‘కంగ్రాట్స్‌ జింక్స్‌.. నువ్వు నా ఫెవ‌రెట్ బ్యాటింగ్‌ పార్ట‌న‌ర్‌’ | Virat Kohli Emotional Message For Long Time Batting Partner Ajinkya Rahane After International Retirement, Post Viral On Social Media | Sakshi
Sakshi News home page

కంగ్రాట్స్‌ జింక్స్‌.. నువ్వు నా ఫెవ‌రెట్ బ్యాటింగ్‌ పార్ట‌న‌ర్‌: కోహ్లి

Jul 30 2026 8:03 PM | Updated on Jul 30 2026 8:51 PM

Virat Kohli Tribute Long-Time-Batting Partner-Ajinkya Rahane-Retires

Photo Credit: BCCI Twitter

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన అజింక్య ర‌హానేకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అభినంద‌న‌లు తెలిపాడు. సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించిన అతడి కెరీర్ గొప్పగా సాగిందని పేర్కొన్న విరాట్.. ఇకపై కూడా అతడికి అంతా మంచే జరగాలని ఆకాంక్షించాడు. ఎన్నో ఏళ్లు తామిద్ద‌రం క‌లిసి దేశానికి ఆడామ‌ని, జింక్స్ త‌న పార్ట‌న‌ర్ అవ్వ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని కోహ్లి తెలిపాడు. 

‘జింక్స్.. నీ క్రికెట్ కెరీర్ గొప్పగా సాగినందుకు అభినందనలు. భారత క్రికెటర్‌గా నువ్వు అద్భుతాలు చేశావు. నీ ఈ ప్రయాణం పట్ల నువ్వు చాలా గర్వపడాలి. స్లిప్‌లో నీ చేతులు చాలా సురక్షితమైనవి. టెస్టుల్లో నాకు ఇష్టమైన భాగస్వామివి నువ్వే. నువ్వు ఎల్లప్పుడూ బాగుండాలి. దేవుడి ఆశీర్వాదం నీకు ఉంటుంది’ అని కోహ్లీ తన పోస్ట్‌లో వెల్లడించాడు.

కోహ్లి హయాంలోనే స్టార్‌ హోదా..
ఇక కోహ్లీ కెప్టెన్సీలోనే రహానే కెరీర్ గొప్పగా సాగింది. కోహ్లి హయాంలోనే అతడు వైస్ కెప్టెన్‌గా, మిడిలార్డ‌ర్‌ బ్యాటర్‌గానూ స్థిరంగా రాణించాడు. కోహ్లి, ర‌హానేలు క‌లిసి టీమిండియా త‌ర‌ఫున 67 టెస్టుల్లో ఆడారు. వీరిద్ద‌రు క‌లిసి 3,661 ప‌రుగులు జోడించారు. ఇందులో 10 శ‌త‌క భాగ‌స్వామ్యాలున్నాయి. ఈ ఇద్ద‌రి మధ్య టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగుల భాగ‌స్వామ్యం 2016లో న్యూజిలాండ్‌తో టెస్టులో (365 ప‌రుగులు) న‌మోదయ్యింది. 

ఇక ఇద్ద‌రు క‌లిసి 33 వ‌న్డేలు ఆడి 1717 ప‌రుగులు జోడించారు. ఇందులో ఆరు శ‌త‌క భాగ‌స్వామ్యాలున్నాయి.  అయితే మూడేళ్ల క్రితం వరకు కోహ్లి, పుజారా, ర‌హానే, రోహిత్‌.. వీళ్లు లేని భార‌త టెస్టు జట్టును ఊహించ‌లేం. ఎందుకంటే.. సుదీర్గ అనుభ‌మున్న ఈ న‌లుగురికి క‌ష్ట స‌మ‌యంలో ఇన్నింగ్స్ నిర్మించ‌డం, ప్రత్యర్ధి బౌల‌ర్లను విసిగించ‌డం ఎలాగో బాగా తెలుసు. టీమిండియా వ‌రుస‌గా రెండుసార్లు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు చేర‌డంలో ఈ న‌లుగురు కీల‌క పాత్ర పోషించారు. అంతేకాదు టెస్టుల్లో రోహిత్ సేన‌ అగ్రస్థానంలో నిల‌వ‌డంలో వీళ్ల పాత్ర మ‌రువ‌లేనిది.

ఫస్ట్ క్లాస్‌లో నిలకడగా రాణించిన రహానే 2013లో ఆస్ట్రేలియాపై మ్యాచ్‌తో టెస్టులో అరంగేట్రం చేశాడు. తన డిఫెన్స్, నిబద్ధతో ర‌హానే అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 15 ఏళ్ల అంత‌ర్జాతీయ కెరీర్‌లో ర‌హానే 85 టెస్టుల్లో 5,077 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 సెంచ‌రీలు, 26 అర్ధ‌సెంచ‌రీలున్నాయి. ఇక 90 వ‌న్డే మ్యాచ్‌ల్లో 2,962 ప‌రుగులు సాధించిన ర‌హానే ఖాతాలో మూడు సెంచ‌రీలు, 24 అర్ధ‌శ‌తకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో 20 మ్యాచ్‌లాడిన ర‌హానే 375 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement