మహిళల ప్రీమియర్ లీగ్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది.
ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని నామమాత్రపు స్కోరే పరిమితం చేశారు. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, కాప్, మిన్ను మని తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ స్మృతి మంధాన(38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయరంతా దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం 110 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో లారా వోల్వడర్ట్(42), కాప్(19) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సత్ఘరే రెండు, రాధా యాదవ్ ఓ వికెట్ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించిన ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.


