టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే ఇటీవల తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల రహానే ప్లేయర్‌గా, కెప్టెన్‌గా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకున్నాడు.
అతడి సారథ్యంలోనే భారత్ 2021లో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రహానేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.
రహానే పెన్షన్ ఎంతంటే?
బీసీసీఐ మాజీ క్రికెటర్లను వారి అనుభవం, ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల ఆధారంగా మూడు విభాగాలగా విభజించింది. అత్యధికంగా 25 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు టాప్ కేటగిరీకి వస్తారు. వారికి ప్రస్తుతం నెలకు రూ.70,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది.
గతంలో ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లకు నెలకు రూ. 50,000 దక్కేది. కానీ 2022లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ మొత్తాన్ని రూ.70,000కు పెంచాడు. ఇప్పుడు భారత్ తరఫున 85 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రహానే, అత్యున్నత పెన్షన్ స్లాట్‌లో ఉన్నాడు.
అతడికి ప్రతీ నెల రూ.70,000 పెన్షన్ లభించనుంది. ఇక దిగువ శ్రేణిలోని వారికి రూ. 60 వేలు, ఫస్ట్‌క్లాస్ మాజీ ఆటగాళ్లకు రూ. 30 వేలు పెన్షన్ అందిస్తోంది. పెన్షన్ పథకం ప్రస్తుతం దాదాపు 900 మందికి పైగా రిటైర్డ్ క్రికెటర్లు, అంపైర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది.


