
IPL 2025 RCB vs KKR Live Updates:
ఆగని వర్షం.. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దుఐపీఎల్-2025 పున:ప్రారంభంలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
👉బెంగళూరు వర్షం ఇంకా కురుస్తోంది. ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెసింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆట సాధ్యపడేలా లేదు.
👉బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద వర్షం ఇంకా కురుస్తోంది. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది.
👉ఐపీఎల్-2025 పున:ప్రారంభానికి వరుణడు ఆడ్డంకిగా నిలిచాడు. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది.
మైదానం మొత్తాన్ని కవర్లతో సిబ్బంది కప్పి ఉంచారు. దీంతో ఈ మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. కాగా చిన్నస్వామి స్టేడియంలో అద్బుతమైన డ్రైనజీ వ్యవస్ద ఉండంతో వర్షం తగ్గిన వెంటనే మైదానాన్ని సిద్దం చేసే అవకాశముంది.