గుండుతో దర్శనం.. హార్దిక్‌ పాండ్యా కొత్త లుక్‌ వైరల్‌ | Hardik Pandya-Offers Prayers With Girlfriend Mahieka In Tirumala-New-Look | Sakshi
Sakshi News home page

గుండుతో దర్శనం.. హార్దిక్‌ పాండ్యా కొత్త లుక్‌ వైరల్‌

Aug 2 2026 3:08 PM | Updated on Aug 2 2026 3:40 PM

Hardik Pandya-Offers Prayers With Girlfriend Mahieka In Tirumala-New-Look

Photo Credit: BCCI Twitter

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్‌తో ద‌ర్శ‌న‌మిచ్చాడు. త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ మ‌హికా శ‌ర్మ‌తో క‌లిసి తిరుమ‌ల స్వామి వారిని ద‌ర్శించుకున్న పాండ్యా క్లీన్ హెడ్‌షేవ్ (గుండు)తో క‌నిపించాడు. దీంతో పాండ్యా కొత్త లుక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. తిరుమల పర్యటనలో హార్దిక్ పాండ్యా శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు. 

ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.  ఆయన మొక్కుబడి తీర్చుకునే భాగంగానే తలనీలాలు సమర్పించారా.? లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా? అనేది తెలియాలి. ఇక ఐపీఎల్ 2026 సీజ‌న్ చివ‌ర్లో గాయానికి గురైన పాండ్యా స్వ‌దేశంలో అప్గానిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఐర్లాండ్‌, ఇంగ్లండ్ టూర్ల‌కు కూడా దూర‌మ‌య్యాడు. 

ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)లో పాండ్యా రీహాబిలిటేష‌న్‌లో గడుపుతున్నాడు. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కోసం పాండ్యాను జాగ్ర‌త్త‌గా కాపాడుకోవ‌డంపై బీసీసీఐ ప్ర‌త్యేక ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగానే ప‌రిమితంగానే పాండ్యా సేవ‌లు ఉప‌యోగించుకోవాల‌ని చూస్తోంది. మ‌రోవైపు పాండ్యా కూడా 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ప‌డ్డాడు.

ఇక ఐపీఎల్ 2026 సీజ‌న్‌లోనూ ముంబై ఇండియ‌న్స్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ 14 మ్యాచ్‌ల్లో కేవ‌లం నాలుగు విజ‌యాలు మాత్ర‌మే సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో 9వ స్థానంలో నిలిచింది. 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించినప్పటికీ.. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.  

పాండ్యా కెప్టెన్‌గా వచ్చిన తర్వాత కూడా ముంబై గత మూడు సీజన్లలో నిరాశాజనక ఫలితాలే అందుకుంది.  దీంతో పాండ్యాను ముంబై ఇండియ‌న్స్ వ‌దులుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది. వ‌చ్చే ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌కు పాండ్యా వేరే జ‌ట్టులో ద‌ర్శ‌న‌మిచ్చే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతోందన్న‌ వార్తలు వినిపిస్తున్నాయి. 

అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌క‌తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ట్రేడ్ లేదా ఒప్పందం ఖరారు కాలేదు. మొత్తంగా 2027 సీజన్లో హార్దిక్ ఏ జట్టు జెర్సీలో కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

 

Read: అభిషేక్‌ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement