breaking news
Natasa Stankovic
-
మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆట కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే తన ప్రేయసి, మోడల్ మహీక శర్మ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు ఈ బరోడా క్రికెటర్.ప్రేయసికి 25 కానుకలుమహీక 25వ బర్త్‌డే సందర్భంగా ఆమెను కానుకలతో ముంచెత్తాడు. ఈ విషయాన్ని మహీక స్వయంగా వెల్లడించింది. తనకు హార్దిక్ పాండ్యా 25 బహుమతులు ఇచ్చాడని.. ఈ పుట్టినరోజును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది.కాగా గత కొంతకాలంగా మహీకతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న హార్దిక్ పాండ్యా.. తన కుమారుడు అగస్త్యను మాత్రం దూరం పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది అతడిని ట్రోల్ చేశారు. మాజీ భార్య నటాషా స్టాంకోవిక్‌తో పాటు.. కుమారుడు అగస్త్యను కూడా పూర్తిగా మర్చిపోయాడని నిందించారు.రూ. 4 కోట్ల విలువైన కారుఅలాంటి వాళ్లకు దిమ్మదిరిగేలా హార్దిక్ పాండ్యా తన చేష్టలతో కౌంటర్ ఇచ్చాడు. నటాషాతో విడిపోయినప్పటికీ ఆమె పట్ల ఆప్యాయతను కనబరిచాడు. నటాషా, అగస్త్య కోసం ఖరీదైన కారును హార్దిక్ పాండ్యా కొనుగోలు చేశాడు. రూ. 4 కోట్ల విలువైన లాండ్ రోవర్ డిఫెండర్‌ను అగస్త్య, నటాషాలకు బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించిన హార్దిక్ పాండ్యా 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి కుమారుడు అగస్త్య జన్మించాడు. ఆ తర్వాత కుమారుడి సమక్షంలో హిందూ, క్రిస్టియన్‌సంప్రదాయాల ప్రకారం మరోసారి పెళ్లినాటి ప్రమాణాలు చేశారు.తల్లి దగ్గరే ఎక్కువగా..అయితే, అనూహ్య రీతిలో 2024లో తాము విడిపోయినట్లు ప్రకటించారు నటాషా- హార్దిక్. ఆ తర్వాత మహీకతో తాను ప్రేమలో ఉన్నట్లు హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా పోస్టుల ద్వారా స్పష్టం చేశాడు. అయితే, విడిపోయినప్పటికీ అగస్త్యకు తల్లిదండ్రులుగా ఉంటామని నటాషా- హార్దిక్ ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. అందుకు తగ్గట్లుగానే కుమారుడి బాధ్యతను ఇద్దరూ పంచుకుంటున్నారు. అయితే, తల్లి దగ్గరే అగస్త్య ఎక్కువగా ఉంటున్నాడు.ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉన్నాడు. చివరగా నిన్న (ఆదివారం) సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పాండ్యా టీమిండియా తరఫున బరిలో దిగాడు. అటు బౌలర్‌గా.. ఇటు బ్యాటర్‌గా అతడు విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో 45 పరుగులు ఇచ్చిన హార్దిక్.. బ్యాటింగ్‌లో 17 బంతుల్లో 18 పరుగులే చేయగలిగాడు.చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్ ఫైర్ -
హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ.. నటాషా స్టాంకోవిచ్ బోల్డ్ లుక్స్..!
ఫ్రెండ్ హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ..మరింత హాట్ హాట్‌గా నటి నటాషా స్టాంకోవిచ్..పాయల్ రాధాకృష్ణ స్టన్నింగ్ వీడియో..గతవైభవ మూవీ జ్ఞాపకాల్లో ఆషిక రంగనాథ్..గోవాలో చిల్ అవుతోన్న హీరోయిన్ శ్రద్ధా దాస్.. View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
ఖరీదైన కారు కొన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య.. ఎన్ని కోట్లంటే?
టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా మాజీ భార్య, డ్యాన్సర్ నటాషా స్టాంకోవిచ్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను సొంతం చేసుకుంది. ఈ కారు విలువు దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. నటాషా స్టాంకోవిచ్ గతంలో క్రికెటర్ హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకుంది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత జూలై 2024లో అతనితో విడిపోయింది. ఈ మాజీ జంటకు అగస్త్య అనే కుమారుడు ఉన్నారు. విడిపోయినప్పటికీ బాబుకు తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ ప్రస్తుతం మోడల్ మహీకా శర్మతో డేటింగ్లో ఉన్నారు.అయితే విడాకుల తర్వాత నటాసా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతోంది. తాను మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నానని ఇటీవలే ప్రకటించింది. భవిష్యత్తులో తనకు నచ్చినవాడు దొరికితే రెండో పెళ్లికి సిద్ధమేనని పరోక్షంగా హింట్ ఇచ్చింది ముద్దుగుమ్మ. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)


