Photo Credit: Rohit (x) Twitter
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై భారత సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ ఆలస్యంగా స్పందించాడు. రోహిత్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా రహానేకు బెస్ట్ విషెస్ చెప్పాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. రహానేతో కలిసి గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగంతో స్పందించాడు.
'మేమిద్దరం చాలా ఏళ్ల పాటు డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాం. రహానే ఎంత కష్టపడతాడో నాకు బాగా తెలుసు. నువ్వు సాధించిన విజయాలు అద్భుతం. నీ నిబద్ధత, వృత్తిపట్ల అంకితభావం నిజంగా ప్రత్యేకమైనవి. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. నీ భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్' అని రోహిత్ వెల్లడించాడు.
ఇక టీమిండియా టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ కూడా రహానేకు భావోద్వేగ సందేశం పంపాడు. 'అజ్జూ భాయ్.. నీతో కలిసి మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ గడపడం నాకు గౌరవంగా భావిస్తున్నా. నీ ప్రశాంత స్వభావం, ఆటపట్ల అంకితభావం అద్భుతం. నువ్వు ఎప్పుడూ మాకు స్ఫూర్తిగా నిలిచావు. నీ జీవితంలోని రెండో ఇన్నింగ్స్ కూడా అంతే విజయవంతంగా, సంతోషంగా సాగాలని నీకు, నీ కుటుంబ సభ్యులకు ఇదే నా ప్రత్యేక శుభాకాంక్షలు' అని సూర్య చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రహానే హండ్రెడ్ కాంపిటీషన్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్కడి నుంచే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిటైర్మెంట్ వార్తను పంచుకున్నాడు. జెర్సీ నెంబర్ 278కి వీడ్కోలు అంటే రహానే ఒక వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన రిటైర్మెంట్‌పై భావోద్వేగ సందేశాన్ని వినిపించాడు. ఈ సందర్భంగా అతడి సహచరులు, దిగ్గజ క్రికెటర్లు రహానే కెరీర్‌ను కొనియాడుతూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఫస్ట్ క్లాస్‌లో నిలకడగా రాణించిన రహానే 2013లో ఆస్ట్రేలియాపై మ్యాచ్‌తో టెస్టులో అరంగేట్రం చేశాడు. తన డిఫెన్స్, నిబద్ధతో రహానే అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో రహానే 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలున్నాయి. ఇక 90 వన్డే మ్యాచ్‌ల్లో 2,962 పరుగులు సాధించిన రహానే ఖాతాలో మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో 20 మ్యాచ్‌లాడిన రహానే 375 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది.
We've shared the dressing room for so many years and I know how much hard work has gone into everything you've achieved. Your commitment and professionalism have always set you apart.
Congratulations on a wonderful career. Best wishes! @ajinkyarahane88 pic.twitter.com/r7eXb1yrUz— Rohit Sharma (@ImRo45) July 30, 2026
Read: పక్కలో బల్లెంలా తయారయ్యాడు.. పంత్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్!


