాబోతున్నాడు. ఇందుకోసం యాజమాన్యం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కేకేఆర్ ప్రధాన కోచ్‌గా పనిచేసిన చంద్రకాంత్ పండిత్ శిక్షణ బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.ఆయన సేవలు వెలకట్టలేనివిరెండేళ్లుగా కేకేఆర్‌తో ప్రయాణం చేసిన చంద్రకాంత్... ఇకపై కొనసాగబోవడం లేదని ఫ్రాంచైజీ యాజమాన్యం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కొత్త అవకాశాలను అన్వేషించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా కొనసాగాలనుకోవడం లేదు. రెండేళ్లుగా జట్టుకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. 2024లో కోల్‌కతా చాంపియన్‌గా నిలవడంలో చంద్రకాంత్ కీలక పాత్ర పోషించారు.క్రమశిక్షణ, అంకితభావంతో బలమైన జట్టును రూపొందించారు. జట్టుపై ఆయన ప్రభావం ఎంతగానో ఉంది. భవిష్యత్తులోనూ ఆయన విజయవంతం కావాలని ఆశిస్తున్నాం’ అని ఫ్రాంచైజీ ప్రకటనలో పేర్కొంది.గతేడాది టైటిల్.. ఈసారి పేలవ ప్రదర్శనకాగా కోచింగ్‌లో అపార అనుభవం ఉన్న చంద్రకాంత్ శిక్షణలో కేకేఆర్ జట్టు 2024లో మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకుంది. అయితే ఈ ఏడాది డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా... స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఐదింట మాత్రమే నెగ్గి పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.ఇక ఐపీఎల్లో కేకేఆర్‌కు ఇదే పేలవ ప్రదర్శన కాగా... ఈ సీజన్లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే ‘ప్లే ఆఫ్స్’ రేసుకు దూరమై నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ జట్టును వీడటం గమనార్హం.కాగా దేశవాళీల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రకాంత్ పండిత్... 2023 ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు కేకేఆర్ జట్టుతో చేరారు. కాగా ఆ ఏడాది ఏడో స్థానంలో నిలిచిన కోల్‌కతా... తర్వాతి సంవత్సరం ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. 2024లో ఐపీఎల్ ట్రోఫీతో పాటు లీగ్ చరిత్రలో అత్యధిక పాయింట్లు, అత్యుత్తమ రన్‌రేట్ సైతం కేకేఆర్ నమోదు చేసుకుంది. హెడ్‌కోచ్‌గా ఇయాన్ మోర్గాన్?ఇక చంద్రకాంత్ పండిట్ నిష్క్రమణ నేపథ్యంలో కేకేఆర్ తమ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను హెడ్‌కోచ్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. 2020, 2021 సీజన్లలో మోర్గాన్ కేకేఆర్ సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో కోల్‌కతా జట్టు 24 మ్యాచ్‌లకు గానూ పదకొండు గెలిచింది.ఇదిలా ఉంటే.. చంద్రకాంత్ పండిట్‌తో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా కేకేఆర్‌ను వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే అతడు చెన్నై సూపర్ కింగ్స్‌తో జట్టుకట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే, గతేడాది జట్టును చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను వదులుకున్న కేకేఆర్.. తాజాగా హెడ్‌కోచ్‌కు కూడా ఉద్వాసన పలికింది. ఇక శ్రేయస్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయగా.. ఐపీఎల్-2025లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు.. కేకేఆర్ అజింక్య రహానేను తమ కెప్టెన్‌గా నియమించుకోగా పేలవ ప్రదర్శనతో కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండా నిష్క్రమించింది.ఐపీఎల్-2025లో కేకేఆర్ కోచింగ్ సిబ్బంది వీరే👉మెంటార్: డ్వేన్ బ్రావో👉హెడ్‌కోచ్: చంద్రకాంత్ పండిత్👉బౌలింగ్ కోచ్: భరత్ అరుణ్👉స్పిన్ బౌలింగ్ కోచ్: కార్ల్ క్రోవ్👉ఫిజియోథెరపిస్ట్: ప్రశాంత్ పంచాడ👉స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్: క్రిస్ డొనాల్డ్సన్👉టీమ్ మేనేజర్: అడ్రియాన్ వాన్ బెంట్లీ.చదవండి: WCL 2025: స్టువర్ట్ బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్‌లో ఇండియా -
బీసీసీఐ పొమ్మంది!.. ఆ జట్టు హెడ్‌కోచ్‌గా అభిషేక్ నాయర్
భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) మరో జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) జట్టు యూపీ వారియర్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. యూపీ వారియర్స్ జట్టు సీఓఓ క్షేమల్ వేంగన్‌కర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.మాకెంతో ప్రత్యేకం‘‘అభిషేక్ నాయర్ మా జట్టుకు హెడ్ కోచ్‌గా రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాము. ఆయన కోచ్‌గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసిన తర్వాత.. మరో మాటకు తావులేకుండా మేము ఒప్పందం చేసుకున్నాం.ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్ది.. వారిలో విజయకాంక్షను రగిల్చే అతి కొద్ది మంది కోచ్‌లలో అభిషేక్ ఒకరు. అతడి అనుభవం మాకు ఉపయోగపడుతుంది. గత పద్దెనిమిది నెలల కాలంలోనే మూడు జట్లు చాంపియన్‌గా నిలవడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు.అభిషేక్ యూపీ వారియర్స్‌తో చేరడం మాకు ఎంతో ఎంతో ప్రత్యేకం’’ అని క్షేమల్ వేంగన్‌కర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు వెల్లడించాడు. కాగా 2018లో అభిషేక్ నాయర్ కోచ్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ సహాయక సిబ్బందిగా చేరాడు. ఇక 2022లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ట్రింబాగో నైట్ రైడర్స్‌కు హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు.కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్రఇక.. 2024లో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌గా తన వంతు పాత్ర నిర్వర్తించాడు. ఈ క్రమంలో నాటి కేకేఆర్ మెంటార్ గౌతం గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అతడి సహాయక సిబ్బందిలో అసిస్టెంట్ కోచ్‌గా చేరాడు.టీమిండియా విధుల నుంచి తప్పించారుఅయితే, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టులలో టీమిండియా 3-0తో వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌ను 3-1తో చేజార్చుకోవడంతో నాయర్‌పై బీసీసీఐ వేటు వేసింది. 2025 జనవరిలో అతడిని అసిస్టెంట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది.ఈ క్రమంలో మళ్లీ కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా తిరిగి వచ్చిన 41 ఏళ్ల అభిషేక్ నాయర్.. ముంబై టీ20 లీగ్-2025లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్‌కు మెంటార్‌గానూ వ్యవహరించాడు. తాజాగా డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు.చదవండి: ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్‌బై!? -
ఐపీఎల్లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! ఆ జట్టు కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్?
మధ్యప్రదేశ్ లీగ్(MPL) రెండో ఎడిషన్‌కు సర్వం సిద్దమైంది. ఈ ఏడాది ఎంపీఎల్ సీజన్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. అయితే తొలి ఎడిషన్‌లో కేవలం ఐదు జట్లు మాత్రమే పోటీ పడగా.. ఇప్పుడు మరో రెండు ఫ్రాంచైజీలు ఇండోర్ పింక్ పాంథర్స్, చంబల్ ఘరియల్స్ కొత్తగా చేరాయి.ఈ టోర్నీలో ఫ్రాంచైజీ ఇండోర్ పింక్ పాంథర్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జతకట్టాడు. గత సీజన్లో గ్వాలియర్ చీతాస్‌కు ప్రాతినిథ్యం వహించిన అయ్యర్.. ఇప్పుడు పింక్ పాంథర్స్‌కు ఆడనున్నాడు.అంతేకాకుండా తమ జట్టు కెప్టెన్సీని వెంకటేశ్ అయ్యర్‌కు అప్పగించాలని పాంథర్స్ యాజమాన్యం భావిస్తోంది. అతడి ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఎంపీఎల్-2024లో 8 మ్యాచ్‌లలో 58.57 సగటుతో 480 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025లో ఫెయిల్..కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం వెంకటేశ్ అయ్యర్ తీవ్రనిరాశపరిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన మూడో ఆటగాడిగా నిలిచిన అయ్యర్.. ఏ మాత్రం తన ధరకు న్యాయం చేయలేకపోయాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో అయ్యర్‌ను రూ.23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. సీజన్ మొత్తంలో అతడు 11 మ్యాచ్‌లలో 7 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడి, 142 పరుగులు చేశాడు. మిగిలిన రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు.చదవండి: WTC final: 'చోకర్స్ ట్యాగ్‌ను చెరిపేయాలి'.. సౌతాఫ్రికాకు బౌచర్ పిలుపు -
'పంత్‌ను చూసి నేర్చుకోండి'.. రహానేపై సెహ్వాగ్ ఫైర్
ఐపీఎల్-2025 సీజన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘోర ఓటమితో ముగించింది. ఆదివారం ఢిల్లీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో కేకేఆర్ పరాజయం చవిచూసింది. ఈ ఏడాది సీజన్ అసాంతం దారుణ ప్రదర్శన కనబరిచిన డిఫెండింగ్ ఛాంపియన్.. వరుస ఓటములతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.శ్రేయస్ అయ్యర్ స్ధానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వెటరన్ ఆటగాడు అజింక్య రహానే జట్టును విజయం పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదన్పించినప్పటికి, కెప్టెన్‌గా మాత్రం రహానే పూర్తిగా తేలిపోయాడు.ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఐదింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్ధానంలో నిలిచింది. ఈ క్రమంలో కేకేఆర్ మెనెజ్మెంట్పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. రహానే టాప్-3లో బ్యాటింగ్‌కు రావడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు."కెప్టెన్ టాప్ త్రీలోనే బ్యాటింగ్ చేయాలని ఎక్కడా రాసిలేదు. పంత్‌ను చూసి నేర్చుకోండి. అతడు తన ఫామ్‌లో లేని అని తెలిసి మిగితా ఆటగాళ్లను తనకంటే ముందు బ్యాటింగ్‌కు పంపుతున్నాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు టాపర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడంతో లక్నో భారీ స్కోర్ సాధించగలుగుతుంది.కేకేఆర్ అలాగే చేసి ఉంటే బాగుండేది. అది టీమ్ మెనెజ్‌మెంట్, కోచింగ్ స్టాప్ బాధ్యత. నిన్న గుజరాత్‌తో మ్యాచ్‌లో కూడా సీఎస్కే అదే పనిచేసింది. ఫామ్‌లో ఉన్న డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబేలను ముందు బ్యాటింగ్‌కు పంపారు" అని క్రిక్‌బజ్ లైవ్ షో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: చెప్పింది వినరా?.. సహనం కోల్పోయిన ధోని.. పతిరణ, దూబేపై ఫైర్! -
ఆఖర్లో అదరహో
‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న జట్లు... తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో దంచికొట్టాయి. గుజరాత్ టైటాన్స్‌తో పోరులో చెన్నై దుమ్మురేపి 230 పరుగులు చేస్తే... కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 278 పరుగులతో విరుచుకుపడింది. అంచనాల ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన ఈ రెండు జట్లు విజయాలతో సీజన్‌ను ముగించాయి. గుజరాత్‌తో పోరులో చెన్నై బ్యాటర్లు కాన్వే, బ్రెవిస్ హాఫ్ సెంచరీలతో విజృంభిస్తే... నైట్ రైడర్స్ బౌలర్లను క్లాసెన్, హెడ్ చీల్చి చెండాడారు. సీజన్ ఆరంభ పోరులో రాజస్తాన్ రాయల్స్‌పై 286 పరుగులు చేసి అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ... తమ ఆఖరి మ్యాచ్‌లో మరోసారి మూడొందలకు చేరువైంది. అభిషేక్ శర్మ, హెడ్ మెరుపులతో భారీ స్కోరుకు పునాది వేస్తే... క్లాసెన్ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మధ్యలో నిలకడలేమితో పరాజయాలు మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ... చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. న్యూఢిల్లీ: విధ్వంసకర ఆటతీరుతో ఐపీఎల్లో భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సీజన్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 105 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ శతకంతో కదంతొక్కగా... ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) దంచికొట్టాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన క్లాసెన్ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూడా రాణించాడు. లక్ష్యఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దంచుడే... దంచుడు మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ తొలి ఓవర్లో 2 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి వెనుదిరిగి చూసుకోని రైజర్స్... ఫోర్లు, సిక్స్‌లతో మైదానాన్ని మోతెక్కించింది. రెండో ఓవర్లో హెడ్ సిక్స్‌తో ఖాతా తెరవగా... అభిషేక్ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో 6, 4, 2, 6 బాదిన హెడ్... నాలుగో ఓవర్లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. నోర్జే ఓవర్లో అభిషేక్ 2 ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్ 79 పరుగులు చేసింది. నరైన్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అభిషేక్... మరో షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ కాగా... క్లాసెన్ రాకతో విధ్వంసం మరో స్థాయికి చేరింది. ఒకవైపు హెడ్, మరోవైపు క్లాసెన్ బౌలర్‌తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడటంతో... 10 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్ ఆర్మీ 139/1తో నలిచింది. ఈ క్రమంలో హెడ్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... హర్షిత్ ఓవర్లో 4, 6, ,6తో క్లాసెన్ 17 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ అందుకున్నాడు. హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడదీయగా ... ఇషాన్ కిషన్ వేగంగా ఆడలేకపోయాడు. నరైన్ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన క్లాసెన్... వరుణ్‌కు అదే శిక్ష వేసి సెంచరీకి సమీపించాడు. రసెల్ ఓవర్లో 6, 4 కొట్టిన క్లాసెన్... అరోరా బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రింకూ (బి) నరైన్ 32; హెడ్ (సి) రసెల్ (బి) నరైన్ 76; క్లాసెన్ (నాటౌట్) 105; ఇషాన్ కిషన్ (సి) నోర్జే (బి) వైభవ్ 29; అనికేత్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–92, 2–175, 3–158. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–39–1; నోర్జే 4–0–60–0; హర్షిత్ రాణా 3–0–40–0; నరైన్ 4–0–42–2; వరుణ్ చక్రవర్తి 3–0–54–0; రసెల్ 2–0–34–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) మనోహర్ (బి) మలింగ 9; నరైన్ (బి) ఉనాద్కట్ 31; రహానే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 15; రఘువంశీ (సి) నితీశ్ (బి) మలింగ 14; రింకూ (సి) నితీశ్ (బి) హర్ష్ దూబే 9; రసెల్ (ఎల్బీ) (బి) హర్ష్ దూబే 0; మనీశ్ పాండే (సి) మనోహర్ (బి) ఉనాద్కట్ 37; రమణ్‌దీప్ (బి) హర్ష్ దూబే 13; హర్షిత్ (సి అండ్ బి) మలింగ 34; వైభవ్ అరోరా (రనౌట్) 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 168. వికెట్ల పతనం: 1–37, 2–55, 3–61, 4–70, 5–70, 6–95, 7–110, 8–162, 9–162, 10–168. బౌలింగ్: కమిన్స్ 2–0–25–0; ఉనాద్కట్ 4–0–24–3; హర్షల్ 2–0–21–0; ఇషాన్ మలింగ 3.4–0– 31–3; హర్ష్ దూబే 4–0–34–3; నితీశ్ రెడ్డి 1–0–6–0; అభిషేక్ 2–0–25–0. 278/3 ఐపీఎల్లో ఇది మూడో అత్యధిక స్కోరు. తొలి రెండు స్థానాల్లోనూ సన్‌రైజర్స్ జట్టే ఉంది. 2024లో బెంగళూరుపై 287/5 స్కోరు చేసిన హైదరాబాద్... ఈ ఏడాది తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 286/5 పరుగులు చేసింది. 37 సెంచరీకి క్లాసెన్ తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది మూడో వేగవంతమైన శతకం. క్రిస్ గేల్ (30 బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అహ్మదాబాద్: ఐపీఎల్ 18వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో నిలిచిన ధోనీ బృందం... ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై గెలుపొందింది. మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్షద్ ఖాన్ వెసిన రెండో ఓవర్లో ఆయుశ్ చెలరేగి వరుసగా 2, 6, 6, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్ దంచికొట్టడమే పనిగా పెట్టుకోవడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా చర్చ సాగగా... మహీ తనకు అలవాటైన రీతిలో ‘వేచి చూద్దాం’ అని ముక్తాయించాడు. సంక్షిప్త స్కోర్లుచెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: 230/5 (20 ఓవర్లలో) (ఆయుశ్ 34; కాన్వే 52; ఉర్విల్ 37; బ్రెవిస్ 57, ప్రసిధ్ కృష్ణ 2/22) గుజరాత్ టైటాన్స్: 147 ఆలౌట్ (18.3 ఓవర్లలో) (సాయి సుదర్శన్ 41; అర్షద్ ఖాన్ 20, అన్షుల్ కంబోజ్ 3/13, నూర్ అహ్మద్ 3/21, జడేజా 2/17).ఐపీఎల్లో నేడుముంబై X పంజాబ్‌వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో -
SRH Vs KKR: కోల్‌కతాపై సన్‌రైజర్స్ గ్రాండ్ విక్టరీ..
ఐపీఎల్-2025 సీజన్ తమ ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.క్లాసెన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. క్లాసెన్‌తో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్(29) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు.అనంతరం లక్ష్య చేధనలో కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో మనీశ్ పాండే(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షిత్ రాణా(34), సునీల్ నరైన్(31) పర్వాలేదన్పించారు. మిగితా కేకేఆర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్, మలింగ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్‌దూబే తలా రెండు వికెట్లు సాధించారు. -
చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో ఒకే జట్టు తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నరైన్ చరిత్ర సృష్టించాడు. సునీల్ కేకేఆర్ తరుపన ఇప్పటివరకు ఐపీఎల్లో 191, ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20)లో 18 వికెట్లు తీశాడు. మొత్తంగా 209 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో నరైన్ ఈ ఫీట్ సాధించాడు. కాగా సునీల్ నరైన్ ఐపీఎల్ ఆరంభం నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కే ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెట్ క్లబ్ నాటింగ్‌హామ్‌షైర్ బౌలర్ సమిత్ పటేల్ పేరిట ఉండేది. నాటింగ్‌హామ్‌షైర్ తరపున పటేల్ 208 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో సమిత్ వరల్డ్ రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు. నరైన్ పటేల్, తర్వాతి స్ధానంలో హాంప్‌షైర్ బౌలర్ క్రిస్ వుడ్ 199 ఉన్నాడు. ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ 195 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.పురుషుల టీ20 క్రికెట్లో ఒక జట్టుకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు210* – సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్)208 – సమిత్ పటేల్ (నాటింగ్‌హామ్‌షైర్)199 – క్రిస్ వుడ్ (హాంప్‌షైర్)195 – లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్)193 – డేవిడ్ పేన్ (గ్లౌసెస్టర్షైర్) -
కేకేఆర్‌ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..
IPL 2025 SRH vs KKR Live Updates: కేకేఆర్‌ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..ఐపీఎల్-2025లో ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. 279 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో మనీశ్ పాండే(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షిత్ రాణా(34), సునీల్ నరైన్(31) పర్వాలేదన్పించారు. మిగితా కేకేఆర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్, మలింగ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్‌దూబే తలా రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.దూకుడుగా ఆడుతున్న హర్షిత్కేకేఆర్ ఎనిమిదో నెంబర్ బ్యాటర్ హర్షిత్ రానా మెరుపులు మెరిపిస్తున్నాడు. 14 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్‌తో 29 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. 17 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 161/7కేకేఆర్ ఆరో వికెట్ డౌన్95 పరుగుల వద్ద కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన రఘువంశీ.. మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది.పీకల్లోతు కష్టాల్లో కేకేఆర్..70 పరుగులకే కేకేఆర్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 8వ ఓవర్ వేసిన హర్ష్ దూబే బౌలింగ్‌లో రింకూ సింగ్(9), రస్సెల్(0) వరుస బంతుల్లో ఔటయ్యారు.కేకేఆర్ మూడో వికెట్ డౌన్..డికాక్ రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన డికాక్.. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 62/3కేకేఆర్ రెండో వికెట్ డౌన్..అజింక్య రహానే రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రహానే.. ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 59/2కేకేఆర్ తొలి వికెట్ డౌన్..సునీల్ నరైన్ రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన నరైన్.. ఉనద్కట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 4 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 39/13 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 33/03 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(27), క్వింటన్ డికాక్(4) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల వీరవిహారం.. ఏకంగా 278 రన్స్అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.క్లాసెన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. క్లాసెన్‌తో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్(29) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు.హెన్రిచ్ క్లాసెన్ సెంచరీ..కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ సెంచరీతో మెరిశాడు. కేవలం 37 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను క్లాసెన్ అందుకున్నాడు. 19 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 261/3200 దాటేసిన ఎస్ఆర్హెచ్ఎస్ఆర్హెచ్ స్కోర్ బోర్డు రెండు వందలు దాటేసింది. 17 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(87), ఇషాన్ కిషన్(20) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 76 పరుగులు చేసిన హెడ్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(55), ఇషాన్ కిషన్(6) ఉన్నారు.హెన్రిచ్ క్లాసెన్ ఫిప్టీ..హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు ఐదు ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. 13 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్భారీ స్కోర్ దిశగా ఎస్ఆర్హెచ్..అరుణ్ జైట్లీ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో హెడ్(65), క్లాసెన్(28) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్..అభిషేక్ రూపంలో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన అభిషేక్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 79/06 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(47), అభిషేక్ శర్మ(20) మెరుపులు మెరిపిస్తున్నారు.దూకుడుగా ఆడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(9), ట్రావిస్ హెడ్(15) ఉన్నారుఐపీఎల్-2025లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తమ ఆఖరి మ్యాచ్‌లో ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. ఈ ఏడాది సీజన్‌ను విజయంతో ముగించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), మనీష్ పాండే, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, అన్రిచ్ నార్ట్జే, వరుణ్ చకరవర్తిసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
ఐపీఎల్-2025లో దారుణ ప్రదర్శన.. కేకేఆర్ హెడ్ కోచ్‌పై వేటు?
ఐపీఎల్-2025లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ దారుణ ప్రదర్శన కరబరిచింది. అజింక్య రహానే సారథ్యంలో బరిలోకి దిగిన కేకేఆర్.. అందరి అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఈ టోర్నీలో వరుస ఓటములతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ నిష్క్రమించింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో సైతం కేకేఆర్ చేతులేత్తేసింది. ముఖ్యంగా వేలంలో రూ.23.75 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వెంకటేశ్ అయ్యర్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 20.28 సగటుతో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు.అయితే వేలంలో కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ సూచన మేరకే వెంకటేశ్ అయ్యర్‌పై ఫ్రాంచైజీ యాజమాన్యం అంత భారీ ధర వెచ్చించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో చంద్రకాంత్ కేకేఆర్ మెనెజ్‌మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సీజన్ తర్వాత ప్రధాన కోచ్‌గా అతడిపై వేటు వేయాలని కోల్‌కతా ఫ్రాంచైజీ భావిస్తోందంట. చంద్రకాంత్ పండిట్ స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ను తమ ప్రధాన కోచ్‌గా నియమించేందుకు కేకేఆర్ ఆసక్తిచూపుతున్నట్లు సమాచారం. ఇయాన్ మోర్గాన్‌తో కేకేఆర్‌కు మంచి అనుబంధం ఉంది. మోర్గాన్ కెప్టెన్‌గా 2021 సీజన్లో కేకేఆర్‌ను ఐపీఎల్ ఫైనల్స్‌కు చేర్చాడు.అయితే ఫైనల్లో మాత్రం సీఎస్కే చేతిలో నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. అదేవిధంగా మెంటార్‌గా ఉన్న డ్వైన్ బ్రావోను కూడా తొలిగించే యోచనలో కేకేఆర్ ఉన్నట్లు సమాచారం. నైట్‌రైడర్స్‌కు ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. మే 25న ఢిల్లీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. చదవండి: IPL 2025: ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా -
ఆర్సీబీతో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ ఔట్
ఐపీఎల్-2025 పున ప్రారంభానికి వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ప్లే ఆఫ్స్ రేసులో కేకేఆర్ నిలవాలంటే ఆర్సీబీపై కచ్చితంగా గెలవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ రద్దు కావడంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి కోల్‌కతా నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 12 పాయింట్లతో టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. మరోవైపు ఆర్సీబీ ఖాతాలో ఒక్క పాయింట్ చేరింది. ఆర్సీబీ 17 పాయింట్లతో అగ్రస్ధానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చెరేందుకు బెంగళూరు జట్టు అడుగు దూరంలో నిలిచింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఒక దాంట్లో గెలిచినా చాలు ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. ఒకవేళ ఓడినా కూడా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంటుంది. అయితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
ఆగని వర్షం.. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దు
IPL 2025 RCB vs KKR Live Updates: ఆగని వర్షం.. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దుఐపీఎల్-2025 పున:ప్రారంభంలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.👉బెంగళూరు వర్షం ఇంకా కురుస్తోంది. ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెసింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆట సాధ్యపడేలా లేదు.👉బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద వర్షం ఇంకా కురుస్తోంది. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది.👉ఐపీఎల్-2025 పున:ప్రారంభానికి వరుణడు ఆడ్డంకిగా నిలిచాడు. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. మైదానం మొత్తాన్ని కవర్లతో సిబ్బంది కప్పి ఉంచారు. దీంతో ఈ మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. కాగా చిన్నస్వామి స్టేడియంలో అద్బుతమైన డ్రైనజీ వ్యవస్ద ఉండంతో వర్షం తగ్గిన వెంటనే మైదానాన్ని సిద్దం చేసే అవకాశముంది. -
IPL 2025: ‘షో’ మళ్లీ షురూ...
బెంగళూరు: ఐపీఎల్ 18వ సీజన్లో తొమ్మిది రోజుల విరామానంతరం తర్వాతి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా లీగ్‌ను గవరి్నంగ్ కౌన్సిల్ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం నేటి నుంచి మ్యాచ్‌లు పునఃప్రారంభమవుతున్నాయి. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగే పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతుంది. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఈ నెల 7న జరిగింది. మే 8న ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసి లీగ్‌కు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆ మ్యాచ్ మళ్లీ నిర్వహిస్తారు. 70 మ్యాచ్‌ల లీగ్ దశలో 57 మ్యాచ్‌లు ముగిశాయి. మిగిలిన 13 మ్యాచ్‌లతో పాటు నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) కలిపి మొత్తం ఈ సీజన్లో మరో 17 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ప్రకటించలేదు. జూన్ 3న ఫైనల్ జరుగుతుంది. ముస్తఫిజుర్, డుప్లెసిస్ రెడీ... ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లలో పాల్గొనే విదేశీ ఆటగాళ్ల విషయంలో శుక్రవారం మరింత స్పష్టత వచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో పేసర్ ముస్తఫిజుర్ రహమాన్‌కు మార్గం సులువైంది. ఢిల్లీ తరఫున అతను బరిలోకి దిగుతాడు. ఢిల్లీ టాప్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ తాను మిగిలిన మ్యాచ్‌లకు తిరిగి రావడం ముందే స్పష్టం చేసేశాడు. ఓపెనర్ డుప్లెసిస్ కూడా ఆడేందుకు సిద్ధం కావడం క్యాపిటల్స్‌కు సానుకూలాంశం. స్టబ్స్ మిగిలిన లీగ్ దశలో ఉండి ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం వెళ్లిపోతాడు.ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన హైదరాబాద్, చెన్నై, రాజస్తాన్ జట్లకు విదేశీ క్రికెటర్ల ప్రాతినిధ్యం పెద్దగా సమస్య కాకపోవచ్చు. అయితే ఫలితాన్ని ప్రభావితం చేయగల విదేశీ ఆటగాళ్లు ఉన్న టీమ్‌లకు వారంతా తిరిగి రావడం ప్లే ఆఫ్స్ అవకాశాలకు పెద్ద బలంగా మారింది. సాల్ట్, షెఫర్డ్, టిమ్ డేవిడ్‌లతో ఆర్సీబీ సంతృప్తిగా కనిపిస్తుండగా... హాజల్‌వుడ్ మాత్రం దూరమయ్యాడు. స్టొయినిస్, ఇన్‌గ్లిస్ విషయంలో పంజాబ్ కింగ్స్‌కు ఇంకా పూర్తి సమాచారం లేదు. ముంబై ఇండియన్స్ తరఫున అంతా అందుబాటులో ఉండగా... ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆ్రస్టేలియా కెప్టెన్ కమిన్స్ మిగిలిన మూడు లీగ్ మ్యాచ్‌ల కోసం సన్‌రైజర్స్‌తో చేరడం ఆశ్చర్యకరం! గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ... సీజన్లో జోరు చూపిస్తూ ఎనిమిది విజయాలు సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరో విజయంపై గురి పెట్టింది. ప్రస్తుతం 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ సొంతగడ్డపై గెలిస్తే 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. బ్యాటర్లంతా ఫామ్‌లో ఉండటంతో పాటు పదునైన బౌలింగ్‌తో జట్టు బాగా బలంగా కనిపిస్తోంది. బెతెల్, కోహ్లి శుభారంభం అందిస్తుండగా, కెప్టెన్ రజత్ పాటీదార్ వేలి గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగుతున్నాడు. భువనేశ్వర్, యశ్ దయాళ్, కృనాల్, సుయాశ్‌లతో బౌలింగ్ కూడా బాగుంది. మరోవైపు కోల్‌కతా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న టీమ్ ఖాతాలో 11 పాయింట్లే ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా... 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ ఖాయమేమీ కాదు. ఇతర ఎన్నో సమీకరణాలతో ముందంజ వేయడం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్ చాన్స్ కోల్పోయిన నాలుగో జట్టుగా కేకేఆర్ నిలుస్తుంది. -
CSK Vs KKR: కోల్‌కతాకు చెన్నై ఝలక్
కోల్‌కతా: ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ అవకాశాలపై దెబ్బ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అజింక్య రహానే (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్ (21 బంతుల్లో 38; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మనీశ్ పాండే (28 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా...నూర్ అహ్మద్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు సాధించింది. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా...శివమ్ దూబే (40 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఉర్విల్ పటేల్ (11 బంతుల్లో 31; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. పవర్‌ప్లేలోపే సగం వికెట్లు కోల్పోయి 60/5 వద్ద నిలిచిన చెన్నై ఓటమి ఇక లాంఛనమే అనిపించింది. కానీ బ్రెవిస్, దూబే పోరాడంతో పాటు చివర్లో ధోని (17 నాటౌట్) పట్టుదలగా నిలబడటంతో గెలుపు సాధ్యమైంది. తాజా ఫలితంతో కోల్‌కతా ‘ప్లే ఆఫ్స్’కు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది. మిగిలిన 2 మ్యాచ్‌లలో గెలిచి గరిష్టంగా 15 పాయింట్లకు చేరినా ముందుకెళ్లడం కష్టమే. సాంకేతికంగా రేసులో ఉన్నా... ఈసారి కథ ముగిసినట్లే! ఐపీఎల్లో నేడుపంజాబ్ X ఢిల్లీవేదిక: ధర్మశాలరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
KKR vs CSK: నిలవాలంటే గెలవాలి
కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ భవితవ్యం ఈ మ్యాచ్‌లో తేలనుంది. ఐపీఎల్ 18వ సీజన్ ప్లేఆఫ్స్ రేసులో కోల్‌కతా ఉంటుందా లేదంటే లీగ్‌తోనే సరిపెట్టుకుంటుందా అనే విషయం నేడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. మరోవైపు ధోని బృందం ఇది వరకే లీగ్ నుంచి ని్రష్కమించింది. అయితే ఐపీఎల్ కెరీర్ చరమాంకంలో ఉన్న ధోని ఆటతీరును, లోయర్‌ఆర్డర్‌లో క్రీజులోకి వస్తున్న తీరును పరిశీలిస్తే ఈ సీజనే చివరిదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే... భారత విఖ్యాత స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌లో తాను ఆడే ఆఖరి పోరును ధోని చిరస్మరణీయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చెన్నైకి నామమాత్రమైనా... నైట్‌రైడర్స్‌కు కీలకమైన ఈ పోరు ఆసక్తికరంగా జరగడం ఖాయం. బ్యాటింగే కోల్‌కతా బలం కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు బ్యాటింగే బలం. ఇప్పటికే ఈ సీజన్లో నాలుగుసార్లు 200 పైచిలుకు పరుగుల్ని సాధించింది. లక్నోతో ఎదురైనా 239 పరుగుల భారీ లక్ష్యఛేదనలోనూ నైట్‌రైడర్స్ 4 పరుగుల తేడాతోనే ఓడింది. దీన్నిబట్టి చెప్పొచ్చు కోల్‌కతా బ్యాటర్ల బలమెంతో! తొలిదశను పక్కన బెడితే గత రెండు మ్యాచ్‌ల్లో చేసిన 200 ప్లస్ స్కోరు కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు ఎంత కష్టపడుతుందో సూచిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్లతో జరిగిన ఈ మ్యాచ్‌ల్లో ఏ ఒక్కరి విధ్వంసంతోనూ, ఒకరిద్దరి మెరుపు ఇన్నింగ్స్‌లతోనూ అంతపెద్ద స్కోరు సాధ్యమవలేదు. బ్యాటింగ్ ఆర్డర్ అంతా మూకుమ్మడిగా రాణించింది. గుర్బాజ్, కెపె్టన్ అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, రసెల్ అందరూ బ్యాట్లకు పని చెప్పారు. ఇక అంతకుముందు ఢిల్లీతో జరిగిన పోరులో ఏ ఒక్కరు కూడా అర్ధసెంచరీ సాధించలేదు. అయినాసరే టాపార్డర్ 20 ప్లస్ స్కోర్లు, రింకూ సింగ్ (36), టాప్‌స్కోరర్ రఘువంశీ (44) చేసిన పరుగులతోనే కోల్‌కతా సులువుగా 200 పైచిలుకు స్కోరును సాధించింది. బౌలింగ్‌లోనూ వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌ల స్పిన్ మ్యాజిక్ ప్రత్యర్థులను చుట్టేస్తుంది. వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలు తమ పేస్ బౌలింగ్‌లో నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి సమష్టి ప్రదర్శన సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లో కనబరిస్తే కోల్‌కతాకు ఎదురే ఉండదు. చెన్నైకిది చేదు సీజన్ ఐపీఎల్‌కే వన్నెతెచ్చిన టీమ్‌లలో చెన్నై ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన 17 సీజన్లలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే). 5 టైటిల్స్‌తో ముంబై ఇండియన్స్‌తో సమానంగా ఉన్నప్పటికీ... పదిసార్లు ఫైనల్ చేరిన (5సార్లు రన్నరప్) ఏకైక జట్టు సీఎస్కే. లీగ్ చరిత్రలో ఇంతటి ఘనచరిత్ర కలిగిన ధోని జట్టుకు ఈ సీజన్ అత్యంత చెత్తగా సాగుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడితే రెండంటే రెండే మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఏకంగా 9 పరాజయాలతో లీగ్ నుంచి ని్రష్కమించిన సూపర్‌కింగ్స్‌కు మిగిలిందల్లా మిగతా మ్యాచ్‌లు ఆడి గెలవడమే! జోరు మీదున్న కోల్‌కతాను ఆపుతుందా... మరో భంగపాటుతో అట్టడునే నిలుస్తుందో చూడాలంటే చీకటి పడేదాకా ఆగాల్సిందే! -
అతడు ఇంకో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు: వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ (Andre Russel)పై ఆ జట్టు బౌలర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ప్రశంసలు కురిపించాడు. ఇప్పట్లో అతడు రిటైర్ కాబోడని.. కనీసం మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలానికి ముందు కేకేఆర్ రసెల్‌ను రూ. 12 కోట్లకు అతడిని రిటైన్ చేసుకుంది.అయితే, తాజా ఎడిషన్ ఆరంభం నుంచి ఈ జమైకన్ స్టార్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గత ఏడు ఇన్నింగ్స్‌లో కేవలం డెబ్బై రెండు పరుగులే చేశాడు. అయితే, ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మాత్రం రసెల్ దుమ్ములేపాడు.PC: BCCI25 బంతుల్లోనే 57ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రసెల్ 25 బంతుల్లోనే 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇక రసెల్ ఇన్నింగ్స్ కారణంగా 200కు పైగా స్కోరు సాధించిన కేకేఆర్ రాజస్తాన్‌పై జయభేరి మోగించింది.ఇంకో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడుఇక రసెల్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కలిపి 129 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గత మ్యాచ్‌లలో బ్యాటర్‌గా విఫలమైనప్పటికీ ఆ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. బౌలర్‌గా ఎనిమిది వికెట్లు తీయగలిగాడు. కాగా ఫామ్‌లేమి, వయసు దృష్ట్యా ఐపీఎల్-2025 తర్వాత రసెల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో రాజస్తాన్‌పై గెలుపు అనంతరం కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ విషయంపై స్పందించాడు. ‘‘ఇంకో రెండు మూడు సైకిళ్ల పాటు అతడు ఐపీఎల్లో ఆడాలని భావిస్తున్నాడు. అంటే.. ఇంకో ఐదారేళ్లన్న మాట. అతడు ఫిట్‌గా ఉన్నాడు. బాగున్నాడు.వయసుతో పనేంటి?అలాంటపుడు వయసుతో పనేంటి? జట్టు ప్రయోజనాల కోసం తన వంతు కృషి చేసినంత కాలం ఓ ఆటగాడు ఆడుతూనే ఉంటాడు. ఫ్రాంఛైజీ క్రికెట్ యాజమాన్యాలు ఇలాగే ఆలోచిస్తాయి. ఇలాంటి ఆలోచనా విధానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు’’ అని వరుణ్ చక్రవర్తి తెలిపాడు. కాగా రసెల్ స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ చితక్కొట్టగలడని ఈ సందర్భంగా వరుణ్ స్పష్టం చేశాడు. కాగా 37 ఏళ్ల రసెల్ 2014 నుంచి కోల్‌కతాతోనే కొనసాగుతున్నాడు.కాగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం నాటి మ్యాచ్‌లో కేకేఆర్ రాజస్తాన్‌పై ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. ఇప్పటికి ఈ సీజన్లో రహానే సేన ఆడిన పదకొండు మ్యాచ్‌లలో ఐదు గెలిచి.. పట్టికలో ఆరోస్థానంలో ఉంది.ఐపీఎల్ 2025: కోల్‌కతా వర్సెస్ రాజస్తాన్👉కోల్‌కతా స్కోరు: 206/4 (20)👉రాజస్తాన్ స్కోరు: 205/8 (20)👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌పై కేకేఆర్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆండ్రీ రసెల్.చదవండి: ఏం ఆడుతున్నార్రా బాబూ! గుడ్లు ఉరిమి చూసిన రియాన్.. ఒక్క చూపుతోనే.. 𝙍𝙪𝙨𝙨𝙚𝙡𝙡 𝙈𝙖𝙣𝙞𝙖 𝙖𝙩 𝙀𝙙𝙚𝙣 𝙂𝙖𝙧𝙙𝙚𝙣𝙨 💪Display of brute force from #KKR's very own Andre Russell 💥Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @Russell12A pic.twitter.com/YfXiU3dF6h— IndianPremierLeague (@IPL) May 4, 2025 -
కోల్‌కతా బతికిపోయింది!
వరుసగా రెండో రోజు మరో ఉత్కంఠ భరిత పోరు. ఆఖరి బంతిదాకా విజయం కోసం రెండు జట్ల సమరం. చివరకు పరుగు తేడాతో ఒక జట్టు గట్టెక్కితే... మరో జట్టు పోరాడి ఓడింది. 6 బంతుల్లో 22 పరుగులు చేస్తేనే రాజస్తాన్ రాయల్స్‌ను విజయం వరిస్తుంది. ఇది రాయల్స్‌కు క్లిష్టమైంది. కోల్‌కతాకు కలిసొచ్చేది. వైభవ్ అరోరా వేసిన ఈ ఓవర్లో 5 బంతులు ముగిసేసరికి 2, 1, 6, 4, 6లతో 19 పరుగులు వచ్చేశాయి. ఇక 1 బంతి 3 పరుగులు... ఇది ఇరుజట్లను మునికాళ్లపై నిలబెట్టేసింది. అప్పటిదాకా సిక్స్‌లు, ఫోర్ బాదిన శుభమ్ దూబే భారీషాట్ ఆడలేకపోయాడు. ‘టై’ కోసం రెండు పరుగులు తీసే ప్రయత్నం కూడా ఆర్చర్ రనౌట్‌తో వృథా ప్రయాసే అయ్యింది. చివరకు ఒకే ఒక్క పరుగుతేడాతో నైట్‌రైడర్స్ ఊపిరి పీల్చుకుంది. కోల్‌కతా: ఇకపై ప్రతీ మ్యాచ్ నెగ్గితేనే ముందుకెళ్లే పరిస్థితుల్లో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిచి ‘ప్లే ఆఫ్స్’ రేసులో నిలిచింది. ఆదివారం ఉత్కంఠరేపిన ఐపీఎల్ మ్యాచ్‌లో రహానే సారథ్యంలోని కోల్‌కతా ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రీ రసెల్ (25 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఫిఫ్టీ సాధించాడు. అంగ్క్రిష్ రఘువంశీ (31 బంతుల్లో 44; 5 ఫోర్లు), గుర్బాజ్ (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), రహానే (24 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.ఆర్చర్, పరాగ్, తీక్షణ, యుధ్వీర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) జోరు కనబరిచాడు. టాపార్డర్‌లో వైభవ్ సూర్యవంశీ (4), కునాల్ రాథోడ్ (0), మిడిలార్డర్లో ధ్రువ్ జురేల్ (0), హసరంగ (0) నిరాశపరిచినా... కెపె్టన్ రియాన్ పరాగ్ (45 బంతుల్లో 95; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీరోచిత పోరాటం చేశాడు. హెట్‌మైర్ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) కీలక దశలో షరామామూలుగా చేతు లెత్తేశాడు. శుభమ్ దూబే (14 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఆఖరి బంతిదాకా జట్టు గెలిచేందుకు నిలిచినా... ఆర్చర్ (12) రనౌట్‌తో ఆశలు కూలాయి. మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) హెట్‌మైర్ (బి) తీక్షణ 35; నరైన్ (బి) యు«ద్వీర్ 11; రహానే (సి) జురేల్ (బి) పరాగ్ 30; రఘువంశీ (సి) సబ్–అశోక్ (బి) ఆర్చర్ 44; రసెల్ (నాటౌట్) 57; రింకూ సింగ్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–13, 2–69, 3–111, 4–172. బౌలింగ్: ఆర్చర్ 4–0–30–1, యు«ద్వీర్ 2–0– 26–1, తీక్షణ 4–0–41–1, ఆకాశ్ 3–0– 50–0, హసరంగ 4–0–35–0, పరాగ్ 3–0–21–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) రింకూ సింగ్ (బి) మొయిన్ అలీ 34; వైభవ్ (సి) రహానే (బి) వైభవ్ అరోరా 4; కునాల్ (సి) రసెల్ (బి) మొయిన్ అలీ 0; పరాగ్ (సి) వైభవ్ అరోరా (బి) హర్షిత్ 95; ధ్రువ్ జురేల్ (బి) వరుణ్ 0; హసరంగ (బి) వరుణ్ 0; హెట్‌మైర్ (సి) నరైన్ (బి) హర్షిత్ 29; శుభమ్ దూబే (నాటౌట్) 25; ఆర్చర్ (రనౌట్) 12; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–5, 2–8, 3–66, 4–71, 5–71, 6–163, 7–173, 8–205. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–50–1, మొయిన్ అలీ 3–0–43–2, హర్షిత్ రాణా 4–0–41–2, వరుణ్ చక్రవర్తి 4–0–32–2, సునీల్ నరైన్ 4–0–27–0, రసెల్ 1–0–11–0. పరాగ్... 6 బంతుల్లో 6 సిక్స్‌లు ఒకే ఓవర్ కాకపోయినా... పరాగ్ తానెదుర్కొన్న వరుస ఆరు బంతుల్లో (వైడ్ మినహా) ఆరు సిక్సర్లతో చెలరేగాడు. ముందుగా మొయిన్ అలీ 12వ ఓవర్లో తొలి బంతికి హెట్‌మైర్ పరుగు తీశాడు. 2వ బంతి నుంచి స్ట్రయిక్ తీసుకున్న పరాగ్ 6, 6, 6, 6, వైడ్, 6లతో ఆ ఓవర్లో 32 పరుగులు వచ్చాయి. మళ్లీ మరుసటి ఓవర్లో హెట్‌మైర్ సింగిల్ తీయగా, పరాగ్ 6 బాదడంతో రెండు ఓవర్లలో వరుసగా 6 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ఈ 8 బంతుల్లో సాధించిన 39 పరుగులతోనే జట్టు లక్ష్యఛేదనలో ఆశలుపెంచింది. -
వారి వాళ్లే ఈ మ్యాచ్‌లో గెలిచాము.. సంతోషంగా ఉంది: అజింక్య రహానే
ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ ప్లేఆఫ్స్ ఆశలను మరింత పదిలం చేసుకుంది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ సంచలన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా ఆరో స్దానానికి చేరుకుంది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో తమ విజయానికి 22 పరుగులు అవసరమవ్వగా.. రాజస్తాన్ 20 పరుగులు చేయగల్గింది. శుభమ్ దూబే ఆఖరి ఓవర్లో మెరుపులు మెరిపించినప్పటికి తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. అదేవిధంగా రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్(95) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో మోయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన తమ ఆటగాళ్లపై రహానే ప్రశంసల వర్షం కురిపించాడు."ఉత్కంఠ పోరులో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకటి లేదా రెండు పరుగుల తేడాతో గెలిచినప్పుడు ఆ విజయం మనకు చాలా సంతృప్తిని ఇస్తుంది. గుర్భాజ్, అంగ్క్రిష్ చాలా బాగా ఆడారు. వీరితో పాటు రస్సెల్ మాకు అద్బుతమైన ముగింపు అందించాడు.పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి, ఆ తర్వాత 12 ఓవర్ వరకు ఆచితూచి ఆడాలన్నది మా ప్రణాళిక. నేను, అంగ్క్రిష్ వీలైనంతవరకు క్రీజులో ఉండాలనుకున్నాము. ఫీల్డింగ్‌లో మా బాయ్స్ అద్బుతం చేశారు. మా ఫీల్డర్లు 10 నుంచి 12 పరుగులు కాపాడారు. ఇదే మా విజయంలో కీలక పాత్ర పోషించింది. రెండు మంచి క్యాచ్‌లు తీసుకొని, ఓ రనౌట్ చేయగలిగితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుందని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రహానే పేర్కొన్నాడు. -
వారెవ్వా రహానే.. కళ్లు చెదిరే క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే సంచలన క్యాచ్‌తో మెరిశాడు. రహానే అద్భుత క్యాచ్‌తో రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పెవిలియన్‌కు పంపాడు.తొలి ఓవర్ వేసిన వైభవ్ ఆరోరా.. నాలుగో బంతిని షార్ట్ బాల్ సంధించాడు. ఆ బంతిని వైభవ్ సూర్యవంశీ పుల్ షాట్ కోసం ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి మిడ్-వికెట్ వైపు గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడ్ వికెట్లో ఉన్న రహానే పరిగెత్తుకుంటూ వెళ్లి చివరి వరకు బంతిపై దృష్టికోల్పోకుండా అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 4 పరుగులు చేసిన సూర్యవంశీ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది.కేకేఆర్ బ్యాటర్లలో రస్సెల్ 25 బంతుల్లో 57 టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ అజింక్య రహానే (24 బంతుల్లో 30), అంగ్క్రిష్ రఘువన్షీ (31 బంతుల్లో 44) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్ చరక్ ఒక్కో వికెట్ తీశారు. A M A Z I N G C A T C H! 💜🙌🏻A dream start for #KKR as #AjinkyaRahane pulls off a stunner, sending #VaibhavSuryavanshi back early in this must-win #IPLRace2Playoffs fixture! 🙌🏻Watch the LIVE action ➡ https://t.co/jVhilCKHmy#IPLonJioStar 👉 #KKRvRR | LIVE NOW on Star… pic.twitter.com/sOnQKFaLnT— Star Sports (@StarSportsIndia) May 4, 2025 -
నీకసలు సంస్కారం ఉందా?.. అతడికి ఇచ్చే గౌరవం ఇదేనా?
ఐపీఎల్-2025లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన సహనాన్ని కోల్పోయాడు. పరాగ్ తన సహచర ఆటగాడు యశస్వి జైశ్వాల్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు.కేకేఆర్ ఇన్నింగ్స్ 10 వ ఓవర్ వేసిన రియాన్ పరాగ్.. అంగ్క్రిష్ రఘువంశీకి మూడో బంతిని ఔట్‌సైడ్ హాఫ్ దిశగా సంధించాడు. ఆ బంతిని రఘువంశీ వైడ్ లాంగ్-ఆఫ్‌పై లాఫ్ట్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో జైశ్వాల్ తన ఎడమ వైపునకు పరిగెత్తి బంతిని హాఫ్ చేశాడు.అయితే జైశ్వాల్ ఫీల్డ్‌లో కాస్త నెమ్మదిగా కదలడంతో రఘువంశీ, రస్సెల్ రెండు పరుగులు పూర్తి చేసుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన పరాగ్.. దుర్భాషలాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో పరాగ్‌పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నీకసలు సంస్కారం ఉందా? సీనియర్ ఆటగాడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు.ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో రస్సెల్ 25 బంతుల్లో 57 టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ అజింక్య రహానే (24 బంతుల్లో 30), అంగ్క్రిష్ రఘువన్షీ (31 బంతుల్లో 44) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్ చరక్ ఒక్కో వికెట్ తీశారు.pic.twitter.com/7UIZbqs72F— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) May 4, 2025 Watch out for your heads, it's raining sixes! 😮💨🙌🏻#AndreRussell steps up when it matters as he brings up a crucial fifty right on cue for #KKR in this crunch #Race2Playoffs clash! 💪🏻🔥Watch the LIVE action ➡ https://t.co/jVhilCLfc6#IPLonJioStar 👉 #KKRvRR | LIVE NOW on… pic.twitter.com/UQLXfiQzEm— Star Sports (@StarSportsIndia) May 4, 2025 -
క్రికెట్ నీకు రెండో ఛాన్స్ ఇచ్చింది.. కానీ..
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కరుణ్ నాయర్ ఆట తీరును భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఐపీఎల్-2025 (IPL 2025) రూపంలో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో కరుణ్ విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు. ఇలాగే కొనసాగితే వచ్చే సీజన్లో ఆడటం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.కాగా 2013 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న కరుణ్ నాయర్ (Karun Nair).. ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపాడు. విదర్భ తరఫున రంజీల్లో, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో కరుణ్‌కు మళ్లీ జాతీయ జట్టులో చోటు ఇవ్వాలనే డిమాండ్లు పెరిగాయి.రూ. 30 లక్షల కనీస ధరతోఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ ఆడించాలని హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు కరుణ్‌కు మద్దతు పలికారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే.. రూ. 30 లక్షల కనీస ధరతో కరుణ్ నాయర్ ఐపీఎల్-2025 మెగా వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు.ఈ క్రమంలో రూ. 50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే, ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి కరుణ్ నాయర్ కేవలం 154 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 87. ఇక తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ కరుణ్ విఫలమయ్యాడు.వన్‌డౌన్‌లో అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. లక్ష్య ఛేదనలో భాగంగా కరుణ్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. మొత్తంగా పదమూడు బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వైభవ్ అరోరా బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా వెనుదిరిగాడు.ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విధించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడినా పద్నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ చేతిలో ఢిల్లీ ఓటమి అనంతరం కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కరుణ్ నాయర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.క్రికెట్ నీకు రెండో అవకాశం ఇచ్చింది.. కానీ‘‘క్రికెట్ నీకు రెండో అవకాశం ఇచ్చింది. కానీ దానిని నువ్వు సద్వినియోగం చేసుకోవడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఒక్కే మంచి ఇన్నింగ్స్ ఆడావు. రెండు, మూడు రనౌట్లలో భాగమయ్యావు.కానీ నీ స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోతున్నావు. నీ నుంచి భారీ ఇన్నింగ్స్ రావడం లేదు. ముఖ్యంగా టాపార్డర్‌లో అదీ వన్‌డౌన్‌లో ఆడుతున్నా బ్యాట్ ఝులిపించలేకపోతున్నావు. ఇలా అయితే కష్టమే’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా కరుణ్ నాయర్ ఐపీఎల్లో ఇప్పటి వరకు మొత్తంగా 82 మ్యాచ్‌లు ఆడి 1650 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ శతకాలు ఉన్నాయి. గతంలో అతడు పంజాబ్ కింగ్స్ (రూ. 5.6 కోట్లు), రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా, లక్నో సూపర్ జెయింట్స్ తదితర ఫ్రాంఛైజీలకు ఆడాడు.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ కోల్‌కతా👉టాస్: ఢిల్లీ.. తొలుత బౌలింగ్👉కోల్‌కతా స్కోరు: 204/9 (20)👉ఢిల్లీ స్కోరు: 190/9 (20)👉ఫలితం: పద్నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీపై కోల్‌కతా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సునిల్ నరైన్ (3/29).చదవండి: అతడు వచ్చే ఏడాది ఆడకూడదు.. ఇప్పటికైనా చెన్నైని వదిలేయాలి: గిల్‌క్రిస్ట్ -
అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)పై నెటిజన్లు మండిపడుతున్నారు. అనుచితంగా ప్రవర్తించినందుకు అతడిపై నిషేధం విధించాలంటూ సోషల్ మీడియా వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!ఐపీఎల్-2025 (IPL 2025)లో కుల్దీప్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అతడు 12 వికెట్లు తీశాడు. ప్రదర్శన పరంగా ఫర్వాలేదనిపిస్తున్నా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో కుల్దీప్ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది.204 పరుగులుఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. కేకేఆర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో రహానే సేన నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 204 పరుగుల స్కోరు సాధించింది.భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి వరకు పోరాడి పద్నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం ఇరుజట్ల ఆటగాళ్ల కరచాలనం చేసుకున్న తర్వాత.. కొంత మంది విడివిడిగా మాట్లాడుకున్నారు.రింకూ చెంపపై కొట్టిన కుల్దీప్ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ (ఢిల్లీ)- రింకూ సింగ్ (కేకేఆర్)తో సరదాగా సంభాషించాడు. ఇద్దరూ కలిసి జోకులు వేసుకుంటూ నవ్వులు చిందించారు. కానీ అంతలోనే కుల్దీప్ రింకూ చెంపపై కొట్టాడు. దీంతో రింకూ కాస్త ఆశ్చర్యానికి లోనయ్యాడు.అయితే, మరోసారి కుల్దీప్ అదే పని చేయడంతో రింకూ ముఖంలో రంగులు మారిపోయాయి. కుల్దీప్ చర్య అతడికి ఎంతమాత్రం నచ్చలేదని అతడి ఎక్స్ప్రెషన్ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Yo kuldeep watch it pic.twitter.com/z2gp4PK3OY— irate lobster🦞 (@rajadityax) April 29, 2025అతడి నిబ్యాన్ చేయండిఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత చొరవ ఉన్నప్పటికీ లైవ్‌లో ఉన్నప్పుడు సహచర ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. ఇలాంటి వాళ్లను ఉపేక్షించకూడదని.. ఒకటీ, రెండు మ్యాచ్‌లలో ఆడకుండా నిషేధం విధిస్తేనే దారిలోకి వస్తారంటూ బీసీసీఐని ట్యాగ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ మూడు ఓవర్ల బౌలింగ్‌లో 27 పరుగులు ఇచ్చి.. వికెట్లు ఏమీ తీయలేకపోయాడు. మరోవైపు రింకూ కేకేఆర్ తరఫున ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. 25 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ కేకేఆర్👉కేకేఆర్ స్కోరు: 204/9 (20)👉ఢిల్లీ స్కోరు: 190/9 (20)👉ఫలితం: ఢిల్లీపై 14 పరుగుల తేడాతో గెలిచిన కేకేఆర్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సునిల్ నరైన్ (16 బంతుల్లో 27 రన్స్, 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు).చదవండి: సూర్యవంశీపై శుబ్‌మన్ గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్The @KKRiders pulled back things in a fitting way 🥳And it was all fueled by the brilliance of Sunil Narine 😎Scorecard ▶ https://t.co/saNudbWaXT #TATAIPL | #DCvKKR pic.twitter.com/zp5CDNEJsw— IndianPremierLeague (@IPL) April 29, 2025 -
DC vs KKR: నైట్‌రైడర్స్ గెలుపు బాట
ఐపీఎల్లో ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలకు పూర్తిగా తెర పడిపోకుండా కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ ఆశలు సజీవంగా ఉంచుకుంది. గత మూడు మ్యాచ్ లలో రెండు పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దు తర్వాత ఎట్టకేలకు ఆ జట్టు గెలుపు రుచి చూసింది. సమష్టి బ్యాటింగ్‌తో 200 పరుగుల స్కోరు దాటిన టీమ్... ఢిల్లీని వారి వేదికపై కట్టడి చేయడంలో సఫలమైంది. ముఖ్యంగా మ్యాచ్ చేజారుతున్న దశలో నరైన్ 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి ఆటను మలుపు తిప్పాడు. న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్ 18వ సీజన్లో కీలక విజయం దక్కింది. గెలిస్తేనే నిలిచే స్థితిలో మంగళవారం బరిలోకి దిగిన కేకేఆర్ 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అంగ్కృష్ రఘువంశీ (32 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా, స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. ఫాఫ్ డుప్లెసిస్ (45 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (23 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విప్రాజ్ నిగమ్ (19 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సునీల్ నరైన్ (3/29) మూడు ప్రధాన వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు. పవర్‌ప్లేలో కోల్‌కతా ఇన్నింగ్స్ జోరుగా సాగింది. చమీరా ఓవర్లో సునీల్ నరైన్ (16 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టగా...స్టార్క్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదిన రహ్మనుల్లా గుర్బాజ్ (12 బంతుల్లో 26; 5 ఫోర్లు, 1 సిక్స్) అదే ఓవర్లో అవుటయ్యాడు. తొలి 6 ఓవర్లలో మొత్తం 79 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో నరైన్, అజింక్య రహానే (14 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (7) వికెట్లను కేకేఆర్ కోల్పోయింది. ఈ స్థితిలో రఘువంశీ, రింకూ ఐదో వికెట్‌కు 46 బంతుల్లో 61 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో కోల్‌కతా కట్టడి చేయడంలో ఢిల్లీ సఫలమైంది. 3 పరుగుల వ్యవధిలో రఘు, రింకూ వెనుదిరగ్గా... స్టార్క్ వేసిన చివరి ఓవర్లో వరుస బంతుల్లో 3 వికెట్లు పడ్డాయి. రాణించిన డుప్లెసిస్ ఛేదనలో ఢిల్లీకి సరైన ఆరంభం లభించలేదు. పొరేల్ (4), కరుణ్ నాయర్ (15), కేఎల్ రాహుల్ (7) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అయితే డుప్లెసిస్, అక్షర్ భాగస్వామ్యంతో ఢిల్లీ గెలుపుపై ఆశలు రేగాయి. నాలుగో వికెట్‌కు డుప్లెసిస్, అక్షర్ 42 బంతుల్లోనే 76 పరుగులు జత చేశారు. 41 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్‌ను నరైన్ అవుట్ చేయడంతో ఆట మలుపు తిరిగింది. అదే ఓవర్లో స్టబ్స్ (1) కూడా వెనుదిరగ్గా... నరైన్ తన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్‌ను కూడా వెనక్కి పంపించాడు. 10 పరుగుల వ్యవధిలో ఈ 3 వికెట్లు పడ్డాయి. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) పొరేల్ (బి) స్టార్క్ 26; నరైన్ (ఎల్బీ) (బి) విప్రాజ్ 27; రహానే (ఎల్బీ) (బి) అక్షర్ 26; రఘువంశీ (సి) నాయర్ (బి) చమీరా 44; వెంకటేశ్ (సి) విప్రాజ్ (బి) అక్షర్ 7; రింకూ (సి) స్టార్క్ (బి) విప్రాజ్ 36; రసెల్ (రనౌట్) 17; పావెల్ (ఎల్బీ) (బి) స్టార్క్ 5; అనుకూల్ (సి) చమీరా (బి) స్టార్క్ 0; హర్షిత్ (నాటౌట్) 0; వరుణ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–48, 2–85, 3–91, 4–113, 5–174, 6–177, 7–203, 8–203, 9–203. బౌలింగ్: స్టార్క్ 4–0–43–3, చమీరా 3–0–46–1, ముకేశ్ 2–0–17–0, విప్రాజ్ 4–0–41–2, అక్షర్ పటేల్ 4–0–27–2, కుల్దీప్ 3–0–27–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) రసెల్ (బి) అనుకూల్ 4; డుప్లెసిస్ (సి) రింకూ (బి) నరైన్ 62; కరుణ్ నాయర్ (ఎల్బీ) (బి) అరోరా 15; రాహుల్ (రనౌట్) 7; అక్షర్ (సి) హర్షిత్ (బి) నరైన్ 43; స్టబ్స్ (బి) నరైన్ 1; విప్రాజ్ (బి) రసెల్ 38; అశుతోష్ (సి) నరైన్ (బి) వరుణ్ 7; స్టార్క్ (సి) గుర్బాజ్ (బి) వరుణ్ 0; చమీరా (నాటౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–60, 4–136, 5–138, 6–146, 7–160, 8–160, 9–189.బౌలింగ్: అనుకూల్ రాయ్ 4–0–27–1, వైభవ్ అరోరా 2–0–19–2, హర్షిత్ రాణా 4–0–49–0, వరుణ్ చక్రవర్తి 4–0–39–2, నరైన్ 4–0–29–3, రసెల్ 2–0–22–1. ఐపీఎల్లో నేడుచెన్నై X పంజాబ్ వేదిక: చెన్నై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: కేకేఆర్ ఈజ్ బ్యాక్.. ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తిరిగి పుంజుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగల్గింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అక్షర్ పటేల్(43) ఫర్వాలేదన్పించాడు. వీరితో విప్రజ్ నిగమ్(19 బంతుల్లో 38) ఆఖరిలో మెరుపులు మెరిపించనప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, అనుకుల్ రాయ్,రస్సెల్, ఆరోరా తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: IPL 2025: వావ్.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్ -
వావ్.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ దుష్మంత చమీర అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. చమీరా సంచలన క్యాచ్‌తో అనుకుల్ రాయ్‌ను పెవిలియన్‌కు పంపాడు.చమీరా క్యాచ్ అంతా షాక్ అయిపోయారు. కేకేఆర్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన స్టార్క్ బౌలింగ్‌లో మూడో బంతికి రావ్మన్ పావెల్ వికెట్లు ముందు దొరికిపోయాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అనుకుల్ రాయ్‌కు స్టార్క్ నాలుగో బంతిని మిడిల్ అండ్ లెగ్ దిశగా సంధించాడు.ఆ డెలివరీని అనుకుల్ రాయ్ డీప్ స్వ్కెర్ లెగ్ దిశగా ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా బౌండరీ వెళ్తుందని భావించారు. కానీ స్వ్కెర్ లెగ్‌లో ఉన్న చమీరా అద్బుత విన్యాసం చేశాడు. స్వ్కెర్ లెగ్ నుంచి పరిగెత్తుకుంటూ గాల్లోకి జంప్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఒక్కసారిగా బిత్తరపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్లలో ఒకటిగా నెటిజన్లు కొనియాడుతున్నారు.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు.Two moments of brilliance ✌Andre Russell's 1️⃣0️⃣6️⃣m six 🤩Dushmantha Chameera's spectacular grab 🤯Which was your favourite out of the two? ✍Scorecard ▶ https://t.co/saNudbWINr #TATAIPL | #DCvKKR | @KKRiders | @DelhiCapitals pic.twitter.com/9griw9ji4f— IndianPremierLeague (@IPL) April 29, 2025 -
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ ఘన విజయం
ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ ఘన విజయంఅరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగల్గింది.ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అక్షర్ పటేల్(43) ఫర్వాలేదన్పించాడు. వీరితో విప్రజ్ నిగమ్(19 బంతుల్లో 38) ఆఖరిలో మెరుపులు మెరిపించనప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, అనుకుల్ రాయ్,రస్సెల్, ఆరోరా తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.ఢిల్లీకి షాక్.. ఓకే ఓవర్లో రెండు వికెట్లు14 ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి అక్షర్ పటేల్(43) ఔట్ కాగా.. ఆరో బంతికి స్టబ్స్ ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(62), విప్రజ్ నిగమ్(5) ఉన్నారు.ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ డౌన్..కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రాహుల్.. రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో ఫాఫ్ డుప్లెసిస్(32), అక్షర్ పటేల్(8) ఉన్నారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..కరుణ్ నాయర్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన నాయర్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్.. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 178) పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(8), కరుణ్ నాయర్(4) ఉన్నారు.చెలరేగిన కేకేఆర్ బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు.కేకేఆర్ ఐదో వికెట్ డౌన్రఘువంశీ రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన రఘువంశీ.. చమీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 142/414 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. క్రీజులో రఘువంశీ(35), రింకూ సింగ్(14) ఉన్నారు.రహానే ఔట్..కేకేఆర్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్ వేసిన విప్రజ్నిగమ్ బౌలింగ్‌లో సునీల్ నరైన్(27) ఔట్ కాగా.. 8 ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ రహానే(26) పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లకు కేకేఆర్ స్కోర్6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 79/06 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(26), రహానే(21) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్రహ్మానుల్లా గుర్బాజ్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన గుర్భాజ్..స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(20), రహానే(0) ఉన్నారు.ఐపీఎల్-2025లో అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. కేకేఆర్ మాత్రం తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రమణ్‌దీప్ సింగ్ స్ధానంలో అనుకుల్ రాయ్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తిఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్ ), కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్ -
‘ఈడెన్’ను ముంచెత్తిన వాన
కోల్‌కతా: ఈ మ్యాచ్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘మెరుపులు... చినుకులు... రద్దు!’ పంజాబ్ ఓపెనర్ల బౌండరీతో మొదలైన ఈ మ్యాచ్ బ్యాటింగ్ వండర్‌గా సాగింది. మైదానంలో జోష్ తెచ్చింది. ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ ఇదంతా ఒక ఇన్నింగ్స్ వరకే పరిమితమైంది. కోల్‌కతా లక్ష్యఛేదన మొదలయ్యాక ఒకటే ఓవర్‌కు ఆట ముగించాల్సి వచ్చింది. వానొచ్చి మైదానంతో పాటు అంతకు ముందరి పరుగుల వరదను ముంచెత్తింది. భారీ వర్షంతో చాలా సేపు నిరీక్షించినా ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు.వీరిద్దరు తొలి వికెట్‌కు 72 బంతుల్లో 120 పరుగులు జోడించారు. ఆ తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ మ్యాచ్ రద్దు కావడం ఇదే మొదటిసారి! 120 దాకా జోరే జోరు! ఫోర్‌తో మొదలైన పంజాబ్ స్కోరు తర్వాత జోరందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్‌ల క్రమంగా హోరెత్తించడంతో మైదానం పరుగుల పండగ చేసుకుంది. ఇద్దరు ఫోర్లు, సిక్స్‌లను అలవోకగా దంచేయడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. 4.3 ఓవర్లలో కింగ్స్ 50 స్కోరును దాటింది. హర్షిత్ పదో ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 4, 6, 4 బాదాడంతో 27 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. తర్వాత నరైన్ 11వ ఓవర్‌ను ఇద్దరు కలిసి చితగ్గొట్టారు. ప్రియాన్ష్ ఓ సిక్స్ కొడితే... ప్రభ్‌సిమ్రన్ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 22 పరుగులొచ్చాయి. ఈ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. ఎట్టకేలకు 12వ ఓవర్లో రసెల్ ఓపెనింగ్ జోడీకి చెక్ పెట్టాడు. ప్రియాన్ష్ భారీ షాట్‌కు యత్నించి వైభవ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 38 బంతుల్లో ప్రభ్‌సిమ్రన్ అర్ధ సెంచరీ పూర్తయింది. సకారియా వేసిన 13వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ వరుసగా 4, 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. వరుణ్ వేసిన 14వ ఓవర్‌ను పూర్తిగా ఆడిన ప్రభ్‌సిమ్రన్ 4, 0, 4, 6, 4, 1లతో 19 పరుగుల్ని పిండుకున్నాడు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే 37 పరుగులు రావడంతో 121/1 స్కోరు కాస్తా 158/1గా ఎగబాకింది. 15వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ అవుట్ కావడంతోనే స్కోరు, జోరు అన్నీ తగ్గాయి. మ్యాక్స్‌వెల్ (7), మార్కో యాన్సెన్ (3) నిరాశపరచగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పెద్దగా మెరిపించలేకపోయాడు. దీంతో ఆఖరి 6 ఓవర్లలో పంజాబ్ 43 పరుగులే చేయగలిగింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఏ మ్యాచ్ జరిగినా గంట మోగించే ఆట ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పహల్గాంలో ఉగ్ర ఘాతుకానికి నివాళిగా ఈ సారి గంట మోగించకుండా నల్ల రిబ్బన్లతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. మ్యాచ్ ఆరంభానికి ముందు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) పహల్గాంలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పించింది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) వైభవ్ (బి) రసెల్ 69; ప్రభ్‌సిమ్రన్ (సి) పావెల్ (బి) వైభవ్ 83; శ్రేయస్ నాటౌట్ 25; మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ 7; యాన్సెన్ (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 3; ఇన్‌గ్లిస్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–120, 2–160, 3–172, 4–184. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–34–2, చేతన్ సకారియా 3–0–39–0, హర్షిత్ రాణా 2–0–27–0, వరుణ్ చక్రవర్తి 4–0–39–1, సునీల్ నరైన్ 4–0–35–0, రసెల్ 3–0–27–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ నాటౌట్ 1; నరైన్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (1 ఓవర్లో వికెట్ కోల్పోకుండా) 7. బౌలింగ్: యాన్సెన్ 1–0–6–0. మాల్దీవుల్లో సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్‌ల ఒత్తిడికి దూరంగా కాస్త విరామం తీసుకున్నారు. తర్వాతి మ్యాచ్‌కు వారం రోజుల వ్యవధి ఉండటంతో సరదాగా గడిపేందుకు ఆటగాళ్లంతా శనివారం మాల్దీవులకు వెళ్లారు. చెన్నైలో సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత అక్కడినుంచే టీమ్ సభ్యులు మాల్దీవులకు చేరుకున్నారు. సన్‌రైజర్స్ తమ తర్వాతి పోరులో శుక్రవారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్‌లలో 3 గెలిచి 6 ఓడిన టీమ్... మిగిలిన ఐదు మ్యాచ్‌లూ గెలిస్తేనే ‘ప్లే ఆఫ్స్’ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X బెంగళూరువేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025 PBKS Vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
KKR vs PBKS Live Updates: వర్షం కారణంగా మ్యాచ్ రద్దుఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కేకేఆర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ ముగిసిన అనంతరం వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుందని అంతాభావించారు. కానీ మైదానం సిద్దం చేసే సమయానికి వర్షం మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(83) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్(25) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రస్సెల్ తలా వికెట్ సాధించారు. మ్యాచ్‌కు వర్షం అంతరాయంఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. కేకేఆర్ ముందు భారీ టార్గెట్ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(83) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్(25) రాణించారు.పంజాబ్ రెండో వికెట్ డౌన్..ప్రభుసిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 83 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సింగ్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 14.3 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 160/2పంజాబ్ తొలి వికెట్ డౌన్..ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 69 పరుగులు చేసిన ఆర్య.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 12 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 121 పరుగులు చేసింది. 11 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 112/011 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 112 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(62), ప్రభుసిమ్రాన్ సింగ్(47) ఉన్నారు.8 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 71/08 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(38), ప్రభుసిమ్రాన్ సింగ్(31) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న పంజాబ్ కింగ్స్..4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(28), ప్రభుసిమ్రాన్ సింగ్(13) ఉన్నారు.ఐపీఎల్-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం.ఈ మ్యాచ్‌లో పంజాబ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. జట్టులోకి తిరిగి మాక్స్వెల్, ఓమర్జాయ్ వచ్చారు. కేకేఆర్ రెండు మార్పులు చేసింది. రావ్మన్ పావెల్‌తో పాటు చేతన్ సాకరియా కేకేఆర్ తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి -
'శ్రేయస్ చాలా బాధపడ్డాడు.. కేకేఆర్‌కు చుక్కలు చూపిస్తాడు'
ఐపీఎల్-2025లో శనివారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కీలకపోరులో తలపడేందుకు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ రేసులో ముందుకు వెళ్లళాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఐదో స్ధానంలో ఉండగా.. కోల్‌కతా ఏడో స్ధానంలో ఉంది. ఇరు జట్లకు ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అయ్యర్ తన మాజీ జట్టు కేకేఆర్‌పై మరోసారి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్దంగా ఉన్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.కాగా శ్రేయస్ అయ్యర్ గతేడాది సీజన్లో కెప్టెన్‌గా కేకేఆర్‌కు టైటిల్‌ను అందించాడు. కానీ అనూహ్యంగా మెగా వేలానికి ముందు అయ్యర్‌ను రిటైన్ చేసుకోకుండా కేకేఆర్ ఫ్రాంచైజీ అందరికి షాకిచ్చింది. కేకేఆర్ నిర్ణయంతో శ్రేయస్ కూడా నిరాశచెందాడు. తనతో రిటెన్షన్ కోసం కనీసం సంప్రదింపులు కూడా జరపనట్లు శ్రేయస్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే వేలంలోకి వచ్చిన అయ్యర్‌ను రూ.26 .75 కోట్ల భారీ ధరకు పంజాబ్ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటికే కేకేఆర్‌ను ఓసారి పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని పంజాబ్ చరిత్ర సృష్టించింది. నేడు జరగనున్న మ్యాచ్‌లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని శ్రేయస్ సేన భావిస్తోంది."కేకేఆర్‌పై శ్రేయస్ అయ్యర్ చాలా కోపంగా ఉంటాడు. ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోతే లేదా కెప్టెన్‌గా విఫలమైతే ఏ ఫ్రాంచైజీ అయినా వేలంలోకి విడిచిపెడుతోంది. కానీ అయ్యర్ కథ వేరు. టైటిల్‌ను అందించిన కెప్టెన్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. నిజంగా ఈ నిర్ణయం ఎవరినైనా బాధిస్తుంది. టైటిల్‌ను అందించిన జట్టుకు ఏ కెప్టెనైనా ఉండాలని భావించడు.తనను రిటైన్ చేసుకోకపోవడంతో అయ్యర్ చాలా బాధపడ్డాడు. అయితే కేకేఆర్ విడిచిపెట్టడంతో అయ్యర్‌కు ఒకవంతు మంచే జరిగింది. అతడు భారీ ధరకు పంజాబ్ కింగ్స్ జట్టులోకి వచ్చాడు. మరోసారి కేకేఆర్‌పై తనంటో నిరూపించకోవాల్సిన సమయం వచ్చింది. పంజాబ్‌కు అయ్యర్ మరో రెండు పాయింట్లను తీసుకువస్తాడని ఆశిస్తున్నాను" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు.చదవండి: ఈసారి వేలం వేస్ట్.. ధోని కేవలం బ్రాండ్ కోసమే ఆడుతున్నాడు: సురేశ్ రైనా విమర్శలు -
KKR Vs PBKS: కోల్‘కథ’ మారేనా!
కోల్‌కతా: ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయిన జట్లు... 18వ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇలా నాలుగు జట్లు చక్కటి ఆటతీరుతో దూసుకెళ్తున్నాయి. తాజా సీజన్లో 8 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 3 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ నేడు జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో తలపడనుంది. గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్... ఇప్పుడు పంజాబ్ కింగ్స్ సారథిగా ఈడెన్ గార్డెన్స్‌లో అడుగు పెట్టనున్నాడు. పుష్కర కాలం తర్వాత కేకేఆర్‌కు మూడో ఐపీఎల్ ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను ఫ్రాంఛైజీ వేలానికి వదిలేస్తే... పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకొని కెప్టెన్‌ను చేసింది. కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి శ్రేయస్ జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో కేకేఆర్ 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 95 పరుగులకు ఆలౌటైంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోల్‌కతా చూస్తుంటే... గెలుపు జోరు కొనసాగిస్తూ ‘ప్లే ఆఫ్స్’ వైపు మరో అడుగు ముందుకు వేయాలని పంజాబ్ భావిస్తోంది. మిడిలార్డర్‌పైనే భారం! డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కోల్‌కతా... నిలకడగా విజయాలు సాధించడంలో విఫలమవుతోంది. 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 5 పరాజయాలతో 6 పాయింట్లు సాధించిన కోల్‌కతా పట్టిక ఏడో స్థానంలో ఉంది. కెపె్టన్ అజింక్యా రహానే ఒక్కడే ఓ మాదిరిగా ఆడుతుండగా... మిగిలిన వాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. 8 మ్యాచ్‌ల్లో 271 పరుగులు చేసిన రహానే జట్టులో అందరికంటే ముందున్నాడు. 19 ఏళ్ల అంగ్క్రిష్ రఘువంశీ 197 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్... 135 పరుగులే చేయగా... ఓపెనర్లు క్వింటన్ డికాక్ 143, సునీల్ నరైన్ 147 కూడా మెరుపులు మెరిపించలేకపోతున్నారు. రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్ సింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. రింకూ 8 మ్యాచ్‌ల్లో 133 పరుగులే చేయగా... రసెల్ 55, రమణ్‌దీప్ 30 పరుగులు చేశారు. ఈ ముగ్గురు ఫినిషింగ్ టచ్‌తో జట్టుకు భారీ స్కోర్లు అందిస్తారనుకుంటే... వారు వరస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. బౌలింగ్‌లోనూ కేకేఆర్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వరుణ్ చక్రవర్తి, నరైన్, మోయిన్ అలీ వంటి ముగ్గురు ప్రధాన స్పిన్నర్లు ఉన్నప్పటికీ పిచ్ వారికి అనుకూలంగా రూపొందించుకోలేక పోయిన కేకేఆర్ దానికి మూల్యం చెల్లించుకుంటోంది. పేసర్లు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా ఫర్వాలేదనిపిస్తున్నారు. కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ మ్యాచ్‌లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు కోల్‌కతా సిద్ధమైంది. అన్నీ రంగాల్లో బలంగా... కేకేఆర్‌తో పోల్చుకుంటే పంజాబ్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఈ సీజన్లో శ్రేయస్ సారథ్యం... పాంటింగ్ వ్యూహాలు... ఓపెనర్ల మెరుపులు... చాహల్ స్పిన్ మాయాజాలం వెరసి పంజాబ్ బలంగా కనిపిస్తోంది. లీగ్ ఆరంభంలో దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న శ్రేయస్... గత మూడు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం కాస్త ఇబ్బంది పెడుతోంది. అయినప్పటికీ అతడు 8 మ్యాచ్‌ల్లో 263 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. అందులో 3 అర్ధశతకాలు ఉన్నాయి. ప్రియాన్ష్ఆర్య 254, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 209, నేహల్ వధేరా 189, శశాంక్ సింగ్ 158 పరుగులు చేశారు. ఓపెనర్లు ఆర్య, ప్రభ్‌సిమ్రన్ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తుండగా... శ్రేయస్, ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్ మిడిలార్డర్లో బరిలోకి దిగనున్నారు. బౌలింగ్‌లో ప్రధాన పేసర్ అర్‡్షదీప్ సింగ్ ఆకట్టుకుంటుండగా... యుజ్వేంద్ర చాహల్ ఫామ్‌లో ఉన్నాడు. అర్ష్ దీప్ 11 వికెట్లు తీయగా... కేకేఆర్‌తో గత మ్యాచ్‌లో చాహల్ 4 ప్రధాన వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న పంజాబ్‌కు మార్కో యాన్సెన్, స్టొయినిస్ రూపంలో నిఖార్సైన ఆల్‌రౌండర్లు ఉండటం అదనపు బలంగా మారింది. ఈ ఇద్దరు మంచి టచ్‌లో ఉన్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కేకేఆర్... పంజాబ్ జోరును ఎలా అడ్డుకుంటుందో చూడాలి!34 ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా, పంజాబ్ జట్లు ముఖాముఖిగా 34 సార్లు తలపడ్డాయి. 21 మ్యాచ్‌ల్లో కోల్‌కతా, 13 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలుపొందాయి. పంజాబ్‌పై కోల్‌కతా అత్యధిక స్కోరు 261 కాగా, అత్యల్ప స్కోరు 95 పరుగులు. కోల్‌కతాపై పంజాబ్ అత్యధిక స్కోరు 262 కాగా, అత్యల్ప స్కోరు 111 పరుగులు. -
GT Vs KKR: గుజరాత్ గర్జన
కోల్‌కతా: గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతులెత్తేసింది. దీంతో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో టైటాన్స్ 39 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (55 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. బట్లర్ (23 బంతుల్లో 41 నాటౌట్; 8 ఫోర్లు) ధాటిగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో రసెల్, వైభవ్, హర్షిత్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ అజింక్య రహానే (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు. ఆ ఇద్దరు బాదేశారిలా... గుజరాత్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ముందుగా సాయి సుదర్శన్ బౌండరీతో బాదుడు మొదలు పెట్టాడు. మూడో ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. కాస్త ఆలస్యమైనా... గిల్ ఐదో ఓవర్లో రెండు వరుస బౌండరీలతో దూకుడు షురూ చేశాడు. టైటాన్స్ పవర్‌ప్లే స్కోరు 45/0. అలీ వేసిన ఏడో ఓవర్లో గిల్ 6, 4, 4లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. క్రమం తప్పకుండా ఫోర్లు బాదేయడంతో సగం ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 89/0 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్లోనే గిల్ 34 బంతుల్లో, సుదర్శన్ 33 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 100 దాటింది. ఎట్టకేలకు సుదర్శన్‌ను అవుట్ చేసిన రసెల్ కోల్‌కతాకు ఊరటనిచ్చాడు. అయితే బట్లర్ రాకతో దంచుడులో ఏ మార్పులేకపోయింది. ఆఖర్లో గిల్, రాహుల్ తెవాటియా (0) వికెట్లు పడినా కూడా భారీస్కోరు సాధ్యమైంది. కెప్టెన్ ఒంటరి పోరాటం పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నైట్‌రైడర్స్ పవర్‌ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. సిరాజ్ తొలి ఓవర్లోనే రహా్మనుల్లా గుర్బాజ్ (1) పెవిలియన్ చేరగా, కెప్టెన్ రహానేతో అడపాదడపా షాట్లతో స్కోరును నడిపిస్తున్న సునీల్ నరైన్ (17)ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. వెంకటేశ్ అయ్యర్ (14) మెప్పించలేకపోయాడు. బాధ్యతగా ఆడిన రహానే 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, అదేస్కోరు వద్ద వాషింగ్టన్ సుందర్ అతన్ని అవుట్ చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రసెల్ (15 బంతుత్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) స్టంపౌట్ కావడంతో కోల్‌కతా లక్ష్యానికి దూరమైంది. రఘువంశీ (13 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు అలరించాడు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 52; శుబ్‌మన్ గిల్ (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ 90; బట్లర్ (నాటౌట్) 41; తెవాటియా (సి) రమణ్‌దీప్ (బి) హర్షిత్ రాణా 0; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–114, 2–172, 3–177. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–44–1, మొయిన్ అలీ 3–0–27–0, హర్షిత్ రాణా 4–0–45–1, వరుణ్ చక్రవర్తి 4–0–33–0, నరైన్ 4–0–36–0, రసెల్ 1–0–13–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 1; నరైన్ (సి) తెవాటియా (బి) రషీద్ 17; రహానే (స్టంప్డ్) బట్లర్ (బి) సుందర్ 50; వెంకటేశ్ (సి) సుందర్ (బి) సాయి కిషోర్ 14; రింకూ సింగ్ (సి) గిల్ (బి) ఇషాంత్ 17; రసెల్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 21; రమణ్‌దీప్ (సి అండ్ బి) ప్రసిధ్ కృష్ణ 1; మొయిన్ అలీ (సి) షారుఖ్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; రఘువంశీ (నాటౌట్) 27; హర్షిత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–2, 2–43, 3–84, 4–91, 5–118, 6–119, 7–119, 8–151. బౌలింగ్: సిరాజ్ 4–0–32–1, ఇషాంత్ 2–0–18–1, ప్రసిధ్ కృష్ణ 4–0–25–2, రషీద్ ఖాన్ 4–0–25–2, సుందర్ 3–0–36–1, సాయి కిషోర్ 3–0–19–1. -
IPL 2025 KKR vs GT: కేకేఆర్‌పై గుజరాత్ ఘన విజయం
IPL 2025 KKR vs GT Live Updates: కేకేఆర్‌పై గుజరాత్ ఘన విజయంఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని గుజరాత్ అందుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగల్గింది.కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే(50)టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో రఘువన్షి(27) పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ట తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, సుందర్, ఇషాంత్ శర్మ సాయికిషోర్ చెరో వికెట్ పడగొట్టారు.ఓటమి దిశగా కేకేఆర్..గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి దిశగా సాగుతోంది. వరుస క్రమంలో కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రస్సెల్(24) ఔట్ కాగా.. ప్రసిద్ద్ బౌలింగ్‌లో రమణ్‌దీప్ సింగ్(1) మోయిన్ అలీ(0) పెవిలియన్‌కు చేరారు. కేకేఆర్ విజయానికి 18 బంతుల్లో 75 పరుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్(6), రఘువన్షి(5) ఉన్నారు.కేకేఆర్ మూడో వికెట్ డౌన్..వెంకటేశ్ అయ్యర్ రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన అయ్యర్.. సాయికిషోర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్..90 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన కెప్టెన్ అజింక్య రహానే.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజులో రింకూ సింగ్(2), రస్సెల్(10) ఉన్నారు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్..సునీల్ నరైన్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన నరైన్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తెవాటియాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(3), అజింక్య రహానే(24) ఉన్నారు.గుజరాత్‌కు భారీ షాక్..199 పరుగులతో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో గుర్భాజ్(1) ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కెప్టెన్ అజింక్య రహానే వచ్చాడు.శుబ్‌మన్ గిల్ విధ్వంసం.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.55 బంతులు ఎదుర్కొన్న గిల్.. 10 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. గిల్‌తో పాటు సాయిసుదర్శన్(52), బట్లర్(41) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న గిల్..17 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(26), శుబ్‌మన్ గిల్(80) ఉన్నారు.గుజరాత్ తొలి వికెట్ డౌన్..సాయిసుదర్శన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 129 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(13), శుబ్‌మన్ గిల్(60) ఉన్నారు.హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, సుదర్శన్..కేకేఆర్‌తో మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(52), సాయి సుదర్శన్(52) హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. 12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 113 పరుగులు చేసింది.గిల్ ఆన్ ఫైర్..7 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్(39), సాయిసుదర్శన్(21) దూకుడుగా ఆడుతున్నారు.నిలకడగా ఆడుతున్న గిల్, సుదర్శన్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(6), సాయిసుదర్శన్(19) ఉన్నారు.ఐపీఎల్-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక పోరులో కేకేఆర్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేకేఆర్ తుది జట్టులోకి గుర్బాజ్, మోయిన్ అలీ వచ్చారు. గుజరాత్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిచదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా -
IPL 2025 GT Vs KKR: టైటాన్స్ జోరు సాగేనా!
కోల్‌కతా: ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో పోరుకు సిద్ధమైంది. కేకేఆర్ జట్టు లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు 259 మ్యాచ్‌లాడగా... అందులో మూడుసార్లు మాత్రమే గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. షెడ్యూల్ కారణంగా ఇరు జట్ల మధ్య తక్కువ మ్యాచ్‌లు జరగగా... సోమవారం పోరులో అటు కేకేఆర్, ఇటు గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్లే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగనున్నాయి. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రూపంలో ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు కోల్‌కతాకు అందుబాటులో ఉండగా... గుజరాత్ తరఫున రషీద్ ఖాన్, సాయికిషోర్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత సీజన్లో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 2 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గతంలో కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహించిన గిల్... తన పాత జట్టుపై విజృంభించాలని చూస్తుంటే... విండీస్ ద్వయం రసెల్, నరైన్ సమష్టిగా కదంతొక్కి జట్టును గెలుపు బాట పట్టించాలని కోల్‌కతా మేనేజ్మెంట్ భావిస్తోంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పించిన అనంతరం తిరిగి కేకేఆర్ గూటికి చేరిన అభిషేక్ నాయర్ ఈ మ్యాచ్‌లో డగౌట్ నుంచి కోల్‌కతా ప్లేయర్లకు సలహాలు ఇవ్వనున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో విజయంతో గుజరాత్ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుందా... లేక సొంతగడ్డపై కోల్‌కతా విజయ దరహాసం చేస్తుందా చూడాలి! నిలకడ లేమి సమస్య... డిఫెండింగ్ చాంపియన్‌గా సీజన్ ఆరంభించిన కోల్‌కతా... స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోతోంది. పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన కేకేఆర్... 95 పరుగులకే కుప్పకూలింది. బ్యాటర్లు ముకుమ్మడిగా విఫలమవడంతో కోల్‌కతా మూల్యం చెల్లించుకుంది. అయితే అభిõÙక్ నాయర్ రాకతో జట్టులో జవసత్వం నిండుతుందని యాజమాన్యం ఆశిస్తోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇకపై ఆడనున్న అన్నీ మ్యాచ్‌లు కీలకమైన నేపథ్యంలో... ప్లేయర్లంతా సమష్టిగా సత్తా చాటాలని చూస్తున్నారు. ముఖ్యంగా వేలంలో రూ. 23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్ కనీస ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. ఈ సీజన్లో వెంకటేశ్ 24.20 సగటుతో 121 పరుగులు చేయగా... రమణ్‌దీప్ కేవలం 29 పరుగులే చేశాడు. హిట్టర్లుగా పేరున్న రసెల్ 5 మ్యాచ్‌ల్లో 34 పరుగులకే పరిమితం కాగా... రింకూ సింగ్ 38.66 సగటుతో 116 పరుగులు చేశాడు. కెప్టెన్ అజింక్య రహానే 2 అర్ధశతకాల సాయంతో 221 పరుగులు చేయగా... 20 ఏళ్ల రఘువంశీ 170 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు సునీల్ నరైన్, డికాక్ కొన్ని మెరుపులు మెరిపిస్తున్నా... నిలకడగా జట్టుకు శుభారంభం అందించలేకపోతున్నారు. ఈ లోపాలన్నీ సరిద్దిద్దుకుంటేనే కేకేఆర్ తిరిగి గెలుపు పట్టాలెక్కనుంది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్‌లో ఉన్నారు. అన్నీ రంగాల్లో పటిష్టంగా... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తోంది. టాప్–3 ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్ చక్కటి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసి రానుంది. రూథర్‌ఫార్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా రూపంలో మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో శతకానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయిన బట్లర్ ఈ సీజన్లో 63.00 సగటుతో 315 పరుగులు చేయగా... సాయి సుదర్శన్ 365 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. బౌలింగ్‌లోనూ గుజరాత్‌కు ఇబ్బందులు లేవు. సీనియర్ పేసర్ ప్రసిధ్ కృష్ణ తాజా సీజన్లో 14 వికెట్లు పడగొట్టి దూకుడు మీద ఉండగా... హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ అతడికి చక్కటి సహకారం అందిస్తున్నారు. తమిళనాడు స్పిన్నర్ సాయి కిషోర్ తనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుండగా... రషీద్ ఖాన్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తుది జట్లు (అంచనా) కోల్‌కతా నైట్ రైడర్స్: రహానే (కెప్టెన్), నరైన్, డికాక్, వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ, రింకూ సింగ్, రసెల్, రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, నోర్జే, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. గుజరాత్ టైటాన్స్: గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, రూథర్‌ఫర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ. -
PBKS vs KKR: 111 తోనే పంజాబ్ పండుగ
సొంత మైదానంలో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై పంజాబ్ కింగ్స్ పడుతూ లేస్తూ 111 పరుగులు చేసింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) విజయంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే కోల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో నంబర్‌వన్ స్థానానికి కూడా దూసుకుపోతుంది. ఎంత వేగంగా ఛేదిస్తారనే దానిపైనే చర్చ. 62/2 స్కోరుతో జట్టు గెలుపు దిశగా సాగింది. కానీ ఒక్కసారిగా అనూహ్యం జరిగింది. యుజువేంద్ర చహల్ పదునైన స్పిన్‌తో కేకేఆర్ పతనానికి శ్రీకారం చుట్టాడు. 17 పరుగుల వ్యవధిలో కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయింది. అయితే రసెల్ ఒకే ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో మళ్లీ కేకేఆర్ విజయంపై అంచనాలు... కానీ యాన్సెన్ బంతితో రసెల్ ఆట ముగిసింది... మరో 29 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా ఆలౌట్... పంజాబ్ అభిమానులతో మైదానం ఒక్కసారిగా హోరెత్తింది. శనివారం 245 పరుగులు చేసి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన పంజాబ్ కింగ్స్...ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా నిలిచింది. ముల్లాన్‌పూర్: ఐపీఎల్లో అరుదుగా కనిపించే తక్కువ స్కోర్ల మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. మంగళవారం జరిగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 15.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (15 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. రఘువంశీ (28 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యుజువేంద్ర చహల్ (4/28) ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ఓపెనింగ్ మినహా... తొలి 19 బంతుల్లో 39/0... తర్వాతి 17 బంతుల్లో 15/4... పవర్‌ప్లేలో పంజాబ్ ఆటతీరు ఇది. ఓపెనర్ల ఆటతీరు చూస్తే ఈ మైదానంలో జరిగిన గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే భారీ స్కోరు ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. నోర్జే ఓవర్లో ప్రియాన్ష్ఆర్య (12 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) రెండు ఫోర్లు కొట్టగా... అరోరా వేసిన తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ వరుసగా 4, 6, 4 బాదాడు. అదే ఓవర్లో ప్రియాన్ష్ కూడా ఫోర్ కొట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. రాణా తొలి బంతిని ప్రియాకూ సిక్స్ కొట్టే వరకు అంతా బాగుంది. కానీ ఆ తర్వాతి బంతి నుంచే కోల్‌కతా బౌలర్ల జోరు మొదలైంది. అదే ఓవర్లో ప్రియాన్ష్ , శ్రేయస్ అయ్యర్ (0)లను అవుట్ చేసిన రాణా తన తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ను కూడా వెనక్కి పంపాడు. అంతకు ముందే సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఇన్‌గ్లిస్ (2) కూడా వరుణ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 54/4కు చేరింది. ఇక ఆ తర్వాత పంజాబ్ కోలుకోలేకపోయింది. నైట్‌రైడర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పవర్‌ప్లే తర్వాత ఆడిన 57 బంతుల్లో 57 పరుగులు మాత్రమే చేసిన జట్టు 6 వికెట్లు కోల్పోయింది. వధేరా (10), మ్యాక్స్‌వెల్ (7), ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన సూర్యాంశ్ (4) ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, శశాంక్ సింగ్ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కూడా విఫలమయ్యాడు. టపటపా... ఛేదనలో కోల్‌కతాకు సరైన ఆరంభం లభించలేదు. మూడు బంతుల వ్యవధిలో ఒకే స్కోరు వద్ద ఓపెనర్లు నరైన్ (5), డికాక్ (2) వెనుదిరిగారు. అయితే అజింక్య రహానే (17), రఘువంశీ కలిసి కొన్ని చక్కటి షాట్లతో మూడో వికెట్‌కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే రహానే వెనుదిరిగిన తర్వాత కేకేఆర్ పతనం వేగంగా సాగిపోయింది. ఒక్కరు కూడా పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించే ప్రయత్నం చేయలేకపోయారు. చివర్లో రసెల్ (11 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. రహానే దురదృష్టవశాత్తూ ఎల్బీపై రివ్యూ కోరకపోవడం కూడా కేకేఆర్‌కు నష్టం కలిగించింది. అతని అవుట్ తర్వాతే పరిస్థితి మారింది. బాల్ ట్రాకింగ్‌లో ప్రభావం ఆఫ్ స్టంప్ బయట కనిపించింది. రివ్యూ కోరితే అతను నాటౌట్‌గా తేలేవాడు. చహల్ మ్యాజిక్ టోర్నీ తొలి 5 మ్యాచ్‌లలో ఏకంగా 83.50 సగటు, 11.13 చెత్త ఎకానమీతో కేవలం 2 వికెట్లు... 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓవర్ల కోటా పూర్తి... వేలంలో రూ.18 కోట్లతో అమ్ముడుపోయిన చహల్ పేలవ ఫామ్ ఇది. కచ్చితంగా రాణించాల్సిన తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన అతను మ్యాజిక్ చూపించాడు. వరుస ఓవర్లలో రహానే, రఘువంశీలను అవుట్ చేసి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపిన అతను కీలక సమయంలో వరుస బంతుల్లో రింకూ, రమణ్‌దీప్‌లను వెనక్కి పంపి విజయానికి బాటలు వేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తనకున్న గుర్తింపును నిలబెట్టుకుంటూ మళ్లీ రేసులోకి వచ్చాడు. ఐపీఎల్లో నేడుఢిల్లీ X రాజస్తాన్ వేదిక: న్యూఢిల్లీరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్(సి) రమణ్‌దీప్ (బి) రాణా 22; ప్రభ్‌సిమ్రన్ (సి) రమణ్‌దీప్ (బి) రాణా 30; శ్రేయస్ (సి) రమణ్‌దీప్ (బి) రాణా 0; ఇన్‌గ్లిస్ (బి) వరుణ్ 2; వధేరా (సి) వెంకటేశ్ (బి) నోర్జే 10; మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ 7; సూర్యాంశ్ (సి) డికాక్ (బి) నరైన్ 4; శశాంక్ (ఎల్బీ) (బి) అరోరా 18; యాన్సెన్ (బి) నరైన్ 1; బార్ట్లెట్ (రనౌట్) 11; అర్ష్ దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.3 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–42, 4–54, 5–74, 6–76, 7–80, 8–86, 9–109, 10–111. బౌలింగ్: వైభవ్ అరోరా 2.3–0–26–1, నోర్జే 3–0–23–1, హర్షిత్ రాణా 3–0–25–3, వరుణ్ చక్రవర్తి 4–0–21–2, నరైన్ 3–0–14–2. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) సూర్యాంశ్ (బి) బార్ట్లెట్ 2; నరైన్ (బి) యాన్సెన్ 5; రహానే (ఎల్బీ) (బి) చహల్ 17; రఘువంశీ (సి) బార్ట్లెట్ (బి) చహల్ 37; వెంకటేశ్ (ఎల్బీ) (బి) మ్యాక్స్‌వెల్ 7; రింకూ సింగ్ (స్టంప్డ్) ఇన్‌గ్లిస్ (బి) చహల్ 2; రసెల్ (బి) యాన్సెన్ 17; రమణ్‌దీప్ (సి) శ్రేయస్ (బి) చహల్ 0; రాణా (బి) యాన్సెన్ 3; అరోరా (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.1 ఓవర్లలో ఆలౌట్) 95. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–62, 4–72, 5–74, 6–76, 7–76, 8–79, 9–95, 10–95. బౌలింగ్: యాన్సెన్ 3.1–0–17–3, బార్ట్లెట్ 3–0–30–1, అర్ష్ దీప్ 3–1–11–1, చహల్ 4–0–28–4, మ్యాక్స్‌వెల్ 2–0–5–1. -
కేకేఆర్ ఓడినా.. సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అనుహ్యా ఓటమి చవిచూసింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక కేకేఆర్ చతకలపడింది. కేకేఆర్ లక్ష్య చేధనలో కేవలం 95 పరుగులకే ఆలౌటై ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్ధి జట్టు డిఫెండ్ చేసుకున్న అత్యల్ప టార్గెట్ ఇదే. పంజాబ్ బౌలర్లలో స్పిన్నర్ చాహల్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు మార్కో జానెసన్ మూడు.. మాక్స్వెల్, బ్రాట్‌లెట్, అర్ష్‌దీప్ తలా వికెట్ సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో కేకేఆర్ బ్యాటర్లలో రఘువన్షి(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు.నరైన్ అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ మాత్రం ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఒకే జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నరైన్ చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్‌పై నరైన్ ఇప్పటివరకు 36 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ ఆటగాడు మార్కో జాన్సెన్ను చేసి ఈ రికార్డును తన ఖాతాలో సునీల్ వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ పేరిట ఉండేది. ఉమేష్ కూడా పంజాబ్ కింగ్స్‌పై 35 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో యాదవ్ అల్‌టైమ్ రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు.ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు36 - సునీల్ నరైన్ vs పంజాబ్ కింగ్స్35 - ఉమేష్ యాదవ్ vs పంజాబ్ కింగ్స్33 - డ్వేన్ బ్రావో vs ముంబై ఇండియన్స్33 - మోహిత్ శర్మ vs ముంబై ఇండియన్స్33 - యుజ్వేంద్ర చాహల్ vs కేకేఆర్32 - యుజ్వేంద్ర చాహల్ vs పంజాబ్32 - భువనేశ్వర్ కుమార్ vs కేకేఆర్ -
KKR Vs PBKS: కేకేఆర్ కొంపముంచిన రహానే.. ఆ ఒక్క తప్పు చేయకపోయింటే?
ఐపీఎల్-2025లో సంచలనం నమోదైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ రికార్డు విజయాన్ని అందుకుంది. 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని పంజాబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యల్ప టార్గెట్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా శ్రేయస్ సేన నిలిచింది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రియాన్ష్ ఆర్య (12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22), ప్రభ్సిమ్రాన్ సింగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరితో పాటు నోకియా, వైభవ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు.తిప్పేసిన చాహల్..112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు పంజాబ్ పేసర్ మార్కో జానెసన్ తొలి ఓవర్లోనే భారీ షాకిచ్చాడు. ఇన్ఫామ్ బ్యాటర్ సునీల్ నరైన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే మరో పేసర్ బార్ట్లెట్.. క్వింటన్ డికాక్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత రఘువన్షి, కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఎటాక్‌లోకి వచ్చిన స్పిన్నర్ చాహల్ (Chahal) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రహానే, రింకూ సింగ్, రమణ్‌దీప్, రఘువన్షి వంటి కీలక వికెట్లను పడగొట్టి కేకేఆర్‌ను దెబ్బతీశాడు.ఆ తర్వాత జానెసన్ ఆఖరిలో చెలరేగి ఆడుతున్న విధ్వంసకర బ్యాటర్ రస్సెల్‌ను ఔట్ చేసి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. 3.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జానెసన్.. కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లను పడగొట్టాడుకేకేఆర్ కొంపముంచిన రహానే..కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమికి కెప్టెన్ అజింక్య రహానే పరోక్షంగా కారణమయ్యాడు. కేకేఆర్ లక్ష్య చేధనలో ఓపెనర్ల వికెట్లను ఆరంభంలోనే కోల్పోయినప్పటికి రఘువన్షి, రహానే అద్బుతంగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. 7 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతే కేకేఆర్ విజయం అంతా లాంఛనమే అనుకున్నారు. కానీ ఇక్కడే రహానే చేసిన తప్పిదం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్‌లో నాలుగో బంతిని రహానే స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. వెంటనే పంజాబ్ ఆటగాళ్లు ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. అప్పటికే కేకేఆర్‌కు రెండు రివ్యూలు మిగిలిన్నప్పటికి రహానే మాత్రం రివ్యూ తీసుకోకుండా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రిప్లేలో క్లియర్‌గా ఇంపాక్ట్ ఔట్ సైడ్‌గా కన్పించింది. రహానే వికెట్‌తో కేకేఆర్ పతనం మొదలైంది. వరుస క్రమంలో బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రహానే అక్కడ రివ్యూ తీసుకుని ఉండింటే కేకేఆర్ సునాయసంగా గెలిచుండేది.


