మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన టీమిండియా స్టార్‌ | Hardik Pandya gifts Car worth INR 4 crore to son Agastya Ex wife Natasa | Sakshi
Sakshi News home page

మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన టీమిండియా స్టార్‌

Feb 23 2026 4:35 PM | Updated on Feb 23 2026 5:26 PM

Hardik Pandya gifts Car worth INR 4 crore to son Agastya Ex wife Natasa

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆట కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే తన ప్రేయసి, మోడల్‌ మహీక శర్మ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు ఈ బరోడా క్రికెటర్‌.

ప్రేయసికి 25 కానుకలు
మహీక 25వ బర్త్‌డే సందర్భంగా ఆమెను కానుకలతో ముంచెత్తాడు. ఈ విషయాన్ని మహీక స్వయంగా వెల్లడించింది. తనకు హార్దిక్‌ పాండ్యా 25 బహుమతులు ఇచ్చాడని.. ఈ పుట్టినరోజును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది.

కాగా గత కొంతకాలంగా మహీకతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న హార్దిక్‌ పాండ్యా.. తన కుమారుడు అగస్త్యను మాత్రం దూరం పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది అతడిని ట్రోల్‌ చేశారు. మాజీ భార్య నటాషా స్టాంకోవిక్‌తో పాటు.. కుమారుడు అగస్త్యను కూడా పూర్తిగా మర్చిపోయాడని నిందించారు.

రూ. 4 కోట్ల విలువైన కారు
అలాంటి వాళ్లకు దిమ్మదిరిగేలా హార్దిక్‌ పాండ్యా తన చేష్టలతో కౌంటర్‌ ఇచ్చాడు. నటాషాతో విడిపోయినప్పటికీ ఆమె పట్ల ఆప్యాయతను కనబరిచాడు. నటాషా, అగస్త్య కోసం ఖరీదైన కారును హార్దిక్‌ పాండ్యా కొనుగోలు చేశాడు. రూ. 4 కోట్ల విలువైన లాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ను అగస్త్య, నటాషాలకు బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా సెర్బియా మోడల్‌ నటాషాను ప్రేమించిన హార్దిక్‌ పాండ్యా 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి కుమారుడు అగస్త్య జన్మించాడు. ఆ తర్వాత కుమారుడి సమక్షంలో హిందూ, క్రిస్టియన్‌సంప్రదాయాల ప్రకారం మరోసారి పెళ్లినాటి ప్రమాణాలు చేశారు.

తల్లి దగ్గరే ఎక్కువగా..
అయితే, అనూహ్య రీతిలో 2024లో తాము విడిపోయినట్లు ప్రకటించారు నటాషా- హార్దిక్‌. ఆ తర్వాత మహీకతో తాను ప్రేమలో ఉన్నట్లు హార్దిక్‌ పాండ్యా సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా స్పష్టం చేశాడు. అయితే, విడిపోయినప్పటికీ అగస్త్యకు తల్లిదండ్రులుగా ఉంటామని నటాషా- హార్దిక్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. అందుకు తగ్గట్లుగానే కుమారుడి బాధ్యతను ఇద్దరూ పంచుకుంటున్నారు. అయితే, తల్లి దగ్గరే అగస్త్య ఎక్కువగా ఉంటున్నాడు.

ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీతో బిజీగా ఉన్నాడు. చివరగా నిన్న (ఆదివారం) సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పాండ్యా టీమిండియా తరఫున బరిలో దిగాడు. అటు బౌలర్‌గా.. ఇటు బ్యాటర్‌గా అతడు విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో 45 పరుగులు ఇచ్చిన హార్దిక్‌.. బ్యాటింగ్‌లో 17 బంతుల్లో 18 పరుగులే చేయగలిగాడు.

చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement