Photo Source: Twitter
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ ప్రవర్తన పట్ల సోషల్ మీడియాలో అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. బిచ్చగాళ్లతో నటాషా ప్రవర్తించిన తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయంలోకి వెళితే.. నటాషా స్టాంకోవిచ్ తన బాయ్‌ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్‌తో కలిసి ఒక హోటల్‌కు వెళ్లింది.
లంచ్ అనంతరం బయటికి వస్తున్న నటాషాతో కొంతమంది ఫొటోలు దిగారు. ఇదే సమయంలో అక్కడికి పిల్లలతో కలిసి బిక్షాటన చేస్తున్న మహిళల వచ్చారు. తమకు సాయం చేయమని నటాషాను అడిగినప్పటికీ, వారిని పట్టించుకోకుండా తన కారు ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోవడం కెమెరాలకు చిక్కింది. ఇంకేముంది, అసలే తమ అభిమాన క్రికెటర్‌ను మోసం చేసి తెగదెంపులు చేసుకున్న నటాషా ఎక్కడ దొరుకుతుందా అని కాచుకు కూర్చుకున్న కొంతమంది విమర్శల వర్షం కురిపించారు.
'ఇదేం పద్దతి.. ఫొటోలకు ఫోజివ్వడం తెలుసు కాని ఒక రూపాయి ధర్మం చేయాలన్న కనీస జ్ఞానం లేదా' అని కామెంట్ల రూపంలో నటాషాను దెప్పిపొడిచారు. అయితే గతంలో పాండ్యాతో కలిసి ఉన్నప్పుడు ఇదే నటాషా పేద వాళ్లకు సాయం చేయడంలో ముందు వరుసలో ఉండడం గమనార్హం.
సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ 2013లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలో ఆ పరిచయం ప్రేమగా మారింది. హార్దిక్, నటాషా ప్రేమలో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉండగానే ఆమె గర్భం దాల్చింది. తండ్రి కాబోతున్నట్లు హార్దిక్ పాండ్యా అధికారికంగా ప్రకటించి, అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత 2020లో హార్దిక్ పాండ్యా, నటాషా వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన నటాషా కుమారుడి పెంపకంపైనే దృష్టి సారించింది.
వివాహం తర్వాత కొంత కాలం వీరి జీవితం ఆనందంగా సాగింది. ట్రిప్పులు, అగస్త్యతో ఆటలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. వివాహం అయిన నాలుగేళ్ల తర్వాత (2024)లో పాండ్యా, నటాషా మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో హార్దిక్ పాండ్యా ‘విడాకుల’పై అధికారిక ప్రకటన చేశాడు. భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. 4 ఏళ్ల దాంపత్య జీవితం అనంతరం నటాషా, తాను విడిపోవడానికే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాడు.విడిపోయినప్పటికీ తమ కుమారుడు అతస్త్యకు కో-పేరెంట్స్‌గా ఉంటామని స్పష్టత ఇచ్చాడు.
हार्दिक पांड्या की पूर्व पत्नी नताशा अब पहले जैसी नहीं रहीं।
Natasa अपने बॉयफ्रेंड "Aleksandar Alex Ilic' के साथ एक होटल से बाहर निकली।
तभी वहां मौजूद कुछ भिखारियों ने उनसे मदद के लिए पैसे मांगे।
लेकिन नताशा बिना रुके सीधे अपनी गाड़ी में बैठकर वहां से निकल गईं।
भिखारी बस… pic.twitter.com/RfBOplXnxV— ʀᴜᴅʜʀᴀ ʏᴀᴅᴀᴠ🇮🇳 (@Rudhrayadav001) August 1, 2026


