ఆసియా కప్‌ 2026కు భారత జట్టు ప్రకటన | BCCI Announces India Womens Asia Cup 2026 Squad, Harmanpreet Kaur Retained As Captain | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌ 2026కు భారత జట్టు ప్రకటన

Aug 2 2026 4:40 PM | Updated on Aug 2 2026 4:57 PM

BCCI Announces India Womens Asia Cup 2026 Squad, Harmanpreet Kaur Retained As Captain

source: BCCI X

మహిళల ఆసియా కప్‌ 2026 కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్సీపై ఇటీవల చర్చ జరిగినప్పటికీ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. స్మృతి మంధానను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. జట్టులో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ వంటి కీలక ప్లేయర్లకు చోటు దక్కింది.

శ్రేయాంక పాటిల్‌కు చోటు లేదు
టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉన్న శ్రేయాంక పాటిల్‌కు ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కలేదు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆమె కుడి చీలమండకు గాయమయ్యింది. శ్రేయాంక స్థానంలో టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చిన ప్రేమా రావత్‌ ఆసియా కప్‌ జట్టులోనూ కొనసాగింది. ఇదే జట్టులో జరిగిన ప్రధాన మార్పు.

భారత మహిళల ఆసియా కప్‌ 2026 జట్టు
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), జి. కమిలిని, అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్‌, రాధా యాదవ్‌, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్‌, నందిని శర్మ, క్రాంతి గౌడ్‌.

కాగా, ఆసియా కప్‌ 2026 సెప్టెంబర్‌ 17న మొదలై 22వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీ ఫిక్చర్స్‌ ఇంకా ఖరారు కాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement