ఘనంగా అర్జున్‌ టెండుల్కర్‌- సానియా వివాహం.. వీడియో వైరల్‌ | Arjun Tendulkar Saaniya Chandhok Married Wedding Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఘనంగా అర్జున్‌ టెండుల్కర్‌- సానియా వివాహం.. వీడియో వైరల్‌

Mar 5 2026 2:53 PM | Updated on Mar 5 2026 4:17 PM

Arjun Tendulkar  Saaniya Chandhok Married Wedding Video Goes Viral

టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ఇంట శుభకార్యం జరిగింది. సచిన్‌- అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్‌ అర్జున్‌ టెండుల్కర్‌ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. యువ వ్యాపారవేత్త సానియా చందోక్‌తో గురువారం అతడి పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

గతేడాది నిశ్చితార్థం
కాగా గతేడాది ఆగష్టులో అర్జున్‌- సానియా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితుల నడుమ గోప్యంగా ఈ వేడుక జరుగగా.. కొన్నిరోజుల తర్వాత సచిన్‌ టెండుల్కర్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇక ఇటీవల అర్జున్‌- సానియా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.

అంబానీ కుటుంబం ఆధ్వర్యంలో
ముకేశ్‌ అంబానీ కుటుంబం జామ్‌నగర్‌లో కాబోయే వధూవరుల కోసం పార్టీ ఏర్పాటు చేసింది. అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ వివాహం జరిగిన చోట అర్జున్‌- సానియాల పెళ్లి వేడుకలను ఆరంభించింది. గణేషుడి ఆశీర్వాదంతో పాటు అంబానీ కుటుంబం వీరికి శుభాకాంక్షలు అందజేసింది.

ఈ సందర్భంగా నీతా అంబానీకి ధన్యవాదాలు తెలిపిన సచిన్‌ టెండుల్కర్‌.. కాబోయే కోడలిపై ప్రేమను కురిపించాడు. తన కుమారుడు అర్జున్‌.. అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకున్నాడని కొనియాడాడు. వారిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని.. కలకాలం ఇలాగే జీవించాలని ఆకాంక్షించాడు.

ముంబైలో పెళ్లి వేడుక
అనంతరం ముంబైలో మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలు జరుగగా.. పెళ్లి వేడుక (Arjun Tendulkar- Saaniya Chandhok Wedding)గురువారం జరిగింది. కాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనుమరాలే సానియా చందోక్‌. ఆమె కూడా ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌. సచిన్‌ కుమార్తె సారా టెండుల్కర్‌కు సానియా ప్రాణ స్నేహితురాలు. అర్జున్‌ టెండుల్కర్‌ కంటే వయసులో ఓ ఏడాది పెద్ద.

ఇక అర్జున్‌ టెండుల్కర్‌ వివాహానికి దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని దంపతులు, సురేశ్‌ రైనా దంపతులు సహా భారత మాజీ క్రికెటర్లలో చాలా మంది సతీసమేతంగా విచ్చేశారు. బాలీవుడ్‌ ప్రముఖులు సైతం ఈ వివాహ వేడుక కోసం తరలివచ్చారు. వ్యాపార దిగ్గజం ముకేశ్- నీతా అంబానీ దంపతులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

చదవండి: మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన టీమిండియా స్టార్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement